ధర్మదేవత (వృషభం) మరియు భూదేవి (గోవు) విలాప సంభాషణ

Dialogue Between Dharma (The Bull) & Mother Earth (The Cow)

bhagavatam

శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ గాఢమైన ఘట్టంలో, ధర్మదేవత గాయపడిన వృషభంగా మరియు భూదేవి దుఃఖపడుతున్న గోవుగా ప్రత్యక్షమై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కలియుగ ప్రభావం వల్ల ధర్మం నాలుగు పాదాలలో మూడు పాదాలను కోల్పోయి, కేవలం సత్యమనే ఒక్క పాదంపై మాత్రమే నిలబడిన దుస్థితిని వృషభం వివరిస్తుంది. పాపం, అధర్మం మరియు స్వార్థం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయని భూదేవి తీవ్రంగా విలపిస్తుంది. ఈ హృదయస్పర్శి సంభాషణ భగవంతుని దివ్య సంకల్పాన్ని మేల్కొలిపి, మహారాజు పరీక్షిత్తు రాకకు నాంది పలుకుతుంది.

In this profound episode from Canto 1 of the Srimad Bhagavatham, we witness a deeply moving exchange between Dharma, appearing as a wounded bull, and Mother Earth, appearing as a grieving cow. The bull stands on only one leg, symbolizing how righteousness has been reduced to a single pillar — truthfulness — as the age of Kali begins its assault on the world. Mother Earth laments the suffering of creation as sinfulness, greed, and irreligion spread across the land, threatening the very foundations of dharmic life. This soul-stirring dialogue reveals the urgent need for the Lord's divine intervention and sets the stage for the arrival of the great warrior Parikshit.

← Prev Next →
Dialogue Between Dharma (The Bull) & Mother Earth (The Cow) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యతో ప్రాప్యన్యవర్తంత వాచశ్చ మనసాసః అహం చాన్య ఇమే దేవాః తస్మై భగవతే నమః భగవానుని స్వరూపమును వర్ణించబోని వాక్కు విఫలమైనది. దానిని ఊహించబోనిన మనస్సు కూడా విఫలమైనది. అహంకారాభిమానియ రుద్రుడు మరియు ఇతర దేవతలు కూడా భగవానుని మహిమను అంచనా వేయలేకున్నారు. అట్టి శ్రీహరి భగవానునకు నమస్కారము. థర్డ్ క్యాంటో సిక్స్త్ చాప్టర్ 40th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 22వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతకుముందు మనం విదురుడు ధృతరాష్ట్రుడికి చేసినటువంటి ఉపదేశము మాటల్ని విన్నాం. దాని తర్వాత భాగం ఏమిటో చదువుకుందాం. ఇట్లు విదురుడు చెప్పిన మాటలతో ధృతరాష్ట్రుని జ్ఞాన నేత్రం విప్పాయనది. ఇంటి యందు తన వారు అనుకొనుడి వారి యందు ఇంత కాలమున్న దృఢమైన స్నేహావేశములు విచ్ఛిన్నమైనవి. తన సోదరుడు చెప్పినట్లు విని ఉత్తర దిక్కునకు బయలుదేరి పోసాగెను. భర్త వెడలిపోవుచున్న విషయం ఎరింగి గాంధారి పరమ పతివ్రత గనుక ఆమె కూడా అతనిని అనుసరించి నడిచెను. వారు హిమాలయ పర్వతం ప్రాంతమున పోసాగిరి. ఇట్లు ధృతరాష్ట్రుడు అజ్ఞాతముగా ఇల్లు వీడిపోవుట వివేకం గల వారికి చివరి దశలో కూడా వీడని బంధమును తెంపుకొనుటకు ప్రబలమైన ఉపదేశమై నిలిచినది. మరునాడు ధర్మరాజు ఉదయం సూర్యోపాసనము అగ్నిహోత్రము చేసి తల్లితండ్రులు గాంధారి ధృతరాష్ట్రులకు ప్రతిదినము వలె నమస్కారము చేయుటకు వారి భవనము కేగెను. అక్కడ సంజయుని కూర్చుని ఉండెను. తల్లిదండ్రులు కనపడలేదు. ధర్మరాజు మనసు చెదిరి సంజయుని ప్రశ్నించెను. సంజయా, వృద్ధుడు, అంధుడు అగు మా తండ్రియు వారిని అనుసరించడి మా తల్లియు కొడుకులు లేక దీనముగా దుఃఖించుతూ ఎచ్చటికి పోయినారో మీకు తెలియునా?

