కలిపురుషుని దౌర్జన్యము - పరీక్షిత్తు పరాక్రమ నిగ్రహము
Cruelty of the Personality of Kali & Parikshit's Punishment
ఈ శ్రీమద్భాగవతం పాడ్కాస్ట్ ఎపిసోడ్లో, కలిపురుషుడు భూదేవిని సూచించే గోవును మరియు ధర్మాన్ని సూచించే వృషభాన్ని కర్దమ స్థితిలో క్రూరంగా హింసిస్తున్న దృశ్యాన్ని వివరిస్తాము. దిగ్విజయ యాత్రలో ఉన్న మహారాజు పరీక్షిత్తు ఈ అధర్మ దృశ్యాన్ని చూసి, వెంటనే కత్తి దూసి కలిపురుషుని ఎదుర్కొంటాడు. కలి శరణు వేడుకున్నప్పటికీ, పరీక్షిత్తు అతనిని వదిలిపెట్టక, జూదం, మద్యపానం, వేశ్యావాటిక, హింస మరియు బంగారం వంటి దుర్వ్యసన స్థలాలకు మాత్రమే పరిమితం చేసి, ధర్మరక్షణలో తన పరాక్రమాన్ని చాటుకుంటాడు.
In this episode of the Srimad Bhagavatham podcast, we explore the fearsome personality of Kali, who torments a cow representing Mother Earth and a bull representing Dharma, striking them mercilessly in the absence of a righteous king. The great emperor Parikshit, while on his royal tour, witnesses this cruel act and immediately confronts Kali with his drawn sword, ready to slay him for his adharmic conduct. Moved by Kali's surrender yet unwilling to let unrighteousness roam free, Parikshit wisely banishes Kali to places of vice — gold, gambling, drinking, animal slaughter, and illicit association — demonstrating that true power lies in righteous restraint.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః తద్వా ఇదం భువన మంగళ మంగళాయ ధ్యానీస్మనో దర్శితం తే ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమతుభ్యం యోనాదృతో నరక బాగ్భిర సత్ప్రసంగైహి థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ ఫోర్త్ ప్రేయర్ జగత్తునకు కళ్యాణ గుణమైన వాడా నీ ఉపాసకుడనగు నాకు కళ్యాణమును చేయుట కొరకై నీవు అట్టి ఈ నీ రూపమును నాకు ధ్యానములో దర్శనమిచ్చితివి. భగవానుడవగు నీకు నేను పరమాలు నమస్కరించుచున్నాను. అజ్ఞానులు మిథ్యాభూతమగు జగత్తునందు తీవ్రమగు ఆసక్తి గలవారై కుతర్కములయందును నిష్ట కలిగి నిన్ను ఉపేక్ష చేసి నరకమును పొందుచున్నారు. థర్డ్ క్యాన్ టు నైన్త్ చాప్టర్ ఫోర్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం 23వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితము ధృతరాష్ట్రుడు గాంధారి వాళ్ళ యొక్క చివరి దశ ప్రయాణము వారితో పాటు విదురుని యొక్క ప్రయాణం గురించి మనం విన్నాం ముందు భాగం తెలుసుకుందాం. అర్జునుడు ద్వారకలోనున్న బంధువులను చూచుటకు శ్రీకృష్ణ వృత్తాంతమును అడయుటకును ద్వారక కేగెను. కొన్ని నెలలు గడిచినను అతడు వెనుకకు రాలేదు. ఘోరములగు అపశకనములు హస్తినాపురున కనపడుచుండెను. జీవనము కొరకు మనుష్యులు పాప వ్యాపారములు చేయుచుండిరి. అందరి ప్రవర్తనలో మోసము కనపడుచుండెను. ప్రేమ చూపడి వారు వంచనతో ప్రేమను చూపించుండిరి. తండ్రి కుమార్తెను విక్రయించి జీవించుచుండెను. కుమారులు తల్లిదండ్రులను పోషించుట మానిరి. బ్రాహ్మణులు వేదములు చదువుటయందు వైముఖ్యము కలిగి ఉండిరి. బంధువులు ఒకరియందు ఒకరికి అనురాగము తగ్గి ఉండిరి. స్వర్గము సారీ స్వరము ఉచ్చరించుటలో శక్తి లేని వారు వేదములు ఉచ్చరించుటకు సిద్ధపడుచుండిరి.
అరిష్టములు ఎక్కువగా కనపడుచుండెను. అందరూ లోభము కలవారై ఉండిరి. ఇట్లు ఉండుట చూచి ధర్మరాజు భీమునితో ఇట్లు అనెను. భీమా అర్జునుడు ద్వారకలో ఉన్న బంధువులను చూడవలెనని కృష్ణుని వృత్తాంతము ఎరింగి రావలెననియు వెడలెను. ఏడు మాసములు గడిచెను. ఇంతవరకు వెనుకకు రాలేదు. కారణం ఏమో తెలియదు. నారదుడు, శ్రీకృష్ణుడు తన లీలకై స్వీకరించిన అపరాజితమగు శరీరమును వీడి వెడలిపోవునని చెప్పిన కాలం సమీపించినదేమో. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వలనే మనకి సంపదలు, రాజ్యము, బిడ్డలు, శత్రు విజయము లభించినది. ఇప్పుడు అంతరిక్షమందును, భూమియందును, శరీరమందును కూడా విపరీతమగు ఉత్పాదములు కనపడుచున్నవి. ఏదో అశుభము జరుగునని చెప్పుదురు. నక్కలు సూర్యుడు ఉదయించుండగా ఆ సూర్యునకు అభిముఖంగా అరుచుచు పోవుచున్నవి. నేను వెలలనప్పుడు కుక్క మురుగుచు భయపడక నాకు ఎదురుగా పరిగెత్తుకొని వచ్చుచున్నది. నేను వెడలుచున్నప్పుడు గోవులు మొదలగు శ్రేష్టమైన జంతువులు ఎడమ వైపు నుండి పోవుచున్నవి. గాడిదలు మొదలగు నీచ మృగములు కుడివైపున నడుచున్నవి. గుర్రములు, ఏనుగులు కన్నీరు కార్చుచున్నవి. పావురములు, గుడ్లగూబలు అరుచుచున్నవి. రాత్రివేళ నిద్రపోకుండా గుడ్లగూబలు ఒకదాని అరుపునకు మరొకటి బదులు చెప్పుచు అరుచుచు అరుచుచు ఉన్నవి. దిక్కులు పొగ కమ్మి ఉన్నవి. భూమి అప్పుడప్పుడు కదులుచున్నది. అకాలమందు మేఘములు పిడుగులతో వర్షించుచున్నవి. పెద్ద ధూళితో పెనుగాలులు వీచుచున్నవి. మేఘములు రక్తమును వర్షించుచున్నవి. సూర్యుడు తేజస్సును తగ్గి ఉన్నాడు. గ్రహములు ఒకదానిపై ఒకటి విరోధించుచున్నవి. పిశాచములు భూమి ఆకాశములలో నడియాడుచున్నవి. నదులు, మృగములు, సరస్సులు కలత చెందియున్నవి. మనస్సు ఏదో బెంగతో దిగులు పడుచున్నది. నేను పోసినను నెయ్యి పోసినను అగ్ని మండుట లేదు. దూడలు పాలు తాగుట లేదు. ఆవు పాలు ఇచ్చుట లేదు. గోవులు కంటి వెంబడి నీరు కారుచున్నవి. విగ్రహములు ఏడుచున్నట్లు ఉన్నవి. చెమరుచున్నవి. విగ్రహములు కదిలిపోవుచున్నవి. మన పల్లెలు, పట్టణములు, ఉద్యానవనములు, ఆశ్రమములు మునుపటి అందము లేక కాంతిహీనములై ఉన్నవి. ఈ ఉత్పాదములను చూచినచో శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శ భూమికి తొలగి భాగ్యము చెదిరిపోయినట్లున్నది. ఇట్టి అరిష్టములను చూచి భయపడుచున్న మనసుతో భీమునితో ధర్మరాజు మాట్లాడుచుండగా ద్వారక నుండి అర్జునుడు మరలి వచ్చెను.
మునుపటి వలె ఆనందముగా లేడు. తొట్రు పడుచు అన్నగారి పాదముపై పడెను. ముఖము కాంతిహీనమై యుండెను. కంటి వెంబడి నీరు స్రవించుచుండెను. ధర్మరాజ్ అతనిని చూచి మనశ్చదిన వాడాయను మిత్రుల మధ్యలో నారదుడు చెప్పిన మాటలను స్మరించుచు అర్జును ఇట్లు ప్రశ్నించెను ద్వారకా నగరములో మన వారందరూ సుఖముగా ఉన్నారా? మాతామహుడగు సూర్యుడు సుఖముగా ఉన్నాడా? మేనమామ వసుదేవుడు సోదరులు కుశలమా? మేనమామల భార్యలు ఏడుగురు పిల్లలతో కోడళ్ళతో సుఖముగా ఉన్నారా? వసుదేవుని భార్యలు దేవకి మొదలగు వారందరూ క్షేమమే కదా? దేవకి, వృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శృతదేవ, దేవరక్షిత, సహదేవలను ఏడుగురు భార్యలకు వసుదేవును గలరు. వారందరూ కుశలమేనా? కంసుని తండ్రి ఆహుకుడు కుశలమేనా? రాజగు ఉగ్రసేనుడు కుశలమేనా? భక్తి పరపాలకుడగు బలరాముడు, అక్రూరుడు, వసుదేవ పుత్రులందరూ కుశలమేనా? భక్త పరిపాలకుడగు బలరాముడు క్షేమమేనా? సర్వ యాదవులలో మహార్ధుడగు ప్రద్యుమ్నుడు గంభీర వేగుడవు అనిరుద్ధుడు భద్రముగా ఉన్నారా? భగవానుని కుమారులు సుషేనుడు, చారుధీష్ణుడు, సాంబుడు వారందరూ కుశలమేనా? భగవాను అనుచరుడగు శృతదేవుడు ఉద్ధవుడు క్షేమముగా ఉన్నారా? బలరామకృష్ణ భుజబలమును ఆశ్రయించి జీవించుచున్న మనవారందరూ క్షేమమేనా? మనయందు ప్రేమగలవారందరూ మనల్ని తలచుచున్నారా? భగవానుడు గోవిందుడు భక్తవత్సుడుడై ద్వారకలో సుఖముగా ఉన్నాడా? అతడు యాదవ వంశమున అవతరించిన అనంతుడు మిత్రుడుగా గల ఆదిపురుషుడు కదా? ఈ లోకమున ఉండుటయే లోకలకు మంగళము క్షేమము. శ్రీకృష్ణుని బాహుబలముచే రక్షింపబడుచున్న ద్వారకలో యాదవులందరూ పరమానందంతో జీవించుచున్నారా? సత్యభామ మొదలగు 16000 మంది దేవులు ఆ స్వామి పాద సుశ్రుషణము చేయుచు ఆనందించుచున్నారా? ఇంద్రుని పట్టపు దేవుల వలె తమ ప్రియుడగు భగవానుడు కోరికలను ఈడేర్చుండగా వారు ఆనందముతో ఉన్నారా? ఆ ప్రభువును అనుసరించి బ్రతికే యాదవులు ఎవరి వలనను భయము లేని వారై సుధర్మ అనడి ఆ సభను అధివసించి ఉన్నారా? అర్జున నీవేమి కాంతి తరిగినట్లు ఉన్నావు? నీ ఆరోగ్యం బాగున్నదా?
ఎవరు నిన్ను అవమానింపలేదు కదా? ఇంతకాలము ఏలా అచట ఉండిపోతివి? ఎవరైనా అమంగళమైన శబ్దములతో నీ మనసును చికాకు పరిచినారా? యాదవులకు ఇచ్చెదనని మాట ఇచ్చి ఈయననట్లు బాధపడుచున్నావేమి? అందరకును అభయవశంగా జాలిన నీవు శరణాగతుడైన బాలుని గాని, బ్రాహ్మణుని కానీ, గోవుని కానీ, వృద్ధుని కానీ, రోగిని కానీ, స్త్రీని కానీ రక్షింపజాలక ఇట్లు నిరుత్సాహంతో ఉన్నావా? పొందరాని స్త్రీలను పొందుట గానీ, చేయరాని పనులను చేయుట గానీ చేయలేదు కదా? ఎవరైనాను నిన్ను అవమానించలేదు కదా? నిన్నిప్పదగిన పనిని దేనిని అయినా చేసితివా? నీతో కలిసి భుజించుటకు తగిన పెద్దలను గానీ, పిల్లలను గానీ విడిచి భోజనము చేసితివా? మనకు అత్యంత ప్రియతముడు. హృదయమును ఆవర్జించిన వాడునగు శ్రీకృష్ణుడు మనతోనిక ఉండక వీడి వెళ్ళినాడా? నీకు దిగులు చూచినచో అంతకంటే వేరొకటి ఏదియు శోకమునకు కారణమై ఉండదని అనిపించుతున్నది. ఇట్లు. శ్రీకృష్ణుడు ప్రాణమిత్రులుగా గల అర్జునునికి అనేక విధములుగా శంకలను చేసి ధర్మరాజు కృష్ణ విశ్లేషణము గూర్చి ప్రస్తావించగానే అర్జునుడి దుఃఖం అధికమాయెను. ఆ శోకముచే ముఖము, హృదయము వాడిపోయి కాంతిహీనుడై శ్రీకృష్ణునే తలంచుతూ మాటలేక నిలిచెను. కొంతసేపటికి అతి కష్టమై శోకము ఆపుకొని కన్నులు తుడుచుకొని శ్రీకృష్ణుని యందు ఉండు ప్రేమచే విరహమైన తలంచుకొని ఆ స్వామి తమ యెడల చే చూపిన ప్రేమను మైత్రిని చెలిమిని సాచివ్యమును తలంచుచు కన్నీటితో గద్గదన స్వరముతో ఇట్లు పలికెను. అర్జునుడు ఏం పలికాడు? ధర్మరాజు ప్రశ్నలకు దాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. This world is auspicious, auspicious. Dhyani smano darshitam te upasakanam. Salutations to that Bhagavat. May it be devoted to you both. Yonadruto Naraka Bagbhira Satprasangaihi. Third Canto, Ninth Chapter, Fourth Prayer Oh, you who are the auspicious quality to the world, you, my worshiper, have given me such a vision of your form in meditation for the sake of performing the auspiciousness. I bow to you, the Lord, the Supreme Being. The ignorant, being intensely interested in the illusory world, are neglecting you, being devoted to false arguments, and are attaining hell. Third can to ninth chapter fourth prayer. Devotees of God, welcome to the 23rd podcast of Srimad Bhagavata Tatva Deepika, the first volume. Previously, we heard about the journey of Dhritarashtra and Gandhari, along with Vidura, and now let's learn about the beginning. Arjuna went to Dwaraka to see his relatives and to ask about the story of Lord Krishna. After a few months, he Did not come back. Terrible and disastrous calamities were appearing in Hastinapur. For the sake of life, men were doing sinful deeds. Everybody's behaviour was so devilish. Those who show love, show love with deceit. The father was living by selling his daughter. The sons have stopped supporting their parents. Brahmins were in the habit of studying the Vedas. Relatives had less affection for each other. Those who do not have the power to utter heavenly music, were getting ready to utter the Vedas.
Evil was very much in evidence. All were greedy. Seeing this, Dharmaraja said to Bhima thus. Bhima and Arjuna, wanting to see their relatives in Dwaraka, set out to go to Krishna's place. Seven months have passed. It hasn't gone back yet. I'm not sure why the difference is. Narada, Srikrishna, the time when he said that he would leave the invincible body he had accepted for his play has come near. It is only by the grace of Lord Krishna that we have wealth, kingdom, children, and victory over enemies. Now, in space, on earth, and also in the body, extraordinary products are appearing. They say that something bad is going to happen. The foxes are proceeding, shouting towards the sun as it rises. When I was alone, the dog, without fear, ran towards me. When I am leaving, the best animals like cows are going from the left side. Dogs and other vile beasts are walking on the right hand side. Horses and elephants, tears They are chirping. Pigeons and owls are cooing. Owls are hooting, one after another, without sleeping at night. The directions are poor. The earth is moving occasionally. In the untimely season, the clouds are raining with thunder. Strong winds blowing with a lot of dust. The clouds are dropping blood. The sun was setting. The planets are locked in a tug-of-war. The demons roam in the earth and in the sky. The rivers, animals, and lakes are disturbed. The mind is troubled and depressed. Even if I pour ghee, the fire doesn't burn. The calves are not drinking milk. The cow is not giving milk. Cows with watery eyes. The statues seem to be shivering. The statues are moving. Our villages, towns, gardens, and hermitages are now without the former beauty and are devoid of light. If we look at these products, it seems as if the touch of Lord Krishna's feet to the earth has been removed, and fortune has been lost. Seeing these misfortunes, Dharmaraja, with a frightened mind, was speaking to Bhima when Arjuna returned from Dwaraka.
He's not like before. The little one fell at her elder brother's feet. The face had lost its radiance. Water continued to flow from beside the eye. Dharmaraj, seeing him, remembered the words spoken by Narada among his friends, saying, "Arjuna, are we all living happily in the city of Dwaraka?" Is the grandfather, the Sun, happy? Are uncle Vasudeva and his brothers well? Are the wives of maternal uncles living happily with their daughters, along with seven children? Vasudeva's wives, Devaki and others, are all safe, right? Devaki, Vrutadeva, Shantideva, Upadeva, Shrutadeva, Devarakshita, and Sahadeva, Vasudeva has seven wives. Are you all well? Is Kamsa's father, Aahuka, well-being? Is Ugrasena, the king, well? Are Balarama, Akrura, and all the sons of Vasudeva, who are devoted to devotion, well? Is Balarama, the protector of devotees, safe? Among all the Yadavas, is Pradyumna, the great one, a serious and cautious one, and is Aniruddha safe? Are the sons of the Lord, Sushenudu, Charudhishnudu, and Sambudu, all well? Bhagavanu Are the followers, Shrutadeva and Uddhava, safe? Are all of us, who live relying on the strength of Balarama and Krishna, safe? Are those who love us thinking of us? Is Lord Govinda, the devotee of the Lord, happily in Dwaraka? He is the one who incarnated in the Yadava dynasty, the one who is the friend, the first man, isn't it? Being in this world is auspicious and prosperous for the worlds. Are all the Yadavas living with supreme joy in Dwaraka, which is protected by the might of Sri Krishna? Are Satyabhama and 16000 other goddesses enjoying the touch of the feet of that Swami? Are they happy that their beloved Lord, like Indra's attendants, is fulfilling their desires? Are the Yadavas who live by following that Lord, without fear of anyone, dwelling in that assembly, asking for good Dharma? Arjuna, why do you look so pale? Are you feeling better?
No one'd ever hurt you, right? How have you been staying there all this time? Has anyone disturbed your mind with inauspicious sounds? Why are you grieving that he gave his word to give to the Yadavas? Are you, who are fearless to all, unable to protect a child, a Brahmin, a cow, an old man, a sick person, or a woman who has taken refuge? Didn't they do things like getting married to unsuitable women or doing things that shouldn't be done? Didn't anybody ever insult you? Have you ever done any work that deserves praise? Did you eat, leaving aside elders or children who are worthy of being served with you? The one dearest of all. Did Lord Krishna, who has taken away the heart, leave us without staying with us? When you see sorrow, it seems that nothing else can be the cause of grief. Thus. Srikrishna, being a close friend, created many doubts for Arjuna. As soon as Dharmaraja mentioned Krishna's analysis, Arjuna's sorrow increased. That His face and heart were withered by grief, and he stood speechless, remembering Sri Krishna. After some time, overcoming the extreme difficulty and sorrow, wiping her eyes, remembering the separation from Sri Krishna with the love she had, and remembering the affection, friendship, and companionship shown by that Swami towards her, with tears, with a choked voice Thus spoke the inquisitive. What did Arjuna say? We will learn about Dharmaraju's questions in the podcast later. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.