శృంగి ముని తీవ్ర శాపము - ఏడు రోజులలో మరణ శిక్ష

The Severe Curse of Sringi — Death in Seven Days

bhagavatam

శ్రీమద్భాగవతంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, బాల మహర్షి శృంగి తన తండ్రి శమీక మహర్షిని అవమానించిన పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజులలో తక్షక సర్పదంష్ట్రచే మరణిస్తావని తీవ్రమైన శాపమిచ్చిన సంఘటనను వివరిస్తాం. పరీక్షిత్ మహారాజు అజాగ్రత్తగా సమాధిలో నున్న శమీకుని మెడలో మృత సర్పమును వేసినందుకు కోపోద్రిక్తుడైన శృంగి ఈ శాపమిచ్చాడు. శాపవార్త విన్న పరీక్షిత్ మహారాజు విచారపడక, రాజ్యమును త్యజించి గంగాతీరమున శుకమహర్షి నోట భగవత్కథలు వినుటకు సంసిద్ధుడయ్యాడు. మహారాజు చివరి ఏడు రోజులు శ్రీమద్భాగవతం వినటానికి కారణమైన ఈ శాపఘట్టం మోక్షమార్గంలో ఒక దివ్యమైన మలుపుగా భాసిల్లుతోంది.

In this sacred episode of Srimad Bhagavatham, we explore the powerful story of young sage Sringi, who in a fit of righteous anger curses King Parikshit to die from a serpent's bite within seven days. When King Parikshit unknowingly offended the meditating sage Shamika by placing a dead serpent around his neck, the sage's son Sringi could not bear the insult to his father and unleashed a devastating curse. Rather than lamenting his fate, the noble King Parikshit accepted the curse with remarkable equanimity, renounced his kingdom, and sat on the banks of the Ganges to attain liberation. This turning point sets the stage for the glorious narration of Srimad Bhagavatham, as the king's final seven days become a divine opportunity to hear the Lord's glories from Sage Shuka.

← Prev Next →
The Severe Curse of Sringi — Death in Seven Days bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనేస్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యస్చినత్యమిషాయ నమోస్తు తస్మై భగవదారాధనము మానవునకు హితకరమగు స్వధర్మము. దానిని భగవానుడే బోధించి ఉన్నాడు. కానీ ఏ మానవుడు దానియందు శ్రద్ధ లేని వాడై నిషిద్ధము కర్మలను ఆచరించును వానికి ఈ లోకములో జీవించాలనే ఆశను కాలం వెంటనే తేగొట్టుచుండును. కాలము చాలా బలీయమైనది. అట్టి కాలమే స్వరూపముగా గల భగవానునకు నమస్కారం. థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ 17th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 26వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితము ధర్మ దేవత భూమి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనం విన్నాం. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకుందాం. ఇట్లు ధర్మ దేవత, భూ దేవత మాట్లాడుకొనుచుండగా పరీక్షిత్ తోను రాజర్షి సరస్వతి తీరమున ప్రభాస తీర్థమున చేరెను. అచట సరస్వతి తీరమునందు ఒక శూద్రుడు రాజ లాంఛనములు గలవాడై ఒక గోవును వృషభమును దండముతో కొట్టుచుండగా పరీక్షిస్తు చూచెను. అందు వృషము తెల్లగా నున్నది. దండముతో కొట్టుచున్న దెబ్బలకు భయపడి మూత్రమును విడుచుండెను. క్లేశమునందుంచు వణికిపోవుచుండెను. ధర్మాచరణకు ఆవశ్యకమగు పాలు, నెయ్యి మొదలగు ద్రవ్యములను వసంగెడి గోవును ఆ రాజ లంఛనములతోనున్న ఒక హీనుడు తన్నగా కన్నీరు కార్చుచు దూడ లేక శోకించుచు కృషించినదై మేతకే తడమారుచున్నట్లు కనబట్టెను. పరీక్షిత్తు వృషభమునకు గోవునకు సమీపము నిలిచిన ఆ రాజలాంచ్యంతుడగు వానిని ఇటు ప్రశ్నించెను నీవు ఎవడవు?

