అశ్వత్థామ నిగ్రహము & కుంతీదేవి స్తుతి (Parts 10-14)
Punishment of Ashwatthama & Prayers of Kunti (Parts 10-14)
శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ భాగంలో, అశ్వత్థామ ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన ఘోరమైన చర్యకు శ్రీకృష్ణుడు అతనిని శిక్షించిన వైనాన్ని వివరిస్తారు. అర్జునుడు అశ్వత్థామను బంధించగా, శ్రీకృష్ణుడు అతని శిరోమణిని తొలగించి అతనిని అపకీర్తితో జీవించమని శపిస్తాడు — ఇది అధర్మానికి తగిన ఫలితాన్ని తెలియజేసే గొప్ప సందేశం. అనంతరం కుంతీదేవి శ్రీకృష్ణుని పట్ల తన భక్తిని అద్భుతమైన స్తుతి ద్వారా వ్యక్తపరుస్తుంది, సుఖదుఃఖాలు రెండూ అతని కృపగా భావించి ఆయన పాదాలకు శరణు వేడుకుంటుంది. కుంతీదేవి స్తుతి నిస్వార్థ భక్తికి పరమోదాహరణగా శ్రీమద్భాగవతంలో చిరస్థాయిగా నిలిచింది
In this profound episode of Srimad Bhagavatham Canto 1, we explore the dramatic confrontation between Arjuna and Ashwatthama, who is punished by Sri Krishna for his heinous act of releasing the Brahmastra against the unborn child in Uttara's womb. Krishna's divine intervention saves the Pandava lineage, and Ashwatthama is stripped of his gem and condemned to wander in disgrace — a powerful lesson on the consequences of adharma. We then witness the deeply moving prayers of Kunti Devi, who humbly glorifies Sri Krishna with heartfelt devotion, surrendering all her sorrows and blessings alike at His lotus feet. Her celebrated stuthi reminds us that true bhakti seeks neither comfort nor protection, but only the endless grace of the Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధలీలయా గృహీతశక్తి త్రిదయామ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే అనంత మహిమాన్వితుడు జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుట అనే లీల కొరకై క్రమముగా రజస్సు, సత్వము, తమస్సు అనే మాయాశక్తి గుణములను ఉపాధిగా స్వీకరించువాడు, సకల ప్రాణులయందు అంతర్యామియై ఉండువాడు, ఇంద్రియములకు గోచరము కాని స్వరూపము గలవాడు, ప్రకృతికి అతీతమైన చేతనా స్వరూపుడు అగు శ్రీహరికి నమస్కారము. సెకండ్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 12th ప్రేయర్. భగవత్ బంధువులారా ఇంతక్రితము భగవంతుని యొక్క అవతార రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. శ్రీమద్ భాగవత తత్వదీపిక. ప్రథమ స్కందం 10వ పాడ్కాస్ట్ లో సుస్వాగతం. ఇంతవరకు చెప్పిన భగవద్ అవతార రహస్యమును అమాయకముగా అవిచ్ఛిన్నముగా భగవానుని ప్రేమతో ధ్యానించు వారలు ఎరుంగ జాలుదురు. ఓ మునులారా పూజ్యులగు మీరు ధన్యులు. అఖిల లోక నాధుడగు వాసుదేవుడు విశ్వమును తనగు శరీరముగా కలిగి ఉన్నాడని ఎరింగిన వారు. అందుచే మీకు గర్భ, జన్మ, జరా, మరణాది దుఃఖ హేతువైన సంసారము మరి కలగదు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భాగవతము పురాణమును భగవానుడగు బాదరాయణుడు రచించినాడు. ఇది వేదముతో సమానమైనది. ఉత్తమ శ్లోకుడగు భగవాను చరితము ఇందు ప్రతిపాదింపబడినది. భాగవతము లోకమునకు నిశ్రేయసమును కలిగించును. జ్ఞానమును కలిగించి మానవులను కృతార్థులను చేయును. నిరతిశయమైన మంగళమును కలిగించును. ఈ పురాణము బాదరాయణ మహర్షి తన కుమారుడగు శుకునకు నేర్పినాడు. వేదములలో ఇతిహాసములలో మిక్కిలి సారభూతమగు విషయములు ఇందు నిబంధింపబడినవి. ఆ శుకయోగి పరీక్షిణ్ మహారాజునకు వినిపించెను. గంగా తీరమందు ఋషులతో పరివేష్టితుడై అనశన వ్రతముతోనున్న పరీక్షిత్తునకు ఈ భాగవతం వినిపించబడినది. అతట చేరి ఉన్నవాడనై.
శుకుని అనుగ్రహం వలన నేను ఈ పురాణమును ఎరుంగ గలిగితిని. నేను నేర్చినట్లు నా బుద్ధిని అనుసరించి నేను గ్రహించినంత వరకు మీకు వినిపించెదను. భగవానుడవు శ్రీకృష్ణుడు ధర్మజ్ఞానాదులతో కూడా ఈ లోకమును వీడి తన ధామమునకేగినాడు. ఉన్నవానిని ఉన్నట్లు ఎరుంగ చేయగలిగిన జ్ఞానమనిడి చూపు లోకులకు పోయినది. ఆనాటి నుండియు కలియుగం ఏర్పడినది. అజ్ఞానాంధులైన జనులకు మరల చూపునొసంగి ఉన్నవానిని ఉన్నట్లు ఎరుంగ చేయుటకు సూర్యుని వలె ఈ పురాణము ఈ లోకమునకు వచ్చినది. ఈ విధంగా సూతుడు చెప్పుచుండగా దీర్ఘ సత్రమున పాల్గొని మునులలో వృద్ధుడు, కులపతి, ఋగ్వేదమును అధ్యయనము చేసినవాడు అగు శౌనకుడు ఇట్లు ప్రశ్నించెను. మహానుభావ సూత భగవత్ కథను మాకు చెప్పగలిగిన సామర్థ్యము గల నీవే చెప్పుము. ఆనాడు శుకుడు చెప్పగా నీవు ఆ పుణ్యముగు భాగవత కథను వింటివి కదా. ఈ భాగవతము ఏ యుగమున ఎచ్చట ఏ కారణముచే చెప్పబడినది? ఎవరు దీనిని చెప్పినారు? బాదరాయణ మహర్షి ఎవరిచే ప్రేరణ చేయబడి ఈ భాగవతమును అను సంహితను రచించినాడు? ఈ వ్యాసమహర్షి కుమారుడు యోగులలో శ్రేష్టుడు. దేవ మనుష్యాది శరీరముచే భేదమున్నను ఆత్మలన్నియు ఏకాకారములని దర్శించినవాడు. అంతట వ్యాపించిన పరమాత్మను సత్య జ్ఞానానందాది గుణములు గలవానిగా దర్శించువాడు. దేహమునకు చెందిన భేదములను బట్టి వేరువేరని తలంపనివాడు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఏదియు లేదని నిశ్చితమైన బుద్ధి గలవాడు. సర్వదా ఆత్మ స్వరూపమును దర్శించువాడు. తన మహాత్మ్యమును పైకి ప్రదర్శించనివాడు. ఏమియు ఎరుగని వాని వలె కనపట్టును. ఒకనాడు దేవతా స్త్రీలు దిగంబరులై నీటిలో వివరించుచు ఆ ప్రక్కగా వెళ్ళుచున్న శుకుని చూచి వస్త్రములను తాల్చక
అట్లే ఉండియు వాని తండ్రియగు వ్యాసుడు వెనక ఉండి వచ్చుతుండగా చూచి సిగ్గుతో వస్త్రములను దాల్చినారట. వారిని వ్యాసుడు ప్రశ్నించినట యువకుడగు క్షుకుని చూచి సిగ్గుపడని మీరు వృద్ధుడగు నన్ను చూచి ఎలా సిగ్గుపడిరి అని. వారు అతనికి స్త్రీ పుం భేదము తెలియదు. నీకు భేదము తెలియును. అందుకే వస్త్రములను దాల్చితిమి అని సమాధానం చెప్పిరట. అట్లు భేద జ్ఞానము లేక సర్వము భవతాత్మకముగా చూచు శుకుడు పిచ్చి వాని వలె మూఢుని వలె లోకమంతటా సంచరించుచు హస్తినాపురమునకు ఎట్లు వచ్చెను? ఆ సంవాదమే ఈ సాత్వత సంహితగా శృతి రూపమై భాగవతముగా సాగినది కదా. మహాయోగియగు శుకుడు గృహస్తుల ఇళ్లలో ఆవు పాలు పిండు కాలమంత కాలము కూడా నిరీక్షిస్తూ నిలబడడు కదా. మరి అతడు ఆ పరీక్షిత్తు ఆశ్రమమునకు ఎట్లు చేరెను? అచ్చట ఎట్లు అంతకాలం ఉండగలిగెను? అతని వునికిచే ఆశ్రమం పవిత్రమైనది కదా? అభిమన్యు కుమారుడవు పరీక్షిత్తు మహా భాగవతోత్తముడు కదా అతని జన్మము అతడు చేసిన కర్మములు ఆశ్చర్యకరములందురు వాటిని మాకు వినిపింపుము. పాండు వంశపు రాజుల యొక్క గొప్పతనమును విస్తరింపచేసిన పరీక్షిత్ అనేడి సామ్రాట్టు ఏ కారణముచే గంగా తీరమున రాజ్య భోగములను విడిచి ప్రాయోపవేశం వనర్చినాడు? శత్రువులు తాము క్షేమముగా ఉండవలెనని ధనములను తెచ్చి ఏ పరీక్షిత్తు పాదపీఠముల వద్ద ఉంచి నమస్కరించుందురో అట్టి చక్రవర్తి అయిన పరీక్షిత్తు యవ్వనమందుండియు రాజ్యమును వదిలి ప్రాణములను వీడుటకు సంసిద్ధుడై ఏల ప్రాయోపవేశమున అర్చినాడు. మహాపురుషులైన భాగవతులు తమ శరీర పోషణకై తాము జీవించరు. లోక క్షేమమునకు, లోక కళ్యాణమునకు జీవించి యుందురు. అట్లు లోకులకు ఉపకారముకు తమ శరీరము విడవవలెనని కోరిక పరీక్షితునకు ఏల కలిగెను.
