మైత్రేయ ముని ఆశ్రయ నిర్దేశము - ఉద్ధవుని వీడ్కోలు వీధులు
Uddhava's Final Instructions & Direction to Maitreya
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ప్రియ భక్తుడైన ఉద్ధవుని హృదయస్పర్శిగా వీడ్కోలు తీసుకునే దృశ్యాన్ని అనుభవిస్తాము. భగవంతుని అంతిమ ఉపదేశాలను స్వీకరించిన తర్వాత, ఉద్ధవుడు మహర్షి మైత్రేయుని వద్దకు వెళ్ళమని ఆదేశింపబడతాడు. దివ్యజ్ఞానం భగవంతుని నుండి ఋషుల ద్వారా భక్తులకు అందుతుందని ఈ ఘట్టం అద్భుతంగా చాటిచెప్తుంది.
In this sacred episode from Canto 3 of the Srimad Bhagavatham, we explore the deeply moving farewell of Uddhava, the beloved devotee and confidant of Lord Sri Krishna. After receiving the Lord's final teachings, Uddhava is directed to seek the great sage Maitreya Muni, who will continue to illuminate the path of divine wisdom. This episode beautifully captures the transition of spiritual knowledge from the Lord Himself to His chosen sages, ensuring that the ocean of bhakti flows uninterrupted to sincere seekers across all ages.
అస్మద్ గురుభ్యో నమః నమః పంకజనాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే పద్మనాభునకు భూత సూక్ష్మేంద్రియ స్వరూపునకు సకల లోకములో వ్యాపించియున్న వానికి పరమ శాంతునకు కూటస్తునకు స్వయం ప్రకాశునకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో, 24th చాప్టర్, 34th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదురుడు. మైత్రేయుడు సంభాషణలో కొంత భాగం పూర్తి చేసుకొని ఆ పైన మైత్రేయుడు నుండి జీవాత్మ పరమాత్మ సంబంధంతో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి విదుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వేశాడు వాటికి. దాన్ని అందిస్తున్నటువంటి జవాబు ఏమిటో ఇప్పుడు అనుభవిద్దాం. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విదురుడు నాకు క్షమించాలి. అచేతనమగు ప్రకృతి సహజముగా దుఃఖమును కలిగించు స్వభావము కలిగినది కాదు. అది అపురుషార్థము కాదు అనగా పొందతగినది కాదు. కర్మవశుడగు జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఆ కర్మవశముచే అతనికి పరమపురుషుని సంకల్పముచే ప్రకృతి ఒకప్పుడు సుఖమును ఒకప్పుడు దుఃఖమును కలిగించుచుండును. పరమ పురుషునకు విచిత్రమగు స్వాభావికమగు శక్తి ఉన్నది. అతనికి గల శక్తిచే అతనిని మాయ బంధింపదు. దోషములను కలిగింపదు. జీవుడు కర్మవశముచే దైన్యమును బంధమును దోషములను పొందును గానీ ప్రకృతి సంబంధముచే కాదు. పరమాత్మ సత్వరజస్తమో గుణములు లేనివాడు మార్పు లేనివాడు కదా అతనికి మార్పు కలుగుటకు వీలు లేదు కదా అతడే జగత్తుగా మారుట ఎట్లు సంభవించును అని శంకింపరాదు పరమాత్మతో విడదీయరానివిగా జీవుడు ప్రకృతి ఉందురు. అవి అతని శరీరము వలె అతని చేతనే ధరింపబడి నియమింపబడుచున్నవి.
శరీరములో మార్పు కలిగినను ఆత్మలో ఎట్లు మార్పు కలగదో శరీరముకు ప్రకృతిలో మార్పు కలిగినను పరమాత్మ మారనవసరం లేదు. శరీరము ద్వారా అతని యందు ఉన్నట్లు అనుకొనుచుందురు. వేరు వేరు రంగుల దారములతో బట్ట నేసినప్పుడు ఆ బట్టలో అన్ని రంగులను ఉండును. ఏ దారపు రంగు ఆ దారమునందు ఉండును కానీ వేరొక దారమునకు అంటదు. అట్లే ప్రకృతి, జీవులు, పరమాత్మ కలిసే ఐక్యముగా ఉన్నను ప్రకృతిలో కలిగే మార్పులు జీవునకు అంటవు. పరమాత్మకు అంటవు. కర్మవశముచే జీవునకు కలుగు సుఖిత్వము, దుఃఖిత్వము పరమాత్మకు కలగవు. జీవుడు కర్మవశుడై శరీరము తాను ఒకటి అనుకొనును. శిరస్సు తగినది, కాలు పోయినది మొదలగు వికారములు శరీరంలో కలుగునవి తనకు కలిగినట్లుగా తోచుచుండును. అనుభవించుచుండును. అది కూడా భగవానుని విచిత్రముగు సంకల్పం. చంద్రుడు నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు కదలుచుండగా కదలని చంద్రుడు కదిలినట్లు కనపడుచుండును. అట్లే శరీరముతో చేరి ఉన్న జీవుడు తాను ఏమియు మార్పు లేని వాడైనను. శరీరములో తాను చేరి ఉండి ఆ శరీరమే తానుగా ఉండుటచే శరీరమందు కలిగిన మార్పులు జీవునకు కలిగినట్లు అనిపించును. కానీ దేహ ధర్మములు జీవునకు అంటవు. పరమాత్మ కర్మ సంబంధమే లేనివాడు కనుక అతని స్వరూపము అవిద్యచే మరుగుపడదు. అతడు ప్రకృతిని జీవులను కూడా నియమించుచుండును. అట్టి వాని స్వరూపము ఎప్పుడు భాసించుచుండుటచే కర్మవశుడైన జీవునకు కలిగినట్లు సుఖదుఃఖములు కలగవు. ఈశ్వరుడు తన జ్ఞానమునందు తాను ఎప్పుడూ నిలకడగా నిలిచి ఉండును. జీవుని కర్మ స్వరూప జ్ఞానమును మరుగుపరుచుండును. అందుచే ఇద్దరు ఒకే శరీరములో ఉన్నను ప్రకృతికి వశుడై జీవుడుండును. అందుచే ప్రకృతి జీవునకు అశుభము కలిగించును. ఈశ్వరునకు లీలలకు లీలకు ఉపయోగించి పనిముట్టు అగును. జీవునకు శరీర సంబంధముచే కర్మవశమున ఆత్మ స్వరూపము గోచరము కానప్పుడు తాను దేహముగా తోచుచుండును. కానీ పరమాత్మకు ఎల్లప్పుడూ
ఆత్మ స్వరూపం భాసించుచు ఉండును కనుక అతనికి దోషములు అంటవు. అంతేకాదు జీవునకు ప్రకృతి సంబంధముచే కలిగిన ఈ దోషములు కూడా కర్మ యోగమును ఆచరించి భగవత్భక్తి కలిగి భగవత్ కృప ఉండుటచే లేకుండా పోవును. అందుచే పరమాత్మ దోషములు తనకు అంటకుండా ఉండుటయే కాక తనతో కూడియున్న జీవుడు తనని ప్రేమించి ధ్యానించినచో వానికి కూడా అంటకుండా చేయును. ఇంద్రియములు శబ్దాది విషయములపై ప్రసరించుచుండుట స్వభావ సిద్ధం. కానీ ప్రకృతి పురుషుల కంటే పరుడగు హరియందు పరమాత్మయందు భక్తి కలిగి అతనిని ధ్యానించి దర్శించినచో ఇంద్రియములు విషయముల నుండి మరలును. అప్పుడు ఇంద్రియములు పరమాత్మయందు నిలిచి విషయములందు ప్రవర్తించుటచే కలిగిన క్లేశములు అంటవు. నిద్రపోవుచున్న వానికి కలలో కలిగిన క్లేశములు ఎట్లు మేల్కొనునప్పుడు అంటవో అట్లే. భగవంతుని యందు మేల్కొనిన వానికి క్లేశములు కలగవు. శ్రీహరి గుణములను వర్ణించుట వినుట చేసిన వారికి సమస్త క్లేశములు చల్లారిపోవును. గుణములను వినుట మాత్రమే కాక ఆ భగవానుని పాదారవిందములయందు ప్రేమతో తైలధార వలె ఎడతెగని స్మరణము మనసులో కలిగిన వారికి క్లేశము లేకుండా పోవుటలో ఆశ్చర్యము లేదు. భగవత్ భక్తిచే క్లేశములు అన్నియు తొలగును. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విదురుడు నాకు కలిగిన సంశయము బాగుగా తొలగింపబడినది. నీ వాక్కు అనేటి కత్తితో నా సంశయము ఛేదింపబడినది. నా మనస్సు భగవానుని గుణములను చెప్పవలెనని. వినవలెనని ఆ భగవానుని పాద సేవనమే చేయవలెనని తొందరపడుచున్నది. మీరు చెప్పిన మాటలచే జీవులను ప్రకృతిని రెండింటిని తనకు నివాస స్థానముగా ఏర్పరచుకొని పరమాత్మ ఉండునని నాకు తెలిసినది. విశ్వమునకు అంతకు కారణము బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ విశ్వమునకు వెలుపలనే కాదు లోన కూడా వ్యాపించియుండును. కారణమగు బ్రహ్మతత్వము తనలో వ్యాపించి ఉండని వస్తువు లోకములో ఉండదు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది అనుకొనుట భ్రాంతి. ఈ విషయమును స్పష్టముగా ఎరింగిన వారికి దేహమే ఆత్మ అనే భ్రాంతి కలగదు. తనలో నియమించుచు తనలో తానే ఉన్నానని తానే స్వతంత్రముగా ఉన్నానని అనుకొనుడి వాడును ఈ కనపడు దేహమే తాను అనుకొనుడి వాడును.
ఇద్దరు మూఢులే. ఈ లోకంలో కొందరు పూర్తిగా మూఢులు శరీరము కంటే వేరొకటి ఉన్నదని ఎరుంగని వారు మరికొందరు పరమాత్మ ఆత్మగా లేని వస్తువు లేదని సర్వత్ర భగవానుని దర్శించువారు వారిద్దరు కూడా సుఖముగా ఉందురు. మూఢులకు శరీరమే పరమార్థము కనుక వానికి క్లేశములు తెలియవు. అంతట పరమాత్మను దర్శించిన వానికి పరమాత్మను దర్శించుటచే ఆనందమే కానీ దుఃఖము కలగదు. కానీ ఉన్నట్లు తెలిసి స్పష్టముగా దర్శింపక పరమాత్మ ఉన్నాడో లేడో అని సంశయం కలుగువానికి ఎప్పుడు క్లేశమే కలుగుచుండదు. దేహము ఆత్మగా భాసించుచుండును. కానీ సత్పురుష చరణ సమాశ్రేణము చేయువాడు ఆ శరీరమే ఆత్మ కాదని నిశ్చయించుకొని దేహమే తాను అనేటి భావమును తొలగించుకొనును. దానికి సత్పురుష సేవనమే ప్రధాన సాధనము. సత్పురుషుల సేవచే నిర్వికారుడగు భగవానుని పాదముల యందు ఏ విఘ్నములు వచ్చినను చెదరని తాపత్రయమును తొలగించు భగవత్ చరణారవిండముల యందు అనురాగం ఏర్పడును. భగవానుని పొందించు వారు భాగవతులు. వారి సేవ ఎంతో తపస్సు చేసిన వారికి గాని లభింపదు. ఆ భగవానుని పొందించు మార్గభూతులగు భాగవతులచే దేవదేవుడు కీర్తింపబడుచుండును. అందుచే వారిని సేవించి వారి వద్ద ఉండి సంతతము భవత్ కథలను వినుచుండును. అందుచే వారికి భక్తి సులభముగా లభించును అని విదురుడు మైత్రేయునితో చెప్పుచు వెనుక మీరు నాకు సృష్టి క్రమమును అంతను ఉపదేశించిరి ఈ బ్రహ్మాండమందు ఈ విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించిన సంతతియే వ్యాపించి ఉన్నది మరీచ్యాది ప్రజాపతులను ఆ బ్రహ్మ సృష్టించిన కదా, సృష్టి విధములను చతుర్ముఖుడు సృష్టించిన తరువాత సృష్టి ప్రకారములను స్వయంభు మనువు మొదలగు 14 మనువులను ఆ మన్వంతరములలో అధిపతులను వారి వంశములలో జన్మించిన వారి చరిత్రములను. ఓ మైత్రేయా నాకు ఎరిగింపుము ఈ భూమి పైన క్రింద ఏ లోకములు ఉన్నవి అవి ఎట్లుండును వాని పరిణామం ఎంత భూలోకం యొక్క పరిణామం ఎంత తెలియచేయుము తిరియక్ జంతువులగు పశువుల యొక్క మనుష్యుల యొక్క దేవతల యొక్క సృష్టి క్రమమును తెలియచేయుము ఈ రకంగా ముందు వివరాలు తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. దానికి జవాబుగా ఇవ్వడానికి ముందు ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ దాని జవాబు మనము తర్వాతి పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Salutations to the Guru. Salutations to the lotus-like one. To the one with subtle senses, to the Vasudeva, to the peaceful one, to the one who is stable, to the one with the lotus-like face, to the one who is in the form of subtle senses, to the one who is pervading all the worlds, to the supreme peace, to the stable one, to the self Greetings to the radiant one. Fourth Canto, 24th Chapter, 34th Prayer. Devotees of God, welcome to the eighth podcast of the third book of Srimad Bhagavata Tattva Deepika. Vidur, that's all. Maitreyudu, after completing a part of the conversation, Vidudu asked some more questions to Maitreyudu to know about the things related to Jeevatma and Paramatma. Let's experience what the answer is that is being provided. Thus, when Maitreyi said so, Vidura should forgive me. The unconscious nature is not naturally prone to causing sorrow. That is not a Purushartha, meaning it is not something worthy of attainment. When a being is bound by karma, due to that karma, by the will of the Supreme Being, nature, sometimes gives him happiness, sometimes sorrow It is being created. The Supreme Being has a natural power that is different from others. The power of his mind will not be bound by illusion. It does not cause defects. A living being, due to karma, attains misery, bondage, and faults, but not due to nature. The Supreme Being is without the qualities of Sattva, Rajas, and Tamas, and is without change. He cannot be changed, right? How can he become the world? One should not doubt this. The living being exists in nature in such a way that it cannot be separated from the Supreme Being. They are being worn and appointed by him, just like his body.
Even if there is a change in the body, how can there be a change in the soul? Even if there is a change in the body and nature, the Supreme Soul does not need to change. They think that it is in him through the body. When the cloth is woven with different colored threads, all the colors are present in that cloth. The color of the thread is present in that thread, but it does not stick to another thread. Similarly, even though nature, living beings, and the Supreme Being are united in unity, the changes that occur in nature do not affect the living being. They don't belong to God. Due to karma, the happiness and sorrow experienced by a living being do not affect the Supreme Soul. The living being, being subjected to karma, considers the body as one. The head is appropriate, the leg is lost, and other distortions occur in the body, as if they are happening to him. He is experiencing it. That too is the Lord's strange intention. When the moon reflects in the water, the water appears to move, but the moon that does not move seems to move. Similarly, the being who is connected with the body, even though he is unchanged. The body, being united with the self, and the self being united with the body, are the changes that occur in the body to the living being It feels like we're on the same page. But the laws of the body do not apply to the soul. Since the Supreme Being is devoid of karmic relationships, his form is not obscured by ignorance. He also appoints nature and living beings. Because his form is always shining, the beings who are subject to karma do not experience happiness and sorrow. God is always steadfast in his wisdom. It hides the knowledge of the karma form of the living being. Therefore, even though two are in the same body, the individual being subject to nature. Therefore, nature causes misfortune to living beings. For God's sake, use the tools for God's sake. When the soul, due to its connection with the body, is not visible in the form of karma, it appears as a body. But always to the Supreme Being
Because the self is manifest, he is not affected by faults. Not only that, these defects caused by the nature of the living being will also disappear without being caused by performing Karma Yoga, having devotion to God, and having God's grace. Therefore, not only does the Supreme Being prevent faults from affecting him, but also if the being with him loves and meditates on him, it will prevent them from affecting him as well. The senses are naturally inclined to pervade the objects of sound and other senses. But if one has devotion to Hari, who is more detached than nature and men, and to the Supreme Soul, and meditates on him and sees him, then the senses will turn away from worldly matters. Then, the sufferings caused by the senses remaining in the Supreme Being and acting in the world are not mentioned. Just as the troubles that a sleeping person experiences in a dream, when he wakes up, they are the same. For he that hath put his trust in the Lord shall have no failing in him. Those who listen to and describe the virtues of Srihari will be relieved from all sufferings. Not only listening to the qualities, but also with love at the lotus feet of that Lord, like a stream of oil, unceasing remembrance should arise in the mind It is no surprise that they are unaffected by the turmoil. By devotion to God, all sufferings will be removed. Thus, as Maitreyi said, Vidura, my doubt has been completely cleared. My doubt has been cleared by your word, which is like a sword. My heart desires to describe the virtues of the Lord. I am in a hurry to serve the feet of that Lord, so that I may listen. I know that the Supreme Being resides in the creatures and nature, having made both of them their abode, as you have said. The cause of the universe is Brahma. That Brahman is not only outside this universe but also pervades it. The cause, the Brahman principle, is pervading within itself; such a thing does not exist in the world. Believing that there is an object that is not the soul of Brahma is a delusion. Those who clearly understand this matter will not have the illusion that the body is the soul. He who thinks that he is appointed in himself, that he is in himself, that he is independent, he also thinks that this visible body is himself.
They're both stubborn. In this world, some are completely ignorant, some do not realize that there is something other than the body, and some see the Lord everywhere, saying that there is no object without the Supreme Soul as the soul. Both of them live happily. For the ignorant, the body is the ultimate reality, therefore they do not know suffering. Then, for one who has seen the Supreme Being, seeing the Supreme Being is bliss, but there is no sorrow. But knowing that, without clearly seeing, one who has doubts whether the Supreme Being exists or not, will never have suffering. The body as the manifestation of the Spirit. But the one who makes the collection of the feet of the virtuous, realizing that the body is not the soul, removes the feeling that the body is himself. For that, serving good people is the main means. By serving the virtuous, one attains devotion to the lotus feet of the unchanging Lord. Even if obstacles arise, one's anxieties are dispelled, and one develops a loving devotion to the lotus feet of the Lord. Those who have attained God are the Bhagavatas. Their service is not available to those who have done a lot of penance. By the Bhagavatas, the path-makers, who obtained the Lord, the God of Gods He is being praised. Therefore, serving them, staying with them, and listening to their stories forever. Therefore, Vidura says to Maitreya that devotion is easily attained by them. Furthermore, you have taught me the entire order of creation. In this universe, the progeny that originated from this Virat Purusha is pervasive The Brahma created the Prajapatis, didn't he After the four-faced one created the creation methods, the creation methods, the 14 Manus like Swayambhu Manu, the rulers of those Manvantaras, the histories of those born in their lineages. Oh Maitreya, tell me, how are the worlds above and below on this earth, how are they, how much is their evolution, how much is the evolution of the earth, tell me, the order of creation of the animals, the cattle, the humans, the gods Inform me. In this way, Vidura is asking questions to find out the details beforehand. Before answering that, let's ask a few more questions and we will find out the answer in the next podcast. Jai Srimannarayana and salutations to the Gurus.