ధ్యాన యోగ సాధన - హృదయ కమల పరమాత్మ రూపము

The Process of Meditation on the Form of the Lord

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, మహర్షి కపిల మహాముని తన తల్లి దేవహూతికి ధ్యాన యోగ సాధనను దివ్యంగా బోధిస్తారు. భక్తుడు హృదయ కమలంలో నివసించే పరమాత్మ యొక్క చతుర్భుజ రూపాన్ని — దివ్యాభరణాలతో, కరుణామయమైన చిరునవ్వుతో — మనసులో ధ్యానించాలని ఉపదేశిస్తారు. ఇలాంటి నిరంతర భక్తి ధ్యానం మనసును శుద్ధి చేసి, భౌతిక బంధాలను తొలగించి, మోక్షమార్గాన్ని సుగమం చేస్తుందని కపిల మహాముని స్పష్టంగా వివరిస్తారు.

In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, the great sage Kapila Muni instructs his mother Devahuti on the profound practice of dhyana yoga, guiding her step by step toward fixing the mind on the transcendental form of the Supreme Lord. The devotee is taught to meditate upon the Lord dwelling within the lotus of the heart, visualizing His radiant four-armed form adorned with divine ornaments, a gentle smile, and eyes filled with infinite compassion. This episode reveals that such steady, loving contemplation of the Lord's form purifies the mind, dissolves all material attachments, and ultimately leads the sincere seeker to liberation.

← Prev Next →
The Process of Meditation on the Form of the Lord bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో విజ్ఞాన మాత్రాయ పరమానంద మూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృతద్వైత దృష్టయే శుద్ధ జ్ఞాన స్వరూపుడు, పరమానంద ఘనుడు, ఆత్మారాముడు, శాంతుడు, భేద దృష్టి లేనివాడు అగు భగవానునకు నమస్కారము. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, నైన్టీన్త్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 41వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిల గీతను మనం అనుభవిస్తున్నాం. ఇంతక్రితం కపిల గీతలో ఈ జీవాత్మ బ్రతికున్నప్పుడు ఎలా తన యొక్క భ్రమతో ఈ లోకాన్ని అనుభవిస్తుంది, ఆ తరువాత పాప కర్మలు చేయటం వల్ల ఏ రకంగా ప్రయాణంలో ఇబ్బందులు పడుతుందో విషయాన్ని మనం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. కపిల గీత చాలా ముఖ్యమైనది. దీన్ని 32వ పాడ్కాస్ట్ నుంచి వివరంగా వింటే మనకు పూర్తిగా ఈ విషయం అర్థమవుతుంది. గమనించ ప్రార్థన. ఇంతవరకు ఇవన్నీయు తెలిసిన గాని ఈ శరీరంపై విషయములపై వైరాగ్యము కలగదు. జీవుడు ఈ శరీరమును వీడి తన పుణ్యమునకు పాపమునకు తగినట్లు స్వర్గమును, నరకమును పొంది వాని ఫలమును అనుభవించిన తరువాత ఇంకను అనుభవింపకుండా ఉండిపోయిన కర్మలను అనుభవించుటకు దైవ సంకల్పముచే శరీరమును పొందుటకు ఒక పురుషుని రేతస్సును ఆశ్రయించి స్త్రీ కడుపులో పరివేసి ఉంచును. ఆ రేత కణము స్త్రీ గర్భములో ప్రవేశించి ఒక రాత్రిలో స్త్రీ శోణితముతో కలిసి చిక్కపడును. ఐదు రాత్రులలో బుడగ వలె గుండ్రముగా తయారగును. 10 రోజుల తరువాత రేగుపండు వలె కొంచెం పెద్దదై గట్టిపడును. తరువాత ఒక మాంసపిండం వలె ఏర్పడును. తరువాత అండముగా ఏర్పడును. నెల రోజులు గడుపు సరికి చేతులు, కాళ్ళు మొదలగు అవయవులు విభాగము ఏర్పడును.

లింగము అభివ్యక్తమగును. ఆయా స్థానములో కన్నులు ఏర్పడును. నాలుగు మాసములు పూర్తయ్యేసరికి సప్త ధాతువులు ఏర్పడును. వానిలో ఐదింటి వలన ఆకలి దప్పి కలుగును. ఆరు మాసములకు ఆ పిండమును మావి ఆవరించును. అట్లు ఆవరించి కడుపులో కుడివైపు కదలుచుండును. ఏడవ మాసములో వెనుకటి జన్మలను వెనుకటి కర్మలను అతను స్మరించెడి జ్ఞానము కలవాడగును. తాను మాయచే ఈ లోకమున బంధింపబడుతున్నాడని అతడు ఎరుంగును. తల్లి తిన్న ఆహారమే ఆ గర్భము ఆహారముగా తీసుకునుచుండును. దానిచే శరీరములోని వేడి ధాతువులు వృద్ధి పొందును. భరించుటకు అనిష్టముగా మలమూత్రములతో నిండిన గర్భకోశమున పరుండి ఉండును. అందులో కొన్ని క్రిములు బయలుదేరును. అవి ఆ కడుపును కరుచుచుండును. చాలా సుకుమారముగా ఆ బాధ తట్టుకొనలేక బాధపడుచు మూర్ఛపోవుచుండును. పైన మావి కప్పి పేగులు చుట్టి ఉండుటచే అతడు దగ్గరగా వంకరగా కూడి ఉండును. శిరస్సు కడుపు వైపు వంగును. మెడ బాగా వంగి పృష్టము పైకి వంగి దగ్గరగా కూడి ఉండును. అవయయములు కదులుటకు వీలు ఉండదు. పంచరములో బంధింపబడిన పక్షి వలె ఏ వ్యాపారము లేని వాడే ఉండును. కానీ అతనికి పూర్వజన్మలన్నీ జ్ఞాపకమునకు వచ్చుచుండును. అవి తలంచుకొని దుఃఖపడుచుండును. స్వేచ్ఛగా ఊపిరి ఆడదు. ఏడవ మాసము నుండి సుఖ దుఃఖాదులు తెలియుచుండును, జ్ఞానము కలుగుచుండును, ప్రసవ వాయువులు లోన వీచుచు దుఃఖపడుచుండును. తన వలెనే ఆ గర్భకోశములో పుట్టిన మలినములో ఏర్పడిన పురుగుల వలె నిలకడగా ఉండలేక, కదలలేక బాధపడుచుండును. బాధపడుచు పూర్వజన్మ స్మృతి ఉండుటచే భగవానుని యాచించుచు జ్ఞానము గల జీవుడు ఏడు విధములకు బంధనములచే బంధింపబడి ఆ గర్భవాసం వలన దుఃఖము, భయము ముప్పిరి కొనుచుండగా చెదిరిన మనసుతో మాట సరిగా పలకలేని దశలో భగవాను నమస్కరించి ఇట్లు స్తోత్రము చేయును. హే భగవాన్, ఈ జగత్తును సృష్టించి దానిని రక్షించుటకు నీ అంత నీవే అనేక రూపములను నామధేయములను గ్రహించి ఈ లోకంలో జన్మించి నడయాడుచుందువు. అట్టి నీ పాదారవిందమును శరణు కోరుచున్నాను.

చెడు కర్మలు గల నాకు తగిన ఇట్టి గతిని కలిగించి నన్ను అనుగ్రహించిన నిన్ను శరణు పొందుచున్నాను. ఈ తల్లి కడుపులో నేను ఎట్లుంటినో అట్లే నీవు కూడా జీవునితో పాటు ఉందువు. పంచభూతములు, ఇంద్రియములు మొదలగు వాని రూపముగా మారిన ఈ మాయను నీవు కూడా చేరి కర్మచే సంకోచమునందని వాడవైనను స్వస్వరూపము మరుగుపడిన జీవుని వలె వసించుచొందువు. నీవు జీవునితో పాటు మాయామయమగు ప్రకృతియందు ఉన్నను నీవు పరిశుద్ధుడవు. నీకు ఈ ప్రకృతి గతములకు గతములగు సత్వము, రజస్సు, తమస్సు మొదలగునవి అంటవు. నీకు ముసలితనం ఉండదు, శోకము, మోహము కలిగి మోహము, ఆకలి దప్పి ఉండవు, అఖండమగు జ్ఞానము గలవాడవై ఉందువు. నిన్ను పొందవలెనని ఆర్తితో బాధపడే వారి మనస్సులో దర్శనమిచ్చుచుందువు అట్టి నీకు నమస్కారము. నీవు ఎక్కడ ఉన్నను ఎన్నడూ దోషములంటని వాడవు కళ్యాణ గుణములు గలవాడవు. అలా గుటచే నీకు జీవునితో పాటు ఉన్నను వాని నియమించుట అనడి లీలకే గాని అది దుఃఖమును కలిగింపదు. అచేతనముగు ప్రకృతి స్వతః దుఃఖమును కలిగించునది కాదు. కర్మచే అందు బంధింపబడిన వారికి ఆ కర్మను బట్టి పరమ పురుషుని సంకల్పము చే దుఃఖము కలుగును. లోకములో ఆయా వ్యక్తులకు ఒకే వస్తువు ఒకరికి సుఖమును కలిగించునది వేరొకరికి దుఃఖమును కలిగించునది అగును. ఒకరికి సర్వ కాలముల యందు సుఖమును కలిగించునది వేరొకరికి ఎల్ల కాలముల యందు దుఃఖమునే కలిగించుచుండును. అందుచేత పంచభూతములతో ఏర్పడిన శరీరముతో జీవుని వలె భగవానుడు ఉన్నను అతనికి దోషములచే దుఃఖము కలగదు. జ్ఞాన కర్మేంద్రియములు గాని సత్వరజస్తమస్సులు గాని శబ్దాది విషయములు గాని అతనిని మార్చవు. అతడు జీవుని ప్రకృతిని కూడా నియమించుచుండును. ప్రకృతికి పరవశుడై తన కర్మచే జీవుడు సంకోచమునంది ఉండును. అట్లు సర్వజ్ఞుడై ప్రకృతి పురుషులకు అవ్వలివాడై అవ్వలివాడై నియామకుడే ఉన్న పరమ పురుషుని నమస్కరించుచున్నాను. జీవుడు భగవానుని సంకల్పము చేతనే సత్వాది గుణములు కారణముగా ఏర్పడిన కర్మల సంబంధముచే సంసార మార్గమునందు ప్రవర్తించుచున్నాడు.

ఇట్లు ప్రవర్తించుచు తనను గూర్చి గాని పరమాత్మను గూర్చి గాని యదార్థ జ్ఞానము లేనివాడై ఉండును. భగవానుని అనుగ్రహమే తప్ప వేరొకటి ఈ జీవుని సంకోచమును తొలగింపలేదు. తన్ను గూర్చి పరమాత్మను గూర్చి యదార్థ జ్ఞానము భగవత్ అనుగ్రహము చేతనే కలుగును. భగవానుడు జ్ఞానము సంగి సంసార బంధము నుండి విడిపించును. కానీ బ్రహ్మ మొదలగు జీవులు ఎవ్వరు కూడా తన ప్రయత్నము చే ఈ బంధము నుండి మోక్షము నందరు. ఆ సర్వేశ్వరుడే వానికి జ్ఞానమును కలిగించి బంధము నుండి విడిపించవలెను. జీవులలో బ్రహ్మ రుద్రాదులు జ్ఞానముచే కర్మచే ఎంత గొప్పవారు అయినను వారెవ్వరూ బంధము నుండి విడిపించజాలరు. భగవానుని అంశమే జీవుడు. ఆ జీవునిలో భగవానుడు అంతరాత్మగా ఉండును. అతడు సర్వజ్ఞుడు. అతడే బంధము నుండి విడిపించువాడు. కావున ఆ సర్వేశ్వరుని నేను ఆశ్రయించుచున్నాను. ఓ భగవానుడా, తల్లి గర్భ కుహరములో రక్తము, మలము, మూత్రములతో నిండిన చోట జఠరాగ్నిచే తపించిపోవుచు ఏమియు చేయజాలని వాడను బయల్పడలేక నెలను లెక్కించుకొనుచు జీవించుచున్న నేను ఎప్పుడూ నీ కటాక్షముచే వెలుపలికి రాగలను కదా. దీననాథుడగు భగవానుడు దయామయుడు. పది నెలల నిండు వరకు గర్భములో తనను గూర్చిన జ్ఞానమును ప్రసాదించును. అతడు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము లేదు. జన్మించిన తరువాత జీవునితో పాటు పరమ పురుషుడు కూడా ఈ శరీరమందు ఈ శరీరముతో ఉన్న జీవుని కంటే వేరై నియామకుడై ఉండును. ఏడు విధములగు చర్మముల చేత చుట్టబడిన శరీరమందు జీవుడు పరమ పురుషుని అనుగ్రహం వలన శమదమాదులు కలిగి ఈశ్వరుడు వసంగిన బుద్ధిచే వాని అనుగ్రహముచే వానినే ఉపాసించి దర్శనము కలుగునట్లు చేయును. ఇన్ని దుఃఖములతో బాధపడుచున్నను, ఈ గర్భము నుండి వెలవడవలెననే కోరిక కలుగుట లేదు. ఈ గర్భము నుండి బయలుపడి చీకటి నూతిలో పడినట్లు నేను ఎవడనో తెలియక, పరులెవ్వరో తెలియక శరీరమునకు, గృహమునకు సంబంధించిన పనులనే చేయుచు. మాయచే దేహాత్మాభిమానముతో స్వతంత్రుడనని అభిమానముతో సుఖదుఃఖముతో

భయమును అనుభవించుచు మరణించి మరల ఇట్లు జన్మించుటయే కదా నాకు లభించునది. బయలుపడగానే ఆ జ్ఞానము పోవును. సంసార చక్రములో పరిభ్రమించుచుండును. అందుచే నేను బయలుపడ కోరుట లేదు. నాకు హృదయ పూర్వకముగా మేలుకోరు మిత్రుడవు నీవే. నిన్నే ఆశ్రయించి నీ సంసార బంధము నుండి బయల్పడెను. నాకు ఈ గర్భవాసము అనేటి నరకం మరల మరల లేకుండా పోవునట్లు నీ పాదములనే సాధనముగా ఆశ్రయించుచున్నాను. ఇట్లు ఏడవ మాసము నుండి పదవ మాసం వరకు నిండు వరకు జీవుడు జ్ఞానము కలిగి తాను జన్మించుటకు దిగులు పడుచు బాధపడుచుండును. జన్మించుట అతనికి ఇష్టముగా ఉండదు. అట్లు ఉండగానే ప్రసూతి వాయువు ఒకసారి అతనికి అతనిని తలకిందులు చేయును. గర్భము నుండి వెలువడునట్లు త్రోసివేయును. దానితో తన స్థానము నుండి కదలి శిరస్సు క్రిందై గర్భములోనున్న స్మృతి పూర్తిగా పోయి ఊపిరాడక తల్లి యోని నుండి అతి కష్టముతో బయలువెడలును. ఎట్లో బయలు వెలిగిన ఆ శిశువు శరీరము నుండా రక్తము పూసుకొని ఉండును. మలములోని పురుగుల వలె పురుగు వలె ఆ మలినముల మధ్య పడి ఉండును. గర్భములో జ్ఞానము గర్భములో కలిగిన జ్ఞానము పోవును. అజ్ఞానము ఆవరించును. ఎక్కువగా ఏడుచును. పక్కవారు వాని అభిప్రాయము ఎరుంగలేక ఆకలిచే ఏడుచున్నాడని పాలు తాగించే ప్రయత్నించుదురు ప్రయత్నించురు. ఇట్లు అతనికి వాటిపై రుచి కలిగింతురు. చిన్న పిల్లలను పొత్తిడిలో పడుండ పెట్టుదురు. ఈగలు, దోమలు మీద వాలుచునునో వానిని తోలుకొనలేడు, ఏడుచుండును. సుకుమారమైన చర్మమును నల్లులు, దోమలు కుట్టి బాధించుచుండును. ఇట్లు ఐదు సంవత్సరములు శైశవము దుఃఖములు అనుభవించును. ఐదు సంవత్సరము నిండిన దగ్గర నుండి పౌగండము అనేటి వయస్సు వచ్చును. కోరికలు బయలుదేరుచుండును. అవి నెరవేరకపోయినా తీవ్రముకు కోపము శోకము వచ్చుచుండును. ఇట్లు గడుచుండగా దేహముతో పాటే తాను స్వతంత్రుడను పట్టుదల పెరుగును. అహంకారముగా పగ ఏర్పడి స్త్రీ విషయమున పురుషులకు, పురుషుల విషయమున స్త్రీలకు కోరిక కలుగును. దానిని దానికి అడ్డు వచ్చిన వారిపై తీవ్రమగు ప్రతీకారము చేయవలెనని బుద్ధి కలుగును. ఈ పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరమందు నేను అనియు దానికి చెందిన వానిపై నాది అనియు తప్పుడు బుద్ధి కలుగును. ఆ దేహము కొరకు దేహ సంబంధముగా సంబంధుల కొరకు ప్రయత్నించుచుండును.

శబ్దాది భోగములను అనుభవించుట కొరకు యాతనలు పడుచుండును. చివరకు నరకమును పొందును. మరల వెనకటి కథ అంతయు జరుగుచుండును. చెడు భావములు కరిగి చెడు భావములు కలవారితో కలిసినందువలన సత్యము, శౌచము, దయ, మౌనము, బుద్ధి, లజ్జ, ఐశ్వర్యము, కీర్తి, ఓరిమి, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, గుణ సంపద నశించిపోవును. కావున విషయ భోగములకై వెంపరలాడు వారితో దేహమే తాను అనుకొనెడి మూఢులతో స్త్రీలకు ఆట వస్తువులై కామ భోగములనే కాంక్షించు వారితో వివేకము గలవారు సంబంధము ఏర్పరచుకొనరాదు. స్త్రీ పురుషులు అన్యోన్య సహవాసము మనసును పాడు చేయును. అంతేకాదు ఆ స్త్రీలను గూర్చి ఆలోచించెడి వారితో కూడా అంటుట ఉండుట. కూడా బంధము కలిగించును. సౌందర్యము మనసును ఆకర్షించును. స్త్రీల సౌందర్యమును సౌకుమార్యమును చూచి పురుషుడు మోహపడుచుండును. సామాన్యులే కాదు జ్ఞానములో గొప్పవాడగు చతుర్ముఖ బ్రహ్మ తన కుమార్తె శరీర సంధ్యము చూచి మోహపడినాడు. ఒక ఋషి మృగ రూపమును దాల్చి ఉన్న స్త్రీని చూచి తాను కూడా మృగమై సిగ్గు లేక దాని వెంట పరిగెత్తినాడు. బ్రహ్మచే సృజింపబడిన మరీచి మొదలగు ప్రజాపతులలో గాని వారిచే సృజింపబడిన కశ్యపుడు మొదలగు వారిలో గాని వారిచే సృజింపబడిన దేవతలలో మనుషులలో గాని ఒక్క నారాయణ ఋషి తప్ప ఎవ్వడును స్త్రీ అనే మోహం మాయకు వశపడని వాడు లేడు. అందరూ ఆ ఆకర్షణచే ఆకర్షింపబడిన వారే. కపిలుడు సాక్షాత్తు భగవానుడు. అతడు చెప్పుచు ఈ లోకములో జ్ఞానమును ఆవరించి మోహమును కలిగించేడి మోహమును కలిగించేడిది స్త్రీ మాయయే. ఆ మాయ నా చేతినే సృజింపబడినది. దాని సామర్థ్యము చాలా గొప్పది. ఈ విషయాన్ని ఇంకా ముందు భాగంలో ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. స్త్రీ పురుషుడు ఏ రకంగా ఈ లోకంలో జన్మిస్తాడు అనే విషయాన్ని చక్కగా వివరించారు. దీన్ని తిరిగి మళ్ళీ విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ప్రార్థిస్తూ మరొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the embodiment of Vijñanamatā, the supreme blissful form, the peaceful, the serene, the vision of non-duality, the pure, the embodiment of knowledge, the great bliss, the self-blissful, the peaceful, Salutations to the Lord who is without difference. Sixth Canto, Sixteenth Chapter, Nineteenth Prayer. Devotees of God, welcome to the 41st podcast of Srimad Bhagavata Tatva Deepika, Third Canto. Until now, as part of the conversation with Vidura Maitreya, we have been experiencing the Kapila Gita. Previously, in the Kapila Gita, we learned how this soul experiences this world with its illusion while alive, and how it faces difficulties in its journey due to committing sinful deeds. Let's experience the front part. The Kapila Gita is very important. If you listen to this in detail from the 32nd podcast, you will fully understand this matter. Prayer of Observation. Until now, even though all this is known, there is no detachment towards the body and its matters. The living being leaves this body according to his merit and sin After attaining heaven and hell and experiencing their fruits, to experience the karmas that have not yet been experienced, to attain the body by divine will, a woman, taking refuge in the semen of a man, places it in her womb. That semen enters the female womb and mixes with the female's egg in one night. In five nights, it will be prepared like a ball, round. After 10 days, it will become a little bigger like a jujube fruit and harden. Then it forms like a ball of meat. Then it becomes an egg. For a month, the hands, legs, and other limbs will be dislocated.

The gender will be expressed. Eyes will be formed in the respective places. By the completion of four months, the seven dhatus will be formed. Five of them will cause hunger and thirst. For six months, that offering will be covered by our women. It is like that, covering, in the stomach, on the right side, it is moving. In the seventh month, he will have the wisdom to remember his past lives and past deeds. He knows that he is being bound in this world by Maya. The food that the mother eats is taken as food for the fetus. By that, the hot elements in the body will increase. It is unwilling to bear and lies in the womb filled with excrement and urine. Some of the germs leave it. They will tear the stomach. He/She is very delicate, unable to bear that pain, and fainting. Above, ours are covered, the intestines are wrapped, and he is curled up closely. The head will bow downwards. The neck is bent well, the back is bent upwards, and it is close together. The organs can not move. Like a bird trapped in a cage, there is no business for one who has no business. But he remembers all his past lives. They will be sad and think about it. Breath doesn't flow freely. From the seventh month, pleasures and sorrows will be known, knowledge will be gained, and labor pains will be experienced while suffering. Like himself, unable to remain still and unable to move, he suffers like the worms formed in the impurity born in that womb. Being afflicted, having the memory of a previous birth, a being with knowledge, being bound by seven kinds of bonds, being bound by the womb, sorrow, While fear is overwhelming, in a state where one cannot speak properly with a scattered mind, one should offer prayers to God and praise Him in this way. Hey Bhagavan, you yourself, in many forms and names, take to this world to create this world and protect it, and you are born and walking in this world. I seek refuge in your lotus feet.

I surrender to you, who have caused me such a fate with bad karma, and who have blessed me. Just as I am in this mother's womb, you too will be with the living being. You too, who have become this illusion, which has transformed into the form of the five elements and the senses, and who, even though you are the one who is said to be constrained by karma, dwell like a being whose own form has been obscured. Even though you are with the living being and in the illusory nature, you are holy. You do not say that these are the qualities of nature that are past, past to past, namely sattva, rajas, and tamas. You will not have old age, sorrow, or delusion. You will not have hunger or thirst. You will be one with unbroken knowledge. You appear in the minds of those who suffer with longing to attain you. Salutations to you. Wherever you are, you never speak of faults; you are one with good qualities. Thus, even if you have a life with you, it is only for the sake of his rule, not for causing sorrow. The unconscious nature is not inherently sorrowful. Those who are bound by karma, according to that karma, the supreme Suffering arises from the intentions of the individual. In the world, the same object gives happiness to one person and sorrow to another. One person's happiness in all times is causing sorrow to another person in all times. Therefore, even though the Lord exists with a body formed from the five elements, like a living being, he does not suffer from sorrow due to faults. Knowledge, action, senses, or the three gunas, or sounds, etc., do not change him. He also controls the nature of the living being. Being ecstatic by nature, the living being is in a state of hesitation due to his actions. Thus, being omniscient, being the ruler of nature and men, being the ruler, I salute the supreme being who is the ruler. The living being, by the will of God, is acting in the path of worldly life through the karmic connections formed by the qualities of goodness, righteousness, and ignorance.

Thus behaving, he is without true knowledge, neither about himself nor about the Supreme Being. Except for the grace of God, nothing else has removed the contraction of this being. True knowledge about oneself and about the Supreme Being is obtained only through the grace of God. The Lord is wisdom, and wisdom alone delivers from bondage. But no one, including Brahma and others, can be liberated from this bondage through their efforts. That Lord God himself should give him wisdom and deliver him from bondage. In living beings, no matter how great they are, whether they are Brahma, Rudra, or Karma, no one can liberate them from bondage. The individual is the reflection of the Divine. The Lord God lives in the midst of the children of men. He is omniscient. He is the one who liberates from bondage. Therefore, I am taking refuge in that Lord of all. Oh God, in the mother's womb, blood, stool, I, who am unable to live without being able to count the months, unable to come out without being able to do anything, being tormented by the fire of the stomach, filled with urine, can never come out by your grace, can I? The Lord compassionate is indeed the Lord of the Universe. For ten months, until full term, she bestows the knowledge about herself in the womb. There is no return for the favor he has done. After being born, along with the living being, the Supreme Being is also appointed differently in this body, more than the living being in this body. In the body wrapped in seven kinds of skin, the living being, by the grace of the Supreme Being, having calmness and self-control, by the wisdom of the Lord who resides, by His grace, by His grace, he will worship Him and make it so that he may have a vision. Even though I am suffering with so much sorrow, I don't have the desire to be born from this womb. Having come out of this womb, as if falling into a dark well, without knowing who I am, without knowing who others are, I am doing the works related to the body and the house. Maya, with ego of the body, with pride of being independent, with happiness and sorrow

Experiencing fear and dying, and then being born again like this, is what I get. The wisdom fades away as soon as it is revealed. He is revolving in the cycle of worldly life. Therefore, I do not want to go out. You are a dear friend to me, a heartfelt greeting. He took refuge yesterday and broke free from your family bondage. I am taking refuge in your feet as a means to eliminate this pregnancy-related hell from again and again. Thus, from the seventh month to the tenth month, until fullness, the being, having knowledge, grieves and suffers to be born. Birth is not something he wanted. While it was like that, the labor pains once overturned him. It will be thrown out of the womb. With that, moving from her place, the memory of being under the head, completely gone, and without being able to breathe, she will exit from the mother's vagina with great difficulty. In what way did that baby's body appear to be covered in blood? Like worms in the dung, like worms, it lies among those impurities. Knowledge in the womb, knowledge in the womb The wisdom would be lost. Ignorance is a curse. Cries more often. They try to feed him milk because he is crying because he cannot understand the opinion of his neighbor and is hungry. Thus he develops a taste for them. They make the little ones lie on their tummy. He cannot drive away the fly and the mosquito that are attacking him, he is crying. The delicate skin is bothered by lice and mosquitoes. Thus, for five years, one experiences childhood sorrows. From the time a child turns five years old, they reach the age of puberty. Desires will begin to flow. Even if they are not fulfilled, intense anger and grief will come. As this progresses, along with the body, the determination to be independent increases. Pride arises, and hatred is formed; in the matter of women, men have desires, and in the matter of men, women have desires. It will be wise to take strong revenge on those who obstruct it. In this body formed with these five elements, I and mine, and belonging to it, a wrong sense arises. For that body, body Regarding the relationship, he is trying for a relationship.

Suffering is endured to experience the pleasures of sound and the senses. Eventually, he or she will go to hell. Again, the old story is happening. Evil feelings melt away, and because of associating with those who have evil feelings, truth, purity, compassion, silence, wisdom, modesty, wealth, fame, arrogance, control of the senses, control of the mind, and virtuous qualities are destroyed. Therefore, those who are engrossed in sensual pleasures, those who consider their body as themselves, those who are foolish, those who are objects of desire for women, those who desire sensual pleasures, those who have no wisdom should not form relationships. Mixed company of men and women is a bad influence on the mind. That's not all, there is also a tendency to think about women. Also, it creates a bond. Beauty is in the eye of the beholder. A man is fascinated by the beauty and modesty of women. Not only ordinary people, but the four-faced Brahma, who is great in knowledge, was fascinated by seeing his daughter's body. A sage, seeing a woman in the form of an animal, became a beast himself and ran after it without shame. Marichi, created by Brahma Except for one Narayana Rishi, no one among the people, gods, or humans who were created by the Prajapatis, or those who were created by them, or those who were created by the gods, is subject to the illusion of desire for women. All were attracted to that charm. Kapila is the actual God. He says that in this world, the illusion that covers knowledge and causes delusion is the illusion of woman. The illusion was created by my own mind. It has a rich and dynamic potential. Let's see what they are going to say next. It's a serious matter. They explained well how a man and a woman are born in this world. Praying that they will listen to it again and try to understand it, let's meet again in another podcast. Jai Shri Mannarayana. Asmat Guru Bhyo Namah.