పరీక్షిత్తు జననము & కలిపురుష నిగ్రహము (Parts 19-23)
Birth of Parikshit & Subduing Kali (Parts 19-23)
ఈ ఎపిసోడ్లో, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి శ్రీకృష్ణ భగవానుడు గర్భంలోనే రక్షించిన పరీక్షిత్తు మహారాజు యొక్క అద్భుతమైన జననాన్ని వివరిస్తున్నాము. అశ్వత్థాముని పాపానికి శిక్షగా ధర్మరాజు అతని మణిని తీసుకున్న కరుణాపూర్వక ఘట్టాన్ని కూడా తెలుసుకుంటాము. తదనంతరం, కలియుగ ప్రారంభంలో పరీక్షిత్తు మహారాజు తన రాజ్యపర్యటనలో కలిపురుషుని సంధించి, అతనిని నిర్మూలించకుండా నియంత్రణతో నిర్దిష్ట స్థానాలలో ఉండనిచ్చిన ఘటనను అర్థం చేసుకుంటాము. ఈ పవిత్ర కథలు భగవంతుని శరణాగత రక్షణను మరియు ధర్మపాలనలో రాజుకు ఉండే బాధ్యతను మనకు స్పష్టంగా తెలియజేస్తాయి.
In this episode of our Srimad Bhagavatham podcast series, we explore the miraculous birth of Parikshit Maharaj, who was protected in the womb by Lord Sri Krishna from the Brahmastra unleashed by Ashwatthama. We then witness the compassionate yet firm encounter between the righteous King Yudhishthira and the cursed soul Ashwatthama, whose gem is taken as punishment for his grievous act. The episode also covers the triumphant arrival of Kali Yuga and how the noble King Parikshit, on his royal tour, confronted and subdued the sinful Kali Purusha, granting him restricted refuge rather than total destruction. These sacred narratives remind us of the Lord's unfailing protection of His devotees and the eternal responsibility of a dharmic ruler to uphold righteousness.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నతోస్మ్యహంతచ్చరణం సమీయుషాం భవచ్ఛిదం స్వశ్చయనం సుమంగలం యో హ్యాత్మా మాయా విభవం స్మ మర్యగాత్ యథానభస్వాంతమథా పరే కుతః శ్రీహరి యొక్క పాదములు శరణు జొచ్చిన వారి సంసారమును తొలగించి కళ్యాణములను ఇచ్చి పుణ్యమును కలిగించును. అట్టి పాదములకు నేను నమస్కరించుచున్నాను. ఆకాశమునకు తన అంతము తెలియదు. అదే విధముగా ఆ శ్రీహరికి కూడా తెలియనంతటి విస్తారమైన మాయకు కలదు. ఇట్టి స్థితిలో ఇతరులు ఆ మాయ యొక్క అంతమును తెలియలేరని వేరుగా చెప్పవలెనా? సెకండ్ క్యాంటో సిక్స్త్ చాప్టర్ 36th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 19వ ఎపిసోడ్లో స్వాగతం. ఇంతక్రితం ఎపిసోడ్లో పాడ్కాస్ట్లో శ్రీకృష్ణుడు బయలుదేరుతున్నప్పుడు అందరూ కూడా తనని సాగనంపుతున్నప్పుడు ఆ పురంలో ఉన్న స్త్రీలు ఏమని మాట్లాడుకుంటున్నారో మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఈ భాగంలో చదువుకుందాం. ఆ పురస్థులు అందరూ వినునట్లుగా అన్యోన్యంగా ఇట్లు మాట్లాడుకొనుచున్నారు. ఈతడు ప్రళయ సమయములో సత్వాది గుణములలో కదలిక లేక కర్మలన్నియు తమ తమ ఫలమును వసంగకుండా నిద్రించినవై ఉండగా చేతనా చేతనము రెండును సూక్ష్మ రూపమున తనలో లీనమై తనకు శరీరం వలె నియమింపదగినవై ఉండగా ఈ సమస్త జగత్తునకు ముందుండెడి ఒకే ఒక కారణం ఈతడే. ఈతడే అద్వితుడై యుండి తన సంకల్పముచే ప్రకృతిని సృష్టికి అభిముఖమగునట్లు చేసెను. దానిలో తాను అంతరాత్మగా ప్రవేశించి దానికి నామరూపములు కల్పించెను.
