సముద్ర గర్భమున భూ దేవి రక్షణ - హరి పరాక్రమము
Lifting and Rescuing the Earth from the Abyss
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, భగవాన్ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి, సముద్రగర్భమున మునిగిపోయిన భూదేవిని రక్షించిన అద్భుతమైన లీలను వివరిస్తాము. హిరణ్యాక్షుడు భూదేవిని బలవంతంగా పాతాళ సముద్రపు లోతులకు తీసుకుపోగా, సమస్త సృష్టి దిక్కుతోచని స్థితిలో పడింది. శ్రీ వరాహ స్వామి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేసి, అతనిని సంహరించి, తన దంష్ట్రలపై భూదేవిని ఆనించి మహా ప్రేమతో పైకి తీసుకొచ్చారు. ధర్మ రక్షణకై భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరించి భక్తులను కాపాడతాడని ఈ లీల మనకు స్పష్టంగా చాటి చెప్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore the magnificent pastime of Lord Vishnu appearing as Varaha, the divine Boar, to rescue Mother Earth from the depths of the cosmic ocean. The demon Hiranyaksha had seized the Earth and plunged her into the primordial waters, leaving all creation in despair, until the Lord descended to restore cosmic order. With thunderous valor, Sri Varaha defeated Hiranyaksha in a great battle and gently lifted the Earth upon His tusks, restoring her to her rightful place in the universe. This episode reminds us that the Lord is ever ready to protect His devotees and uphold Dharma, no matter the depth of darkness into which the world may fall.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః కమలనాభాయ నమః కమలమాలినీ నమః కమల పాదాయ నమస్తే కమలేక్షణే ఓ కలవ కన్నుల శ్రీహరి బ్రహ్మాండము కమలముల మాలను ధరించే నీ నాభ్యందలి కమలమైనది. కమలమ్ముల వంటి పాదములు గల నీకు అనేక నమస్కారములు. ఫోర్త్ క్యాంటో 30th చాప్టర్ 25th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము. 21వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతక్రితము విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా స్వాయంభవ మను యొక్క చరిత్ర దానిలో వరాహ అవతారము వరాహ అవతారము రావడానికి ముందు హిరణ్యాక్షుని యొక్క చరిత్ర హిరణ్యాక్షుడు పుట్టానికి కశ్యప దితి యొక్క సమాగమం వృత్తాంతము. అప్పుడు వైకుంఠం యొక్క వర్ణన ఆ జరిగినటువంటి వైకుంఠంలో సనకాది కుమారులు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆ విషయాన్ని మనం ముందు భాగంలో మనం ఇప్పుడు అనుభవించబోతున్నాం. ఈ వైకుంఠమును యోగ బలముచే సనకాది కుమారులు ఒకసారి చేరిరి. ఆ వైకుంఠమును విశ్వమునకు అంతకు గురువునగు భగవానునిచే అధిష్టింపబడినది లోకములంతటిచే నమస్కరింపబడునది. ఇంతకుముందు ఎక్కడనూ చూడబడనది. దేవతల విమానములచే ప్రకాశించునది ఆశ్చర్యకరమైనది అయిన వైకుంఠమును చేరి సనకాది కుమారులు వేరొక వైపు దృష్టి ప్రసరింపని వారలై భగవానును దర్శింపవలెనని ఆసక్తితో ఆరు కక్షలను దాటి లోనికి ఎగిరి. ఏడవ కక్షయందు కేయూరములు, కుండలములు, కిరీటములు దాల్చిన వారును, చేతిలో గద దాల్చిన వారును, ఒకే వయసున్న వారును అగు ఇద్దరు దేవతా మూర్తులను గాంచిరి. వారి కంఠముల యందు మదించిన తుమ్మెదలు ఆవరించుచున్న పరిమళములు గల పుష్పములతో కూర్చిన వనమాలలు విరలాడుచుండెను. వీరిని చూచి ఆ పురుషులిద్దరూ కనుబొమ్ములు ముడిచి నాసారంధ్రములు కొద్దిగా విచ్చుకొనునట్లు ఎరనైన నేత్రములతో
ద్వారమున నిలిచి యుండిరి. వారిద్దరూ చూచుచుండగానే వారిని లెక్కచేయక సనక సనందాదులు వారి అనుమతిని అడగకనే వెనక ద్వారములను దాటి వచ్చినట్లుగానే ఏడవ ద్వారమును దాటి లోపలకు పోవుచుండిరి. వారికి ఎచ్చటికి పోవుటకును ఆటంకం ఉండదు. ఆ ద్వారమునందుండు పురుషులు ఇద్దరిని ఇద్దరును వారిని చూచి వారు ఐది ఏండ్ల వయస్సు గల వారి వలె దిగంబరులై ఉండిరి. వయస్సు గడుచున్నను ఐదేళ్ల వయస్సు గల వారి వలనే ఉండిరి. వారు పరమాత్మ యాదాత్మ్యమును ఎరుంగిన వారు. అట్టి వారిని వారి ప్రభావం ఎరుంగక ఏమేమి సాహసము అన్నట్లుగా కొద్దిగా నవ్వి నివారించుటకు తగని వారిని ఎరుంగక తమ చేతిలోని వేత్తదండముతో వారించి నేత్రములతో ఆగవలెనన్నట్లుగా సూచించి నిలబెట్టిరి. ఇట్టి ప్రవృత్తి భగవానుని మనసునకు క్లేశము కలుగుంచునని వారు ఎరుంగరు. వారు భగవానుని ద్వారపాలకులు. సనకాది కుమారులు అందరి చేతను పూజింపదగిన వారు. అట్టి వారిని అడ్డగించుచున్నారని దేవతలందరూ ఆశ్చర్యముతో చూచుచుండిరి. భగవానును దర్శింపవలెనని కోరికతో లోపలికి ఎగుచున్న తమను అడ్డి అవమానపరిచినారని ఆ కుమారులు మనసున కినుక కలిగి కనులు ఎర్రబారెను. వారు ద్వారపాలకుతో ఇట్లు అనుచుండిరి. ఏమి ఈ లోకమున ఈ విచిత్రమగు ప్రవృత్తి? ఈ లోకములోని పరుషులందరూ శాంత స్వభావులు కదా? ఇచ్చట అందరూ భగవత్ పరిచర్య చేయువారే కదా? ఇచ్చట శంకింపదగిన వారు స్వభావములో వైషము గలవారు ఎవరందురు? భగవానుడు సమస్త జగత్తును తనలో ధరించి ఉండువాడు కదా, అట్టి వాని వద్దకు వీడు చేరదగినవాడు, వీరు చేరదగని వాడు అని వైషమ్యం ఉండునా? యోగులు ఆ పరమాత్మలు తమను చూచి వానితో చేరిన వారుగా అనుభవించుచుందురు కదా. వీరు అనుకూలమగు దేవ వేషములో ఉన్నారు. శ్రీ వైకుంఠములో ఉన్నారు. ఈ ప్రదేశములో రాగద్వేషములు ఎవ్వరికీ ఉండవు. ఇచ్చట ఇట్లు వచ్చిన వారిని అడ్డగించవలెనని బుద్ధి ఎట్లు కలిగినది? ఇతట అల్పముకు భేదము కూడా ఉండుటకు అవకాశము లేదు. భేదము ఉన్ననే కదా భయము. భగవానుని కంటే వేరైన వారు ఎవరున్నారు? ఎవరి వలన భగవానునకు భయము కలుగునని శంకించుచున్నారు?
తమతో సమానులు కానీ అధికులు కానీ లేని వైకుంఠనాధునకు సంబంధించిన వారు వీరు. మీరు మీరు ఇట్టి ప్రవర్తన గలవారై ఉన్నారు కావున వీడు నావాడు వీడు పైవాడు అనేటి విషమబుద్ధి కలుగుటకు కారణములైన కామ క్రోధ లోభ రూపములను శత్రువులు మూడును ఏ లోకములో ఉండునో ఆ లోకములో కేగుడు. వారి తీవ్రమగు ఆగ్రహమునకు గురియైన ఆ ద్వారపాలకులు వారి పాదములపై బడిని. బ్రాహ్మణుల శాపము ఈ అస్త్రము చేతను వారింపరానిది అని ఎరింగిన ద్వారపాలకులు ఇరువురు వారి పాదములను పట్టుకొని భయముతో వణికిపోవుచుండే. వారితో ఇట్లు పలికిరి. దండనము మాకు తగినది. మీ వంటి భగవత్భక్తులను తిరస్కరించిన పాపము తొలుగుటకు కానీ అట్టి జన్మలో భగవంతుని గూర్చిన స్మరణము నశింపజేయు మోహము మమ్మల్ని ఆక్రమింపకుండా అనుగ్రహింపుడు. ద్వారపాలకులు సానకాది కుమారులను అడ్డకించి వారి శాపమునకు పాత్రుడైనని పద్మనాభునకు వెంటనే తెలిసెను. వెంటనే లక్ష్మీ సైతుడై నారాయణుడు ఆ ప్రదేశమునకు వచ్చెను. సనకాయ కుమారులు కూడా ఏ పాదములను అన్వేషించుచు వచ్చుచున్నారో ఆ పాదములను కదలిచి నడిచి వారిని ఉపశింప చేయవలెనని ఎదురుగా వచ్చిరి. శ్రీకరి వైకుంఠ నిలయము నుండి కదలగని వారి పరివారము హంసల బోలిన తెల్లని చామరములు విచ్చుచు అనుసరించుచుండిరి. చంద్ర మండలము వలె తెల్లని ఛత్రమును ధరించి ఉండిరి. ఛత్రముల నుండి వేలాడుచున్న ముత్యాల జారు నుండి అమృత బిందువులు స్రవించుచున్నవి. లక్ష్మీ సమేతుడవు శ్రీహరి సనకాది మునులకు ఎదురుగా వచ్చుచు చూచెను. తమయందు పరిపూర్ణ అనుగ్రహమును ముఖమున కనిపించచేయుచు శ్రీహరి వచ్చుచుండెను. ప్రేమతో కూడిన దృష్టి ప్రసారముచే మనసులు హరించుచుండెను. విశాలముకు వక్షస్థలమందు ప్రకాశించుచున్న లక్ష్మితో వైకుంఠ లోకమంతను ప్రకాశింపజేయుచు మునులకు ఎదురుగా వచ్చెను. నితంబ ప్రదేశమున పీతాంబరముపై మొలనూలు విరాజిల్లుచుండెను. మకరంద పానము చేత మెదించిన తుమ్మెదలు.
వక్షస్థలమందు ఉన్న వనమాల యందు రుద చేయుచుండెను. సుందరములగు ముంజేతులందు కంకణములు ఒప్పుచుండెను. కుడి చేతిలో తామర పువ్వును త్రిప్పుచు ఎడమ చేతిలో గరుడుని మూపును స్పర్శించుచుండెను. గండ స్థలమున మెరుపుల వంటి కాంతులను ప్రసన్నింప చేయుచున్న మకర కుండలముల కర్ణముల యందు శోభిల్లుచుండెను. నాసిక ఉన్నతమయ ముఖమును అందగింప చేయుచుండెను. మణులు గల కిరీటములు ప్రకాశించుచుండెను. భూమి మధ్య భాగమున మనోహరమగు ముక్తాహారము వేలాడుచుండెను. వక్షస్థలమున కౌస్తుభము మెరేయుచుండెను. లోకములో అందరికంటే నేనే నిరతిశయ సౌందర్య నిధినని గర్వముతో ఉండెడి లక్ష్మి కూడా స్వామి సౌందర్యంలో మగ్నమైన మనసుచే. తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు మనసుచే తన సౌందర్యమును తాను భావింపకుండెను. ఆ స్వామి సుందరమగు రూపమును చూచి బ్రహ్మ రుద్రాదులు దేవతలు కూడా తృప్తి తీరని చూపులతో చూచుచు శిరస్సులతో నమస్కరించుచుండిరి. పుండరీకాక్షిని పాదారవింద కింకలములతో కూడిన తులసి యందలి మకరందమును వహించి వచ్చెడి వాయువు ఆత్మానుసంధానముచే నిశ్చలమగు మనసు గల వారలగు మునుల యొక్క మనసును శరీరమును కూడా ఆనంద పరవశము చేయుచుండెను. అట్లు స్వామి సౌందర్యము చూచి స్వామి సుందర మంద హాస పరిపూర్ణమగు వదనమును చూచి కోరికలు నెరవేరిన వారయును వదలలేక ఆ స్వామి పాద ద్వందమును విడవలేక ఆశ్రయించియే ఉండిరి. కర్మ యోగ జ్ఞాన యోగములచే సహకరింపబడిన భక్తి యోగముచే ఆ స్వామి రూపమును నేత్రములతో దర్శించి వీడలేక అట్లే ఆశ్రయించి ఉండిరి. అట్టి దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును దర్శించిన సనత్ కుమారులు ఆనంద పరవశులై పరమ పురుషులు శ్రీహరిని ఇట్లు స్తుతించనారంభించిరి. వారు ఏమని స్తుతిస్తారు? ఇస్తున్నారు. ఎంతో కాలము నుండి మా హృదయములలో ధ్యానింపబడుచున్న నీ రూపము ఈనాడు మా నేత్రములకు గోచరమైనది. యోగులు కాని వారు వారి హృదయములోనే నీవు వసించుచున్నను నిన్ను చూడలేరు.
అట్టి నీవు ఈనాడు మా నేత్రములు కన్పట్టితివి. ఏనాడు నీ నుండి జన్మించిన మా తండ్రియగు చతుర్ముఖునిచే నీ రూపం వర్ణింపబడినదో ఆనాడే నీ రూపం మా చివరగుండా మా హృదయంలో ప్రవేశించి ఉన్నది. పరమ పురుషా, భక్తులకు శుద్ధ సత్వమయమైన నీ దివ్య దేహమును ప్రతి క్షణము దర్శింపచేసి ప్రేమను కలిగించుచుందువు. అట్టి నిన్ను గూర్చియే మాకు మా తండ్రి ఎరింగించి ఉన్నారు. అది పరమాత్మ తత్వమని మేము ఎరుంగుదుము. సంసారమందు వైరాగ్యము కలిగి దృఢమైన భక్తితో అహంకార రహితులై ఏ ఆత్మ తత్వమును ధ్యానించుచుందురో. అట్టి శుద్ధ సత్వమయమగు విగ్రహము గల ఆత్మతత్వమును కూర్చి మా జనకుడగు చతుర్ముఖుడు ఉపదేశించినాడు. నీ పాదారవింద శరణాగతులు చేయుటకు శక్యము గాని కర్మ జ్ఞానాది ఉపాయములను వదలి పవిత్రము కీర్తి గల నీ కథను వినుటయందు రుచిని రింగిన వారై నీ అనుగ్రహ ఉపమగు మోక్షమును కూడా లెక్కచేయరు. నీ కనుబొమ్మ కదలికచే నశించిపోయెడి ఈ స్వర్గమును స్వారాజ్యమును లెక్కచేయుట ఎందుకు? మా మనస్సు నీ పాద పద్మమునందు తుమ్మెద వలె మకరందమును ఆస్వాదించుచున్నచో, మా వాక్కులు తులసి వలె నీ పదములను శోభింపచేయు స్తోత్రములు కలవైనచో, మా వాక్కులు తులసి వలె నీ పదమును వినుటలో వినుటతో నిండినవైనచో. మేము మా పాపములచే నరకముల వంటి ఏ నీచ జన్మలలో జన్మించినను జన్మించనేము. మాకు కావలసినది నీ పాదారవింద సేవనమే. లోకములోని సర్వజనులచే స్తుతింపబడువాడా, నీవు నీ దివ్య మంగళ విగ్రహమును మాకు ప్రకాశింప చేసితివి. ఆ రూపమును దర్శించుటచే మా నేత్రములు సుఖమునందినవి. మనసు తన వశమందు లేని పరిపక్వము గాని యోగులకు నీ రూపము గోచరమగునట్టుది కాదు. అట్టిది నీ అనుగ్రహముచే మాకు ఈనాడు గోచరమైనది. అట్టి అనుగ్రహమును ప్రసరింపచేసిన నీకు. నమస్కారము. ఆ తరువాత స్తనకాదుల స్తోత్రం విన్న తరువాత భగవానుడు ఏం పలికాడు మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Kamalanabha. Salutations to Kamalamalini. Salutations to Kamala Padaya. Oh, lotus-eyed one, Srihari, the universe, the lotus-wearing one, is the lotus in your navel. Many salutations to you, who have lotus-like feet. Fourth Canto, 30th Chapter, 25th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Third Canto. Welcome to episode 21. Previously, as part of the conversation between Vidura and Maitreya, the history of Swayambhava, in which the Varaha incarnation, before the Varaha incarnation, the history of Hiranyaksha, the story of Kashyapa and Diti's union to the birth of Hiranyaksha. Then, the description of Vaikuntham, what happened when the sons of Sanaka went to that Vaikuntham, we are going to experience that matter in the front part now. The sons of Sanaka and others, with the strength of yoga, once reached this Vaikuntha. That Vaikuntha is established by the Lord, who is the guru of the universe, and is worshiped by all the worlds. Never seen anything like it before. Devatha Having reached the astonishing Vaikuntha illuminated by airplanes, the sons of Sanaka, not diverting their gaze to the other side, with the desire to see the Lord, crossed six koshas and flew inside. In the seventh house, they saw two divine figures, wearing earrings, earrings, and crowns, holding a mace in their hands, and of the same age. The garlands of forest flowers, adorned with fragrant flowers, were waving as bees, which were intoxicated by their voices, surrounded them. Seeing them, the two men closed their eyebrows and nostrils slightly opened, with their eyes like a small net
They stood at the door. As they were watching, without considering them, Sanaka and Sanandadu, without asking their permission, as if they had come through the back doors, were crossing the second door and going inside. They will not be hindered in going anywhere. The two men standing at the door, both of them, seeing them, were naked like five-year-old children. Even though they were old, they remained as young as five years old. They were the ones who knew the Lord's Spirit. Without understanding their influence, without understanding what courage it is, laughing a little, to prevent them, without understanding those who are unworthy, with the staff in their hand, they stopped them and, as if to stop them with their eyes, they indicated and made them stand. They do not understand that such a tendency causes suffering to the mind of God. They are the gatekeepers of the Lord. Sanakadi's sons are worthy of worship by everyone. All the gods were watching in amazement that they were obstructing such people. With the desire to see the Lord, they were inside, and the sons felt insulted The eyes, full of tears, turned red. They were saying this to the gatekeeper. What is this strange behavior in this world? Aren't all the wicked people in this world peaceful? Here, everyone serves God, right? Who are those who are worthy of doubt here, those who are naturally deceitful? Isn't it that the Lord, who holds the entire world in Himself, is worthy of reaching out to such a person, and is there a distinction between those who are worthy and those who are not? The yogis, those supreme souls, experience themselves as those who have joined him, don't they? They are in the guise of a friendly god. They are in Vaikuntha. In this place, there are no hatreds of raga. How did the idea to stop those who came here come about? There is no possibility of a difference in this case. Fear is only different. Who is different from God? Who are afraid of God?
These are those who belong to Vaikuntha Nadhudu, who are not equal to them, nor are they superior. You, you are of such behavior, therefore, the reason for the arrogance of 'this is mine, this is yours, this is above you' is the form of lust, anger, and greed. The enemies, all three, are in whichever world they exist, in that world, Kegudu. The gatekeepers, subjected to their intense anger, fell at their feet. The Brahmins' curse, because of this weapon, the gatekeepers who thought they could not be harmed, were holding their feet and trembling with fear. You spoke to them like that. Punishment is for us. Please grant us the grace to not be consumed by the delusion of forgetting the remembrance of God in such a birth, so that the sin of rejecting devotees like you is removed. The gatekeepers, having stopped the sons of Sanaka, immediately informed Padmanabha that he was worthy of their curse. Immediately, Lakshmi, feeling ashamed, Narayana came to that place. The sons of Sanaka are also coming to explore which feet, and by moving those feet, they should walk and comfort them They came in front. The family who could not move from Srikari Vaikuntha Nilayam were following, spreading out white chamaras like swans. They were wearing a white umbrella like the lunar orb. From the canopies, from the pearl-like stream, drops of nectar are flowing. Lakshmi, along with Srihari, came before the sages Sanaka and others and looked at them. Showing complete grace in their face, Srihari was coming. With the spread of love, hearts were being captivated. He came before the sages, shining with Lakshmi, who shines in the chest of the vast, illuminating the entire Vaikuntha world. In the Nitamba region, a peacock was adorning the yellow silk. The bees are swarming with nectar.
He was crying in the garland of the chest. Beautiful bangles were adorning the beautiful hands. She was waving a lotus flower in her right hand and touching Garuda's neck in her left hand. In the dangerous place, the lightning-like lights were shining in the ears of the Makara Kundalamu. The nasal aperture was high and the face was beautiful. The crowns with jewels were shining. In the middle of the earth, a beautiful pearl necklace was hanging. The Kaustubha gem was studded in his breast. Even Lakshmi, who is proud to be the most beautiful treasure in the world, with her mind absorbed in the beauty of the Lord. She did not realize her beauty. That Swami, with a beautiful mind, did not consider his own beauty. Seeing that beautiful form of the Lord, even Brahma, Rudra, and other gods were looking with unfulfilled glances and bowing their heads. The wind that carries the nectar from the lotus, which is the lotus of the feet of Pundarikakshi, and the one who is calm in mind through self-realization He was making the minds and bodies of the sages ecstatic with joy. Thus, seeing the beauty of the Lord, seeing the beautiful, smiling, and complete face of the Lord, those who had their desires fulfilled, unable to let go, unable to leave the lotus feet of that Lord, remained under His shelter. They were able to see the form of that Swami with their eyes, and without being able to leave, they remained under his shelter, having been aided by the Bhakti Yoga, which was aided by Karma Yoga and Jnana Yoga. Having seen the divine auspicious form of such beauty, the Sanatkumaras, filled with joy, began to praise the Supreme Being, Srihari, thus. What do they praise? They are giving. Your form, which has been meditated upon in our hearts for so long, is visible to our eyes today. Those who are not yogis cannot see you, even though you reside in their hearts.
Oh, you, today, our eyes have been opened. On the day your form was described by our father, the four-faced one, who was born from you, on that very day your form entered our hearts through our end. Oh Supreme Being, you inspire devotion by showing devotees your pure, Sattvic divine body every moment. That is why our father told us about you. We know that it is the Supreme Being. Those who, having detachment in worldly life, with firm devotion, and without ego, meditate on the essence of the self. Thus, the soul, which has a pure, Sattvic form, was composed by our ancestor, the four-faced one, who taught it. Your lotus feet are capable of accepting surrenders, but abandoning the means of karma, knowledge, and other means, those who are pleased to hear your story, which is sacred and glorious, do not even consider the salvation that is like your grace. Why count this heaven and kingdom that is destroyed by the movement of your eyebrows? If our minds, like a bee, are enjoying nectar at the lotus feet of you, our words will be like Tulasi at your feet If we have hymns that adorn the words, if our words are like Tulasi, filled with hearing your word, then. We were not born in any lowly births like hells because of our sins. We need your service. Wonderful, glorious, and most honored be yours, O Lord, who are praised by all the people of the world. By seeing that form, our eyes were pleased. It is not possible for yogis to see your form, even if they are mature and not under the control of their mind. That is because of your grace, it is visible to us today. To you who bestowed such grace. Salutations. After hearing the praise of the breasts, what did the Lord say? We will learn in the next episode. Jai Srimannarayana and salutations to the Ashram Guru.