వేనరాజు అధర్మ శాసనములు - మునుల తీవ్ర హుంకారము
Vena's Sinful Decrees & Slaying of Vena by Sages
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, అహంకారంతో గుడ్డివాడైన వేనరాజు సమస్త వేదయాగాలను, భగవద్భక్తిని నిషేధిస్తూ అధర్మ శాసనాలు జారీ చేసిన విధానం వివరించబడింది. మహర్షులు ముందుగా శాంతచిత్తంతో వేనుని సన్మార్గంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించిరి, కానీ ఆ రాజు వారి హితవులను అహంకారంతో తిరస్కరించాడు. ధర్మసంరక్షణకై వేరే మార్గము లేదని నిశ్చయించుకున్న మునులు, తమ తీవ్రమైన సమష్టి హుంకారముతో వేనుని సంహరించిరి. రాజకుల జన్మయైనను భగవంతుని విముఖత మరియు ధర్మద్రోహము వలన కలిగే దుష్పరిణామాలను ఈ ఘట్టము స్పష్టముగా నిరూపిస్తున్నది.
In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, we explore the tragic tale of King Vena, who, blinded by pride and arrogance, issued sinful decrees forbidding all Vedic sacrifices and worship, declaring himself the sole object of devotion. The great sages, deeply troubled by his adharmic proclamations, first attempted to counsel and reform him through compassionate words, but Vena arrogantly refused to heed their wisdom. Seeing no recourse left to protect dharma and the universe from ruin, the enraged sages slew King Vena with the power of their fierce, collective humkara. This episode powerfully illustrates how even royal lineage cannot shield one from the consequences of turning away from the Supreme Lord and trampling upon the sacred order of dharma.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః గుణారణిచ్ఛన్న చిదూష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి నిప్పును అరణి దాచి పెట్టినట్లుగా సత్వరజస్తమో గుణముల కార్యమగు దేహాదికము జ్ఞాన ఘనమగు ఆత్మను కప్పివేయును సృష్ట్యాదిలో ఆ గుణముల యందు క్షోభను కలిగించి తద్వారా జగద్రూపముగా ప్రకటము కావాలనే సంకల్పము భగవానుని యందు కలిగెను. సకల కర్మల సంశ్లేషము లేని ఆత్మ తత్వమునందు పరినిష్టితులై విధి నిషేధముల పరిధిని దాటివేసిన మహాత్ముల యందు ఆ భగవానుడు. ఆత్మరూపుడుగా సాక్షాత్కరించును. ఆయనకు నేను నమస్కరించుచున్నాను. ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ సిక్స్టీన్త్ ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 18వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధృవుడి యొక్క కుమారుడైనటువంటి వేణుని వధ జరిగినటువంటి విషయాన్ని ఋషుల ద్వారా మునుల ద్వారా తెలుసుకున్న తరువాత మనం పృథ్వి చక్రవర్తి యొక్క చరిత్రలో అడుగు పెడుతున్నాం, శ్రద్ధగా ఆలకిద్దాం. రాజు లేని రాజ్యమున దొంగల వలన పీడ కలగకుండునా అని వారు అనుకొనుచుండగానే ఆ రాజ్యమంతటా అన్ని వైపులా దోపిడీలు, హత్యలు చేసి పారిపోవుచున్న దొంగల దుర్మార్గుల అలజడి ఎక్కువ అయ్యాయను. ఈ విధముగా లోకమంతయు అరాచకమై చోరప్రాయమై ఉండెను. వేనుని చంపినట్లే ఆ చోరులను కూడా చంపుటకు శక్తిగలవారైనను తమ తమస్సు తపస్సు నాశనమగును కావున దుష్టులను శిక్షించుటకు. ప్రయత్నించుట కంటే శాసించుటకు తగిన రాజును స్థాపించుటయే మంచిదని నిర్ణయించుకొనిరి. బ్రాహ్మణుడు సమదర్శి అయి శాంతుడై ఉండవలెను. అట్టివాడు ఆపద నొందుచున్న వారిని చూచి తన తపశ్శక్తిచే వారి ఆపదలను తొలగించుటకు యత్నింపకున్నచో. చిల్లు పడిన కుండ నుండి నీరు కారినట్లు వారి తపస్సు శ్రవించిపోవును. అందుకై ప్రజారక్షణమునకు మరొక రాజును ఆ రాజర్షి అంగరాజు యొక్క వంశము నుండే జన్మింపచేసి పరిపాలకుడుగా నియమింపవలెని సంకల్పించిరి.
ఆ రాజవంశం వారు శ్రీహరి పాదములను నమ్మినవారు. అందుచే వారి శక్తి అమోఘము. ఇట్లు నిశ్చయించి చనిపోయిన వేనుని శరీరమును మధించి దాని నుండి ఒక పాలకుని ఆవిర్భవింప చేయవలెను ప్రయత్నించిరి. ఆ పడి ఉన్న శరీరమును చేరి ముందు తొడను మధించిరి. బాహుకుడు అను పేరు గల నరుడు దాని నుండి పుట్టెను. అతడు కాకి వలె నల్ల రంగు గలవాడు, పొట్టివాడు, పొట్టి చేతులు గలవాడు, ఎర్రని కన్నులు కలవాడు, రాగి వెంట్రుకలు కలవాడు. అట్టి బాహుకుడు లేచి నేను ఏమి చేయవలెను అని నమస్కరించి అడిగెను. ఇతడు పరిపాలనకు అనర్హుడు అని మునులు గుర్తించి నిషీధ అనగా కూర్చుండుము అనిరి. అనగానే అతడు కూర్చుండెను. కనుక అతనిని నిషాదుడు అనిరి. వాని వంశము వారు నిషాదులు. వారు కొండ జాతుల వారు, అడవులలో ఉండువారు ఐరి. వేనుని శరీరములో ఉన్న పాపము ఈ విధముగా వెలికి వచ్చెను. మరల మును ఆ వేణుని బాహులను మధించిరి. అందుండి స్త్రీ పురుషుల జంట ఆవిర్భవించెను. అట్లు జన్మించిన ఆ దంపతులను చూసి భగవంతుని అంశమేని గుర్తించి ఋషులు సంతోషపడిరి. ఆ పురుషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. భువనములను పాలించెడి కళయే ఈమె. ఈమె లక్ష్మీదేవి యొక్క అంశ. పురుషుని వీడి ఉండని లక్ష్మియే ఈమె. శ్రీ మహావిష్ణువు అంశచే జన్మించి ఈ రాజు రాజ్యమును పాలింపగలడు. విస్తారముకు కీర్తిని ఆర్జించువాడు అగుటచే పృథువునని వ్యవహరింతురు. ఈతనితో జన్మించిన ఆమె లక్ష్మీదేవి. ఆమె గుణములే ఆభరణములుగా కలది. అర్చి అనడి పేరుతో వ్యవహరింపబడును. పృథ్వుతో వీడక చేరి ఉండును. ఈ విధముగా సాక్షాత్తు శ్రీహరి అంశచే పృథ్వు చక్రవర్తియు అతనిని వీడి ఉండని లక్ష్మీదేవి అంశచే అర్చి అను పేరుతో అతని ధర్మపత్నియు ఆవిర్భవించిరి. వీరిని చూచి దేవతలు ఆనందించిరి. గంధర్వులు గానము చేసిరి. అప్సరసలు పుష్పవృష్టిని కురిపించిరి. సిద్ధులు నృత్యము చేసిరి. శంఖమృదంగాది వాద్యములు దుందువులు ఆకాశమును మ్రోగుచుండెను. అచ్చటికి దేవతలు, పితృ దేవతలు అందరూ వచ్చిరి. జగద్దుర్వకు బ్రహ్మ కూడా వచ్చెను. ఆ పృథువు యొక్క కుడి భుజమునందు చక్ర చిహ్నము చక్కగా కనపడెను.
పాదముల యందు పద్మరేఖ కనపట్టెను. వెంటనే బ్రహ్మాది దేవతలు అతడు భగవంత్ అంశయే అని నిర్ణయించిరి. అతనికి పట్టాభిషేకము చేయవలెనని బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు సిద్ధపడిరి. అభిషేకమునకు కావలసిన పరికరములను సంపాదించిరి. సముద్రములు, పర్వతములు, సర్పములు, పక్షులు, ద్విలోకములు, భూమి, సర్వభూతములు అతనిని సన్మానించుటకు కానుకలు తెచ్చినవి. పట్టాభిషేకము చేసి విలువైన పట్టుబట్టలతో అలంకరించి కుబేరుడు అతనికి బంగారు సింహాసనము సమర్పించెను. చంద్రుని వంటి కాంతి కలిగి చల్లని జల్లు పడుచుండెడి ఛత్రమును వరుణుడు సమర్పించెను. వాయువు రెండు చామరను అర్పించెను. ధర్ముడు కీర్తిమయమగు మాలను సమర్పించెను. యముడు దండమును సమర్పించెను. బ్రహ్మ వేదమయమగు కవచమును సంగెను. సరస్వతి హారమును సంగెను. శ్రీహరి సుదర్శనమును సంగెను. శ్రీహరి పత్నియగు లక్ష్మి అవ్యాహతమగు ఐశ్వర్యమును సంగెను. రుద్రుడు దశచంద్రమును కత్తిను సంగెను. పార్వతి శతచంద్రమును వరనిచ్చెను. సోముడు అమృతమయమగు అశ్వమును నొసంగెను. త్వష్ట అతి సుందరముగు రథమును నొసంగెను. అగ్ని ఆగజగవము అనేడి ధనుస్సును నొసంగెను. సూర్యుడు రశ్మిమయములగు బాణములను వసంగెను. యోగమయములగు పాదుకలను భూమి వసంగెను. ద్విలోకము పుష్ప పంక్తిను వసంగెను. సిద్ధ సాధ్య గంధర్వాదులు నాట్యమును సంగీత వాద్యములను అంతర్ధాన శక్తిని వసంగిరి. ఋషులు సత్యములకు ఆశీస్సులను వసంగిరి. సముద్రుడు శంఖమును వసంగెను. సముద్రుడు పర్వతము, నదులు, రథమార్గములు ఏర్పరిచిరి. సూత మాఘదవందులు ఆ పృథువును స్తుతించిరి. తనతో ప్రశంసించుచున్న ఆ స్తోత్ర పాఠకులను ఉద్దేశించి పృథువు మేఘ గంభీరము వాక్కుతో ఇట్లు పలికెను. ఓ సూతా, ఓ మాగధా, ఓ వందులారా, నన్ను మీరు స్తోత్రము చేయతగదు. నా గుణములు లోకములో ప్రసిద్ధములు కావు. ప్రసిద్ధములైన గుణములు ఉన్నవారు ఉన్ననాడు కదా స్తోత్రము చేయుట. గుణములు లేని నన్ను స్తుతించుటచే మీ స్తోత్రములు వ్యర్థమగును.
కాలాంతరమునందు గుణములు కలుగునని ఇప్పుడు మమ్ములను స్తోత్రము చేయవలదు. మీ వాక్కులు మధురములు అట్టి వాక్కులు నా వంటి వారి విషయమున ఉపయోగించుటచే వాని శోభ తరిగిపోవును. ఉత్తమ శ్లోకుడగు భగవానుని గుణములను కీర్తించుట మీకు తగిన పని కానీ గుణములు లేని నా వంటి వారిని స్తుతించుట మీకు తగదు. మీచే స్తుతింపచేయుట సదస్యులకు తగదు. ఎప్పుడో రాబోవు కాలమున నాలో ఆవిర్భవించు శౌర్య వీర్య పరాక్రమములు. లేకుండా ఇప్పుడు స్తోత్రము చేయుటచే లోకులు అవహేళన చేతురు. బుద్ధిహీనులు లేని గుణములచే తన్ను స్తుతించుటను సహింతురు కానీ బుద్ధిమంతులు సహింపరు. పరమోదారులు సమర్ధులు మంచి గుణములు సంపాదింప సమర్ధులు అయిన రాజులు కూడా తమ స్తోత్రమును తాము సహింపలేరు. మేము ఇప్పటికింకను మా గుణములచే లోకమును ప్రసిద్ధనందిన ప్రసిద్ధినందిన వారము కాము. మీచే స్తోత్రము చేయబడుట పసితనమగును కానీ ఉత్తమమైనది కాదు. అందుచే మమ్ములను స్తోత్రము చేయుట మీకు తగదు. మునులచే ప్రేరణ చేయబడి గానము చేసిన గాయకులు పృథు చక్రవర్తి తనను స్తోత్రము చేయవలెదని నిషేధించిన వాక్యములను విని అతని వాగామృతమును సేవించుటచే సంతుష్టి నందిన వారై స్తోత్రము చేయుట మానక ఇట్లు పలుకుచున్నారు. ఓ ప్రభు, మేము నీ మహిమను వర్ణించుటకు సమర్ధులము కాము. నీవు సాక్షాత్తు భగవానుడవు. నీ సంకల్పము చేతనే నీవు నీ మనుష్య రూపమున అవతరించినావు. నీవు అనంతములగు కళ్యాణ గుణములకు ఆకరము అనగా గణి అయినవాడవు. మేము నీ అనంతములగు భగవద్గుణ నామములను వర్ణింప సమర్థులము కాము. నీవు వేణుని శరీరము నుండి వాని కుమారునిగా మనుష్య రూపమున అవతరించినను స్తోత్రము చేయుటకు మా బుద్ధులు చాలకపోవుటయే కాదు వాచస్పతి కూడా మనసున స్తోత్రము స్తోత్రము చేయుటకు కలవరపడుచుండును. మేము స్తోత్రము చేయుటకు సమర్థులము కాము. కానీ భగవత్ అంశావతారమగు నీ కథామృతము మాకు ఆదరము కలిగించుచున్నది.