బలము గలవాడివై దుర్బరుని హింసించుచున్నావు. వేషముచే రాజు వలె కనపడుచున్నావు. నీవు ఆచరించు కర్మ ధర్మరహితుడు చేయుచున్నట్లు కనపడుచున్నది. అర్జునునితో శ్రీకృష్ణుడు ఈ లోకము నుండి ఎగగాని హింసింపదగని వారిని హింసించి నీవు తప్పు పని చేయుచున్నావు. నిన్ను వధించుటయే కర్తవ్యం. ఓ వృషభమా నీవు తెల్లగా ఉన్నావు. మూడు పాదములు లేక ఒక పాదముతో సంచరించుచున్నావు. నీవు వృషభ రూపముతో ఉన్న దేవతా స్వరూపుడివి కావు కదా? కురువంశమందు జన్మించిన రాజులు పాలించుచున్న ఈ భూలోకములో నీవు తప్ప ఎవ్వరినూ శోకించు వారు లేరు. ఓ గోరూపధారిణి, నీవు శోకింపకుము. ఈ వృషళుని వలన నీ కలిన భయము తొలుగును. దుర్మార్గులను శాసించడి నేనుండగా నీవు శోకింప అవసరం లేదు. నీకు సుఖమే కలుగును. ఏ రాజు పరిపాలించుండగా ప్రజలు భయముతో బెదురుచుందురో అట్టి రాజు యొక్క కీర్తి, ఆయుర్దాయము, భాగ్యము, పుణ్యలోకములు క్షీణించును. రాజ్యమును పరిపాలించు పాలకుడు ఆర్తిని తొలగించుటయే తన కర్తవ్యముగా భావింపవలెను. మిమ్ములను ఇట్లు హింసించుచున్న ఆ పాలకుడిని నేను ఇప్పుడు చంపెదను. ఈతడు భూత ద్రోహం చేయుచున్నాడు, దుర్మార్గుడు. ఓ గోరూపధర, నీ పాదములను ముడింటిని ఎవరికి ఎవరు నరికినారు? ఓ వృషభమా, నీకు మంగళమవు గాక. ఎవరికి అపకారము చేయని నీ వంటి సాధువులను హింసించిన వారికి శిక్ష తప్పదు. నీకు అంగవైకల్యం కల్పించిన వారు ఎవరో చెప్పుము. తప్పులేని వారిని హింసించు వారిని శిక్షించుటయే నా కర్తవ్యం. అసత్పురుషులను శిక్షించుటచే సత్పురుషులకు క్షేమం కలుగును. ఈ ప్రాణులకు పాపము చేయని వారికి నిరంకుశముగా ద్రోహం చేయువాడు ఎవడో వాడు దేవజాతికి చెందినవాడు అయినను వాని భుజమును ఛేదించెదను. తమ తమ ధర్మములను ఆచరించు వారిని కాపారుటయే రాజునకు పరమ ధర్మం. ఆపద లేకుండా దుష్ప్రవర్తులను ఆచరించు వారిని శాసించుట పాపమును తొలగించును. అందుచే మిమ్ములను హింసించిన వారిని తప్పక శిక్షించెదను.

ఇట్లు పరీక్షిత్తుడు అడగగా ధర్మ దేవత వృషభ రూపం నిలిచి ఇట్లు చెబుచున్నది. పాండవ వంశమున పుట్టిన నీవు ఇట్టి మాటలను పలుకుట అన్ని విధములో తగియున్నది. నీ వారి గుణములకు పొంగి శ్రీకృష్ణుడు వారికి దౌత్యమును సారథ్యమును చేసినాడు. మాకు ఈ క్లేశములను కలిగించడంకు కారణం ఇవ్వడో తెలియదు. లోకులు వారు వీరిని వారు వీరని నా దుఃఖములకు కారణభూతులైన వారిని పరురకములుగా చెప్పుచున్నారు. కొందరు క్లేశము కలుగుటకు మేమే కారణమని అందురు, కొందరు దైవము కారణము అందురు. కొందరు స్వభావము కారణమందురు, కొందరు ప్రాచీన కర్మ కారణమందురు, కొందరు జీవాదృష్టమే కారణమందురు. ఇట్లు మాకు కలిగిన క్షేషములకు కారణము నిశ్చయముగా తెలియకున్నది. నీవే నీ సీక్ష్మ బుద్ధిచే విమర్శించి నిర్ణయించుకొనుము. ఇట్లు ధర్మదేవత మాట్లాడుచుండగా పరీక్షిత్తు ఆలోచించి తన అంతర్దృష్టితో కారణము నిశ్చయముగా తెలుసుకొనెను. ధర్మజ్ఞా, నీవు వృషభ రూపం ఉన్న ధర్మ దేవతవు. అందుచేతనే ఇంత ఆపదను పొందియు నీ ఆపదకు కారణమైన వాడు సన్నిహితుడు అయినను ఆపదకు కారణం ఎవరో తెలియదని పలక్కగలిగితివి. అధర్మమును ఆచరించు పురుషుడు ఎదురుగా ఉన్నను వీడు అధర్మము చేసినాడని నిర్దేశించుట పాప హేతువని నీవెరుంగుదు. కనుక నిర్దేశింపలేదు. అయినను దానికి కారణము ఈశ్వర సంకల్పము. అది మనస్సునకు మాటలకు అందనిది. నీవు ధర్మ దేవతవు. నీవు లోకములోని వృషభము వలె తపస్సు, శౌచము, దయ, సత్యము అనే నాలుగు పాదములతో కృతయుగములో సంచరించుంటివి. త్రేతాయుగములో మూడు పాదములతో ద్వాపర యుగములో రెండు పాదములు కలిగి నీవు సంచరించితివి. తపస్సు, శౌచము, దయ అని మూడు పాదములు కలియుగమున పోయినవి. తన్ను తాను గొప్పవాడిగా భావించుకొనుట అనేటి దోషముచే తపస్సు అనేటి పాదము పోయినది. అన్ని విషయములను మనసులో పట్టించుకొనుట అనేటి సంఘముచే శౌచము అనేటి పాదము పోయినది. జాతి చేత, ధనము చేత, విద్య చేత తాను గొప్పవాడనని అహంకారం వలన

