దితి గర్భధారణ - దేవతల భీతి మరియు విచారము
Diti's Pregnancy & Apprehension of the Demigods
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, దితి అశుభ సమయంలో మహర్షి కశ్యపుని వలన గర్భం ధరించే విషయాన్ని వివరిస్తారు, ఇది రెండు శక్తివంతమైన రాక్షసుల ఆవిర్భావానికి నాంది అవుతుంది. ముల్లోకాలలో భయంకరమైన అపశకునాలు కనిపించడంతో దేవతలు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ధర్మమార్గాన్ని విడిచి కోరిక వెంట పోవడం వల్ల కలిగే పరిణామాలను బ్రహ్మదేవుడు మరియు దేవతలు విచారిస్తూ, ఆత్మనిగ్రహం మరియు భగవంతునిపై శరణాగతి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తారు.
In this sacred episode from Canto 3 of the Srimad Bhagavatham, we explore the fateful moment when Diti conceives children by the great sage Kashyapa at an inauspicious hour, setting the stage for the appearance of two mighty demons. Disturbed by this transgression of cosmic order, the demigods witness fearful omens across the three worlds and grow deeply anxious about the threat to come. Lord Brahma and the devas reflect on the consequences of desire overriding dharma, offering timeless wisdom on self-discipline and surrender to the Lord's will.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్యాయ తుభ్యం భగవతే నమః నీవు సర్వ ప్రాణులలో ఆత్మ చైతన్య రూపముగా సమానముగానున్నావు. నీ యందు కర్తృత్వ భోక్తృత్వాది దోషములు లేవు. సర్వ జగన్నివాసుడగు నీవు. స్వయం ప్రకాశ స్వరూపుడవు. నీవు ప్రకృతికి అతీతుడవు. సర్వమూర్తివగు నీయందు ఈశ్వర భావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములు పూర్ణముగానున్నవి. నీకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో, 30th చాప్టర్, 42 ప్రేయర్. ఒక బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 23వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో జై విజయుల యొక్క కథ వారికి సనక సనందాదులు ఇచ్చిన శాపము భగవంతుడు దానికి సమన్వయంగా చెప్పినటువంటి సమాధానము. వరకు మనం తెలుసుకున్నాం. వారు ఆ వైకుంఠవాసం నుండి క్రింది లోకంలో వచ్చి కశ్యప దితి ద్వితీయ యొక్క గర్భములో ప్రవేశిస్తారు. ఇంతవరకు మన కథ జరిగింది. దాని తర్వాత విషయాన్ని తెలుసుకుందాం. భర్త ఆజ్ఞను అనుసరించి తన బిడ్డలకు ఏమి ప్రమాదం వచ్చును అని భయపడుచు 100 సంవత్సరములు గర్భవతి అయి ఉండి కవల పిల్లలను కనెను. వారు పుట్టిన సమయమున భూమిపై అంతరిక్షములో దేవలోకమున భయంకరములగు ఉత్పాదములు ఏర్పడెను. లోక పీడ కలగబోవుచున్నదని ఆ సూచనలనిచే ఎరుంగుటకు అవకాశం కలిగినది. కొండలలో భూమి కంపించుచున్నది. దిక్కులలో హఠాత్తుగా మంటలు వచ్చుచున్నవి. తోక చుక్కలు ఉల్కాపాతములు జరిగెను. తీవ్రమగు వాయువు పెద్ద ధ్వనితో పెద్ద పెద్ద చెట్లను కూల్చి వేయుచుండెను. చెట్లను పెకిలించి వేయుచుండెను. మేఘములలో మెరుపులు అధికముగా ఉండెను. మేఘములచే సూర్యుడు మొదలగు వారి కాంతి కప్పబడి చీకటి ఆవరించి ఆకాశము కనపడటకుండెను.
సముద్ర కిరటములతో కల్లోలితమై లోపల ఉన్న జలచరములు పీడింపబడి ధ్వని చేయుచున్నట్లు ధ్వని చేయుచున్నది. చెరువులు, తటాకములు మొదలగునవి అన్నియు కలతబారెను. సూర్యునకు, చంద్రునకు తరచు గ్రహణములు వచ్చుచుండెను. పరివేషములు వచ్చుచుండెను. మేఘము లేకనే ఉరుములు వినబడుచుండెను. గ్రామ మధ్యలో నక్కలు, తోడేళ్ళు నిప్పులు కక్కుచు అరచుండెను. గుడ్లగూబలు ఊరిలో ఎక్కువాయెను. పల్లెలలో, పట్టణములలో ఉన్న పశువులు, జంతువులు ఈ ధ్వనులకు భయపడి ఏడుపు ధ్వనితో అరచుచు తమ గుళ్ళ నుండి ఎగిరిపోవుచుండెను. మేఘముల నుండి రక్తము వర్షించుచుండెను. దేవతా ప్రతిమల నేత్రముల నుండి రక్తము వర్షించుచుండెను. ఇట్టి అశుభ సూచకములను ఎరుంగని వారందరూ జగత్తునకు ప్రళయం వచ్చుచున్నదేమో అని భయపడిరి. బ్రహ్మపుత్రులకు ప్రజాపత్రులు మాత్రము తమ జ్ఞానముచే కారణము ఎరింగి ఉండిరి. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల జన్మచే లోకమునకు కీడు రాబోవుచున్నదని ముందుగా ఉత్పాదములు ఎరింగించినవి. ఆది దైత్యులు ఇద్దరు మిక్కిలి అధికమగు పౌరుషము గలవారై ఇనుము వంటి ధృడముగు శరీరములతో పర్వతముల వలె వృద్ధినందుచుండిరి. వారు తమ రూపముచే ఆకాశమునంటుచుండిరి. దిక్కులకు వ్యాపించి ఉండిరి. వారి భుజములు కేయూరములతో అలంకరించి ఉండెను. వారు అడుగు వేసినచో భూమి వణుకుచుండెను. అందమగు మొలనూలు గల వారి మొలభాగము సూర్యమండలమును కూడా మించి ఉండెను. వారి తండ్రియగు కశ్యప ప్రజాపతి వారికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అని పేర్లు ఉంచెను. ముందు పుట్టిన వానికి హిరణ్యాక్షుడు అని పేరు తరువాత పుట్టిన వానికి హిరణ్యకశిపుడు అని పేరు ఉండెను. హిరణ్యకశిపుడు తన తపోబలముచే మృత్యువు లేనివాడై లోకపాలులతో మూడు లోకములను తన అధీనమున ఉంచుకొనెను. హిరణ్యకశిపుని తమ్ముడగు హిరణ్యాక్షుడు అన్నగారికి చాలా ప్రీతిపాత్రుడై ఉండెను. వారికి అన్యోన్యానురాగము అధికము.
హిరణ్యాక్షుడు తనతో యుద్ధము చేయు వారకై వెదుకుచు ముందు దేవలోకమునకేగెను. అతని బలమును ఎవరూ సహింపలేరు. అతడు మొలపై ధనించుచున్న మొలనూలును దాల్చెను. పాదములకు బంగారపు నూపురములను దాల్చెను. మెడలో వైజయంతి మాలను ధరించెను. భుజములకు భుజకీర్తులను ధరించెను. అతడు వరములను పొంది మదించి ఉండెను. అతనికి ఎవరి వలనా భయము లేకుండెను. దేవతలు అతన్ని చూచి పాముడు గరత్మంతునకు గరుత్మంతునకు భయపడినట్లు భయపడి దాగిపోవుచుండిరి. హిరణ్యాక్షుడు తన పరాక్రమమును సహింపలేక దేవతలు దాగుకొని దాగుకొనినారని ఎరింగి వారు పౌరుషహీనులను ఒక్కసారి గర్జించెను. వెనకకు మరలి వచ్చెను. తను ఎదిరించు వారు సముద్రములో ఉందురేమోనని బలమైన మధించిన ఏనుగు నీటిలో దూకినట్లుగా సముద్రంలోనికి చొచ్చుకొని పోయెను. సముద్రమునకు అధిపతి వరుణుడు. అతని సైనికులందరూ ఇతని ఆర్భాటమునకు భయపడి వాని తేజస్సుచే వెనుతిరిగి పారిపోయేరి. ఆ హిరణ్యాక్షుడు చాలా సంవత్సరములు సముద్రములో సంచరించుచు పెద్ద పెద్ద కెరటములను ఉవ్వెత్తుగా తన గదచే కొట్టి వేయుచు అందు విహరించుచు వరుణుని రాజధానియగు విభావరి అని పట్టణమును చేరెను. ఆ పట్టణములో పాతాళ లోకమందుండు రాక్షసులందరకు పాలకుడై ఉన్న వరుణుని చూసి నవ్వుచు నాతో యుద్ధము చేయుము అని పలికెను. నీవు లోకపాలురగు అధిపతివని గొప్ప కీర్తిని అర్జించి ఉన్నావు. నీవు పూర్వం దైత్యులను దానవులను అందరినీ జయించి రాజసూయమును చేసితివట. అందుచే నాతో యుద్ధమునకు రమ్ము అని పిలిచెను. అప్పుడు వరుణుడు మదించి ఉన్న రాక్షసుడు తనకు కోపం కలుగునట్లుగా పలుకుచున్నను అది సమయము కాదని తన కోపమును తగ్గించుకొని అతనితో ఇట్లు పలికెను. అయ్యా. మేము యుద్ధము చేయుట మానితిమి. నీతో యుద్ధము చేయుటకు నానా విధముల యుద్ధములలో నేర్పుగల పరమ పురుషుడు తప్ప వేరొకడు సమర్థుడు కాడు. అందుచే అతని వద్దకు ఏగుము. నీవంటి మానవంతులు అతనిని స్తోత్రము చేయుందురు. చేయుదు చేయుచుందురు. వీరుడగు ఆ పరమ పురుషుని వద్దకేగి అతనిని ఎదిరించి గర్వము తొలగిన వాడవై యుద్ధభూమిలో పడి శునకములు చుట్టూను చేరగా క్షీణించెదవు. నీ వంటి దుష్టులను నాశము చేయుట కొరకును సత్పురుషులు అనుగ్రహించుట కొరకును అనేక రూపములు ధరించుచుండెను.
వరుణుడు పలికిన మాటలను విని తనతో ఎదిరించి యుద్ధము చేయగల యోధుడు ఉన్నాడని సంతోషించిన మనసుతో మదించిన వాడగుటచే తనను అతడు చంపునని వర్ణుడు చెప్పిన మాటను లెక్క చేయక ఆ భగవానుడు ఎచ్చట ముండునో నారదుడు ఎరిగింపగా తొందరగా పాతాళమున కేగెను. ఆ రసాతలమున అందరును జయింపజాలిన. శ్రీహరి పర్వతం వలె చలించని వాడై నిలిచి వరాహ రూపమున తన కోర చివరతో భూమిని పైకెత్తి నిలిచి ఉండెను. తన కంటి ఎర్రని కాంతిచే హిరణ్యాక్షుని తేజస్సును హరించుచుండెను. అట్టి వరాహ రూపమున ఉన్న శ్రీహరిని హిరణ్యాక్షుడు చూచి అడవిలో సంచరించు మృగము ఇచర కనబడుచున్నదని నవ్వెను. ఎదురుగా కనపడిన శ్రీహరిని వరాహ రూపమునున్న వానిని చూచి ఇట్లు పలికెను. రమ్ము మూర్ఖుడా ఈ దేశమును పాతాళ వాసులను మాకు బ్రహ్మ వసంగినాడు. ఓ దేవతా ధమా, నేను చూచుచుండగా నీవు ఈ భూమిని తీసుకొని క్షేమముగా బయలు పడలేవు. వరాహాకారమును స్వీకరించి నిలిచిన వాడా, నా కంటబడిన నీవు తప్పించుకొని క్షేమముగా బయలు పడలేవు. హిరణ్యాక్షిని మాటలలో అతనికి తెలియకుండా శ్రీహరిని స్తుతించినట్లు అర్థం వచ్చినది. అతడు వెనుకడి జన్మలో శ్రీమన్నారాయణు ద్వారపాలకుడగుటచే అంతరాంతరముల అతనిపై భక్తి ఉండెను. బాహ్యముగా అసురుడగుటచే దూషించెను కానీ అతనికి తెలియకనే స్తోత్రం అందు స్తోత్రం స్తోత్రమే అందుండెను. అజ్ఞ అని పిలిచినాడు అంటే జ్ఞానం లేనివాడా అని అర్థం. దీనికి నీకంటే జ్ఞానము కలవారు వేరొకరు లేనివాడా సర్వజ్ఞుడా అని అర్థము నీవు వనగోచరుడవు అనినాడు అందులో ఉందువు అని బాహ్యార్థము వనము అనగా నీరు. దానియందు ఉండువాడు అంటే నారాయణుడు. నీవు నారాయణుడవు అని అర్థము. నీవు మృగమై వచ్చితివి అనినాడు. మృగము అనగా వెదక్కునది అని అర్థం. వెదకబడునదని కూడా అర్థం. అడవులలో దాగి ఉండుటచే వేటగాంటచే వెదకబడునది మృగము. ఆహారమునకై ఎటునటు వెదుకున్నది మృగము. అట్లే భగవానుడు కూడా యోగులచే వెదకబడును కనుక మృగము.