అతడే వేదములను ప్రవర్తింపజేసెను. ఇంద్రియములను జయించి నిర్మలమగు మనసుతో ధ్యానించు వారులకు అంతఃకరణము పరిశుద్ధి ఉనర్చువాడు ఈతడే. ఇతని కథలు వేదములలో వేదాంతములలో కీర్తింపబడునవి. తాను ఒక్కడే ఈ జగత్తునంతా తన లీల కొరకు సృష్టించువాడు, రక్షించువాడు, సంహరించువాడు. ఆ జగత్తులో వ్యాపించి నియమించువాడును దాని దోషములు అంటనివాడును ఈ శ్రీకృష్ణుడే. తమోగుణము అధికమై రాజులు అధర్మపరులై జీవించునాడు దుష్టులను శిక్షించి సాధులను రక్షించుట కొరకు శుద్ధ సత్వమయమగు రూపములను ఇతడే స్వీకరించును. ఇతడు ఐశ్వర్యము కలవాడు, సత్య రుత యశస్సులు కలవాడు. ఇతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. మధురాపురిలో కొంత కాలం ఉండి ద్వారకకు చేరి ప్రజలను పాలించుచు అష్ట మహిషులతో దేవతలతో ఆనందించుచు ఆనందింపజేయుచున్నాడు. ఈతనిని పొందిన ఆ స్త్రీల భాగ్యమే భాగ్యం. ఈతడు అవతరించిన యదువంశము మిక్కిలి పుణ్యవంతమైనది. సాక్షాత్ లక్ష్మీపతి అయిన భగవానుడు యదువంశున జన్మించి తన సంచారముచే మధుర వనమును పవిత్ర మునరించినాడు. ఈ లోకమునకే అతని జన్మ కీర్తి కలిగించునది. పరిపూర్ణమైన అనుగ్రహముచే ద్వారకలో వేయించేసి ఉండి అచటి వారికి తన దర్శనం వసంగినాడు. ఈతని పాణిగ్రహణమందిన పడతురు వెనకటి జన్మలో ఏమి వ్రతములు, నోములు, హోమములు చేసి భగవానిని ఆరాధించి ఉందురో ఈ జన్మలో స్వామి ప్రియురాండ్రై అధరామృతమును చవిచూచెడి భాగ్యములు పొందినారు. ఆ బ్రేపల్ల యందలి గోపికలు ఎంత ధన్యమైన జీవితము కలవారలో మదించిన శిశుపాలుడు మొదలగు వారిని మట్టుపెట్టి తన వీర్యమే శుల్కముగా స్వయంవరములో రుక్మిణిని, జాంబవతిని, సత్యభామను ఇంకను ఎందరును అనుగ్రహించినాడు. వారి యందు ప్రద్యుమ్న సాంబాది కుమారులను కలిగినాడు. ఆ పట్టపురాణులు ఎంత ధన్యులో. నరకాసురుని వధించి 16 వేల మందిని చేపట్టి వారికి ధన్యతను కల్పించిన మహాపురుషుడు ఇతడు. ఈ పుండరీకాక్షుడు ఆ స్త్రీల ఇళ్లలో వసించుచు వారిని ప్రీతితో పేరు పెట్టి పిలుచుచు మనోహరమగు మాటలతో అలరించుచు ఆనందింప చేయుచున్నాడు. ఓహో వారి జన్మ ఎంత ధన్యమైనది అని ఇట్లు పురస్త్రీలు తనను గూర్చి మాట్లాడుకొనుచుండగా
మందహాసముతో వారిని అభినందించుచు ద్వారకకు బయలుదేరెను. ధర్మరాజు మార్గమధ్యమున శత్రువులు భగవానిని బాధింతురేమో అని శంకతో చతురంగ బలమును అతని వెంట రక్షణకు నియోగించెను. తన వెంట నడుచుచు చాలా దూరం వచ్చిన ధర్మరాజాదులను ప్రేమపూర్ణముగా వాక్యములతో శాంతింపచేసి వెనకకు మరలింపచేసి తాను ద్వారకకు ప్రయాణమాయెను. కూరు, జాంగల, పాంచాలాది దేశములను, మత్స్య, సమీరాది దేశములను గడచి ద్వారకకు దగ్గరగా ఉన్న ఆనర్త దేశమునకు స్వామి చేరుసరికి గుర్రములు బడిలినవి. ఆ దేశమునందలి జనము శిరస్సుపై పూజా సామగ్రిని పెట్టుకొని ఎదురు వచ్చిరి. స్వామి ఆ అనర్త దేశమునకు చేరి దాని దగ్గరగా ఉండు తమ దేశమును చేరుటకు ముందు తాను