విరాట్ రూప ముఖ బాహాది అవయవ విభజన వైభవము
Division of the Universal Form's Limbs and Senses
శ్రీమద్భాగవతం మూడవ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, విరాట్ పురుషుని ముఖం, బాహువులు, చెవులు, నేత్రాలు మొదలైన అవయవాలలో వివిధ దేవతలు మరియు విశ్వశక్తులు నివసిస్తున్న తీరును మైత్రేయ మహర్షి విదురునికి వివరిస్తారు. సమస్త సృష్టి ఆ పరమాత్మ యొక్క దివ్య శరీరంలో నిక్షిప్తమై ఉందని, ప్రతి అవయవమూ ఒక విశ్వతత్త్వానికి నిలయమని ఈ అధ్యాయం అద్భుతంగా నిరూపిస్తుంది. ఈ విరాట్ రూప ధ్యానం మన దృష్టిని పరిమితమైన జగత్తు నుండి అనంతమైన పరమేశ్వరుని వైపు మళ్ళించి, భక్తిని మరింత పరిపక్వం చేస్తుంది.
In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the magnificent third canto's revelation of how the various limbs, senses, and faculties of the Virat Purusha — the Universal Form of the Lord — correspond to the cosmic elements and presiding deities of creation. Each part of this boundless divine form, from the mouth and arms to the ears and eyes, is shown to be the sacred dwelling of specific gods and forces that sustain the universe. This teaching, conveyed through the divine dialogue between Maitreya and Vidura, invites us to perceive the entire cosmos as the living body of the Supreme Being. Meditating on this vision transforms our understanding of creation and deepens our reverence for the all-pervading glory of the Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ప్రవృత్తాయ నివృత్తాయ పితృ దేవాయ కర్మణే నమో ధర్మ విపాకాయ మృత్యువే దుఃఖదాయ చ ప్రవృత్తి, యజ్ఞాది, నివృత్తి, శమదమాది అని కర్మ రెండు రూపములలో ఉన్నది. ఈ కర్మయు దాని ప్రభావం వలన లభించే పితృలోకము, స్వర్గలోకము కూడా శ్రీహరి రూపములే. పితృ దేవతలు, దేవతలు కూడా శ్రీహరి రూపములే. అధర్మమును ఆచరించువారు మరణించి దుఃఖ భాజనులగుదురు. ఈ మృత్యువు దుఃఖమునిచ్చే నరలోకము కూడా శ్రీహరి రూపములే. అట్టి శ్రీహరికి నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 41st ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం. 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు కాలము యొక్క ప్రమాణం గురించి, కాలము ఏ రకంగా మనం కొలుస్తామనేటువంటి విషయంలో, కాలమంటే పరబ్రహ్మ స్వరూపమని దాని యొక్క గణన విషయాల్ని మనము తెలుసుకున్నాం. ఇంకా ఆ కాలం యొక్క పరిణామాలను తెలుసుకుందాం. విదురుడు మరల ఇట్లు ప్రశ్నించుచున్నాడు. పితృ దేవతల యొక్క దేవతల యొక్క మనుష్యుల యొక్క ఆయుత్పరిణామమును ఎరంగింపుము. నీవంటి జ్ఞానులు యోగ సిద్ధిచే లభించిన నేత్రములచే విశ్వమును చూచుచుందురు. యోగులకు కూడా కనపడనిది ఏదీయును ఉండదు ఇట్లు విదురుడు ప్రశ్నించగా మైత్రేయుడు చెబుచున్నాడు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అనునవి 12 వేల దివ్య సంవత్సరములచే ఏర్పడినవి అందు సంధ్యాకాలము కూడా కలిసి ఉన్నది. కృతయుగము దేవమానముచే నాలుగు వేల సంవత్సరములు. త్రేతాయుగము మూడు వేల సంవత్సరములు. ద్వాపర యుగము రెండు వేల సంవత్సరములు. కలియుగము వెయ్యి సంవత్సరములు. కృతయుగము ముందు తరువాత సంధ్యాకాలముండును. అది దేవమానముచే 400, 400, 800 సంవత్సరములు.
