హస్తినాపుర పునరాగమనము - తండ్రి కౌగిలింత సంబరము
Dhruva's Grand Return & King Uttanapada's Reception
శ్రీహరి అనుగ్రహం పొంది తపస్సు పూర్తి చేసిన బాలుడు ధ్రువుడు హస్తినాపురానికి తిరిగి వస్తాడు, దేవతలు పుష్పవర్షం కురిపించగా నగరమంతా ఆనంద కోలాహలంతో నిండిపోతుంది. ఒకప్పుడు కన్నీళ్ళతో అడవికి వెళ్ళిన బాలుణ్ణి గుర్తుచేసుకుని పశ్చాత్తాపంతో నిండిన రాజు ఉత్తానపాదుడు పరుగెత్తుకుంటూ వచ్చి కుమారుణ్ణి గుండెకు హత్తుకుంటాడు. తల్లి సునీతి మరియు సవతి తల్లి సురుచి సహా యావత్తు రాజపరివారం ధ్రువుని చూసి భక్తి శ్రద్ధలతో ఆనందభాష్పాలు రాల్చుతారు. నిరాదరణకు గురైన ఆ పసివాడే శాశ్వత కీర్తిని సాధించిన మహాభక్తుడిగా తిరిగి రావడం, భగవద్భక్తి యొక్క అద్భుత మహిమను చాటి చెబుతుంది.
After his extraordinary penance and the divine blessing of Lord Vishnu, young Dhruva triumphantly returns to Hastinapura, welcomed by celestial festivities and the joyful cries of the people. King Uttanapada, overwhelmed with love and remorse, rushes forward to embrace his long-lost son, shedding tears of relief and gratitude. The entire kingdom erupts in celebration as Dhruva, once a rejected child, returns as a glorified devotee destined for eternal honor among the stars.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః సత్వైన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యైణ విపశ్చితే నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిధే వివేక్యగు సాధకుడు సత్తగుణ ప్రధానుడై నివృత్తి ధర్మమును పాటించి అకర్తృత్ ఆత్మ స్వరూపమును తెలుసుకొను తెలుసుకొని పరమాత్ముని ఆత్మ రూపముగా పొందును. మోక్ష ప్రదాత యగు భగవానుడే మోక్షానందము యొక్క అనుభవము అనుభవం రూపములో ఉన్నాడు. ఆయనకు నమస్కారము ఏత్ క్యాంటో. థర్డ్ చాప్టర్, 11th ప్రేయర్. భగవంతువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 13వ. పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధృవుడి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. ధృవుడు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత కీర్తించి తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆ చేసినటువంటి అలంకరణలు అక్కడి ఆహ్వాన సంగతులు మనం తెలుసుకున్నాం. దీని తర్వాత భాగాన్ని మనం మళ్ళీ మనం ఇప్పుడు అనుభవిద్దాం. శిశుమారుడను ప్రజాపతి యొక్క పుత్రికయగు భ్రమియను ఆమెను ధృవుడు వివాహమాడెను. భ్రమియ అను ఆమెను ధృవుడు వివాహమాడెను. ఆమెకు కల్ప వత్సరులు అనే ఇద్దరు కుమారులు కలిగిరి. వాయువు కుమార్తెయగు ఇలను భార్యగా వివాహమాడెను. ఆమె యందు ఉత్కరుడను కుమారుని ఒక కుమారి రత్నమును పొందెను. ఇచ్చట కాలమునకు ఆధారమైన గ్రహచక్ర భ్రమణమునకు ధృవుడు ఆధారభూతుడు. అది స్థిరముగా ఉండు ఇరుసు వంటిది. దానిపై చక్రము తిరుగును. ఆ తిరుగుటకు భ్రమి అని పేరు. ధ్రువుడు భర్త, భ్రమి భార్య. ఈ రెండే కాలమును ఏర్పరచుచున్నది. వత్సరము ఒక ప్రమాణము, కల్పము చివరి హద్దు. సంవత్సరము నుండి కల్పము దాకా కాలము ఈ రెండింటి చేతనే కల్పింపబడునని సూచించుటకు వీరిద్దరిని కల్పుడు.
