ధృతరాష్ట్ర విదుర సంభాషణ - విదురాగమన వైభవము

Return of Vidura & Dispassionate Counsel to Dhritarashtra

bhagavatam

దీర్ఘకాలం తీర్థయాత్రలు చేసిన తరువాత మహాత్ముడైన విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి, దుఃఖితుడైన ధృతరాష్ట్రునిచే ఆదరంగా స్వాగతించబడతాడు. పుత్రశోకంలో మునిగి పాండవుల ఆశ్రయంపై ఆధారపడుతున్న ధృతరాష్ట్రుని స్థితిని గమనించిన విదురుడు, వైరాగ్యంతో కూడిన గంభీరమైన హితోపదేశం చేస్తాడు. నిజమైన హితైషిగా విదురుడు, కాలం మించిపోకముందే సర్వాసక్తులను వదిలి భగవంతునిపై మనసు నిలపమని ధృతరాష్ట్రుని హృదయపూర్వకంగా హెచ్చరిస్తాడు.

After years of tirtha yatra, the great sage Vidura returns to Hastinapura and is welcomed with deep reverence by the grieving Dhritarashtra. Recognizing the blind king's attachment to his lost sons and his dependence on the charity of the Pandavas, Vidura offers him sharp and compassionate counsel rooted in detachment and self-knowledge. With the wisdom of a true well-wisher, Vidura urges Dhritarashtra to renounce his lingering desires and turn his heart toward the Supreme Lord before time runs out.

← Prev Next →
Return of Vidura & Dispassionate Counsel to Dhritarashtra bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యస్యావతార కర్మాణి గాయంతిహ్యస్మదాదయః నయం విందంతి తత్వేనా తస్మై భగవతే నమః మన వంటి వారలము ఆ శ్రీహరి తన అవతారములలో ప్రకటించిన లీలలను గానము చేయుచున్నాము. కానీ ఆయన యొక్క యధార్ధ స్వరూపము మనకు అంతు పట్టుట లేదు. అట్టి భగవానునకు నమస్కారము. సెకండ్ క్యాంటో సిక్స్త్ చాప్టర్ 38 ప్రేయర్. భవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. ప్రథమ స్కంధం 20వ పాడ్కాస్ట్ లో స్వాగతం. మనం ఇంతవరకు శ్రీకృష్ణుడు ద్వారకకు చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా వారిని ఎదుర్కొన్నారు. విషయాన్ని తెలుసుకుంటున్నాం. ముందు భాగాన్ని ఇంకా తెలుసుకుందాం. ప్రజలు మొదలుకొని తక్కువ వారి వరకు అందరును వారి వారికి తగినట్లు వినయంతో నమస్కరించియు కౌగలించుకొనియు తన చేతులతో వారిని స్పృశించియు చిరునవ్వుతో చూపులతో దూరము నుండి పలకరించియు ఆనందింపచేసెను. గురువులు, బ్రాహ్మణులు, వృద్ధులు వారి వారి భార్యలతో కూడా దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి. ఇట్లందరూ ఆనందించి ఎదుర్కొనుచుండగా భగవానుడు ద్వారకలో ప్రవేశించెను. శ్రీకృష్ణుడు ద్వారకలో రాజమార్గమున పయనించుండగా చూచి ఆనందించవలెనని కోరికతో గృహిణులందరూ మెడలనెక్కి ఆనందించుండ్రి. ద్వారకలో ఉన్నవారు భగవానుని నిత్యము చూచుచున్నను ఆ స్వామి సందర్శనముచే తృప్తిని పొందకుండిరి. భగవానుని శరీరము లక్ష్మీదేవికి నివాసస్థానము కదా. ఆ భగవానుని వక్షస్థలమే లక్ష్మికి నివాసస్థానము. ఆ స్వామి ముఖము చూచెడి వారి నేత్రములకు పానపాత్రము. వారు ఆనంద రసమును ఆ ముఖము నుండి త్రాగి ఆస్వాదించి ఆనందించుండిరి. ఆ భగవానుని బాహువులు దిక్పాలకులు వీర్రసమును పానము చేయుటకు పాత్రలే ఉపకరించును. సారమును గ్రహించెడి మునులు ఆనంద రసమును ఆ భగవాని పాదముల నుండి ఆస్వాదింతురు. తెల్లని గొడుగు, తెల్ల చామరములు స్వామికి శోభకు కూర్చుచు తోడ్పడుచున్నవి.

