ధ్రువ మహారాజు దివ్య చరిత్ర (Parts 9-16)
The Pastimes of Dhruva Maharaja (Parts 9-16)
శ్రీమద్భాగవతంలోని చతుర్థ స్కంధం నుండి ధ్రువ మహారాజు యొక్క పవిత్ర చరిత్రను ఈ ఎపిసోడ్ కొనసాగిస్తుంది, భగవత్ దర్శనం పొందిన అనంతరం జరిగిన మహత్తర సంఘటనలను వివరిస్తుంది. ధ్రువుడు రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యాభిషేకం పొందడం, ధర్మబద్ధంగా పాలన సాగించడం అనే విషయాలు ఇందులో వర్ణించబడతాయి. తన సోదరుడు ఉత్తముని మరణానంతరం యక్షులతో జరిగిన తీవ్రమైన యుద్ధం, అనంతరం నారద మహర్షి యొక్క జ్ఞానోపదేశంతో ధ్రువుడు ఆయుధాలు విడవడం అనే కథ కూడా ఇందులో చెప్పబడింది. చివరగా, శ్రీమహావిష్ణువు యొక్క పార్షదులు స్వయంగా వచ్చి ధ్రువుని శాశ్వత నివాసమైన ధ్రువలోకానికి తీసుకెళ్ళిన దివ్యమైన ఘట్టంతో ఈ ఎపిసోడ్ ముగిసినది.
This episode continues the sacred narrative of Dhruva Maharaja from the Fourth Canto of Srimad Bhagavatham, exploring the profound events that unfold after his divine vision of the Lord. We witness Dhruva's triumphant return to the kingdom, his coronation as king, and the exemplary righteousness with which he rules his subjects. The episode also recounts his fierce battle with the Yakshas following the death of his brother Uttama, and the wise counsel of the great sage Narada that ultimately leads Dhruva to lay down his weapons and seek peace. Finally, we are blessed with the transcendent account of Dhruva's departure from this world, as Lord Vishnu's own messengers arrive to escort him to the eternal Dhruva-loka, his everlasting abode among the stars.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే అరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే ఓ భగవానుడా పూర్ణుడవగు నీవు సర్వాత్మ స్వరూపుడవు సకల ప్రాణులలో అంతరంతమగు ఆత్మ స్వరూపుడవై విరాజిల్లే పరబ్రహ్మవు నీవే. నీవు అద్భుతమగు సింహము రూపము దాల్చిన శ్రీహరివి నీకు నమస్కారము. సెవెంత్ క్యాంటో టెన్త్ చాప్టర్ టెన్త్ ప్రేయర్. భోగద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక తొమ్మిదవ పాడ్కాస్ట్ చతుర్ధ స్కంధంలో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము దక్షుని యొక్క వృత్తాంతాన్ని అనుభవిస్తున్నాం. దక్షుడు తన యొక్క శిరస్సు ఒక పొట్టేలు శిరస్సుతో ధరించిన తరువాత ఆయనతో పాటు అందరూ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని అందరూ స్తుతిస్తున్నారు. దానిలో బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు వీరు చేసిన స్తుతులన్నీ కూడా మనం విన్నాము. ఇంకా ముందు చేస్తున్న స్తుతులు మనం ఇప్పుడు. దేవతలు ఇటు స్తుతిస్తున్నారు. దేవా, నీవు సకల జగత్తుకు ఉపాదానము అయిన వాడవు. అనగా కుండలు మొదలు వానికి మట్టి వలె సకల జగత్తు నీ నుండియే ఏర్పడినది. నీలో చేరుచున్నది. ప్రళయములో సృష్టికి ముందు మొదటి కల్పము చివర నీవు సృష్టించిన సకల పదార్థములను నీలోనే చేర్చుకొని శేష శయనముపై జలములలో శయనించి వంటివి. జనలోక వాసులగు సిద్దులచే యోగ పరిశుద్ధమగు హృదయములో దర్శింపబడిన ఆత్మతత్వము నీవే. అట్లు సర్వ జగత్తుకు ముందున్న నీవు ఈనాడు మా కళ్ళ ఎదుట కనబడుచున్నావు. మాటకు మనసుకు అందని వాడవు, కృపచే సులభుడవై ప్రత్యక్షమై భృత్యులమైన మమ్మల్ని కాపాడుచున్నావు. గంధర్వులు ఇటు స్తుతిస్తున్నారు. హే భగవాన్, సకల జగత్తునకు లోన వెలుపల వ్యాపించి ఉండువాడా, ప్రకాశించువాడా, మరీచి, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మొదలుగాగల దేవతలందరూ నీ అంశలు.
దేవతలందరూ నీ శరీర భాగములు ఈ విశ్వమంతయు నీ క్రీడా భాండము నీకు నిత్యము నమస్కారములు చేయుచున్నాము విద్యాధరులు స్తుతించుతున్నారు ఈ ప్రాణులందరూ నీ సంకల్పము చేతనే సకల పురుషార్థములకు సాధనమగు ఈ మనుష్య శరీరమును పొందినారు. ఆ శరీరమునందు నేను అనియు నాది అనియు దుర్బుద్ధి కలిగి ఉన్నారు. ఆ శరీరమును అనుభవించవలసిన సుఖములు లభింపక దుఃఖము అనుభవించుచున్నారు. వానిని అర్జించుటకు లోక మర్యాదను వేద మర్యాదను కూడా అతిక్రమించి ప్రవర్తించుచున్నారు. తమ పుత్రులు పౌత్రులు నిందించుచున్నను ఆ చెడు విషయముల నుండి మరలలేక ప్రవర్తించుచున్నారు. అట్టి వారలైనను ఒక్కసారి ప్రేమతో నీ కథామృతము వినినను వినిపించినను వారికి ఆ అహంకారము మమకారము మోహము తొలగిపోవును. ఆ మోహము తొలగుటకు నీ కథామృత సేవనము కంటే వేరొక ఉపాయము లేదు. బ్రాహ్మణులు ఇట్లు స్తోత్రం చేయుచున్నారు. హే భగవాన్, నీవే యజ్ఞము, నీవే హవిస్సు, నీవే ఋత్విక్కులు, నీవే అగ్నివి, నీవే ఇంద్రాది దేవతా రూపుడవు, నీవే సమిధలు, దర్భలు, ఆకులు అగుచున్నావు. సదస్యులు ఋత్విక్కులు నీవే యజమాన దంపతుల రూపమున ఉన్నవాడవు నీవే దేవతా రూపమున ఉన్నవాడవు నీవే అగ్నిహోత్రమనడి కర్మ నీవే అగ్నిలో ఆయా పదార్థములను అర్పించుట అనడి హోమము నీవే ఆ హోమము చేయునప్పుడు పించెడి విధానము నీవే, సోమరసము నీవే, ఆజ్యము నీవే, యజ్ఞమున విశసనము చేయు పశువు నీవే, పూర్వము నీవే శ్వేత వరాహ రూపమును దాల్చి ఏనుగు తామర తీగను. పెకిలించి తెచ్చినట్లు పాతాళము నుండి భూమిని నీ కోరతో విడదీసి తెచ్చితివి. యోగులు నీ స్తోత్రము చేసిరి. నీవు వేద స్వరూపుడవు. నీ ఆరాధనమే యజ్ఞం. అట్టి నీవు ఈ భ్రష్టమైన యాగమును మరల సంధానము చేయుము. నీ దర్శనము కాంక్షించు మాకు నీ దర్శనము సంగుము నీ దర్శనమే కాదు నీ నామస్మరణమే యజ్ఞ విఘ్నములను నాశనము చేయును అట్టి నీకు నమస్కారము ఈ విధముగా సర్వాత్మకుడగు ఋషీకేశుడు స్తోత్రము చేయబడి వీరభద్రునిచే రుద్రునిచే పాడు చేయబడిన యజ్ఞమును మరల ప్రవర్తింపచేసెను.
మూడు కపాలములతో పురుడాశయమును సమర్పింపగా దానిని స్వీకరించి స్తోత్రము విని సంతోషించి భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు. చేతనా చేతనములు శరీరముగా కలిగిన నేను నామ రూపములు లేక సూక్ష్మముగా ఉండు ప్రకృతితో జీవులతో కలిసి సృష్టికి ముందు ఒక్కడనే ఉందును. అండ సృష్టి చేసి చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి దానిలో నేను ప్రవేశించి సృష్టి చేయుదును. స్వయముగా నేనే విష్ణు రూపము నుండి జగత్తును నిలిపి రక్షణ చేతును. నేను ఒకరిచే నియమింపబడువాడను కాను, స్వతంత్రుడను. ప్రళయములో నాలో లీనమై ఉన్న జీవులను వాని వాని కర్మానుగుణముగా ప్రకృతిని మార్చి శరీరములుగా చేసి వానిలో ఉండి నేనే నియమింతును. కనుక నేనే ఆత్మేశ్వరుడను, నాకు నేనే నియామకుడను, ఇతరములైన ఆత్మలు అన్నిటికీ నేనే నియామకుడను, దేవ మనుష్యాది నామ రూపములు నాకు లేవు. అన్నిటినీ చూచువాడను నేనే కనుక నేను ఉపద్రష్టను నేను జ్ఞాన స్వరూపుడను జ్ఞానము గలవాడను అనగా నేను సర్వజ్ఞుడను ప్రకృతి జడము మారునది జీవుడు జ్ఞాన సంకోచమునంది సర్వజ్ఞుడును ఆనంద స్వరూపుడైన కర్మ వశముచే సుఖము గలవాడు దుఃఖము గలవాడగుచుండును. అట్టి భేదములు ఏమియు నాకు లేవు. సత్త రజౌ గుణములు కలిగిన నాదే అయిన ప్రకృతిలో జీవుని ద్వారా సంకల్ప రూప జ్ఞానముచే ప్రవేశించి ఈ జగత్తును బ్రహ్మ ద్వారా సృజించుచు సృష్టి స్థితి లయములకు తగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యవహరింపదగిన వాడనై ఉందును ఈ విధముగా నేను ప్రకృతి పురుషులలో చేరి ఉండియు వాని దోషములు అంటని వాడను నియమించువాడను, ప్రకృతి పురుషుల కంటే ప్రత్యేకమైన వాడను, అన్నిటినీ ధరించువాడను. నాలో ఉండి నన్ను నియమించువాడు వేరొకడు లేడు. నాతో సమానుడు కానీ, నాతో అధికుడు కానీ వేరొకడు లేడు. నేను స్వరూపము చేత గుణముల చేత గొప్పవాడను. నా స్వరూపమును నా గుణములను మించిన స్వరూపము గుణములు గలవాడు వేరొకడు లేడు. సర్వభూతములు నేను అంతరాత్మగా ఉండుటచే నాయందే అధీనమై ఉన్నవి ప్రవర్తించుచున్నవి. నాయందే లయమగుచున్నవి. సర్వ భూతములు బ్రహ్మ రుద్రాదులు కూడా నా నుండి వేరు చేసి ఉండగలిగిన వారు కారు. నేను ఉందును నేను లేని వారు ఉండరు కానీ తెలియక వారు వేరు వేరు అని భావించుచుందురు.
దేహము ఆత్మ అని ఎరింగిన పురుషులు కూడా తమ శరీరము తాము ఒకటి అనేటి బుద్ధినే కలిగి ఉండును కదా. తన శరీరము కంటే శిరస్సు, చేయి, కాలగు, కాలు మొదలగునవి వేరు కావు, వేరుగా ఉండవు. అట్లే సర్వభూతములు నా శరీరములోని భాగములే వేరు కావు. బ్రహ్మ విష్ణు రుద్రాదులు ముగ్గురు వేరని తెలియని వారు భావింతురు. ఆ మూడును ఒకటే ఎరింగిన వారు శాంతిని పొందురు. బ్రహ్మ రుద్రాదులు కూడా నాకంటే వేరుగా స్వతంత్రముగా ఉండగలిగిన వారు కారు. నేను ఆత్మగా వారు శరీరముగా ఉందుము. ఈ సంబంధమును ఎరుంగని వారు బ్రహ్మ రుద్రాదులను సకల భూతములను వేరువేరుగా భావింతురు. దానిచే అశాంతిని పొందుదురు. ఈ విధముగా భగవానుడు ఆదేశింపగా దక్షుడు శ్రీహరిని ఆరాధించి మూడు కపాలములతో చేసిన వైష్ణవ యాగముచే హరిని సంతృప్తి పరచి అంతరిక్షమున ఉన్న దేవతలను భూమిపై ఉన్న వారలను ఎవరి భాగమున వారికి అర్పించి ఆరాధించెను. మనస్సు కుదుటపడిన వాడై రుద్రునికి వసంగవలసిన భాగమును వసంగెను. యజ్ఞ సమాప్తిని చేసి తాను చేసిన కర్మకు ఋత్విక్కులతో కూడా అవభృత స్నానము చేసెను. ఈ విధముగా దక్షిణి కుమార్తెయగు సతీదేవి శరీరం వదలి హిమవంతిని భార్యయగు మేనక యందు మరల జన్మించెనని పెద్దలు చెప్పుదురు. ఆ జన్మలో పార్వతి అని పేరు గలదై పతినే పరమ ప్రాప్యముగా భావించి తననే తలంచుచున్న తన భర్తయగు పరమశివుని మరల భర్తగా పొందెను. ప్రళయములో పరమాత్మతో చేరిన చేతన వర్గమంతయు మరల సృష్టి దశలో వెలువికి వచ్చి వారితోనే చేరి స్థూలమగు. హే దేహముతో ఎట్లుండునో అట్లే సతి అను దేహమును వీడి పార్వతి అనేటి దేహమును పొంది మరల పరమశివునితో విడదీయ వీలు కానిదై చేరి యుండెను. భగవానుడగు శంభుని దక్షాధ్వర ధ్వంసము అనటి వృత్తాంతము బృహస్పతి శిష్యుడగు ఉద్ధవుని వలన నేను వింటిని. ఇది రుద్రుని లీలలను వర్ణించు చరిత్రము. ఇది పవిత్రము, కీర్తిని కలిగించును, ఆయుష్షును ప్రసాదించును. పాప రాశిని పటాపంచలు చేయును దీనిని చెప్పినను వినెనును భగవద్గత్ భక్తి కలుగును మైత్రేయుడు చెబుచున్నాడు సనకుడు మొదలగు నలుగురు కుమారులను నారదుడు బుభువు హంసుడు అరుణ అనెడి వారు
వారును బ్రహ్మపుత్రులు. వారు ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యమునే ఆశ్రయించి ఉండి గృహస్థాశ్రయమును స్వీకరించలేదు. అధర్ముని భార్య మృష, మృష అనగా అసత్యం. అధర్మునకు అసత్యమునకు భార్య భర్తృ సంబంధం ఉండునని ఆ నామములు తెలియజేయుచున్నవి. అధర్ముడు కూడా బ్రహ్మపుత్రుడే. ఈ దంపతులకు దంభము అనేటి కుమారుడు, మాయ అనేటి కుమార్తె జన్మించిరి. దంభము అనగా ఇతరులను వంచించుటకు లోపల ఒక విధమైన భావము కలిగి ఉండి లోకము వేరొకలా అనుకొనునట్లు ప్రవర్తించుట. అట్టి భావం ఉండగానే దానిని అనుసరించి మాయ పుట్టును. అనగా లోపల వంచన భావం ఉండగానే దానికి అనుగుణమైన నటనము ఆరంభమగును. నిరుతి అనువానికి సంతానము లేదు. అందుకు అతడు దంభుని మాయను తన కుమారునిగా కోడలిగా స్వీకరించును. వారిరువురకు లోభము, నికృతి అను ఇద్దరు బిడ్డలు కలిగిరి. ఒకరికి చెందినవి తనకు కావలెను అను భావము లోభము. ఈ భావం ఉండగానే తెలియకుండా ఇతరులను బాధించు షటత్వము కలుగును. లోభము, నికృతి అనేటి దంపతులకు క్రోధము, హింస అనే ఇద్దరు పిల్లలు కలిగిరి. కలి, దురుక్తి అను వారు ఇద్దరు కలిగిరి. లోభము, షటత్వము ఉండగానే క్రోధము, హింస కలుగును. క్రోధము లోపల కలిగేటి భావము. ఇది పురుషుడు దానిచే బయటకు వచ్చునది హింస ఈమె స్త్రీ వీరిద్దరూ దంపతులు అట్లే కలిపురుషుడు దురుక్తి అనగా చెడు మాట పలుకు స్త్రీ ఈమె వాని సోదరి వారిద్దరూ దంపతులు అయిరి. ఆనాడు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు దంపతులుగా ఉండి సృష్టిని సాగించినట్లు మనకు తెలియును. కలికి భార్య ఆగు దురుక్తి యందు భయము మృత్యువు అని ఇద్దరు కలిగిరి. భయము పురుషుడు, మృత్యువు స్త్రీ వీరిద్దరికీ నిర్దయ. దుఃఖము, యాతన అంటే వేదన అను జంట పుట్టిరి. ఇందులో దుఃఖము పురుషుడు, దానిచే కలిగెడి వేదన భార్య, బ్రహ్మ పుత్రుడు అధర్ముడు. అతడు వంశమునకు మూల పురుషుడు. వారి వంశము అనడి వృక్షమునకు వెనుక చెప్పబడిన వారందరూ శాఖల వంటి వారు. ఈ వంశము వారు సంసారమునకు కారణం అయిన వారు. శ్రేయస్సును కోరుకొను వారు. ఈ వంశము వారిని సేవింపరాదు. అందులో ముఖ్యముగా సన్యాసాశ్రమమునందు ఉండువారు ఈ వంశము వారితో సంబంధం పెట్టుకొనరాదు. ఇదే ప్రళయమునకు కారణమైనది. ఇది అంతయు ప్రతిసర్గము.
దానిని ఎరుంగవలెను. ఎరింగి దానిని విడిచి పుణ్యమునందవలెను. దానిని విడిచినచో మన ఆత్మకు అంటిన పాపం తొలగును. ఈ విధంగా మను యొక్క ముగ్గురు కుమార్తెల వంశం వర్ణింపబడినది. ఆ తరువాత వారి పుత్రుల వంశములు వర్ణించుతున్నారు. శతరూప స్వయంభువ మనువు మొదటి దంపతులు. ఆమె యందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. వీరిద్దరూ భగవదాంశముచే జన్మించిన వారు. భగవంతునికి ప్రీతికరమగు వ్రతము గలవారు ప్రియవ్రతుడు. ఉన్నతమైన పాదము గలవాడు ఉత్తానపాదుడు. అతని పాదములు పైకి నడుచుటకు పనికి వచ్చునవే కానీ క్రిందకు నడుచుటకు పనికి వచ్చునవి కావు అనగా ఉన్నతిని కలిగించు ఆచరణము కలవాడు వారి వంశము చెప్పెదని వినుము. ఇంతటితోని మనకు దక్ష యొక్క వృత్తాంతం పూర్తి అవుతుంది. తర్వాత పాడ్కాస్ట్ నుంచి మనకి ఉత్తానపాదుడి యొక్క వంశము, ధ్రువుడి యొక్క కథ మనం తెలుసుకోబోతున్నాం. ధ్రువోపాఖ్యానంలో మరో పాడ్కాస్ట్ లో మనం కలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. Jai Srimannarayana
Jai Srimannarayana, salutations to the Guru. Om, salutations to the Lord, the Supreme Being, the great soul, the wonderful, the great, the Brahman, the Supreme Soul. Oh Lord, you are complete, you are the embodiment of all souls, you are the embodiment of the soul within all beings You are the supreme being who shines. You are the wonderful lion form, Srihari, I salute you. Seventh Canto Tenth Chapter Tenth Prayer. Bhogadbandhu, welcome to the fourth Skandha of the ninth podcast of Srimad Bhagavata Tatvadipika. As part of the conversation between Vidura and Maitreya, we are experiencing the story of Daksha. After Daksha wore his head with a ram's head, everyone along with him had a vision of Lord Vishnu and everyone is praising. In that, we heard all the praises done by Brahma, Indra, and Rudra. And the praises we are doing now. The gods sing their praises. Oh God, You are the sustainer of all creation. That is to say, from the pots to him, like clay, the entire world was created from you. In you It is reaching. In the apocalypse, before creation, at the end of the first kalpa, you included all the substances you created within yourself, and like resting on the bed of Shesha, resting in the waters. You are the soul essence that is seen in the heart purified by the yogis, who are the inhabitants of the world. Thus, you, who are before the entire world, are visible before our eyes today. You are a person beyond words and words, graciously appearing and protecting us, who are your servants. The Gandharvas are presenting this praise. Hey Bhagavan, the one who is within and outside the entire universe, the one who shines, the moon, Brahma, Indra, Rudra, and all the gods are parts of you.
All the gods, your body parts, this entire universe, your play vessel, we offer you eternal salutations. The learned praise, all these beings, by your will, this human body, which is the means to all human endeavors Received. They have a bad mindset that I am in that body and it is mine. They are experiencing sorrow because they are not getting the pleasures that the body should experience. They are behaving by transgressing worldly decorum and Vedic decorum to achieve that. Even though their sons and grandsons are condemning, they are unable to escape from those bad things and are acting accordingly. Even if they are such people, if you listen to your story with love once, their ego, affection, and delusion will be removed. There is no other way to remove that desire except through the service of your stories. The Brahmins are chanting prayers. Hey Bhagavan, you are the Yagnya (sacrificial fire), you are the offering, you are the priests, you are the fire, you are the form of Indra and other deities, you are the Samidhalu (sacrificial firewood), Darbha grass, and leaves. You are the Sadasyulu and Ritvikulu, the master couple You are the one who is in form, you are the one who is in the form of a deity, you are the one who is the fire sacrifice, you are the one who offers those substances in the fire, you are the one who performs the Anvadi Homa, you are the one who offers, you are the Somarasa, you are the Ajyam, you are the one who You are the animal that performs the Yagnya, you are the one who assumed the form of the white boar in the past, the elephant, and the lotus vine. You brought it from the underworld, separating the earth from your hand. The yogis have praised you. You are the embodiment of the Vedas. Yourself is the sacrifice. O you who are corrupt, re-establish this corrupted sacrifice. We desire your darshan (vision). May your darshan be ours. Not only your darshan, but your name's remembrance destroys the obstacles of Yagnya (sacrificial fire). Salutations to you in this way. Thus, the all-pervading sage Keshava is praised, and Veerabhadra and Rudra sing He performed the sacrifices that had been made.
Having offered the Purusha's abdomen with three skulls, accepting it, hearing the praise, the Lord is saying thus. I, who am consciousness and body, exist as a single entity before creation, united with the subtle nature and the beings. Creating the universe, creating the four-faced Brahma, and entering into it, I create. I alone, from the form of Vishnu, sustain the world and protect it. I am not a servant, I am independent. In the deluge, I transform the beings that are absorbed in me, according to their respective karmas, changing nature into bodies, and remaining within them, I myself establish them. Therefore, I am the self-existent, I am the ordainer of myself, I am the ordainer of all other souls, I have no names or forms like gods, humans, etc. Since I am the one who sees everything, I am the cause of calamity. I am the embodiment of knowledge, the possessor of knowledge. That is, I am omniscient. Nature is inert, the living being is subject to knowledge. The omniscient one is happy due to the karma of being subject to the enjoyment of happiness Sadness It is becoming a problem. I don't have any such differences. Having the qualities of power, Raja, and Guna, entering into the nature that is mine through the living being, with the knowledge of the form of resolve, creating this world through Brahma, being worthy of being treated as Brahma, Vishnu, and Maheshwara, who are suitable for the states of creation and destruction In this way, I, being among the nature and the men, am the one who does not say his faults, the one who appoints Nature is more unique than men, it is the one who wears everything. There is no other one who can rule me, who can control me. There is no one like me, no one above me. I am great because of my form and qualities. There is no one else who has a form and qualities greater than my form. All beings are subordinate to me, being in me, and are acting. They are becoming rhythmic. All beings, including Brahma, Rudra, etc., are not able to be separated from me. I exist, those who don't exist, but unknowingly they think they are different.
Even men who have understood that the body is the soul have the wisdom that their body is one with themselves, right? His body, head, hands, legs, etc., are not separate from each other. Similarly, all beings are parts of my body; they are not separate. Brahma, Vishnu, Rudra, and others, the three are different, they think. Those who have erased these three, will attain peace. Even Brahma, Rudra, and others are not able to be independent and different from me. I am the soul and they are the body. Those who do not understand this relationship consider Brahma, Rudra, and all beings as separate. They suffer from it. In this way, as the Lord commanded, Daksha, after worshiping Sri Hari, satisfied Hari with a Vaishnava Yaga performed with three skulls, and offered the gods in space and those on earth to whomever they belonged to and worshiped. Having calmed his mind, he took possession of the part that belonged to Rudra. Having completed the Yagnya, he also performed the Avabhrtha Snana with the Ritvikas for the karma he had performed. In this way, south The elders say that the daughter-in-law Sati Devi left her body and was reborn in Himavanti as the wife of Menaka. In that birth, she, who was named Parvati, considering the fall as the ultimate attainment, and thinking of herself as the one, obtained Parameshwara, her husband, again as her husband. In the deluge, all the conscious classes that joined with the Supreme Being will again come to light in the stage of creation, join with them, and become gross. Hey, just as he was with the body, similarly, abandoning the body of Sati, having attained the body of Parvati, he again joined with Parameshwara, which was impossible to separate. I heard the story of the destruction of Daksha's palace by Lord Shambhu, from Uddhava, a disciple of Brihaspati. This is a story describing the pastimes of Rudra. This is sacred, it brings glory and life. He will destroy the evil influence. Even if told, he will not listen. He will attain devotion to the Lord. Maitreya is saying, Sanakudu and other four sons, Narada, Bubhu, Hamsudu, Aruna, they are
They are also sons of Brahma. They, being ascetics, having taken refuge in celibacy, did not accept the shelter of a householder. Adharmuni's wife is Mriśa, Mriśa means untruth. Those names indicate that Adharmuna has a relationship with untruth and husband. Adharma also means son of Brahma. This couple had a son named Dambhamu and a daughter named Maya. Dambhamu means to deceive others, having a certain feeling inside, and to act as if the world is different. When such a feeling exists, Maya is born following it. That is, as soon as there is a feeling of inner bending, the appropriate action begins. Niruthi has no children. Therefore, he accepts Dambhuni's illusion as his son and daughter-in-law. They both had two children named Lobham and Nikriti. The feeling that one's belongings belong to oneself is greed. While having this feeling, unknowingly hurting others causes a sense of inertia. Lobhamu and Nikriti, a couple, had two children named Krodhamu and Himsa. Kali and Durukti, these two, possessed. Greed, Anger and violence are caused by the presence of inertia. Anger Anger is a feeling of physical and emotional expression that exists within a person. This is a man, it comes out of it, violence. This is a woman, these two are a couple. Similarly, Kalipurushudu is bad speech, meaning a bad word. This woman is his sister, these two are a couple. We know that in those days, brothers, sisters, and couples existed and created the universe. Kali's wife, stop, fear in wickedness, death, thus both had. Fear is a man, death is a woman, both are cruel to each other. Sorrow and suffering, meaning pain, are born as a pair. In this, sorrow is the man, the pain caused by it is the wife, and the son of Brahma is unrighteous. He is the founder of the dynasty. Their lineage is like a tree, as mentioned before, all those who are mentioned are like branches. These people are the reason for the family. Those who seek prosperity. This lineage cannot be served. Among them, mainly those who are in the monastery should not have any connection with this lineage. This is the cause of the apocalypse. This is all a prelude.
It should be erased. Erring should leave it for good. If we leave it, the sin that clings to our soul will be removed. In this way, the lineage of Manu's three daughters is described. After that, they are describing the lineages of their sons. Sātarupa was the first couple and Swayambhuva was the first couple. She had two sons, Priyavrata and Uttanapada. Both of these were born out of divinity. One who observes a vow pleasing to God is called Priyavrata. Uttanapada is the one with the high-footed posture. His feet are useful for walking up, but not for walking down, that is, he who has a practice that brings elevation, listen to what their lineage says. With this, the story of Daksha is completed for us. After that, from the podcast, we are going to learn about the lineage of Uttanapada and the story of Dhruva. We will meet in another podcast in the Dhruvopakhyanam. Salutations to the Ashmadgurus. Jai Srimannarayana