యమునాతీరమున ఉద్ధవుని కలయిక - కుశల ప్రశ్నలు

Meeting with Uddhava on the Yamuna Bank

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, విదురుడు పుణ్యమైన యమునా నదీతీరమున మహాభాగవతుడైన ఉద్ధవుని దర్శిస్తాడు. శ్రీకృష్ణుని మరియు యదువంశీయుల క్షేమసమాచారమును తెలుసుకోవాలని విదురుడు అత్యంత భక్తిశ్రద్ధలతో కుశల ప్రశ్నలు అడుగుతాడు. శ్రీకృష్ణుని అత్యంత ప్రియమైన సఖుడైన ఉద్ధవుడు, భగవంతుని దివ్యలీలలను మరియు భక్తుల సాంగత్య మహిమను ప్రేమపూర్వకంగా వివరిస్తాడు.

In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, Vidura encounters the great devotee Uddhava on the holy banks of the Yamuna river. Vidura, eager to hear tidings of the Lord and His beloved Yadu dynasty, humbly inquires about their well-being with deep affection and reverence. Uddhava, himself a mahabhagavata and intimate companion of Sri Krishna, responds with profound love as he recounts the glorious pastimes and the divine presence of the Lord among His devotees.

← Prev Next →
Meeting with Uddhava on the Yamuna Bank bhagavatam

శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్య క్రియాకారక విభ్రమోర్మయే తన మాయచే నామ రూపములను ధరించువాడు గుణస్వరూపుడు స్వరూపానుభవముతో ద్రవ్య క్రియాకారక విభ్రమముల తరంగములను తొలగించగల పరమ పురుషునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో, 17th చాప్టర్, 29th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము మూడవ. పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదురుడు అడిగిన ప్రశ్నలకు ఉద్ధవుడు కృష్ణుని యొక్క విషయాలు తెలుపుతూ కృష్ణుని యొక్క లీలల్లో ఉన్నటువంటి భాగాలను వర్ణిస్తూ తను అందించే సమాధానాన్ని మనం విన్నాము. ఇంకా ముందు తను చెబుతున్న సమాధానాన్ని మనం అనుభవిద్దాం. మంచి బలిసిన ఎద్దులను ముకుత్రాడు పోయని వానిని ఏడింటిని కలిపి కట్టి నాగ్నజితిని వివాహం చేసుకునెను. ఎదిరించిన మూర్ఖులగు రాజులెందరునో చంపెను. తాను సర్వస్వతంత్రుడై ఉండియు సామాన్యుని వలె భార్య మాట విని దేవలోకము నుండి పారిజాతమును తెచ్చుచుండగా ఇంద్రుడు దేవతలతో కలిసి ఎదిరించగా కోపముతో వానితో యుద్ధము చేసినాడు. విశ్వమంతయు విశ్వమంతకు పతియగు భగవానుడు తానొక స్త్రీకి పతినని భావించి స్త్రీ పరతంత్రుని వలె ప్రవర్తించినాడు. యుద్ధములో చక్రాయుధముతో భూమి కుమారుడగు నరకాసురుని చంపినాడు. తన భార్యయగు భూదేవి తన కుమారుడు చనిపోయాడని బాధపడగా ఆ నరకుని కుమారుడగు కుమారునకు అతని రాజ్యమున సంగినాడు. అతని అంతఃపురమున బంధింపబడిన స్త్రీలను చూచి వారందరూ అనురాగ పరవశులై స్వామిని భర్తగా స్వీకరింపవలెనని కోరగా అందరినీ తాను భార్యలుగా స్వీకరించినాడు.

పదునారు వేల మందితో ఒక్కడే ఏకకాలమందు తన ఆశ్చర్యకరమగు దివ్యశక్తిచే అన్ని రూపములను దాల్చి ఆనందింపచేసినాడు. తనతో సమానమగు బలపరాక్రమములు గల కుమారులను ఒక్కొక్క ఆమెకు పది మంది చొప్పున అనుగ్రహించినాడు. తనచే నియమింపబడు లీలావిభూతి వృద్ధి పొందవలెని సంకల్పించి సంతానమును విస్తరింపచేసినాడు. కాలయవనుడు, జరాసంధుడు మొదలగు వారు తమ సైన్యములతో పట్టణమును అరికట్టినప్పుడు. వారిని భీమునకు అర్జునకు తానే శక్తినిచ్చి వారి ద్వారా అంతమొగ్నించి తానేముయు చేయలేని వాడి వలె నటించినాడు. శంబరుడు, దివిధుడు, వల్వలుడు మొదలగు వారిని తానే స్వయంగా చంపినాడు. ఓ విదురా, కురుక్షేత్ర వృత్తాంతము నీవు ఎరిగినదే కదా? అన్నదమ్ముల కుమారులు కలహించుకొని తమ తమ సైన్యములతో భూమి అదురునట్లు కురుక్షేత్రమును చేరి యుద్ధమునకు తలపడిరి. అప్పుడు భగవానుడు కరుణాదుల ఆలోచనలతో అంతమొందని సంపద కలవారైన దుర్యోధనాదులను అంతమొందించి ఆ దుర్యోధనుడు తొడలు విరిగి నీలపై పరుండగా చూచియు ఆనందింపలేకపోయెను. తన అంశలగు ద్రోణ భీష్మాదులను ఒకవైపు, భీమార్జులను ఒకవైపు నిలిపి భూభారమును తగ్గించినాడు. కానీ ఇది ఎంత మాత్రం ఇంకను ఎంత భారము మిగిలి ఉన్నది? పూర్తిగా భారము తొలగించినప్పుడు కదా శ్రీకృష్ణుకు సంతుష్టి. యాదవ బలమును కూడా అంతమొందింపవలెనని సంకల్పించినాడు. ఒకనాడు యాదవులు సురాపానము చేసి మదించి విప్రుని అవమానించి శాపం పొందినారు. దాని ఫలితముగా వారికి వివాదము కలుగును. అప్పుడు ఒకరినొకరు ఎదిరించుకొని యాదవులు అంతమొందొదురని తలంచి తాను ఏమియు పట్టించుకొనక వారి చెడు నడవడిచే వారిలో వారే కలహించుకొని అంతమొద్దునట్లు చేసినాడు. ఇట్లు చేయవలసిన కార్యములను నెరవేర్చి భగవానుడు ధర్మరాజు చేత తన రాజ్యమును స్థాపించినాడు. మిత్రులను ఆనందింపచేసినాడు. తన ఉపదేశము చేత ఆచరణ చేత వరుణాశ్రమ మర్యాదలను పాటించుట లోకమునకు నేర్పినాడు. పూర్వంశమునకు అంకురముగా అభిమన్యునకు ఉత్తరకు కలగబోయెడి సంతానమగు పరీక్షిత్తును అశ్వద్ధామ ప్రయోగించిన ఆ పాండవ అస్త్రము అంతమందింపకుండా కాపాడినాడు.

ధర్మరాజుచే మూడు అశ్వమేధ యాగములను చేయించినాడు. విశ్వాత్మకుడగు భగవానుడు కూడా వేద మార్గములను అతిక్రమించకుండా ప్రవర్తించి జ్ఞాన మార్గమును ఆచరించుచు అందరకు అందినాడు. కామములను అనుభవించుచున్నట్లే ఉండి తాను అనుభవింపక తనలో తానే అనుభవించుచు ఆనందించినాడు. తన దయామయమగు మందహాసముతో అమృత తుల్యమగు చూపుతో నిర్దిష్టమగు తను నడవడితో లక్ష్మీ నివాస స్థానమగు ఈ లోకమును పై లోకమును రమింప చేయుచు తాను స్త్రీలతో రాత్రి రమించి తన లిల్లచే వారిని రమింప చేసినాడు. గృహస్థాశ్రమమున ఆచరించవలసిన ధర్మములను ఆచరించి వాటియందు విరక్తినందినాడు. తన అధీనమందున్న విషయ భోగముల యందే యోగీశ్వరుడగు భగవానుడు. తాను విరక్తి నందినాడనిన మాట వినిన నాడు ఎవడు దైవాధీనముగా తాను అనుభవించు విషయభోగములందు విరక్తి నందక ఉండును. భగవానుని సంకల్పముచే మునులు యాదవులను, భోజులను, దాసార్హులను శపించిరి. తరువాత కొద్ది రోజులకు వారందరూ దైవ సంకల్పముచే ప్రభాస తీర్థమునకు రథములతో వెడలిరి. అచర స్నానము చేసి పితృ దేవతలను దేవతలను ఋషులను తృప్తిని అందించిరి. బ్రాహ్మణులకు గోవులను దానమొసంగిరి. హిరణ్య రజిత శయ్యాదులను దానమొసంగిరి. మధురముకు భోజ్య పదార్థములను భగవదర్పణముగా బ్రాహ్మణులకు సమర్పించిరి. బ్రాహ్మణులకు నమస్కరించిరి. ఇట్లు చేయవలసిన కార్యములన్నియు నెరవేర్చి దైవ సంకల్పముచే మద్యపానమునర్చి మత్తిల్లి ఒడలు మరిచిరి. యాదవులందరూ స్నానము చేసి దానమునర్చిన తరువాత ఆ బ్రాహ్మణులు అనుమతితో భోజనములు చేసిరి. తరువాత మద్యమును సేవించి వడలు మరిచి తెలివి తప్పిరి. ఒకరినొకరు దుర్భాషలు ఆడుకొనుచుండిరి. మనసులు పట్టు తప్పుడచే సూర్యుడు అస్తమించున్న సమయమున ఒకరినొకరు కొట్టుకొనసాగిరి.

శ్రీకృష్ణ భగవానుడు తన సంకల్పం ఫలించి తన వంశము కూడా నశించుట ఆరంభమైనదని చూచి సరస్వతి నదిలో ఆచమనము చేసి ఒక చెట్టు మొదలన కూర్చుండెను. తనను శరణు పొందిన వారి ఆర్తిని తొలగించడి భగవానుడు నన్ను చూసి నీవు బదరికేగుము అని చెప్పెను. ఉద్ధవుడు శ్రీకృష్ణ అభిప్రాయమును ఎరింగిన వాడెనను అతనిని వీడి ఉండలేని వాడై అతని వెంట అనుసరించి వెళ్ళెను. ఒంటరిగా శ్రీనివాసుడైన తన ప్రభువు సరస్వతి తీరమందు ఉండుటకు చోటు లేని వాని వలె అందరకూ ఆశ్రయమైన వాడు ఏకాంతమున కూర్చొని ఉండెను. అతడు నల్లని తెల్లని వర్ణములు కలిగి ఉండెను నిర్మలుడై ఉండెను ప్రసన్నములు అరుణములగు నేత్రములు కలిగి చతుర్భుజములతో పీతాంబరముతో ప్రకాశించుచుండెను చెట్టు మొదట కూర్చొని ఆ రావి చెట్టునకు చేరబడి ఎడమ తొడపై కుడి పాదమునుంచుకొని హాయిగా కూర్చొని యుండెను. కర్మ ఫలములు అంటని వాడు. అగుటచే వయస్సు గడిచినను కృషింపలేదు. అతని వద్దకు వ్యాసునకు మిత్రుడు, వ్యాసుని యందు ప్రేమ గలవాడును అగు మహా భాగవతుడగు మైత్రేయుడు లోకముల్లో తిరుగుచు అనుకొనకుండా వచ్చెను. ఆ మైత్రేయుని భక్తిభావమునకు అతడు తనని చూచి పొందిన ఆనందమునకు తనపై అతనికి గల ప్రేమకు భగవానుడు సంతోషించి అనురాగముతో కూడిన చూపుతో అతని శ్రమను పోగొట్టుచో నాతో ఇట్లు పలికెను అని ఉద్ధవుడు చెప్పుచుండెను. ఉద్ధవా, నీవు వెనుకటి జన్మలో వసువులలో ఒకడైవై ఉండి నన్ను పొందవలెనని కోరి ఆరాధించితివి. నీ మనసులో గల కోరికను నేను ఎరుంగుదును. నా పాద సేవ చేసిన వారికే తప్ప ఇతరులకు నీవు కోరిన ఫలము పొందుట దుర్లభము. అయినను నిన్ను అనుగ్రహించుచున్నాను. ఓ సాధుశీలా ఉద్ధవా, నీవు ఎవ్వరూ చూడకుండా ఈ మర్త్యలోకమును వీడి నా లోకమునకేగుచున్నావు. నీవు ఏకాంత భక్తితో ఈ సమయమున నన్ను చూడగలిగితివి ధన్యుడవు. సృష్టి ప్రారంభమునందు నా నాభి నుండి బయలు వెడలనియ పద్మమునందు కూర్చున్న చతుర్భుగ బ్రహ్మకు నా మహిమను ప్రకాశింప చేసేడి భాగవతమును వసంగితిని.

ఇప్పుడు ఆ పరమ రహస్యము జ్ఞానమును నీ కోసం గుచున్నాను. భగవానుడు చెప్పగా ఆ పరమ పురుషుని కృపా కటాక్ష ప్రసారమును అనుగ్రహమును పొంది. ధన్యుడనై నేను ప్రేమతో ఒడలు పులకరించి గగుర్పొడిచి గద్గద స్వరముతో కన్నీరు కార్చుతూ ఇట్లు పలికితిని. సర్వేశ్వరా నీ పాదపద్మములు సేవించిన వారికి ఈ లోకములో ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగు పురుషార్ధములలో ఏది దుర్లభము? కానీ నీ పాదపద్మ సేవనమే కోరెడి నేను ఆ పురుషార్ధమును కోరను. నీవు కర్వ సంబంధము లేని వాడవు, జన్మ లేని వాడవు. కాలము నీకు వశమందుండును. అట్టి నీవు ఈ శరీరమును దాల్చి లోకమునందు మానవుని వలె ఉండి శత్రువులకు భయపడి ద్వారక అను జలదుర్గములో నివసించితివి. కాలయవ్వనిని వలన భయపడి పరిగెత్తితివి. ఆనందమే నీ రూపమైన వాడవు. గృహస్థాశ్రమమున చాలామంది స్త్రీలతో ఆనందము నందినట్లు ప్రవర్తించితివి. వీని రహస్యము ఎంతటి జ్ఞానులను ఎరంగలేరు. నీవు చూపిన ఆ చేష్టలు నా మనసును కలవరపెట్టుచున్నవి. ఏ ఆవరణము లేని అపరిచ్ఛిన్నమగు జ్ఞానము గల నీవు. ఏమియు ఎరుంగని ఎరుగని వాని వలె నన్ను పిలిచి కొన్ని కార్యములలో ఆలోచనము అడిగితివి. అది నన్ను మొహపరుచున్నది. ఎరుంగదగిన వానిలో ముఖ్యమగు జ్ఞానమును నేను పొందుటకు తగిన వాడను అని తలంచినచో అనుగ్రహింపుము. దానిచే నేను ఈ దుఃఖ నిలయమగు సంసారమును సుఖముగా దాటగలను ఇట్లు ఉద్ధవుడుకు ప్రార్థింపగా సకల గురువగు భగవానుడు పుండరీకాక్షుడు తన యధాత్మమునకు నాకు ఉపదేశించెను పవిత్రము చేయు శ్రీ పదములు గల భగవానుని నుండి గొప్ప జ్ఞానమును ఎరింగి ఆ ప్రభువు చరణములకు నమస్కరించి ప్రదక్షిణము చేసి అతనిని విడిచిపెట్టుటకు బాధపడుచు ఆ స్వామి ఆజ్ఞను పాటించి నేను వనమును చేరితిని. స్వామి నన్ను బదరికి వెళ్ళమని చెప్పెను. అట్లే అని ఆ ప్రభువు దర్శనముచే కలిగిడి ఆనందమును వదిలి ఉండలేక బాధపడుచు అతనికి ప్రియమగు బదరికాశ్రమమును చేరుటకు బయలుదేరితిని.

ఆ బదిరులు లోకములకు క్షేమములను కలిగించు నరనారాయణుడు తీవ్రమగు తపస్సు చేయిస్తున్నా చేసి ఉన్నారు. ఈ విధంగా. విదురుడు అడిగిన ప్రశ్నకు ఉద్ధవుడు అందించిన సమాధానం మనం విన్నాము. ఇంకా దీనిలో ముందు భాగం ఏమిటో తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Salutations to Srimannarayana, the true Guru. Salutations, salutations to the Supreme Personality of Godhead, the cause of all causes, the source of all sources, the embodiment of the qualities, the determinant, the cause of the action of matter, the illusion of form, the one who assumes names and forms through his illusion, the embodiment of qualities, with the experience of form Salutations to the Supreme Being who is capable of removing the waves of material actions. Fourth Canto, 17th Chapter, 29th Prayer. Oh, devotees of the Lord, the third book of the Srimad Bhagavata Tattva Deepika, the third. Welcome to the podcast. Until now, Uddhava, explaining the matters of Krishna to the questions asked by Vidura, describing the parts in Krishna's pastimes, we have heard the answer he provides. Let's experience the answer she is going to give next. She married Nagnajithi after tying together seven good and strong bulls and a man who had lost his testicles. He killed all the kings who were obstinate and foolish. Even though he was all-independent, like a common man, listening to his wife, while he was bringing the Parijata from the heavens, Indra, along with the gods, opposed him He fought with him in anger. The Lord, who is the husband of the universe, considering himself a husband to a woman, behaved like a woman's slave. In the war, he killed Narakasura, the son of the earth, with the Chakra weapon. His wife, Bhudevi, was saddened that her son had died, and that Naraka's son, Kumara, was in his kingdom. Seeing the women imprisoned in his palace, they were all ecstatic with love and asked him to accept the Swami as their husband, and he accepted them all as his wives.

With fifteen thousand people, at once, he, with his wonderful divine power, assumed all forms and made them rejoice. He granted his sons, who possessed equal strength and valor, ten sons each to each woman. He, having appointed, resolved that the play-like glory should increase, and expanded his progeny. When Kalayavanudu, Jarasandhudu, and others besieged the town with their armies. He gave strength to Bhima and Arjuna himself, and through them, he acted as if he could not do anything like the fire that was extinguished. Shambarudu, Dividhudu, Valvaludu, and others, he himself killed them. Oh Vidura, you know the story of Kurukshetra, don't you? The sons of the brothers, having quarreled, with their respective armies, reached Kurukshetra, as if to shake the earth, and prepared for war. Then, with the thoughts of compassion, the Lord destroyed Duryodhana and others who had unlimited wealth, and seeing Duryodhana lying on his thighs broken, he could not be happy. Keeping his own elements, Drona and Bhishma on one side, and Bhima and Arjuna on the other side He reduced the burden on the earth. But how much more burden is left? It is when the burden is completely lifted that Sri Krishna is satisfied. He resolved to also destroy the Yadava army. Once upon a time, the Yadavas, after consuming alcohol and becoming intoxicated, insulted the Brahmin and received a curse. As a result, they will have a dispute. Then, considering that the Yadavas would not end, he did not care about anything and, without any quarrel among them due to their bad behavior, he made it so that they would not end. Thus, having fulfilled the tasks that needed to be done, the Lord established his kingdom through Dharmaraja. He/She made friends happy. He taught the world to follow the customs of Varunashrama through his teachings and practice. As a seed for the past lineage, Parikshit, who was about to be born to Abhimanyu, was protected from the Pandava's weapon used by Ashwatthama without ending.

Dharmaraja performed three Aswamedha sacrifices. The divine being, the Lord, also acts without transgressing the paths of the Vedas, practicing the path of knowledge, and is accessible to all. He enjoyed himself, as if experiencing the pleasures, without experiencing them himself, enjoying himself within himself. With his merciful smile, with his nectar-like gaze, with his specific behavior, he delights this world and the upper world, which is the abode of Lakshmi, and he delights women by spending the night with them. He practiced the dharmas that should be followed in the household life and became detached from them. The Yogeshwarudu, the Lord, is in the enjoyment of the pleasures of the worlds under his control. When he heard that he was detached, who would be detached from the pleasures of the senses, experiencing them as divinely ordained? By the will of the Lord, the sages cursed the Yadavas, the Bhojas, and the Dasarhas. After a few days, all of them, by divine will, set out for the Prabhasa Tirtha with chariots. After performing the Achara bath, they satisfied the ancestors, gods, and sages. Cows for Brahmins They gave away the golden bed. They gave away the golden bed. The sweet and delicious food items were offered to the Brahmins as a gift. Pay respects to the Brahmins. Having fulfilled all the tasks that needed to be done, by divine will, they quit drinking alcohol, became intoxicated, and forgot their bodies. After all the Yadavas had taken a bath and performed the donation, those Brahmins, with their permission, had their meals. After that, they consumed alcohol, forgot themselves, and lost their senses. They were using abusive language towards each other. The hearts were clashing, as the sun was setting, they continued to fight each other.

Srikrishna Bhagavan, seeing that his resolve had come to fruition and that his lineage was beginning to perish, performed Achamana in the Saraswati River and sat under a tree. The Lord, seeing me, said, "Remove the sorrow of those who have sought refuge in you." Uddhava, having understood Sri Krishna's opinion, he left him and followed him, unable to stay away. Like a lonely Srinivasa, his Lord, who has no place to be on the banks of Saraswati, like one who is the refuge of all, was sitting in solitude. He had black and white colors, was pure, was cheerful, had lotus-like eyes, and was shining with four arms and yellow garments. The tree first sat down and reached that banyan tree, on the left thigh, right He was sitting comfortably with his feet up. He who does not accept the fruits of action. Therefore, even though age has passed, it has not been exhausted. To him, Maitreya, a great devotee who is a friend to Vyasa and has love for Vyasa, came wandering in the worlds without thinking. That Maitreyi To the devotion, to the joy he received seeing him, to the love he had for him, the Lord was pleased and with a loving gaze, as he relieved his suffering, he spoke thus to me, thus Uddhava was saying. Uddhava, in your past life, you were one of the Vasus, and you desired to attain me and worshiped. I will fulfill your heart's desire. It is difficult for others to receive the fruit you desire except for those who have served my feet. But I'm inclining towards you. Oh, virtuous and humble Uddhava, without anyone seeing you, you are leaving this mortal world and going to my world. You are blessed to have seen me at this time with solitary devotion. In the beginning of creation, I have established the Bhagavatam, which illuminates my glory to the four-armed Brahma, who sits in the lotus that does not bud from my navel.

Now I am gathering the supreme secret knowledge for you. Having received the grace and blessings of that Supreme Being, as told by the Lord. I am grateful, and with love, my heart thrilled, trembling, and with a choked voice, I cried tears, saying thus. Oh Lord, to those who serve your lotus feet, in this world, what is the most difficult to obtain among the four Purusharthas: Dharma, Artha, Kama, and Moksha? But I desire only your lotus feet's service; I do not desire that purpose. You are not related to karma, you are not born. The times shall come to an end. Having assumed this body, you lived in Dwaraka, a water fortress, fearing enemies, like a human in the world. You ran away in fear of the time. You are the joyous one. In your household life, you behaved as if you were enjoying yourself with many women. The secret of this is not known to the wise. Those actions that you have shown me are disturbing my mind. You, who are without a dwelling, and are imperishable, and have knowledge. Like someone who doesn't know anything, he called me and said something You asked about tasks. It's making me feel fancy. Grant me the grace to acquire the chief knowledge among those worthy of being considered, if I think I am worthy of it. By that, I can cross this sorrowful world with ease. Thus, Uddhava prayed, and the Lord, who is the guru of all, Pundarikaksha, instructed me in my own self. From the Lord who has sacred feet, great Having gathered knowledge, I bowed to the feet of that Lord, circumambulated, and, grieving to leave him, obeying the order of that Swami, I reached the forest. Swami told me to go to Badri. Likewise, unable to bear the joy of having the Lord's vision, I set out to reach Badrikashram, which is dear to him, while suffering.

Those who are causing severe penance to Narayana, who brings well-being to the worlds, are doing it. Like this. We heard the answer given by Uddhava to the question asked by Vidura. And we'll see what the front end looks like later on the podcast. Salutations to Asmadguru, Jai Srimannarayana.