దితి కశ్యపుల సంధ్యోపాసన కాల సంవాదము

The Evening Request of Diti to Sage Kasyapa

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, సంధ్యాకాలంలో దితి తన పతి కశ్యప మహర్షిని కోరిక తీర్చమని ఆర్తిగా వేడుకుంటుంది. సంధ్యోపాసన కాలం భగవదారాధనకు అత్యంత పవిత్రమైనదని, ఆ సమయంలో ఇతర కార్యములు శాస్త్రవిరుద్ధమని కశ్యప మహర్షి దితికి నెమ్మదిగా హెచ్చరించినప్పటికీ, ఆమె కోరిక మేరకు ఆయన అంగీకరించాల్సి వస్తుంది. ఈ సంఘటన సృష్టిలో సుదూర పరిణామాలకు దారితీస్తుందని, కాలనియమాన్ని పాటించడంలో గల ధార్మిక ప్రాముఖ్యతను ఈ సంవాదం హృద్యంగా తెలియజేస్తుంది. మన ఆచరణలు ఎంత చిన్నవైనా సరే, వాటి ఫలితాలు బ్రహ్మాండమంతటా ప్రతిధ్వనిస్తాయని ఈ ఘట్టం మనకు గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తుంది.

In this sacred episode from Canto 3 of the Srimad Bhagavatham, we witness a profound moment as Diti, overcome by longing, approaches her husband Sage Kasyapa during the auspicious hour of twilight with an earnest plea. Despite Kasyapa's gentle warnings about the sanctity of the evening hour — a time reserved for prayer and worship of the Lord — Diti's desire prevails, setting in motion a series of events with far-reaching cosmic consequences. Sage Kasyapa compassionately explains the spiritual significance of sandhyopasana and the grave risks of neglecting such sacred duties, offering timeless wisdom on dharma and self-discipline. This episode beautifully illustrates how even great souls are bound by the laws of time and divine order, and how the consequences of our choices ripple across creation.

← Prev Next →
The Evening Request of Diti to Sage Kasyapa bhagavatam

నమః కమల కింజల్క ఇషంగామల వాససే సర్వభూత నివాసాయ నమో యుగ్మహి సాక్షిణే కమలముల వలె కమలముల పుప్పడి వలె పచ్చనైన స్వచ్ఛమగు వస్త్రములను ధరించి ఉన్న శ్రీహరు కొరకు ఫలమాలు నమస్కరించుచున్నాము. ఆయన సకల ప్రాణులలో సాక్షి చైతన్య రూపముగా నివసించి ఉన్నాడు. ఫోర్త్ క్యాంటో, 30th చాప్టర్, 26th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక. తృతీయ స్కందము 22వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనము సనక సనందాదులు వైకుంఠవాసాన్ని దర్శించినప్పుడు వారిని ద్వారపాలకులు అడ్డగించిన తర్వాత వారికి సనకనాధులు, సనక సనందాధులు చేసిన శాపము, తరువాత భగవంతుడు వారికి ప్రత్యక్షమైన తరువాత వారు చేసిన స్తుతిని మనము తెలుసుకున్నాము. ఇది కూడా విదుర మైత్రేయ సంవాదంలోని భాగమే. భగవంతుడు వారి స్తుతి తరువాత ఏం పలుకుతున్నాడో విందాం. భగవద్భక్తియే తమకు సహజముగా కల సనగసనందాదులు స్తోత్రము చేయుచుండగా విని సంతోషించి వైకుంఠవాసియగు భగవానుడు ఇట్లు పలికెను. వీరిద్దరూ జయుడు, విజయుడు అను పేరు గల నా పారిషధులు, ద్వారపాలకులు. మీకు అవమానము కలుగునట్లుగా మీ యెడల అపచారము చేసిరి. వీరికి మీరు విధించిన శాపము మేము అంగీకరించితిమి. దేవతా స్వరూపులగు మిమ్మలను అవమానించుటచే వీరికి దండము తగినదే. మా ద్వారపాలకులు మీ యెడ చేసిన అపచారమునకు నన్ను క్షమింపుడు. బ్రహ్మవేత్తలే మాకు పూజ్య దేవతలు. నాకు చెందిన వారు చేసిన అపచారం నేను చేసినట్లే. సేవకులు తప్పు చేసినచో స్వామి పేరు ముందు చెప్పి వాని సేవకుడు తప్పు చేసినని లోకులు చెప్పుకొందురు. అందుచే సేవకులు చేసిన తప్పు స్వామి కీర్తిని నాశనము చేయును. శరీరమున బొల్లి వచ్చినచో అందం ఎట్లు తగ్గునో అట్లే సేవకులు తప్పు చేసిన ప్రభువుల కీర్తి మాయును. నా నిర్మలమగు అమృతం వంటి కీర్తిని వినుటచే అంత్యజాతి వరకు సకల మానవులు పవిత్రులగు చొందురు. అట్టి వైకుంఠవాసియగు నా కీర్తి మీ వలననే.

లోకములో ప్రసిద్ధమై ఉన్నది. అట్టి మీ యెడల తప్పు చేసిన నాడు నా చేతినైనను నేను ఖండించుకొందును. నా పాద పరాగమునకు పవిత్రత బ్రాహ్మణ పాద సేవ చేతనే లభించినది. ఈ విధముల గుణములన్నియు నాకు వారి సేవ చేతనే లభించినవి. బ్రాహ్మణ సేవ చేతనే నేను ఆమె యెడల ఒకప్పుడు అనాదరణముగా ఉన్నను లక్ష్మీదేవి నన్ను వదలనని నన్ను అనుసరించి ఉండును. ఆ లక్ష్మి యొక్క కటాక్ష లేశ ప్రసారము కొరకు బ్రహ్మాది దేవతలు నియమములను పాలించుచుందురు. అట్టి లక్ష్మి కూడా బ్రాహ్మణ సేవచే నాకు అనుకూలమై ఉన్నది. తాము చేయు వర్ణాశ్రమ కర్మల ఫలములను నాకు అర్పించి సంతోషముతో తమకు లభించిన దానిని నా ప్రీతికై భుజించిన బ్రాహ్మణుల భోజనముచే నేను సంతుష్టిందినందినట్లు యజ్ఞములలో యజమానుడు అగ్నిహోత్రమున హోమము చేసిన హవిస్సులచే కూడా తృప్తినందును. నా పాదముల నుండి వెలువడిన గంగ పరమశివుని లోకములను కూడా పవిత్రము చేయుచున్నది. అట్టి పవిత్రమైన పాదములు గలవాడనైనను నేను బ్రాహ్మణుల పాదపద్మ పరాగమును కిరీటములచే స్వీకరించుచుందును. నా శరీరము వంటి వారు బ్రాహ్మణులు, నా శరీరం వంటివి గోవులు. అట్టి వారిని పాము వంటి పగ పెట్టుకొని వానిని నా శరీరమును ప్రేమించునట్లు ప్రేమించక. నాకంటే వేరుగా ఎవరు చూచుచుందురో వారిని యమలోకములో యముని అధీనములో ఉండు ఇనుప ముక్కులు గల గ్రద్దలు పీకుతినును. ఏ బ్రాహ్మణులు తమను తిరస్కరించుచున్న వారికి ఆత్మగా నేను ఉన్నానని ఎరింగి ఆరాధింతురో ప్రేమతో నిండిన మందహాసముతో కూడిన మాటలతో పలకరించి మాట్లాడుచుందురో వారు నాకు ఉపకారము చేసిరని భావించుచుందును. నా సేవకులైన జయ విజయులు నా మనసును ఎరుంగక మీ యెడల తప్పు చేసిరి. అది వారికి చాలా మేలును కలిగింపగలదు. వారు మరల తమ శాపఫలమును అనుభవించి నిన్ను చేరునట్లు మీరు అనుగ్రహింపుడు. ఇట్లు భగవానుడు పలుకుచుండగా వేదముతో సమానమగు అమానుషమగు భగవద్వాణిని వినెనను వారి మనసులు కోపము తగ్గక ప్రసన్నములు కాలేకపోయెను. తక్కువ అక్షరములతో గంభీరమగు అర్థమును ప్రతిపాదించు. భగవద్వాణిని విని స్వామి ఏమి చేయదలించినాడో వారు ఎరుగలేకపోయిరి. బాహ్యమగు అర్థమును గ్రహించిరి. కోపముచే వారి శరీరము మండుచుండెను.