దయ అనడి పాదము లేకుండా పోయెను. ఇట్లు మూడు పాదములు పోగా ఇప్పుడు ఒక్క సత్యమును పాదముతో ఈ కలియుగమున సంచరించున్నావు. ఈ కలియుగము కృష్ణావతారం సమాప్తము కాగానే భూమిని ఆక్రమించినది. అధర్మముచే అనృతము పెరుగుచున్నది. భగవానుడు ఈ భూమి బరువును తొలగించినాడు కానీ అతని అతడు వదిలి వెళ్ళగానే ఆ సాధువులగు ప్రభువులు పాలకుల వలె వేషం వేసుకొని పాలించుటకు సిద్ధపడుచున్నారు. అందుకై ఈ భూమి ఏడుచున్నది. ఆ భూమియే ఈ గోవు. నేనీ అధర్మమును అంతమొందించెదనని కలిని అధర్మమును అంతమొందింపవలెనని వాడియు ఖడ్గమును ధరించి పరీక్షిత్తు సన్నిధ్యుడాయను. వెంటనే పాలక వేషమునున్న కలి చంపుటకు సిద్ధముగానున్న పరీక్షిత్తు పాదములపై శిరస్సు మోపి రక్షింపమని ప్రార్థించెను. శరణు పొందిన వారిని రక్షించు స్వభావము గల పరీక్షిత్తు పాదములపై బడిన కలిని ఏమియు చేయజాలక మందహాసముతో ఇట్లనెను మేము అర్జునుని వంశంలో జన్మించిన వారము. అంజలి ఘటించి శరణన్న వారు రక్షించు స్వభావం కలవారము అందుచే నిన్ను చంపం. కానీ నీవు అధర్మమునకై తోడై నిలిచినావు. నీవు ఈ లోకమును పాలించు వారలలో ప్రవేశించినావు దానిచే అధర్మము లోకమును పాలించుచున్నది. రకరకముల అధర్మములు నీవిచే లోకమున ప్రదర్శింపబడుచున్నవి. లోభము, అసత్యము, చౌర్యము, మోసము, పాపము, దారిద్ర్యము, కలహము, వంచనము అనునవి లోకమున విస్తారముగా వర్ధిల్లుచున్నవి. ఇవి అన్నియు అధర్మముచే ప్రబోలుచున్నవి. ఈ దేశము బ్రహ్మావర్తం. ఇచట ధర్మము సత్యము సాగవలెను. ఇచట యజ్ఞము చేయు వైద్యుకులు యజ్ఞములచి యజ్ఞేశ్వరుడగు పరమపురుషుని ఆరాధింతురు. అందుచే నీవు ఇచట ఉండతగదు. శ్రీహరి యజ్ఞములచే ఆధారి ఆరాధింపబడి లోకులకు సుఖమును కలిగించును. కోరికలను ఈడేర్చును. స్థావరములకు జంగములకు ఆత్మగా ఉండి వెలుపల రక్షకుడుగా ఉండి కాపాడును. కావున నీవే దేశం వదిలి వెళ్ళవలెనని. చేతితో కత్తి పట్టుకొని శిక్షించడం సిద్ధముగా ఉన్న పరీక్షిత్తును చూచి దండపాణియగు యముని చూచి భయపడినట్లుగా వానికి భయపడి కలి ఇట్లు పలికెను. హే సార్వభౌమా నీవు ఎచట ఉండుమని ఆజ్ఞాపించినా అచటనే ఉండెదను. నాకు ఉండుటకు ఏదో ఒక స్థలమును నిర్దేశింపుము. నేను నీకు భయపడుచు నీ శాసనమును పాలించుచు నీవు ఉండమన్న చోటనే ఉండెదను అని కలి చెప్పగా పరీక్షిత్తు అతడు ఉండుటకు నాలుగు స్థలములను నిర్దేశించెను. జూదపు శాలలు.

