పాండవుల మహాప్రస్థానము - పరీక్షత్తు పట్టాభిషేకము

The Retirement of the Pandavas & Coronation of Parikshit

bhagavatam

ఈ పవిత్రమైన శ్రీమద్భాగవతం ఎపిసోడ్‌లో, పాండవులు తమ రాజ్యాన్ని త్యజించి, సమస్త లౌకిక బంధాలను వదులుకుని మహాప్రస్థానం వైపు సాగిన పరమ పావన గాథను తెలుసుకుందాం. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు మరియు ద్రౌపదీదేవి సహా పాండవులందరూ తమ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గంలో నడచిన తీరు అత్యంత భక్తిప్రపత్తులను కలిగిస్తుంది. వారు తరలిపోవడానికి ముందు, పాండు వంశపు ఏకైక వారసుడు మరియు అర్జునుని మనమడైన పరీక్షత్తు మహారాజును హస్తినాపుర సింహాసనంపై సగౌరవంగా పట్టాభిషేకం చేసి, ధర్మపరిపాలన కొనసాగింపునకు నిశ్చింతగా వెళ్ళారు. గొప్పవారైనా సరే వైరాగ్యమే పరమగతి అని మరియు భగవత్కృప వల్ల ధర్మం తరతరాలు నిలుస్తుంది

In this sacred episode of Srimad Bhagavatham, we explore the majestic departure of the Pandavas as they renounce their kingdom and embark on their final journey of Mahaprasthanam, surrendering all earthly attachments at the feet of the Lord. Having fulfilled their dharmic duties, Yudhishthira and his brothers, accompanied by Draupadi, set forth on the great path toward liberation, leaving behind the world they had so nobly upheld. Before their departure, the wise and virtuous Parikshit — the sole surviving heir of the Pandava lineage and the grandson of Arjuna — is solemnly crowned as the king of Hastinapura, ensuring the continuation of righteous governance. This episode beautifully illustrates the inevitability of renunciation for even the greatest of souls and the divine grace that preserves dharma through each generation.

← Prev Next →
The Retirement of the Pandavas & Coronation of Parikshit bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమామతే దేవ పదారవిందం ప్రపన్నతాపోపశమాత్ పత్రం యాన్మూలకేతాయతయోంజసోరు సంసార దుఃఖం బహురిక్షిపంతి అభిమాని దేవతలు ఇట్లు పలికినవి ఓ పరమేశ్వర నీ పాద పద్మములు శరణు పొందిన వారి తాపమును పోగొట్టే గొడుగు వంటివి యతనశీలు రఘు మహాత్ములు నీ పాద మూలమును ఆశ్రయించిన వారై సంసారంలోని మహా దుఃఖమును తేలికగా దూరముగా పారదోలుచున్నారు. థర్డ్ క్యాంటో, ఫిఫ్త్ చాప్టర్, 39th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 21వ పాడ్కాస్ట్ లో స్వాగతం. నిన్న పరీక్షిత్తుకు ఉన్నటువంటి పేరు ఎందుకు పరీక్షిత్తు అని వచ్చింది? తరువాత విషయాన్ని చెప్తూ ఆ తరువాత ధర్మరాజు పలుకుతున్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ధర్మరాజు అంటున్నాడు ఈతడు పవిత్రమగు కీర్తి గల మహాత్ములగు మా వంశమునందు పెద్దల ఉపదేశముచే కీర్తినొంది ఈతడు రాజరుషులను అనవర్తించువాడు అగునా అని ప్రశ్నించెను. జాతకమును చూచి బ్రాహ్మణులు ఆ బాలుని గుణములు ఇట్లు వర్ణించిరి. రాజా ఇతడు మనువు కుమారుడగు ఇక్ష్వాకు ప్రజలను పరిపాలించినట్లు పరిపాలించును. దశరథ పుత్రుడు శ్రీరామచంద్రుని వలె బ్రాహ్మణుల విషయమున భక్తి గలవాడై సత్యసంధుడై పాలించును. దాతృత్వము గలవాడై శరణము అనువారిని రక్షించు శీలము గలవాడై శిబిచక్రవంతి వాడగును. దుష్యంత పుత్రుడగు భరతుని వలె యజ్ఞములను చేసి కీర్తిని విస్తరింప చేయువాడగును. ధనుర్ధరులలో అగ్రేసరుడై కార్తవీర్యార్జునుతో అర్జునునితో సమానుడగును. అగ్ని వలె సహించుటకు శక్యము కానివాడు, సముద్రుని వలె అగాధముగు హృదయం గలవాడు అగును. సింహం వలె పరాక్రమము గలవాడగును, హిమవంతుని వలె సర్వ భూతములచే సేవింపదగువాడగును.

భూమి వలె అపరాధములను సహింప ఓర్మి గలవాడగును. తల్లిదండ్రుల వలె ఎంతటి తప్పు లేనను ఓర్చుకొన గలవాడగును. బ్రహ్మ వలె సర్వభూతము లేడ సమభావము గలవాడగును. జ్ఞానములో అనుగ్రహములో పరమశివునితో సమానముగా నుండును. శ్రీనివాసుని వలె పురుషార్ధములను కోరెడి వారి అందరి చేత ఆశ్రయింపదగిన వాడై ఉండును. దోషములు లేక గుణములే కలిగి భగవానుడు శ్రీకృష్ణునితో సమానుడగును. ధైర్యమున బలి చక్రవర్తిని పోలినవాడై ప్రహ్లాదుని వలె కృష్ణునియందు భక్తి కలవాడై అశ్వమేధమును ఆచరించువాడై జ్ఞానముచే శీలముచే వృద్ధులగు వారిని సేవించువాడగును. ఒక బ్రాహ్మణ కుమారుడు శాపమున శాపమును వసంగక తక్షకుని వలన తనకు మరణం తప్పదని ఎరిగి దేహమునందు దేహ బంధువుల యందు సంఘము లేనివాడై ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధిని చేరును. వ్యాసపుత్రుడగు శుకుని వలన ఎరుంగదగిన ఆత్మతత్వమును ఎరుంగినవాడై గంగా తీరమున ఈ శరీరమును వీడి అభయస్థానముకు శ్రీ మహావిష్ణువు పాద సన్నిధిని చేరును. ఇట్లు ఆ బ్రాహ్మణులు జాతకమును ఎరింగిన వారై అర్జునునకు బాలుని జాతకమును ఎరింగించిన వారై వాని వలన గౌరవింపబడి తమ తమ ఇళ్లకు ఎగిరి. ఆ పరీక్షిత్తు తరువాత ప్రభువై లోకములో ప్రసిద్ధి చెందిన వాడై గర్భములోనుండగా తాను చూచిన పరమ పురుషుని చూడవలెనని అంతటిను పరిశీలించి ఉండెను. అతడు క్రమోగా వృద్ధి పొందిన వాడై శుక్ల పక్ష చంద్రుని వలె వృద్ధి చెందుచుండెను. జ్ఞాతులను చంపిన దోషము తొలగవలెనని ధర్మరాజు అశ్వమేధ యాగము చేయవలెనని తలపెట్టెను. పన్నులుగా వసూలు చేయు ధనము, తప్పు చేసిన వారి నుండి దండముగా వసూలు చేసిన ధనము తప్ప వేరొక ధనము లేని వాడై అశ్వవేధమును చేయుటకు ధనము ఎట్లు వచ్చునా అని ఆలోచించెను. శ్రీకృష్ణ భగవానుడు వారి అభిప్రాయమును ఎరింగి ఉత్తర దిక్కునందు వెనక పరాజయమందిన రాజులు వదిలిపోయిన ధనమున్నది చెప్పగా దానిని భీమార్జును సంపాదించి తెచ్చిరి. ఆ విధముగా ధనమును సంపాదించుకొని ధర్మరాజు మూడు అశ్వమేధ యాగములను చేసెను. శ్రీ భగవానుని ఆరాధించెను. అశ్వమేధ యాగములకు ఆహ్వానింపబడిన భగవానుడు

వారితో హస్తినాపురంలో ఉండి వారి వద్ద హనుమంతుని అనుమతినంది ద్రౌపది బంధువులు అనుమతింపగా అర్జునునితో యాదవులతో కూడి ద్వారకా నగరునకు చేరెను. విదురుడు కౌరవ పాండవుల యుద్ధములకు ముందే ధృతరాష్ట్రుడు యుద్ధమును గూర్చిన ఆలోచనలకు రమ్మని పిలవగా వాని వద్దకేగెను. అప్పుడు దుర్యోధనుడు అతనిని అవమానించెను. వెంటనే అతడు విరక్తుడై పరమాత్మ స్వరూపమును అతనిని పొందడి మార్గమును ఎరుంగవలెనని తీర్థయాత్రలకు వెళ్ళెను. మైత్రేయుని దర్శించి వారి వలన ఎరుంగవలసిన దానిని ఎరుంగి కృతకృత్యుడై అన్నిటి యొక్క రహస్యములను ఎరుంగిన వాడాయను. విదురుడు, మైత్రేయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకముందే భగవత్ స్వరూప జ్ఞానము కలిగి భగవానుని యందు అనన్యమైన భక్తి కలిగెను. దానితో మరి మైత్రేయుని నుండి వినుట కంటే వినిన దానిని మననము చేసుకొని ధ్యానము చేసుకొనుటయే కర్తవ్యమని విరమించెను. ఒకసారి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ధర్మరాజు సోదరులతో తిరిగి వచ్చిన తమ బంధువుకు విదురుని చూచి ఎదురేగి ఆనందించెను. ధృతరాష్ట్రుడు. యుయుత్సుడు, సంజయుడు, కృపుడు, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర మిగిలిన అంతఃపుర స్త్రీలు కూడా విదురునకు ఎదురేగి శరీరము నుండి పోయిన ప్రాణం మర లేచి వచ్చినట్టు ఆనందించిరి. అందరూ విదురుని ఎడుబాటుకు ఎడబాటుకు చాలా బాధపడిన వారై చూచిన ఆనందముచే కౌగలించుకొని నమస్కరించి ప్రేమతో కన్నీటిని విడిచిరి. ధర్మరాజు ఆసనముపై కూర్చుండ చేసి ఆరాధించెను. తరువాత స్నాన భోజనాదులు అయి విశ్రాంతికి సుఖముగా ఆసనముపై కూర్చునిన విదురునకు వినయంతో నమస్కరించి యుధిష్ఠిరుడు అందరూ వినుచుండుగా ఇట్ల పలికెను. ఆర్యా మీ రెక్కల చాటున పెరిగిన మమ్ములను స్మరించుచున్నారా? మా తల్లితో మేము ఆపదలను పొందిన నాడు, కౌరవులు మాకు విషం పెట్టిన నాడు, లక్క ఇంటికి నిప్పు అంటించిన నాడు మీరే కదా కాపాడినారు. భూమండలమంతయు సంచరించుచు మీరు ఏ విధముగా జీవితమును సాగించినారు? ఏ ఏ క్షేత్రములను దర్శించినారు? మీరు మీ వంటి భాగవతులలో

భగవానుడు గదాధరుడు ఎల్లవేళలా వసంచియుండును. అట్టి వారి పాదములను పవిత్ర క్షేత్రములో స్పృశించుట చేతనే అవి ఇతరుల పాపములను తొలగించుటకు తగిన శక్తి గలవి అగును. కృష్ణుడే దైవమని నమ్మిన మన బంధువులు మిత్రులగు యాదవులు కుశలముగా ఉన్నట్లు వింటిరా? వారిని చూచితిరా? ఈ విధంగా ధర్మరాజు ప్రశ్నింపగా తానెరింగిన విషయములన్నింటినీ క్రమము తప్పక చెప్పెను. యదువంశము సంపూర్ణముగా నాశమునందిన విషయం మాత్రము చెప్పలేదు. ఈ విషయం వారు భరించలేరనియు వారిలో ఎవరు దుఃఖించినను తాను చూడజాలకయు చెప్పుట మానినాడు. కొంత కాలం వారు ఆదరించుచుండగా తన జ్యేష్ట సోదరుడగు ధృతరాష్ట్రునకు శ్రేయస్సును కలిగించువాడై ధర్మరాజాదులకు ప్రీతిని కలిగించుచు అచటనే ఉండెను. విదురుడు. మాండవ్యుని శాపం వలన శూద్ర భావమున పొందిన యముడే. అందుచే అతనికి సర్వ ప్రాణుల యొక్క మృత్యుకాలము తెలియును. సూర్యుడు ఎవరు ఎంత పాపము చేసినా అంత పాపమునకు తగిన దండమును విధించును. సూర్యుని కుమారుడే యముడు. యముడు విదురుడుగా వచ్చినప్పుడు సూర్యుడే యముని కర్తవ్యమును కూడా నెరవేర్చుచుండునని ఎరంగవలెను. యుధిష్ఠునకు రాజ్యము లభించినది. వంశము నిలుపుటకు ఉత్తరాగర్భమునందు పరీక్షిత్తు జన్మించినాడు. లోకపాలరు వంటి సోదరులు శవించుచున్నారు. అందుచే ఐశ్వర్యముతో ఆనందముతో కాలము గడుపుచుండెను. యుధిష్ఠిరాదులు కానీ ధృతరాష్ట్రకు కానీ కాలము గడిచిపోవుచున్నదే అనే భావన కూడా మనసులో కలగలేదు. తన అన్న అయిన ధృతరాష్ట్రకు హితము చెప్పవలెనని తలంచి విదురుడు అతని వద్దకేగి ధృతరాష్ట్రునితో ఇట్లు చెప్పెను. ప్రభు, ఎవ్వరైనాను కాలమును అతిక్రమించి ప్రవర్తించలేరు. దానికి ప్రతీకారం చేయుట ఎవరికీ చేత కాదు. మృత్యుకాలము మనకు సమీపించినది. ఆ కాలము మనకు సమీపించినప్పుడు అన్నిటికంటే ప్రియమైన ప్రాణమును కూడా విడక తప్పదు. ఇంకా ధనాదులు వదులుట తప్పదని వేరే చెప్పవలెనా? సోదరులు, పుత్రులు, మిత్రులు అందరును యుద్ధములో చనిపోయినారు. మీ శరీరమును కూడా.

ముసలితము ఆక్రమించినది. కుమారులు లేక పరుల ఇంట వసించుంటిరి. ప్రాణులకు జీవితాశ చాలా బలమైనది. ఎంత ఆపద వచ్చినను, ఎంత నైత్యము అనుభవించినను. జీవించవలెనని అనిపించును. నీ కుమారులను చంపిన భీముడు పెట్టిన అన్నము తినుచు ఇంటికి కాపల పడి ఉండు కుక్క వలె జీవితం నిలుపుకొనుచున్నారు. మీరు పాండవులను చంపింపవలెనని ఇంటికి నిప్పు పెట్టించినారు. వారికి విషాన్నం పెట్టినారు. వారి భార్య సభలో అవమానపరిచినారు. వారి రాజ్యమును ధనమును హరించినారు. ఇన్ని అపకారములు చేసి ఈనాడు వారు పెట్టిన అన్నముతో ప్రాణమును నిలుపుకొనుచున్నారు. ఇంతకంటే హీనమైన జీవితం ఉండునా? ఏదో ఒక విధముగా ప్రాణమును నిలుపుకొనవలెనని వారు పెట్టిన అన్నము తిని అయినను దైన్యముతో జీవించవలెనని మీరు కోరుచున్నను మీకు ఇష్టము లేకపోయినను చినిగిన బట్ట ముక్క ముక్కలై ప్రదిలిపోవునట్లు ఈ శరీరం పోవునదే గానీ నిలుచునది కాదు. శరీరముతో తాను సాధించవలసినది లేనినాడు విరక్తుడై బంధమును కలిగించు గృహబంధు సంఘమును. వీడినవాడై ఎవరికీ తెలియక ఒంటరిగా అయినను పోయి తన దేహమును వీడినవాడే ధీరుడు. వాడే యోగి. తనంత తనకు గాని ఒకరి ఉపదేశం వలన గాని మానవునకు జ్ఞానము కలగవలెను. కలిగిన తరువాత తాను ఎవడో ఎరిగి ఇంద్రియములను జయించవలెను. సంసార బంధమును హరించెడి భగవానుని మనసులో నిలిపి ధ్యానించుచు ఇంటిని వీడిపోవలెను. అందుచే నీవు నీ వారికి తెలియకుండా ఉత్తర దిక్కున నడిచిపోము. చాలా హీనమైన కలికాలము రానున్నది. అది లోకములో మంచి గుణములను కలగనివ్వదు. భగవానుడిపై మనసు సాగనివ్వదు. అందుచే నీవు భగవత్ ధ్యానముతో పరివ్రాజకుడవై సాగిపొమ్ము. అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినాడు. తర్వాత విషయాన్ని మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Gurus. I bow to the lotus feet of the God. Forgive the sins of those who have surrendered. The sorrows of worldly life are greatly relieved. The gods who are devoted to me, thus spoke. Oh Parameshwara, the lotus feet of your feet, those who have taken refuge Like an umbrella that removes heat, the virtuous Raghu Mahatmas, who have taken refuge at the base of your feet, are easily and far away driving away the great sorrow in the world. Third Canto, Fifth Chapter, 39th Prayer. Devotees of God, welcome to the 21st podcast of Srimad Bhagavata Tatva Deepika, the first volume. Why is the name of the test yesterday Parikshithu? After telling the next thing, we are going to know what Dharmaraju is saying today. Dharmaraju is saying, "This person, who has a sacred reputation and is a great person, has gained fame in our lineage through the teachings of elders. Is he one who obeys the kings?" he asked. Seeing the horoscope, the Brahmins described the boy's qualities thus. King, this is Manu's son, Ikshvaku, the people As if governing, as if governing. Like the son of Dasaratha, Sri Ramachandra, he will be devoted to Brahmins, truthful, and will rule. He who is charitable, who is of the nature of protection, who is of the nature of protecting those who seek refuge, will be like a wheel of the camp. Like Bharata, the son of Dushyanta, he performs yagnas (sacrifices) and expands his fame. Among the archers, he is the foremost, equal to Kartikeya and Arjuna. He who is unable to endure like fire, he who has a heart as deep as the ocean. He will be as valiant as a lion, and as the snow-white elephant, he will be served by all creatures.

Like the earth, he is one who endures iniquity. He is able to tolerate any mistake like parents. Like Brahma, he is the one who is equal to all beings. In knowledge, in grace, he is equal to Parameshwara. Like Srinivasa, he is the one who is worthy of being sheltered by all those who desire the fruits of action. Without faults, possessing virtues, the Lord is equal to Sri Krishna. Being like the mighty emperor in courage, being devoted to Krishna like Prahlad, performing Ashwamedha, serving those who are grown old by knowledge and character. A Brahmin's son, knowing that he would surely die by the curse of Takshaka, without any association in his body or among his body's relatives, will reach the presence of that Sri Maha Vishnu. Having understood the essence of the self, which is to be understood by Shuka, the son of Vyasa, leaving this body on the banks of the Ganges, he will reach the abode of fear, at the feet of Sri Maha Vishnu. Thus, those Brahmins, having examined the horoscope, having examined Arjuna's horoscope, being honored by him, their respective Flying homeward. After that examination, being the Lord, having become famous in the world, while in the womb, he examined to see the Supreme Being whom he had seen. He, having grown in order, was growing like the waxing moon. Dharmaraju decided to perform Ashwamedha Yagam so that the sin of killing his relatives would be removed. The money collected as taxes, the money collected as punishment from those who committed wrongs, besides that, he thought how would he get money to perform Ashwamedha, being without any other money. Srikrishna Bhagavan, in his opinion, said that the kings who had lost in the north, in the north, and behind, had left the wealth. Bhima and Arjuna then acquired and brought it. In that way, Dharmaraja, having earned wealth, performed three Ashwamedha Yagas. He worshipped the Lord. The Lord who was invited to the Ashwamedha Yagna

Having stayed with them in Hastinapuram, Draupadi's relatives, having been permitted by Hanuman, joined with Arjuna and the Yadavas and reached the city of Dwaraka. Vidur, before the Kauravas and Pandavas' wars, Dhritarashtra called him to discuss the war, and he went to him. Duryodhana then mocked him. Immediately he became detached and went on pilgrimages to learn the path to attain the form of the Supreme Being. Having seen Maitreya, having understood what needs to be understood by them, having understood, being accomplished, having understood the secrets of everything, I am the one. Before Vidura and Maitreya could answer some questions, they attained the knowledge of the divine form and developed unique devotion to the Lord. With that, he concluded that it is more important to contemplate and meditate on what is heard than to listen to it from Maitreya. Once again, he returned to Hastinapur. Dharmaraju, seeing his relative who had returned with his brothers, Vidura, was delighted. Dhritarashtra, Yuyutsu, Sanjaya, Krupa, Gandhari, Draupadi, Subhadra, and the remaining inner palace women also, facing Vidura, rejoiced as if the life that had departed from their bodies had returned. Everyone, having grieved greatly for Vidura's separation, embraced him with joy, saluted him, and with love, released their tears. Dharmaraju sat on a seat and worshiped. After that, having finished bathing and eating, and having rested comfortably, Vidura, who was sitting on a seat, was respectfully greeted by Yudhishthira, and as everyone was listening, he spoke thus. Arya, do you remember the children who grew up under your wings? When we faced difficulties with our mother, when the Kauravas poisoned us, when the house was set on fire, it was you who saved us. Traveling the whole earth, how did you live your life? Which are the places that you visited? Among the devotees like you

The Lord, the Gadadhara, is always present. By touching the feet of such people in the holy place, they become capable of removing the sins of others. Have you heard that our relatives and friends, the Yadavas, who believed that Krishna is God, are doing well? Did you see them? In this way, when Dharmaraju questioned, he must have told all the things he knew in order. The fact that the Yadava dynasty was completely destroyed was not mentioned. They could not bear this matter, and he stopped telling them, saying that he could not bear to see anyone grieving. For some time, while they were supporting him, he remained there, bringing prosperity to his elder brother Dhritarashtra and pleasing the kings like Dharmaraja. Vidura. Yama, who was cursed by Mandavya, attained the state of a Shudra. Therefore, he knows the time of death of all creatures. The sun, whoever commits how much sin, will be punished according to that sin. Yama is the son of Surya. When Yama came as Vidura, the Sun also fulfilled Yama's duty It is like a battle. Yudhishthira got the kingdom. To preserve the lineage, Parikshit was born in the northern part. Brothers like Lokpal are dying. Therefore, he was spending his time with wealth and happiness. Neither Yudhishthira nor Dhritarashtra felt that time was passing. Vidura, thinking that he should advise his brother Dhritarashtra, went to him and said this to Dhritarashtra. Lord, no one can transgress the time. No one can respond to that. The hour of our death is near. When that time approaches, even the dearest of our lives cannot be separated. Should I also say that it is necessary to give up wealth? Brothers, sons, and friends, all died in the war. So that you too can have yours.

The old woman has taken over. They lived in the house of others because they had no sons. Life expectancy is very high among animals. No matter how much danger there is, no matter how much sacrifice there is. It feels like I should live. They are living life like a dog guarding the house, eating the food given by Bhima, who killed your sons. You have set fire to the house so that the Pandavas have to be killed. They were poisoned. His wife was humiliated. They have plundered their kingdom and their treasures. Having done so many evils, they are now sustaining their lives with the food they have provided. What worse can one imagine than this life? If you desire to live with some kind of life, even if you eat the food they have given you, if you wish to live with poverty, even if you do not like it, this body will be torn to pieces, and it will be scattered, but this body will not go away It's not a stand. When the body does not achieve what it should, he becomes detached and creates bondage, the household bond, the association. He who has abandoned, even though he is alone without anyone knowing, the one who has abandoned his body is the brave one. The Yogi. One should gain knowledge to the extent of one's own understanding or through the teachings of someone. After attaining it, one should know who they are and conquer the senses. One should leave home, meditating on the Lord, keeping in mind the Lord who destroys worldly bonds. Therefore, without your people knowing, we will walk in the north direction. An age of darkness is coming. It does not allow good qualities in the world. The heart does not allow one to be in touch with God. Therefore, you should live as a renunciant with the meditation of the Lord. Thus spoke Vidura to Dhritarashtra. We'll learn more about it in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.