మునులు స్తోత్రము చేయునట్లు మాకు ఉపదేశించి పేరను వసంగిరి. వారి పేరనచే ప్రశంసింపదగు మీ చేష్టితములను మేము విస్తరించి చెప్పెదము. ఇవన్నీ మాగధులు తన యొక్క వివరాన్ని. విషయాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ భాగాన్ని మనము తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. స్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. The one who is full of virtues, the one who is free from the desire to do evil, the one who is filled with the arousal of anger, the one who is devoid of desire, the one who is free from the feeling of non-action, I salute the self-illuminating fire. Like a firewood is covered and kept, the work of the three qualities, Sattva, Raja, and Tama The body covers the dense soul, causing agitation in those qualities in the beginning of creation, and thereby, the intention to manifest as the world arose in the Lord. That Lord is in the great souls who are established in the essence of the soul, without the synthesis of all actions, and have transcended the limits of duty and prohibition. He will be revealed as the Self. I bow before him. Eighth Canto, Third Chapter, Sixteenth Prayer. Dear devotees, welcome to the 18th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Vidura and Maitreya, after learning through the sages and saints about the killing of Venu, the son of Dhruva, we are stepping into the history of the Emperor of Earth, Let's listen carefully. In a kingdom without a king As they were thinking whether they would not be troubled by the thieves, the disturbance of the wicked thieves who were committing robberies and murders all over the kingdom and fleeing increased. In this way, the whole world became chaotic and lawless. Just as they killed Vena, even though they are capable of killing those thieves, their own penance will be destroyed, therefore, to punish the wicked. They decided that it is better to establish a king who is fit to rule than to try to rule. The Brahmin should be a representative and calm. If such a person, seeing those who are in distress, does not try to remove their troubles with his power of penance. Their penance will be heard as water trickling from a broken pot. Therefore, for the protection of the people, they resolved to appoint another king, born from the lineage of that king, Angaraja, as the ruler.
The royal family was devoted to the feet of Sri Hari. Therefore, their power is unstoppable. Thus, having decided, they tried to make a ruler emerge from the body of Venu, who had died, by churning it. They reached the fallen body and massaged its front thigh. A man named Bahukudu was born from it. He is black in color like a crow, short, has short hands, has red eyes, and has copper hair. Then the man with the arm, getting up, asked, "What should I do?" The sages recognized that he was unworthy of governance and said, "Nishidha," meaning, "Sit down." As soon as it was said, he sat down. Therefore, he was called Nishadh. The Nishadas are the descendants of Vaan. They are the hill tribes, who live in the forests. The sin in Venu's body came out in this way. Again, the sages twisted the arms of that flute. There, a pair of men and women emerged. Seeing the couple born like that, the sages were pleased to recognize that they were a part of God. The male figure represented is none other than Lord Vishnu himself. She is the art that rules the worlds. She is the aspect of Lakshmi. She is Lakshmi, the goddess who cannot be separated from a man. Born from the part of Sri Maha Vishnu, this king can rule the kingdom. Because he is the one who earns fame and glory, he is called Pruthuvu. She was the mother of Lakshmi Devi, who was born with a lot of wealth. Her virtues are her ornaments. It is referred to by the name Archi Anadi. It will join with Prithu. In this way, by the part of Srihari himself, the emperor of Prithvu, and by the part of Lakshmi Devi, who had left him, his wife, named Archi, appeared. Seeing them, the gods rejoiced. The Gandharvas came singing. The apsaras showered flowers. The Siddhas performed the dance. The conch, mridangam, and other instruments were playing, and the sky was resounding. The gods and goddesses had all come to the place. Even Brahma came to Jagadhvara. The wheel symbol was clearly discernible on the right arm of the Prithu.
A lotus-like mark appeared on the feet. Immediately, the Brahma and other gods decided that he was a part of the divine being. Brahmin priests, who were Brahmins, were ready to perform his coronation. The materials needed for the anointing were gathered. The oceans, mountains, snakes, birds, the two worlds, the earth, all beings brought gifts to honor him. After the coronation, Kubera, adorned with valuable silk clothes, presented him with a golden throne. Varuna offered a canopy that had the light of the moon and a cool shower. Vayu offered two palanquins. Dharmudu offered the garland which was a symbol of glory. Yama offered the garland. Brahma, the Veda-maya, took the Kavacha. Saraswati garland. Srihari joined Sudarshan. Srihari's wife, Lakshmi, possessed unparalleled wealth. Rudra took the ten-handed form and the sword. Parvati granted Shatachandra a boon. Somudu offered the nectar-like horse. Twashta offered the most beautiful chariot. Fire is the ultimate source of creation Dhanush was defeated. The sun has set upon the rays of the radiance. The earth has settled the footrests that are the yogamayas. The two worlds were settled in the flower line. The Siddhas, Gandharvas, and Natyas, along with musical instruments, possess the power of disappearance. May the sages grant the truths their blessings. The sea-king held the conch. The sea, mountains, rivers, and paths of chariots were formed. The Suta Magadha praised Prithu. Addressing the hymn singers who were praising him, Pruthuvu spoke thus with a solemn voice. Oh Suta, oh Magadha, oh Vandula, you should not praise me. My qualities are not famous in the world. Those who have famous qualities, when they are there, they praise, don't they? Your praises are in vain, for you praise me, who have no virtues.
We should not praise ourselves now, thinking that qualities will be added over time. Your words are sweet, but using such words against someone like me will diminish their glory. It is not appropriate for you to praise the virtues of the best Shloka Bhagavan, but it is not appropriate for you to praise those like me who do not have virtues. Your praise-giving is not befitting of a noble person. The courage, valor, and prowess that will emerge in me someday. Without it, now, by doing praise, people will ridicule. The wise do not tolerate being praised for their lack of foolishness, but the intelligent do not tolerate it. The supreme leaders, the capable ones, even the kings who are capable of acquiring good qualities cannot bear their own praise. We are not yet famous in the world because of our qualities. Your praise will be praiseworthy, but it will not be the best. Therefore, it is not appropriate for you to praise us. The singers who were inspired by the sages and sang, hearing the words that Prithu Chakravarti had forbidden them to praise him They are speaking thus, not ceasing to praise, being satisfied by serving his Vagamrutam. O Lord, we are not able to describe your glory. You yourself are God. It is by your will that you have incarnated in your human form. You are the abode of infinite auspicious qualities, that is, you are the one who is counted. We are not able to describe the infinite names of God's virtues. Even though you incarnated from the body of Venu as his son in human form, it is not only that our intellects are not enough to praise, but Vachaspati is also worried to praise in his mind. We are not able to praise. But your story, which is an incarnation of God, is giving us respect.
May the sages teach us to praise, and may we be blessed. We will expand and tell of your deeds that are praiseworthy in their name. All these are Magadhan accounts of his own. Getting ready to deliver the goods. We will learn about this part in the podcast later. Smadgurubhyo Namah Jai Shrimannarayana.