విదుర తీర్థయాత్ర & ఉద్ధవ సంవాదము (Parts 1-8)

Vidura's Travels & Uddhava Dialogue (Parts 1-8)

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో శ్రీమద్భాగవతంలోని మూడవ స్కంధం నుండి విదురుని పవిత్ర తీర్థయాత్రను వివరిస్తాము, ఇందులో ఆయన రాజభోగాలను త్యజించి సత్సంగం కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. యాత్రా మార్గంలో విదురుడు శ్రీకృష్ణుని ప్రియ శిష్యుడైన ఉద్ధవుని కలుసుకుంటాడు, మరియు ఆ సంవాదంలో భగవంతుని దివ్య లీలలు మరియు భక్తి మార్గం గురించి అమూల్యమైన జ్ఞానం లభిస్తుంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని భూలోక విహారపు అంతిమ ఘట్టాలను మరియు ఆయన అనుగ్రహించిన ఆధ్యాత్మిక బోధలను హృదయస్పర్శిగా వివరిస్తాడు. ఈ కథలు సత్సంగ మహిమను, శరణాగతి యొక్క గొప్పతనాన్ని మరియు పరమాత్మ యొక్క శాశ్వత కృపను మనకు స్పష్టంగా తెలియజేస్తాయి.

In this episode of our Srimad Bhagavatham series, we explore the sacred pilgrimage of Vidura, the noble devotee who renounced royal comforts to seek the company of saints and holy rivers. Along his journey, Vidura encounters the great sage Uddhava, a beloved disciple of Lord Krishna, who shares profound wisdom about the Lord's divine pastimes and the path of devotion. Through their deeply moving dialogue, Uddhava recounts the final days of Lord Krishna's earthly presence and the spiritual guidance He imparted before departing from this world. Together, these narratives illuminate the power of saintly association, steadfast surrender, and the eternal grace of the Supreme Lord.

Next →
Vidura's Travels & Uddhava Dialogue (Parts 1-8) bhagavatam

ప్రేరణ అస్మద్ గురుభ్యో నమః సప్రసీదతమస్మాకమాకాంక్షతాం దర్శనంతే పరిభ్రష్ట సత్కర్మణాం కీర్త్యమానే నృభిర్నాం నియజ్ఞేశతే యజ్ఞ విఘ్నాహక్షయం యాంతి తస్మై నమః ఓ యజ్ఞేశ్వరా మేము నీ దర్శనమును గట్టిగా కోరుచుకొనుచున్నాము. మేము మొదలు పెట్టిన మంచి యజ్ఞము వినష్టమైనది. మమ్ములను అనుగ్రహించుము. నీ నామమును కీర్తించు జనులకు యజ్ఞములో విఘ్నములు దూరమగును. నీకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో సెవెంత్ చాప్టర్ 47th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం మూడవ స్కంధం. ఫస్ట్ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం రెండు స్కంధాలు పూర్తి చేసుకున్నాం. సృష్టి కార్యం ఎలా ఉంటుంది? సృష్టి ఎలా జరుగుతుంది? తరువాత అంతక్రితం పాండవుల యొక్క ప్రస్థానము. ఈ విషయాలని కూడా మనం తెలుసుకున్నాం ముందు ఎపిసోడ్లో. ముఖ్యంగా క్రితటి రెండవ ఎపిసోడ్లో చివరి మూడు. చాలా ముఖ్యంగా మనందరం కూడా విని అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ సృష్టి గురించి బ్రహ్మ చతుర్ముఖుడు నారదుడికి చెప్పిన విషయాన్ని మనకు శౌనక మహాముని ద్వారా పరీక్షిత్తు తెలుసుకున్నాడు అదే విషయం మనం కూడా తెలుసుకుంటున్నాం. పాండవుల యెడ పక్షపాతముతో దౌత్యమును నెరిపిన యముని అంశచే జన్మించిన విదురుడు తనది అనేటి బుద్ధితో ధృతరాష్ట్రుని భవనములో కొంతకాలం ఉండెను. ఐశ్వర్య పరిపూర్ణమగు ఆ భవనమును వీడి వనమునకు చేరి మైత్రేయుని కలిసి ప్రశ్నించిన ప్రశ్నకు అతడు చెప్పిన సమాధానమును ఎరింగించెదను. సో విదురుడు మైత్రేయుని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనం ప్రప్రథమ అధ్యాయంలో తృతీయ స్కంధంలో చదువుతున్నాం. పరీక్షిత్తు విదురుల మైత్రేయుల సంవాదం గూర్చి ప్రశ్నింపగా దానిని ఎరుంగించుటకు శ్రీ సుఖయోగి ఇట్లు ప్రారంభించినాడు.