వచ్చుచున్నానని తెలిసి దుఃఖము తొలగి ప్రజలందరూ ఆనందింపవలెనని ముందుగా శంఖమును పూరించెను. ఎర్రని శ్రీకృష్ణ భగవానుని హస్తములో తెల్లని శంఖము ధరింపబడినది. స్వామి అధరం యొక్క ఎర్రదనము దానిపై ప్రసరించుచున్నది. అప్పుడు ఆ శంఖము ఎర్ర తామరల మధ్య కదలాడుచున్న హంస వలె ప్రకాశించెను. జగత్తులకు కలిగెడి భయమునకు భయమును కలిగించెడి. ఆ శంఖనాదము వినగని ద్వారక యందలి జనులందరు తమ ప్రభువును చూడవలెనని కోరికతో ఎదురేగిరి. తన ప్రకాశమునని తాను ప్రకాశించుచు లోకమునంతను ప్రకాశింపచేయు సూర్యునకు దీపము చూపినట్లు ఆనంద పరిపూర్ణుడై ఆనందప్రదుడై ఆనందమును కలిగించు. వికసించిన ముఖము గల భగవానునకు పూజా ద్రవ్యమును సమర్పించి ఆనందమును కలిగింప ప్రజలు సిద్ధపడిరి. పసిపిల్లలు తమపై ప్రేమ గల తండ్రి తమను రక్షించునకు వచ్చినాడు ఎట్లు ఆనందింతురో అట్లు ప్రజలందరూ మహానందము పొందిరి. వారు ఆనందముతో ఇట్లు పలుకుచున్నారు. నాథా, నీ పాదపద్మమును చేరి కోల్చెడి వారము మేము. బ్రహ్మాది దేవతలు, సనకాది మునులు నమస్కరించెడి పాదము నీది. ఈ లోకంలో క్షేమమును శాశ్వతమగు మోక్షమును కోరెడి వారికి క్షేమ సాధనము నీ పాదము. బ్రహ్మాది దేవతలను కూడా తన వంశమునందు
తన వశమునందు ఉంచుకొనుడి కాలము నీ విషయమున తన శక్తిని చూపక పరతంత్రమై ఉండును. నీవే జగత్తునంతకు సృష్టి స్థితులను చేయువాడవు, నీవే అభ్యుదయమును కలిగించువాడవు, మాకు అభ్యుదయమును కలిగించువాడవు కమ్ము. లోకములోని బంధువులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధములుగా బంధువులగుదురు. నీవు తల్లి, తండ్రి మొదలగు సర్వవిధ బంధువు అగుదువు. నీ సేవచే మేము కృతకృత్యులమైతిమి. నీవు మాకు ప్రభువుగా ఉండుటచే నిరతిశయమైన సుఖమును ఇచ్చే ప్రభువు గలవారమైతిమి. నీ ప్రేమతో కూడిన మందహాసమును, నీ అనురాగంతో కూడిన చూపులను, నీ సుందరమైన నేత్రములను దేవతలు కూడా చూడజాలరు కదా. అట్టి దానిని మేము దర్శించడి భాగ్యమును నోచుకొంటిమి. ఆనాడు నీవు మిత్రులకు చూడవనని కోరికతో కురుదేశముకేగితివి. ఆనాటి నుండి నిన్న నిన్ను చూడని మాకు సూర్యుడు లేని పగటి వలె దినము కోటి సంవత్సరములే గడుచున్నది. ఈ విధంగా వారు పలుకుచుండగా భక్తవత్సరుడగు భగవానుడు ఆ మాటలను వినుచు తన చూపులచే వారిని అనుగ్రహించుచు పట్టణమును ప్రవేశించెను. తనతో సమానము బలము గల మధు, భోజ, దాసార్హ, కుకూర, అంధక, వృష్ణి అను పేర్లతో వేరువేరుగా పిలువబడి యాదవులచే పాతాళము పాములచే రక్షించబడినట్లు రక్షించబడుచున్న ద్వారకా పట్టణమున భగవానుడు ప్రవేశించెను. ఆ పట్టణమున అన్ని ఋతువులలో ఉండెడి అన్ని వైభవములు ఏకాలముననే కలిగి వృక్షములు లతలను శోభించుండెను. ఉద్యానవనములు, ఉపవనములు అందముగా ప్రకాశించుండెను. గోపుర ద్వారములలో మార్గములలో తోరణములు కట్టిరి. రెండు రంగుల జెండాలను పతాకాలను స్థాపించిరి. త్రోవలో ఎండ పడకుండా ఆచ్ఛాదించిరి. మార్గమంతయు