ద్వారకానగర లీలలు - యాదవ వంశ పరమ వైభవము

Dwaraka Glories & Pastimes of the Yadu Dynasty

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నివసించిన దివ్యనగరమైన ద్వారకా పురి యొక్క అద్భుత వైభవాన్ని శ్రద్ధగా తెలుసుకుందాం. యాదవ వంశ పరమ వైభవాన్ని వర్ణిస్తూ, శ్రీహరి సన్నిధి వల్ల ఆ కులమెంత ధన్యమైందో శుకమహర్షి మనకు హృద్యంగా వివరిస్తున్నారు. ద్వారకలో జరిగిన దివ్య లీలలు భక్తుల హృదయాలను పవిత్రం చేస్తూ, మోక్షమార్గాన్ని సుగమం చేస్తాయని మహర్షులు ప్రబోధిస్తున్నారు. ఈ కథలను భక్తిశ్రద్ధలతో శ్రవణం చేయడం సాక్షాత్తు శ్రీకృష్ణ చరణ సేవకు సమానమని భాగవత మహాత్మ్యం చాటుతున్నది.

In this sacred episode of Srimad Bhagavatham Canto 3, we explore the divine glories of Dwaraka, the golden city established by Lord Sri Krishna as the eternal abode of the Yadu dynasty. The episode illuminates the unparalleled splendor of the Yadu clan, whose greatness was magnified beyond measure by the direct presence of Bhagavan Sri Krishna among them. We also witness the magnificent pastimes that unfolded within Dwaraka's sacred walls, revealing how the Lord's every action carries profound spiritual significance for devoted seekers. Listening to these transcendental narrations with faith and reverence is itself a purifying act that draws the soul closer to Sri Krishna's lotus feet.

← Prev Next →
Dwaraka Glories & Pastimes of the Yadu Dynasty bhagavatam

జితంతే ఆత్మ విద్ధుర్య స్వస్తయే స్వస్థిరస్తు మే భవతారాధ సారాద్ధం సర్వస్మా ఆత్మనే నమః ఆత్మవేత్తలలో అగ్రేసరులు గలవారి కళ్యాణము కొరకై నీవు నీ ఉత్కర్షను ఆవిష్కరించినావు. నాకు కూడా మంగళము కావుగాక. పరమానంద రూపుడవగు నీవు ఆత్మ రూపముగా నిత్య సిద్ధుడవై ఉన్నావు. సర్వము రూపములో ఉన్న నీవు ఆత్మ రూపుడవై యున్నావు నీకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 33rd ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం ఈ సృష్టిలో అంతఃకరణాలు, ఇంద్రియాలు ఎలా ఏర్పడ్డాయి అని తెలుసుకుంటూ ఈ నాలుగు వర్గాలు ఎలా ప్రారంభమవుతాయో తెలుసుకునే దానిలో బ్రాహ్మణుల విషయం తెలుసుకుని మనం ఇంతవరకు అనుభవించాం. ఇక ముందు విషయాన్ని మనం అనుభవిద్దాం. సమిష్టి పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఆవిర్భవించిరి. ఇంతక్రితం మనము బ్రాహ్మణులు ముఖము నుండి ఆవిర్భవించారని, వారిని ముఖ్యులు అంటారని, వారికి వాక్ వ్యాపారముతో గురువులని అంటారని కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఆ సమిష్టి పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఆవిర్భవించిరి. బాహువులతో రక్షణ చేయువారు, ఇతర వర్ణములను రక్షించువారు, లోకములకు ఉపద్రవములను కలిగించడి వారిని శిక్షించువారు. తమ బాహువులతో రక్షించువారు, బాహు వ్యాపారం ప్రధానముగా గలవారు కనుక సమిష్టి పురుషుని బాహువుల నుండి బయలు వెలిగినారు. ఇక్కడ ఈ సమిష్టి పురుషుని యొక్క ఊరువులు అనగా తొడల నుండి లోకమున జీవికకు సాధనములను ఆర్జించెడి వైశ్యులు ఆవిర్భవించిరి. కొనుట, అమ్ముట, వ్యవసాయము చేయుట, గోపాలనము చేయుట వీరి వ్యాపారములు. ఇవి తొడలు బలము గలవారు తిరిగి చేసే పనులు. వీరి సమిష్టి పురుషుని తొడల నుండి జన్మించిన వారు కనుక వైశ్యులు అయిరి. చతుర్ముఖుని పాదముల నుండి పుట్టిన వారు శూద్ర వర్ణము వారు. సుశ్రుషలో చేయుటలో పాదమే సాధనము.

చెప్పినట్లు చేయవలెనని సంచరింపగలిగిన వాడు కావలెను. సంచరించుటకు సాధనము పాదము. ఆ పాదము నుండి జన్మించిన వారు శూద్రులు, సుశ్రుష ధర్మముగా గలవారు. ఈ నాలుగు వర్ణముల వారు కూడా తమ స్వభావములకు తగిన ధర్మములను ఆచరించుచు అనాది పాప వాసనచే కలుషితమైన అంతఃకరణము యొక్క శుద్ధి కొరకు శ్రద్ధతో తమకు జన్మను సంగిన శ్రీహరిని ఆరాధింతురు. చతుర్ముఖుడు శరీరముగా కలిగిన పరమాత్మయే అన్ని వర్ణములను ఆ వర్ణములకు ఆయా వృత్తులను కల్పించినాడు. అందుచే చతుర్ముఖుడు సృష్టించినను అతనిలో నుండి నడిపించెడు శ్రీహరిని వీరందరూ ఆరాధింతురు. అన్ని వర్ణముల వారును తాము ఆచరించదగిన ధర్మములచే భగవానునకు ప్రీతి కలిగించి తమ అంతఃకరణమునకు అంటిన పాప వాసనలను పోగొట్టుకొనుటయే సృష్టి యొక్క పరమ ప్రయోజనము. ఇట్లు భగవానుడిచే నియమింపబడు కాలము, కర్మ, జీవులు అను వానిని నియమించువాడు భగవానుడు. అతడు తన సంకల్పముచే ప్రకృతి యందు మార్పులు కలిగించుచు ఈ విశ్వమును కల్పించుచున్నాడు. దానిని వర్ణించుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. చెప్పటకు శక్యము కాకపోయినను మా గురువగు వ్యాసుని నుండి వినిన దానిని నా బుద్ధిచే గ్రహించినంతవరకు వర్ణించితిని. ఇది అంతయు శ్రీహరి యొక్క కీర్తియే. భగవాను విభూతియగు విశ్వమును వర్ణించుట శ్రీహరిని కీర్తించుటయే. శ్రీహరి కంటే ఇతరములకు పదార్థములను కీర్తించుటచే చెడిన వాక్కును పవిత్రము చేసుకొనుటకు మానవునకు భగవానుడు వాగింద్రియమును వసంగెను. అదియే వాక్కునకు చరితార్థత. తత్వమెరింగిన విద్వాంసులు వర్ణించిన కథామృతమును వినుటకు ఉపయోగించుటయే చెవి ఉన్నందుకు ప్రయోజనము. విదురా. భగవన్ మహిమ అనేక వేల సంవత్సరములు యోగముచే పరిపక్వమైన బుద్ధి గల చతుర్ముఖుడు కూడా ఇట్టిది అని ఇంతయని వర్ణింపజాలడు. ఆ భగవన్ మాయ ఆశ్చర్యకరమైనది. అది ఆశ్చర్యకరమగు శక్తి గలవారికి కూడా ఆశ్చర్యము కలిగించునది. ఆ భగవానును ఎరంగించునది వేదమే కానీ ఆ వేదము కూడా ఇట్టిది ఇంత పరిణామము కలదని భగవన్ మహిమను ఎరంగ చాలదు.

ఆ వేద వాక్కులు కూడా భగవానుని మహిమను అంతను చూడలేకపోయినవి. అతీంద్రియమగు అర్థమును ఎరుంగగల పరిశుద్ధమగు మనస్సు కూడా వెనకకు మరలినది. ఇంకా ఇతర దేవతలు నేనును మిగిలిన ఋషులను ఎరుగజాలము అనుటలో ఆశ్చర్యమేమిటి? అట్టి మహిమ గల భగవానునకు నమస్కారము. ఈ విధంగా మైత్రేయుడు చెప్పిన దానిని విదురుడు ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. భగవానుడు జ్ఞానము, శక్తి మొదలగు ఆరు గుణములతో పరిపూర్ణమైన వాడు. జ్ఞానమే తన స్వరూపముగా కలవాడు. అందుచే మార్పు చెందనివాడు. సత్తరజస్తమో గుణములు లేనివాడు. అట్టి వానికి గుణముల యొక్క మార్పుచే కలిగెడి క్లేశములు, మార్పులు లీలకైనను ఎట్లు సంభవించును? మార్పు చెందకుండా ఉండెడి భగవానునకు ఈ జగత్తునకు తానే ఉపాదానముగా ఉండి జగత్కారణముగా ఉండుట సంభవింప చాలదు. అయినచో లీలకైనను అతడు మార్పు చెందని వాడు అనుట ఎట్లు సంభవించును? బాలకుడు ఆట పరికరములతో ఆడుకొనునట్లు భగవానుడు పూర్ణుడు అవాప్త సమస్త కాముడును అయి. ఏ ప్రయోజనము లేనివాడయ్యు తానే తన నుండి తన నుండి ఆటవలె సృష్టి చేయుచు అనుట కూడా కుదరదు. బాలుడు తనకంటే వేరైన పరికరములతో అనగా బంతి మొదలగు వానితో తనకు అంతకు ముందు లేని వినోదమును పొందవలెనని ఆటలపై కోరిక కలిగించి ఆడుకొనుచుండును. కానీ సర్వేశ్వరుడు తాము ఎల్లప్పుడూ తృప్తినంది ఉండువాడు. తనకంటే ఇతరమైన ఆట వస్తువు గాని తనకంటే ఇతరులగు ఆటలు ఆడువారు గాని లేనివాడు. అట్టివానికి ఆటయందు కోరిక ఎట్లు? ఆడుట ఎట్లు? సత్వరజస్తమోగుణములు గల తనదేయగు మాయచే భగవానుడు విశ్వము సృజించెను. దానిని తానే పాలించుచుండెను. మరల దానిని మరుగుపరుచుండెను. తనచే అధిష్టింపబడి ఉండు మాయను మహత్తత్వం మొదలగు తత్వములుగా మార్చి తాను బ్రహ్మ రుద్రాది రూపములతో సృష్టి చేయుచున్నాడు. పరమాత్మతో మాయ చేరినప్పుడు మాయచే జ్ఞానం ఆచ్ఛాదింపబడును కదా పరమాత్మ జ్ఞాన స్వరూపుడు అతని జ్ఞానము దీప కాంతి వలె కొంత మేర వ్యాపించునది. కొంత మేర వ్యాపించునది కాదు. మెరుపు యొక్క వెలుగు వలె ఒక సమయములో ఉండి ఒక సమయములో పోవునది కాదు.

పరణాములలో అంతకు ముందు లేని జ్ఞానము ఆవిర్భవించినట్లు భగవానునకు అంతకు ముందు లేని జ్ఞానము ఆవిర్భవించదు. స్వప్నములో కలిగిన జ్ఞానము తరువాత నశించినట్లు నశింపదు. అతడు జ్ఞాన స్వరూపుడై అంతటా వ్యాపించి ఉండును. మార్పునందని వాడై ఉండును. అట్టి పరమాత్మ మాయతో కూడినవాడు అగుట ఎట్లు? జ్ఞానం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిచో, ఒకచోట ఉండి ఒకచోట లేనిచో అవిద్యా సంబంధము కలగవచ్చును. కానీ భగవానునకు మాయా సంబంధం ఎట్లు కలుగును? భగవానుడు ఒక్కడే సమస్త శరీరములో జీవునకు అంతరాత్మగా ఉండును. అతనికి కర్మలచే క్లేశం ఎట్లు కలుగును? పరమాత్మ అంతటను వ్యాపించును అని చెప్పుదురు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో జీవునిలో పరమాత్మ ఉండినచో ఆ అవస్థలలో ఉన్న జీవునకు అంటేటి దోషములు పరమాత్మకు కూడా అంటును కదా? పరమాత్మకు అంటకుండుట ఎట్లు? అపవిత్రముగు శరీరముతో సంబంధం ఏర్పడిన నాడు. కర్మవశుడు కాకపోయినను ఆ అపవిత్రముగు శరీర సంబంధముచే పరమాత్మకు కూడా అపవిత్రత కలువు కదా. జగత్తుకంతగు ఒకే కారణమైన పరమాత్మ అన్ని పదార్థములో ఉన్నాడని చెప్పుచున్నారు కదా అతనికి. అండకుండుట ఎట్లు అను సంశయం బాధించుచున్నది. దాన్ని తొలగించవలెను కోరుచున్నాను. ఇట్లు విదురుడు ప్రశ్నింపగా భగవంతుడు భగవంతుని యందే మనసు నిలిపిన మైత్రేయుడు ఆ ప్రశ్నలకు ఏమి ఆశ్చర్యము నొందక మందహాసముతో చేయుచున్నట్లుగా హేలగా ఇట్లు సమాధానము చెప్పెను. తను ఏమి సమాధానం ఇచ్చారు? ఈ విదురు అడిగిన ప్రశ్నలకు ఆ సంవాదాన్ని మనం మరియొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Victory to the self-realized, to the well-being, to stability, to the essence of your devotion to the incarnation of the self. Salutations to the self-realized. For the well-being of those who are at the forefront among the self-realized, you have revealed your glory. May it be auspicious for me as well. You, who are the embodiment of supreme bliss, are eternally ready as the form of the self. You, who are in all forms, are in the form of the soul. Salutations to you. Fourth Canto, Chapter 24, 33rd Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the seventh podcast. Until now, while learning how the inner senses and senses were formed in this creation, while learning how these four categories begin, we have experienced so far by learning about the Brahmins. Let's experience the next step. Kshatriyas were born out of the arms of Samyukta Purusha. Previously, we learned that Brahmins emerged from the mouth, that they are called chieftains, and that they are called gurus with the business of speech. However, from the arms of that collective man Kshatriyas have emerged. Those who protect with their arms, those who protect other colors, those who punish those who cause calamities to the worlds. Those who protect with their arms, those who mainly do arms business, therefore, they emerged from the arms of the collective man. Here, from the thighs of this collective male, the Vaishyas who earn the means for livelihood in the world, emerged. Buying, selling, farming, and herding are their businesses. These are the things that take the strong at their joints. Since they were born from the thighs of the collective male, they became Vaishyas. Those who are born from the feet of the four-faced one are Shudra. The feet are the means of practice in Sushruta.

He must be able to do as he is told. The means to an end. Those who were born from that foot were Shudras, those who followed the dharma. These four castes also, practicing the dharmas appropriate to their natures, with devotion, for the purification of their inner selves, which are polluted by the stench of eternal sin, worship Srihari, who is born to them. The Supreme Being, who is the four-faced one, has created all the colors and the respective professions for those colors. Therefore, even though the four-faced one created it, all these heroes worship Srihari, who leads from within him. All people of all colors, by the righteous deeds they practice, bring pleasure to God and to remove the sinful smells attached to their inner selves is the ultimate purpose of creation. Thus, the time, karma, and beings appointed by God, the one who appoints them is God. He, through his will, is causing changes in nature and creating this universe. No one is capable of describing it. It is not possible to say, but our guru Vyasa I have described what I heard from the beginning, as far as my understanding allows. All of this is the glory of Sri Hari. Describing the universe as the manifestation of God and praising Sri Hari is the same as describing the universe itself. By praising substances to others other than Srihari, the Lord gave the human speech to purify the ruined speech. That's the testimony of the word. The benefit of having ears is to use them to listen to the nectar of stories described by the wise who have grasped the essence of philosophy. Vidura. The glory of God, even the four-faced one who is matured by yoga for thousands of years, cannot be described as this or that. The wonder of God is amazing. It is astonishing and even astonishing to those who have the power. That which removes the Lord is the Veda, but even that Veda is such that it cannot fully describe the glory of the Lord, considering its evolution.

Even the Vedic hymns could not bear to look at the glory of the Lord. The pure mind that can understand the meaning beyond the physical has also turned back. What is surprising that I and the other gods and the remaining sages cannot know? Salutations to the glorious Lord. In this way, Vidura is questioning what Maitreya said. The Lord is perfect with six attributes of wisdom, power, etc. The one who has knowledge is his own form. The one who remains unchanged. The one without the quality of being a Satrajit. How can the sufferings caused by the change of qualities be caused by the play of such a person? It is not possible for the Lord, who does not change, to be the cause of this world and the cause of the world. However, how is it possible to say that he is unchanging even in play? The boy is playing with toys, as if the Lord is the complete one, and all desires are fulfilled. Even if he is without any benefit, it is not possible to say that he creates from himself, like a game. The boy with different equipment than himself That is to say, he plays games with the ball and others, desiring to gain a pastime that he did not have before. But the Lord God is always satisfied. He is someone who does not have any other toys than his own, or any other games than those played by others. How is there a desire for such a person in the game? How to play? The Lord created the universe through the illusion that is his own, which has the qualities of sattva, rajas, and tamas. He was the one in control. Again, it was being boiled. He transforms the illusion that is established by him into elements like greatness, and he creates the universe with forms like Brahma, Rudra, etc. When the illusion merges with the Supreme Soul, knowledge is obscured by the illusion, isn't it? The Supreme Soul is the embodiment of knowledge; His knowledge is spread out to some extent like the light of a lamp. It's not something that spreads a little. It is not like the light of a flash, it is not something that goes on and off.

In the world, as if knowledge that did not exist before has manifested, the knowledge that did not exist before will not manifest in God. The knowledge gained in a dream will not perish afterwards. He is the embodiment of knowledge and is omnipresent. He must have changed. How is it that the Supreme Being is united with Maya? If knowledge once existed and once did not exist, if it exists in one place and does not exist in another, it may be related to ignorance. But how can there be a magical connection to God? God alone is the inner self of all beings in the entire body. How does he suffer from karmic afflictions? They say that the Supreme Being pervades everything. Be careful. If the Supreme Being is in the state of dream, sleep, and the living being, then the faults that are in those states will also affect the Supreme Being, right? How is it that the Supreme Being is not attached? The time when the connection with the impure body was established. Even if not by karma, due to that impure physical relationship, even the Supreme Soul gets impurity, right? They say that the supreme being, who is the cause of the entire universe, is present in all substances, right To him. The doubt of how the egg will be, is causing him pain. I want it to be removed. Thus, when Vidura asked, Maitreya, who had his mind fixed on God, replied with a smile, as if he was answering the questions without any surprise, saying, 'Hela.' What answer did he give? We will learn about the conversation regarding the questions asked by Vidur in another episode. Salutations to Asmadguru, Jai Srimannarayana.