విరాట్ పురుషుని బ్రహ్మాండ ఆవిర్భావ వృత్తాంతము
Appearance of the Universal Form within Cosmos
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం బ్రహ్మాండ జలాలలో ఆవిర్భవించిన వైభవోపేతమైన వృత్తాంతాన్ని తెలుసుకొంటాము. ఆ విరాట్ పురుషుని దివ్య అవయవాల నుండి వివిధ లోకాలు, పంచభూతాలు మరియు సమస్త జీవరాశులు ఉద్భవించిన అద్భుత రహస్యాన్ని శుకదేవ మహర్షి వివరిస్తారు. సమస్త సృష్టి పరమేశ్వరుని దివ్య శక్తి యొక్క అభివ్యక్తియే అని ఈ అధ్యాయం మనకు గంభీరంగా బోధిస్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore the magnificent appearance of the Virat Purusha, the universal form of the Supreme Lord, within the cosmic waters. The Lord's transcendental body becomes the very foundation of creation, as each limb and feature gives rise to the different realms, elements, and living beings that constitute this universe. Through the profound narration of Shukadeva Goswami, we come to understand that all of existence is nothing but an expression of the Lord's divine glory and infinite potency.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః అర్ధలింగాయ నభసే నమోంతర్ బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే పదార్థముల పరస్పర భేదమునకు సూచకము, లోపల బయట అనే వ్యవహారమునకు మూలము అగు ఆకాశము శ్రీహరి రూపమే. పుణ్యముచే లభించే గొప్ప ప్రకాశము గల స్వర్గము మొదలగు ఊర్ధ్వలోకములు కూడా శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరికి అట్టి శ్రీహరి కొరకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 48th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితము మనము భగవంతుని యొక్క సృష్టిలో ఉన్న రెండు భాగాలు ప్రాకృతము వైకృతము అని ఆ ప్రాకృతము వైకృతము మొదలుకొని తొమ్మిది సృష్టిలు జరుగుతాయని వాటి యొక్క పేర్లు తెలుసుకుంటూ దానిలో మూడు సృష్టిల గురించి మనం తెలుసుకున్నాం. మహత్ సృష్టి, అహంకార సృష్టి, భూత సృష్టి వీటి వివరాల్ని. వినటానికి 13వ పాడ్కాస్ట్లో విని ఈ భాగాన్ని తర్వాత అనుభవించవచ్చు. నాలుగవది ఇంద్రియ సృష్టి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు సృష్టించబడుట ఇంద్రియ సృష్టి. ఐదవది ఇంద్రియాభిమానులగు దేవతల సృష్టి దీనిని దేవ సర్గమందురు ఈ దైవ సర్గమున ఇంద్రియాధిష్టానములగు దిక్కు మొదలగు దేవతల యొక్క సృష్టి జరుగును తరువాత తామస సర్గం అనగా ప్రకృతి మండల రూపముగు అంద అండ సృష్టి. ఆ సృష్టిని తామస సృష్టి అందురు. ఇది ఆరవది. ఇది చతుర్ముఖుడు సృష్టించినది కాదు. భగవానుని యొక్క సంకల్పము చేతనే ఈ అండ సృష్టి జరిగినది. ఈ ఆరింటిని ప్రాకృత సర్గములు అందురు. తరువాత వైకృత సర్గము. ఈ సృష్టి చతుర్ముఖు నుండి జరిగినది.
చతుర్ముఖిని శరీరము రజోగుణము అధికముగా గలది. ఏడవ సృష్టి స్థావర సృష్టి జరుగును. ప్రాకృత సర్గములు ఆరు అయిన తర్వాత వైకృత సర్గములో మొదటిది స్థావర సృష్టి. ఈ స్థావరములు చైతన్యము అభివక్తము కానివి. అవి ఔషధులు, లతలు. చర్మమే సారభూతముగా కలవి. కదళి అనగా అరటి, వేణు అనగా వెదురు. పొదలు, చెట్లు ఇవి స్థావరములు. వీనికి ఆహారము క్రింది నుంచి పైకి స్రవించుచుండును. ఇవి గమనం లేనివి. చైతన్యం అభివ్యక్తము కానివి. వాని స్పర్శచే చలి, వేడి మొదలగు సుఖదుఃఖములు కలిగించుచుండున్నవి. బాహ్యమగు విశేషములను ఎరుంగనివి, అంతరములగు స్పర్శ ఎరుగునవి, ఇట్టివే స్థావరములు, అడ్డముగా నడుచునవి తిరియక్కులు. ఇది ఎనిమిదవది. ఇవి 28 విధములు తిరియక్కులు. నిన్న, ఈరోజు, రేపు అనుజ్ఞానము లేనివి. గాఢమైన తమోగుణము ఆవరించుటచే ఆహారము, నిద్ర, మైథునములందు మాత్రమే ఆసక్తి గలవి. వాసన చూచి వస్తువును గుర్తించునవి, లోన కలిగిన సుఖదుఃఖములను ఎరుంగును కానీ చిరకాలం వానిని గుర్తుంచుకొనలేనివి. వీని భేదములు గోవులు, మేకలు. ఎనుములు, లీళ్ళు, పందులు, అడవిలో ఉండు గవయవములు, రురుమృగములు, గొర్రెలు, ఒంటెలు మొదలగునవి. రెండు గిట్టలు గలవి అనగా చీలిన గిట్టలు గలవి పై జంతువులు. గాడిద, గుర్రము, అశ్వతరములు, శరభము, చమరీ మృగము అనునవి ఒక గిట్టగలవి. ఈ పన్నెండు జాతులు. అందు ఐదు ప్రశస్తములు: కుక్క, నక్క, తోడేలు, పెద్దపులి, పిల్లి, చెవులపిల్లి, ముళ్ళపంది, సింహము, కోతి, ఏనుగు. తాబేలు, ఉడుము అనునవి. ఇవన్నీయు భూమిపై సంచరించు పశువులు. మొత్తం ఇవి 28, 27 విధములు. మొసళ్ళు మొదలగునవి జలచరములు, గ్రద్దలు, కొంగలు, డేగలు, కంకము, చషము, భల్లూకము, చరిశనము, హంసలు, సారసము, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగునవి.
భూచరములే కాక ఆకాశమునందు సంచరించు పక్షులు ఇవి అన్నియు ఎనిమిదవ సృష్టి. తొమ్మిదవది అర్వాక్ స్రోతసములు. వీని ఆహారము శరీరములు అడ్డముగా కాక పై నుండి క్రిందకు ప్రవహించుచున్నవి. అవి అర్వాక్ స్రోతసములు అనబడును. ఈ సృష్టికి చెందిన వారు మనుష్యులు. వీరి యందు రజోగుణము ఎక్కువ. అందుచే కర్మ చేయుచునే యుందురు. సుఖము కలిగినప్పుడు సుఖమును సుఖముగా ఎరుంగువారు. ఇవి మూడును వైకృత సర్గములు. ఈ వైకృత సర్గములో దేవ సర్గము, కుమార సర్గము అని భేదం ఉన్నవి. వీరు ప్రాకృత సర్గములోను వైకృత సర్గములోను చేరిన వారై ఉందురు. బ్రహ్మ చేత మొదట సృజింపబడిన వారు సనత్కుమారులు మొదలగు కుమారుల సృష్టి. ఇది వైకృత సృష్టిలోనిదే కానీ మొట్టమొదట సృజింపబడుటచే ఇది ప్రాకృతం అని కూడా అనబడును. అందుచే కుమార సృష్టి ప్రాకృతము వైకృతము కూడా అయి ఉండును. దేవతలు ఎనిమిది విధములుగా ఉందురు. పితృ దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసలు, సిద్దులు, యక్షరాక్షసులు, చారణులు, భూత ప్రేత పిశాచములు. కిన్నర కింపురుష విద్యాధరులు. ఇవి ఎనిమిది. ఇట్లు దేవ సృష్టి ఎనిమిది విధములు. ఈ విధంగా చతుర్ముఖునిచే సృష్టింపబడిన సృష్టి అండ సృష్టి వరకు జరిగిన ప్రాకృత సృష్టితో కలిసి పది విధములుగా చెప్పబడినది. ఇంకా తరువాత సర్వ వస్తువులను పరిచ్ఛేదించి చూపునట్టి కాలములో భాగములగు మన్వంతరములను మనువులను ఎరంగించెదను. ఈ విధంగా తనంత తానుగా ఉండెడి శ్రీహరి చతుర్ముఖ శరీరుడై రజోగుణము యొక్క ఉద్రేకము గల చతుర్ముఖ శరీరమందున్న జీవునిలో ప్రవేశించి సృష్టించెను. సత్వరజస్తమోగుణములు కూడిక కలిగిన ఈ అండమునందు ఒకటి ముందు ఒకటి వెనుక సృష్టించబడినవి అని పెద్దలు అంగీకరింపరు. అన్నియు ఒక్కసారే సృజింపబడినవి. పరమాత్మ ఆశ్చర్యముకు శక్తి కలవాడు. సకల తత్వములను అండమును ఒక్కసారే చేయగలడు. నదిలో జలం ఎటునటు కదులుచున్నప్పుడు సుడులు, బుడగలు అనునవి ఒక్కసారే ఏర్పడును. కానీ ఒకటి ముందు ఒకటి వెనక ఏర్పడవు. అట్లే తత్వములన్నియు ఒక్కసారే ప్రకృతి నుండి వెలుబడినవి.
ఇంద్రుడు మొదలగు దేవతలు ప్రతి కల్పమునందు ఉందురు. అసురులు కూడా ఉందురు. వారి ఆకారములు, పేర్లు ప్రతి మన్వంతరమునందును ఒకే విధముగా నుండును. కాలం యొక్క స్వరూపం వివరించు కాలము చేత పరిచ్ఛేదింపబడు పదార్థము వలనే కాలము యొక్క స్వరూపమును ఎరుంగవలెను. కానీ కాలము ఇట్టిదని ఎరుంగుటకు వీలు కానిది. సూర్యుడు పరమాను దేశమును ఎంతలో దాటునో ఆ కాలమును పరమాను కాలమందురు. 12 రాశుల కూటమిలో నుండు భువన కోశమును సూర్యుడు దాటిడి కాలమును మహాకాలమందురు. ఇది కాలం యొక్క చివరి హద్దు. కార్యమగు పదార్థమును విభజించినప్పుడు దాని భాగములలో చిట్టచివరి అత్యల్పమగు భాగము మరి భాగించుటకు వీలులేనంత చిన్న దానిని పరమాణువు అందురు. కొన్నిటి యొక్క సముదాయము కానిది, కార్యావస్థ నందనిది, సముదాయవస్థ నందనిది అగు దశలో నుండి సూక్ష్మ పదార్థమును పరమాణు వందురు. అట్టి పదార్థము యొక్క కదలికకు కాలము అని పేరు. ఇట్లు కాలము అనేకమైన భాగములతో కూడినది. కానీ దానిని ఎరుంగలేక కాలము అఖండమనుకొందుచుందురు. కార్యావస్థ చెందిన పదార్థము మరియొక వికారము నందని స్వరూపమున ఉన్నప్పుడు దానికంటే పెద్దది లేదు కనుక దానిని పరమ మహాన్ అందురు. అంతకంటే పెద్దది లేనిది. ఇట్లు పదార్థములలో విభాగము చేసినప్పుడు సూక్ష్మాంశమునకు పరమాణువని, పెద్దదానికి మహత్ అవస్థ అని లేదా స్థూలావస్థ అని అందురు. సూర్యుని యొక్క గమనము ఆ అణువుతో ఆ మహా పదార్థముతో కూడి ఉన్నప్పుడు ఎంత సమయమగునో దానిని కాలమని అనుమానముచే రుంగవలెను. కాలము భగవత్ స్వరూపము. అది ఇట్టిదని ప్రమాణముచే ఎరుంగ వీలు కానిది. ప్రమాణ గోచరములగు పదార్థములలో మార్పును కలిగించునది కాలము. అది అంతటా వ్యాపించి ఉండునది.
ఆ కాలములో అత్యంతము అల్పమైన దశనంది ఉన్న కాలము పరమాణువు. అన్నిటికంటే పెద్దదియగు కాలము కాల విభాగం సంవత్సరము. ఆ సంవత్సరములే సంఖ్య పెరుగుచున్న కొలది పరార్థమని, యుగములని, మన్వంతరములని వ్యవహరింతురు. కానీ కాలములో స్థూలా అష్టలో చివరి దశ సంవత్సరము. కాలావయవములు అగు పరమాణువులో రెండు కలిపిన ఒక అణుకాలమగును. అట్టి అణువులు మూడు కలిసిన ఒక త్రసరేణు కాలమగును. త్రసరేణువు కంటే సూక్ష్మమగు అణువుగా పరమాణువుగా ఉన్న కాలము గుర్తించుటకు వీలుకానిది. కిటికీ కన్నము నుండి సూర్యకిరణములు ప్రసరించుచున్నప్పుడు కనపడే సూక్ష్మమైన పరాగరేణువును త్రసరేణువందురు. అది ఆకాశముననే ఉండును. భూమిని చేరదు. త్రసరేణువు ఎంత మేర ఉండునో అంత మేర సూర్యలష్మి ప్రసన్నించు కాలము త్రసరేణు కాలము. కిటికీ నుండి వచ్చిన సూర్యకిరణములలో కనపడునట్టి ధూళికణము యొక్క కదలిక ఎంత కాలము పట్టునో ఆ కాలమునకు త్రసరేణు కాలమని పేరు. మూడు త్రసరేణు కాలములను తృటి అనబడును. తృటి అనబడునది వేధ అను కాలములో నూరవ భాగము. అట్టి వేధలు రెండు ఒక లవమగును. లవములు మూడు ఒక నిమిషము. మూడు నిమిషములు కాలము ఒక క్షణము. ఐదు క్షణములు కాష్ట. కాష్టలు పదునైదు లఘువు. పదునై లఘువుల కాలము ఒక నాడిక, నాడికలు రెండు ఒక ముహూర్తము, నాడికలు ఆరు లేక ఏడు ప్రహరము. అనగా జాము. ఈ జాములు పగలు, రాత్రి, నాలుగు, నాలుగు చొప్పున రోజుకు ఎనిమిది జాములుగా ఉండును. ఒకప్పుడు రాత్రింబ వేళలో ఆరు గాని ఏడు గాని జాములు ఉండును. సంధ్యాకాలం ఇందు చేరదు.
నాలుగు మినపగింజల ఎత్తుగల బంగారముతో చేసిన సూదితో ఒక కుంచెడు నీరు పట్టెడి పాత్రకు రంధ్రము చేసి ఆ పాత్రను నీటిపై నుంచిన ఆ కన్నము గుండా నీరు లోనికి వచ్చి ఆ పాత్ర నిండి నీటిలో మునుగుటకు ఎంత కాలము పట్టునో ఆ కాలమును నాడిక అనబడును. అట్టి నాడికలు రెండు ఒక ముహూర్తము. అట్టి నాడికలు ఆరు లేదా ఏడు ఒక జాము. పగలు నాలుగు, రాత్రి నాలుగు కలిపి ఒక రోజుని ఎనిమిది జాములు. ఇట్టి రోజులు పదునైదు ఒక పక్షము, శుక్ల పక్షము, కృష్ణ పక్షము అని రెండు పక్షములు ఉండు కాలము. మాసము ఇది మనుష్య మాసము. మనుష్యులకు ఒక నెల, పితృ దేవతలకు ఒక రోజు. మనుష్య మాసములో రెండు మాసములు ఒక ఋతువు, ఆరు మాసములు ఒక అయనము. దక్షిణాయనము, ఉత్తరాయణము అవి అయనములు రెండు. దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. వారికి సంవత్సరము ఒక రోజు. ఇట్టి మాసములు 12 ఒక సంవత్సరం అనబడును. మనుష్యులకు 100 సంవత్సరములు ఆయుర్దాయము. సూర్యుడు నిత్యము మెలుకొని ఉండువాడు, ఎల్లడా వ్యాపించి ఉండువాడు. గ్రహములు, అశ్వన్యాది నక్షత్రములు, మిగిలిన తారకలు అనువానితో కూడిన ఉన్న చక్రమునందు సూర్యుడు ఉండును. ఒక సంవత్సర కాలము కాలచక్రమున తిరుగును అనగా భువన కోశమున సంచరించును. అందుచే సూర్యుని గమనముచే ఆయుష్షు తరిగిపోవుచుండును. సూర్యుడు గమనముచే భువనకోశమును అతిక్రమించు కాలము సంవత్సరము. బృహస్పతి గమనముచే పరివత్సరము. 30 రోజులు ఒక నెల అను లెక్కతో 12 నెలలు గడుచుట ఇలా వత్సరము. చంద్రుని గమనముచో ఇద్వత్సరము. నక్షత్ర గమనముచే వత్సరము ఏర్పడును. ఇట్లు గతిభేదముచే వత్సరము, సంవత్సరము, పరివత్సరము ఇలా వత్సరము, ఇద్వత్సరము. అని ఐదు మానవులు ఏర్పడుచున్నవి. ఈ విధంగా సూక్ష్మ స్థూల రూపము కాల విభాగమును ఎరుంగుటకు సూర్యుని గమనము సాధనము. ఎవడు తన కాలముని శక్తిచే సృజింపబడిన పదార్థముల యొక్క కర్మశక్తిని మారుచుచున్నాడో.
ఎవడు భూతములలో వికారములను కలిగించుచున్నాడో అట్టి భగవానుడు అంతరిక్షమందు సూర్య అంతర్వర్తి అయి సంచరించుచున్నాడు. జీవునకు మోహము తొలగించి ఆయా కాలములయందు చేయదగిన ధర్మములను ఆచరించుచున్నట్లు చేయుచున్నాడు. అట్టి సూర్య శరీరకుడు సంవత్సరం మొదలగు ఐదు విధములగు వత్సర రూపములో ఉన్న భగవానుడు అతనికి పూజ చేయుడు. సూర్యమండలాత్ వర్తి అగు పురుషునిలో నారాయణుని ఉపాసించవలని విదురుడకు మైత్రేయుడు ఎరంగించెను. తర్వాత మళ్ళీ విదురుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు, దాని జవాబు ఏం చెప్తున్నాడో మరొక భాగంలో మనం తెలుసుకుందాం. ఇంకా కాలంలో ఉన్నటువంటి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. అందరూ మరొకసారి విని అర్థం చేసుకుని తర్వాత భాగానికి సిద్ధం కండి. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to Ardalinga, salutations to the inner self, salutations to the virtuous world, salutations to the one who shines greatly. The sky, which indicates the difference between substances, is the form of Sri Hari, the origin of the matter of inside and outside. The great bright heavens and other upper worlds obtained by merit are also forms of Srihari. Salutations to that Srihari. Fourth Canto, 24th Chapter, 48th Prayer. Devotees of God, welcome to the third episode of the third book of Srimad Bhagavata Tattva Deepika, in the 14th podcast. Previously, we learned that there are two parts in God's creation: Prakrita and Vaikruta. Starting from Prakrita and Vaikruta, nine creations occur, and we will learn their names. Among them, we will discuss three creations We found out. The great creation, the creation of ego, the creation of beings, these details. You can listen to this episode later on the 13th podcast. The fourth is the creation of the senses. The creation of the senses, the senses, the organs of action, is the creation of the senses. Fifth The creation of the gods who are fond of senses, this is called Deva Sargamu. In this divine creation, the creation of the gods who are the abode of senses, directions, etc., will take place. Then, Tamasa Sargamu means the creation of the universe, which is the form of nature. They call that creation Tamasic creation. It is the sixth one. It is not created by Chaturmukha. This universe was created by the will of God. These six are called Prakrita Sargas. The next category is the Vaikhruta. This creation happened from the four-faced one.
The body of Chaturmukhi is said to have a predominance of Rajasic qualities. The seventh creation, the establishment of creation, will happen. After the six Prakrit Sargas, the first in Vikruta Sarga is Sthavara Srishti. These bases are non-conscious and non-personal. They are medicines and herbs. The skin as the primary source. Kadali means banana and venu means bamboo. Plants and trees are static. Its food is secreted from below upwards. These are the ones that don't make sense. Consciousness is not something that can be expressed. His touch causes cold, heat, and other pleasures and pains. Those that do not know the external specialties, those that do not know the internal touch, such are the stationary ones, those that walk sideways are the rotating ones. It's the eighth one. These are the 28 types of Tiriyakkul. Yesterday, today, tomorrow, without any sense of time. Due to the deep covering of the quality of darkness, there is only interest in food, sleep, and sexual intercourse. Those that recognize an object by its smell, understand the pleasures and pains within, but cannot remember them for a long time. The differences are cows and goats. Cattle, sheep, pigs, wild animals in the forest, Deer, sheep, camels, etc. The two-horned ones, that is, the split-horned ones, are the top animals. Donkey, horse, horsemen, deer, and chamari animal are some of them. These twelve species. And five are prestigious: dog, fox, wolf, tiger, cat, cat, cat, porcupine, lion, monkey, elephant. Turtles and snakes. These are all animals that roam the Earth. In total, these are 28, 27 types. Crocodiles, aquatic animals, eagles, cranes, ostriches, shells, lapwing, heron, cranes, swans, cranes, cuckoos, crow, owl, etc.
Besides the earth, the birds that fly in the sky, all of these are the eighth creation. Ninth is Arvak Strotasam. Their food and bodies flow from top to bottom, not sideways. They are called Arvak Srotas. The people of this creation are human beings. They have more of the Rajasic quality. Therefore, they are doing karma. Those who know how to enjoy happiness when they have it. These three are the Vaikhrutha sargas. In this Vaikhṣṇa Sarga, there is a difference between Deva Sarga and Kumara Sarga. They are included in Prakrit Sarga and Vaikhrt Sarga. The creation of the sons of Sanatkumaras, who were first created by Brahma. This is from the Vaikuntha creation, but since it was the first to be created, it is also called Prakrit. Therefore, the creation of Kumara is also Prakrit and Vaikruta. The gods are grouped into eight different types. Pitru Devatalu, Asurulu, Gandharvulu, Apsarasalu, Siddhulu, Yaksharakshasulu, Charanulu, Bhuta Praetapa Pishachamulu. Kinnaras, Kimpurushas and Vidyādhāras. These are eight. Thus, the creation of God is of eight types. This Thus, the creation created by the four-faced one, along with the Prakrit creation that happened up to the end of creation, is described in ten ways. And after that, I will destroy the Manvantaras and the Manus, which are parts of the time that pervades all things. In this way, Srihari, who was self-existent, became a four-faced being, and entered into the being with the excitement of Rajoguna and created it. The elders do not agree that in this egg, which has the qualities of sattva, rajas, and tamas combined, one is created before the other. All were created at the same time. The Supreme Soul is the source of all wondrous energy. He is the one who can at once contain and surpass all essences. When water moves in a river, swirls and bubbles are formed simultaneously. But one doesn't replace the other. Similarly, all the elements emerged from nature at once.
Indra and other gods are present in every kalpa. The demons will be there. Their shapes and names are the same in each Manvantara. The nature of time is explained by the fact that time is a substance that is pervaded by time. But it is not possible to know that time is like this. The time when the sun crosses the Paramanu country is called Paramanu Kaalam. In the 12 zodiac signs, the sun crosses the Bhuvanakoshamu, the time of crossing, and it is called Mahakala. This is the ultimate limit of time. When a substance is divided, the smallest part among its parts, which cannot be further divided, is called an atom. That which is not a community of some, that which is not a functional state, that which is not a community state, from that stage, the subtle substance is called a molecule. The movement of such a substance is called time. Thus, time is composed of many parts. But unable to overcome it, they consider time to be infinite. When the substance in a state of operation is in a form that does not undergo any further change It is called Parama Mahan because it is the greatest of all. Nothing bigger than that. Thus, when dividing substances, they are called atomic for the subatomic particle, macroscopic for the large particle, or gross for the macroscopic particle. The movement of the sun, when combined with that atom, that great substance, how much time it takes, that should be considered as time. Time is the form of the Divine. That is not possible to prove by that standard. Time is what causes changes in the visible objects. It's all over.
The shortest time period in that era was the atom. The largest unit of time is the year. As the number of those years increases, they are referred to as 'pararthamani', 'yugamulu', and 'manvantaras'. But in time, the last stage of the gross eight is the year. In an atom, which is a collection of particles, two combined form an atomic particle. Three such atoms combine to form a molecule. It is impossible to identify the time when it is smaller than a molecule, smaller than an atom, than a particle. The minute pollen grains that are visible when sunlight shines through the window are called stamen pollen grains. It will be in the sky. It will never reach the ground. The time when the solar rays are pervading to the extent of the solar sphere is the solar time. The time it takes for a dust particle to appear in the sunlight coming from the window is called a 'thrasaranu kaalam' (a unit of time). Three Thursdays are called Truti. Thruti is one hundredth of the time called Vedha. Such pains are two, one is Lavamu. Three minutes for the lavambu. Three Minute is a time unit and also a moment. Five moments of ash. Kaashta has fiveteen laghus. Ten times the time of the short syllables is one nadika, two nadikalu is one muhurtam, six or seven nadikalu is a praharam. That is, Jamu. These jams are for four days, day and night, four each day, making eight jams per day. Once upon a time, there used to be six or seven jams at night. Evening does not reach here.
With a needle made of four black gram seeds, make a hole in a vessel that holds a handful of water, and when that vessel is placed on the water, the water comes in through that hole, and how long it takes for that vessel to fill and sink in the water, that Time is called Nadika. Such nerves are two, a moment. Six or seven such nerves, one pair. Four days by four and four nights make one day of eight hours. These days are five days, one fortnight, Shukla Paksha and Krishna Paksha, these are the two fortnights. The month, this is the month of Manushya. A month for humans, a day for the ancestor. In the human month, two months are a season, six months are a year. Dakshinayanam and Uttarayanam are two such periods. Dakshinayanam is the night for the Gods and Uttarayanam is the day. They have a year-long membership. Thus, 12 months make a year. Humans have a lifetime of 100 years. The sun is always awake, always pervading. Planets, constellations like Ashwinya, and other stars are included The sun is in opposition. A year's time revolves in the cycle of time, meaning it circulates in the universe. Therefore, due to the movement of the sun, life span is decreasing. The time when the sun crosses the ecliptic is called a year. A year is the time it takes for Jupiter to orbit the Sun. 30 days, one month, with that calculation, 12 months passing, like this, a year. The lunar month is a year. The year is determined by the motion of stars. Thus, due to the difference in gati, vatsaram, varsham, parishyam, like vatsaram, idvarsham. And five humans are being formed. In this way, to understand the subtle and gross forms and the division of time, the movement of the sun is the means. Who is changing the karmic energy of the substances created by his time's power?
Who is causing disturbances in the ghosts, such a God is wandering in space as the sun's interior. He is removing the attachment to the living being and making them practice the righteousness that can be done in those times. That Surya Bharata, the Lord who is in the form of five types of years starting from the beginning of the year, should be worshiped by him. Maitreya exclaimed to Vidura, "In the sun-centered universe, one should worship Narayana." Then again, what question is Vidur asking, what answer is he telling in another part, let's find out. There are still details that need to be known in time. This is a very, very important part. Everyone, listen once again, understand, and then prepare for the next part. Jai Srimannarayana. Salutations to the Gurus