ధృతరాష్ట్రుడు తన తమ్ముడగు పాండురాజు కుమారులగు పాండవులు తండ్రి లేని వారై వారిని ఎరింగియు దయలేక లక్క ఇంటిలో ప్రవేశింపచేసి ఆ భవనమును దహింపచేసెను. ధర్మ విషయమగు జ్ఞాన నేత్రము లేనివాడై ఆ ధృతరాష్ట్రుడు అధర్మముచే నీచులగు తన కుమారులను ఆదరించి పోషించెను. తమోగుణ ప్రధానుడగు ఆ రాజు సభలో నిలిచి గుండెలపై బడి అలదుకొనిన అనురాగం కరుగునట్లు కన్నీరు కార్చిన ద్రౌపదిని చూచి తన కుమారుల దుష్ట వర్తనమును వారించలేకపోయెను. ద్యూతములో అధర్మముగా సత్యమునే ఆశ్రయించి ఉండు. ధర్మరాజు రాజ్యమును అపహరింపచేసినాడు. ప్రతిజ్ఞను అనుసరించి వనవాసము చేసి మరల వచ్చి రాజ్యము ఇమ్మని ప్రార్థించిన ధర్మరాజునకు గ్రుడ్డి అయి అర్ధించినను రాజ్యమును వసంగినాడు కాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారమంపగా జగద్గురువు భగవానుడు శ్రీకృష్ణుడు పలికిన అమృత పలుకులు విని ధృతరాష్ట్రుడు గౌరవింపలేకపోయెను. ఇట్టి అకృత్యములు ధృతరాష్ట్రుడు చేయుచుండుట చూచి సహింపలేక విదురుడు ఆ ధృతరాష్ట్ర భవనము నుండి బయలు వెడలి అరణ్యమునకు వెడలెను. అంతే కాదు. ఒకనాడు ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి తాను ఏమి చేయవలెనో చెప్పమని అడిగెను. అప్పుడు ఆ విదురుడు అతనికి చక్కని ఆలోచన చెప్పెను. దానిని నీతి శాస్త్రజ్ఞులు విదురు నీతి అని ఆదరించుదురు. విదురుడు ధృతరాష్ట్రునితో ఇట్లు చెప్పినాడు. యుధిష్ఠిరుడు అజాత శత్రువు మీరు చేసిన తప్పులు సహింపరానివైనను సమర్థులై ఉండినను వారు సహించినారు. కావున నీవు ఆ పాండవులకు వారి వంతు రాజ్యమును వసంగుము. అర్జునుడు మొదలగు సోదరులతో కూడిన భీముడు అజాత శత్రువు వద్ద వినయముచే అణిగి ఉండి ఏమియు చేయలేకపోవుచున్నాడు. అతనిని చూచి నీవు ఎప్పుడు భయపడుచునే ఉందువు. పరిపూర్ణ జ్ఞాన శక్త్యాదులు గల శ్రీకృష్ణుడు పాండవులను పరిగ్రహించినాడు. ఆ భగవానుడు వేదవేత్తలగు బ్రాహ్మణులచే బ్రహ్మజ్ఞాన సంపన్నులచే పరదైవముగా ఆరాధింపబడువాడు.