యుగమునకు ముందు భాగము సంధ్య అందురు. యుగమునకు చివరి భాగమును సంధ్యాంశమందురు. సంధ్య సంధ్యాంశములకు మధ్య భాగము యుగము అందురు. ఆ యుగములందు ఆయా వర్ణములకు ఆయా ఆశ్రమములకు తగిన ధర్మములను ఆచరించుచుండవలెను. ధర్మములను ఎరింగిన వారు ఏ యుగములో ఏ ధర్మము ఆచరించవలెనో నిర్ణయించి చెప్పిరి. కృతయుగములో నాలుగు పాదములతో కూడిన ధర్మమును మనుజులు ఆచరించవలెను. త్రేతాయుగములో ఒక పాదము లోపించును. మూడు పాదములతో ధర్మమును ఆచరింతురు. ద్వాపర యుగములో రెండు పాదముల ధర్మమును ఆచరింతురు. కలియుగములో ఒక పాదం ధర్మమే ఆచరింపబడును. బ్రహ్మకు వే యుగములు ఒక పగలు, వే యుగములు ఒక రాత్రి. ఆ రెండును కలిసి ఒక దినము. రాత్రి వేళ జగత్ సృష్టి చేయు బ్రహ్మ నిద్రించును. రాత్రి గడిచి బ్రహ్మ నిద్ర నుండి మేల్కొనిన తరువాత బ్రహ్మచే సృష్టించబడిన లోకము 14 మనువుల పరిపాలన కాలముగా సాగును. ఒక మనువు 71 యుగములను పాలించును. ఇట్లు భూమిని పాలించెడి మనువు 14రు గడుచునంతవరకు బ్రహ్మ పగలు సాగుచుండును. ప్రతి మన్వంతరమునందును భూమిని పాలించు రాజులుగా మనువంశమందు రాజులు జన్మించుచుందురు. ఋషులు, దేవతలు, ఇంద్రులు కూడా ఒక్కొక్క మను పరిపాలన కాలమున వేరువేరుగా పుట్టుచుందురు. వారందరూ ప్రతి మన్వంతరమున ఒక్కసారే బయలు వెడలి పరిపాలించుచుందురు. ఇట్లు బ్రహ్మ పగటి వేళ చేయు సృష్టి ప్రతిదినము చేయును. కనుక చతుర్ముఖుడు చేయు సృష్టి దైనందిన సృష్టి అందురు. ఈ మూడు లోకముల యొక్క ఉనికి ఈ పగటి వేళ ఉండును. మూడు లోకములలో ఈ పగటి వేళ దేవతలు, పితృ దేవతలు, మనుష్యులు, పశుపక్షులు అనే శరీరములతో వారి వారి కర్మలను అనుసరించి జీవులు పుట్టుచుందురు. మన్వంతరములో భగవానుడే తన మూర్తులతో శుద్ధ సత్వము కలవాడై పురుష రూపమును దాల్చి మన్వాదుల ద్వారా జగద్రక్షణమును చేయుచుండును. ఇట్లు పగలు సత్వగుణము అధికముగా కలిగి ఉండి సృష్టి చేసి రాత్రివేళ నిదురించగానే కాలము కూడా అతనిని అనుసరించి అణగారి ఉండును.
కాలముననుసరించి భూ, భువః, స్వరలోకములు మూడును తిరోహితములగును అనగా కనపడకుండా పోవును. చంద్ర సూర్యులు లేకుండా పోదురు. చంద్ర సూర్యులు ఎప్పుడు మరుగుపడుదురో అప్పుడు సంరక్షణ రూపియగు భగవానుని ముఖము నుండి రుద్ర రూపను బయల్పడును. వాని నుండి అగ్ని వెడలును. ఆ అగ్ని వేడిచే మూడు లోకములు దహింపబడును. ఆ వేడికి ఓర్చుకొనలేక మహర్లోకము నుండి భృగు మొదలగువారు ఆ లోకము నుండి జనలోకమునకేగుదురు. సంకర్షణాగ్నిచే దహింపబడిన మూడు లోకములను కల్పాంతరమునందు పొంగిన సముద్రములు ముంచివేయును. అప్పుడు అంతయు జలమయమగును. అప్పుడు ఆ జలములలో అనంతుని ఆసనముగా కలిపించుకొని శ్రీహరి యోగనిద్రతో నేత్రములను ముడుచుకొని ఉండును. తన స్వరూపమును తాను అనుభవించుటయే యోగనిద్ర. యోగనిద్రచే కనులు మూసుకొని ఉన్న ఆ భగవానుని జనలోకములో ఉండువారు స్తోత్రము చేయుదురు. ఇట్టి కాలము గడుచుచుండగా బ్రహ్మ యొక్క ఆయుష్షు కూడా తరిగిపోవుచుండును. అతని మానముచే అతని నూరు సంవత్సరములు గడిచిపోవుచుండును. బ్రహ్మ నూరు సంవత్సరముల ఆయుర్దాయములో మొదటి ఏవది సంవత్సరములు ఇప్పటికీ గడిచిపోయినవి. రెండవ పదార్థము ఇప్పుడు సాగుచున్నది. పూర్వ పరార్థము యొక్క మొదటి భాగమున బ్రహ్మ కల్పము ఏర్పడెను. అది చాలా పెద్దది. అది పూర్వ ప్రార్థము యొక్క మొదటి కల్పమునందు బ్రహ్మ బయలు వెడలును. అందుచే ఆ కల్పమును బ్రహ్మ కల్పమందురు. ఆ కల్ప ప్రారంభమునందు వచ్చిన శబ్దము బ్రహ్మ రూపము అనగా వేద రూపము. ఆ కల్ప ప్రారంభమునందే బ్రహ్మ యొక్క ఉపాసనమును వాని ఆరాధనమును ప్రకాశింపచేయు వేదము ఆరంభమాయెను. వేద రూపముగు బ్రహ్మము ఆవిర్భవించినది కనుక ఆ కల్పమునకు బ్రహ్మ కల్పమని పేరు. ఆ పూర్వ పరార్థము యొక్క చివర పద్మకల్పం ఉండెను. ఆ కల్పమునందు శ్రీహరి యొక్క అనగా అనిరుద్ధ రూపముగా ఉన్న భగవాను యొక్క నాభి అనేడి సరస్సునందు భువన కోశమనడి తామర పువ్వు పుట్టెను. అందుచే దానిని పద్మ కల్పమని వ్యవహరింతురు. ఈ పద్మ కల్పమునే వరాహ కల్పమని కూడా అందురు. అప్పుడు శ్రీహరి వరాహ రూపమును దాల్చి ఉండెను. రెండు పరార్థముల కాలము భగవానునికి.
ఒక నిమిషం అంత అల్పమైనది. భగవానుడు ప్రాకృతమగు నామరూపములు లేనివాడు అందుచే అతనికి ఆది లేదు. ప్రాకృత నామములు కలవారికే ఆ పేర్లు. ఆ రూపములు ఎప్పుడు ఏర్పడినా అప్పటి నుండి వారున్నట్లు పరిగణింతురు. అతను జగదాత్మకుడు. అతను జగత్తునకు ఉపాదాన కారణమై యుండి జగత్తునకు అంతకు నామరూపములు కల్పించుచుండును. కానీ అతనికి నామరూపములు ఉండవు. అతడు అనాది కనుక అతడు కాలమునకు వశపడి ఉండడు. కానీ ఆ కాలమును నియమించు భగవానుడు మూడు విధములకు పరిచ్ఛేదము లేని వాడగుటచే అతడు కాలమునకు వశుడు కాడు. ఈ అండకోశము అనగా జగత్తు ఏ పది కోట్ల యోజనములు విస్తారము కలది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని ఐదు విషయములు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలనడి ఐదు కర్మేంద్రియములు, వాని యొక్క వ్యాపారములు, మనస్సు యొక్క వికారము మొత్తము పదునారు వికారములతో కూడినది ఈ విశ్వకోశము. దానికి పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము. మహత్తు, ప్రకృతి అనడి ఎనిమిది ఆవరణములు ఉండును. అవి ఒకదానికంటే ఒకటి పది రెట్లు ఎక్కువ. అట్టి అండకోశ మూల ప్రకృతిలో చేరిపోయిన నాడు ఒక పరమానువు వలె ఉండును. ఇటువంటి అండరాశులు కోట్ల కొలది ఆ మూల ప్రకృతిలో చేరి పరమాణువుల వలె అణిగి ఉండును. ఇట్టి అండములన్నిటికీ కారణమైన మహదాయు తత్వములకు కారణమైనది ప్రధానమనబడును. ఆ ప్రధానమే అక్షరము. అట్టి అక్షరము మహాపురుషుడు మహాత్ముడునగు శ్రీ మహావిష్ణువునకు శరీరము వలె నియమింపదగినదై ఉండెను. శ్రీ మహావిష్ణువునందు కాలము యొక్క ప్రభావము ఉండదు. ఇంకా ముందుకు వెళుతూ కాలము యొక్క స్వరూపాన్ని ఇంకా వర్ణిస్తున్నారు ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. భగవత్ బంధువులారా, మనవి ఈ విషయాన్ని కాలం యొక్క గణన విషయాన్ని, యుగాల విషయాన్ని అందరూ కూడా రెండు సార్లు మూడు మార్లు విని అయినా. అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo. For the sake of being initiated, for the sake of being ceased, for the sake of the father, for the sake of action, salutations to the Dharma Vipakaya, for the sake of death, for the sake of sorrow, the action is in two forms: Yagnya, Nivrutti, Shamadama, etc. This karma and its effects, the Pitruloka and Swargaloka that are obtained, are also forms of Srihari. The father god and the gods are all forms of Sri Hari. Those who practice unrighteousness die and become the objects of grief. This death, which gives sorrow, even the human world is the form of Sri Hari. Salutations to Shri Hari. Fourth Canto, Chapter 24, 41st Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Welcome to episode 15. Until now, regarding the measure of time, in the matter of how we measure time, we have learned that time is the form of the Supreme Brahman and its calculations. Let us proceed and learn about the evolution of the era. Vidur again asks this question. Describe the life cycle of ancestors, gods, and humans. Wise men like you attain yoga They see the universe through the eyes they have gained. Even for yogis, there is nothing that is not visible. Thus, when Vidura asked, Maitreya is saying, Krita Yuga, Treta Yuga, Dvapara Yuga, Kali Yuga, these are formed by 12 thousand divine years. Even the evening time is together It is. Krita Yuga was four thousand years of divine age. Treta Yuga is 3000 years. The Dvapara Yuga is a period of two thousand years. Kali Yuga is a thousand years. Before and after Krita Yuga, there will be twilight. That is 400, 400, 800 years by the divine power.
The fore part of the day is called Sandhya. The end of an era is dusk. The middle part of the day is called a yuga. In those ages, the respective castes and ashrams should practice the respective dharmas. Those who have learned the Dharmas have determined and told in which era which Dharma should be practiced. In the Krita Yuga, humans should practice the Dharma of four legs. In the Treta Yuga, one foot will be defective. They practice dharma with three steps. In the Dvapara Yuga, they will practice the two-legged dharma. In Kali Yuga, only one foot of Dharma will be practiced. For Brahma, a day is a day, and a night is a night. A day spent together. At night, Brahma, the creator of the universe, sleeps. After the night passed and Brahma woke up from sleep, the world created by Brahma continued as the reign of 14 Manus. A Manu governs 71 yugas. Thus, as long as the Manu who rules the earth exists, Brahma's day will continue. In each Manvantara, kings ruled the earth, kings in the Manu dynasty They are born. Sages, gods, and Indra also are born differently during each human's reign. All of them will go out and rule only once in every Manvantara. Thus, Brahma, during the day, creates; every day, he creates. Therefore, the creation made by the four-faced one is the daily creation. The existence of these three worlds exists during the daytime. In the three worlds, during this daytime, gods, ancestors, humans, and animals, with their respective bodies, according to their respective deeds, beings are born. In the Manvantara, the Lord himself, with his forms, being pure and virtuous, assuming the form of a man, performs the protection of the world through the Manavas. Thus, having the quality of goodness (sattva) in abundance during the day, and creating and sleeping at night, time also follows him and remains suppressed.
According to time, the earth, the planets, and the heavenly spheres will disappear, meaning they will disappear without being seen. The moon and sun are never absent. When the moon and sun are eclipsed, then the form of Rudra will be revealed from the face of the God who is the embodiment of protection. Fire from the serpent's mouth. The three worlds will be burned by the fire that is heated. Unable to bear that heat, Bhrigu and others from Maharloka go to Janaloka from that world. The three worlds, which were burned by the conflagration, will be submerged by the oceans that swelled in the afterlife. And the whole thing will be ruined. Then, in those waters, Srihari, as Anantu's seat, having merged, with yogic sleep, closes his eyes. Yoga Nidra is the experience of one’s own form. Those who are in the world praise that God who has his eyes closed by Yoganidra. As time passes, Brahma's lifespan also diminishes. His hundred years will pass by by his will. Brahma's lifespan of a hundred years, the first few years have already passed. The second material is currently being processed. In the first part of the Purva Parva, the Brahma Kalpa was established. It's pretty big. That is, in the first creation of the first prayer, Brahma will leave. Therefore, that kalpa is called Brahma Kalpa. The sound that came at the beginning of creation is the form of Brahma, that is, the form of the Vedas. At the very beginning of that creation, the Veda that illuminates the worship and adoration of Brahma began. Because Brahma, who is in the form of Vedas, manifested, that era is called Brahma Kalpa. At the end of the former Parvarti, there was a Padmakalpa. In that Kalpa, in the lake called Nabhi, which is the navel of the Lord, who is in the form of Aniruddha, a lotus flower with a world treasure was born. Therefore, it is called Padma Kalpa. This Padma Kalpa is also called the Varaha Kalpa. At that time, Srihari assumed the form of a boar. The time of two meanings for the Lord.
That's a short time. The Lord is formless, having no name or form; therefore, He has no beginning. Those are the names of the people who have Prakrit names. They are considered to exist from the time they are formed. He is a Jagadātmaka. He is the cause of the world, and He creates the world and its forms. But he won't have any name. He is eternal, therefore he is not subject to time. But the Lord who appointed that time is without defect in three ways, therefore he is not subject to time. This ovary, that is, the world, is vast, spanning ten crore yojanas. Sound, touch, form, taste, smell - these are the five senses. Speech, hands, feet, genitals, and the base of the body are the five organs of action. Their functions, the distortions of the mind, all together, this universe is composed of ten distortions. For that, earth, water, light, air, sky, ego. Mahattu, nature, Anadi, eight enclosures are there. They are ten times bigger than each other. When such an ovum is incorporated into the natural process, then one It will be like a supreme being. Such particles, in the millions, join the fundamental nature and remain hidden like atoms. The main reason for all these eggs is the great essence that is the cause of the greatness. The principal is the letter. Such a letter was appointed to Sri Maha Vishnu, who is a great man and a great soul, like a body. In Shri Maha Vishnu, there is no effect of time. Moving forward, they are further describing the nature of time. We will learn about that topic in another podcast. Oh, devotees of God, we request that everyone listen to this matter, the calculation of time, and the matter of eras, even if it is heard two or three times. Praying to understand, Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo