భూదేవి రసాతల గమనము - బ్రహ్మదేవుని చింత
Submersion of Mother Earth & Brahma's Anxiety
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, అధర్మభారాన్ని తట్టుకోలేక భూదేవి రసాతలంలో మునిగిపోవడం వర్ణించబడింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ మహావిపత్తును చూసి తీవ్రమైన చింతకు గురవుతాడు మరియు సృష్టిని తిరిగి నిలబెట్టే మార్గం కానరాక కలవరపడతాడు. అస్తిత్వపు పునాది అయిన భూమి సంరక్షణ కోసం భగవంతుని దివ్య అవతారం అనివార్యమవుతుందని ఈ ఘట్టం హృద్యంగా వివరిస్తుంది, వరాహావతారం యొక్క ఆగమనానికి నాంది పలుకుతుంది.
In this sacred episode of Srimad Bhagavatham Canto 3, we explore the alarming moment when Mother Earth, overwhelmed by the weight of adharma, sinks into the depths of the cosmic ocean known as Rasatala. Lord Brahma, the creator of the universe, witnesses this catastrophe and is seized with deep anxiety, unable to fathom how creation itself can be restored. This episode beautifully illustrates how the Lord's divine intervention becomes essential when the very foundation of existence is threatened, setting the stage for the glorious appearance of Lord Varaha.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః శుద్ధాయ శాంతాయ నమస్వ నిష్ఠయా మనస్య పార్థం వికసద్వయాయ నమో జగత్స్థాన లయోధయేషు గృహీతమాయ గుణవిగ్రహాయ శుద్ధునకు, శాంతునకు, సనిష్టతో మనసులలో అపార్థముగా భేద భావనను వికసింపచేయువానికి జగత్ యొక్క సృష్టి స్థితిలేములయందు యోగమాయచే గ్రహించబడిన గుణమయ ఆకారము కలవానికి నమస్కారము. ఫోర్త్ క్యాంటో, 30వ చాప్టర్, 20వ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం 19వ. పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం స్వయంభువ మనువు సృష్టి చేయమని అడిగినప్పుడు అడుగున సముద్రంలో దాగినటువంటి ఆ భూమిని పైకి తీసుకురావడానికి వరాహ అవతారం ఉద్భవించడం చూశాం. ఆ ఉద్భవించిన వరాహ అవతారని బ్రహ్మ ఇతర దేవత అందరూ కూడాను ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన భాగంలో ఇంకొంత భాగాన్ని మనం ఇప్పుడు సేవిద్దాం. పరిష మొదలగు విషయములందు ఆసక్తి లేకపోవుట అనడి వైరాగ్యము, భక్తి, మనోజైవం వీటిచే కలిగిన ధ్యాన రూపము జ్ఞానము అనునవి అన్నియు నీ అనుగ్రహమును ఆర్జించుటకు సాధనములు. అట్టి సకల విద్యలకు గురువగు నీవు గురువు ఆచారుడు అయి ఉన్నావు. వరాహవతారమున రామావతారమున కృష్ణావతారమున భగవానుడే ఉపాయమని విశ్వసించిన వారికి తానే రక్షకుడనే ఉండునని స్వామి ఉపదేశించినాడు. కావున శరణాగతి అనేటి విద్యను లోకములకు అందించిన విద్యా గురువు శ్రీ వరాహమూర్తి. నీ కోర చివరి భాగమున భూమి పర్వతములతో కూడి పైకెత్తబడి ప్రకాశించుచున్నది.
తెల్లని నీ కూరలపై కూరపై నిలిచి ఉన్న భూమి ఏనుగు మడుగు నుండి వెలికి వచ్చుచు బురదతో కూడిన తామర తీగను తన కూరతో పెకిలించి పైకి తెచ్చుచున్నట్లు ఉండెను. దంతముతో భూమండలము దాల్చి ఉన్న నీ వరాహ రూపము శిఖరముపై మేఘము నిలిచి ఉన్న కుల పర్వతం వలె ఒప్పుచున్నది. హే భగవాన్ స్థావర జంగమాత్మకమగు ఈ లోకము నిలుచుటకు ఆధారముగా నీ భార్యయు జగత్తులగు తల్లియైగు ఈ భూమిని నిలుపుము. నీవు జగత్తులకు తండ్రివి రక్షకుడవు కూడా అయి ఉన్నావు ఆ భూమి మీద ఉండి మేమందరము తల్లిదండ్రులగు మీ ఇరువురకు నమస్కారము చేసి సేవింతుము యజ్ఞమును ఆచరించువారు తమ మంత్రశక్తిచే అరణ్యయందు అగ్నిని ప్రతిష్ఠించినట్లు భూమిని నీయందు నీవు నిక్షేపించుకొని ఒంటివి. పాతాళమునకు అంటుకొని పోయిన ఈ భూమిని వెలికితీయుట నీవు తప్ప వేరొకడెవరూ చేయగలడు. నీవు ఇట్లు చేయుటలో ఆశ్చర్యము లేదు. నీవు విశ్వమునంతకు ఆశ్చర్యకరమగు వివిధ విచిత్త రూపములతో జగత్తును సృజించగలవాడవు. నీ సంకల్ప మాత్రముచే ఆశ్చర్యకరమగు నీ సంకల్ప శక్తిచే విశ్వమును సృజించితివి. నీవు నీట నుండి వెలికి వచ్చుచు జూలు దులిపినప్పుడు పైన పడిన నీటి బిందువులచే జనః తపః సత్యలోకములలోని మేమందరము పరిశుద్ధి నందినాము. అపారముకు జగత్ సృష్టి మొదలగు వ్యాపారములను చేయు నీ కర్మల అంతు ఎరంగవలెనని కోరినవారు కోరినవాడు బుద్ధిహీనుడు. నీ యోగ మాయా శక్తిచే సత్వరజస్తమో గుణముల సంబంధముచే ఈ విశ్వమంతయు మోహమునందినదై. సుఖమునంది ఉండునట్లు నీవే అనుగ్రహింపుము. ఇట్లు బ్రహ్మవేత్తలగు మునులచే స్తోత్రము చేయబడిన ఆ వరాహమూర్తి తాను వెలికితీసిన భూమిని తన గిట్టలతో ఆక్రమింపబడిన జలమునందు ప్రతిష్ఠించెను. ఇట్లు భగవానుడు రసాతలము నుండి భూమిని వెలికితీసి జలముపై ప్రతిష్టించి తానేగెను. తన కీర్తిచే లోకమును పాలనము చేయు భగవానుని మంగళకరమగు మనోహరమగు ఈ కథను ఎవడు వినునో. వినిపించునో వాని హృదయమునందు భగవానుడు వసించి ప్రసన్నముగా చేయును. సకల పురుషార్ధములను వసంగెడి భగవానుడు ప్రసన్నమైన నాడు ఇక లభింపనిది ఏదీ ఉండదు.
అల్పములగు కోరికలు కోరుట మాని ఆ పరమాత్మే తనకు ఆత్మేని ప్రేమించి సేవించు వారిని తనంత తానే తనను పొందించుకొనును. పురుషార్ధము ఎరింగినవాడు పూర్వ కథలను వినునప్పుడు తను చెవులని దోసిలిగా చేసుకొని త్రాగి సంసారమును తొలగించుకొని జీవించుచు ఇది చాలును అని తృప్తినందు వాడెవడు? భగవత్ కథలను వినడి వానికి తృప్తి ఉండదు. భగవత్ కథలను విని చాలును అనిన వాడు పశువై ఉండినే గాని మనుష్యుడు కాదు. విదురుడు మైత్రేయుడు చెప్పిన వరాహ రూపియగు భగవానుని కథను విని భగవత్ కథా శ్రవణము యందు తృప్తి లేని వాడై రెండు చేతులను ఎత్తి నమస్కరించుచు మరల ఇట్లు ప్రశ్నించెను. యజ్ఞమూర్తియగు శ్రీహరి ఆది దైత్యుడగు శిరణ్యాక్షుని చంపెనని వింటిని కానీ కోరతో భూమిని ఉద్ధరించుండగా వరాహమూర్తికి హిరణ్యాక్షునికి యుద్ధం ఎలా జరిగెను ఎరింగింపుము అనెను. విదురుని ప్రశ్న విని మైత్రేయుడు అభినందించుచున్నాడు. చాలా బాగుగా ప్రశ్నించితివి. మరణశీలులగు మనుష్యులకు మృత్యుపాశమును శిథిలము చేయునది భగవత్ కథయే. నారదుడు చెప్పిన భగవత్ కథను విని ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు మృత్యు శిరస్సుపై పాదమును మోపి భగవత్ స్థానమును అధిరోహించినాడు. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు చెప్పుచుండగా నేను ఒక ఇతిహాసమును విన్నాను దానిని చెప్పదని వినుము. పూర్వము దితి అనడి దక్ష ప్రజాపతి కుమార్తె సంతానము కావలనిడి అనడి కోరికతో తన భర్తయగు కాశ్యపుని కామపరవశ అయి సంధ్యా సమయంలో పొందవలెనని కోరినది. సంధ్యా సమయమున అగ్నిహోత్రం ఉనర్చుకొని యజ్ఞపతియగు పరమపురుషుని ఆరాధించి సూర్యాస్తమయ సమయం అగు సమయం అవుచుండగా కాశ్యపుడు అగ్నిహోత్ర శాలలో కూర్చొని ఉండెను. అతని వద్దకు దితి వెళ్లి దేవా మీ సమాగమమును పొందవలెనని కామదేవుడు నన్ను కదల్చి వేయుచున్నాడు. నా సవతులందరూ సంతానవతులై ఐశ్వర్యముతో సుఖముగా ఉండుట చూచి నా మనస్సు దహించుకొని పోవుచున్నది. నన్ను మీరు అనుగ్రహింపు ప్రార్థన మీకు మంగళమవుకాక. భర్త యొక్క ఆదరమును పొందిన స్త్రీలు లోకములో కీర్తినందుదురు. భర్త చేయు సమ్మానము భార్యకు తాను ఆమెయందు మరల జన్మించుటయే కదా.
భర్తయే భార్యయందు కుమారుడుగా జన్మించునని ప్రసిద్ధమై ఉన్నది. పూర్వం మా తండ్రియగు ప్రజాపతి తన కుమార్తెలయగు మాయందు ప్రేమ గలవాడై మమ్ములను వేరువేరుగా పిలిచి వరునిగా ఎవరు కావాలని అడిగెను. అప్పుడు అందరము మిమ్మలనే భర్తగా కోరుకొంటిమి. అప్పుడు మమ్ములను పదముగ్గురును మీకు భార్యలుగా సమర్పించినాడు. మేమందరము నీ స్వభావమును అనుసరించి ప్రవర్తించు వారలము. అందుచే నీవు మా యెడల సమానముగా ప్రేమను చూపుట న్యాయము. నీవు మంగళకరుడవు, నా కోరికను తీర్చి అనుగ్రహింపవలెను. ఆర్తులు మహాపురుషులను చేరి తమ కోరిక నెరవేరక మరలుట ఉండదు కదా? ఇట్లు దీనముగా కామ పరవశ అయి చాలా మాటలు మాట్లాడుచున్న దితిని చూసి జితేంద్రియుడు కాస్తపుడు ఇట్లు బదులు పలికెను. లోకములో భార్య కోరికను తీరుచుట భర్త ధర్మము కదా కావున తప్పక నీ కోరికను తీర్చగలను. భార్యే ధర్మార్థ కామములను సాధించుటకు సాధనము. భార్య గల పురుషుడు గృహస్థాశ్రమమునందు ఉండి మిగిలిన మూడు ఆశ్రమముల వారిని సేవించుచు దుఃఖమును దుఃఖమును సముద్రమును దాటగలడు. భార్య భర్తకు అర్ధ శరీరమని శాస్త్రములు చెప్పును. ధర్మార్థ కామముల యందు భార్య కూడా భర్తతో సమానముగా బరువు మోసి ఏ విధములగు తాపములు లేకుండా చేయును. బ్రహ్మచర్యం మొదలగు ఆశ్రములలో ఉండువారు ఇంద్రియములను జయించుటకు చాలా శ్రమపడవలెను. దుర్గము గలవాడు దొంగలు మొదలగు వారు లోనికి రాకుండా ఎట్లు నిరోధించుకొనగలడో అట్లే భార్యతో కూడి ఉన్న గృహస్థ ఇంద్రియములను ఇంద్రియములను దొంగలను సులభముగా నిరోధించుకోగలడు. ఇట్లు ఉపకారము చేయు నీకు ఏమి చేసి ఉపకారమునకు ప్రత్యుపకారమును చేయగలను? నీవు సంతానము కొరకు ఇప్పుడు కోరితివి. తప్పక నెరవేర్చెదను. కానీ ఒక ముహూర్త కాలము తమోగుణం అధికముగా గల రుద్రుడు వారి సేవకు గల ప్రమద గణములన్నిటి భూతములు ఎల్లడిలా సంచరించుందురు. భూతములకు అధిపతియగు రుద్రుడు ప్రమద గణములతో కూడినవాడై తన వాహనమగు వృషభ భూమిపై భూమినంతను సంచరించుచుండును. స్మశానములో బయలుదేరిన సుడిగాలికి చెదిరిన కేశములు గలవాడై ఒడలి నిండుగా భస్మము పూసుకొని దివ్య దేహకాంతితో ప్రకాశించుచు రుద్రుడు
తన మూడు కన్నులతో లోకమునంతును చూచుచుండును. అతనికి మరుగైన ప్రదేశం ఉండదు. అతడు నీకు మరిది. నీ సోదరియగు సతీదేవి భర్త. అందుచే ఇతడు చూచుచుండగా మనము కలియరాదు. అతనికి తనవారు పైవారును భేదము లేదు. ఒకరు ఆదరింపదగిన వారు వేరొకరు నిందింపదగిన వారు అనునది కూడా లేదు. మనము సంసారులము. ఈ విభూతి అంతయు ఆ రుద్రుని పాములతో నిర్మాల్యము వలె త్రొక్కబడి అనుభవింపబడి వదిలివేయబడినది. సంసారులందరూ అనేకములగు ఐశ్వర్య సాధనములను అనుభవించి ఆ విభూతులను కోరుచుందురు. ఆ రుద్రుని చరిత్రము నిర్దిష్టమైనది. ఆ అవిద్యావరణమును తొలగించు జ్ఞానము వసంగెడివాడు ఆ రుద్రుడే. ఇట్టి వాడైయు పిశాచ వ్యాపారమును చేయుచు తిరుగుచుండును. అతడు ఆత్మానుభవమును ఆనందించువాడు. అందుకే అతనికి బాహ్యముగా వేషము ప్రధానము కాదు. బాహ్యమగు వేషము ప్రధానము కాదు. అది ఎరుంగని అజ్ఞానులు అతని చరిత్రమును నిందించుచుందురు. కుక్కలకో, నక్కలకో ఆహారమయ్యెడి ఈ శరీరము తాను అనుకొని దీనిని వస్త్రాదులతో అలంకరించుకొనెడి వారు మూర్ఖులు. పులస్త్యుడు, పులహుడు మొదగు ప్రజాపతులందరూ ఆ రుద్రుడు ఏర్పరిచిన మర్యాదలనే పాలించుచుందురు. ఈ విశ్వమును సంహరించువాడా అతడు. అందుచే అతనే ఈ విశ్వమునకు కారణమై యుండును. మాయ అతని ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించును. అహంకారమునకు అతడు అధిష్టాన దైవము. అందుచే అహంకారము అతని వశవర్తి అయి ఉండును. అట్టి వాని ప్రవర్తనము లోక విరుద్ధముగా ఉండుట నటనమే. అందుచే నీవు భర్తృ సమాగమము కోరుట తగదు అని చెప్పెను. మరి దాని తరువాత దితి ఏమన్నది ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the pure, peaceful, and steadfast one. Salutations to the one who is the cause of the expansion of the mind. Salutations to the one who is the destroyer of the world's snares. Salutations to the pure, peaceful, and Salutations to the one who, with devotion, causes misunderstanding and discrimination in the minds, to the one who, through the illusion of Yoga, has a virtuous form perceived in the creation, the preservation, and the destruction of the world. Fourth Canto, Chapter 30, 20th Prayer. Devotees of God, Srimad Bhagavata Tattva Deepika, Third Canto, 19th. Welcome to the podcast. Until now, when we asked the self-existent Manu to create, we saw the incarnation of Varaha emerging to bring that land hidden in the sea to the surface. The Varaha avatar that originated, Brahma and all other gods are praying. Let us now give attention to the prayer part of the session. Not having interest in matters like Parisha, detachment, devotion, mental life, the form of meditation, knowledge, all these are means to acquire your grace. You are the guru, the guru of all knowledge You're a jockey. In the incarnation of Varaha, in the incarnation of Rama, in the incarnation of Krishna, the Lord himself is the means, and the Swami has preached that he himself is the protector for those who believe. Therefore, the teacher who imparted the knowledge of surrender, the teacher of education, Sri Varahamurthy. The end of your tail is raised with the earth and mountains, shining.
The earth standing on the white vegetables, like an elephant emerging from a pond, was lifting a lotus vine covered in mud with its vegetables. Your boar form, which holds the earth with its teeth, resembles a mountain of caste, with a cloud standing on its peak. Hey Bhagavan, as the immovable and movable, this world, as the basis for its existence, your wife also, as the mother of the worlds, hold this earth. You are the father of the worlds, you are also the protector. Staying on this earth, we all become parents. We offer our salutations to both of you and serve you. Those who perform Yagnya (sacrificial rituals) have established fire in the forest with their mantra power You are the one who is deposited in the earth. Except you, no one else can bring this earth, which has stuck to the underworld. No wonder you're so good at it. You are the one who can create the world with various forms that are astonishing throughout the universe. You created the universe with your will, with your wondrous will power. You are coming out of the water, the tail When wiped, by the water droplets that fell on it, we all in the world of truth were purified. Those who wish that the end of your actions, which are like the creation of the world, should be like the end of your actions, are fools. By your yogic power, through the connection of the three qualities of Sattva, Rajas, and Tamas, this entire universe is deluded. May you be blessed with happiness. Thus, that Varahamurthy, who was praised by the Brahmavidas and sages, established the land he had brought out in the water occupied by his pegs. Thus, the Lord took out the earth from the netherworld, placed it on the water, and rose up. Whoever listens to this story, which is auspicious and beautiful, and whoever governs the world with his fame. He who listens, the Lord dwells in his heart and makes him happy. When the Lord, who resides in all beings, is pleased, there is nothing that cannot be obtained.
Abandoning small desires, that Supreme Being, loving and serving those who love Himself, will Himself obtain Himself. Who is satisfied that he who has attained the purpose, when he listens to the former stories, makes his ears a vessel, drinks, removes the family, and lives, is it enough? The Lord's stories are not satisfying to the listener. He who says that listening to the stories of the Lord is enough, even if he is an animal, is not a human. Vidurudu, having heard the story of the boar-formed Lord told by Maitreya, was not satisfied with listening to the Lord's story, and raising both hands, he bowed and asked again. I have heard that Srihari, the Yagnyamurthy, killed the first demon, Shiranyaksha, but while he was uplifting the earth with his wish, how did the war between Varahamurthy and Hiranyaksha take place? Please tell me, he said. Maitreyi is congratulating Vidura upon hearing his question. You asked very good questions. The story of God is what destroys the noose of death for mortal beings. Having heard the divine story narrated by Narada, Dhruva, the son of Uttanapada He placed his foot on the head of death and ascended to the abode of the Lord. While the ancient four-faced Brahma was telling the gods, I heard a story, listen to it without telling it. In the past, Diti, the daughter of Daksha Prajapati, with the desire to have children, desired to have her husband Kashyapa, overcome by lust, and desired to have children in the evening. In the evening, after performing the Agnihotra, worshiping the supreme being who is the sacrificer, as the time of sunset approached, Kasyapa was sitting in the Agnihotra hall. Kamadeva is making me change so that Diti goes to him and attains your union, O God. Seeing all my sons and daughters-in-law living happily with wealth, my heart is burning. May your prayer of blessing be a blessing to me. Woman who honor her husband will be honored in the world. The respect a husband shows to his wife is that he is reborn in her.
It is well known that a husband is born as a son to his wife. Once upon a time, Prajapati, our father, loved his daughters Maya and called us separately and asked who wanted to be his groom. Then we all wished you as a husband. Then he offered us, the three of us, as wives to you. We are all of us following your nature. Therefore, it is fair for you to show equal love towards us. You are auspicious, please fulfill my wish. Doesn't it happen that the wishes of the great men are fulfilled by those who approach them? Thus, seeing Diti, who was in a state of lust and was talking a lot, Jitendriya replied thus. In the world, fulfilling a wife's desire is the duty of a husband, so I can definitely fulfill your desire. Wife is a means to achieve dharma, artha and kama. A man with a wife, being in the household stage, serves the other three stages and can cross the ocean of sorrow and sorrow. Wife is half the body of her husband, according to scriptures Tell me. In matters of dharma, artha, and kama, a wife, like her husband, bears equal weight and prevents any kind of suffering. Those who are in ashrams like Brahmacharya should strive very hard to conquer their senses. Just as a fortress can prevent thieves and others from entering, similarly, a householder with his wife can easily prevent the senses and thieves. Thus, what can I do to repay you for your kindness? Now you ask for children. I will definitely do that. But at a moment, Rudra, who has a high degree of Tamoguna, and all the ghosts of the Pramada Ganas who serve them, how will they roam everywhere? Rudra, the lord of the ghosts, along with the group of Pramada, his vehicle, the bull, roams all over the earth. Rudra, with hair scattered by the whirlwind that started in the cremation ground, with his body full of ashes, shining with divine radiance
He sees the whole world with his three eyes. He has no sense of privacy. He's your brother-in-law. Your sister's husband is a widower. Therefore, while he is watching, we should not be disturbed. He has no discrimination between his people and others. There is no one to be respected and another to be condemned. We are family. This glory was all crushed and experienced like the serpents of Rudra, and then abandoned. All the people, having experienced many kinds of wealth, desire those possessions. The story of Rudra is specific. That Rudra is the one who removes the ignorance and instills knowledge. Such a person is also doing occult business and wandering around. He is a self-realized one. Therefore, his external appearance is not important. External appearance is not important. Those who are ignorant and unaware criticize his history. Those who think that this body, which is food for dogs or foxes, is to be decorated with clothes, are fools. Pulastya, Pulahu, and all the other Prajapatis, that Rudra They follow the established customs. He who annihilates the universe. Therefore, he is the cause of this universe. The illusion will obey his commands. He is the supreme deity of Ahankaram. Therefore, ego becomes his subordinate. His behavior is contrary to the world, it is an act. Therefore, he said that it is not appropriate for you to desire a union with your husband. And after that, let's experience what Diti said in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.