త్రోవలో పుష్ప వర్షము కురుయుచున్నది. స్వామి పీతాంబరమును దాల్చి వనమాలను వక్షమున ధరించి ప్రకాశించుచుండెను. నీల మేఘము సూర్యునితో, చంద్రునితో, ఇంద్రధనస్సుతో మెరుపులతో కూడి వచ్చుచున్నది అనునట్లుండెను ఆ సన్నివేశము. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రుల ఇంటికి చేరెను. దేవకీ వసుదేవులకు నమస్కరించెను. తల్లులు అతనిని కౌగలించుకొనిరి. తల్లులు దేవకీ, రోహిణి మొదలగు వారు శ్రీకృష్ణుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆనందముచే హృదయము ద్రవించుండగా మనసు చలించుండగా తమ కంఠ స్రవించుచున్న నీటితో అభిషేకించిరి. తరువాత శ్రీకృష్ణుడు తన భవనమునకు చేరెను. అచట లోకములో కోరదగిన పదార్థములన్నీ ఉండెను. దానికంటే గొప్ప భవనం వేరొకటి ఏదీ ఉండదు. 16000 భార్యల అంతఃపురములు అందేగలవు. తమ పతిదేవుని చూడగానే ఆ భార్యలందరూ మనసు మహోత్సాహంతో నిండగా ఒకసారి తమ తమ ఆసనం నుండి లేచి సిగ్గుతో పలుకలేక మనసుతోనే స్వాగతం పలికిరి. చాలా కాలం దూరముగా ఉన్న శ్రీకృష్ణుడు చూడగానే ఆ భార్యలందరుకు కౌగలించుకొనవలెనని అనిపించినను తమ మర్యాదకు తగదని తమ బిడ్డలను కౌగలించుకొని తమ చూపులతో తమ మనస్సులతో స్వామిని కౌగలించుకొని తమ ఆనందమును అభివ్యక్తము చేసిరి. ఆనందముచే కన్నీరు వెడలుట ఇతరులను ఇతరులు చూసిన బాగుండదని వారు సిగ్గుపడి ఆపుకొన్నను ఆగ కన్నీరు స్రవించెను. ఆ భగవానుడు తమ పక్కనే ఉన్నవాడు రహస్యమున తమతో కూడి ఉన్నవాడేనను వాని పాదములు వారికి ఎప్పటికప్పుడే కొత్త కొత్త ఆనందమును కలిగించుండెను. ఒకరి దగ్గర స్థిరముగా ఉండుటకు అలవాటు లేక చంచలముగు లక్ష్మి కూడా అతని వక్షమునని నిత్యవాసము చేయుచుండగా యవతెవాని పాదములను వదలి దూరంగా ఉండగలదు. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు అసుర భావములతో లోకమునకు అపకారులై భూమికి బరువైన జన్మలు గల రాజులందరును అంతమొందించుటకు వాయులో వారికి వైరమును కల్పించి గాలి అగ్నిహోతుని ప్రజలింపచేసినట్లు వారికి గల వైరమును పెంచి తాను ఆ యుద్ధమును చేపట్టకయే అక్షోహిణిల సైన్యమును ఒకరితో ఒకరు తలపడి చనిపోనట్లుగా చేసి తాను ఏమియు ఎరుంగని వాని వలె ప్రశాంతముగా ఉండెను. ఇట్టి విచిత్ర శక్తి సంపన్నుడు భగవానుడు తనదైన దివ్య సంకల్పముచే ఈ నరలోకమున తాను అవతరించి ప్రాకృత జనుని వలె స్థిర సముదాయంతో రమించుచు సంచరించుచుండెను.

ఆ స్త్రీలందరూ చాలా అందగత్తెలు. వారి ఉత్కంఠమగు అనురాగము చే నిండిన మందహాసమును, సిగ్గుతో కూడిన ఓరచూపులను చూచి మన్మధుడు పురుషులను ప్రేమింప చేయుటకు వారి విలాసములే చాలి ఉండగా. నా ధనస్సు ఏలా అని తన ధనస్సును పారవేచెనట. అట్టి అందగత్తెలకు, వనితలకు, వనితలు కూడా తమ సౌందర్యములచే, విలాసములచే ఆ భగవానుని మనసును కలత చెందించలేకపోయిరి. అట్టి జితేంద్రుడగు స్వామి ప్రాకృత జనుని రవలే రమించుచున్నాడు. అతడు సామాన్యుల దృష్టిలో స్త్రీలపై మోహము కలవాని వలె కనపడును. కానీ అతడు సంగమం సంగము లేనివాడు. తమ స్వభావమును బట్టి లోకులు అతనిని కామపరవశుడిగా భావింతురు. అట్లు మనుజుడుగా మనుజులలో సంచరించినాడు. ఇది భగవానుని స్వభావము. ఈ సర్వ జగత్తుకు మూలముగు ప్రకృతి అతనిచే వ్యాపింపబడియున్నది. కానీ ప్రకృతి యొక్క సత్వరజస్తమస్సులు అను గణువులచే జీవుడు అవిద్యను రాగద్వేషములను పొందుచున్నను అతడు తనకు అంటకుండా వానితో కూడి ఉండి వానిని నియమించుచుండును. లోకులందరూ తమ వంటి వాడే అని అజ్ఞానముచే భావించునట్లే స్త్రీలు అతనిని అనుభవించుచు రహస్యముగా అతని సంగమమును పొందుచు తమను అనుసరించు భగవానుని సామాన్య మానవుగా భావించుందురు. అతని మహిమ ఎంత సన్నిహితులకైనను తెలుసుకొనరానిది. ధర్మరాజు పట్టాభిషిక్తుడై కృష్ణుని పాదములనే ధ్యానించుచు సమస్త విషయముల నుండి మనసు విరమించిన వాడై రాజ్యపాలనము చేయుచుండెను. ముకుంద పాదములను సేవించు వారికి సంపదలు గాని, క్రతువులు గాని, లోకములు గాని, భార్య గాని, సోదరులు గాని, భూమండలము గాని, జంబూద్వీపాది ఆధిపత్యము గాని కోరదగినవిగా కనపడవు. ఆకలి గనవానికి అన్నమునందు తప్ప ఇతరమైన భోగమునందు ఎట్లు మనస్సు ప్రసరింపదో అట్లే ముకుంద పాద సేవనముని కాంక్షించు వారులకు ఇతరములు రుచింపవు. అశ్వత్థామ అస్త్రముచే గర్భము దహింపబడుచుండగా ఆ గర్భమునందున పరీక్షిత్తు ఒక పురుషుని దర్శించెను. అతడు అంగుష్ట మాత్ర పరిమాణము గలవాడై నిర్మలమగు దేహకాంతి కలవాడై బంగారు కిరీటము కుండలములు దాల్చినవాడై ఎర్రని నేత్రములు గలవాడై