పరిమళములుగా జలములతో తడిపిరి. ఫలములను, పుష్పములను, అంకురములను అంతట నెలకొలిపిరి. ప్రతి ఇంట ద్వారమందును పెరుగు, అక్షతలు, ఫలములు, చెరుకులు, పూర్ణకుంభములు, ధూప దీపములు, పూజా ద్రవ్యములు నిలిపి అలంకరించిరి. తమకు ప్రియమైన భగవానుడు వచ్చుచున్నాడని విని వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, పరాక్రమశాలియగు బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుధీష్ణుడు, సాంబుడు ఆనందముగా తొందర తొందరగా నడుచుకొనుచు ఏనుగును ముందుంచుకొని శంఖ తూర్య నాదములతో వేద ఘోషతో ఎదుర్కొనిరి. ప్రేమ చేయగలిగిన తొట్రుపాటుతో ఆనంద పరవశులై వేల కొలది స్త్రీలు చూడవలెనని కోరికతో ఎదురుగా వచ్చిరి. కుండలములు ఊగుచుండగా అందగించుచున్న చెక్కిళ్ళు గల నటులు, నర్తకులు, గంధర్వులు, మాగధులు వంది
జనము ప్రశస్తము కీర్తి గల శ్రీకృష్ణ భగవానుని అద్భుతముగు చరిత్రములను గానము చేయుచుండిరి. భగవానుడు బంధువులను పౌరులను సేవకులను ఉచితముగా రీతిలో ఆదరించి పలకరించి గౌరవించుండెను. తర్వాత ఏం జరిగిందో ముందు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. I bow to your feet, I am your servant. May my life be free from worldly attachments, may my mind be free from illusion. As you are, so are others. Where is the difference? The feet of Sri Hari, those who surrender, their family Removing and giving weddings will bring merit. I bow to those feet. The sky has no end. Similarly, that Srihari also has an immense illusion that is beyond knowledge. In this situation, should I separately say that others do not know the end of that illusion? Second Canto Sixth Chapter 36th Prayer. Devotees of God, welcome to the first episode of the Srimad Bhagavata Tattva Deepika, 19th episode. In the previous episode, in the podcast, when Srikrishna is leaving, when everyone is bidding him farewell, we need to know what the women in that town are talking about. Let's read it carefully. All the townspeople are talking in harmony, as if they are listening. He is in the time of destruction, without movement in the qualities of goodness and truth While all actions are sleeping without being bound by their respective fruits, while both consciousness and intellect are absorbed in him in a subtle form, and while he is the only one who is ordained as his body to this entire world, he is the only reason. He, being alone, by his will, made nature and creation face each other. He entered into it as his own soul and gave it form and name.
He is the one who made the Vedas come into practice. He is the one who purifies the inner self by conquering the senses and meditating with a pure mind. His stories are praised in the Vedas and Vedanta. He alone created, protected, and destroyed this entire world for His play. He who pervades and rules the world, and he who does not suffer its faults, is this Sri Krishna. When the quality of darkness increases and kings live unrighteously, he accepts pure, virtuous forms to punish the wicked and protect the virtuous. He is wealthy, truthful, and has glorious fame. He is none other than, Srimannarayana himself. Having stayed in Madhurapuri for some time, he reached Dwaraka, ruled the people, rejoiced with the eight buffaloes and the gods, and is making them rejoice. The fortune of the women who have obtained him is fortune. The Yadava dynasty, into which this person was born, is very sacred. The God, who is the direct Lakshmi, was born in the Yadu dynasty and sanctified the sweet forest with his wandering. This world is the one whose birth and fame are praised. Perfect By the grace, he was made to be placed in Dwaraka, and his darshan (divine appearance) was granted to the people there. Those who have attained the feet of this Lord, what vows, rituals, and sacrifices they performed in their past lives, worshiping the Lord, in this birth, being dear to the Lord, they have attained the fortune of tasting the nectar of the lotus. Those Gopikas in the brahmins, how blessed their lives were, having killed those like Shishupala who were intoxicated, he made his semen as a dowry, and in the Swayamvara, he blessed Rukmini, Jambavati, Satyabhama, and many more. He had sons with them, Pradyumna and Samba. How fortunate are those who have been blessed with a crown. This is the great man who killed Narakasura, took 16,000 people, and bestowed blessings upon them. This Pundarikaksha, residing in the houses of those women, calling them with affection, calling them by name, delighting them with beautiful words, is making them happy. Oh, how blessed their birth was, thus the learned men were speaking about him
With a smile, he congratulated them and set off for Dwaraka. Dharmaraju, with the doubt that the enemies might trouble Bhagavan in the middle of the path, appointed the Chaturanga force to accompany him for protection. Following him, after traveling a long distance, he lovingly pacified Dharmaraja and others with words, turned them back, and traveled to Dwaraka. Having crossed the lands of Kuru, Jangala, and Panchala, and the lands of Matsya and Sameera, and having reached the land of Anarta, which is near Dwaraka, the horses stopped. The people of that country came forward with the worship materials on their heads. Swami, knowing that he was coming to reach his country, which was near that wicked country, so that the sorrow would be removed and all the people would rejoice, he first blew the conch. In the hand of Lord Krishna, who is red, is a white conch shell. The redness of the Swami's forehead radiates outwards. Then that conch shone like a swan moving among red lotuses. Causing fear to the worlds, causing fear. The sound of the conch Unheard of, all the people in Dwaraka went to see their Lord with the desire to see him. As you shine your light, shine in the world, as you show the lamp to the sun, be joyful, be joyful, and give joy. People were ready to offer worship to the God with a developed face and to bring joy. How the little children rejoice when their loving father comes to protect them, so all the people rejoiced greatly. They are speaking with joy. Oh Lord, we are the ones who have reached your lotus feet. The feet of those who bow down to you are those of Brahma and other gods, and Sanaka and other sages. For those who seek well-being and eternal salvation in this world, your feet are the means to achieve well-being. Even the Brahma and other gods are in his lineage
Keep in your possession the time, in your matter, without showing your power, it will be foreign. You are the one who creates the entire universe, you are the one who brings about progress, you are the one who gives us progress, be with us. Relatives in the world are each one in their own ways. You are a mother, father, and all kinds of relatives. Your service has made us accomplished. Because you are our Lord, we have become those who have the Lord who gives us unceasing joy. Even the gods cannot see the smile mixed with your love, the gaze mixed with your affection, your beautiful eyes, can they? We have had the good fortune to visit it. That day, with the desire that you would not see your friends, you went to Kurukshetra. From that day, since yesterday, we have not seen you. Like a day without the sun, a crore of years have passed. While they were speaking in this way, the devotee Bhagavan, hearing those words, blessed them with his gaze and entered the city. Madhu, Bhoja, Dasarha, Kukura, Andhaka, Vrishni, etc., who were equal in strength to him Called by different names, the Lord entered the city of Dwaraka, which was protected by the Yadavas and the serpents. In that town, all the glories that existed in all seasons were present at one time, and the trees and vines were adorned. The gardens and groves were adorned with beauty. They built arches and gates in the gopuram's entrances. Two colored flags were established. The courtyard was shaded and not exposed to sun. Fragrant waters flow along the road. They established fruits, flowers, and sprouts. At every door of the house, yogurt, akshatalu (turmeric rice), fruits, water pots, full pots, incense sticks, and worship items were placed and decorated. Hearing that their beloved God was coming, Vasudeva, Akrura, Ugrasena, the valiant Balarama, Pradyumna, Charudhishna, Sambudu, joyfully and quickly, walking ahead, leading the elephant, confronted with the sound of conch shells and cymbals, with the sound of Vedic chants. Thousands of women, overwhelmed with joy, with the fickleness that can love They came forward with a desire to see. As the kundalas swayed, the actors, dancers, Gandharvas, and Magadhas, with their adorned hair, bowed
The people were singing the wonderful stories of Sri Krishna Bhagavan, who is famous and has fame. The Lord respected and honored his relatives, citizens, and servants in a free manner. We'll hear more about what happened next in our podcast episode. Jai Srimannarayana, salutations to the Gurus