పానశాలలు, స్వేచ్ఛా సంచారిణులు గల స్త్రీలు ఉండేటి చోటు, ప్రాణులను హింసించి జీవించేటి స్థానములు అన్నవి నాలుగు నీకు నివాస స్థానములే ఉండు కాక. అని చెప్పిన విని కలి మరియొక స్థానమును కూడా వసంగమని కోరెను. అప్పుడు పరీక్షిత్తు బంగారం అధికముగా ఉండి దానిచే అనృతము, మదము, కామము, రోషము, వైరము కలిగే చోటు కూడా నీకు ఐదవ స్థానము కాగలదని చెప్పెను. ఈ ఐదు స్థానములయందు కలియుండును. అచట అధర్మము పెరుగుచుండును. పరీక్షిత్ ఇచ్చిన ఈ స్థానములు అభ్యుదయమును కోరిన మానవుడు సేవింపరాదు. ధర్మశీలుడై లోకములను పాలించెడి రాజు వీనిని తప్పక విడిచి ఉండవలెను. అప్పుడు పరీక్షిత్తు వృషభ రూపమునున్న ధర్మమునకు పోయి పోయిన మూడు పాదములను అనగా తప, శౌచ, దయలను తిరిగి సమకూర్చెను. భూమిని గోరూపమునున్న దానిని ఓదార్చి పెంపొందించెను. ఈ విధంగా ధర్మమును స్థాపించిన పరీక్షిత్తు తన తాతగారగు యుధిష్ఠిరుడు వసంగిన సింహాసనమును హస్తినాపురమున అధివసించి ఈ భూమండలను పరిపాలించుండును. అతడు రాజ్యమును పరిపాలించుండునుచే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఇటువంటి సత్రయాగము సాగుచున్నది. దీని తర్వాత జరిగిన కథా భాగాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The world is engrossed in actions, deluded by skill. You are the source of all actions. I am devoted to your worship. He who is strong, whose life is desired, may he live. Salutations to him. May the worship of the Lord be beneficial to mankind, the practice of one's own duty. It was God who taught him. But if any man is without diligence in it and performs forbidden deeds, the time will soon be taken away from him to live in this world. Time is money. Salutations to the Lord who is the embodiment of time. Third Canto Ninth Chapter 17th Prayer. Devotees of God, welcome to the first episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 26th podcast. We have heard the conversation that took place in the middle of the earth between the god of righteousness. Let's get back to the story. Thus, while the goddess of righteousness and the god of earth were conversing, Parikshit and the sage Saraswati reached the Prabhasa Tirtha on the banks of the river. There, on the banks of the Saraswati, a Shudra, adorned with royal finery, was beating a cow and a bull with a staff, and Parikshit saw. And Vrushamu White and smooth. Frightened by the blows of the rod, she was releasing urine. He was trembling with anguish. The king, with his luxurious gifts, appeared as if a cow that had given birth to milk, ghee, and other necessities for religious practice, was weeping and grieving without a calf, and appeared to be wandering around for fodder. Parikshit, who stood near the bull and the cow, asked the king, who was a luxurious one, who are you?

You who are strong are oppressing the weak. You look like a king. The karma you are practicing seems to be done by a non-righteous person. Srikrishna, with Arjuna, is not to be tortured by those who are not to be tortured from this world, you are doing wrong. It is better for you to kill me. Oh, Taurus, you are white. You are moving with three feet or one foot. You are not a divine being with the form of a bull, are you? In this world ruled by kings born in the Kuru dynasty, there is no one to mourn except you. Oh beautiful one, do not grieve. Because of this Vrushal, your fear will be removed. While I am here to rule the wicked, you need not grieve. You'll be inlove. When a king rules, the fame, longevity, fortune, and virtuous worlds of such a king diminish as the people fear and tremble. The ruler who governs the kingdom should consider it his duty to remove suffering. I will now kill the ruler who is torturing you. Eethudu bhuta He's treacherous, that ruffian. Oh, Gorupadhara, who cut off your feet and your hair? May it be auspicious for you, O bull! Those who harm saints like you, who do not harm anyone, will not escape punishment. Tell me who has disfigured you. It is my duty to punish those who do not do wrong. By punishing the wicked, the righteous will be protected. He who betrays these sinless creatures unjustly, even though he belongs to the tribe of God, I will tear off his shoulder. Protecting those who practice their respective religions is the supreme duty of the king. To govern those who practice evil without suffering, to remove sin. Therefore, I will surely punish those who have tortured you.