గదా పాణి అయి గర్భములో తిరుగుచుండగా ఆ పరీక్షిత్తు చూచెను. ఆ అస్త్ర తేజస్సును గదను తిప్పుచు దూరముగా తొలగించుచున్న ఆ పురుషుని ఇతడు ఎవరు? అని గర్భగతుడుగా శిశువును పరీక్షించెను. అందుచేతనే ఆ శిశువునకు పరీక్షిత్తు అని పేరు వచ్చెను. ఈ విధంగా గర్భమునందు బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సు ఆ గర్భమునకు అంటకుండా పారద్రోలుచు భగవానుడు కాపాడెను. పదవ నెలలో గర్భస్థ శిశువునకు ఆ పురుషుడు కనబడకుండా అంతర్ధానమాయెను. తరువాత శుభగ్రహములు ఉచ్చస్థానముంద ఉండగా ప్రశస్తమగు అగ్నమందు పాండు మహారాజు వంశమును ధరించుటకు పాండురాజుతో సమానమైన తేజస్సు గల బాలుడు జన్మించెను. ధౌమ్యుడు కృపుడు మొదలగు బ్రాహ్మణులను పిలిచి ఆ బాలుని ఆశీర్వదింపచేసి ధర్మరాజు జాతకర్మ చేయించెను. వాని క్షేమమునకై యోగ్యులైన వారికి వారి కోరికలు అనుసరించి దానములను సంగెను. బ్రాహ్మణులకు పరిపుష్టమగు భోజనము కల్పించెను. బంగారమును, గోవులను, భూమిని, గుర్రములను యోగ్యైన వారికి దానము సంగెను. బ్రాహ్మణులందరూ సంతోషించిరి. వినయముతో వంగి నమస్కరించిన ధర్మరాజును చూచి ఆ బాలుడు గర్భమున భగవానునిచే రక్షింపబడినవాడు కనుక ఇతనికి విష్ణురాతుడని పేరు తగునని విష్ణురాతుడని నామకరణం చేసిరి. అతడు మహా భాగవతుడు అగునని వారు సెలవిచ్చిరి. తర్వాత భాగం తర్వాత తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. By whose incarnations these are sung by us, we sing of Him, and we sing of Him. Salutations to that Lord. We, like you, sing the Leelas (divine plays) that Sri Hari has declared in his incarnations. But we cannot fathom his true form. Salutations to that Lord. Second Canto Sixth Chapter 38 Prayer. Oh, my dear relatives, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 20th podcast episode of Prathama Skandham. Until now, after Sri Krishna reached Dwaraka, how did the people there confront him? We're learning about the issue. Let's learn more about the front part. From the people to the least, everyone, according to their needs, humbly greeted, embraced, touched them with their hands, and made them happy by speaking from a distance with a smile and eyes. The gurus, Brahmins, and elders, along with their respective wives, came close and blessed Sri Krishna. While everyone was rejoicing and facing it, the Lord in Dwaraka He entered. Seeing Sri Krishna traveling on the royal road in Dwaraka, all the housewives, with the desire to rejoice, put their necks around their necks and rejoiced. Those who were in Dwaraka, though they always saw the Lord, did not find satisfaction from the Lord's visit. The body of the Lord is the abode of Lakshmi, the goddess of wealth. The chest of the Lord is the abode of Lakshmi. That Swami's face is a mirror for their eyes. They drank the juice of joy from that face, enjoyed it, and rejoiced. The arms of that Lord, the guardians of the directions, are vessels that help in the drinking of virasam. The sages who have attained enlightenment, enjoy the blissful essence from the feet of that Lord. White umbrellas and white chameleons are aiding the Lord in his adornment.

