భీష్మ పితామహుని దేహత్యాగము - విష్ణుసహస్రనామ వైభవము
The Passing Away of Bhishma Pitamaha in Lord's Presence
శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, కురువంశ పితామహుడైన భీష్ముడు శ్రీకృష్ణుని సన్నిధిలో తన దేహాన్ని త్యజించే అద్భుతమైన దృశ్యాన్ని మనం దర్శిస్తాము. మనసు పూర్తిగా పరమాత్మయందు లగ్నమై, భీష్ముడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపంగా స్తుతిస్తూ అత్యంత భక్తిపూర్వకంగా ప్రార్థనలు సమర్పిస్తాడు. ఈ ఎపిసోడ్‌లో విష్ణుసహస్రనామ మహిమను కూడా వివరిస్తారు — భీష్ముడు లోకకల్యాణం కోసం భగవంతుని వేయి దివ్యనామాలను తన చివరి కానుకగా అందించిన వైభవాన్ని తెలుసుకుందాం. భగవంతుని పాదాలపై చివరి శ్వాసను అర్పించడమే నిజమైన మోక్షమని ఈ కథనం మనకు స్ఫూర్తినిస్తుంది.
In this sacred episode of Srimad Bhagavatham Canto 1, we witness the glorious departure of Bhishma Pitamaha, the grandsire of the Kuru dynasty, who chose to leave his body in the divine presence of Lord Sri Krishna. With unwavering devotion and a mind fully absorbed in the Lord, Bhishma offers profound prayers to Krishna, revealing his identity as the Supreme Personality of Godhead. The episode also celebrates the eternal glory of Vishnu Sahasranamam, the thousand divine names of Lord Vishnu that Bhishma gifted to the world as his final and most precious offering. This deeply moving narration reminds us that true liberation lies in surrendering one's last breath at the lotus feet of the Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేధసే పపుర్జ్ఞానమయం సౌమ్యా యన్ముఖాంభురుహాసవం భక్తులు వ్యాస భగవానుని ముఖపద్మము నుండి లభించిన జ్ఞానామృతమును గ్రోలుచున్నారు. ఆయన అపరిమితముకు తేజస్సు గలవాడు పూజ్యుడవు అట్టి వ్యాసమహర్షికి నమస్కారము. సెకండ్ క్యాంటో, ఫోర్త్ చాప్టర్, 24th ప్రేయర్. భగవత్ బంధువులారా, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ముంచి దేవుడి యొక్క స్తుతిని తెలుసుకున్నాం. తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. 17వ ఎపిసోడ్లో శ్రీ భాగవత తత్వ దీపికలో ప్రథమ స్కంధములో స్వాగతం. ఇటు కుంతీదేవి స్తుతించగా అఖండ మహిమాన్వితుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యకరమగు శక్తి గల తన మందహాసముచే లోకమును మోహపరచువాడై చిన్న నవ్వు నవ్వెను. ఇట్లు కొంతియు పాండవులను మిగిలిన స్త్రీలు ప్రేమతో ప్రార్థింపగా తన ప్రయాణమును ఆపి హస్తినాపురన మరల ప్రవేశించెను. భగవానుడగు శ్రీకృష్ణుడే అనేక ఇతిహాసములచే బోధపరిచెనను. తన బంధువులు చనిపోవుట కాలము యొక్క అప్రతిహతముకు శక్తి అని ఎరుంగలేక ధర్మరాజు శోకించుండెను. బంధువుల యందు ప్రేమచే వారి వధను గూర్చి ఆలోచించు ధర్మరాజు ఇట్లు పలుకుచుండెను. ఓహో నేను ఎంత మూర్ఖుడను నా హృదయం ఎంతటి అజ్ఞానములతో నిండినది చివరకు. కుక్కల చేతనో నక్కల చేతనో తినదగిన ఈ శరీరము కొరకే కదా ఎందరినో చంపితిని. బాలులనెందరినో చంపిన నాకు నరకము నుండి మోక్షము లేదు. బ్రాహ్మణులను, మిత్రులను, ప్రీతిపాత్రులను, తండ్రులను, సోదరులను, గురువులను ఎందరినో యుద్ధములో ఎదిరించి చంపిన నాకు కొన్ని వేల కోట్ల సంవత్సరములైనను నరకము నుండి విడుదల లేదు. ప్రజలను పోషించు రాజు అధర్మపరులవు శత్రువులను చంపుట కర్తవ్యమే దోషము కాదు అని భగవానుడు చెప్పుచున్నను నా మనసు ఒప్పుకొనుట లేదు.