ఆ భగవానుని విచిత్రముకు శక్తిచే తమకిట్టి పదవి లభించినదని ఎరింగిన వారగుటచే భగవానుని మాటల అర్థమును భగవత్ అనుగ్రహముచే గుర్తించి నమస్కరించి ఇట్లు పలుకుచుండిరి. భగవాన్, నీవేమి చేతలెంచితివో మాకు తెలియదు. మమ్ములను అనుగ్రహింప తలచినావో, నిగ్రహింప తలచినావో మాకు తెలియుటలేదు. మాటకు మనసుకు. గోచరము గాని మా కంటికి కనబడుచు నిలిచినావు, మాట్లాడుచున్నావు. బ్రాహ్మణులు నాకు దేవతలను అనుటలో భావం మాకు తెలిసినది. లోకులు బ్రాహ్మణులను ఆదరించనిచో చెడిపోవుదురని వారిని దిద్దుపాటు చేయుటకు అట్లు పలికితివి గాని సకల లోకేశ్వరుడగు నీ చేత. కూడా గౌరవింపబడు బ్రాహ్మణులు కూడా నీవే పరదైవము. వర్ణాశ్రమ వ్యవస్థలో సాగుచున్న సనాతన ధర్మమును నీవే అవతరించి రక్షించుచున్నావు. ఆ సనాతన ధర్మమునకు పరమ రహస్యముగు ఫలము నీవే కదా? శృతులన్నియు నీ అనుగ్రహం పొందుటయే ధర్మమని చెప్పుచున్నవి. వృత్తి ధర్మమున నీయందే నిలచి ఉండెడి యోగులు నీ యోగులు నీ అనుగ్రహం వలన మృత్యు వంటి సంసారమును సుఖముగా తరించుచున్నారు. అట్టి నీవు ఒకరిచి అనుగ్రహింపవుట ఏమి? లోకములో బ్రహ్మాది దేవతలు చతుర్విధ పురుషార్ధములు కాంక్షించి లక్ష్మీదేవి పాదరేణువును తమ శిరస్సులపై ధరించుచుందురు. ఆ లక్ష్మి తులసిచే అలంకరించబడిన నీ పాద పద్మములను కోరుచున్నదై నీవు ఏ రూపమున ఉన్నను నిన్ను వదలక సేవించుచున్నది. నీవు బ్రాహ్మణుల పాద పరాగమును పవిత్రతకు సేవింతునని పలికితివి గాని సౌందర్య రాశి అయిన పరమ పవిత్రురాలగు లక్ష్మీదేవి కూడా నీ పాద పరాగ సేవకై వక్షస్థలమును విడిచి తులసితో పాటు నీ పాదములను సేవింపవలెని కోరుచున్నది. పరమ భక్తులు నీ పాదములనే సేవించుచుండుటచే వక్షస్థలమందున్న తనతో మాట్లాడకు కూడా అవకాశం ఉండదని పాదములందున్నదో. నీ అనుగ్రహం పొందవచ్చునని తులసితో పోటీ పడి తాను కూడా పాద సన్నిధిని వసించుచున్నది. శ్రీవత్సము నీకు శోభనిచ్చుచున్నదని ధరించితివా దానిని అనుగ్రహించుటకే అది ఒక నల్లని పొట్టుమచ్చ కదా అది అందమునకు శోభను కూర్చున్నది కాదు. అయినను దానిని ఎట్లు అనుగ్రహించుటకు ధరించితివో అట్లే వారి పాద పరాగమును స్వీకరింతువు కానీ నీవు పవిత్రుడగుటకు కాదు.

నీవు లోకులకు వారు ఆచరించవలసిన ఆచరణము నేర్పవలెను కదా? జ్ఞాన శక్త్యాది గుణములలో పరిపూర్ణుడవు నీవు. లోకములోని ధర్మమును, తపస్సు, దానము, దయ అనే మూడు పాదములతో నిలిపి బ్రాహ్మణులను, దేవతలను సంరక్షించుందువు. ఆ తపోదాన దయలను రజస్తమో గుణములతో నిండిన వారు పాడు చేయుచుందురు. అందుకని శుద్ధ సత్వమయమగు నీ రూపమును నీవే లోకమున ప్రకాశింపచేసి ధర్మ విరోధులను తొలగించి ధర్మ పాదములను కాపాడుచున్నావు. బ్రాహ్మణ కులము నీవు ధరించుట చేతను నీ ప్రియమైన మాట చేతను కాపాడగలిగినదై యున్నది. నీవు ధర్మములను ఆచరించు వారిని ధర్మ మార్గములందు ప్రవర్తింపచేయనిచో వేద మార్గమే నశించిపోవును. శ్రేష్టుడవగు నీవు ఏది ఆచరించిన దానినే లోకము ఆచరించును. నీవు సత్వగుణమునకు నిధివి. నీవే లోకమునకు క్షేమమును కల్పింపగోరువాడవు. అట్టి నీకు వేదమార్గమును నాశనము చేయు ధర్మ విరోధులు. వర్ధిల్లుట అనిష్టము కదా, అందుచే నీవు నీ అవతారములలో ధర్మద్రోహులను శిక్షించుచుందువు. నీవు బ్రాహ్మణులకు నమస్కరించుట విశ్వమునంతకు ప్రభవు అగు, నీవు తక్కువదనమును కల్పింపదు. కానీ లోకులను వాయి కర్తవ్యమును ప్రవర్తింపచేసి రక్షించును. ప్రభువు, నీ సేవకులకు ఈ జయ విజయులకు మేము కోపముతో ఇచ్చిన శాపమును నీవు అంగీకరించిన అంగీకరింపము లేదా దానిని తొలగించి వేయుము. ఏ తప్పు ఎరుగని వీరిని మేము శపించుట మేము చేసిన మహా పాపం. దానికి తగిన దండమును విధింపుము. ఇట్లు సనకాది మునులు విన్నవింపగా భగవాను ఇట్లు పలుకుచున్నాడు. ఈ జయవిజయులు ఇద్దరూ అసుర జన్మను పొంది పుట్టినది మొదలు నాపై పగ తెగ పెట్టుకొని ఎడతెగక నన్నే స్మరించుచు నన్ను గురించి. ఆలోచించుచు దానిచే నా సంబంధము గలవారగుదురు. అందుచే వారు మరల నన్ను వేగముగా చేరగలరు. వారికట్టి శాపమును వసుంగునట్టి ప్రేరణ నీ వలననే మీకు కలిగినది అని చెప్పి మునులను ఉపశింపింప చేసెను. ఆ మునులు నేత్రములకు ఆనందము కలిగించు ఆ వైకుంఠనాధుని స్వయం ప్రకాశమగు వాసస్థానమగు వైకుంఠమును దర్శించి భగవానులకు ప్రదక్షిణమునొచ్చి నమస్కరించి సంతోషముతో భాగవత సంపదకు ఆనందించుచు వెనకేగిరి.

మురులు విడలిన తరువాత తన భృత్యులను అనునయించుచు భగవానుడు ఇట్లు చెప్పెను. భయపడుకుడు, సుఖముగా విడలుడు, శాపము మీకు అనుగ్రహమే. ఆ బ్రాహ్మణులు ఇచ్చిన శాపమును నాకు శక్తియున్నను మరల్పదలచలేదు. ఒకసారి వెనక లక్ష్మి ప్రణయ కలహముతో నేను మాట్లాడక పరుండి ఉండగా బయటకు వెడలికి వెడలిలోనికి వచ్చుచుండగా మీరు ఆటంక పరిచిరి. అప్పుడు ఆమె కోపం వచ్చి మీకు కొంత కాలము ఈ స్థానము నుండి భ్రంశము కలగవలెనని తలంచెను. దానిని అనుసరించి ఇప్పుడు జరిగినది. తమ ధర్మమునే తాను ఆచరించినను అందులో యుక్తాయుక్తమును నిలింగి ప్రవర్తించవలెను. శ్రీ మహాలక్ష్మిని మహాపురుషులను తమ ధర్మమని లోనికి ప్రవేశించకుండా వారించుట భగవానుని మనస్సునకు ఇష్టమైన పని కాదు అట్లు చేయరాదు. దానిచే జయ విజయులకు మీకు శాపం వచ్చినది. మీరు జన్మించి బ్రహ్మజ్ఞానము కలిగిన భక్తుల యెడల అపచారము చేతురు. ఇట్లు ద్వారపాలకులకు చెప్పి దివ్య అనుభవములతో ప్రకాశించుచున్న వైకుంఠ స్థానమును మరల ఏగెను. స్వామి పారిషధులలో శ్రేష్టులగు జయవిజయులు బ్రాహ్మణుల శాపం వలన తేజస్సు తొలగి సర్వము నశించి విష్ణులోకము నుండి దిగిరి. ఇట్లు వారు వైకుంఠము నుండి క్రిందికి పడుచుండగా చూచి విమానములలోని దేవతలు హాహాకారములు చేసిరి. దితి గర్భమున నిక్షిప్తమైన కశ్యప ప్రజాపతి వీర్యమునందు ఆ జీవులు చేరిరి. వారు ఇద్దరు కవలలుగా ఆమె గర్భమునందు చేరి ఉండిరి. శ్రీహరి వారిని అంతమొందించి మీకు క్షేమమును కల్పింపగలడు. భగవానుడు సర్వ సమర్ధుడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు. మూడు లోకములకు అధిపతి. అతడు మనకు క్షేమమును కలిగింపగలడు. సత్వగుణము అభివృద్ధి పొంది చెందిన నాడు తప్పక వారిని అంతమొందించి మనకు క్షేమము కలిగించును. సకల లోకేశ్వరుడగు భగవానునకు తనను ఆశ్రయించిన వారి మన క్లేశములను తొలగించుట అల్పము తప్పక చేయగలడు.

ఈ విధముగా మైత్రేయుడు బ్రహ్మ చెప్పిన వృత్తాంతమును చెప్పెను. ఈ విధముగా దేవతలందరూ బ్రహ్మ వలన విని సంతోషించి తమ లోకమునకేగిరి. తర్వాత భాగం ఏమిటో మనం మరోవైపు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Salutations to the lotus, the one who shines like a jewel, the abode of the gods, the caretaker of all beings, salutations to Sri Hari, who is the witness to both, who is like a lotus, like the pollen of a lotus, wearing pure and clean garments, we offer the garland of fruits and salutations. He resides in all living beings as the form of witness consciousness. Fourth Canto, 30th Chapter, 26th Prayer. Oh, devotees of the Lord, the essence of the Lord's Bhagavata. Welcome to the 22nd podcast episode of Tritiya Skandam. Until now, when we, Sanaka, Sanandadu, and others, visited Vaikuntha, after the gatekeepers blocked their way, the curse given by Sanakanadhulu and Sanaka Sanandadhulu to them, After that, after God appeared to them, we learned about the praise they offered. This is also part of the Vidura Maitreyiya dialogue. Let's listen to what God is saying after their praise. While the devotees of the Lord were naturally praising the Lord with their hearts full of devotion, the Lord, who resides in Vaikuntha, heard and was pleased. These two are my ministers and gatekeepers named Jayudu and Vijayudu. In a way that causes you humiliation, towards you Beset. We accept your curse on them. By insulting you, who are the embodiment of gods, this is a fitting punishment for them. Forgive me for the wrongdoing done by our gatekeepers. We revere the Brahmins as our Gods. The betrayal of those close to me has been done so because I did it. If a servant makes a mistake, people will say that his servant made a mistake by mentioning the master's name. Therefore, the mistake made by the servants will destroy the glory of the Lord. If the body is afflicted with leprosy, how the beauty diminishes, similarly, the fame of the lords who have committed mistakes is diminished. By hearing of my pure, nectar-like fame, all mankind, up to the last race, will attain purity. My fame, who is a resident of Vaikuntha, is because of you.

It is famous in the world. When I have wronged you, I will confess it to you. The purity of my feet was obtained only through the service of Brahmins. All these qualities were obtained by me through their service. It is only through the service of Brahmins that I, once, was disrespectful towards her. Goddess Lakshmi will not abandon me and will follow me. For the grace of that Lakshmi, the Brahma and other gods follow the rules. That Lakshmi also, by serving Brahmins, is favorable to me. Having offered the fruits of the deeds of the Varnaashrama to me, with joy, I am satisfied that I have eaten what I received for my pleasure. Likewise, in sacrifices, the master, with the offerings made by the sacrificer, with the offerings made by the fire, also Satisfied. The Ganga, which emerged from my feet, is also sanctifying the worlds of Parameshwara. Even though I am the one with such sacred feet, I accept the lotus feet of Brahmins with crowns. Those who are like my body are Brahmins, like my body Cows. Like a snake, having hatred towards such people, without loving him, my body. Those who see differently than me, in Yamaloka, under the control of Yama, the eagles with iron beaks will tear them apart. Those Brahmins who, as a soul, I am to those who reject them, I will speak with words filled with love and with a smile, I will speak and talk, I will think that they have done me a favor. My servants, Jaya and Vijaya, without understanding my mind, have made a mistake against you. It can make them feel very good. Grant them that they may again experience the consequences of their curse and reach you. Thus, as the Lord was speaking, their minds were not satisfied by not hearing the divine voice, which was as unearthly as the Vedas, and their anger did not subside. Propose a solemn meaning with fewer letters. Hearing the divine voice, they could not understand what the Swami intended to do. They understood the external meaning. Their bodies burned with rage.

Because they knew that they had attained this position by the power of the Lord's miracle, they recognized the meaning of the Lord's words by the grace of the Lord, bowed down, and spoke thus. Oh my God, we don't know what you are going to do. We do not know whether you intended to please us or to be pleased with us. To heart and soul. It is not visible, but you are standing there visible to our eyes, you are talking. Brahmins, the feeling in me to consider the gods, we know. If the people do not respect the Brahmins, they will be ruined, so you spoke to correct them, but by you, the lord of all the worlds. Even the Brahmins who are respected are also yours, the supreme God. You are the one who has incarnated and is protecting the Sanatana Dharma that is being followed in the Varna system. You are the ultimate secret and the fruit of Sanātana Dharma, aren't you? All the rules say that it is righteous to receive your grace. The yogis who stand firm in your dharma, by your grace, are happily crossing the world like death. What is it that you are not favoring one person over another? Lokamula The Brahma and other gods, desiring the fourfold Purusharthas, wear the dust of the feet of Lakshmi Devi on their heads. That Lakshmi, decorated with Tulasi, desires your lotus feet, and whatever form you may be in, she serves you without abandoning you. You said that you would serve the dust of the feet of Brahmins for purity, but even Lakshmi Devi, who is a treasure of beauty and is the most sacred, wants to leave her chest and serve your feet along with Tulasi for the service of your dust of the feet. Because the supreme devotees serve your feet, there is no opportunity to even talk to the one in the chest, but there is an opportunity to talk to the one in the feet. She is competing with Tulasi to gain your grace and is also residing in the presence of your feet. You assumed that Srivatsa is adorning you, to bless it, it is a black spot, isn't it? It is not that it is adorning beauty. However, just as you have received it to be blessed, you will accept their footstool, but not to be holy.

You should teach the people the practice they should follow, shouldn't you? You are perfect in the qualities of knowledge, power, and other virtues. You protect the Brahmins and the gods by holding the Dharma of the world, penance, charity, and compassion in three steps. Those who are full of penance, charity, and compassion, and are full of Rajas and Tamas qualities, will be ruined. Therefore, you yourself illuminate your pure, virtuous form in the world, remove those who oppose righteousness, and protect the feet of righteousness. The Brahmin caste, because you wear it, and because of your dear word, it is able to protect you. If you do not make those who practice righteousness act in the righteous paths, then the path of the Vedas will be destroyed. You are the best, the world will follow what you do. You are the treasure of goodness. You are the one who wants to provide safety to the world. Such are the enemies of the Vedas, who destroy the path of dharma. It is undesirable to prosper, isn't it? Therefore, in your incarnations, you punish those who are faithless. You are the one who is the lord of the entire universe, saluting the Brahmins, you do not create inferiority. But the people The voice will enforce the duty and protect. Lord, whether you accept or reject the curse that we, your servants, gave in anger to these victories, or remove it. We cursed them, who knew what was wrong, that was a great sin we committed. And the punishment fitting to the crime. Thus, Sanaka and other sages, having heard, the Lord spoke thus. These two victories, having taken birth as demons, from the beginning, having taken revenge on me, constantly remembering me, about me. Thinking about it, they will become related to me. So that they can reach me quickly again. Having spoken, he caused the sages to be comforted, saying that the inspiration to utter the curse was from you. Those sages, bringing joy to their eyes, having seen that Vaikuntha, the self-illuminating abode of Vaikuntha, circumambulated the Lord, bowed, rejoiced with joy in the wealth of Bhagavatam, and went back.

After the anklets were broken, the Lord said thus, appeasing his servants. Fear not, be afraid, you are blessed with a curse. I cannot change the curse given by those Brahmins, even though I have the power. Once, while I was away from Lakshmi's love affair, you came out and interrupted me. Then she got angry and thought that you should be disturbed from this place for some time. It's what happened next. Even though one practices their own dharma, one should act with consideration and discrimination. To prevent Sri Mahalakshmi and great men from entering their dharma, is not a task dear to the mind of God, and should not be done. It is a curse to the victors, to you. You are committing misdeeds towards the devotees who have attained divine knowledge. Thus, having told the gatekeepers, she again ascended the divinely illuminated Vaikuntha abode. Among the Swami's physicians, the best, Jayavijayas, due to the curse of the Brahmins, their radiance was diminished, and everything was destroyed Descended from Vishnu. Thus, seeing them descending from Vaikuntha, the gods in the airplanes cried out in horror. In the womb of Diti, in the semen of Kashyapa Prajapati, those beings joined. They were twins, and were in her womb. Srihari can end them and grant you well-being. The Lord is omnipotent, the creator, the sustainer of the universe. The Lord of the Three Realms. He can give us well-being. When the quality of goodness is developed and attained, it will surely eliminate them and bring us well-being. The Lord of all the worlds, the Lord, will surely be able to remove the sufferings of those who take refuge in him.

In this way, Maitreya told the story that Brahma had told. In this way, all the gods, hearing from Brahma, rejoiced and went to their own world. We'll see what the next part is in the podcast later on. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.