A rain of flowers falls in the valley. The Swami, wearing a yellow garment and adorning himself with a garland of flowers, was shining. The blue cloud was coming with the sun, the moon, the rainbow, and with lightning, that scene was like that. Sri Krishna went to his parents' house. Saluting to Devaki and Vasudeva. The mothers gave him a hug. Mothers, Devaki, Rohini, and others, while placing Sri Krishna in their laps and their hearts melting with joy, and their minds restless, anointed him with the water that was flowing from their throats. Then, Lord Krishna went to his palace. There were all kinds of forbidden things in the world. No other building can be greater than that. 16000 palaces of wives can be found. As soon as they saw their husband, all those wives, with great enthusiasm, stood up from their seats and, unable to speak out of shyness, welcomed him with their hearts. As soon as they saw Sri Krishna, who had been far away for a long time, all the wives felt like embracing him. However, they felt that it was not appropriate to do so, so they embraced their children and With their eyes, with their hearts, they embraced the Lord and expressed their joy. Tears flowed from joy, and they were ashamed that others saw it and stopped it, but tears flowed without stopping. That God, the one who was next to them, secretly, the one who was with them, his feet always gave them new joy. Lakshmi, being fickle, can stay away from him, abandoning his feet and staying away, while he is constantly residing in his chest, which is accustomed to being stable with one person. In this way, Sri Krishna Bhagavan, with demonic emotions, became an enemy to the world, causing all the kings who had heavy births on earth to be destroyed, creating enmity between them in the air, and making the wind and fire the cause of their people He, without undertaking that war, made the army of Akshohini fight each other and die, and he remained calm as if he knew nothing. Such a wondrously powerful God, by his own divine will, incarnated in this world of humans and became stable like a natural person He was enjoying himself, wandering around with the community.

The women were all beautiful. Seeing their anxious, filled with affection, smile, and shy glances, Manmadha, to make men love, while their luxuries are enough. He threw his bow because my bow is like this. Such beautiful women and ladies, even the ladies could not disturb the mind of that God with their beauty and luxury. Such a Jitendra, the Lord, is captivating the natural people. He appears to the common people like a man who is fascinated by women. But he is a bachelor. People, according to their nature, consider him lustful. Thus, he wandered among men as a human. This is the nature of God. The nature that is the root of this entire universe is pervaded by him. But by the sages called the elements of nature, the being, though acquiring ignorance and attachment, without being attached to himself, remains united with him and appoints him. Just as all people think that he is like them, due to ignorance, women experience him secretly, his They consider the Lord who is following them, as an ordinary human being, while attaining union. His glory is so close that even close friends cannot know it. Dharmaraju, having been crowned, meditated on Krishna's feet, and having relinquished his mind from all matters, was ruling the kingdom. Those who serve the lotus feet will not be able to obtain wealth, rituals, worlds, wives, brothers, the earth, or the dominion of Jambudvipa. Just as the mind does not wander in other pleasures except in food for the sake of hunger, similarly, other things are not pleasing to those who desire the service of Mukunda's feet. Ashwatthama, while the womb was being burned by the arrow, Parikshit saw a man in that womb. He was the size of an inch, with a pure body radiance, wearing a golden crown and earrings, with red eyes

While he was wandering in the womb as Gada Pani, that Parikshit saw. Who is this man who is removing the light of the weapon and the mace from a distance? And the midwife checked the baby. Therefore, that baby was named Parikshit. In this way, the radiance of the Brahmastra did not touch the womb, and the Lord protected it by driving it away. In the tenth month, that man disappeared from the womb of the fetus without being seen. After that, while the auspicious planets were in an exalted position, a boy with the same radiance as Pandu Raja was born to Pandu Raja to inherit the lineage of Pandu Maharaja. Dhaumya, Krupa, and other Brahmins were called, and Dharmaraja blessed the boy and performed the Jatakarma ceremony. He gave donations to those who were worthy of his well-being, according to their wishes. The Brahmins were provided with a sumptuous meal. Gold, cows, land, and horses were given as gifts to the worthy. All the Brahmins were happy. Seeing Dharmaraju bowing humbly, that boy in his womb Because he was protected by God, he was named Vishnurathu, as it was appropriate, and they named him Vishnurathu. They said that he is a great devotee. We will learn about the next part later. Smadgurubhyo Namah Jai Shrimannarayana.