వత్సరుడు అని పేర్లు గలవారిగా నిర్దేశించిరి. ఈ భ్రమణమునకు వాయు సహాయం ఉండవలెను. అందుచే వాయుపుత్రికాగు ఇలయందు ఉత్కలుడను కుమారుడు కలిగినని సూచించెను. ఇట్లు మనకు విశ్వ చరిత్రము, కాల చరిత్రము, ఖగోళ చరిత్రము విశదీకరించబడుచుండును. ఉత్తమునకు వివాహము లేదు. ఇతడు ఒకనాడు వేటకు బయలుదేరెను. ఒక యక్షుడు హిమోత్ పర్వతమునందు అతనిని చంపెను. అతని తల్లి సురుచి పుత్రశోకముతో మరణించినది. భగవంతునకు గాని, భగవంతుని విశ్వసించిన వారికి గాని, తనను ద్వేషించిన వారికి, అవమానించిన వారికి ఆపద కలగవలెనని ఉండదు. కోరిక లేకున్నను అగ్ని స్పృశించిన వారిని దహించును. అట్లే మహా భక్తుడగు ధ్రువునకు నీతిని పాలించడి సునీతికి అపచారం చేసిన ఫలమును ఉత్తముడు సురుచి అనుభవించినారు. భగవత్ సేవకు ఫలమును ఆ భగవత్ అనుగ్రహమునకు తగిన ఫలమును ధృడు పొందినాడు. మహాపురుష సేవనము చేసి భగవానుని ధ్యానించి వానిని దర్శించు స్థితికి ఎదిగినను జన్మాంతరములోని భోగ వాసన మనసున వదలదు. అందుచే ధ్రువునకు సవతి తల్లి ఆడిన మాటలచే కలిగిన బాధ తండ్రి తొడకంటే మాత్రమే కాక లోకములో అన్ని స్థానముల కంటే ఉన్నతమైన స్థానమును ఎక్కవలెనని కోరిక మనసును వదలలేదు మోక్షముని వసంగ గల భగవానుడు ప్రత్యక్షమైనను మరల ఎన్నడును దుఃఖమును పొందకుండా శాశ్వతముగా ఆనందమును అనుభవించడి మోక్షమును కోరలేదు. ఇది మన సంస్కారమునకు ప్రబల నిదర్శనం. దానిని స్వభావము అందురు. అది అనేక జన్మల నుండి మనసు అనుసరించి వచ్చుచుండును. దానిని దాటుట సాధ్యము కాదు. స్వభావము నడిపించుచుండగా మనోనిగ్రహం ఏమియు చేయదు. కానీ భగవాన్ అనుగ్రహం మంచికే నడిపించును గానీ చెడు కలగనియ్యదు. అందుచే ధ్రువుడు రాజ్యమును పొంది ధ్రువ పదవిని పొంది కల్పాంతమున భగవత్ సాయుధ్యమును పొందినాడు. సోదరుడగు ఉత్తముడు చనిపోయినాడని వినిన వార్త ధ్రువునకు కోపమును అసహనమును కలిగించెను శోకము కలిగెను.
యక్షులను జయింపవలెనని విజయరథమును ఎక్కి యక్షుల పట్టణమగు అలకను చేరెను. అలకానగరము ఉత్తర దిక్కున హిమత్పర్వత లోయలలో ఉన్నది. అచట రుద్రుని అనుచరులగు భూతగణములు ఉండును. యక్షులు ఆ పట్టణమును నిండి ఉందురు. ధృడు అలకను చేరగనే తన శంఖమును పూరించెను. ఆ శంఖనాదముతో ఆకాశము దిక్కులు ప్రతిధ్వనించెను. యక్షుల భార్యలు అందరూ ఎక్కువగా భయపడిరి. భయంకరమగు ధనస్సు ధరించెను. మహారధుడగు ధ్రువుడు ఎదురించి యుద్ధమును చేయుటకు వచ్చెను. వీరులందరూ ఒక్కసారిగా వచ్చినను ఒక్కొక్కరిని మూడేసి బాణములతో కొట్టెను. వారి ఆయుధములు ఒక్కసారి పడగొట్టెను. ఆ బాణములు ఆ వీరుల ముఖముపై గుచ్చుకొని ఉండెను. వారందరూ అతని శౌర్యమును ప్రశంసించిరి. ధ్రువుని ఓర్వలేని వారలై అతడు వేసిన మూడు బాణములకు బదులుగా ఆరు బాణములతో యక్షులందరూ ధ్రువుని కొట్టిరి. పరిఘులు, కత్తులు, ప్రాసములు, శూలములు, శక్తులు మొదలగు ఆయుధములతో అతనిని ఒకసారి ఎదిరించి 13 కోట్ల మంది సారధిని, రథమును, ధ్రువుని ముంచెత్తెను. అరెరే మన వంశమున పుట్టిన సూర్యుడు ధ్రువుడు. అతడు యక్షులనెడి సముద్రమున మునిగిపోయినాడని ఆకాశంపై నిలిచిన సిద్దులు హాహాకారము చేయుచుండిరి. అంతలో ధ్రువుని రథము వర్షమనడి మంచును ఛేదించుకొని సూర్యుని వలె వెలికి వచ్చెను. ధృడు తన ధనస్సును ధని చేసెను. దానితో శత్రువులకు దిగులు కలిగెను. శత్రువులు వేసిన అస్త్రములు అన్నింటినీ గాలి మేఘమును చిందరవందర చేసినట్లు భిన్నము చేసెను. అతని వెంటి నుండి వెలువడిన బాణములు ఆ రాక్షసుల కవచములను ఛేదించెను. పిడుగులు కొండలపై పడినట్లు వారి శరీరములపై పడెను. ఆ యుద్ధభూమి అందంతట ధ్రోని బాణములచే ఛేదించబడిన అందమైన కుండలములు గల శిరస్సులు, బంగారు తాళ వృక్షముల వంటి మెడలు. కంకణములతో మనోహరములకు బాహువులు, హారములు, కేయూరములు, కిరీటములు, తలపాగలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉండెను. ద్రోణి బాణపు దెబ్బలచే చనిపోకుండా మిగిలిన రాక్షసులు.
సింహమునకు భయపడిన ఏనుగులు పరిగెత్తి పోయినట్లు పరిగెత్తి పోయిరి. యుద్ధభూమిలో ఎవ్వరును కనిపించలేదు. వారు పట్టణములోకి ప్రవేశింపవలెనని ధ్రువుడు అనుకొనెను. కానీ వారు మాయాబలం గలవారు. ఏమి చేయుదురో చూతమని నిరీక్షించెను. శత్రువుల ప్రతిక్రియను శంకించు సారథితో వేచి చూడమని చెప్పుచు అతనే నిలిచి ఉండెను. ఇంతలో మేఘములు ఉలిమినట్లుగా ధ్వని వినిపించెను. గాలితో కూడిన ధూళి అంతటా కనపడ్డను. ఆకాశమంతయు మెరుపులతో ఉరుములతో కూడిన మేఘములు ఆవరించెను. ఆ మేఘములు రక్తమును, మలమూత్రములను, క్రొవ్వును ధారలుగా వర్షింపసాగెను. మొండెములు ఆకాశము నుండి నేలపై పడుచు కనపడెను. ఆకాశములో ఒక కొండ కనపడెను. అన్ని దిక్కుల నుండి గదలు, పరిఘలు, కత్తులు, ముసలములు, రాళ్ళు వర్షం వలె వచ్చి పడుచుండెను. పాములు పిడుగుల వలె నిట్టూర్పులు వదులుచు అగ్నిని క్రక్కుచు మీద మీదకు వచ్చుచుండెను. తీవ్రమైన క్రోధముతో ఏనుగులు, సింహములు, వ్యాఘ్రములు ధ్రువుని వైపు పరిగెత్తి వచ్చుచుండెను. ఎరటములతో భయంకరముగు సముద్రము ప్రళయ కాలమునందు వలె ఉవ్వెత్తున వీచెను. ఎరుగని వారికి భయము గొల్పడి అసుర మాయలు ఎన్నో కనపడసాగెను. మునులందరూ ఆ మాయను చూచి ఆశ్చర్యపడుచు ధ్రువునకు మంగళము కలగవలెనని ఆకాంక్షించుండిరి. ఓ ధ్రువా ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించు వాడగు భగవానుడు నీ శత్రువులను నాశనము చేయుకాక భగవన్నామ శ్రవణము చేతనే దాట శక్యము గాని మృత్యువును దాటుట సులభము కదా? ఋషులు ఇట్లు పలుకుట విని ధృవుడు వెంటనే ఆచమనము చేసి నారాయణాస్త్రమును తన ధనస్సున సంధించెను. యక్షుడు ప్రయోగించిన మాయలు అన్నియు నారాయణాస్త్రమును సంధించినంతనే జ్ఞానము కలగగానే క్లేశములు నశించినట్లు నశించెను. నారాయణాస్త్రము సంధింపగానే ధనస్సు నుండి బంగారు మొనలు కలిగిన బాణములు భయంకరముగు ధ్వని చేయుచు నెమళ్ళు కేకారావముతో వనములో చేరినట్లు శత్రు సైన్యమును చేరెను. ఆ బాణములు వాడి అయినవి శత్రువులను బాధించుచుండెను. దానితో యక్షులకు కోపము కలిగెను. ఆయుధములను చేతపట్టి పాము పడగలు ఎత్తి గరుడుని పైకి ఎగసినట్లుగా ఎగిసిపడిరి.
వచ్చుచున్న సైనికులను ధ్రువుడు బాణములతో బాహులను, తొడలను, మెడలను, ఉదరములను ముక్కలు ముక్కలుగా ఛేదించి నేల పడవేసెను. సన్యాసులు సూర్య మండలమును ఛేదించుకొని వెళ్ళినట్లు యుద్ధములో చనిపోయిన వీర అందరూ పరలోకమునకు పోయిరి. యక్షులందరూ చనిపోవుచుండిరి. వారందరూ తప్పు చేయకయే చనిపోవుచున్నారని ధృణి తాతగారగు స్వయంభువమునగు జాలి కలవాడాయను. ఋషులతో కూడా ధృణి వద్దకు వచ్చి ఇట్లు పలుకుచున్నాడు. స్వయంభువ మనువు ధృణికి ఉపదేశం చేసేటువంటి ఉపదేశాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one who is attainable through goodness, the one who is free from desire, the one who contemplates. Salutations to Kaivalyanatha, the one who is the master of liberation and happiness. The seeker who is wise, being predominated by the quality of truth, following the path of detachment, the self-form of the unattached Knowing, knowing, one attains the form of the Supreme Soul. The one who is the giver of salvation, the Lord himself, is in the form of the experience of salvation. Greet him if you can. Third Chapter, 11th Prayer. Oh Gods, Srimad Bhagavata Tatva Deepika, Fourth Canto, 13th. Welcome to the podcast. Until now, as part of the conversation with Vidura Maitreya, we are learning about Dhruva's history. Dhruva, after the appearance of the Lord, praised and returned to his kingdom. When we arrived, we learned about the decorations and the invitation details. We will experience the next part again. Dhruva married Bhrami, the daughter of Prajapati, who was the son of Shishumara. Dhruva married Bhramiya Anu. She has imagination Vatsaras had two sons. Vayu married Ila, the daughter of Vayu, as his wife. She obtained a son named Utkara and a daughter named Ratna. Here, Dhruva is the basis for the planetary rotation that is the basis for time. It is like a steady, firm joint. A wheel turns on it. The name of the rotation is Bhrami. Dhruva is the husband and Bhrami is the wife. These two are the only ones that make the time. A year is a standard unit of time, similar to a cycle. The time from the year to the Kalpa is indicated by these two, Kalpudu, to indicate that it is created by these two.
They were designated as those with the name Vatsarudu. This rotation must be aided by air. Therefore, it indicated that Vayuputra had a son in the sky. Thus, we are being explained about the history of the universe, the history of time, and the history of astronomy. Uttam has no wife. One day he set out on a hunt. He was killed by a Yaksha on the Himmatnagar. His mother Suruchi died of grief over her son's death. Neither to God, nor to those who believe in God, nor to those who hate him, nor to those who insult him, there will be no danger. The fire will burn those who do not have the desire. Similarly, the virtuous and great devotee Dhruva experienced the consequences of misconduct for the good of justice. The servant of God has obtained the fruit, the fruit befitting the grace of that God. Even after serving great men, meditating on the Lord, and reaching the state of seeing Him, the desire for worldly pleasures in the mind does not leave. Therefore, the pain caused by the words spoken by Dhruva's stepmother was not only to the father's thigh but also in the world The desire to climb the highest position, higher than all positions, did not leave the mind. Even though the Lord who grants salvation appeared, he did not desire to experience eternal bliss without ever experiencing sorrow again. He did not desire salvation. This is a strong example of our culture. They call it nature. It has been following the mind from many lifetimes. It is not possible to cross it. While nature is at work, the mind's control does not do anything. But God's grace leads to good, not bad. Therefore, Dhruva attained the kingdom, attained the position of Dhruva, and attained the union with the Lord at the end of the eon. Hearing the news that the best brother had died, Dhruva was filled with anger and impatience, and sorrow was caused.
Having conquered the Yakshas, he mounted the victory chariot and reached Alaka, the city of the Yakshas. Alaknagar is located in the Himalayan foothills in the northern direction. There will be ghosts who are followers of Rudra there. Yakshas are said to be filling the town. Dhrudu, having reached the crest, blew his conch. And with the sound of the conch, the sky and the earth resounded. All the wives of the Yakshas were very frightened. He is wearing a scary bow. The great warrior Dhruva came to fight. Even though all the warriors came at once, he hit each one with three arrows. They were defeated with a single stroke. Those arrows were piercing the faces of those heroes. They all praised his bravery. Unable to bear Dhruva, instead of the three arrows he shot, all the Yakshas struck Dhruva with six arrows. With Parighulu, swords, rhymes, spears, and powers, he once confronted him with weapons and submerged 13 crore charioteers, chariots, and Dhruvas. Oh, the sun, born of our lineage, Dhruva. He is in the ocean called Yakshas The Siddhas, standing on the sky, cried out in despair that he had drowned. Meanwhile, Dhruva's chariot, piercing the rain-like snow, emerged like the sun. Dhrud brought his bow. With that, the enemies were filled with sorrow. The enemy's weapons were scattered like a cloud of dust, as if the wind had scattered them. The arrows released from his bow pierced the armors of the demons. Like lightning bolts falling on mountains, it fell on their bodies. That battlefield, all over, with beautiful earrings, heads pierced by arrows, necks like golden palm trees. With necklaces, beautiful arms, bracelets, crowns, and headbands were scattered everywhere. The surviving demons were able to escape Drona's arrow without being harmed.
The elephants ran away as if they were afraid of the lion. The battlefield was devoid of any soldiers. Dhruva thought that they should enter the town. But they are magical. He waited to see what they would do. He remained, telling the charioteer to wait and watch for the enemy's reaction. Meanwhile, a sound like clouds being crushed was heard. The dust raised by the wind could be seen everywhere. The heavens above were filled with a cloud of lightning and thunder. The clouds began to rain blood, excrement, and fat in streams. The heads appeared to fall from the sky to the ground. A mountain was seen in the sky. From all directions, maces, spears, swords, clubs, and stones rained down. Snakes, like lightning, were releasing their sighs, blazing like fire, coming upon one another. With intense anger, elephants, lions, and tigers were running towards Dhruva. The terrible sea with waves, like during the time of destruction, surged. Unknown They were frightened and many demonic illusions began to appear. All the sages, seeing that illusion, were astonished and desired that Dhruva should be blessed. Oh Dhruva, the Lord, who removes the sorrow of those who take refuge, is it not easy to cross death by listening to the name of the Lord, which is impossible to cross without destroying your enemies? Hearing the sages speaking thus, Dhruva immediately performed Achamanam and attached the Narayana Stotram to his bow. All the illusions used by Yaksha, as soon as they were combined with the Narayana Stama, and as soon as the knowledge was attained, the sufferings were destroyed. As soon as the Narayana Strom was struck, arrows with golden tips from the bow made a terrible sound, and like peacocks joining the forest with a caw, the enemy army joined. Those arrows, having been used, were tormenting the enemies. With that, the Yakshas became enraged. Holding weapons in their hands, they flew up like snakes carrying their hoods and riding Garuda.
Dhruva, with arrows, pierced the soldiers who were coming, severing their arms, thighs, necks, and bellies into pieces and threw them to the ground. As if the monks had crossed the solar system, all the heroes who died in the war went to heaven. All the Yakshas were dying. They are all dying without committing any wrong, said Dhruni, the father, a compassionate person who is self-existent. He is also coming to Dhruni with the sages and speaking thus. We will learn about the teaching that Swayambhuva Manu gave to Dhrini in the next podcast. Jai Srimannarayana Asmatgurubhyo Namaha