Thus, when Parikshit asked, the goddess of righteousness, assuming the form of a bull, said thus. You, born in the Pandava dynasty, uttering such words is inappropriate in every way. Overjoyed by their virtues, Sri Krishna gave them diplomacy and charioteering. We don't know the reason for causing these sufferings. People are saying that they are the reason for my sorrows, they are the ones who are the cause of my sorrows. Some say that we are the reason for suffering, and some say that God is the reason. Some attribute the cause to nature, some to ancient karma, and some to the vision of life. Thus, the reason for the shortcomings we have experienced is not known for sure. You yourself, with your discerning intellect, criticize and decide. Thus, as the god of righteousness was speaking, Parikshit thought and with his inner insight, he certainly understood the reason. Dharmajna, you are the form of Dharma as Vrishabha. Therefore, having faced so much calamity, even though the one who caused your calamity is close, you were able to speak, saying that no one knows the cause of the calamity. Even if a man who practices unrighteousness is in front of you, you will not understand that it is a sin to declare that he has done unrighteousness. So, it was not specified. However, the reason for that is God's will. It's beyond words. You are the God of righteousness. You, like a bull in the world, wandered in Krita Yuga with four legs: penance, purity, compassion, and truth. In the Treta Yuga, you traveled with three legs, and in the Dvapara Yuga, you had two legs. Penance, purity, and compassion - these three steps have disappeared in the Kali Yuga. The penance was lost due to the fault of considering oneself great. Considering all matters in the mind is like losing the foot of the cleanliness that is called purity by the church. By caste, by wealth, by education, he is great, because of ego

The compassionate one has gone without a foot. Thus, having gone through three stages, now you are wandering in this Kali Yuga with only one truth. This Kali Yuga ended as soon as Krishna Avatar ended, and it occupied the earth. Unrighteousness and injustice are increasing. The Lord removed the weight of this earth, but as soon as he left, those saints, like lords and rulers, disguised themselves and are preparing to rule. Therefore, this earth is crying. The land is this cow. I will end this unrighteousness, and Parikshit, having taken up his sword, said that he would end the unrighteousness of Kali. Immediately, Parikshit, who was in the guise of a ruler, prayed to be protected by placing his head on the feet of the one who was ready to kill Kali. Parikshit, who has the nature of protecting those who seek refuge, could not do anything to the Kali that fell on his feet, and with a laugh, he said, we were born in the lineage of Arjuna. Those who have taken refuge in you, who have the nature of protecting those who have taken refuge in you, therefore I will not kill you. But you persist in your impious conduct. You are among those who rule this world You have entered, by which injustice is ruling the world. Various kinds of unrighteousness are being displayed in the world by you. Greed, falsehood, covetousness, deceit, sin, poverty, strife, and deception are flourishing extensively in the world. All these are being promoted due to injustice. The country is Brahmavarta. Here, dharma and truth must proceed. Here, the physicians who perform sacrifices worship the Supreme Being, the Lord of sacrifices. That's why you shouldn't be here. Srihari, through yagnas (sacrifices), is worshipped and brings happiness to the people. It's what it stands for. Being the soul of the station and the station, being the protector outside, He protects. Therefore, you should leave the country. Seeing Parikshit, who was ready to punish him by holding a sword in his hand, and seeing the one who was the punisher, Yama, Kali spoke thus, fearing him. Oh sovereign, wherever you command me to be, I will be. Please give me a place to stay. I am afraid of you, I will obey your command, and I will stay where you tell me to When Kali told, Parikshitu, he designated four places for him to stay. The gambling dens.

Bathhouses, places where women with free movement live, places where they live by torturing animals, those four should not be your dwelling places. Having heard this, Kali also desired to reside in another place. Then Parikshit said that if gold is abundant, then you will also have a place in the fifth position where there is untruth, arrogance, lust, anger, and enmity. It will be in these five places. There, injustice increases. The positions given by Parikshit are not to be served by a human who desires progress. A righteous king who rules the world must surely be released. Then Parikshit, having gone to Dharma in the form of a bull, gathered back the three steps that had been lost, namely penance, purity, and compassion. He comforted and nurtured the one who was like a bear. Thus, Parikshit, who established Dharma, will reside in Hastinapura, occupying the throne of his grandfather, Yudhishthira, and rule this earth. He is ruling the kingdom, therefore, even in this Kali Yuga, such a Satra Yagam It is ongoing. Let's find out the next part of the story in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.