హిరణ్యాక్షుని గదా యుద్ధ సవాలు - వరాహ మూర్తి రౌద్రము

Hiranyaksha's Challenge & Fierce Varaha Anger

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, హిరణ్యాక్షుడు భూమిని ఉద్ధరించిన వరాహ స్వామిని గదా యుద్ధానికి సవాలు చేస్తాడు. రాక్షసుని అహంకారపు మాటలకు కోపోద్రిక్తులైన వరాహ మూర్తి రౌద్ర స్వరూపాన్ని దాల్చి విశ్వమంతా భయకంపితమయ్యేలా చేస్తారు. ఈ దివ్య సంగ్రామం శ్రీ హరి సంకల్పం ముందు ఏ అసుర శక్తీ నిలువలేదనే శాశ్వత సత్యాన్ని మనకు బోధిస్తుంది.

In this powerful episode from Canto 3 of Srimad Bhagavatham, the mighty demon Hiranyaksha boldly challenges Lord Varaha to a mace duel after the Lord rescues the earth from the cosmic waters. Provoked by the demon's arrogance and taunts, Lord Varaha assumes a fearsome, wrathful form that fills the universe with awe. The intense battle between the demonic force and the Lord's divine fury reveals the ultimate truth that no power in creation can stand against the will of Sri Hari.

← Prev Next →
Hiranyaksha's Challenge & Fierce Varaha Anger bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయానంతాయ వ్యక్తాయ నమః పురుషోత్తముడగు సంకర్షణుడే త్రిగుణ కార్యముకు జగత్తునకు చైతన్య ప్రకాశమును అనుగ్రహించుచున్నాడు. అనంతుడగు ఆయన ఇంద్రియములకు గోచరము కాడు. ఆయనకు అనేక నమస్కారములు. ఫిఫ్త్ క్యాంటో, 17th చాప్టర్, 17th ప్రేయర్. భగత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం. 27వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు కర్దముని యొక్క స్తుతి మనం విన్నాం. స్వయంభువ మనవద్ధరంలో సృష్టి కార్యము చేయటాని కోసం బ్రహ్మ తన కుమారుడైన ప్రజాపతి కర్దమునికి అడిగినప్పుడు కర్దముని భగవంతుని ప్రార్థిస్తాడు తనకొక స్త్రీ అవసరం కావాలి మనుషులను సృష్టి చేయడానికి అని ఆ స్తుతి చేస్తాడు. దాని తర్వాత భాగాన్ని మనము తెలుసుకుందాం. నీవు భార్యగా స్వీకరించుటకు తవు కన్య కొరకు నియమములతో నువ్వు నన్ను ఆరాధించితివి అని నేను ముందే ఎరంగి నీకు తగిన కన్యము సిద్ధము చేసితిని. భగవంతుడు చెప్తున్నాడన్నమాట. నీవు ప్రజాపతివి, నీవు నన్ను ఆరాధించుట ఎన్నడూ వ్యర్థము కాదు. నా యందే మనసు నిశ్చలముగా నిలిపి నీవు చేసిన ఆరాధనము ఎన్నడూ వ్యర్థము కాదు. బ్రహ్మ యొక్క కుమారుడు సదాచార సంపన్నుడు సార్వభౌముడగు మనువు బ్రహ్మావర్త దేశమును నేడు పాలించుచున్నాడు. అతడు తన భార్యకు శతరూపతో నన్ను ఆరాధించుటచే సిద్ధినంది నిన్ను చూడవలెనని ఎల్లుండి ఇత్తటకు రాగలడు. అతని కుమార్తె దేవహుతి, ఆమె చల్లని చూపులు కలది, సుందరాంగి, సుస్వభావ సద్వర్తనము కలగది. ఆమె తనకు తగిన భర్తకై అన్వేషించుచున్నది.

అందుకై అతడు తన కుమార్తెను నీకు వసంగవలెనని ఇచరకు రానున్నాడు. నీవు ఆమెతో అనేక సంవత్సరములు భోగమును అనుభవింపగలవు. ఆమె నీ మనస్సును బాగుగా ఆనందింపచేయగలదు. ఆమె యందు నీవు తొమ్మిది మంది కుమార్తెలు జన్మింతురు నీకు. ఋషులు వారిని భార్యలుగా స్వీకరించి సంతానమును విలయింతురు. నీవు నా ఆజ్ఞను పాలించి నా ఆరాధనమునందు నిష్ట గలవాడవై నీవు ఆచరించు కర్మఫలము సమస్తము నాకే అర్పించుచు చివరకు నన్ను చేరెదవు. నీవు అంతఃకరణమును జయించిన వాడవు. చరాచరములగు సకల జీవుల యందు దేగలవాడవై యుందువు. అన్ని భూతముల యందు లోన ప్రవేశించి నియమించువాడను నేను అని ఎరంగి ఈ జగత్తును నాయందు నన్ను జగత్తునందు దర్శింపగలవు. ఆ దేవహుతి యందు నేను నా అంశచే అవతరింతును. ప్రకృతి, పురుష, ఈశ్వర అను తత్వములను వివేచించి ఎరింగించు శాస్త్రమును ప్రవచించెదను. ఈ విధముగా మాట్లాడి. అదోక్షజుడు సరస్వతీ నదిలో కూడిన బిందు సరస్ తీరమందు కర్దమ ఆశ్రమం నుండి వెడలిపోయెను. ఆ కర్దముడు చూచుండగానే ఆ భగవానుడు అధిష్టించిన గరుడుని రెక్కల కదలికచే ఋగ్వేదము సామవేదము అతనికి వినిపించెను. అట్టి వేదములను కర్దమునికి వినిపింపచేయుచు భగవానుడు గరుత్మంతునితో వెడలిపోయెను. స్వయంభువ మనువు బంగారు రథములో తన భార్యను పుత్రికను కూర్చుండ చేసుకొని శాంత స్వభావుడు కర్దమ ప్రజాపతి ఆశ్రమమునకు భగవానుడు చెప్పినట్లే వచ్చెను. భగవానుడు కర్దముని చూచి పొందిన ఆనందముచే నేత్రముల నుండి వెలువడిన ఆనందాశ్రు బిందువులు ఆ సరస్సునందు పడినవి. అందుచే ఆ సరస్సునకు బిందు సరస్సు అని పేరు వచ్చినది. దాని చుట్టూను సరస్వతి నది ప్రవహించుచుండెను. దాని దర్శనము చేతనే పుణ్యము లభించును, రోగములు తొలుగును. ఆ జలములు అమృతం వలె నుండును. మహర్షులు ఆ నదీ తీరమును సేవించుచుందురు. మృగములు, పక్షులు రుద చేయుచు కూయుచు పవిత్రములకు వృక్షములు, పుష్పములు ఈ అచట వనములో ఎల్లప్పుడూ లభించుచుండెను. మకరంద పానముచే మత్తిల్లిన తొమ్మిదలు అచట వృక్షములపై రుద చేయుచుండెను. మదించిన నెమళ్ళు అచట నాట్యము చేయుచుండెను. పూచిన కడిమి చెట్లు. మెదలగు చెట్లు మొదళ్ళు దట్టముగా ఉండెను. కారండము మొదలగు పక్షులు అచట మధురముగా కూయుచుండెను. లేళ్ళు విస్తారముగా విహరించుచుండెను. వరాహములు, మర్కటములు, సింహములు.

కస్తూరి మృగములు అచర తిరుగాడుచుండెను. అది రాజొగు మనువు ఆశ్రమమున ప్రవేశించెను. కర్దముడు హోమము చేసుకొని తన స్థానములో ఆసీనుడై యుండెను. అతడు చాలా కాలము తపస్సున మనసు నిశ్చలముగా నిలిపి మనసున ఏ విధమగు దోషములు లేనివాడై భగవంతుని ప్రేమతో ఆరాధించిన వాడై యుండెను. మనువు కర్దవ ప్రజాపతిని దర్శించెను. కర్దవ ప్రజాపతి భగవానుని వాక్కు అనే అమృతమును పానము చేయుటచే చాలా కాలము తపస్సు చేసినను ఎక్కువ కృషింపలేదు. మను అతని సమీపమునకు వచ్చి దర్శించి అతని పాదముల వద్ద నమస్కరించెను. కర్దమ ప్రజాపతి. అనురూపముకు పూజను వనర్చి ఆశీర్వదించి అతని రాకను అభినందించెను మరియు మనువుతో ఇట్లు పలికెను ఓ మను నీ దేశ పర్యటనము సాధు రక్షణమునకు దుష్ట శిక్షణమునకు జరుగుచున్నదని మేము ఎరుంగుదము. ఈ లోకము పాలించడి భగవానుని దివ్యశక్తి నీ రూపమునై ఈ లోకమున పాలించుచున్నది. శ్రీ మహావిష్ణువే ఈ జగత్ పాలనమునకు అవసరమైనప్పుడు సూర్య చంద్ర అగ్ని వాయు చంద్ర ఇంద్ర యమ వరుణాది రూపములను స్వీకరించుచుండును. అట్టి భగవానునకు నమస్కారము. నీవు ఇచ్చటికి వచ్చుటకు ప్రధానమైన ప్రయోజనము జగద్రక్షణమే అయినను ఏదో ఒక ప్రయోజనము కూడా ఉండి ఉండును. జయశీలమగు రథముతో భయజనకమగు విల్లును చేబూని ధర్మ విరోధులను భీతిని కలిగించుచు నీవు ఈ భూమండలమున సంచరించుచుంటివి. నీవు భూమిపై నీ సేనలతో పర్యటనము చేయనిచో వరుణాసన ధర్మముల వ్యవస్థ ధర్మ విరోధులగు వారిచే భ్రంశము చేయబడును. నియమ పాలన లేక అర్ధకామములే ప్రధానమని భావించడి మానవులు అధర్మమును లోకమున పెంపొందించుచుందురు. నీవు కదలక ఒకచోటనే పరుణ్ణచో లోకము ధర్మ చోరులచే నాశనము నొందును. ధర్మ రక్షణమునకే సంచరించుచున్న నీవు మా ఆశ్రమమునకు విచ్చేయుటలో వేరొక ప్రయోజనము కూడా ఉన్నచో నీవు స్పష్టముగా మాకు ఎరిగించిన మేము దానిని అంగీకరించగలము. తన గొప్పతనము ప్రశంసించుచు కర్దమ ప్రజాపతి మాట్లాడుట విని కొద్దిగా సిగ్గుపడుచు మనుసామ్రాట్టు నివృత్తి ధర్మమున నిష్ట గల ఆ మునితో ఇట్లు పలికెను.

బ్రహ్మ వేద స్వరూపుడు. అతడు తన ముఖము నుండి కర్మ యోగ, జ్ఞాన యోగ, భక్తి యోగములతో అలరారుచు విషయ లాలసత లేని వేదమయములగు బ్రాహ్మణులను వేద రక్షణకే సృష్టించినాడు. బ్రాహ్మణును రక్షించుటకు సహస్రపాదులగు శ్రీ మహావిష్ణువు తన భుజ సహస్రము నుండి క్షత్రియులను సృజించినాడు. వేద పాలనముకు బ్రాహ్మణులను బ్రాహ్మణ పాలనకు క్షత్రియులను సృజించిన బ్రహ్మ ఆ రెండింటిని రక్షించుటచే చేతనా చేతనాత్మకము జగమంతయు రక్షింపబడునని భావించినవాడు. హే భగవాన్, మీ దర్శనము చేతనే నా సంశయములన్నియు తొలగినవి. మీరు ధర్మ రక్షణమే నా కర్తవ్యమని ఇప్పుడే చెప్పి ఉండిరి. సుకృతం లేని వారికి మీ వంటి మహాపురుషుల దర్శనం లభింపదు. మీ పాద రజస్సు నా భాగ్యవశముచే నా శిరస్సుతో స్పృశించిడి భాగ్యము లభించినది. మీరు నన్ను అనుగ్రహించితిరి. మీ వాక్కులతో నా స్తోత్రమును పరమానందముగా వింటిని. నా పుత్రిక కొరకు నేను మనసును దుఃఖముతో నిండి ఉన్నాను. దాసుడనగు నా విజ్ఞాపనమును మీరు వినదగును. ఈమె నా కుమార్తె, ఈమె దేవహూతి. ఈమె సోదరులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఆమె భర్తకై అన్వేషించుచున్నది. నారదుని వలన మీ గుణములను విని మీ యందే మనసు నిలిపినది. మీరు మీకు భార్యగా ఉండవలెని కోరినది. అందుకై మీకు శ్రద్ధతో ఆమెను మీ వద్దకు తోడి తెచ్చితిని. గృహస్థ ధర్మములయందు ఈమె మీకు సర్వ విధముల అనుకూల అయి ఉండును. ఈమెను మీరు ధర్మపత్నిగా స్వీకరింప ప్రార్థించుచున్నాను. దైవ వశమున ఒకరు కోరదగిన కోరిక కోరిన వాడు కోరిన నాడు. తమకు దానియందు సంఘము లేకపోయినను దానికి విరక్తులై తిరస్కరింపరాదు. ఓ ప్రజాపతి, మీరు వివాహమునకై ప్రయత్నము గలవారలై ఉన్నారని విన్నాము. మీరు నైష్టిక బ్రహ్మచారి కాదని వివాహము చేసుకుందురని విన్నాం. నేను సమర్పించని మా కన్యను స్వీకరింపుడు. ఇట్లు స్వయంభవమును ప్రార్థింపగానే కర్ద మహాముని ఏమి అన్నారో తర్వాత మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం పాడ్కాస్ట్లో. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Om Namo Bhagavate Mahapurushaya, Sarvaguna Sankhyanayanantaya Vyaktaya Namah. The supreme being, Sankarshana, bestows consciousness and light upon the world for the sake of the three-fold purpose. He, who is infinite, is not visible to the senses. Many salutations to him. Fifth Canto, 17th Chapter, 17th Prayer. Devotees of Bhagavat, Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Welcome to episode 27. Up to this point, we have heard the praise of Kardamuni. In the Swayambhuva Manavadhara, when Brahma asked his son Prajapati Kardamuni to perform the creation task, Kardamuni prays to God, saying that he needs a woman to create humans, that is the praise He will. We will learn about the next part. You worshiped me with rules for a virgin to accept you as a wife, I had already prepared a suitable virgin for you. That's what God's telling you. You are the Prajapati, worshiping me will never be in vain. Naa Keep your mind steady, and the worship you have done will never be in vain. Brahma's son, the virtuous and sovereign Manu, is ruling the Brahmavarta country today. He, with his wife, having attained perfection by worshipping me with Shatarupa, will come to see you the day after tomorrow. His daughter, Devahuti, was beautiful, with a cool demeanor, and had a good nature and good character. She is looking for a suitable husband.

Therefore, he is coming to Ichakaru to give his daughter to you as a dowry. You can enjoy the pleasures with her for many years. She could make your heart feel right. In her, you will be born nine daughters to you. The sages accepted them as wives and begat children. You obey my command and be devoted to my worship, and you will offer all the fruits of your actions to me and finally reach me. You are the conqueror of the inner self. You are the one who reigns over all living beings, both animate and inanimate. I am the one who enters into all beings and ordains them, and you can see me in this world. I will descend in the form of a child from the Devahuti. I will explain the scriptures that discern the essence of nature, man, and God. Speak in this way. Adokshajuudu, along the shore of the Bindu Saras, which merges into the Saraswati River, left the Kardama Ashram. As Kardamudu watched, the Rigveda and Samaveda were made audible to him by the movement of the wings of Garuda, who was seated on the Lord. Having made the Vedas heard by Kardamuni, the Lord departed with Garuda. Svayambhuva Manu, having seated his wife and daughter in a golden chariot, and being of a peaceful nature, came to the hermitage of Kardama Prajapati, just as the Lord had said. The joy that the Lord felt seeing Kardamuni fell from his eyes as tears of joy. Therefore, that lake is called Bindu Lake. The Saraswati river flowed around it. By its sight, merit is obtained, and diseases are cured. The waters are as if they are nectar. Sages used to serve the river. Animals, birds, singing and chirping, and sacred trees and flowers were always available in this forest. Nine bees, intoxicated by nectar, were crawling on the trees there. The intoxicated peacocks were dancing there. Flowering oleanders. The trees and shrubs were lush. Birds like the karandamu were singing sweetly there. The lions were roaming extensively. Boar, jackal, lion.

The musk deer was wandering around. He entered the hermitage of Rajogu Manu. Kardamudu performed the homam and was seated in his place. He, for a long time, with penance, keeping his mind steady, without any faults in his mind, being worshiped with love for God, was there. Manu went to see the king of the Kardava. By drinking the nectar called the word of Lord Kardeva Prajapati, even after doing penance for a long time, he did not exert much. Manu came near him, saw him, and bowed at his feet. Kardama Prajapati. Having worshiped and blessed Anurupa, she congratulated his arrival and spoke thus to Manu: O Manu, we know that your journey to the country is for the protection of the saints and for the punishment of the wicked. This world is ruled by the divine power of the Lord, which is your form, ruling in this world. Sri Maha Vishnu, when it is necessary for the governance of this world, accepts the forms of Surya, Chandra, Agni, Vayu, Chandra, Indra, Yama, Varuna, etc. Salutations to that Lord. The main reason for your coming here The benefit is for the protection of the world, but there must also be some benefit. With a victorious chariot, carrying a frightening bow, and instilling fear in those who oppose righteousness, you are wandering in this world. If you do not travel on the earth with your armies, the system of Varunasana Dharmas will be destroyed by those who are against Dharma. Without law and order, and considering lust as the main thing, humans will promote unrighteousness in the world. If you do not move and remain in one place, the world will be destroyed by the thieves of righteousness. If there is another purpose in your coming to our ashram while wandering for the protection of Dharma, we can accept it if you clearly inform us. Hearing Kardama Prajapati speaking praising his greatness, the humble Manusa Mraatu, being a devotee of Dharma, spoke thus to that sage.

The Brahma is the form of the Vedas. He, from his face, shone with Karma Yoga, Jnana Yoga, and Bhakti Yoga, created Brahmins who were without worldly desires, who were full of Vedas, for the protection of the Vedas. To protect the Brahmins, Sri Maha Vishnu, who has a thousand hands, created Kshatriyas from his shoulder. Brahma, who created the Brahmins for the rule of the Vedas and the Kshatriyas for the rule of the Brahmins, thought that he could protect both of them, and that the entire universe would be protected. Oh Lord, it is only by your grace that all my doubts have been cleared. You just said that protecting dharma is my duty. Those who are without good deeds will not receive the vision of great men like you. By the grace of your lotus feet, I have been blessed with the fortune to touch your head. You have set me free. I have heard my praise with your words. I am heartbroken for my daughter. You will hear my humble request. She is my daughter, she is Devahuti. Her brothers were Priyavrata and Uttanapada. For her husband It is searching. Having heard of your virtues through Narada, it has fixed its mind on you. That you wanted to be her wife. Therefore, with care, I brought her to you. In the duties of a householder, she will be favorable to you in every way. I pray that you accept her as your wife. By the grace of God, one who desires a desired wish, at the time of desire. Even though you do not have a church, you should not be disgusted by it. Oh, Prajapati, we have heard that you are eager to get married. We heard that you are not a celibate and will get married. Accept my unacknowledged virgin. Thus, as soon as Swayambhavamu prayed, let's find out what Karda Mahamuni said in the next episode in the podcast. Jai Srimannarayana and salutations to the Gurus.