నేను చేసిన పాపం ఎంతో కాలం అనుభవించదగినది. ఏవో కొన్ని ధర్మములను ఆచరించి తొలగించుకొనుటకు శక్యము కానిది. ఒంటి నిండా బురద అంటిన నాడు. బురద నీటితో వడలు కడుగుగునిన బురద పోయునా? కళ్ళు పోసిన కుండను కళ్ళుతో కడిగిన శుద్ధి అగునా? అట్లే యజ్ఞములను ఆచరించి నేను చేసిన పాములు పాపములు పోగొట్టుకొనుటకు వీలగునా? కాదు. ఈ విధంగా ధర్మరాజు ప్రజాద్రోహమును చేసితినని భయపడుచు సర్వ ధర్మములను ఎరుంగవలెనని కోరికతో యుద్ధభూయమైన కురుక్షేత్రమున అంపశయ్యపై పడి ఉన్న భీష్ముని దగ్గరకు ధర్మమును ఎరుంగుంట కొరకు వెళ్ళినాడు. సోదరులందరూ మంచి గుర్రములను పూన్చిన బంగారు అలంకారములతో కూడిన రథములతో ధర్మరాజు వెంట కదిలిరి. వ్యాసుడు, ధౌమ్యుడు మొదలగు వృద్ధ బ్రహ్మణులు కూడా వెంట వెళ్ళిరి. భగవానుడు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో రథమును అధిరోహించి వారితో కదలసాగెను. దేవలోకము నుండి జారిన దేవతామూర్తియే అన్నట్లు ప్రకాశించున్న భీష్ముని చేరి అందరూ నమస్కరించిరి. అచ్చట భీష్ముని చూచుటకు బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు కూడా వచ్చి యుండిరి. వారిలో పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, బాదరాయణ భగవానుడు, భరద్వాజుడు, వశిష్టుడు, విశ్వామిత్రుడు మున్నగు ఋషులు యుండిరి. పరశురాముడు శిష్యులతో కూడా వచ్చి యుండెను. కశ్యప, అంగీరసాధులు, బ్రహ్మరాతి, బ్రహ్మరాతాది మునులు ఋష్యు శిష్యులతో కూడా అచరికి వచ్చిరి. దేశ కాలోచితముగు ప్రవర్తనను ఎరిగిన భీష్ముడు వారందరిని యదార్ధముగా పూజించెను. శ్రీకృష్ణుని ప్రభావం ఎరింగిన వాడగుటచే జగదీశ్వరుడగు భగవానుడే తనలో అంతర్యామిగా ఉండి తన సంకల్పముచే రూపము స్వీకరించి తాను చూచుటకు వీలుగా వచ్చి ఎదురుగా కూర్చున్నాడని గుర్తించి పూజించెను. ఎదురుగా వినయముతో ప్రేమతో చేరి తనను సేవించుచున్న పాండవులతో ప్రేమతో వెలువడి వెలువడిన భాష్పములచే కనులు నిండుగా ఇట్లు పలుకుతున్నాడు. నాయనలారా, మీరు బ్రాహ్మణులను, ధర్మమును, అచ్యుతుని ఆశ్రయించిన వారు. కానీ చాలా కష్టములను అనుభవించిరి. ఇది అన్యాయం.
పాండురావు చనిపోయిన తరువాత చిన్నవారుగా ఉన్న మిమ్మలను కాపాడుకొనుచు జీవించు మీ తల్లి కుంతీదేవి చాలా దుఃఖమును అనుభవించినది. మీకు అట్టి క్లేశములు వచ్చుటకు కారణము కాలమే. దట్టమైన మేఘములు గాలికి వశమై కదులునట్లు లోకమంతయు కాలమునకు వశమై కదులుచున్నది. సాక్షా ధర్మపుత్రుడు రాజుగా ఉన్నాడు. బలశాలి వృకోదరుడు గద దాల్చి ఉన్నాడు. అర్జునుడు గాండీవమును విల్లును దాల్చి ఉన్నాడు. మిత్రుడే కృష్ణుడు ఉన్నాడు, అయినను మిమ్మలను ఆపదలు విడలేదు. ఇదంతయు శ్రీకృష్ణుడి సంకల్పం. కాలము కూడా అతని ఆజ్ఞను అనుసరించి నడుచునది. భగవానుడు ఏమి తలంచినాడో ఎవ్వరును ఎరుంగ చాలరు. దాని ఎరుంగవలెనని ప్రయత్నించి జ్ఞానులు కూడా మోహము నందినారు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవానుడు జగత్ కారణమైనవాడు. పరమ పురుషుడైన నారాయణుడు నారాయణుడు తన సంకల్పముచే లోకమును తనను ఎరుంగజాలని దానినిగా చూసి తన రూపమును మరుగుపరుచుకొని యాదవులలో ఒక యాదవుడుగా సంహరించుచున్నాడు. ఈ కృష్ణుని మహాత్మ్యమును శివుడు ఎరిగిన ఎరుంగ జాలును. దేవరిషి నారదుడు కపిల భగవానుడు ఎరుంగుదురు. నీవు ఇతనిని మేనమామ కొడుకుగా, ప్రియమైన మిత్రుడుగా, సమానమైన వయస్సు గల సహృత్తుగా ఎరుంగుదువు. ఈతనిని నీవు మంత్రిగా ఒకప్పుడు దూతగా వరించితివి. ఒకప్పుడు ప్రేమచే సారధిగా స్వీకరించితివి. కానీ ఈతడు ఏ కార్యము చేయుచున్నను నీకు అంతరాత్మయై ఉన్నాడు. అతని ఎన్ని విధముల భావించినట్లు అతడే నీలో ప్రేరణ కలిగించుచున్నాడు. నీవు అతనిని ఎన్ని విధములుగా భావించుచున్నను అతనిలో మార్పు ఉండదు. అతనికి దేహాత్మ భ్రాంతి ఉండదు. అతడు వ్యాపించని వస్తువు లోకములో ఏదీను లేదు. ప్రకృతి పురుష రూపముగా జగత్తునంతను తన శరీరముగా నియమించుటచే అన్నిటినీ అతడు ఏకరూపంగా భావించును. ఇట్లు సర్వాత్మయై సమదర్శి అయినను భగవానుడు వేరొక ప్రయోజనము లేక తనను ప్రేమించు వారలను ఎక్కువగా ప్రేమించును. అందుచేతనే ప్రాణములను వదులుటకు ముందుగా నా వద్దకు వచ్చి నాకు దర్శనము సంగినాడు. శరీరమును విడుచు సమయమున ఎవడు భగవానుని యందే మనసు నిలిపి వాని నామములు కీర్తించునో వాడు సర్వ కర్మ విముక్తుడగును.
దేవ దేవుడగు భగవానుడు ప్రసన్నమగు మందహాసముతో ఎర్రని నేత్రములతో వికసించిన ముఖపద్మముతో నా ధ్యానమును గోచరించువాడు నా నేత్ర పదము నిలిచి ఉండగానే నా శరీరమును విడిచెదను. ఇట్లు పలికిన పలుకులు విని శరతల్పమై తల్పముపై శనించియున్న భీష్ముని యుధిష్ఠిరుడు ఋషులందరు వెనుచుండగా అనేక ధర్మమును గూర్చి ప్రశ్నించెను ఆయా వర్ణములలో ఆయా ఆశ్రయ ఆశ్రమములలో వైరాగ్యముచే లేదా కామముచే చేయబడు ప్రవృత్తి ధర్మములను గూర్చియు నివృత్తి ధర్మములను గూర్చియు ప్రశ్నించెను. దాన ధర్మములను, రాజ ధర్మములను, మోక్ష ధర్మములను, స్త్రీ ధర్మములను. భగవత్ ధర్మములను అనగా భగవానుని పొందుటకు చెప్పబడిన శ్రవణ కీర్తనాదులను ఎరుంగవలెనని ప్రశ్నించెను. వాటన్నింటినీ భీష్ముడు సంగ్రహముగా విస్తారముగా ఉపదేశించెను. ధర్మార్థ కామ మోక్షములనేటి నాలుగు పురుషార్ధములను కూర్చియు వానిని పొందడి ఉపాయములను గూర్చియు అనేక విధముల కథలతో ఇతిహాసముతో భీష్ముడు వర్ణించి ఎరింగించెను. ఇట్లు ధర్మములను ప్రవచించుచు స్వచ్ఛంద మరణముగా తన శరీరమును వీరుటకు ఉత్తరాయణమునకై వేచి ఉండెను. ఉత్తరాయణ కాలం వచ్చెను. అప్పుడు కౌరవ పాండవులందరకు నాయకుడు భీష్ముడు మాటలను చాలించెను. దేహమునందు దేహ సంబంధుల యందు సంగమమును సంగమును వీడెను. తను ఎదుటనున్న పీతాంబరధరుడగు విష్ణువునే మనసున నిలిపి కనులు మూసి వానినే లోపల ధ్యానించుండెను. భగవాను మూర్తిని ధారణ చేయుటచే అతని పాపరాశి అంతయు పటాపంచలాయెను. భగవానుడు భీష్ముని చూచుటచే అస్త్రములచే ఆయుధములచే కలిగిన బాధ అంతయు తొలగి మనసు ప్రసన్నమాయెను. ఇంద్రియములు మనస్సు ఏకాగ్రమై ఉండెను. అప్పుడు శరీరమును వీడుచు భీష్ముడు శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. భీష్మ స్తుతి ఏమిటో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the Lord. The one who knows the knowledge of the universe, gentle one, with a smiling face, the one who has the knowledge nectar obtained from the mouth of Vyasa Bhagavan, the devotees are drinking it. He is the one with infinite radiance, you are venerable. Salutations to such Vyasa Maharshi. Second Canto, Fourth Chapter, 24th Prayer. Oh, devotees of God, in the previous episode, we learned about the praise of the immersed God. Let's move on to the next part. Welcome to the first chapter of the Sri Bhagavata Tattva Deepika in the 17th episode. While Kunti Devi was praising, Srikrishna, the unparalleled glorious one, with his wondrous power, captivated the world with his smile, and smiled a little. Thus, as the remaining women prayed with love to the Pandavas, he stopped his journey and re-entered Hastinapura. Lord Krishna himself has taught through many epics. Dharmaraju was grieving, unable to understand that his relatives' death was the power of time's invisibility. With love for relatives, their killing Thinking about it, Dharmaraju spoke thus. Oh, how foolish I am! How much ignorance is filled in my heart, finally. Is this body, which can be eaten by dogs or foxes, not for that purpose? I have killed many. I killed many children, but I have no salvation from hell. Brahmins, friends, beloved ones, fathers, brothers, gurus, I, who have defeated and killed many in battle, have not been released from hell even after thousands of crores of years. The king who nourishes the people becomes unrighteous. It is the duty to kill the enemies, but it is not a sin, says the Lord, but my mind does not agree.
The sin I have committed I cannot forgive myself for, for too long a time. It is not possible to practice some dharmas and remove them. When the mud covered the body. Will the mud go away if the mud is washed away with water? Is it purification by washing the eyes with eyes that have been poured out? Similarly, by performing yajnas (sacrifices), can I get rid of the sins I have committed? No. In this way, Dharmaraju, fearing that he had committed treason against the people, with the desire to learn all the dharmas, went to Bhishma, who was lying on a bed of arrows in the battlefield of Kurukshetra, to learn dharma. All the brothers, adorned with good horses and chariots decorated with gold ornaments, followed Dharmaraja. Vyasa, Dhaumya, and other elderly Brahmins also went along. Lord Sri Krishna also mounted the chariot with Arjuna and started moving with them. As if a deity had fallen from heaven, everyone bowed to Bhishma, who was shining. There, to see Bhishma, Brahma Rishis, Raja Rishis, and Deva Rishis also came. Among them Parvathudu, Narada, Dhaumya, Badarayana Bhagavan, Bharadwajudu, Vasishta, Viswamitrudu, and many other sages were there. Parashurama also came with his disciples. Kashyapa, Angirasa, Brahma Rati, Brahma Ratadi sages also came to Acharya with the disciples. Bhishma, knowing the conduct of the country, truly worshiped them all. Because he was the one who knew the influence of Sri Krishna, he recognized that the Lord of the universe, the Lord himself, was within him, taking form by his own will, and came to be able to see him, and worshiped him, recognizing that he was sitting in front of him. He is speaking thus, with eyes full, with tears that have burst forth with love, joining with the Pandavas who are serving him with humility. Oh noble sons, you are Brahmins, you are the protectors of Dharma, and you are the ones who have taken refuge in Achyuta. But they have experienced a lot of difficulties. This is unacceptable.
After Pandurao died, your mother Kunti Devi, who was young, lived to protect you. She experienced great sorrow. The reason for your suffering is time. Like dense clouds that are subject to the wind, the whole world is subject to time and is moving. Saksha is Dharmaputra, the king. The mighty Vrikodara is holding the mace. Arjuna is holding the Gandiva bow. Krishna, my friend, is there, but he has not stopped the troubles for you. This is all the work of Sri Krishna's will. And time itself would obey his commands. No one knows what God has in mind. Trying to be like that, even the wise ones were deluded. Lord Krishna is the very embodiment of God and is the cause of the world. Narayana, the supreme being, Narayana, by his will, seeing the world as something that cannot be understood by him, hiding his form, is destroying it as one of the Yadavas. Shiva knew the greatness of this Krishna and was not averse to it. The sage Narada and Kapila are said to be in the Kapila. You him As a maternal uncle's son, as a dear friend, and as a peer, I am Yerunggudu. You once came as a messenger, you were a minister. Once upon a time, you were accepted as a charioteer of love. But whatever this man is doing, he is with you as your conscience. He is inspiring you in many ways, as if he is inspiring you. No matter how many ways you think of him, there will be no change in him. He will never be able to get over his body illusion. He is the one who has no world where things don't spread. By establishing the entire world as his body, as the form of nature and man, he considers everything as one. Thus, being all-pervading and all-seeing, the Lord loves those who love Him more than others, without any other purpose. Therefore, before giving up his life, he came to me and gave me a vision. Whoever, at the time of leaving the body, fixes his mind on the Lord and glorifies His names, he becomes liberated from all actions.
The God, the Lord, with a pleasant smile, with red eyes, with a face like a lotus, the one who reveals my meditation, as long as my eye-pad remains, I will leave my body. Hearing these words, Sharadalpa, Bhishma, who was lying on the bed, and Yudhishthira, the sages, all turned back. He inquired about various dharmas in those varnas, in those ashramas, whether it is done by detachment or by desire He questioned about the tendencies and the tendencies of cessation. Charity, royal duties, salvation, and women's duties. He asked, "Should we not understand the Shravana and Kirtana that are said to be the means of attaining the Lord of the Lord's Dharma?" Bhishma summarized and elaborated on all of them. Bhishma described and narrated in many ways with stories and history about the four Purusharthas, namely Dharma, Artha, Kama, and Moksha, and about the means to attain them. Thus, preaching the Dharmas, he waited for Uttarayanam to voluntarily give up his body. Uttarayan The times call for it. Then Bhishma, the leader of all the Kauravas and Pandavas, stopped the speech. He has abandoned union and separation in the body and in those related to the body. He kept in his mind the Vishnu, who was in the form of a yellow-clad ascetic, and closed his eyes, meditating on him inside. By assuming the form of the Lord, all his accumulated sins were destroyed. Seeing Bhishma, the Lord, the suffering caused by weapons and arms was all removed, and his mind was pleased. The senses and mind are united. Then, abandoning his body, Bhishma praised Sri Krishna thus. We will learn about the Bhishma Stuti in the next episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus