భగవంతుని దివ్య అవతార లీలలు - పురుషావతార వర్ణన

Divinity & Purusha Incarnations of the Lord

bhagavatam

శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలోని ఈ పవిత్ర ఎపిసోడ్‌లో, పరమాత్మ యొక్క దివ్య స్వరూపం మరియు సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పురుషావతారల గురించి విపులంగా వివరించబడింది. మహావిష్ణువు, గర్భోదకశాయి విష్ణువు మరియు క్షీరోదకశాయి విష్ణువు అనే మూడు పురుషావతారాలు విశ్వ సృష్టిలో తమ తమ పాత్రలను ఏ విధంగా నిర్వహిస్తారో శౌనకాది మహర్షులకు సూత మహర్షి అద్భుతంగా వివరిస్తారు. భగవంతుడు సమస్త సృష్టిలో వ్యాపించి ఉంటూనే సర్వదా దాని అతీతంగా వెలుగొందుతాడని ఈ ఎపిసోడ్ మనకు తెలియజేస్తుంది. భగవంతుని ప్రతి అవతారమూ జీవులకు మోక్షమార్గాన్ని చూపే దివ్య కరుణకు ప్రతీకమని ఈ కీర్తన మనకు స్ఫూర్తినిస్తుంది.

In this sacred episode of Srimad Bhagavatham Canto 1, we explore the divine nature of the Supreme Lord and His transcendental Purusha incarnations that govern creation, maintenance, and dissolution. The three Purusha avatars — Maha Vishnu, Garbhodakashayi Vishnu, and Kshirodakashayi Vishnu — are described in their cosmic roles, each presiding over different aspects of universal existence. Through the wisdom of the great sage Shaunaka and the narration of Suta Goswami, we come to understand how the Lord enters and pervades all of creation while remaining eternally beyond it. This episode invites seekers to contemplate the infinite glory of the Lord whose every incarnation is a divine blessing for the liberation of all souls.

← Prev Next →
Divinity & Purusha Incarnations of the Lord bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయచ భగవత్ బంధువులారా శ్రీ భాగవత తత్వదీపిక ప్రథమ స్కంధం మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఈ భాగవతమునందు పరబ్రహ్మ స్వరూపము పరమాత్మయు సర్వేశ్వరునకు భగవానుడగు శ్రీకృష్ణుడే రుంగజేయబడును. దాని పొందుటకు ముందుగా ప్రవర్తించని విధము భాగవత ధర్మము. అట్టి భక్తి రూపముగు భాగవత ధర్మము ఆ భక్తిచే పొందదగు భగవానుడును ఇందు ప్రతిపాదింపబడును. శ్రీ భాగవ శ్రీమద్భాగవతమని ఈ పురాణమునకు పేరు. భగవంతునికి సంబంధించిన బహత్ స్వరూపమును అసాధారణ దివ్య మంగళ విగ్రహమును కళ్యాణ గుణములను అతనిచే నియమింపబడు విశ్వ స్వరూపమును ఈ పురాణం ప్రతిపాదించును. అంతటా వ్యాపించి అన్నిటికంటే గుణములలో స్వరూపములో అధికమైన ఒక తత్వం ఉన్నదని ఎరింగిన సత్పురుషులు తెలుసుకునవలసిన విషయము ఇందు ప్రతిపాదించబడినది. ఇందు ప్రతిపాదింపబడిన భగవానుడు ఎల్ల కాలములయందు మార్పు చెందక ఏకరూపముగా ఉండెడివాడు. ఆ తత్వమును ఎరింగిన వానికి మంగళము కలుగును. దుఃఖము తొలుగును. దీనిని బాదరాయణ మహామని రచించినాడు. బాదరాయణుడు నారాయణ అంశ సంభూతుడు. పరాశర పుత్రుడు. ఆప్తతముడు. ఇందు వ్యాసుడు భగవానుని పూర్ణముగా దర్శించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడు. కనుక ఈ పురాణము ప్రమాణతమము. ఇందు భగవాని ఉన్నతిని తెలిపేడి గుణములన్నియు వాస్తవములు. ఇది ఎరింగిన మోక్షానందము కలుగును. సంసార దుఃఖము తొలుగును.

