మహత్తత్వ ప్రాకట్యము - అహంకార తత్వ వికాసము
Manifestation of Mahat-Tattva & Ego Elements
ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, మూడవ స్కంధంలోని పరమ పవిత్రమైన మహత్తత్వ ప్రాకట్యము గురించి లోతైన వివరణలు అందించబడతాయి. భగవంతుని సంకల్పం వలన ఉద్భవించిన మహత్తత్వం నుండి అహంకార తత్వము సత్త్వ, రజస్, తమో గుణాలుగా విభజించబడే రహస్యమైన ప్రక్రియ వివరించబడుతుంది. సమస్త సృష్టికి మూలాధారమైన ఈ సూక్ష్మ తత్వాల ద్వారా పరమేశ్వరుడు ఏ విధంగా విశ్వాన్ని నిర్మిస్తాడో ఈ ఎపిసోడ్ చక్కగా తెలియజేస్తుంది.
In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the third canto's sacred teachings on the emergence of Mahat-Tattva, the great cosmic intelligence that arises from the Lord's divine will. We then delve into the unfolding of Ahamkara, the ego principle, which further differentiates into the three modes of Sattva, Rajas, and Tamas, setting the foundation for all material creation. This episode beautifully illuminates how the Supreme Lord's creative energy systematically manifests the building blocks of the entire universe through these subtle principles.
హరే శ్రీ నారాయణ నమ ఊర్జ ఇషేత్రయ్యాహ పతయే యజ్ఞ రేతసే తృప్తిదాయచ జీవానాం నమః సర్వరసాత్మనే పితృ దేవతలకు మరియు దేవతలకు ఆహారము యజ్ఞము చేసిన మానవులకు ఫలము చంద్రుడే ఆ చంద్రుని రూపములో ఉన్నది కర్మకు మూలమైన రుగ్యజు సామవేదములకు ప్రభువగు శ్రీహరియే సకల రసముల రూపంలో నుండి ప్రాణులకు దాహశాంతిని కలిగించే నీరు రూపములోనున్న శ్రీహరికి నమస్కారము. భగవంతుల్లారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 12వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం తామ్ర కాడలో నుంచి ఆ పద్మంలో నుండి ఉభవించినటువంటి బ్రహ్మ పరమాత్మ ప్రత్యక్షమైన వెంటనే తన స్తుతిస్తూ ఉన్నాడు, ఆ స్తుతిలో కొంత భాగాన్ని మనం అనుభవించాం. ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఓ భగవన్, నీవే నీతో వేరుగా ఉండని లక్ష్మీదేవితో కూడా సర్వజ్ఞత్వం మొదలగు సహజము గుణములను విడువకని అవతరించి ఎన్నో లీలలను చేయుచుందురు. అట్టి లీలలను అనుభవించి ఆనందించెడు మనసును నాకు ప్రసాదింపుము. నీ గుణములను, నీ కర్మలను అనుభవించుటచే నా పాపములు నన్ను వీడిపోవును. నీ అనుగ్రహముచే నీ అవతారములను, గుణములను, కర్మలను అనుభవించుచు నీచే నియమింపబడు నీదే అగు జగత్తును నీ ఆజ్ఞచే నీ సేవగా సృజించుచు ఉండునట్లు అనుగ్రహింపు. అనంతము శక్తి గల సర్వేశ్వరా, జలములలో శయనించి ఉన్న నీ నాభి నుండి పరిపూర్ణమగు విజ్ఞానం గల నేను ఆవిర్భవించితిని. నీ శరీరముగా నీ నియమమునకు నియమనమునకు లోబడ ఉండేది ఈ జగత్తును విస్తరింపచేయుట.
నేను చేయదగిన కార్యము దానికి తగిన జ్ఞానమును ప్రసాదించెడి వేదవాణి యొక్క స్మరణము ఉచ్చారణము నాకు సంతతము సాగుగాక. నీవు అపారము కృప కలవాడవు పురాణ పురుషుడవు. అత్యధికమగు ప్రేమతో మందహాసము చేయుచు నేత్ర పద్మములను వికసింపజేయుదు మమ్ములను అనుగ్రహించుటకు. ఆ నిద్ర నుండి మేల్కొని మధురమగు వాక్కులతో నన్ను అలరించుచుందువు. అట్టి నీ వాక్కు నా దుఃఖమును తొలగించు గాక. ఇట్లు చతుర్ముఖుడు తాను ఎవరి నుండి జన్మించినాడో. ఆ భగవానుని తన కర్మ జ్ఞాన భక్తులచే దర్శించి తన మనసునకు మాటలకు అందినంత మేర స్తోత్రము చేసి శ్రమపడిన వాని వలె విరమించెను. మధుసూదనుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క అభిప్రాయమును ఎరింగి గంభీరమైన వాక్కుతో అతని మోహమును తెలగించుచున్నాడు. ఈ లోకం యొక్క నిర్మాణం ఎట్లు చేయవలెనో ఏమి చేయవలెనో తెలియక ఖేదము నొందకుము. సృష్టి చేయ ప్రయత్నింపుము. నీవు నన్ను ప్రార్థించునట్లుగా నీకు జ్ఞానము కలుగునట్లుగా నేను సంకల్పించితిని. నీవు నన్నే ధ్యానము చేయుచు నా ఆరాధనగా నీవు చేయు కర్మలను చేయుము. వానిచే నీ మనస్సులో ఇంతవరకు నీకు తెలియని లోకములు అన్నియు స్పష్టముగా కనపడుతును. అట్లు లోకమునన్నింటినీ చూచిన తరువాత నాయందే మనసు నిలిపి ధ్యానించుచున్న వాడవై నీయందు లోకమునందు అంతటా వ్యాపించి ఉన్న నన్ను దర్శింపగలవు. సకల పదార్థములలో అంతర్యామిగా నేను ఉన్నట్లును లోకములన్నియు నా చేతనే ధరింపబడుచున్నట్లును నీవు దర్శింపగలవు. అట్లు దర్శనము కలగగానే పైకి కనబడక కర్రలో అగ్ని ఉన్నట్లు అన్ని భూతములలో అణిగి ఉన్న నన్ను చూతువు. చూడగానే నీ దుఃఖము, మోహము నిన్ను వీడిపోవును. అన్నిటిలో నన్ను చూడగలవు. పంచభూతములు, ఇంద్రియములు, వాసనలు, అంతఃకరణము అనవి ఏమియు లేనివాడనై ధారకుడనై ఆత్మగలోన ఉండి నడిపించుచున్నవాడను నేను. నన్ను నీవు ధ్యానించి కర్మలకు పశువుడు.
కర్మలకు వశుడవు గాక ఆనందముందదవు. జీవులకు చెందిన అనాది కర్మలను అనుసరించి విచిత్రములగు దేహములను కల్పించి సృష్టి చేయుచుందువు. అట్టి కార్యమునందే ఆసక్తి గలదైనను నీ మనస్సు నా స్వరూప రూప గుణ విభూతుల అనుసంధానము చేయుచునే ఉండును. ఇట్లు సాగునట్లు నేను అనుగ్రహించితిని. నీవు దేహధారులందరి కంటే ముందుగా జన్మించిన వాడవు. నా స్వరూప గుణములను ప్రతిపాదించు వేద రాశిని చూచిన వాడవు. నిన్ను నా అనుగ్రహం వలన రజోగుణము బంధింపదు. నీ మనస్సు నాయందే సంతతము నిలిచి ఉండును. దేహధారులకు భక్తి లేనిచో నన్ను ఎరుంగుటకు శక్యము కాదు. నేను సత్వరజస్తమస్సులనడి గుణముల సంబంధము లేనివాడను. ప్రకృతి వికారములగు భూతములు నన్ను బంధింపలేవు. సకల విషయములు స్పష్టముగా దర్శించువాడను. విశ్వమంతయు నా చేతనే సృజింపబడుచున్నది. ధరింపబడి సంహరింపబడుచున్నది. నేను సర్వజ్ఞుడను, సత్య సంకల్పుడను. అట్టి వానినిగా నన్ను నీవు ఎరుంగుదువు. నీవు వశించి ఉన్న తామర పువ్వు యొక్క మూలమును ఎరుంగవలెనని వెతికితివి. అట్లు వెదుకుచున్న నీకు నా రూపమును నేను దర్శింప చేసితిని. నన్ను దర్శించి నీవు నా కథలను, నా మహిమలను చెప్పుచు స్తోత్రము చేసితివి. నీవు నన్ను గూర్చియే తపస్సు చేయుచుందువు. అది అంతయు నా అనుగ్రహం చేతనే కలిగినది. కళ్యాణ గుణములలో పరిపూర్ణుడను హేయ గుణములు లేని వాడనగు నన్ను నీవు సృష్టి చేయుటకు శక్తి కలగవలెనని స్తుతించితివి. అందుచే నేను సంతోషించితిని. నీకు మంగళమవుగాక. నీవు చేసిన ఈ స్తోత్రముతో ఎవ్వరైనను నన్ను స్తుతించినచో వారు కోరిన కోరికలు అన్నియు నెరవేరినట్లు నేను అనుగ్రహించును. ఏది చేసినను నాకు ప్రీతి కలిగించుటయే ప్రధానం. యజ్ఞ యాగాదులు చేసినను తపో యోగ సమాధులు ఆచరించినను నాకు ప్రీతిని కలిగించుటయే ప్రధానమైన ఫలం. నేను ఈ జీవులందరుకు లోపల వ్యాపించి ఆత్మనే నియమించుచుందును. వారు ప్రేమించు వస్తువులన్నిటిలో నేను ఉండి నా సంబంధము చేతనే వారికి ఆ వస్తువులు ప్రీతిని కలిగించునవిగా చేయుచుందును. అందుచే
నా యందు భక్తి కలిగి నేను ప్రియమైన వాడునుగా భావించుట జన్మకు సార్ధకము. జీవులందరకు ఆత్మ అయిన నా చేత ఉపదేశింపబడిన జ్ఞానముతో ఈ జగత్తును జగత్తునందలి ప్రజలను పూర్వ కల్పనలు ఎట్లున్నవో అట్లే మరల సృజింపుము. ప్రళయములో నా యందే చేరి పరుండి ఉన్నవి. ఈ విధముగా ప్రధాన పురుషేశ్వరుడగు పద్మనాభుడు జగత్ సృష్టి చేయ బ్రహ్మకు జగత్ నిర్మాణము చేయు విధానమును తెలియచేసి తన దివ్య మంగళ విగ్రహమును అంతర్ధానము నొచ్చెను. తరువాత బ్రహ్మ తన ఇంద్రియములను వశపరచుకొనిన వాడై తన శరీరముతో తన మనస్సుతో ఎన్నో విధములుగా సృష్టి చేసినాడు. విదురుడు మరల ప్రశ్నింపగా ఆ విదురుని సంశయములను ఆవిష్కరించిన ప్రశ్నలను మనసులో నిలుపుకొని వానికి సమాధానముగా ఇట్లు. మైత్రేయుడు చెబుతున్నాడు. విదురుడు అడిగిన ప్రశ్నల సమాధానంగా మైత్రేయుడు ఇంకా ముందు ఏం చెప్పాడో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Hare Sri Narayana Namah Oorja Isetrayaha Pataye Yagna Retase Truptidayacha Jeevanam Namaha Sarvarasaatmune Pitru Devatalaku Ganadigalaku Aaharamu Yagnam chesina manushyalaku phalamu Chandrudu Aa Chandrudi roopamlo unnaadu Karmaaku moolamina Rugyaju Salutations to Sri Hari, who is the lord of the Samavedas, who is in the form of all flavors, and who is in the form of water that quenches the thirst of living beings. Oh Gods, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 12th podcast. Until now, as soon as the Brahma Paramatma, who emerged from the lotus from the copper stem, appeared, he is praising himself. We have experienced some part of that praise. Let's start with the front. Oh Lord, you, along with Lakshmi Devi, who is different from you, without abandoning the natural qualities like omniscience, have incarnated and are performing many divine plays. Grant me a mind that experiences and rejoices in such play. By experiencing your virtues and your actions, my sins will be abandoned. By your grace, your incarnations, your qualities, Grant that you may be pleased to create the world, which is appointed by you, by your command, as your service, experiencing the deeds. Oh, infinite and all-powerful Lord, from your navel, which is situated in the waters, I, with complete knowledge, have manifested. Your body, obeying your rule, expanding this world.
May the remembrance and utterance of the Vedic sound, which bestows the knowledge appropriate to the task I am capable of, continue to me forever. You are the one with immense grace, the ancient being. With the greatest love, smiling, to make the lotus eyes bloom, to bless us. Waking from sleep, you delight me with sweet words. Mayst thou remove my sorrow with thy word. Thus, the four-faced one, from whom he was born. Having seen that God through his devotees of Karma Jnana, having praised his mind and words to the extent that he could, he rested like one who had toiled. Madhusudana, with a serious tone, is explaining the opinion of the four-faced Brahma to his delusion. Do not be sad about not knowing how to build this world, what to do. Please try to create. I have decided that you should have wisdom so that you may pray to me. You meditate on me, and do the deeds that you do as my worship. Through him, in your mind, worlds unknown to you until now Everything will be crystal clear. Having seen all the worlds, you, who are meditating with your mind fixed on me, can see me, who is pervading everywhere in the world. You can see that I am inherently in all substances, and that all the worlds are being ruled by me. As soon as the vision appeared, not visible to the eye, seeing me, who was hidden in all the beings, as if there was fire in a stick. As you look at it, your sorrow and despair will fade away. You can see me in all of these. I am the one who is without the five elements, senses, smells, and inner senses, and I am the one who is the stream, the one who is in the soul, and I am the one who is leading. Meditate on Me and be attached to My service.
May you be happy and content with your work. You create various bodies following the eternal karmas belonging to living beings, and you create the creation. Even if you are interested in such a task, your mind will always be connected to my form, appearance, qualities, and glories. I have blessed you to continue in this way. You were born before all that which is embodied. You are the one who saw the Veda Rasi that propounds my form and qualities. By my grace, the quality of passion will not bind you. May thou ever be steadfast in thy mind. Without devotion to the embodied being, it is not possible to understand me. I am not related to the qualities of being quick-witted or slow-witted. The forces of nature are not able to tame me. I am the one who clearly sees all things. The whole universe is created by me. It is being paid and being destroyed. I am omniscient and truthful. You don't know me as such. You searched for the root of the lotus flower that you had subdued. I have shown you my form, as you have been searching for it. Nannu Having seen, you praised by telling my stories, my glories. You are doing penance only for me. It is all because of my grace. You praised me, saying that I am perfect in virtues and without vices, and that you should have the power to create me. "and so I am happy. May you be blessed. If anyone praises me with this praise that you have done, I will grant that all the desires they have asked for are fulfilled. Whatever I do, my main goal is to please God. Even if I perform yagnya, yagadi, tapas, yoga, and samadhi, the main fruit is to bring me pleasure. I will pervade all these beings and establish the soul within them. I am in all the things they love, and through my relationship, I make those things pleasing to them. Therefore
Having devotion in me, considering myself dear is worthwhile for birth. With the knowledge imparted by me, who is the soul of all living beings, create this world and the people in it again in the same way as the previous imaginations were. In the apocalypse, they are all with me, hidden within me. In this way, Padmanabha, the main Lord, explained to Brahma the method of creating the world, and his divine auspicious idol disappeared. After that, Brahma, having subdued his senses, created in many ways with his body and his mind. When Vidura asked again, keeping in mind the questions that revealed the doubts of that Vidura, thus as an answer to him. Maitreyi says. As an answer to the questions asked by Vidur, let's find out what Maitreyudu said next in the next episode. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.