అసంగత్వ వైభవము - మాయా నిరూపణ మరియు వైరాగ్యము

The Adverse Power of Material Attachment Explained

bhagavatam

శ్రీమద్భాగవతం మూడవ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో మాయా స్వరూపాన్ని మరియు వైరాగ్యము యొక్క ఉన్నత మహిమను విశదంగా వివరించడం జరిగింది. మహర్షి మైత్రేయుల ద్వారా తెలియజేయబడిన ఈ తత్త్వం, జీవుడు దేహము, ఇంద్రియములు మరియు సాంసారిక బంధముల వలన మాయలో ఎట్లు చిక్కుకుంటాడో స్పష్టంగా చూపిస్తుంది. కపిల మహర్షి బోధించిన జ్ఞానము ఆధారంగా, నిజమైన వైరాగ్యమే సంసార బంధముల నుండి విముక్తి కలిగించే మార్గమని ఈ ఎపిసోడ్ స్పష్టపరుస్తుంది. భగవత్ శరణాగతి మరియు సత్సంగము ద్వారా మాత్రమే మాయను అధిగమించవచ్చునని శ్రోతలకు హృదయపూర్వకంగా స్మరింపజేయడం జరిగింది.

In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore Canto 3's illuminating teachings on the nature of Maya and the liberating power of detachment. The great sage Maitreya reveals how material illusion binds the soul through false identification with the body, senses, and worldly relationships. Through the compassionate wisdom of Kapila Muni and the dialogues preserved in this sacred canto, listeners are guided toward understanding how true vairagya — renunciation — alone can sever the chains of samsara. Surrender to the Lord and the company of pure devotees are presented as the most reliable paths to breaking free from Maya's powerful grip.

← Prev Next →
The Adverse Power of Material Attachment Explained bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః యస్మిన్ నిదం యతశ్చేదం తిష్టత్యప్యేతి జాయతే మృన్మయేశ్వివమృజ్జాతిహి తస్మైతే బ్రహ్మణే నమః ఈ జగత్తు పరబ్రహ్మ నుండి పుట్టి పరబ్రహ్మ యందే మనుగడను సాగించి పరబ్రహ్మ యందే విలీనమగును. మట్టితో చేసిన ఘటాదుల యందు మట్టి అనుస్యూతముగా నుండును. అదే విధముగా ఈ జగత్తునందు పరబ్రహ్మ అనుస్యూతమై ఉన్నది. అట్టి పరబ్రహ్మము నీవే నీకు నమస్కారము. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, ట్వంటీ సెకండ్ ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధము. 43వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిల గీతలో మనం జీవాత్మ పరమాత్మ విషయాలను చర్చించుకుంటూ జీవుడి యొక్క గమనం ఎలా ఉంటుంది తెలుసుకుంటూ జీవుడు ప్రకృతిలోకి అడుగు పెట్టిన తర్వాత స్త్రీ ఆకర్షణతో ఎలా తన యొక్క జీవితంలో మార్పులు జరుగుతాయి. తర్వాత పాప కర్మలతో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి? ఇవన్నీ మనం చర్చించుకుంటూ పుణ్య కర్మలు చేసేటువంటి వారు, ధర్మాచరణ చేసేటువంటి వాళ్ళ యొక్క మార్గం ఎలా ఉంటుంది? తర్వాత అనే విషయాన్ని మనం కొంత భాగం చర్చించుకుంటున్నాం. దీనిలో ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. భగవంతుని ఉపాసించెడి వారు కొందరుందురు. ఇంద్రియములను జయించి విషయానుభవునకై ఆరాటపడరు. కామములను నెరవేర్చుకొనుటకు ధనమును ఆర్జించుట కొరకు తమ ధర్మములను ఆచరింపరు. సంఘము లేని వారై తాము చేయు కర్మలన్నింటికీ భగవంతుని కనే చెందినవిగా భగవానుడే తమ చేత వాని ప్రీతి కొరకు చేయించుకొనుచున్నాడని భావించి చేయుచుందురు. అట్లు తమ ధర్మములు ఆచరించుటచే వారి మనసున రాగము ద్వేషము లేకుండా పోవును. పరిశుద్ధమగు మనసు గలవారగుదురు. ఇట్టి వారిని నివృత్తి ధర్మము పాలించువారు అందురు. వారు ఎల్లవేళలా భగవత్ గుణములను వినుచు పరమాత్మ ప్రీతి కొరకు చేయుచున్నానని త్యాగ బుద్ధితో చేయుచుందురు.

వారి మనసు పరిశుద్ధమైన భగవంతుని యందే ఆసక్తమై ఉండును. వారికి దేహమే నేను అనకనుడి అనుకొనుడి మమకారం ఉండదు. అట్టి శరీరమును వీడిన తరువాత సూర్యమండలము ద్వారా అర్చిరాది మార్గమున ఏగుదురు. అగ్ని, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణము, సంవత్సరము, వాయువు, సూర్యుడు, చంద్రుడు, మెరుపు, వరుణుడు, ఇంద్రుడు, బ్రహ్మ అను వారుండెడి ఆయా లోకముల గుండా పయనించి ప్రకృతి మండలమును దాటి పరమ పురుషుడగు భగవానుని చేరుదురు. ఆ పరమ పురుషుని సంకల్పం వలనే జీవులకు బంధమోక్షములు కలుగుచుండును. ఈ విశ్వమునకు సృష్టి స్థితి సంహారములు చేయువాడు అతడే. అతడు సర్వశక్తిమంతుడు. తనను చేరిన పురుషుని తన సంకల్పముచే అతడు వెనకకు వెళ్ళనీయక వేరొక కోరిక కలగనీయక తన అనుభవమునే ప్రసాదించుచు తన వద్దనే ఉంచుకొనును. కోరికలతో పుణ్య కార్యములు చేయువారు ప్రవృత్తి ధర్మనిష్ఠులు. వారు ధూమాది మార్గమున పైలోకములు చేరి మరల వెనకకు వస్తురు. భగవద్భక్తితో ఏ కోరిక కోరక భగవానుని ఆరాధించువారు నివృత్తి ధర్మనిష్టులు. వీరు అచ్చిరాది మార్గమున పయనించి మరల జన్మింపరు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసినది మొదలు సంహారం వరకు నూరు సంవత్సరముల కాలపరిమితి ఆయువు కలిగి ఉండును. ఏవది సంవత్సరము కాలము పరార్థము అందురు. 100 సంవత్సరములు రెండు పరార్థములు. ఈ రెండు పరార్థములు కాలము పూర్తి కాగానే చతుర్ముఖ బ్రహ్మ ప్రళయమునందును. యోగాభ్యాసముచే ఆత్మ స్వరూపమును ధ్యానించువారు యోగులు అనబడుదురు. వారు బ్రహ్మలోకమును చేరి బ్రహ్మతో పాటు అచటనే ఉండి అప్పుడు పరమాత్మ సన్నిధి చేరుదురు. చనిపోయిన వారు వెళ్ళెడి దారులు పితృయానము, యోగియానము, దేవయానము అని మూడు విధములుగా ఉండును. కోరికలతో కర్మలు చేయువారు పితృయానములో వెళ్లి ఆ పుణ్యమునకు ఫలమగు ఆయా భోగములు అనుభవించి ఆ ఫలము పూర్తి కాగానే తిరిగి భూలోకమునకు వస్తురు. యోగాభ్యాసముచే పరమాత్మను ధ్యానించువారు యోగయానములో అంటే యోగియానములో ముందు బ్రహ్మలోకమునకు వెళ్లి

ప్రళయం వరకు అచడనే ఉండి వాని ఆయుర్దాయము పూర్తి కాగానే బ్రహ్మతో పాటే పరమాత్మను చేరుదురు. భక్తితో నిష్కామ కర్మతో భగవానును ఉపాసించువారు దేవయానములో పయనించి విరజను దాటి విష్ణులోకమును పొంది వెనకకు మరలి రాక ఉందురు. భూమి మొదలు ఆకాశం వరకు పంచమహాభూతములు, మనస్సు, ఇంద్రియములు, శబ్దాది విషయములు, భూతాది అనడి తామసాహంకారము దానిచే ఆవరింపబడి ఉన్న బ్రహ్మాండమును సంహరింపవలెనని భగవానునకు సంకల్పము కలగగానే సత్వాది గుణములు కలిగిన స్థూల చేతనా చేతనములతో కూడి ఉన్న పరమాత్మ అవ్యాకృతమున ప్రవేశించును. అనగా నామ రూపములతో విభజించుటకు వీలు కాని సూక్ష్మ చేతనా చేతన విశిష్టముగు దశను పొందును. అప్పుడు ఇంద్రాది దేవతలందరి కంటే ఉత్కృష్టుడగు బ్రహ్మ రెండు పరార్థములుగా ఉన్న తన ఆయుకాలమును అనుభవించి పరమ పురుషుని చేరును. యోగాభ్యాసము చేసి భగవానుని ధ్యానించి హిరణ్యగర్భుడు అనేటి చతుర్ముఖ బ్రహ్మను చేరిన వారు కూడా బ్రహ్మతో పాటు బ్రహ్మలోకమున ప్రాణవాయువును ఇంద్రియములను మనస్సును జయించిన వారై పరబ్రహ్మము కంటే ఇతరములగు అణిమాది ఐశ్వర్యములను కూడా కోరిక, దేహాత్మాభిమానము, స్వతంత్ర బుద్ధి లేని వారై బ్రహ్మతో పాటు ఆ పరమ పురుషుని చేరుదురు. ఇచ్చట యోగాభ్యాసము చేసి భక్తి యోగము పరిపూర్ణముగా ఫలింపని వారు హిరణ్య గర్భుని లోకమున పొంది లోకమును పొంది అక్కడ భగవత్ ఉపాసనము చేసి బ్రహ్మ ఉన్నంత కాలము ఆ బ్రహ్మ లోకమున ఉండి ప్రళయములో ఆ బ్రహ్మతో పాటు పరమాత్మను చేరుదురు. ఈ లోకంలో ఉండగానే కొందరు భాగ్యశాలులు పరిపూర్ణమగు భక్తి యోగమును పొందుదురు. వారు ఈ లోకముననే సంతతము ఎడతెగక ప్రీతితో భగవాన్ని స్మరించి దర్శించుచుందురు. అందుచే అమ్మా సకల జీవకోటి యొక్క హృదయ పద్మములో వసించుచున్న భగవానుని సర్వవిధ సంబంధములతో శరణముగా స్వీకరింపుము. అతని వైభవమును నీకు ఇంతవరకు చెప్పి ఉండిని సర్వలోక శరణ్యుడగు భగవానుడే శరణమని విశ్వసించని వారికి భక్తి యోగము పూర్ణముగా సిద్ధించకుండా అడ్డగించునని దేహాత్మాభిమానము ఆత్మ స్వతంత్రమైన అభిమానము. యోగాభ్యాసు ఆదులచే హిరణ్యగర్భుడు ఉండెడి బ్రహ్మలోకమును చేరిన వారు కూడా అచట భగవానుని శరణు పొంది ప్రతిబంధకములు తొలగిన తరువాత భగవానుని సన్నిధి చేరుదురు.

స్థావర జంగముల యొక్క సృష్టికి కారణమైనవాడు చతుర్ముఖ బ్రహ్మ. అతడు సమిష్టి పురుషుడు, వేద గర్భుడు. అతడు కూడా దేహాత్మాభిమానము, స్వతంత్రాభిమానము తొలగకపోవుటచే ప్రళయములో లయమై ప్రళయాంతకమందు మరల జన్మించును. సనత్ కుమారుడు మొదలగు యోగీశ్వరులతో మరీచ్ఛాదులకు ఋషులతో యోగ ప్రవర్తకులగు సిద్దులతో బ్రహ్మ కూడా బ్రహ్మ ఆత్మగాలిని స్వతంత్ర వస్తువులుండునని భావించు వాడగుటచే శరీరాత్మాభిమానము స్వతంత్రాభిమానము గలవాడగును. అందుచే అతనికి భేద దృష్టి తొలగదు, అభిమానం వదలదు. సంఘము లేకుండా కర్మ చేయును. కానీ భేద దృష్టి పోకపోవుటచే, స్వతంత్రాభిమానము పోకపోవుటచే సామాన్య అవస్థను పొంది. సత్తరజస్తమో గుణములతో కూడిన సూక్ష్మ దశతో అచేతనముతో జీవులతో కూడి ఉన్న ఆ పరమాత్మను చేరును. చేరిన వారి కంటే వాని కంటే వేరుగా కనుపోవుటకు వీలు లేకుండా లీనమగును. కొంతకాలం అట్లు గడిచిన తరువాత కాలము ప్రేరణ చేయగా భగవానులో తాను అనేక రూపములుగా బయల్వెడలని కోరిక కలగని ప్రకృతియందు సత్వరజస్తమో గుణములలో వైషమ్యము కలుగును అదియే సృష్టి దశ. ఆ దశలో చతుర్ముఖ బ్రహ్మ పూర్వం వలనే మరల జన్మించును. బ్రహ్మ యొక్క ఐశ్వర్యము కూడా కర్మాధీనముగా వచ్చినదే. కనుక దానిని అనుభవించి బ్రహ్మ కూడా ప్రళయములో సూక్ష్మావస్థనందిన చేతనా చేతనములతో కూడిన పరమాత్మతో చేరి మరల పుట్టుచుండును. ఈ విధంగా నిష్కామ కర్మను ఆచరించుచున్నను అభిమానము తొలగని వారు వారు మరల జన్మించుచుందురు. ఇంకా కామ్య కర్మలు చేయువారు జన్మింతురు అనుటలే సంశయము లేదు. బ్రహ్మ లోకం వరకు ఆయా లోకములను పొందవలెనని కోరికతో కామ్య కర్మలు ఆచరించుచుందురు. రజోగుణము చే భగవానుని కంటే ఇతరములగు వానిపై మనసు ప్రసరించెడి వారగుదురు. అందుచే ఇంద్రియములు వారి వశమునందుండవు. వారి మనసు ఇల్లు, ఇల్లాలు, బిడ్డలు అను వానియందే లగ్నమై యుండును. వారు పితృ దేవతలను ఆరాధించుచుందురు. వారికి ధర్మార్థ కామములే ప్రధానముగా తోచును. సంసారమును అంతమొందించు నిరతిశయమగు కీర్తి గల భగవానుని కథలయందు ప్రీతి కలగదు. అట్టి వారు త్రైవర్గికులు అనగా ధర్మార్థ కామములు ప్రధానములని భావించువారు.

వారు భగవత్ కథ అనేటి అమృతమును వదలి పందులు మున్నగునవి అమేథ్యమును భక్షించునట్లు లోక వృత్తాంతములే వినుచుందురు. వారు దురదృష్టవంతులు. వారు చనిపోయిన తరువాత ధూమాది మార్గము పితృయానము గుండా పితృలోకమును చేరుదురు. వారు మరల జన్మించుచుందురు. పుట్టినది మొదలు అనేకములైన గర్భదానాది స్మశానాంత కర్మలను ఆచరించుచుందురు. ఇక్కడ ఈ పుణ్యముల ఫలమును అనుభవించి దేవతల చేత మరల ఈ లోకమునకు త్రోసివేయబడుదురు. అందుచేత అమ్మా. నీవు పరిపూర్ణమైన మనసుతో నిండు ప్రేమతో పరమనాధుడగు పరమపురుషుని ఆశ్రయించుము. అతడే అందరి దేవతల చేతను ఆరాధింపదగినవాడు. జ్ఞాన శక్త్యాది గుణములు పరిపూర్ణముగా కలవాడు భగవంతుడగు వాసుదేవుని యందు భక్తి యోగము కలిగినచో ఆ భక్తిచే బ్రహ్మ దర్శనము కలుగును దానిచే వైరాగ్యము కలుగును ఇట్లు భగవానుని ప్రేమతో ధ్యానించు వారికి ఇంద్రియ వ్యాపారములు శబ్దాది విషయముల వైపు ప్రసరింపవు ఇది అనుకూలము. ఇది ప్రతికూలము అను భేదము అతనికి మనసున తోచదు. ఇట్లు మనస్సు నిస్సంగమై సమదర్శనమైన నాడు సర్వము బ్రహ్మాత్మకము అనిటి బుద్ధి స్థిరముగా ఏర్పడి మనస్సు ఆ పరమాత్మ యందే నిలిచినదగును. అతడు అంతట భగవానునే దర్శించును. పరమాత్మ పరబ్రహ్మము అని వ్యవహరింపబడి భగవానుడే పరమ పురుషుడు. అతడు జ్ఞాన స్వరూపుడు. అతనిలో జడమైన భాగం ఉండదు. ఆ భగవానుడే తన శరీరముగానున్న అచేతనమగు ప్రకృతిని విస్తరింపచేసి విశ్వముకు కనపడుచున్నాడు. ఇట్లు సాంగమగు భక్తి యోగము పూర్ణముగా సిద్ధించిన నాడు భగవానుని అనుగ్రహముచే జీవుడు సహజమగు గుణములు ఆవర్భవించిన వాడగును. పూర్తిగా ప్రకృతి సంబంధము లేని వాడగును. జీవనకు కూడా పరబ్రహ్మకు వలనే సత్వాది గుణ సంబంధం ఉండదు. అతడు జ్ఞాన స్వరూపుడే గానీ కర్మ వశముచే ఇతరులచే ప్రకాశింపజేసేడి భూతములతో ఇంద్రియములతో కూడినవాడై దేహమే తానునడి భ్రాంతి కలిగి ఉండును. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, జ్ఞానాది గుణములు కలవాడు, జీవుని వలె అతనికి కూడా ప్రకృతితో సంబంధం ఉండును, కానీ అతనికి కర్మ ఉండదు. కనుక జీవుని వలె భ్రాంతి కలగదు, జ్ఞానము సంకోచింపదు. ఆ భగవానుని శరీరముగు ప్రకృతియే మహత్తత్వము. మూడు విధములగు అహంకారములు, ఐదు విధములగు భూతములు, పదకొండు విధములగు ఇంద్రియములుగా కనపడుచున్నది.

దాని నుండి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మయే స్వరాట్. అతని నుండియే ఈ బ్రహ్మాండము పుట్టినది. బ్రహ్మ అతనిచే సృష్టించబడిన బ్రహ్మాండము అనేటి జగత్తు అంతయు కూడా భగవానుని శరీరమే. శరీరం అనగా శరీరం వలె. ధరింపబడి నియమించబడి ప్రవర్తించిడిది. ఇట్లు భగవానుని శరీరముకు విశ్వమును చూడగానే అందు ఆత్మగానున్న పరబ్రహ్మము భక్తి యోగముచే దర్శనము సంగును. అట్లు దర్శనము సంగనే ముసంగగనే ఆ బ్రహ్మమునకు చెందనిది ఆ బ్రహ్మము కానిది వేరొకటి లేదని తెలియును దానిచే భేదభావము తొలుగును. వైరాగ్యము ఏర్పడును దానిచే మనసు సంతతము భగవానుని యందే నిలుచును విషయముల వైపు ప్రసరించదు అందుచేత ఓ పూజ్యురాలా ఇంతవరకు నీకు చెప్పిన తత్వజ్ఞానముచే భూమి మొదలగు రూపములోనున్న ప్రకృతి యొక్కయు దానికి ఆత్మగా ఉన్న పురుషుని యొక్కయు ఈ రెండింటినీ శరీరముగా కలిగి ఉండి తాను వానికి ఆత్మగా ఉన్న పరమ పురుషుని తెలియును. ఈ జ్ఞానమే బ్రహ్మ దర్శనం ఉపాయముకు జ్ఞానము దాని నీకు వివరించితిని. తర్వాత చెప్పినటువంటి భాగాన్ని మళ్ళీ మనం మరొక పాడ్కాస్ట్ లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. In which state of being, whatever is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that is, that It will be merged. In the pots made of clay, clay is present as an ingredient. Similarly, in this world, the Supreme Being is present. That Supreme Being is you, salutations to you. Sixth Canto, Sixteenth Chapter, Twenty Second Prayer. Oh, devotees of the Lord, the third book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 43. Until now, as part of the conversation between Vidura and Maitreya, in the Kapila Gita, we are discussing the topics of the individual soul and the supreme soul, and learning how the movement of the individual soul is. After the individual steps into nature, how does he with female attraction his own Life is full of changes. What are the consequences of being in sinful deeds? All these, while discussing, how is the path of those who perform good deeds, those who practice righteousness? We will discuss the next part in due course. Let's experience the front part of it. There are some who worship God. They do not yearn for sensual pleasures, having conquered their senses. They do not practice their dharma to fulfill their desires and to earn money. Those who do not have a community, considering all the deeds they do as belonging to God, and believing that God himself is making them do it for His pleasure, they do it. Thus, by practicing their dharma, their minds will be free from attachment and aversion. May thou have a heart of gold,. Those who follow the principle of restraint are called such people. They always listen to the divine qualities and do it with a spirit of sacrifice, thinking that they are doing it for the pleasure of the Supreme Soul.

Their hearts are filled with a pure devotion to the Lord. They will not have affection thinking that I am their body. After leaving such a body, they ascend through the solar system via the path of Archa and others. Fire, day, Shukla Paksha, Uttarayanam, year, air, sun, moon, lightning, Varuna, Indra, Brahma, along with them, travels through various worlds, crosses the realm of nature, and reaches the Supreme Being, the Lord. It is only by the will of that Supreme Being that beings attain bondage and liberation. He is the one who creates, preserves, and destroys the universe. He is omnipotent. He, by his own determination, does not let the man who has reached him go back, does not let another desire arise, and bestows his experience, keeping it with him. Those who perform virtuous deeds with desires are steadfast in their dharma. They, through the path of smoke, reach the upper worlds and return again. Those who worship God without desiring any wish with devotion to God are righteous. They will not be reborn after traveling the path of Achira. The creation of the four-faced Brahma From the beginning to the end, it has a lifespan of a hundred years. Which year, time, and purpose are mentioned. A hundred years is two parartham. These two meanings, as the time is completed, also in the dissolution of the four-faced Brahma. Those who meditate on the nature of the self through the practice of yoga are called yogis. They reach Brahmaloka, stay there with Brahma, and then reach the presence of the Supreme Soul. The paths that those who have died take are Pitruyaanam, Yogiyaanam, and Devaayaanam, in three ways. Those who perform actions with desires go to the ancestral abode, enjoy the fruits of those merits, and as soon as that fruit is completed, they return to the earth. Those who meditate on the Supreme Being through the practice of yoga, in the path of yoga, that is, in the path of a yogi, first go to the Brahmaloka

Until the apocalypse, they remain as Achada, and upon their lifespan completion, they reach the Supreme Soul along with Brahma. Those who worship the Lord with devotion and selfless action, traveling in divine vehicles, crossing the ocean of space, and attaining Vishnu's abode, will not return. From the earth to the sky, the five great elements, mind, senses, sound and other things, Bhutadi Anadi Tamasahankaramu, as soon as the Lord has the determination to destroy the universe covered by it, the Supreme Soul, who is endowed with the qualities of truth, goodness, and ignorance, enters into the unmanifest. That is, it attains a state that is unique to the subtle mind and consciousness, which cannot be divided into names and forms. Then, Brahma, who is superior to all the gods, including Indra, will experience his lifespan, which is of two purposes, and reach the Supreme Being. Having practiced yoga and meditated on the Lord, those who have reached the four-faced Brahma called Hiranyagarbha, along with Brahma, having conquered the life force, senses, and mind in Brahmaloka, are beyond the Supreme Brahman, other than the subtle And also wealth Desire, ego, and those without independent intellect, along with Brahma, reach that supreme being. Those who do yoga practice here and do not fully attain devotion, attain the world of Hiranyagarbha, attain the world, and there, worshiping God, as long as Brahma exists, staying in that Brahma world, in the apocalypse, along with that Brahma, the Supreme Soul They won't. While living in this world, some people attain the perfect Bhakti Yoga. They, in this world itself, without ceasing, with unwavering love, remember and behold the Lord. Therefore, Mother, accept the refuge of the Lord residing in the heart-lotus of all living beings with all kinds of relationships. The one who has told you his glory until now, the one who is the refuge of all the worlds, is the Lord. For those who do not believe, devotion and yoga are not fully ready, and the ego of the body obstructs it, and the ego of the soul is independent. Those who, through the practice of yoga, reach the Brahmaloka where Hiranyagarbha resides, also attain the presence of the Lord after surrendering to the Lord and removing obstacles.

The creator of the Sthavara jagamu is Chaturmukha Brahma. He is the collective male, the Veda's Bhr̥ṣṇa. He too, because of the lack of body-consciousness and self-consciousness, merges into the dissolution in the apocalypse and is reborn again in the end of the apocalypse. Sanat Kumara, along with other yogis and sages, including the yogis and siddhas, and even Brahma, believed that the Brahma Atmagali (divine essence) possesses independent objects. Therefore, he possessed body-consciousness and self-consciousness. Therefore, his perception of difference will not be removed, his affection will not be abandoned. He performs actions without a group. But because the difference of view is not gone, because the self-respect is not gone, having attained a common state. He attains that Supreme Soul, which is with the subtle state, with the qualities of sixteen, with the unconscious, with the living beings. It is impossible to distinguish him from those who have joined him, and he merges into them. After some time passed like that, when time inspires, in the divine, one who has a desire to manifest in many forms, in nature, there will be a difference in the qualities of Sattva, Rajas, and Tamas, that is the stage of creation. At that stage, the four-faced Brahma, formerly He will be reincarnated. Even the wealth of Brahma came under the control of karma. Therefore, experiencing that, even Brahma, in the dissolution, joins with the Supreme Soul, which is endowed with subtle states of consciousness, and is reborn again. In this way, even while practicing selfless action, those who do not let go of ego will be reborn again. There is no doubt that those who perform desirable actions will be reborn. With the desire to attain the Brahma world and its respective worlds, they perform desirable actions. Those with a passion for Rajasic qualities, those who focus their minds on others other than the divine, become such. Therefore, the senses are not under their control. Their mind is fixed on their house, wife, and children. They worship their ancestors. For them, dharma, artha, and kama are the main things. There is no interest in the stories of the Lord who ends the world and has immense fame. Those who are like that are called Trivargikulu, meaning those who consider dharma, artha, and kama as the main things.

They, abandoning the nectar called the story of God, eat inedible things like pigs, and listen to the stories of the world. They are unfortunate. After they die, they reach the world of the ancestors through the path of smoke and fire. They will be reincarnated. From birth until death, they perform many rituals, including those related to pregnancy, childbirth, and cremation. Here, having experienced the fruits of these merits, they will be thrown back into this world by the gods. Therefore, mother. You, with a complete mind, with full love, take refuge in the supreme being, the supreme man. He is the one whom all gods worship. He who is perfectly endowed with qualities like knowledge, power, and other virtues, if he has devotion and yoga in Lord Vasudeva, then through that devotion, he attains the vision of Brahma, and through that, he attains detachment. Thus, those who meditate with love for the Lord, their senses Businesses should not spread towards words and other things; this is favorable. This is negative, he does not realize the difference in it. Thus, when the mind is free from delusion and is of equal vision, then the intellect firmly establishes that everything is of the nature of Brahman The mind is fixed in the Supreme Soul. He sees God in all. The Supreme Being is called the Supreme Brahman, and the Lord is the Supreme Personality of Godhead. He is the embodiment of knowledge. He will not be a cripple. That God, expanding the inert nature that is his body, is visible to the universe. Thus, when the Sangamagu Bhakti Yoga is fully attained, by the grace of the Lord, the soul becomes one with its natural qualities. He is completely devoid of any natural connection. Even for life, there is no connection between the Supreme Being and the quality of goodness. He is the embodiment of knowledge, but due to the influence of karma, he is united with other beings and senses, and he has the illusion of being the body itself. The Supreme Being is the embodiment of knowledge, possessing the qualities of knowledge and other virtues. Like a living being, he also has a connection with nature, but he has no karma. Therefore, like a living being, there is no delusion, knowledge does not shrink. The great principle is the nature of the Lord's body. Three types of ego, five types of beings, eleven types of senses It is visible.

The self-existent one is the quadruped Brahma. From him, this universe was born. The universe, which is created by Brahma, is the body of the Lord. Bodily functions bodily. It is appointed and appointed to act. Thus, upon seeing the body of the Lord and the universe, the Supreme Brahman, who is the soul, is seen through devotion and yoga. Thus, the vision is not related to the unmanifest. That which is not Brahman, that which is not Brahman, it is known that there is nothing else. By that, the sense of duality is removed. Detachment will be established, and by that, the mind will always remain in the Lord alone, not deviating towards worldly matters. Therefore, O venerable one, the knowledge of the essence that I have told you so far, and the nature that exists in the form of earth and so on, and that is the soul of it He knows the Supreme Being, who is the embodiment of the male and these two, and who is the soul of him. This knowledge is the means to the vision of Brahma. I have explained that knowledge to you. Let's experience the part that was said later again in another podcast. Jai shreemannarayana Asmad gurubhyo namah