మోక్ష సాధనమగు ధర్మము భక్తి అనియు దానిచే ఆరాధింపబడు పరదేవత సర్వ జగత్ కారణమును సర్వాంతర్యామియు సర్వ జగన్ నియామకమగు భగవానుడు ఆ శ్రీకృష్ణుడే అనియు ఈ పురాణమున ప్రతిపాదింపబడును. భగవానుని విభూతియగు విశ్వమును గూర్చియు విశ్వాంతర్యామిని గూర్చియు వానిని పొందు ఉపాయమును గూర్చియు విశదముగా వివరించిన ఈ పురాణం ఉండగా వేరొక శాస్త్రములు ఏవియు అధ్యయనమును చేయవలసిన అవశ్యకత లేదు. ఈ పురాణమును వినవలెని కోరిక కలిగినంత మాత్రముచే వెంటనే వినిన వారి హృదయమున వారి శ్రవణముల ద్వారా భగవానుడు ప్రవేశించి మరి వదలక నిలుచును. ఇతర శాస్త్రములు, గ్రంథములు ప్రయత్నముతో భగవాని పొందుటకు చిరకాలం విభజించిన గాని భగవంతుని పొందలేరని చెప్పుటకు సాయపడునవే గాని. సులభముగా భగవంతుని వినిన వారి హృదయములో నిలుపగలిగినవి కావు. దీనికి యోగ్యత వినవలెననే కోరిక కలిగి వినుట మాత్రమే అట్టి వారికి వినిన వెంటనే మనసులో భగవానుడు నిశ్చలముగా నిలుచును. నిగమ కల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూయి భావుకాః భగవదానందమునందలి మాధుర్యము ఎరింగిన వారును దానిని మరల మరల మనసులో భావన చేసి ఆ రుచిని చవి చూడవలెని భావించెడు వారును అనుభవింపదగిన పరమానంద స్వరూపుడవు శ్రీకృష్ణ భగవానుడు ఈ భాగవతమున ప్రతిపాదింపబడినాడు. మాధుర్యమే రూపిదాల్చి నిలిచిన మూర్తి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఈ లోకులను అనుగ్రహించున కొరకై దివి నుండి భూమికి దిగినాడు. ఆ శ్రీకృష్ణ తత్వము రసోవైసః అనుపరిషత్తులో పేర్కొనబడిన రసతత్వమే. అది అందరికీ అందుకొన శక్యము కానిదై వేదమునడి కల్పవృక్షముల చివర కొమ్మల నండు పండు. వేదము కలపుతరు వంటిది. ఎవరు ఏది కోరినా దాన్ని వసంగా జాలినది. ఈ వృక్షం యొక్క చివరి శాఖలే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన రస స్వరూపుడే శ్రీకృష్ణ భగవానుడు అనేటి ఫలము.

దానిని ఒక చిలిక కొరికినది. ఆ ఫలము జారి నిలబడినది. ఆ ఫలమును కొరికిన చిలికయే శ్రీ సుఖయోగేంద్రుడు. సుఖము అనేటి పదమునకు చిలుక, సుఖయోగి అని రెండు అర్థములు. సుఖయోగి ఆ ఫలమును అనగా రసస్వరూపుడును వేద ప్రతిపాద్యుడును అగు బ్రహ్మ తత్వమును అనుభవించి. తన వాక్కు ద్వారా ఈ భూమిలో ప్రసరింపచేసినాడు. శుకయోగి అనేటి చిలుక కొరికిన పడవేసిన ఫలమే శ్రీకృష్ణ భగవానుడు. వేదైశ్చ సర్వే అహమేవ వేద్యః వేదములన్నింటి చేతను ప్రతిపాదింపబడేటి వాడును నేనే అనినాడు శ్రీకృష్ణ భగవానుడు. వేద వృక్షము నుండి జారి భూమిపై పడిన ఫలము శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుని ప్రతిపాదించునది భాగవతం. ఇందు అమృత వంటి ద్రవము నిండి ఉన్నది. కాదు అమృతమే ఫల రూపమున ఉన్నది. లోకములోని ఫలములలో తొక్క, టెంక మొదలగునవి పారవేయవలసినవి. నవల దగినవి ఉండునేమో కానీ ఇందు అంతయు పానము చేయదగిన అమృతమే అనగా. భగవత్ అనుభవమే ఈ గ్రంథమును అనుభవింపజేయబడును. భగవానుని స్మరణమే అమృతము. విస్మరణమే మరణము. ఈ భాగవతమును అధ్యయనము చేయుచున్నచో భగవత్ స్మరణము ఎడతెగక సాగును. భగవత్ అనుభవం మధురమైన ఒక రసానుభూతిని పోలియుండును. అందుచే భాగవతమును ఫలమును పానము చేయుడు అని శ్రీ సుఖయోగి ప్రేరణ కలిగించుచున్నాడు. పండును తాగుట లోకంలో ప్రసిద్ధి కాదు. కానీ ఈ భాగవతము ఫలము శ్రీకృష్ణానుభవము అనే మధుర రసముతో నిండిన తగుటచే దీనిని పానము చేయవలెను. ఈ రసము ఒకనాడు తాగి ఒకనాడు విరమించుట అనునది ఉండదు. అందుచే శరీరమును వీడి జీవుడు పరమాత్మ సన్నిధిని చేరు వరకును భాగవతం అనుభవించుచునే ఉండదగినదై ఉండును. దీనిని రసికులు, భావుకులు అనుభవించవచ్చును.

ఫలము యొక్క రుచిని ఎరుంగిన వారే అనుభవింతురు గానీ ఆ రుచిని ఎరుంగని వారు దాన్ని అనుభవింపజాలరు. అందుచే భగవత్ అనుభవమందలి రుచి గలవారందరూ భాగవతుని అధ్యయనమును అధ్యయనము చేయవలెను. ఒక మాట తిని మరల ఆ రుచిని మనసులో భావింపని వారు ఫలం యొక్క రుచిని బాగుగా ఎరుంగని వారు. బాగుగా ఎరిగిన వారు మరల మరల మనసులో భావించుకొనుచుందురు. అట్టి వారు భావుకులు. వారే ఈ భాగవతమును అధ్యయనం చేయుటకు యోగ్యులు. ఎత్తైన చెట్ల చివరి కొంపై ఉన్న పండు పొందుటకై దుర్లోభమైనది. చిలుక కొరికి కింద పడవేసినచు అది ఎట్లు సుఖముగా పొందవీలగునో అట్లే వేద శిఖలలో పండిన భగవత్ తత్వమును సామాన్యులకు అందుబాటులో ఉండనిది. దానిని శ్రీ సుఖయోగి తన వాక్కుచే ఈ లోకమును అందించినాడు. ఈ భాగవతమునకు వేదమే మూలము. కేవల నివృత్తి ధర్మమునందే ఆసక్తి కలిగి విరక్తులలో అగ్రేసరుడు ఒక శుకయోగి దానిని ఆదరించినాడు కనుక మోక్షమందు ఇచ్చగలవారు దీనిని ఆదరంతో శమింపదగును. ఇట్టి భాగవతము సుఖయోగి పరీక్షిత్తునకు వివరించుటకు ముందు చేసిన ప్రార్థనా శ్లోకములు ఇంతవరకు వివరింపబడినవి. ఇక ముందు పరీక్షిత్తునకు సుఖయోగిందుడు ఉపదేశించుటకు ముందు దీనిని నమిశారణ్యమున శౌనకాదు ఋషులకు వివరించిన కథ తెలియజేయబడుతుంది. అది మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations to you, the Lord of Vasudeva, salutations to Pradyumna, salutations to Kamalapatna, and to Sankarshana. Dear devotees, welcome to the first part of the first episode of Sri Bhagavata Tattvadipika, the third podcast. In this Bhagavatam, the supreme Brahman form, the supreme soul, and Sri Krishna, who is the Lord of all, are to be enshrined. The Bhagavata Dharma is the way of life that does not act before it is attained. Such a form of devotion, the Bhagavata Dharma, and the Lord who is attained by that devotion are also presented here. Sri Bhagavata is the name of this Purana. This Purana proposes the many forms related to God, the extraordinary divine auspicious idol, the qualities of marriage, and the universal form appointed by him. It is proposed that the matter that the virtuous men who have realized that there is a supreme element in the qualities and in the form of everything is to be known. The Lord, who is proposed here, is one and the same, unchanging in all times. Blessed are those who have heard the Word of the Lord. Grief will pass. This Badarayana composed the Mahamuni. Badarayana is the incarnation of Narayana. Parashara's son. Aptamudu. Indu Vyasudu, having fully seen the Lord, said as it is. Therefore, this Purana is authentic. In this, the qualities that indicate the greatness of the Lord are all true. This is the Mokshaanandam that is attained by erasing. Suffering from worldly sorrow will be removed.

The Dharma that leads to salvation is devotion, and the supreme deity worshiped by it is the cause of the entire universe, the omnipresent, and the Lord who is the controller of all the universe, that is Sri Krishna, and this is what is propounded in this Purana. This Puranam, which clearly explains about the universe, the lord of the universe, the lord of the universe, and the means to attain him, is not necessary to study any other scriptures. Just as one desires to listen to this Puranam, the Lord enters the hearts of those who listen immediately through their ears, and remains without leaving. Other scriptures and books, even if they are divided for a long time to try to attain God, do not help to say that they cannot attain God. Those who have heard God easily cannot be placed in the hearts of those who have heard Him. Having a desire to hear about its worthiness, just listening to it, for such people, as soon as they hear it, the Lord stands still in their minds. Nigama Kalpa Tarorgalitam Phalam Sukhamukhadamrutadrava Samyutam Pibata Bhagavatam Rasamalayam Muhuraho Rasika Bhui Bhuvukaha Bhagavadanandamunandali Those who have tasted sweetness, those who repeatedly contemplate it in their minds and feel that taste, those who think they should taste it, you are the embodiment of supreme bliss that can be experienced, Sri Krishna Bhagavan is propounded in this Bhagavatam. The form that stands as the embodiment of sweetness is Lord Krishna. He came down from heaven to earth to bless these people. That Sri Krishna Tatvam is the rasa tatvam mentioned in Anuparishattu. That which is beyond the reach of everyone, like a fruit on the branches at the end of the Vedic tree of Kalpa. The Vedas are like a foundation. Whoever wants what, gets it. The last branch of this tree is the Upanishads. The fruit is that Sri Krishna Bhagavan is the embodiment of rasa as propounded in the Upanishads.

It was bitten by a glitter. The fruit has fallen off and is now standing up. The one who bit the fruit is Sri Sukha Yogendrudu. The word Sukhamu has two meanings: parrot and Sukhyogi. Sukayogi, that fruit, meaning the embodiment of rasa, the one who recites the Vedas, having experienced that Brahma Tattvam. He spread it across the earth by his word. Shukayogi is the fruit that was dropped by a parrot bite, that is Sri Krishna Bhagavan. I am the only one who is known by all the Vedas. I am the one who is propounded by all the Vedas, said Sri Krishna Bhagavan. The fruit that fell from the Veda tree onto the earth is Lord Sri Krishna. The Bhagavatam is the one who propounds Lord Krishna. It is filled with a nectar-like liquid. No, nectar is the fruit form. The fruit of the world, including the peel and the seed, should be discarded. There may be novels, but this is all nectar that can be drunk. The experience of the divine is what this book is meant to convey. Remembering God is like drinking nectar. Forgetting is death. If you study this Bhagavatam, the remembrance of God will continue without interruption. The Experience of the Divine Sounds like a symphony. Therefore, Sri Sukha Yogi is inspiring to drink the fruit of the Bhagavata. The act of drinking pomegranate is not famous in the world. But this Bhagavatam, the fruit, is filled with the sweet juice called Srikrishna Anubhavam, so it should be drunk. There is no such thing as stopping this juice once you drink it. Therefore, until the soul leaves the body and reaches the presence of the Supreme Soul, the Bhagavatam should be experienced. It can be enjoyed by people who appreciate it.

Only those who have tasted the fruit can experience it, but those who have not tasted it cannot experience it. Therefore, all those who have a taste for the experience of God should study the Bhagavata. Those who eat a word and do not feel that taste in their mind are those who do not properly taste the fruit. Those who are well-versed repeatedly contemplate in their hearts. Such people are emotional. They are the ones who are worthy of studying this Bhagavatam. It is difficult to get the fruit at the end of the tall trees. Just as a parrot, having bitten and dropped down, cannot attain it easily, similarly, the divine essence that has grown in the peaks of the Vedas is not accessible to the common people. He gave this world to Sri Sukha Yogi through his words. The Vedas are the foundation of the Bhagavata. Only in the interest of detachment, the foremost among the detached is a Shuka Yogi, who has supported it, therefore, those who can give liberation will be able to pacify it with respect. Before explaining this Bhagavatam to Sukha Yogi Parikshit, the prayers and verses that were made have been described so far. From now on Before teaching Sukha Yogindunudu to Parikshit, this story is explained to the Shaunakadi Rishis in Namisharanyam. We'll get to that in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.