అతడు ఎవరి వద్ద ఉన్నా వారికి విజయము ఐశ్వర్యము కలిగి తీరును. సకల రాజులను జయించి అతడు యాదవులతో కూడిన తన పట్టణమున ఉన్నాడు. అట్టి భగవానుని ద్వేషించుచున్న దుర్యోధనుని నీవు కుమారుడు అను ప్రేమతో ఇంటిలో పెట్టి పోషించుచున్నావు. ఈతడు దోషముల ప్రోగు. అతనికి కృష్ణుని యందు ద్వేషము. నీ కులము కుశలముగా ఉండవలెనని తలంచినచో ఆ దుర్యోధని వెంటనే రాజ్యము నుండి వెడలగొట్టుము. ఇట్టు తన ఆలోచనను అడిగిన ధృతరాష్ట్రునకు విదురుడు సలహా చెప్పుచుండగా. తన సోదరుడగు దుశ్శాసునితో, శకునితో, కర్ణునితో కూడిన దుర్యోధనుడు వినినాడు. వడలంతయు కోపముతో కంపించినది. లోకులందరిచే ఆదరింపదగిన శీలము గల విదురుని ఆ దుర్యోధనుడు. ధిక్కరించి ఇట్లు పలికినాడు. ఈ విదురుడు దాసీ పుత్రుడు. ఇతని రాజసభలో సమాలోచనమునకు ఎవరు పిలిచిరి? మేము పెట్టిన పిండము తిని బ్రతికేడి వాడా అతడు? పెంచి పెద్ద చేసిన మాకు ఈతడు వ్యతిరేకమై శత్రువులకు అనుకూలుడై ఉన్నాడు. ఇతడు స్మశానం వంటివాడు. ఇతని ఇంట ఉండనీయరాదు. వెంటనే రాష్ట్రము నుండి బయటకి పంపుడు. ఇట్లు దుర్యోధనుడు పలకగానే చెవులలో ములుకుల వలె బాధింపదగిన మాటలు విన్నను విదురుడు మనసులో ఏమియు బాధపడలేదు. వెంటనే నవ్వుచు లేచి నిలచి తన చేతిలో ఉన్న విల్లును ఆ గుమ్మములో ఉంచి తీర్థయాత్రను తిరిగి నాకు ధనస్సు ఎందుకని వదిలి ఓహో. భగవన్ మాయ శక్తి ఎంత శక్తి కలది అని దానిని గౌరవించుచు ఆ హస్తినాపురం నుండి అతడు వెలికి వచ్చినాడు. భగవాన్ యొక్క మూర్తులను ప్రతిష్టించిన భూమండలమందున దివ్య దేశములను ఏగినాడు. ఆ ఆలయములోనున్న అర్చామూర్తులను సేవించినాడు. పుణ్యములకు పట్టణములను, ఉపవనములను, పర్వతములను, నిర్మలముగు జలములు గల నదులను, సరస్సులను, భగవత్ సంబంధము గల వాటన్నింటినీ శక్తితో సేవించినాడు. ఈ విధంగా సంచరించుచు దుష్టములు కాని ఆహార పదార్థములతో శరీరమును పోషించుకొనుచు శరీర సంస్కారము లేనివాడై ఆచ్ఛాదన లేని నేలపై పరుండుచు