శిక్షించుట వెదుకుచుండును కనుక మృగము అని భగవానునికి చెప్పవచ్చును నేను చూచుండగా సుఖముగా పోలేవైనాడు నేను చూచుండగా నన్ను లెక్క చేయక నా రాజ్యమును నీవు పొందెదవు అని జరగబోవు విషయమును చెప్పినట్లు ఉన్నది. సూకర ఆకారమును పొందినవాడా అని హేళనముకు పిలిచినట్లు పిలిచినాడు. అది వాస్తవమే అతడు శ్రీహరియే. సూకరాకారమును అతడు లీలగా తెచ్చుకొనున్నది. మా శత్రువులగు దేవతలచే మమ్ములను చంపుటకు నీవు పోషింపబడితివా? వారిచే ప్రేరేపింపబడి మాయతో రాక్షసులను చంపుచున్నావు, నీకు మాయే బలము. పౌరుషము చాలా స్వల్పము. అట్టి నిన్ను చంపి మా మిత్రుల శోకమును తొలగించెదను. అనినాడు హిరణ్యాక్షుడు. దీనిలో కూడా శ్రీహరిని స్తోత్రము చేయుచున్నట్లు అర్థం వచ్చినది. దేవతలు నిన్ను మోక్షమునకై ఆశ్రయించుచుందురు. నీకు బలము నీ సంకల్పమే. నీవు నీ రూపముతో బలమును చూపించనవసరం లేదు. నీవు ఇంద్రాదుల ద్వారా నీ సంకల్పముచే రాక్షసులను చంపుచుందువు. ఇది నీకు లీల. నిన్ను భక్తితో హృదయమందు స్థాపించుకొని ఈ సంసార దుఃఖమును నాశనము చేసుకుందురు. నేను నిన్ను స్మరించుటచే నా బంధువుల శోకములు కూడా తొలగిపోవును అని రెండు అర్థములు వచ్చినట్లు హిరణ్యాక్షిని పలుకులు వెలువడినవి. నా భుజమునందున్న గదతో నీ శిరస్సును బ్రద్దలు చేతును. నీవు చనిపోయినచే నిన్నే ఆరాధించు ఋషులు దేవతలు ఏ ప్రయత్నం అక్కరలేకయే. దిక్కులేని వారై నశింతురు. ఈ విధంగా ఆ అసురుడు హిరణ్యాక్షుని మాటలే ములుకులుగా తనను పొదువుగా పొడువగా తన కూరపై నిలిచి ఉన్న భయపడుచున్న భూమిని చూచి వాడి మాటలచే కలిగిన బాధను సహించుచునే మొసలి పట్టు తప్పించుకొనిన ఆడ ఏనుగును తన దంతముపై నిలుపుకొని వెలికి వచ్చుచున్న మగ ఏనుగు వలె భూదేవితో వెలికి వచ్చుచుండెను. తన లక్ష్యము చేయకుండా వెడలిపోవుచున్న వరాహ రూపమున ఉన్న భగవానును చూపి తన పట్టు తప్పించుకొని పోవుచున్న ఏనుగును మొసలి మొరల వెళ్లి పట్టినట్లు వెంటనంటి పరుగెత్తి భయంకరముగు ధనితో పిడుగు పడినట్లు ఎదురించి ఇట్లు పలికెను. సిగ్గులేని వాడా, నేను నిందించుచుండగా భయపడి పారిపోవుచుంటివా? అది నీకు తగునా? అనెను హిరణ్యాక్షుడు. ఇట్లు వాడు పలికిన మాటను విని భగవానుడు నీటి పైన తెచ్చిన భూమిని నిక్షేపించెను.
ఆ భూమియందు తన బలమునకు తగినట్లుగా ఆధార శక్తిని నిక్షేపించెను. రాక్షసుడు చూచుండెను. సముద్ర జలముల పై భాగమున భూమిని నిలుపుటను చూచి దేవతలందరూ బ్రహ్మతో కూడా పుష్పములు జల్లి పూజించి స్తోత్రములు చేసిరి. వెన్నంటి హిరణ్యాక్షుడు పరిగెత్తి వచ్చుచుండెను. అతడు బంగారు గదను ఆభరణముగా దాల్చి ఉండెను. బంగారు కవచమును ధరించి ధరించెను. మర్మ భేదకములగు దూషణములతో శ్రీహరిని నిందించుచుండెను. వానిని విని భగవానుడు ఆ అసురుడిపై తీవ్రమగ కోపముతో కోపం వచ్చి నవ్వుతూ ఇట్లు పలికెను. భగవానుడు ఏమని పలికినాడు? హిరణ్యాక్షుడు శ్రీహరి మధ్యలో జరిగిన వైరం ఏమిటి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the pure, the supreme, the Vasudeva, the truth, and to you, the Lord. You are equal among all beings, in the form of self-consciousness. You have no faults of doership or enjoyers. You are the lord of all the worlds. Self-illuminating. You are beyond nature. In you, who are the embodiment of all forms, the six qualities of God, namely energy, fame, glory, wisdom, and detachment, are fully present. Namaste. Fourth Canto, 30th Chapter, 42nd Prayer. Dear listeners, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 23rd podcast. Until now, in the conversation between Vidura and Maitreya, the story of Jai and Vijaya, the curse given to them by Sanaka and Sanandadas, and the answer given by God in harmony with it. We have come to know so far. They come from that Vaikuntha abode to the lower world and enter the womb of Kashyapa Diti Dvitiya. This is the story so far. We'll learn about the next step after that. What danger will come to her children if she follows her husband's orders And fearing, she was pregnant for 100 years and gave birth to twins. At the time they were born, terrible creations were formed on earth, in space, and in the heavens. There is a possibility to know that the world is about to suffer a calamity because of those indications. The ground beneath the mountains shakes. In the distance, fire is raging. Stars and meteors flew across the sky. The intense wind was crashing big trees with a loud sound. The trees were uprooted and thrown around. Lights in the clouds. The light of the sun and others was covered by clouds, darkness covered, and the sky was not visible.
The sea is churned with whirlpools, and the aquatic creatures inside are tormented and making a sound, making a sound. Ponds, lakes, etc., all were disturbed. The sun and the moon frequently experience eclipses. The disguises were coming. Thunder was heard without a cloud. In the middle of the village, foxes and wolves were howling, spitting fire. The owls are numerous in the village. The cattle and animals in the villages and towns, frightened by these sounds, cried out with a sound and flew away from their pens. Blood was falling from the clouds. From the eyes of the fane, blood was raining. Those who did not understand these inauspicious signs were afraid that a cataclysm was coming to the world. The Brahmins and the people were the only ones who were the cause of the Brahmotsavam. Hiranyaksha and Hiranyakashipu's births had already predicted the impending destruction of the world. The two first demons were exceedingly mighty, with bodies as strong as iron, like mountains They were in old age. They were shining in their form in the sky. They were spread across the horizons. Their shoulders were decorated with armlets. The ground trembled beneath their feet. The splendor of those with beautiful sprouts surpassed even the solar system. Their father, Kashyapa Prajapati, named them Hiranyakashipu and Hiranyaksha. The one who was born first was named Hiranyaksha, and the one who was born later was named Hiranyakashipu. Hiranyakashipu, by his power of penance, became immortal and kept the three worlds under his control with the help of the worlds. Hiranyakashipu's brother, Hiranyaksha, was very dear to his elder brother. They have a lot of mutual affection.
Hiranyaksha, searching for those who would fight him, went to the heavens. No man has ever been able to withstand his strength. He wore a crown of flowers on his head. He wore gold anklets on his feet. He wore a Vaijayanti garland around his neck. He wore shoulder straps with shoulder badges. He had received boons and was arrogant. He had no fear of anyone. The gods, seeing him, were afraid of Garutmantha, and hid in fear. Hiranyaksha, unable to bear his valor, the gods hid themselves, and Eringi shouted at the cowardly ones once. He returned to the back. He, resisting, thought that those who were in the ocean might be there, and like a strong-rooted elephant jumping into the water, he entered the ocean. Varuna is the god of the sea. All his soldiers, fearing his arrogance, turned back and fled because of his brilliance. That Hiranyaksha, for many years, wandering in the ocean, washes away the big waves with his mace and roams in the ocean, which is the capital of Varuna Vibhavari reached the town. In that city, seeing Varuna, who is the ruler of all the demons in the underworld, he laughed and said, "Fight with me." You are the ruler of the world, and you have earned great fame. You, in the past, having conquered all the demons and the Danavas, performed the Rajasuya Yagna. Therefore, he called me, saying, "Come to the war with me." Then, the demon, enraged, spoke in a way that made him angry, but he said, "It is not the time," and calmed his anger and spoke to him thus. Sir. We have stopped fighting. To fight with you, there is no one else capable except the supreme being who is skilled in various kinds of wars. Therefore, go to him. Manifestations like you will praise him. They will do it. Go to that supreme being, who is a hero, and having opposed him, having lost pride, fall in the battlefield, and when the dogs gather around, you will perish. To destroy wicked people like you, and to grant good people, He takes many forms.
Hearing the words spoken by Varuna, with a mind filled with joy that there was a warrior who could resist him and fight, and being intoxicated, without considering the words spoken by the one who said he would kill him, wherever that Lord was, Narada knew He quickly went to the underworld. That which is not conquered by all in the netherworld. Srihari, unmoving like a mountain, stood in the form of a boar, lifting the earth with the tip of his tusk and stood still. His red eye was destroying Hiranyaksha's radiance. Hearing that Hiranyaksha saw Srihari in the form of a boar and was laughing that a deer-like creature was seen wandering in the forest. Seeing the Srihari who appeared in front of him and the one in the form of a boar, he spoke thus. Come on, you fool, this country and its inhabitants are under the control of Brahma. Oh Goddess Dhama, while I am watching, you cannot take this earth and safely leave. Oh, you who have accepted the form of a boar, you who have come into my sight, you cannot escape and safely emerge. It is understood that Hiranyakshi praised Srihari in her words without him knowing. He In his past life, he had devotion to him from within, as he was the gatekeeper of Srimannarayana. He was externally insulted for being an Asura, but unknowingly he was praised, praised, praised. Ajnya means one who does not have knowledge. To this, the one who has more knowledge than you, is there no one else, O omniscient one? That is the meaning. You are invisible in the forest, he said. You will be in it, that is the external meaning. Vanam means water. The one who resides in it is Narayana. You are Narayana. He said, you came as a beast. Mrigam means a creature that is searched for. It can also mean to search or to look for something. The animal is hidden in the forests and is searched for by hunters. The animal is looking for food. Similarly, the Lord is also searched for by the yogis, therefore, the animal.
Because he seeks to punish, one can tell the Lord that he is like an animal. While I was watching, he went happily. While I was watching, without considering me, you will obtain my kingdom, it seems as if he has told about the upcoming matter. He called him mockingly as if he had obtained the shape of a pig. It is true that he is Sreehari. He is gracefully bringing the shape. Were you nourished by the gods, our enemies, to kill us? Inspired by them, you are killing demons with illusion; illusion is your strength. Might as well have a heart of stone. I will kill you and remove the sorrow of our friends. Hiranyaksha, the other day. It also seems that in this, Srihari is being praised. The gods will seek you out for protection. You have the strength, you have the will. You do not need to show your strength with your form. You, through Indra and others, kill demons by your will. It's a play for your entertainment. Establishing you in their hearts with devotion, they will destroy this worldly sorrow. I remember you The words of Hiranyaksha were uttered as if two meanings came, saying that the sorrows of relatives will also be removed. With the mace in my hand, I will smash your head. Since you have died, the sages and gods who worship you do not need any effort. They will be destroyed. In this way, that Asura, as the words of Hiranyaksha, as a muraliku, as he pierced himself, as he stood on his curry, seeing the frightened earth, enduring the pain caused by his words, the female elephant that escaped the crocodile's grip, on her tusk Like a male elephant that has been kept and brought out, she was coming out with Bhudevi. Showing the Lord in the form of a boar, who is leaving without achieving his goal, and as if the elephant, which is escaping from his grip, is chasing and running, as if a thunderbolt has struck with a terrible sound, thus He said. Shameless one, while I am blaming, you are running away in fear? Would that work for you? He is Hiranyakashipu. Thus, hearing the words spoken by him, the Lord deposited the earth that he had brought on the water.
He deposited the base power in that land according to his strength. The demon watched. Seeing the gods holding the earth on the surface of the ocean waters, they also worshiped Brahma by showering flowers, praising and glorifying. Hiranyaksha followed in hot pursuit. He wore a golden mace as an ornament. Wearing a golden armour. He was criticizing Srihari with insults that were like a mystery. Hearing him, the Lord, with intense anger, laughed and spoke thus upon that demon. What did the Lord say? Let's find out what the conflict between Hiranyaksha and Srihari was in the next episode. Jai Srimannarayana. Salutations to the Gurus