మా పిన తండ్రి విదురుడు కూడా కనబడు లేదు. వారి ఇతరకే ఇరో బంధు శోకముచే శోకించున్న నా తండ్రి భార్యతో కలిసి వివేకహీనుడనగు నేను తమ యెడల ఏమైనా పాపము చేతునేమోనని శంకించి గంగలో పడి ఉండడు కదా. మా తండ్రి పాండురాజు చనిపోయిన నాడు పసివారలై ఉన్న మమ్ము మా పెద్ద తండ్రి యగు ధృతరాష్ట్రుడును మా పిన తండ్రి యగు విదురుడే కాపాడినారు కదా ఇప్పుడు ఎచ్చరికేగినారు. సంజయుడు తన ప్రభోగు ధృతరాష్ట్రుని చూడని దుఃఖముతో తాను కూడా బాధపడుచు వారి ఎడబాడు కలచెందిన మనస్సుతో ఏడ్చుచున్నాడు. జ్ఞానము గలవాడొకటిచే ఎట్లో మనస్సు కుదరపరుచుకొని కన్నీటిని తుడుచుకొని ధృతరాష్ట్రుని మనస్సులో తలుచుకొని అజాత శత్రువుతో ఇట్లు పలికెను. ధర్మరాజా, మీ తల్లిదండ్రులు సంకల్పమును నేను ఎరుంగను. మహాత్ములగు గాంధారి ధృతరాష్ట్రులు నన్ను కూడా వంచించి పోయినారు. ఇట్లు చెప్పుచుండగా తుంబురునితో కలిసి నారద మహర్షి అచ్చరికి ఎతెంచెను. యుధిష్ఠిరుడు వారిని చూచి లేచి నిలబడి నమస్కరించి వారిని ఆరాధించెను. నారదుని ఇష్టు ప్రశ్నించెను. మా తల్లిదండ్రుల జాడ తెలియటం లేదు, ఎక్కడికేగినారో. పిల్లలు పోయి దినులే బాధపడుచున్న మా అమ్మ గాంధారి ఎచ్చటికి పోయినో తెలియదు. దుఃఖ సముద్రంలో మునిగిన వారికి చుక్కాని నడుపు నావికుని వంటి వారు కదా మీరు, మీ దర్శనమైనది. మీరు అన్నింటినీ ఎరుంగజాలిన వారు మాకు ఎరుంగజే ప్రార్థన. ధర్మపుత్రుడు ఇట్లు ప్రార్థించగా దేవరిషకు నారదుడు ఇట్లు పలికెను. రాజా ఎవరిని గూర్చియు శోకింపవలసిన పని లేదు. భగవత్ అధీనమైన జగము కదులుచున్నది. లోకములు లోకపాలులు కూడా తాము చేయు పనులు నియంతయగు వాని ఆరాధన గనగని చేయుదురు. ప్రాణులను కలిపెడువాడును విడదీయువాడు వాడే. ముక్కు త్రాడు పోసి పశులను నడిపినట్లు వేదము త్రాడితో వర్ణాసన ధర్మముల నడి బంధములతో భగవానునిచే జీవుడు నడిపింపబడుచుండును. ఈ లోకములో ఆయా సాధనములతో ఆడుకొను వారు తమ ఇచ్చ వచ్చినట్లు కొన్నిటిని కలిపి కొన్నిటిని విడదీసి ఎట్లు ఆడుకొందురో అట్లే భగవానుడు కూడా ఆడుకొనుచుండును.

ఈ లోకము స్థిరమైనదా, అస్థిరమైనదా లేదా స్థిరము అస్థిరమును కూడన కూడన అనునది నిర్ణయింప వీలు కానిది. ఎట్లు అనుకొన్నను విచారింపనక్కర్లేదు. మన ప్రేమ వలన అజ్ఞానం వలన వీడితిమి అని దుఃఖము కలుగుచున్నది. ఒకరితోనొకరు ఉండడి వారును కాదు. పోయేటి వారును కాదు. అందుచే నీ మానసిక తాపము ఆదరింప తగినది కాదు. అది అజ్ఞానముచే కలిగినది. దిక్కు లేని వారు కదా అని శోకముతో కృంగిపోయిన వారు కదా అని నేను లేనిదే వారు ఎట్లు బ్రతకగలరు? అని నీవు భావించి శోకించుచున్నావు కానీ అట్లు తలంచకుము. ఈ పాంచ భౌతికముగు దేహము, కాలము, కర్మ, సత్వరజస్తమో గుణములు అనువానికి అధీనమై నిలుచునది, కదలునది, పోవునది. ప్రతి ప్రాణియు మృత్యు నోటిలో ఉన్నాడు. పాము నోటిలో ఉన్న కప్ప వేరొక దానిని రక్షించుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో, మృత్యువుచే సంతతము గ్రహింపబడి ఉన్న జీవులు వేరొకరికే శోకించుట అంత అవివేకము. ఈ లోకములో వారికి ఆహారం ఎట్లు అని నీకు బెంగగా ఉండవచ్చును. చేతులు లేనివి చేతులు కలవానికి ఆహారమగుచున్నవి. పాదములు లేనివి చతుష్పాదములు అనగా నాలుగు పాదములు కలవానికి ఆహారమగుచున్నవి. ఔషధులు, ఫలములు, మూలములు, పశువులు, మృగములు కూడా ఒకరికి ఆహారమగుచు తమలో తాము ఒకదానిని ఒకడిని తిని బ్రతుకుచున్నవి కదా. ఒక జీవుడు ఒక జీవునకు ఆహారమగుచుండును. అందుచే ఆహారమెట్లు అను ప్రశ్న చాలా క్షుద్రమగు ప్రశ్న. ఓ రాజా, ఈ కనపడుచున్న చేతనా చేతనాత్మకమగు జగత్తు అంతయు తానే అయి తాను ధరించి నియమించున్నాడు భగవానుడు. అన్నింటినీ వాడే పోషించుచున్నాడు. అంతయు వాడు ఒక్కడే ఉండగా అజ్ఞానముచే మనం భిన్నభిన్నముగా భావించి శోకించుచున్నాం. మహారాజా సకల భూతములకు ఆహారమును కలిగించువాడు భగవానుడు. ఆ భగవానుడే సాధులను రక్షించుటకు అసుర భావములతో లోక వినాశకులగు వానిని శపించుటకు తానే మృత్యు రూపుడై అవతరించినాడు. దేవ కార్యము శ్రీకృష్ణుడు నెరవేర్చినాడు. ఇక కొద్ది పని ఉండుటచే ఈ లోకమున నిలిచి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఈ లోకమున ఉండగానే మీరు కూడా మీ శ్రేయస్సునకై ప్రయత్నించుట మేలు. మీ తండ్రి, మీ తల్లి హిమవత్ పర్వతమునకు దక్షిణ భాగమున ఋషుల ఆశ్రమమునకు చేరినారు. అచ్చట గంగ ఏడు పాయలుగా ఏడుగురు ఋషులను తృప్తపరచుటకై ఏడు మార్గములు ప్రవహించినది. అందుచే ఆ క్షేత్రమును

సప్త స్తోత్రము అందురు. అచ్చట వారు స్నానము చేసి హోమము చేసుకొని జలములను మాత్రమే స్వీకరించి మనసులో ఏ విధమైన కామము లేని వారై దేనిని గూర్చి వాంఛ లేని వారై ఉన్నారు. అట్లు స్థిరముగా కూర్చుని ధ్యానము చేయుచునను శ్రమ కలిగిన స్థితి గలవారులైనారు. ప్రాణవాయువును నియమించి ఇంద్రియ వ్యాపారములను మనోవ్యాపారములను భగవత్ ధ్యానముచే నిరోధింపగలవారైనారు. వారి శరీరములోని సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములు ఆగిపోయినవి. దేహము నిర్మలమైనది. మనస్సును ఆత్మతో చేర్చి ఆ ఆత్మను పరమాత్ములో నినమొనర్చి ఘటము బ్రద్దలైనచో ఆవరణము లేకపోవుటచే అందరి ఆకాశము. ఆకాశములో కలిసినట్లు పరమాత్ములో లీనమైనారు. ప్రకృతి గుణముల యొక్క ప్రభావము ధ్వంసమైనది. ఆహార ప్రసక్తి వారికి లేదు. వారొక చలనము లేని స్థానము వరే ఉన్నారు. వారు ఆ ధ్యానము నుండి చలించిన స్థితిలో ఉన్నారు. వారు ఈనాటికి ఐదవ రోజు శరీరమును వీడి పరమాత్ములో చేరుదురు. ఆ శరీరములు అచటనే భస్మముగును. ధృతరాష్ట్రుడు నియమధారణముచే యోగాగ్నిచే దహింపబడగా ఆమె కూడా ఆ అగ్నియందే ప్రవేశించి తన శరీరమును వీడును. విదురుడు ఆ సన్నివేశమును ఆశ్చర్యకరముగా దర్శించి సోదరుడవుటచే శోకమును అత్యుత్తమమగు పరమపదమును పొందుటచే ఆనందమును పొంది అతని నుండి తీర్థయాత్ర దర్శనము సందర్శనమునకు పోవును. ఇట్లు ధర్మరాజునకు వారి వృత్తాంతము చెప్పి తుంబురు నారదాదులు స్వర్గమునకేగిరి. నారదుని మాటలు విని మనసును నిలిపి ధర్మరాజు శోకం తొలగిన వాడాయను. తర్వాత జరిగిన భాగాన్ని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Gurus. Those who attain and do not return, their speech and mind are different. I am different from them, O Gods. Salutations to that Lord. The speech that was about describing the form of the Lord has failed. The mind that could not conceive it, failed. The arrogant Rudra and other gods also could not estimate the greatness of the Lord. Salutations to Lord Sri Hari. Third Canto Sixth Chapter 40th Prayer. Devotees of God, welcome to the first episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 22nd podcast. Earlier, we heard the teachings and words of Vidura to Dhritarashtra. Let's read the next part. Thus, with the words spoken by Vidura, Dhritarashtra's eyes of wisdom opened. The strong friendships that existed between his family members for so long have been broken. Hearing what his brother said, he set off towards the north. Because Gandhari, a chaste woman, followed her husband as he left. They are in the Himalayan mountain region Posagiri. Thus, Dhritarashtra's leaving home in anonymity is a strong teaching for those who are wise to break the bond that remains even in the final stage. The next day, Dharmaraja, after performing morning sun worship and Agnihotra, went to his parents' house to offer salutations as he did every day to Gandhari and Dhritarashtra. There was a man named Sanjay sitting there. The parents are not found. Dharmaraja's mind was disturbed, and he questioned Sanjaya. Sanjaya, do you know where our father, who is old and blind, and our mother, who is sad and grieving without sons, have gone?

My uncle Vidur is nowhere to be seen. My father, who is grieving over his other relatives' sorrow, along with his wife, wonders if I, being unwise, have committed any sin against them, and fears that he might fall into the Ganges. When our father, Panduraju, died, we were children, but our elder father, Dhritarashtra, and our younger father, Vidura, protected us, didn't they? Now, why are they asking? Sanjaya, with the sorrow of not seeing his master Dhritarashtra, is also grieving and crying with a heart that is attached to their separation. The wise one, having cleared his mind, wiped away the tears, remembered Dhritarashtra in his mind, and spoke thus to Ajatashatru. Your parents' resolve, I will not fail to capture it. The great Gandhari and Dhritarashtra deceived me too. While saying this, Narada Maharshi, along with Tumburu, arrived immediately. Yudhishthira, seeing them, stood up, saluted them, and worshipped them. Narada was asked a favour. I can't find my parents, Where did they go? My mother, Gandhari, who has lost her children, is suffering. I don't know where she went. You are like a boatman steering the boat of those who have drowned in the sea of sorrow, you are their guide. We pray that you, who are the all-pervading, are the all-embracing. When Dharmaputra prayed thus, Narada spoke thus to Devarisha. The king has no reason to mourn. The world is moving under the control of God. The worlds and the rulers also do the works they do, knowing that it is the worship of the ruler. He is the one who unites and separates the living beings. Like leading animals by threading a nose, the Vedas, with the thread, the rules of Varna, and the bonds of conduct, the soul is led by the Lord. In this world, those who play with various instruments, as they please, mix some things and separate some, just as they play, so does God play.

Is this world stable, unstable, or neither stable nor unstable? It is not possible to determine. There is no need to worry about how it is thought. We are saddened that we were separated due to ignorance and love. They are not even friends. Not the ones who are going to lose it. Therefore, your mental suffering is not worthy of respect. It is a result of ignorance. They are those who have no direction, aren't they? They are those who are depressed with sorrow, aren't they? How can they live without me? And you are grieving thinking that, but don't think like that. This body, which is the five material elements, is subject to the qualities of time, action, and the three gunas: sattva, raja, and tamo. It is capable of moving, moving, and moving. Every living being is in the mouth of death. How foolish it is for a frog in a snake's mouth to try to protect another one, it is so foolish for creatures who are constantly being consumed by death to grieve for someone else. You may be concerned about how they will eat in this world. Those without hands are becoming food for the hands to join. Those without feet are quadrupeds, meaning four legs They are the food for the community. Medicines, fruits, roots, animals, and beasts also live by eating each other, right? One organism is becoming food for another organism. Therefore, the question of how to eat is a very important question. Oh king, this visible, conscious, and all-pervading world is all Himself, and He Himself has established and ordained it. He's using everything. While he alone is there, due to ignorance, we are feeling different and grieving. The Maharaja is the Lord who provides food for all beings. That God himself, to protect the saints, with demonic emotions, to curse those who destroy the world, he himself incarnated as death. The divine play of Lord Krishna. Now, because of a little work, he is standing in this world. While Sri Krishna is in this world, it is good for you to also strive for your own well-being. Your father and your mother reached the hermitage of the sages in the southern part of the Himalayas. There, the Ganges, in seven streams, to satisfy the seven sages, seven The paths have been paved. Therefore, that field

Sapta stotram is there. There, they have taken a bath, performed a homa (fire ritual), and only accepted water, and in their minds, they are without any kind of desire, without any longing for anything. Thus, those who are in a state of suffering, sitting still and meditating. They have been able to control the life force, the activities of the senses, and the activities of the mind through the meditation of the Lord. The functions of the sattva, rajas, and tamas gunas in their body have stopped. The body is pure. Joining the mind with the soul, establishing that soul in the Supreme Soul, if the pot breaks, because the enclosure is lacking, everyone's sky. They merged with the Supreme Being, as if united in the sky. The effect of natural qualities is destroyed. They don't care about food. They are in a place that is not moving. They are in a state of being moved out of that state of meditation. They leave their bodies on the fifth day and join the Supreme Being. Those bodies would be reduced to ashes there. Dhritarashtra, being burned by the fire of yoga, she also enters that fire and abandons her body. Vidurudu, seeing that scene in an astonishing way, having become a brother, having attained sorrow and the supreme abode, having attained joy, will go on a pilgrimage from him, for darshan and visit. Thus, after telling their story to Dharmaraja, Thumburu and Narada went to heaven. Hearing Narada's words, Dharmaraja, with a steady mind, said that he was relieved of his sorrow. We will find out what happened next in another episode. Salutations to Asmadguru, Jai Srimannarayana.