మహదాది తత్వముల వికాసము - ఇంద్రియ నిగ్రహ నియమములు
Evolution of Cosmic Elements & Controlling Senses
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, మహదాది తత్వముల నుండి పంచభూతాలు, ఇంద్రియాలు మరియు మనసు ఏ విధంగా క్రమంగా వికాసం చెందాయో మహర్షి మైత్రేయులు విదురునికి అద్భుతంగా వివరిస్తారు. త్రిగుణాల సమన్వయంతో సృష్టి యొక్క గొప్ప రహస్యం ఆవిష్కృతమవుతూ, పరమాత్మ సంకల్పంలో ఎంత అద్వితీయమైన క్రమం ఇమిడి ఉందో ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది. అంతేకాక, మోక్షమార్గంలో సాధకులకు అత్యంత అవసరమైన ఇంద్రియ నిగ్రహ నియమాలను కూడా ఈ ఎపిసోడ్ వివరంగా తెలియజేస్తుంది. బాహ్య సృష్టిని అర్థం చేసుకోవడమే కాకుండా, అంతరంగాన్ని జయించడమే నిజమైన ఆత్మజ్ఞానమని ఈ తత్వోపదేశం మనకు స్మరింపజేస్తుంది.
In this profound episode of Srimad Bhagavatham Canto 3, we explore the sacred knowledge of how the cosmic elements — beginning with Mahat-tattva — evolved from the Supreme Lord's divine energy in a grand, ordered unfolding of creation. The great sage Maitreya illuminates how the five gross elements, the senses, and the mind emerged progressively through the interplay of the three gunas, revealing the magnificent intelligence embedded in the structure of the universe. Alongside this cosmic vision, the episode also delves into the essential discipline of sense control, presenting timeless guidelines that help a sincere seeker turn inward and progress steadily on the path of liberation. Together, these teachings remind us that both the cosmos without and the senses within are governed by the same divine order, and mastering oneself is the highest form of understanding creation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయచ భగవంతుడగు వాసుదేవుని కొరకు ప్రద్యుమ్న శ్రీకృష్ణుని పుత్రుడు అనిరుద్ధ మనమడు సంకర్షణ సోదరుడు కొరకు మనస్సులో నమస్కారం అను భావన చేయుచున్నాము లేదా ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము లేదా సర్వ జగన్నివాసుడు ప్రకాశ స్వరూపుడు తేజస్వరూపుడు స్వతంత్రుడు ప్రేమ స్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించువాడు అగు భగవానునకు అనగా ఓ దేవా నీకు మనస్సులో నమస్కారమును భావమని చేయుచున్నాము. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్ ఎయిటీన్త్ ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 40వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిల గీత మనం అనుభవిస్తున్నాం. కపిల గీతలో భగవంతుడి యొక్క జీవాత్మ పరమాత్మ ప్రకృతి సంబంధము, కాలం యొక్క ప్రభావము, భగవంతుడితో కాలానికి ఉన్నటువంటి సంబంధము విషయాన్ని మనకు తన తల్లి అయినటువంటి దేవహూతికి కపిలుడు వివరిస్తున్నాడు. ఇంకా దీనిలో ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. ఈ భగవదాత్మకమగు కాలము చాలా బలము కలది. దానిచే నడపబడుచున్నను సంతతము దానితో కలిసి ఉన్నను దానిని ఈ లోకము గుర్తింపలేదు. వాయువు చేతనే కదలుచున్న మేఘములు వాయు యొక్క గమనమును ఎట్లు గుర్తింపలేవో కాలమును ప్రాణులు అట్లు గుర్తింపలేవు. పురుషుడు సుఖమును పొందవలెనని కష్టపడి ఎన్నో పదార్థములను సంపాదించుచుండును కానీ కాలము దానిని నిలకడగా ఉండనీయక నశింపచేసి వానికి శోకమును కలిగించుచున్నది. ఇట్టి శోకము కలుగుటకు కారణము అజ్ఞానమే. భార్యా పుత్రాదులతో కూడిన తాను తన దేహము దేహమునకు సంబంధించిన ఇల్లు ధనము మొదలగునవి అన్నియు మూర్ఖుడగు మానవుడు అస్థిరములను ఎరుంగక స్థిరములను తలంచును. అందుచే ఇవి నశింపగానే శోకించును. ఈ సంసారములో జీవుడు దేవుడుగా మనుష్యుడుగా అనేక జన్మలెత్తి సంచరించుచుండును. ఏ జన్మలోనున్నను సుఖమునందడు కానీ విరక్తిని పొందడు.
భగవానుని మాయచే మోహమునంది నరకములో ఉన్నప్పుడు కూడా అతడి కష్టములను అనుభవించుచున్నను ఆ నరకములో తినడి ఆహా ఆహారము మొదలగు వానిచే స్వల్పముకు సంతుష్టినందుచు ఆ శరీరము పోవలెనని కోరడు. దేహము, ఇల్లు, ధనము మొదలగు వాని యందు మనస్సు ఎక్కువగా అంటిపెట్టుకొని ఉండుటచే తాను ఈ శరీరముతో ఉండుటయే సుఖము అని భావించును. శరీరమును శరీరమునకు సంబంధించిన వారిని పోషించుటకు చాలా కష్టపడుచు సంతతము చేయరాని పనులను చేయుచునే ఉండును. స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమ శరీరమునకు సంబంధించినదే కానీ స్థిరమైనది కాదు. కానీ అట్టి ప్రేమతో ఒకరితో ఒకరు కలిసి రహస్యముగా మాట్లాడుకొను మాటలు కలిగిన పిల్లలు, ఆ పిల్లలు మాట్లాడుకొను మాటలు మనసును సంతతం ఆకర్షించి మనసును పాడు చేయుచుండును. ఈ గృహముల దుఃఖమే ఎక్కువగా గలవి. గృహములలో గృహస్తుడై ఉండి ఆయా ధర్మములను ఆచరించుచుండును. వానిచే సుఖమునందుచున్నట్లు భావించుచుండును. ఆకలి వేసినప్పుడు తిండి తినుట, దాహం వేసినప్పుడు నీరు త్రాగుట, దురద వేసినప్పుడు గోక్కునుట మొదలగునవి దుఃఖమును పోగొట్టుటకు చేయుచున్న పనులనియు వానిచే దుఃఖములే కలుగుచున్నవనియు ఎరుగక ఆనందించుచుండును. చాలా శ్రమపడి ఇతరులను హింసించి అనేక మార్గములచే ధనమును ఆర్జించి బిడ్డలను పరివారమును పోషించును. వారు అనుభవింపగా మిగిలిన దానిని తాను తినుచుండును. ఇంత కష్టపడి సంపాదించునది నరకమే. తాను బ్రతుకుటకు ఒక వ్యాపారమును చేసి అది పాడైనచో మరల మరల సంపాదించి ఎంత శ్రమపడినను తనంత తాను ధనమును ఆర్జించుకొనలేక ఇతరులకు ధనమును ఆర్జించుచుండును. దూరదృష్టవంతులు ఎన్నో ప్రయత్నములు చేసియు వ్యర్థమై కుటుంబమును పోషించుకొనలేక బాధపడుచుందురు. అయినను అతనికి కుటుంబ పోషణమునందు గాని శ్రమించుటలో గాని విసుగు కలగదు. అట్లు కష్టపడి ఆర్జించి పోషించినను భార్యా పుత్రాదులను పోషింపలేని దశ వచ్చినప్పుడు నిరసించుచుందురు.