మేము అడిగిన విషయము ఇంకను మరికొన్ని విషయములు మీరు ఎరుగినవి మాకు తెలియజేయము. మీరు వేదములకు అధికరింపకపోయినను వేద సారములను ప్రతిపాదించు. పురాణములన్నింటినీ ఎరింగిన వారు కావున మాకు మీరు ఎరింగిన విషయమంతటినీ తెలియజేయమని ప్రార్థించుచున్నాము. దీని తరువాత సూతుడు శౌనకాదులకు ఏమని సమాధానం ఇచ్చారో మరో ఎపిసోడ్లో ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations, salutations to the Supreme Being. May the power that is contained in the place of creation, the destruction, the play of the three forms, and the destruction of the self, be attained by those who are born. The infinite glory For the sake of Leela, gradually, the Rajas, One who accepts the qualities of goodness and darkness, the illusionary power, as his support, one who is the indwelling being in all beings, one who has a form that is not visible to the senses, salutations to Srihari, who is the embodiment of consciousness beyond nature. Second Canto Fourth Chapter 12th Prayer. Oh, devotees of God, we have now learned the secret of the incarnation of God. Srimad Bhagavata Tattvadipika. Welcome to the 10th podcast episode of Prathama Skandam. Those who have innocently and continuously meditated on the secret of the divine incarnation that has been said so far, with the love of the Lord, will be able to understand. Oh, sages, you are venerable and blessed. Those who knew that Vasudeva, the lord of the entire world, had the universe as his body. Therefore, you have sorrows related to pregnancy, birth, old age, and death There will be no more family. In response to the questions you asked, the Bhagavata Purana was composed by the divine Badarayana. It is as good as Veda. The best verse, the story of the Lord, is presented here. Bhagavatam is the best thing for the world. Giving knowledge makes humans accomplished. Will bring endless good luck. This Purana was taught by the sage Badarayana to his son, Shuka. In the Vedas and epics, the most essential subjects are described here. The Shakya Yogi told Parikshit Maharaj. This Bhagavatam was narrated to Parikshit, who was surrounded by sages on the banks of the Ganges, and who was observing the vow of non-violence. He who has reached the other.
By the grace of Shuki, I was able to understand this Purana. I will speak to you as much as I can, following my intellect and as far as I have understood. Oh Lord Krishna, with your knowledge of dharma, you left this world and returned to your abode. The knowledge that can make the existing things appear as if they exist has gone to the people. From that day, the Kali Yuga was formed. To make the ignorant people understand that the one who is there again, like the sun, this Purana has come to this world to make them understand. While thus saying, Shaunaka, who was an elder among the sages, who had participated in the long assembly and studied the Rigveda, thus questioned. Oh great one, you are the one who has the ability to tell us the story of the divine son. Tell us. That day, as Sukudu said, you heard that virtuous story of Bhagavata, didn't you? In which era, where, and for what reason was this Bhagavata told? Who said that? By whom was the Bhagavata composed and the Anu Samhita inspired? This essay Maharshi's son is the best among the yogis. Deva He who saw that all souls are one, even though they are different in body and soul. He who sees the Supreme Being, who is pervaded, as one with qualities like truth, knowledge, bliss, and so on. One who does not think that there are different kinds of bodies. One who has a firm intellect does not believe that anything exists other than the Brahman as the Self. The one who always beholds the Self. He who does not show his greatness. He pretends to be someone he knows nothing about. Once upon a time, the goddesses, naked, were describing themselves in the water. Seeing Shuka, who was walking beside them, they did not wear clothes
Similarly, seeing his father Vyasa standing behind him and coming, he was ashamed and wore his clothes. Vyasudu asked them, "You, who are young, do not be ashamed to see the shaved one, but how are you ashamed to see me, who am old?" They did not know the difference between a male and a female. You know the difference. Therefore, they replied that they had worn clothes. Thus, without the knowledge of difference, seeing everything as being full of existence, how did Sukha, like a madman, like a fool, wandering all over the world, come to Hastinapura? That conversation itself became the Shruti form, the Bhagavata, as it continued, didn't it? The great yogi Shuka does not stand in the houses of householders waiting for the time when cow's milk is milked, right? Then how did he reach the Parikshitta ashram? How could he stay there for so long? Isn't his ashram sacred because of his devotion? Abhimanyu is the son of Parikshit, the great devotee of Bhagavan, isn't he? His birth and the deeds he performed are astonishing. Please tell us about them. The greatness of the Pandya dynasty kings The king, Parikshit, who had expanded, for what reason did he abandon his kingdom and pleasures on the banks of the Ganges and fast unto death? The enemies, wishing to be safe, bring wealth and place it at the feet of which Parikshitu, such an emperor, while still young, is ready to leave the kingdom and give up his life, why He performed the Pratyahara. The great Bhagavatas do not live for their own bodily nourishment. They live for the good of the world, for the welfare of the world. Thus, the desire to give up their bodies for the benefit of the people arose in Parikshit.
We asked about this matter, and you still haven't revealed a few more things that we need to know. Even if you do not surpass the Vedas, propose the essence of the Vedas. Since you are the one who knows all the Puranas, we pray that you reveal to us all the things you have known. After this, let's find out in another episode, in this podcast, what Suta gave as an answer to Shaunaka and others. Jai Srimannarayana. Salutations to the Asmadgurus