అవధూత వలె వల్కలమును అజినమును ధరించి భగవంతునకు ప్రీతి కలిగించెడి వ్రతములను చేయుచు దేశమును సంచరించుచుండెను. ఇట్లు భరత వర్షమంతయు తిరుగుచు ఒకనాడు ప్రభాస తీర్థమును చేరినాడు. ఆ కాలమునందే ధర్మరాజు రాజ్యమున పట్టాభిషిక్తుడై రాజ్యమును పరిపాలించుచుండెను. అతడు ఎట్లు తిరుగుచుండగానే ప్రభాస తీర్థం వద్ద వెదురు పొదలు ఒకదానితో ఒకటి రాసుకొని కాలిపోయినట్లు కౌరవులు అన్యోన్యము కలహించి మరణించరని వినినాడు. ఆ ప్రభాస తీర్థము నుండి సరస్వతి నది తీరముకేగెను. ఆ సరస్వతి నది తీరమందు పదునొక్కటి తీర్థములను సేవించెను. ఋషుల చేత, దేవతల చేత నిర్మింపబడిన భగవదాలయమును దర్శించి. అతడనున్న భగవాను దర్శించుటచే కృష్ణునే స్మరించుచుండెను. ఇట్లు దేశాడనము చేయుచు సురాష్ట్ర దేశమును, సౌవీర దేశమును, మత్స్య దేశమును, కూరు, జాంగల దేశములను దాటి యమునా తీరమును చేరినాడు. అతన మహా భాగవతుడగు ఉద్ధవుని దర్శించినాడు. ఉద్ధవుడు వాసుదేవుని అనుచరుడు. శ్యామ దమాది గుణములతో కూడినవాడు. బృహస్పతి నుండి నీతి శాస్త్రమును అభ్యసించినవాడు. ఆ ఉద్ధవుని దర్శించి ప్రేమతో గాఢముగా విదురుడు ఆలింగనము చేసుకున్నాడు. తన బంధువుల కుశలమును ప్రశ్నించినాడు. బ్రహ్మ ప్రార్థనచే ఈ లోకములో అవతరించిన పురాణ పురుషులు బలరామకృష్ణులు. వారు లోకమునకు క్షేమము కలిగించి వాసుదేవుని ఇంట కుశలముగా ఉన్నారా? వధాన్యుడును ఎవరు కోరిన దానిని వారికి వసంగి తృప్తి కలిగించువాడును ప్రద్యుమ్నుడు కుశలముగా ఉన్నాడా? రుక్మిణీ దేవి బ్రాహ్మణులను సేవించి వెనకటి జన్మలో మన్మధునిగా ఉన్న వానిని భగవానుని వలన తన కుమారుడిగా పొందినది అతడే ప్రద్యుమ్నుడు. సాత్వతులకు, భోజులకు, దాసార్హులకు, వృష్ణి వంశమునకు అధిపత్య ఉగ్రసేనుడు సుఖముగా ఉన్నాడా? పుండరీకాక్షుడు. రఘు భగవానుడు తన రాజ్యమునకు ఆశపడక తన తాతగారగు ఉగ్రశనునకు పట్టాభిషేకం చేసినాడు. రధికులలో శ్రేష్టుడగు శ్రీకృష్ణునితో సమానుడగు శ్రీకృష్ణుని కుమారుడగు సాంబుడు కుశలమా? జాంబవతీ దేవి వెనకటి జన్మలో పార్వతీ కుమారుడైన కుమారస్వామిని భగవాన్ అనుగ్రహముచే కుమారునిగా పొందినది. ఆ కుమారుడే సాంబుడు. సాత్యకి అర్జునుని నుండి ధనుర్వేదము నేర్చుకొనినాడు. శ్రీకృష్ణ సేవయే పరమార్థమని భావించినవాడు.