అయినను అతనికి విరుక్తి కలగదు. అయ్యో అనిపించదు. ఇంతకుముందు తాను ఆ భార్యా పుత్రాదులను పోషించిన వాడే ఈనాడు వ్యర్థుడై శరీరం ముదుసలి అయి ఏమియు చేయలేనిదై మరణమునకు సిద్ధముగా ఉన్నది. ఇతని వికృత రూపమును చూచి వెనక ఇతడు చేసిన శ్రమను మరిచి ఇంట్లోని వారు అవమానించుచుందురు. కాపలా ఉన్న కుక్కకు ముద్ద పడేసినట్లు ఏదో వీనికి అనాదనముగా పెట్టుచుందురు. దానినే తినును. ఆ తిన్న కొంచెము జీర్ణము కాదు. దానితో ఆహారము తగ్గును. ఏ పనియు చేయలేని వాడగును. నాడులలో కఫము పుట్టి. ఊపిరి ఆడకుండా బిగపట్టును. దానిచే ఆయాసపడుచు గుడ్లు తలక్రిందులై ప్రాణమెట్లు బయటకు వచ్చుచుండగా గొంతులో గురగురలాడుచుండగా ప్రాణము పోక బాధపడుచు పరుండి ఉండును. బంధువులు చుట్టూను చేరి ఏవోవో వావులు పెట్టి పిలుచుచున్నను పలుకలేడు. ఇట్లు యవ్వనములో ముసలితనములో క్లేశములే అనుభవించుచుండవలెను. చివరకు మరణము. ఇంద్రియములు బాగుగా డస్సిపోవును. ఇంద్రియములను ఇంతకాలము తన వశమందు ఉంచుకొనిన వాడు కాడు. మనసు నిలకడగా ఉంచుకొనుట అతని వశము కాదు. శరీరము బాధపడుచు మనసు చెదురుచుండగా మాట రాక బుద్ధి పనిచేయక తన వారందరు చుట్టును చేరి ఏడ్చుచుండగా ప్రాణమెట్లో వీడును. ఇట్లు మరణములో కూడా క్లేశములే అనుభవించుచుండును. జీవించి ఉండగా పుణ్యకర్మలు చేసి ఎరుగడు, పాపకర్మల్నే చేసి ఉన్నవాడు అట్టి వాని ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వద్దురు. వచ్చి అతని కంఠమును పాశముతో బిగించి లాగుకొని పోవుచుందురు. ఇతడు వెనకకు తగ్గుచున్నచో వారు బెదిరింతురు, తిట్టుదురు, దానిచే వీనికి వణుకు వచ్చుచుందును. త్రోవలో కుక్కలు వడలు కరిచి వేయుచుండును. తాను చేసిన పాపమును స్మరించుకొనుచు తల్లడిల్లుచుండును. ఆఖరి దప్పికలు అధికమగుచుండును. ఎండకు వేడెక్కిన ఇసుక మార్గములో మీదను సూర్యుడు చుట్టూను కార్చిచ్చులు వేడి గాలులు వీచి శరీరం ఉడికిపోవుచుండును.
వీపిపై తోలు కొరడాతో నడవమని కొట్టుచుందురు. నడవలేడు, విశ్రాంతికి స్థానం ఉండదు, నీరు దొరకదు, ఎంతో ఎట్లో అతి కష్టముపై నడుచుండును. తామస కర్మలు చేసి సత్కర్మలు చేయక ఈ పాప మార్గము గుండా యమలోకమును చేరును. శరీరమును వీడినది మొదలు యమలోకమునకు చేరుటకు ఎన్నో వేల యోజనములు నడవవలెను. ఇంత దూరము రెండు లేక మూడు ఘడియలలో వెళ్ళవలెను. ఆ యమలోకములో కొరవులతో శరీరమునంతూ కాల్చుచుందురు. తన శరీర మాంసమును తానే కోసుకుని తినవలెను లేదా ఒకరు ముక్కలు కోసి ఇయ్యగ తినవలెను. బ్రతికుండగానే కుక్కలు, గ్రద్దలు పైనబడి ప్రేగులను బయటకు లాగివేయును. పాములు కరుచుచుండును. చిన్న చిన్న ముక్కలుగా నరుకుచుందురు. ఏనుగుల చేత తొక్కింతురు. నీటిలో గోతిలో పడవేయుచుందురు. ఇవి కాక తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము మొదలగు నరకములను అనుభవింపచేతురు. వీనిని గూర్చి ముందు వివరింపబడును. తన కుటుంబము పోషించుకొనుటయే పరమార్థమని, తన దేహమును పోషించుకొనుట మాత్రము పరమ ప్రయోజనమని భావించువారు, సత్కర్మలను ఆచరింపని వారు ఈ దేహమును విడిచి నరకమునకేగి ఇట్టి దుఃఖములను అనుభవింతురు. వీడు బ్రతికి ఉండగా ఎన్నో పాపపు పనులు చేసి ఆర్జించిన ధనమును భార్య బిడ్డలందరు అనుభవింతురు కానీ ఇంతకాలము లోకమును హింసించి పోషించిన ఈ శరీరమును శరీరమును చెందిన బంధువులను ఇచ్చుటనే వదలి ఇచ్చటనే వదలి తాను ఒక్కడే తాను చేసిన పాపము. తన దారి బత్తెముగా నరక మార్గమును పొందును. అప్పుడు ఈ బంధువులు కానీ ఈ శరీరము కానీ తోడు కావు. పుణ్యము చేసిన వాడు కూడా ఇట్టి ప్రయాణమే చేయును కానీ అతడు స్వర్గము చేరును. దారిలో ఇంత శ్రమ పడడు. అచ్చట భోగములను అనుభవించును. పాపము చేసిన వారు నరకమును, పుణ్య కర్మ చేసిన వారు స్వర్గమును పొందుదురు. అచ్చటి యాతనలను భోగములను అనుభవించి ఆ పుణ్య పాపమును అనుభవించుట పూర్తి కాకుండా మరల జన్మించుచుందురు. కుటుంబ పోషణ చేయుటయే ధర్మము, చేయుట ధర్మమే. దానిని ధర్మబద్ధముగా చేసినవాడు ఇట్టి నరకమును పొందడు. శరీరమును పోషించుకొనుటయే తన కర్తవ్యమని బ్రతికేడు వాడు నరకములలో చిట్టచివరి నరకము అంధతామిశ్రయము అను నరకమును పొందును. ఈ విధంగా నరకమున పాపఫలమును అనుభవించి కర్మము అంతయు ఖర్చు కాగా మరల ఈ లోకములో వారు పుట్టుదురు. ఇంతవరకు యవ్వనములో వార్ధక్యములో మరణ సమయంలో పొందడి క్లేశములు వర్ణింపబడినవి.
జీవుడు గర్భములో ఉన్నప్పుడు, జన్మించినప్పుడు కలిగే క్లేశములు ఇప్పుడు వర్ణించుచున్నాడు. ఆ విషయాలను మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, Lord Vasudeva, may we be steadfast, to Pradyumna and Aniruddha, salutations to Sankarshana. For the Lord Vasudeva, Pradyumna is the son of Sri Krishna, Aniruddha is the younger brother, for Sankarshana We are feeling salutations in our minds, or salutations to those four formations with those names, or the one who resides in the entire world, the one with the form of light, the one with the form of radiance, the one who is independent, the one with the form of love, the one who attracts devotees to himself To the Lord, that is, O God, we offer our salutations and devotion in our hearts. Sixth Canto, Sixteenth Chapter, Eighteenth Prayer. Dear relatives, welcome to the 40th podcast of Srimad Bhagavata Tatva Deepika, Third Canto. As part of the Vidura Maitreyi conversation, we are experiencing the Kapila Gita. In the Kapila Gita, Kapila is explaining to Devahuti, his mother, about the relationship between the soul of God, the Supreme Soul, and nature, the influence of time, and the relationship between God and time. And in this, the front part we Let's experience. This divine time is very powerful. Even though it is being driven by it, even though it is always with it, this world does not recognize it. The clouds that move by the wind, how can they not recognize the movement of the wind, nor can they recognize time and life. A man works hard to obtain pleasure, acquiring many things, but time does not allow it to remain stable, destroying it and causing him sorrow. The reason for this sorrow is ignorance. He, who is united with wife, son, and others, considers his body, house, wealth, and other things related to his body, as unstable, and considers the stable things. Therefore, as soon as these perish, he grieves. In this world, a being, as God and as a human, takes many births and wanders. He is not happy in any birth, but he does not attain detachment.
Even when in hell, deluded by the illusion of God, he does not desire to be satisfied with a little food, ah, food, etc., by hunger, aha, food, etc., in that hell, and does not desire to leave that body. The body, house, wealth, etc., because the mind is very attached to them, he thinks that being with this body is happiness. The body, those related to the body, struggle a lot to nourish themselves, and they keep doing things that should not be done. The mutual love of men and women is related to the body, but it is not permanent. But children who have such love, who have secretly spoken to each other, those children's words attract the mind and destroy the mind. These homes are the most vulnerable. He will be a householder in the house and will practice those dharmas. He thinks that he is in happiness. Eating when hungry, drinking water when thirsty, scratching when itchy, etc., are the things that are done to get rid of sorrow He does not know that sorrow is caused by him, yet he rejoices. Having worked very hard, torturing others, earning wealth through many ways, and nurturing children and their families. He will eat what is left over as they experience it. What the hell, after all I worked hard for it. He made a business to live, and if it is ruined, he earns it again and again, no matter how hard he works, he cannot earn money on his own, but he earns money for others. The unfortunate ones, despite making many attempts, are unable to support their families and suffer. However, he does not get bored with family maintenance or hard work. Thus, even if they have worked hard and earned, when the time comes when they cannot support their wife and children, they will be disgraced.
But he will not be disgraced. I don't think so. The one who used to take care of his wife, children, etc., is now a waster, his body has become old, he is unable to do anything, and he is ready for death. Seeing his distorted form, the people in the house will forget the hardship he has done and will be humiliated. It's as if they are keeping something as a gift to the guard dog, as if they are feeding it something. I will eat it. That little morsel of food was not digested. With that, the food will decrease. He is unable to do any work. In the days of Kapha, it is produced. Hold your breath. By that, being exhausted, the eggs are upside down, and while the life is coming out, while it is chattering in the throat, while the life is not going, he will be lying down in pain. Relatives gathered around, making various calls, but he couldn't speak. Thus, in youth, in old age, one should experience suffering. Eventually, death. The senses are very good at it. He is not the one who has kept his senses under control for so long. It is not in his control to keep his mind steady. The body aches, the mind is distressed, the words When the foolish intellect did not work, and all his relatives gathered around and were crying, he was in the midst of life. Thus, even in death, one experiences suffering. He who does not know how to do good deeds while alive, and who has only done sinful deeds, such a person's life should not be taken away by Yama's messengers. They come, tighten his throat with a noose, and pull him away. If he retreats, they will be afraid, they will scold, and because of that, he will tremble. Dogs are barking in the street. He will be troubled, remembering the sin he committed. The last thirst increases. The sun is scorching hot on the sandy path, and the heat and wind blow around the sun, making the body feel hot.
They beat him with a whip to make him walk on a treadmill. He cannot walk, there is no place to rest, water is not available, he is walking with great difficulty. By doing tamasic deeds and not doing good deeds, one will reach Yamaloka through this path of sin. From the time the body is abandoned, it takes thousands of yojanas to reach Yamaloka. It should go this far in two or three hours. In that hell, they burn their bodies with hunger. One should cut and eat their own body flesh, or someone should cut it into pieces and give it to you to eat. While alive, dogs and eagles will attack and pull out the intestines. Snakes are biting. They are chopped into small pieces. They are trampled by elephants. They throw it into the water. Besides these, they make one experience hells like Tamisramshu, Andhataisramshu, and Rauravam. This will be explained in detail later. Those who consider that taking care of their family is the ultimate goal, and that taking care of their body is the ultimate benefit, those who do not practice good deeds, leaving this body, go to hell, and such sorrows Experience it yourself. While he is alive, his wife and children will all enjoy the wealth he earned by doing many sinful deeds, but he alone will give up this body that has been tormented and nurtured for so long, and give up the relatives who belong to the body The sin he committed. He will find the path of hell as a burden. Then these relatives or this body is not a companion. Even one who has done good deeds will make such a journey, but he will reach heaven. One doesn't really work that hard on the road. There, one experiences pleasures. Those who commit sins will attain hell, and those who do good deeds will attain heaven. Having experienced the sufferings and pleasures of that place, without completing the experience of that merit and sin, they are reborn again. Taking care of the family is dharma, doing dharma. He who has done righteous deeds will not suffer such a hell. He who lives believing that nourishing the body is his duty will attain the last hell, the hell called blindness and association. In this way, having experienced the consequences of sin in hell, and having spent all the karma, again in this world They are born. Until now, the sufferings experienced during youth, old age, and the time of death have been described.
He is now describing the sufferings that a being undergoes when in the womb and when born. We'll learn about those things in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus