ఉద్ధవుని విలాపము - కృష్ణ నిర్యాణ వార్తా శ్రవణము

Uddhava's Grief & Lord Krishna's Disappearance

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ హృదయస్పర్శి అయిన ఘట్టంలో, శ్రీకృష్ణ భగవానుని నిర్యాణ వార్తను విన్న ఉద్ధవుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోతాడు. కృష్ణుని అత్యంత ప్రియమైన భక్తుడు మరియు సఖుడైన ఉద్ధవుడు, విదురునికి ఆ దుఃఖకరమైన సంఘటనలను వివరిస్తూ తన భావాలను అదుపులో ఉంచుకోలేకపోతాడు. ఈ ఎపిసోడ్ శుద్ధమైన భక్తి యొక్క లోతును మరియు భగవంతుని విరహ వేదనను అత్యంత హృద్యంగా చిత్రిస్తుంది.

In this deeply moving episode from Canto 3 of Srimad Bhagavatham, we witness the grief-stricken Uddhava as he receives the heart-wrenching news of Lord Krishna's disappearance from this mortal world. Uddhava, one of Krishna's most beloved devotees and confidants, is overwhelmed with sorrow and struggles to compose himself as he recounts these events to Vidura. This episode beautifully illustrates the depth of pure devotion and the profound pain of separation from the Supreme Lord, offering a glimpse into the intimate bond between Krishna and His dearest devotees.

← Prev Next →
Uddhava's Grief & Lord Krishna's Disappearance bhagavatam

అస్మద్గురుభ్యో నమః సర్గాదియోస్యానురుణధిశక్తిభిహి ద్రవ్యక్రియాకారక చేతనాత్మభిహి తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే ద్రవ్య క్రియా కారక చేతనాత్మకములైన శక్తులచే సృష్టి స్థితి సంహారములను నియమించువాడు చక్కగా విజృంభించిన శక్తులు కలవాడు. ఇతర శత్రువు నిరోధించువాడు అయిన పరమ పురుషునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో 17th చాప్టర్ 33rd శ్లోక. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం నాలుగవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఉద్ధవుడు విరుదుడికి అందించినటువంటి సమాధానాన్ని కృష్ణుని యొక్క వివరాలతో అందించిన సమాధానాన్ని విన్నాము. తర్వాత తనని బద్రికాశ్రమం పోవడానికి శ్రీకృష్ణుడు ఆదేశించాడు. ఆ విషయం కూడా తెలుసుకున్నాం. ఇక ముందు జరిగే భాగాన్ని అనుభవిద్దాం. ఇట్లు ఉద్ధవుడు విదురుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానముగా సహించుటకు సఖ్యముగా అని తమ జ్ఞాతుల మరణ వార్తను ఎరింగింపగా విని శోకము నిండిన వాడైయు జ్ఞానముచే ఆ శోకమును తగ్గించుకొనెను. ఆ ఉద్ధవుని కృష్ణుని అనుగ్రహం పొందిన వారిలో ప్రధానుడుగా విదురుడు గుర్తించెను. అతడు ఎరుంగిన తత్వమును తాను ఎరుంగవలెనని కోరి ఇట్లు పలికెను. ఉద్ధవా, యోగీశ్వరుడగు సర్వేశ్వరుడు తన స్వరూపమందరి రహస్యమును ఎరింగించిన జ్ఞానమును నాకు అనుగ్రహింపవేడుచున్నాను. విష్ణుభక్తులు తమను సేవించిన వారి కార్యములను తప్పక నెరవేరుతురు కదా అని విదురుడు ప్రశ్నింపగా ఉద్ధవుడు విదురా భగవానుడు. తానీ లోకము వీడి వెళ్ళుచు నేను ఉండగానే మైత్రేయునకు తత్వజ్ఞానమనంతను ఉపదేశించినాడు అతడు నీచే సేవింపదగినవాడు మైత్రేయుని నిన్ను ఆశ్రయించిన వారికి ఈ జ్ఞానమును ఉపదేశించమని ఆదేశించెను. కావున నీవు ఆ మైత్రేయుని ఆశ్రయించి జ్ఞానము నొందుము.

ఈ విధముగా ఉద్ధవుడు విదురునితో భగవానుని కథలను చెప్పుచు అమృత ప్రవాహములో మొలిగినట్లు ఆనందమునొంది యమునా తీరమునందు ఆ రాత్రి ఒక క్షణం వలె గడిపి బదరికాశ్రమమును కేగెను. పరీక్షిత్ మరల ఇట్లు సుఖయోగిని ప్రశ్నించుచున్నాడు. దేవదేవా, యాదవులందరూ శాపముచే నశించినారు కదా? ఉద్ధవుడు కూడా యాదవుడే కదా? అతడు ఎట్లు మిగిలెను? శ్రీహరి కూడా తన శరీరమును ఈ లోకము నుండి ఉపసంహరించి తన లోకమునకు తీసుకొని పోయినాడే. ఉద్ధవుడు మాత్రం ఎట్లు మిగిలి ఉండెను? అతని ప్రశ్నకు శుకుడు సమాధానం ఎట్లు చెప్పెను. భగవానుడు తన అమోఘమగు సంకల్పముచే బ్రహ్మ శాపము అను మిషతో యాదవ వంశమును అంతమొద్దించి తన శరీరమును ఈ లోకమున కనపడకుండా మరుగుపరచవలెనని తలంచి ఇట్లు అనుకొనెను. నేను ఈ లోకము నుండి నా లోకమునకు ఏగినచో నన్ను గూర్చిన జ్ఞానము ఈ లోకములో ఎవ్వరికీ తెలియదు. ఆత్మజ్ఞాన పరిపూర్ణుడకు ఉద్ధవుడు ఒక్కడే నన్ను గూర్చి స్పష్టముగా ఎరింగినవాడు. ఉద్ధవుడు నాకంటే ఏ మాత్రము జ్ఞానములో తక్కువవాడు కాడు. అందుచే భగవద్విషేకమగు జ్ఞానమును లోకమునకు ఎరింగించుటకు ఈతడు ఈ లోకమున ఉండుగాక అని భగవానుడు సంకల్పించుటచే ఆ కృష్ణుని ఆజ్ఞను అనుసరించి ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరి జ్ఞాన యోగముచే భగవానుని ఆరాధించుండెను. విదురుడు కూడా లీల కొరకు మనుష్య రూపమును దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రమును ఉద్ధముని వలన వినెను. ఈ భగవత్ చరిత్రము యోగులకు యోగమును వృద్ధి పొందించును. మనసును నిలుపలేని వారలకు అది ఎరుంగుటకు సఖ్యమైనది కాదు. ఆ శ్రీకృష్ణుడు శరీరమును వీడిన విధమును మనసులో భావించుచు ఉద్ధవుడు విడలిన తరువాత విదురుడు భగవంతుని యందలి ప్రేమచే పరవశమైన మనసుతో యమునా తీరమున ఉచ్చైశ్వరముతో విలపించెను. కొంత కాలమైన తరువాత భాగవత శ్రేష్టుడగు విదురుడు యమునా తీరము నుండి గంగా తీరమున హరిద్వారమున చేరి మైత్రేయుడున్న స్థానమునకు చేరెను. అది గంగ భూమికి దిగిన చోటు. అఖండముకు జ్ఞానము గలవాడై మైత్రేయుడు అచట ఆసీనుడై ఉండెను. విదురుడు మైత్రేయుని చేరి జ్ఞానమునకు తనకు జ్ఞానము తనకు అనుగ్రహింప ప్రార్థింప సిద్ధిపడి ఇట్లు ప్రశ్నించెను. స్వామి.