యతులు కూడా పొందలేని ఉత్తమ స్థితిని పొందినట్టి సాత్వికి కుశలముగా ఉన్నాడా? తత్వజ్ఞాన సంపన్నుడు, పాపరహితుడు, భగవత్ చరణాగతుడు, అక్రూరుడు. అతడు కుశలముగా ఉన్నాడా? ఒకనాడు మధుర నుండి నంద వ్రజమునకు వెళ్ళ అచ్చట భూమిపై శ్రీకృష్ణ పాద చిహ్నములను చూచి ఒడలు మరిచి నేలపడి పొర్లాడిన మహా భక్తుడు అక్రూరుడు. దేవకుడు అను భోజరాజు కుమార్తె అగు దేవకికి శ్రీ మహావిష్ణువే కుమారుడుగా జన్మించినాడు. వేదవేద్యుడగు పరమపురుషుని తన గర్భమున దాల్చిన ఆ దేవకి కుశలమా? సాత్వికుల కోరికలను నెరవేర్చగల అనిరుద్ధుడు కుశలముగా ఉన్నాడు కదా? ఆ అనిరుద్ధుడే శాస్త్ర ప్రమాణములచే ఎరుంగబడు. భగవానుని నాలుగవ అంశమని చెప్పుదురు. ఇంకా భగవానుని ఏకాంత భక్తితో సేవించెడి యాదవులందరూ కుశలమా? తమకు ఆత్మ దైవముగా శ్రీ కృష్ణ భగవానుని ఏకాంత భక్తితో అనుసరించిన హృదీకుడు, చారుధేష్ణుడు, గదుడు మొదలగు యాదవులందరూ కుశలమే కదా? ఇక తన రెండు బాహువుల వంటి వారైన కృష్ణార్జునులతో కూడి ధర్మరాజు వేదశాస్త్రమును అనుసరించి వరణాసరణ ధర్మమును కాపాడుచున్నాడా? ఆ ధర్మరాజు సభలో అర్జునుని సేవించుచుండగా ఆనాడు దుర్యోధనునికి మనోభేదన కలిగించిన సామ్రాజ్య లక్ష్మిని అనుభవించుచున్నాడా? తన విషయంలో కౌరవులు చేసిన అపరాధమును సహింపలేక పగపెట్టుకొనిన భీముడు దీర్ఘ క్రోధమును వదిలినాడా? ఆనాడు యుద్ధములో భీముడు గద పట్టుకొని విచిత్రముగా సంచరించుచున్నప్పుడు అతని నడకను భూమి కూడా సహింపలేకపోయెను. సేనానుల మధ్య శత్రువులందరినీ అంతమొందించిన అర్జునుడు సుఖముగా ఉన్నాడా? ఆ అర్జునుని బాణములతో ఆచ్ఛాదింపబడిన దేహము కలిగిన ఆనాడు మాయా కిరాతకుడుగా వచ్చిన రుద్రుడు అతని పరాక్రమమునకు సంతుష్టి నందినాడు కదా? కుంతీ పుత్రులు కన్నులను రెప్పలు కాపాడునట్లు కాపాడుచుండగా కుంతిచే పెంచబడిన నకుల సహదేవులు యుద్ధములో తమ రాజ్యమును తాము పొంది సుఖముగా ఉన్నారా? ఆనాడు పాండురావు చనిపోయినప్పుడు భర్త లేనిదే బ్రతుకుట దుర్భరమని భావించిన కుంతి తన పిల్లల కొరకు జీవించినది. పాండురాజు నాలుగు దిక్కులను తన చేత దాల్చిన ధనస్సు మాత్రమే తోడుగా జయింపగల మహావీరుడు. ఆ ధృతరాష్ట్రుని గూర్చియే నా మనసు బాధపడుచున్నది.

అంతటి వీరుడగు పాండురాజు చనిపోయిన తరువాత తండ్రి లేని పాండవులకు ద్రోహము చేసి నరకమును పొందినాడు. తన కొడుకుల మాటలను ఎదిరింపలేక నన్ను కూడా పట్టణం నుండి వెలికి పంపినాడు ఆ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర పుత్రులు నేను రాజ్యము నుండి విడలుటకు ప్రేరణ కలిగించుట నా భాగ్యం. తన గొప్పతనము మరుగుపరుచుకొని మనుష్యుని వలె నటించుచు చూచు వారి మనస్సులను భ్రమింపచేయు శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం వలన నాకు ఈ విశ్వమంతయు ఆయన విభూతిగా ఆనందం కలిగించుచున్నది. అందుచే నేను ఆనందముతో ఒకరి కంటపడకుండా జీవించుచున్నాను. తనను ఆశ్రయించిన పాండవుల బాధపడుచున్నను అభిజన విద్యా విత్తములు తముకు కలవని గర్వించి. భూమిని కదల్చి వేయుచున్న కౌరవులను వెంటనే అంతమంతింపకుండా భగవానుడు కొంత కాలము ఉపేక్షించినాడు. వెంటనే వారిని అంతమొందించినచో చెడు నడత నడిచెడి రాజులందరూ అంతమొందిరని వారందరూ ఏకమగు వరకు నిరీక్షించినాడు. కర్మాధీనముకు జన్మలేని వాడు భగవానుడు. అతడు స్వేచ్ఛనే అప్రాకృతముకు దివ్య మంగళ విగ్రహమును ధరించి జన్మించుట దుర్మార్గులను శిక్షించుటకే. జన్మలకు కారణమైన కర్మ సంబంధము లేని భగవానుడు కొన్ని కర్మలను ఆచరించుట తన లీలలను లోకమున చెప్పుకొని తరించుటకే ఉద్ధవా. తననే ఉపాయముగా ప్రాప్యముగా నమ్మిన లోకులను తన శాసనములో నిలిచిన రాజులను కాపాడుటకై యదువంశంలో జన్మించిన పవిత్రముకు జన్మ కలిగిన భగవాను వృత్తాంతమును వర్ణింపుము. తనివి ధీరా నాకు వినిపింపుము అని విదురుడు ఉద్ధవుని ప్రార్థించాడు. ఉద్ధవుడు మరి విదురుడికి శ్రీకృష్ణ వృత్తాంతం ఎలా చెప్పాడు ఏం చెప్పాడో మనం తర్వాత పాడ్కాస్ట్ లో విందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Inspiration, salutations to the Guru. May we be pleased and our desires be fulfilled. Those who are wandering, praising good deeds, are praised by the gods. May we be protected from obstacles in our yajnas (sacrifices). Salutations to you. Oh, Lord of Yajnas, we firmly seek your darshan (sight) We are requesting. The good sacrifice we began has fallen. Please have mercy. For the people who praise your name, obstacles will be removed in the Yagnya. Namaskar. Fourth Canto, Seventh Chapter, 47th Prayer. Devotees of God, Srimad Bhagavata Tattva Deepika, Third Canto, Third Canto. Welcome to the first podcast. So far, we have completed two scandals. How is the creation work? How is creation happening? The Pandavas' journey to the afterlife. We have learned about these things in the previous episode. Especially the last three episodes of the second one. Very importantly, what all of us need to listen to and understand is about this creation. What Brahma Chaturmukha told Narada, that is what we have through Shaunaka Mahamuni, Parikshit He found out, and so are we. Vidura, born from the part of Yama who conducted diplomacy with partiality towards the Pandavas, with the intellect that it was his, stayed in Dhritarashtra's palace for some time. Leaving that house, which is full of wealth, I will go to the forest and meet Maitreya and make him recite the answer he gave to the question he asked. So, in response to the question asked by Vidur to Maitreya, we are reading in the first chapter, in the third book. When Parikshit asked about the conversation between Vidura and Maitreya, Sri Sukha Yogi started this to explain it.

