భగవంతుని మాయాశక్తి - జగత్ సృష్టి ప్రణాళిక

The Lord's External Potency & Material Creation Plan

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, భగవంతుని బాహ్యశక్తి అయిన మాయాశక్తి స్వరూపాన్ని మరియు జగత్ సృష్టిలో దాని పాత్రను విశదంగా వివరిస్తారు. మైత్రేయ మహర్షి విదురునికి, పరమాత్మ ప్రకృతిని తన దివ్యదృష్టితో అవలోకించి, సృష్టి ప్రక్రియను ఎలా ప్రారంభిస్తాడో అనే రహస్యాన్ని బోధిస్తారు. త్రిగుణాల సమ్మేళనం, మహత్తత్త్వం యొక్క ఆవిర్భావం మరియు సమస్త జగత్తు వ్యక్తమయ్యే క్రమాన్ని ఈ ఎపిసోడ్‌లో లోతుగా అర్థం చేసుకుంటాం. భగవంతుని సంకల్పం మరియు మాయాశక్తి కలిసి ఈ విశ్వ సృష్టి ప్రణాళికను ఎలా నిర్వహిస్తాయో తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ తప్పక వినండి.

In this enlightening episode of our Srimad Bhagavatham podcast, we explore Canto 3's profound revelations about the Lord's external potency, Maya Shakti, and how it serves as the divine instrument through which the material universe is projected. Sri Maitreya Muni explains to Vidura how the Supreme Lord, though untouched by material nature, orchestrates creation through His glance upon the unmanifest prakriti. We examine the intricate plan behind cosmic creation, including the interplay of the three gunas and the emergence of the mahat-tattva as the first principle of material existence. This episode offers seekers a deeper understanding of how the Lord's will and His external energy together weave the grand design of the universe.

← Prev Next →
The Lord's External Potency & Material Creation Plan bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః స్వర్గాపవర్గ ద్వారాయ నిత్యం శుచిషదే నమః నమో హిరణ్య వీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే స్వర్గమునకు అపవర్గమునకు ద్వారభూతుడు పరిశుద్ధ స్థానునకు హిరణ్య వీర్యునకు వేద స్వరూపునకు సకల జగదాధారునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటు 24th చాప్టర్ 37th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక 11వ ద్వితీయ స్కంధంలో 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం బ్రహ్మ ఆవిర్భవించిన తర్వాత తన యొక్క మునికెను తెలుసుకుంటూ తను ప్రయత్నం చేసి చివరికి తనకు ఆ పరమాత్మకు స్వరూప దర్శనం కలిగి సృష్టి చేయడానికి కోసమని ప్రారంభించాలని అనుకుంటూ భగవంతుని యొక్క స్తోత్రాన్ని చేయ ప్రారంభించాడు. ఆ తర్వాత భాగాన్ని మనం తెలుసుకుందాం. ఓ భగవన్, చాలా కాలం చేసిన తపస్సునకు ఫలముగా నిన్ను నేడు ఈనాడు చూడగలిగితిని. శరీరధారులు ఎవ్వరును నిన్ను ఎరుంగజాలరు. నీవు కానిది లోకములో ఏ వస్తువును లేదు. నీకంటే ఒక వస్తువు వేరు అనుకొనుట భ్రాంతి. నీవు నీకే చెందిన ప్రకృతి యందలి సత్వరజస్తమోగుణముల మార్పులచే అనేక రూపములు గలవాడివిగా భాసించుచున్నావు. నిరుపాధికము, నిత్యము అగువు, అపరిచ్ఛిన్న ఆనంద జ్ఞాన స్వరూపుడవు నీవు. ఆనందము, జ్ఞానము పరిపూర్ణముగా గలవాడవు. అజ్ఞానం ఎప్పుడును నిన్ను చేరనేరదు. అనేకములకు అవతారములకు మూలమైన వాడవు. పరమ పురుషా దుఃఖముతో కలయిక లేని ఆనందమే నీవు. జాతి గుణము లేని వాడవు.

అడ్డులేని సంకల్ప రూప జ్ఞానము కలవాడవు. నీవే ఈ విశ్వము కంటే వేరుగా ఉండియు విశ్వమునకు కారణమై యుందువు. నీవు ప్రకృతి వికారమునను పంచభూతములను ఇంద్రియములను రూపముగా కలిగి యుందువు. అట్టి నిన్ను నేను శరణముగా ఆశ్రయించుచున్నాను. భగవన్ మంగళ ధ్యానించు వారులకు మంగళమును కలిగించుతూ వేదాంతములో ప్రసిద్ధముగు రూపమును నా మనసులో దర్శింపచేసితివి. నీవు జ్ఞాన శక్త్యాది గుణములలో పూర్ణుడవు. నీకు నమస్కారం. శబ్దాది విషయములందు సంఘము కలిగి నరకమునందరి దేహధారులు నిన్ను చేరలేరు. నీ గుణములను వినుట అనడి గాలిచే నీ పాద పద్మ గంధము కొందరు తమ కరుణ వివరములచే అఘ్రాణించుచున్నారు. వారికి నీ పాదముల యందు తప్ప ఎన్నడూ మరియొక దాని వైపు ప్రసహించని భక్తి కలుగును. అట్టి భక్తి కల వారి హృదయ కమలము నుండి తొలగి ఉండవు. వారి హృదయములో నీవు నిత్యము ఉందువు. లోకములో సంసారమే భయము. అట్టి భయమును తొలగించినవి నీ పాదములు. వానిని నిరతిశయమగు ప్రేమతో ఉపాసించు వారులకు భయము గాని, ఇల్లు, మిత్రులు, ధనము మొదలగునవి పోవునేమో అని వెంగ గాని. పోవుటచే కలిగెడి శోకము గాని ప్రతికూలమైనది సంభవించునేము అనడి ద్వేషము గాని అనుకూలమగు వస్తువులను పొందవలెనన్న కోరిక గాని ఒకరి చేత తిరస్కరింపవలెనుట గాని అధికమగు లాభము గాని ఆత్మ కాని శరీరమందు ఆత్మ అనడి అభిమానము గాని ఉండనేరవు. కొందరి ఇంద్రియములు నీ రూపమును చూడవలెనని కానీ నీ గుణములు వినవలెనని గాని కోరవు. అట్టి వారు సంతతము దుఃఖములను కలిగించు కర్మలను శబ్దాది విషయ సుఖములను అనుభవించుట యందు లాభము గలవారై యుందురు. అట్టి వారి బుద్ధి దైవముచే దుఃఖమునే చెందుచుందురు. వారు ఆకలి, దప్పిక, శోకము, మోహము, జ్వర, మృత్యువు అని వాటిచే పీడింపబడుచుందురు. వాతము, పైత్యము, శ్లేష్మము వారి శరీరములో ప్రకోపించుచు బాధలను కలిగించుచుండును. వారు కామమనెడు అగ్నిచే దహించబడుచుందురు. తీరని పగచే ఉడికిపోవుచుందురు. అట్టి వారిని చూచి నా మనసు చాలా బాధపడుచున్నది.

భగవానుని సంకల్పముచే ప్రకృతి జీవులకు యధార్ధ జ్ఞానము కలగకుండా మరుగుపడుచుండును. బాహ్యేంద్రియములకు దేవుడు మనుష్యుడు. మొదలగు భేదములచే దేహములు వేరువేరుగా కనపట్టుచుండును. ఆ భేదము దేహమునకు చెందినది గానీ ఆత్మలకు చెందినది కాదని వారు గుర్తింపలేరు. అట్లు గుర్తింపనంతవరకు సంసారం వారికి తొలగదు. వారు ఏదో ఒక ప్రయోజనమునకై కర్మలను చేయుచునే ఉండురు. దానిచే వారికి పరమ పురుషార్ధము సిద్ధించదు. దుఃఖమే కలుగుచుండును. అట్టి వారు పగటి వేళ శతాబ్ది విషయములను ఇంద్రియములతో అనుభవించుటకే ప్రవర్తించుచుందురు. రాత్రి వేళ ఇంద్రియములు ఏవియు పని చేయక నిద్రించుచుందురు. అట్టి వారికి అత్యల్పమైన సుఖము కూడా ఉండదు. వారికి సుఖమును స్వప్నములు అనుభవించు భాగ్యము కూడా ఉండదు. ప్రతి క్షణమునందు ఎన్నో కోరికలు కోరుచుండుటచే నిద్ర పట్టక తాము ఒక ప్రయోజనమునకే చేయు వ్యాపారములు దైవం అనుకూలింపక చెడిన వారై. దుఃఖమునే పొందుచుందురు. ఎవరు నీ యందు ప్రేమ కలిగి ఆ భక్తిచే హృదయము పరిశుద్ధమై శాస్త్రములచే సంపాదించిన జ్ఞానముని నిన్ను జ్ఞానముచే నిన్ను ఉపాసింతురో అట్టివారు సంతతం నిన్నే స్మరించుచుందురు. దర్శించుచుందురు. అట్టి వారికి వారి ప్రేమను చూచి ప్రేమించి నీవు నీ రూపమును నీవే స్పష్టముగా దర్శింపజేతువు. మనసులో కోరికలతో నీకు ఎన్నో పూజలు నడిచిన దేవతలను కూడా నీవు అనుగ్రహింపవు. నిన్ను ఆరాధించుట మాత్రమే మాత్రముచే నీవు సంతుష్టి నందు సంతుష్టి నందవు సర్వభూతముల యందు నీవే ఆత్మగా ఉన్నావని ఎరంగి ఏ ప్రాణికి బాధ కలిగినను తాను ప్రేమించిన భగవానునికే బాధ కలుగునని మనసులో బాధపడి దయచూచెడి వారిపై నీ అనుగ్రహం పరిపూర్ణముగా ప్రసరించును. సకల శరీరములలో నిన్ను జీవులలో అంతరాత్మగా వారిని శాసించుచు ధరించుచు నీవు వారి మేలును కోరుచుందువు. అట్లు అందరిలో నీవు ఉందువని ఎరింగి అందరిపై దయచూప కలిగిన వాడు నీ కృపకు పాత్రుడగును. కోరికలతో కర్మలు ఆచరించుటచే నీవు ప్రసన్నుడవు కావు. సకల వస్తువులకు నీవు ఆత్మవని ఉపాసించుటయే నీ అనుగ్రహమునకు మూలము.

యజ్ఞము, దానము మొదలగు సర్వ కర్మలకు కర్మలు నీకు ప్రీతిని కలిగించుటయే పరమ ప్రయోజనముగా కలవి. అట్టి యజ్ఞాది ధర్మములను నీ ఆరాధనగా చేయువాడు ఎన్నడును ఏ విధముగాను మరణింపరు, నశింపరు. అతనికి నిత్య పురుషార్ధము సిద్ధించును. పరమ పురుష యోగులు ప్రకృతి కంటే ఆత్మ స్వరూపం వేరుని దర్శించి భేద జ్ఞానము తొలగి మోహము తొలగి జ్ఞాన యోగ కర్మ యోగములను ఆచరించి భక్తిని ఆర్జించుదు. అట్టి వారికి నీవు ధ్యానములో దర్శనమును వసంగుచుందువు. నీవు ప్రకృతి కంటే జీవుల కంటే ప్రత్యేకమైన స్వభావము కలవాడవు. ఈ జగత్తు యొక్క రక్షణము, లయము నీ లీలలు. అదే నీకు ఆనందం వసంగును. నీవు సర్వమును నియమింతువు. అట్టి నీకు నమస్కారం. నీవు అనేకములకు రూపములతో గుణములతో అవతరించి ఎన్నో లీలలను చేయుచుందువు. ఆ అవతారములోని నామములను దేవకీనందన, దాశరథి, భక్తవత్సల, గిరిధారి, కంసారి, రావణాంతక అనుట అలవాటైన వారు ఈ శరీరము నుండి ప్రాణములు విడలిడి సమయములో ఒడదరుంగక పలికినను అనేక జన్మలలో ఆర్జించిన పుణ్య పాపమును వీడి బ్రహ్మమును పొందురు. అట్టి సర్వలోకములకు శరణమగు నిన్నే శరణుగా వరించుచున్నాను. నీవు సృష్టికి ముందు నామరూపములు లేనివాడవై ఉందువు. నీ నుండియే లోకమును సృష్టించుటకు నన్ను, లోకమును లయము చేయుటకు రుద్రుని సృజించి, మాలో నీవు చేరి ఉండి సృష్టి ప్రళయములను చేయుచు స్వయముగా నీవే రక్షణము చేయుచుందువు. నీవే మహత్వత్వం మొదలు వ్యష్టి వరకు ప్రధానము ప్రకృతిని మార్చి దేవతలు, మనుష్యులు, తిరియక్కులు, స్థావరములని శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షం వలె లోకమంతా నిండితివి. అట్టి భువన ధ్రువమగు నీకు నమస్కారము. భగవానుడు ఆదేశించిన వేద విహితముగు కర్మలను తమ తమ వర్ణములకు ఆశ్రమములకు తగువానిని ఆచరించి వానిని భగవదారదాధనముగా రూపముగా చేయుచు శాస్త్రములో చేయరాదు అనిన కర్మలను మానిన వానికి ఈ సంసారమునందు ఆసక్తిని భగవానుడు ఛేదించును. అట్లు సర్వశక్తిమంతుడై వైరాగ్యమును కలిగించుటలో

సమర్ధులకు భగవానునకు నమస్కారము. ఆచరింపతగని కర్మలకు తానే కర్తనని, తానే అనుభవించు వాడనని, అభిమానముతో విషయ సుఖములను అనుభవించువాడు తన జీవితమును వ్యర్థముగా గడుపుచుండుటచే కాలము అతని ఆయుష్షును క్షణింపచేయును. చతుర్ముఖుడవగు చతుర్ముఖుడనగు నేను అన్ని లోకములచే నమస్కరింపదగిన సత్యలోకమునందు ఉండువాడని అయినప్పటికీ కాలమునకు భయపడుచునే ఉండును. ఆ కాలమునకు లోన ఆత్మగా వ్యాపించి ఉండి నీవే కాలరూపుడవై లోకములను హరించుచుందువు. నాకు నియమించిన సృష్టి కార్యమందు జాగరూకుడవై ప్రవర్తించుచున్నను నా లోకము రెండు పదార్థముల రెండు పరార్థముల కాలము పూర్తి కాగానే నశించునది అని ఎరింగి నిన్ను పొందవలెనని. ఆరాధింపబడి ఫలములను సంగు గల సమర్ధుడవైన నీకు నమస్కారము. నీవే ధర్మమును రక్షించుట కొరకు తక్కువ వారితో అరమరిక లేకుండా మెలగడి సౌశీల్యమును గుణము కలవాడవై వాక్కుకు మనస్సుకు అందని నీ రూపమును మనుష్యుల చర్మ చక్షువులకు గోచరమగునట్లు చేసి త్రియక్కులుగా మనుష్యులుగా దేవతలుగా నీ సంకల్పము చేతనే అనేక రూపములను స్వీకరించి నీవు ఆనందించుచుందువు. నిరతిశయముగు ఆనందమే స్వరూపముగు గలవాడవైయు నీ స్వరూభావం స్వభావం మారకుండగనే ఆయా రూపములు గలవాడవై ఆ శరీరములకు తగిన కర్మలు చేయుచు చేయుచు ఆనందించునట్లు నటింతువు. అట్టి పురుషోత్తముడవు నీకు నమస్కారం. నీవే త్రియక్కులలో మత్స్య కూర్మ వరాహ రూపములను దాల్చితివి. మనుష్యులలో తా రామకృష్ణాది రూపములను దాల్చితివి. దేవతలలో వామనాది రూపములను స్వీకరించితివి. ఆ శరీరములకు తగిన చేష్టితములను వనరించితివి. అందరి కన్నులకు కనపట్టుచు అక్రూరుడు, ఉద్ధవుడు, మాలాకారుడు, గుహుడు, శబరి మొదలగు వారితో వారిని దయతో సౌహార్దముతో అనుగ్రహించితివి. అట్టి పురుషోత్తముడవు నీకు నమస్కారము. నీవు అవిద్య చేతను ఆక్రమింపబడని వాడవు. అవిద్య యొక్క వృత్తులు తామిశ్రము, అంధతామిశ్రము, మోహము, మహామోహము, తమస్సు అని ఐదు విధములుగా ఉండును. వృక్షములలో, పొదలలో, తీగలలో, మొక్కలలో, గడ్డిలో అజ్ఞానమును కలిగించును. అట్టి అజ్ఞాన ప్రవృత్తికి కారణముగు అవిద్య నిన్ను ఆక్రమించదు.

అట్టి నీవు ప్రళయములో యోగనిద్రను పొందుదవు. నీ ఉదరములో లోకములన్నిటిని నిలుపుదువు. అనంతుడే శయ్యగా సముద్ర కిరటములు పానుపును కదిలించుండగా నీటిలో హాయిగా నిద్రించుచు నిద్రలేని వాడవై నిద్రించినట్లు శయనించి ఉందువు. అట్టి శయనించి ఉన్న నీ నాభి నుండి బయలుబడిన పద్మముని భవనముగా చేసుకొని నేను వసించుచుందును. నీ అనుగ్రహముచే మూడు లోకములు నాచే పరిపాలించబడునట్లుగా నిలిపితివి. సృష్టించబడు సకల పదార్థములు నీ గర్భమునందే ఉండును. యోగనిద్ర పూర్తి కాగానే పుండరీకముల వంటి నీ నేత్రములను నీవు పెదవు. అట్టి నీవు చేతన అచేతనములగు సకల జగత్తుకు ఆత్మవై సుహృతువై ఉండువు. అట్టి నీవే నీ జ్ఞానముచే సత్యమయముగు శరీరముతో ఈ విశ్వమును సుఖింప చేయుచున్నావు. అట్టి నీ శక్తియే నాకు ప్రజ్ఞను ప్రసాదించుకాక. వెనక సంకల్పమునందు ఉన్నట్లుగానే మరల లోకమును సృజించుటకు తగిన జ్ఞానమును నాకు అనుగ్రహింపుము. తర్వాత ఆయన స్తుతించినటువంటి విషయాన్ని ఇంకా భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Always purifying the path to heaven and liberation, salutations to Hiranya Virya. The one who is the gateway to heaven and liberation, to the pure abode, to Hiranya Virya, to the form of Vedas, to all Greetings to the Lord of the Universe. Fourth Canto, 24th Chapter, 37th Prayer. Devotees of God, welcome to the 11th episode of the 11th part of Srimad Bhagavata Tatva Deepika in the 11th Dvitiya Skandha. Until now, after Brahma manifested, he was trying to know his own form, and finally, he wanted to start creating the universe, thinking that he would have a vision of the Supreme Soul, and to create it He began to make the hymn. We will explore the latter a bit in the following section. Oh Lord, as a result of the penance I have done for a long time, I am able to see you today. No one will ever know you. There is nothing in the world that you are not. To think that something is different from you is delusion. You are the one who, through the changes of the qualities of Sattva, Rajas, and Tamas in nature, are in many forms You are shining. You are the one who is eternal, without a beginning, and the embodiment of unbroken bliss and knowledge. You are the one who is full of joy and knowledge. Ignorance is curable, after all. You are the origin of many incarnations. You are the bliss unmixed with sorrow of the Supreme Personality of Godhead. You're no racist.

You are the one who has the knowledge of the form of determination without obstacles. You are different from this universe and are the cause of the universe. You are the form of nature, the five elements, and the senses. I surrender to you. Oh Lord, you have bestowed auspiciousness upon those who meditate on auspiciousness, and you have shown me the famous form in Vedanta in my mind. You are full of the qualities of knowledge, power, etc. Namaste. In matters of sound and other things, the community is with you, but all the bodies of those in hell cannot reach you. Hearing your virtues, some are smelling the fragrance of your lotus feet with the wind, and some are smelling it with the details of their compassion. They will have devotion that never turns towards anything else except your feet. Such devotion will not be removed from the lotus of their heart. You are forever in their hearts. In this world, family is a fear. Your feet are the ones that removed such fear. Those who worship him with unwavering love have no fear, whether their house, friends, wealth, etc., will be lost, but Venga. The sorrow caused by going That which is adverse, whether it is hatred, or the desire to obtain favorable things, or to be rejected by someone, or excessive gain, or the self, or the self-love in the body, will not exist. Some people's senses do not desire to see your form or hear your qualities. Such people are always engaged in causing sorrows, performing actions, and experiencing pleasures of sound and other things. Such people suffer from sorrow because of their intellect being divine. They are afflicted by hunger, thirst, grief, delusion, fever, and death. Vata, Pitta, and Kapha, in their bodies, provoke and cause suffering. They are burnt by the fire of lust. Unresolved grudges can fester. Seeing such people, my heart is very saddened.

By the will of God, nature hides the true knowledge from living beings. God is man to the outer senses. The bodies appear different due to various differences. They cannot distinguish between what belongs to the body and what does not belong to the soul. Until they recognize it, their family life will not improve. They are doing karmas for some benefit. By that, they will not attain the supreme being. Grief is inevitable. Such people behave in the daytime only to experience the matters of the century with their senses. At night, the senses do not work, they sleep. Such people do not even have the least bit of happiness. They will not have the fortune to experience happiness and dreams. Because of desiring many things in every moment, not being able to sleep, they are ruined by doing business for a purpose, without God being favorable. They suffer. Whoever has love for you, and through that devotion, their heart is purified, and those who worship you through knowledge acquired by the scriptures Those who are like that, the generations will remember you. They will visit. Seeing their love, loving them, you will clearly show your form. Even the gods who have performed many poojas with desires in their hearts, you will not grant them. Only by worshiping you, you are satisfied. You are satisfied in all beings. You are the soul. Even if any creature is hurt, the one who loves the Lord will be hurt. Feeling sorrow in his heart, on those who show mercy Your Grace's benediction is here. In all bodies, you are the inner soul in living beings, governing and adorning them, and you desire their good. Thus, the one who has the grace to be in everyone, to have compassion on everyone, will be worthy of your grace. By performing actions with desires, you will not be pleased. It is by your grace that you worship me as the soul of all things.

Yagnya, charity, and all such deeds, the actions, the pleasure they bring you is the ultimate purpose. He who worships such sacrifices and other righteous deeds will never die in any way, nor will he perish. He will surely attain Nitya Purushardham. Supreme beings, having realized that the self is different from nature, remove the knowledge of difference, remove delusion, practice the yoga of knowledge and the yoga of action, and earn devotion. To such people, you will be the vision in meditation. You are more than nature, more than living beings, you are a unique being. Your play is the protection and dissolution of the world. That's the joyful news for you. You are the ordainer of all things. Greetings to you. You appear in many forms and qualities to many, and you perform many miracles. The names in that incarnation are Devakinandana, Dasarathi, Bhaktavatsala, Giridhari, Kamsari, Those who are accustomed to saying Ravana Antaka, even if they speak without hesitation at the time of separating their lives from this body, will leave the merit and sin earned in many births and attain Brahman. To all the worlds, I surrender to you alone I am invoking. Before creation, you were without form and name. To create the world from you, to destroy the world, to create Rudra, and to be in us, you are the one who creates the creation and destruction, and you yourself are the protector. You are the beginning of greatness, from the individual to the supreme, the main thing, changing nature, like a tree that has spread as branches to gods, humans, animals, and inanimate objects, you have filled the whole world. Salutations to you, the axis of this universe. The actions prescribed by the Vedas, which are ordained by God, should be performed by those who are fit for their respective castes and ashrams, and should be made into the form of divine charity. Those who abandon the actions that are not to be done in the scriptures, this world is for those who have abandoned them It will break. Thus, being omnipotent, in causing detachment

Salutations to the Divine. He who considers himself the doer of actions that are not practiced, he who enjoys worldly pleasures with pride, because he spends his life in vain, time diminishes his life. I, who am the four-faced one, who am the four-faced one, even though I am in the true world, which is worthy of being worshiped by all the worlds, am still afraid of time. Being spread as the spirit in that time, you are the form of time, destroying the worlds. Even though I am being vigilant in the creation work appointed to me, my world will be destroyed as soon as the time of two substances, two purposes is completed, so that I can attain you. Salutations to you, who are worshiped and who have the fruits of the fruit. You, to protect righteousness, without any discrimination with the less, being virtuous and having good qualities, making your form invisible to speech and mind, making it visible to human eyes, as three, as humans, as gods By your will, accepting many forms, you rejoice. Being the form of unceasing joy, without changing your form and nature, being the one with those forms, doing actions befitting those bodies, you act as if you are enjoying. Salutations to you, O Supreme Person. You have assumed the forms of Matsya, Kurma, and Varaha in the three worlds. In humans, you have assumed the forms of Rama, Krishna, and others. You have accepted the forms of Vamana among the Gods. You have made the actions appropriate to the bodies. Acrurudu, Uddhavudu, Malakarudu, Guhudu, Shabari, and others, you have graciously and amicably blessed them. Salutations to you, O Supreme Person. You are unconquerable by ignorance. The professions of ignorance are their own association, blindness, delusion, great delusion, and darkness; they are of five kinds. In trees, in bushes, in vines, in plants, in grass, it causes ignorance. That ignorance, which is the cause of such a state of ignorance, will not occupy you.

Thus, you will attain yogic sleep in the apocalypse. You hold the world in your bosom. Anantudu is on the bed, while the sea waves are stirring the bed, you will be sleeping peacefully in the water, like a sleeper who is sleepless. Having taken the lotus-like form that emerged from your navel while lying down, I will reside. By your grace, you have kept the three worlds ruled by me. All created things are in your womb. As soon as the yoga sleep is complete, you are the lips that are like lotuses. Like that, you are the soul of all the animate and inanimate worlds, being a friend. You are the one, with your knowledge, with a body that is truth, you are making this universe happy. Mayst thou, O Lord, grant me the wisdom to use thy power. As in the previous resolve, grant me the wisdom to create the world again. Then, let's find out more about the topic he praised in the next part of the podcast. Jai Srimannarayana and salutations to the Gurus.