లోకులు సుఖమును అందవలెనని కర్మలు చేయుచుందురు. కానీ ఆ కర్మలచే వారికి నిరతిశయమైన సుఖము లభించుట గానీ, దుఃఖము పూర్తిగా లేకుండా పోవుట గానీ జరుగుట లేదు. ఆచరించిన కర్మచే ఇంకను అధికమగు దుఃఖమునే పొందుచున్నారు. అట్టిచో పూర్తిగా దుఃఖము తొలగి నిరతిశయము అనంతమునగు సుఖమును పొందుటకు సాధనము నాకు ఉపదేశించి ప్రార్థించుచున్నాను. తమ వంటి విష్ణుభక్తులు భగవంతును గూర్చి జ్ఞానము లేక దుఃఖించునున్న జనమును అనుగ్రహించురకే ఈ మర్త్యులోకములో సంచరించుచున్నారు. అందుచే ఓ సాధు పుంగవా. అజ్ఞానినగు నాకు సుఖమునకు సాధనమును ఉపదేశింపుము. ఏ జ్ఞానముచే నేను భగవానుని ఆరాధించి పవిత్రమైన హృదయమున తత్వమును రెంగజాల జాలుదునో అట్టి జ్ఞాన మార్గమును ఉపదేశింపుము. భగవానుడు స్వతంత్రుడు, మూడు లోకములకు ప్రభువు. అయినను బ్రహ్మాదులలో తాను అనుప్రవేశము చేసి ఆయా వ్యాపారమును చేయుచుండును. అతడు ఏ కర్మను చేయనవసరము లేదు. అయినను ఈ జగత్ సృష్టిని, స్థితిని, దాని ప్రవృత్తిని సాధించుచున్నాడు. అది ఎట్లు చేయుచున్నాడో నాకు ఉపదేశింపుము. ఒకప్పుడు అతడే తన శరీరం వంటిదగు తపస్సు అని పేర్కొనబడి పేర్కొనబడిడి ప్రకృతి యందు ఈ స్థూలముగు ప్రపంచమును ఉపసంహరించి. తాను జగద్వ్యాపారమును మాని పరమాకాశము అనబడి గుహయందు వర్తించుచుండును. తానే ఈ చేతనా చేతనాత్మకముకు జగత్తులో ప్రవేశించి దానిని శాసించి ధరించును. తానే అనేక నామరూపములు దాల్చిన వాడగును ఎట్లు ఇన్ని విధములుగా మారునో ఎరంగింపుము. అతడే లోకక్షేమమునకై రామకృష్ణాది అవతారములను స్వీకరించి క్రీడగా సాధు రక్షణమును దుష్ట శిక్షణమును చేయును అనేకముగులీలలను చేయుచుండును ఎట్లు ఈ అవతారములను స్వీకరించునో ఎరంగింపుము పవిత్రమగు కీర్తి గల భగవానుని అమృత తుల్యము చరిత్రములను ఎంతగా వినుచుననో మనసు తృప్తి చెందదు. లోకములకు అధిపతియగు భగవానుడు ఏ తత్వములతో లోక పాలులను లోకములను వీనికి వెలుపల నుండు నరకములను కల్పించెనో ఎరంగింపుము. వేరొక కారణము తనకు లేని సర్వ జగత్ కారణముగు భగవానుడు ఈ ప్రాణులను, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, దేవ మనుష్యాది భిన్న భిన్న రూపములగు రూపములను, నామములను ఎట్లు కల్పించెను ఎరంగింపుము.

ఆయా వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములను వ్యాసుని వలన అనేక పర్యాయములు వింటిని. కృష్ణ కథామృతము శాశ్వత సుఖములను వసంగునది. ఆ ధర్మములు అల్ప సుఖములను వసంగి వసంగజాలినవి. ఈ ఆ ధర్మములను వినుట చాలును అనిపించినది. తనివి తీరని భగవత్ కథామృతమును ఎరంగింపుము. విద్వాంసులు భగవానుల దివ్య చరిత్రములను కీర్తించుండగా వినడి పురుషుడు ఎవడును తృప్తినందడు. ఆ భగవత్ కథ కర్ణరంధ్రము గుండా హృదయమున ప్రవేశించి సంసారమును కలిగించడి ఇల్లు, ఇల్లాలు, బిడ్డలు మొదలగు వారి యందు ప్రీతిని తురించివేయును. నీ మిత్రుడగు కృష్ణుడు కృష్ణద్వైపాయనుడు భగవత్ గుణములను చెప్పదలంచి అల్ప సుఖములను ఇచ్చు ధర్మములను కర్మములను కర్మలను ఎరింగించెను. వాని యొక్క తక్కువతనము తెలిసినా కానీ భగవత్ కథల యందు రుచి కలగదని భారతము రచించినాడు. దానిని వినిన వారికి ఆ క్షుద్రములకు ధర్మములను వదలి అఖండానందమునిచ్చు భవత్కథల యందు శ్రద్ధ కలుగును. భవత్కథలను వినగానే ఇతరమైన వాని యందు విరక్తి కలుగును. భగవత్ పాద స్మరణము చేత సుఖించిన వానికి దుఃఖములన్నియు అంతమొందును. కొందరు ఆజ్ఞులు ఎంత వినదగినదో ఎరుగరు. పాపపు ప్రభావముచే భగవత్ కథల యందు విరక్తులయుందురు. వారు లోక వృత్తాంతము వినుచు కాలము గడుపుటచే వారి ఆయుర్దాయమును సూర్యుడు హరించును. భగవత్ కథలను వినక ఇతర కథలను విను వారికి మాట చేత మాట తలంపు వ్యర్థములుగా సాగుచుండును. సమస్త వ్యధలను పోగొట్టు హరికథయే సుఖమును ఇయ్యజాలినది. తాపత్రయముతో పీడింపబడుచున్న మాకు సుఖతరమును సారభూతమునగు హరికథలను అనుగ్రహింప ప్రార్థించుచున్నాను. బ్రహ్మాది రూపములతో సృష్టి స్థితి సంహారమును చేయు భగవానుడై ఈ లోకమున మనుష్య రూపమున దాల్చి అవతరించి చేసిన అతి మానుష్యములకు దివ్య చేష్టితములు ఎరింగింప ప్రార్థించున్నాను. ఈ విధంగా. విదురుడు మైత్రేయుని దగ్గరికి గంగా దగ్గర ఆయన ఉన్నత్ ప్రదేశానికి వెళ్లి ఆయనను ప్రశ్నించాడు. దీని తర్వాత మైత్రేయుడు ఏం సమాధానం ఇచ్చాడో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం.

అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ

Salutations to Asmadguru. Salutations to the one who is the cause of creation, preservation, and destruction, and the one who is the cause of the actions of matter and mind. Salutations to the one who is the knower of the self, the cause of the actions of matter and mind. By the powers that are the cause of the actions of matter and mind, the creation, preservation, and destruction The one who hired him has powerful and mighty hands. Salutations to the Supreme Being, the Lord of the Universe, who is the Protector of the weak. Fourth Canto, 17th Chapter, 33rd Verse. Dear devotees, welcome to the fourth podcast of the third book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we have heard the answer given by Uddhava to Virudhudu, the answer given with the details of Krishna. Then, Sri Krishna ordered him to go to Badrikashram. We also learned about it. Let's experience the next part. Thus, Uddhava, in response to the questions asked by Vidura, to endure and to be friendly, hearing the news of the death of his relatives, he, filled with sorrow, reduced that sorrow through knowledge. Among those who received the grace of Krishna, Uddhava was the foremost Vidur recognized it. He spoke thus, desiring to understand the essence that he had not understood. Uddhava, O Lord of all, O Lord of all, I beseech You to bestow upon me the knowledge that has revealed the secret of Your form. Vishnu devotees will surely fulfill the deeds of those who serve them, when Vidura asked, Uddhava said, Vidura, the Lord. Leaving that world, while I was there, he taught Maitreya the knowledge of the self, and he is worthy of being served by you. He commanded Maitreya to teach this knowledge to those who have taken refuge in you. Therefore, you take refuge in that Maitreya and attain wisdom.

In this way, Uddhava, while telling the stories of the Lord to Vidura, rejoiced as if he had emerged in a stream of nectar, spent a moment on the banks of the Yamuna that night, and went to Badrikashrama. Parikshit again thus inquires of Sukha Yogini. Oh God, all the Yadavas have been destroyed by a curse, haven't they? Uddhava is also a Yadava, right? How did he survive? Srihari also withdrew his body from this world and took it to his world. How did Uddhava remain? How did Sukudu answer his question? The Lord, with his wonderful resolve, with the help of the Brahma curse, thought to destroy the Yadava dynasty and hide his body from this world, thus he thought. If I leave this world and go to my world, no one in this world will know about me. The perfect knower of the self, the Uddhava, is the only one who clearly explained about me. Uddhava is not inferior to me in knowledge. Therefore, to impart the knowledge that is the divine bath to the world, he is in this world As the Lord intended, following Krishna's command, Uddhava went to Badrikashrama and worshiped the Lord through the path of knowledge and yoga. Vidur also heard the story of Sri Krishna Paramatma, who assumed human form for the sake of Leela, from Uddhava. This divine story will increase the yogic practices for yogis. For those who cannot control their minds, it is not easy to understand. That, thinking in his mind about the way Sri Krishna left his body, after Uddhava separated, Vidura, with a mind filled with love for God, lamented with great emotion on the banks of the Yamuna. After some time, Vidura, the best of the Bhagavata, from the banks of the Yamuna to the banks of the Ganges, reached Haridwar and reached the place where Maitreya was. It is the point at which the Ganges begins its descent. Maitreya, who possessed knowledge of the unbroken, was seated there. Vidurudu approached Maitreya and asked him to grant him knowledge, to which he was granted and thus asked. Swami.

People perform actions so that they may attain happiness. But by those actions, they do not get unconditional happiness, nor do they completely get rid of sorrow. They are still suffering more sorrow due to the karma they have performed. I am praying, having been fully instructed, to be able to remove all sorrow and to attain infinite bliss. Devotees like you, without knowledge about God, are wandering in this mortal world only to bless the people who are suffering. Therefore, O noble sage. O ignorant one, teach me the means to happiness. By what knowledge can I worship the Lord and imbue my heart with purity, and teach such a path of knowledge? The Lord is very independent, and the Lord of the three worlds. However, he enters among the Brahma and performs those businesses. He doesn't have to do any karma. However, he is achieving the creation, preservation, and destiny of this world. Teach me how he is doing it. Once upon a time, he was like his own body Having mentioned penance, having mentioned, having mentioned, having withdrawn this gross world in nature. He abandons worldly affairs and dwells in a cave called the Supreme Abode. He himself, through this consciousness, enters the world, rules it, and adorns it. He himself is the one who assumes many forms, how he changes in so many ways, let us understand. He himself, for the welfare of the world, accepts the incarnations of Rama, Krishna, and others, and performs the protection of the saints as a game, and punishes the wicked. He performs many such feats. How? By accepting these incarnations, he makes a statement. The nectar of the sacred fame of the Lord The mind is not satisfied by listening to equal and similar stories. The Lord, who is the ruler of the worlds, with what principles He created the worlds, the inhabitants of the worlds, and the hells outside of them, tell me. Another reason, the Lord who is the cause of the entire universe, which he does not have, how did he create these beings, the senses of knowledge, the senses of action, the forms that are different from gods, humans, etc., and the names?

I have heard many times about the dharmas that the people of those varnas should practice through Vyasa. The nectar of Krishna's story is the abode of eternal happiness. Those virtues are capable of producing little happiness. It seemed that listening to these dharmas was enough. Let us drink the unquenchable nectar of the divine story. While the scholars are praising the divine stories of the Lord, no one is satisfied. That divine story, entering the heart through the ear holes, causes worldly life, destroying love for house, wife, children, and others. Your friend Krishna, Krishna Dvaipayana, wishing to tell the virtues of God, gave small pleasures, gave righteous deeds, and made them wear out. Even though he knew his inferiority, he wrote the Bharatamu because he did not have a taste for the stories of the Lord. Those who hear it, abandoning the dharma for those who are hungry, will be filled with immense bliss in the stories of the Lord. Upon hearing the stories of the Lord, aversion arises in others. One who is pleased by remembering the feet of the Lord, all his sorrows will end. Some commanders Don't know how much I can vocalize. Due to the influence of sin, they are detached from the stories of God. They spend their time listening to worldly stories, and the sun destroys their lifespan. Those who do not listen to the stories of the Lord and listen to other stories, their words and thoughts will be in vain. Hari Katha is the only thing that can relieve all suffering and give happiness. I pray to you to bestow upon us, who are afflicted with suffering, the pleasant and essence-filled Harikatha. Oh Lord, who performs creation, preservation, and destruction with forms like Brahma, I pray that you bestow divine deeds upon the most human-like beings who have incarnated in this world in the form of humans. Like this. Vidura went to Maitreyi, near the Ganges, to his place and questioned him. After this, we will find out what Maitreyi replied in the next podcast.

Salutations to Asmadguru, Jai Srimannarayana