Dhritarashtra, his brother Panduraju's sons, the Pandavas, being without a father, were made to enter the lac house without any mercy, and that building was burned down. Dharmavastu, without the eye of knowledge, that Dhritarashtra, by unrighteousness, favored and nurtured his sons who were vile. That king, who was dominated by the quality of darkness, stood in the assembly, and seeing Draupadi, who had cried, as if her affection had melted away, having fallen on her chest, he could not prevent his sons' wicked behavior. In betrayal, rely on truth as unrighteousness. Dharmaraju has usurped the kingdom. Following the vow, he went into exile, and when he came back and prayed to Dharmaraja to give him the kingdom, even though he blinded himself, he did not grant the kingdom. Dharmaraju, upon being entrusted with Sri Krishna's royal responsibilities, the Jagadguru Bhagavan Sri Krishna, upon hearing the nectarous words spoken, Dhritarashtra could not bear to be disrespectful. Seeing Dhritarashtra committing such atrocities, Vidura, unable to bear it, left Dhritarashtra's palace and went to the forest. It's not just that. Once upon a time, there was Dhritarashtra He called Vidura and asked him to tell him what he should do. Then Vidura gave him a good idea. Ethicists call it the Vidura Dharma. Vidur said this to Dhritarashtra. Yudhishthira, the invincible enemy, even though you have unbearable mistakes, they have tolerated it. Therefore, you should grant the Pandavas their due kingdom. Arjuna and Bhima, along with their brothers, are unable to do anything by being subdued by Ajatashatru with humility. Seeing him, you are always afraid. Lord Krishna, who possessed complete knowledge and power, accepted the Pandavas. That Lord is worshipped as the Supreme God by the Brahmins, who are the knowers of the Vedas, and by those who are endowed with divine knowledge.

He will surely bring victory and prosperity to whomever he is with. Having conquered all the kings, he is in his city with the Yadavas. You are keeping Duryodhana, who hates such a God, in your house with love, considering him your son. This is a fault of the swimmer. He is jealous of Krishna. If you think that your caste should be well-behaved, then immediately expel that Duryodhana from the kingdom. Thus, while Vidura was advising Dhritarashtra, who had asked for his thoughts. Duryodhana, along with his brothers Dussasana, Shakuni, and Karna, heard this. The vines creaked with anger. Duryodhana, who is of the nature of Vidura, who is admired by all the people. He spoke thus, defiantly. This Vidura was the son of a maidservant. Who summoned him to a meeting in his royal court? Is he the one who lived by eating the offering we made? He who raised us and made us big, is against us and favors the enemies. He's like a graveyard. He's not allowed to stay at his in-laws' house. Immediately send him out of the state. Thus, as soon as Duryodhana spoke Even though Vidura felt pain in his heart hearing words that were like a thorn in his ear, he did not feel any pain. Immediately laughing, he stood up and placed the bow in his hand in that doorway and said, "Then why did you leave me with the bow?" Oh. Bhagavan, considering how powerful the power of Maya is, he emerged from Hastinapuram. He has traveled across the earth, a divine land, where the idols of the Lord are installed. He served the deities in the temple. He served with strength all the cities, gardens, mountains, pure waters, rivers, and lakes that have water, and all that is related to God. In this way, wandering, nourishing the body with non-vicious food, being without body culture, lying on the bare ground

Like an Avadhuta, wearing a loincloth and a robe, and performing vows that bring pleasure to God, he was wandering the country. Thus, wandering throughout the Bharata forest, one day he reached the Prabhasa Tirtha. At that time, Dharmaraja was crowned king and was ruling the kingdom. As he was wandering, he heard that the Kauravas, having clung to each other like burnt bamboo shoots, would not die in conflict, even though they were at the Prabhasa Tirtha. From the Prabhas Tirtha, it went to the banks of the Saraswati River. She bathed in the banks of Saraswati river and served the 11 sacred water bodies. Visit the Bhagavada temple built by sages and gods. He was remembering Krishna, by seeing the Lord who was there. Thus, having conquered, he crossed the Surastra country, the Sauvira country, the Matsya country, the Kuru, and the Jangala countries, and reached the banks of the Yamuna. He had a vision of the great Bhagavata-deva, Uddhava. Uddhava is a disciple of Vasudeva. Shyama is endowed with the qualities of dāma and dāma. He was the one who practiced ethics from Brihaspati. Having seen that Uddhava, with love Vidur embraced him tightly. He inquired about his relatives' well-being. The ancient men who incarnated in this world through Brahma's prayer are Balarama Krishna. Are they safe in the world and well-pleased in Vasudeva's house? Is Pradyumna well? Is Vasangi satisfying those who asked for it? Rukmini Devi served the Brahmins and obtained Manmadhan, who was in her previous birth, as her son from Bhagavan, that is Pradyumna. Is Ugrasena, the ruler of the Sātvatas, Bhojas, Dāsarhas, and the Vrishni dynasty, living happily? Pundarikaksha. Raghu Bhagavan, without desiring his kingdom, coronated his grandfather, Ugrasena. Is Sambudu, the son of Srikrishna, who is equal to Srikrishna, who is the best among the Radhikas, well? Jambavati Devi in her previous birth had obtained Kumaraswamy, the son of Parvati, as a son by the grace of Bhagavan. The son is Sambhu. Satyaki learned archery from Arjuna. Serving Lord Krishna is the ultimate goal The one who believed.

Is he in a state of well-being, even though he is in a state that even ascetics cannot attain, and has attained the best state? The one who is full of knowledge of the essence, the one without sin, the one who is devoted to the feet of God, and the one who is without malice. Is he alright? Once upon a time, Akrura, a great devotee, forgot his body and rolled on the ground, seeing the footprints of Sri Krishna on the earth while going from Madhura to Nanda Vrajam. Lord Mahavishnu himself was born as a son to Devaki, the daughter of King Devaka of Devaka. Is Devaki, who carried the Supreme Being, the Veda-performing one, in her womb, alright? Aniruddha, who can fulfill the desires of the virtuous, is doing well, isn't he? That Aniruddha is known by the scriptures. It is said to be the fourth aspect of God. And are all the Yadavas who serve the Lord with solitary devotion well? Are all the Yadavas, including Hridikudu, Charudheshnudu, Gadudu, and others who followed Sri Krishna Bhagavan with solitary devotion as their own deity, well-being? Now, along with Krishna and Arjuna, who are like his two arms, is Dharmaraja following the Vedas and upholding the Varanasara Dharma? In the court of Dharmaraja, Arjuna While serving, did he experience the mental distress that caused Duryodhana that day, the empire's Lakshmi? In his own matter, Bheema, unable to bear the crime committed by the Kauravas, took revenge, even though he had long since lost his anger? In that day, in the war, when Bhima was wandering strangely holding the mace, even the earth could not bear his gait. Is Arjuna, who annihilated all the enemies among the soldiers, happy? That day, Rudra, who came as a Maya Kiratakudu with a body covered with Arjuna's arrows, was pleased with his valor, wasn't he? While the sons of Kunti were protecting their eyes like eyelids, were Nakula and Sahadeva, raised by Kunti, in the war, having obtained their kingdom, and living happily? When Pandurao died that day, Kunti, thinking that life without a husband was unbearable, lived for her children. Panduraju is a great warrior who can only be accompanied by a bow and arrows in all four directions. My heart is pained for Dhritarashtra.

After the death of such a great warrior, Panduraju, he betrayed the fatherless Pandavas and attained hell. Unable to withstand his sons' words, that Dhritarashtra also sent me out of the city. It is my fortune that I am inspired to separate from the kingdom of Dhritarashtra's sons. By concealing his greatness and acting like a human, by deceiving their minds, by the grace of Sri Krishna Bhagavan, this entire universe is giving me joy as his manifestation. Therefore, I am living with joy, without being seen by anyone. Even though the Pandavas, who had sought refuge in him, were suffering, he was proud that he did not have the seeds of knowledge of his own. The Lord waited some time without immediately destroying the Kauravas who were turning the earth. If they were immediately killed, all the kings who walked in wicked conduct would be destroyed, and he waited until they were all united. The Lord is the unborn, unmanifested birth of the material world. He is born with the divine auspicious idol of freedom to punish the wicked. Janmakalu The God who is not related to cause and effect performs some actions, tells his plays in the world, and is saved. Describe the story of the Lord, who was born in the lineage of the sacred one, who was born to protect the kings who believed in him as a means and as a possession, and who was established in his kingdom. Vidura requested Uddhava to make him hear the story. Uddhava and Vidura, how did Srikrishna tell the story? What did he tell? We will listen to it in the next podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus