ధ్రువుని దిగ్విజయ యాత్ర - యక్షులతో ఘోర సంగ్రామము

Dhruva's Conquests & War Against the Yakshas

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ మహత్తర ఘట్టంలో, ధ్రువ మహారాజు తన దిగ్విజయ యాత్రను ధర్మబద్ధంగా నిర్వహిస్తూ రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. అయితే, తన ప్రియమైన సోదరుడు ఉత్తముడు యక్షుల చేతిలో వీరమరణం పొందడంతో ధ్రువుని హృదయం శోకంతో మండిపోయి, యక్షజాతిపై తీవ్రమైన యుద్ధానికి సంసిద్ధుడవుతాడు. ధ్రువుని శరపరంపర ఆకాశాన్ని కప్పివేయగా, యక్షులు దివ్యాస్త్రాలతో భీకర ప్రతిఘటన చేసే ఈ సంగ్రామం అత్యంత రోమాంచకరంగా సాగుతుంది. శోకావేశంలో ధర్మబుద్ధి మరుగున పడే ప్రమాదాన్ని ఈ పవిత్ర కథ మనకు సూక్ష్మంగా బోధిస్తుంది.

In this powerful episode from Canto 4 of the Srimad Bhagavatham, we witness the glorious reign of Dhruva Maharaja as he expands his kingdom through righteous conquest. When a Yaksha warrior slays his beloved brother Uttama in battle, Dhruva is consumed by grief and rage, launching a fierce campaign against the Yaksha race. The ensuing war is both terrifying and magnificent, as Dhruva's arrows darken the skies and the Yakshas fight back with devastating celestial weapons. Through this sacred narrative, we are invited to reflect on the tension between dharmic duty and the dangers of anger clouding a noble soul's judgment.

← Prev Next →
Dhruva's Conquests & War Against the Yakshas bhagavatam

జై శ్రీమన్నారాయణ నమఃశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞాన ఘనాయచ పరమాత్ముడు సత్వర్జస్తమో గుణాత్మకమగు తన మాయాశక్తి యందు ప్రకటమై సత్వగుణాధిక్యముచే శాంతుడుగను రజోద్గుణాధిక్యముచే ఘోరుడగను తమోగుణాధిక్యముచే మూఢుడుగను భాసించినను ఆయన యొక్క ఏక రసమగు జ్ఞాన స్వరూపమునందు భేదములు లేవు. సర్వమునందు సమానముగా సత్తాస్ఫూర్తుల రూపముగా ప్రకటమయ్యే ఆ పరమాత్మునకు అనేక నమస్కారములు. ఎత్క్యాంటో థర్డ్ చాప్టర్. 12th ప్రేయర్. భగవంతువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధృవుడి యొక్క వృత్తాంతాన్ని మనం కొంత భాగం వరకు తెలుసుకున్నాం. ధృవుడు తన తమ్ముడైనటువంటి ఉత్తముడి యొక్క వధ యక్షుడు చేశారనేటువంటి కోపముతో యక్షులందరినీ కూడా వధించడం జరుగుతుంది. దాన్ని చూసి తన యొక్క తాతగారనటువంటి స్వయంభువ మనువు తనకి ఉపదేశం చేయడానికి కోసం వచ్చాడు. ఆ ఉపదేశాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. నాయనా, ఎక్కువ రోషము నరకమునకు ద్వారము, అది పాపము. ఈ యక్షులు ఏ విధమైన పాపము ఎరుగరు. వారిని నీవు చంపరాదు, ఇది మన వంశమునకు తగిన పని కాదు. సత్పురుషులు దీనిని నిందింతురు. తప్పులేని యక్షులను వ్యధించుట అయుక్తము. ఎవడో ఒక యక్షుడు నీ సోదరుడగు ఉత్తముని చంపినాడు. సోదరుని యందు ఉండు వాత్సల్యముచే నీవు బాధపడి చాలా మందిని చంపినావు. ఋషీకేశుడగు భగవంతుని అనువర్తించు సాధువులకు ఇది యుక్తమగు మార్గము కాదు. దేహమే ఆత్మ అని భావించెడి పశువులు ప్రవర్తించవలసిన విధానం ఇది. భూత హింస భగవద్భక్తులు చేయరాదు. సర్వ భూతములకు ఆత్మగా ఉండెడివాడు శ్రీహరి. ఆరాధింప శక్యము కాని ఆ విష్ణువును సంతోషపరిచి సర్వోన్నతముగు పదవిని పొందినావు. నిన్ను హరిభక్తులందరూ భాగవతోత్తముడుగా భావింతురు.

సత్పురుషుల ఆచరణమును దిద్దవలసిన నీవు చేయరాని దోషమును చేసినావు. భగవద్భక్తికి భూతద్రోహము కంటే శత్రువు లేదు. తప్పు చేసిన వారిని ఓర్పుతో క్షమించవలెను. ఇతరులకు దుఃఖము కలిగినప్పుడు కరుణతో సహింపలేక బాధపడవలెను, బాధపడవలెను. సకల ప్రాణులను తన శరీరమును ఎట్లు ప్రేమతో చూచుకొనునో అట్లు ప్రేమతో చూడవలెను. సకల శరీరములోను జ్ఞానమే ఆకారముగా గల జీవుడు ఉన్నాడని సమభావముతో చూడవలెను. దేహము వేరు వేరుగా ఉన్నను ఆ భేదమును పరిగణించి తారతమ్య బుద్ధితో చూడరాదు. ఇట్లు ప్రవర్తించిన నాడు సర్వాత్మకుడగు భగవానుడు అనుగ్రహించును. సర్వాత్మకుడగు భగవానుని ఉపాసించిన పురుషుడు జీవించి ఉండగానే ప్రకృతి వశముచే కలుగు క్రోధము మొదలగు దోషములు తొలగిన వాడగును. శరీరమును వీడిన తరువాత మోక్షమునంది నిరతిశ ఆనంద రూపమగు ఆ బ్రహ్మమును పొందును. తత్వమును ఎరింగిన వారు రోశముతో ఇట్టి పనిని చేయరు. పురుషుడు గాని స్త్రీ గాని పంచభూతములలో తయారైన దేవ మనుష్యాది శరీరముతో కూడి ఉండును. స్త్రీ పురుష శరీర ధారులు అన్యోన్యము కలియుటచే సకల ప్రాణిజాతము పుట్టుచున్నది. ఆ పంచభూతాత్మకమగు రెండు శరీరముల సంబంధముచే ఏర్పడిన ప్రాణి సమూహము అంతయు పంచభూతాత్మకమే. వీటికన్నిటికీ కారణము పరమాత్మచే అధిష్టింపబడిన ప్రకృతి యందలి సత్వ రజస్తమో గుణముల తారతమ్యమే సృష్టి స్థితి లయములు జరుగుటకు కారణము. రజోగుణము పెరిగి సత్తము తమస్సు తగ్గినప్పుడు సృష్టి జరుగును. సత్తము పెరిగి రజస్తమస్సులు తరిగిన నాడు సృష్టింపబడినది పదిలముగా నిలుచును. తమోగుణము పెరిగినప్పుడు లేకుండా పోవును. పురుషుడు అనగా ఈశ్వరుడు. సత్వాది గుణ సంబంధము లేనివాడు అతని నిమిత్త మాత్రుడై ఈ ప్రకృతితో చేరి ఉండును. సుఖ దుఃఖ తారతమ్యమునకు దేవ మనుష్యాది శరీర భేదమునకు కర్మయే కారణము. ఈశ్వరుడు చూచుచు దాని నడిపించుచుండును. సూదంటురాయి దగ్గరగా నున్నచో ఇనుములో కదిలిక కలిగినట్లు ఈశ్వరుడు దగ్గరగా నుండగా అవ్యక్తమైన ప్రధానము. దాని కార్యమైన మహత్తత్వం మొదలగు వ్యక్తము ప్రవర్తించుచుండును. ప్రకృతి ఈశ్వరునకు శరీరము వంటిది.

అలాగుటచే మారునది శరీరమే అయినను అతడే మారినాడని అనుకొనుటకు అవకాశం ఉన్నది. శరీరము మారిన నాడు లోనున్న వానిని మారిన నాడు. మారినాడు అందుము కదా. బాల్యముతోనున్న శరీరము యవ్వనమును పొందినప్పుడు బాలుడు యువకుడు అయినాడందురు. అందుచే ఈ జగత్తుగా మారినవాడు మార్చినవాడు సర్వేశ్వరుడే. దేవ మనుష్యాది భిన్న భిన్న దేహములు పొందుటకు గాని వారికి సుఖ దుఃఖములు కలుగుటలో గాని ఈశ్వరుడు కారణము కాదు వారి కర్మయే కారణము. ఆయా జీవుల అదృష్టముగు కర్మను అనుసరించి తాను ఏమియు చేయువాడు కాకుండా ఉండియు చేయుచుండును. అతడు ఉన్నప్పుడు గాని జరగదు. కనుక శరీరం మారుటకు జీవుడు సుఖదుఃఖములు అనుభవించుటకు కూడా అతడు ఉండుట కారణము కనుక అతన్ని కర్త అందురు. కానీ అతడు చేయువాడు కాదు. జీవుడు తన కర్మానుగుణముగా దేహములలో తారతమ్యమును సుఖదుఃఖములను పొందుచుండును. ఇట్టి విచిత్రమగు ప్రభావము కలవాడు భగవానుడు. నీ సోదరుని చంపినవాడు ఎవ్వడు? చంపబడిన వాడు ఎవ్వడు? అనునది తత్వం ఎరిగిన నాడు నీకు తెలియును. కాల శరీరకుడుగా పరమాత్మ ఉండును. అతడు ఆయా కాలములలో తండ్రి ద్వారా పిల్లలను పుట్టినట్లు చేయును. మృత్యువు ద్వారా ద్వారా ఆ సమయం వచ్చినప్పుడు చనిపోవునట్లు చేయును. అతడు పుట్టుక లేనివాడు, నాశనము లేనివాడు, అతడు అంతము లేనివాడు, ఈశ్వరుడు చంపినవాడు కానీ. యక్షుడు కాదు, చనిపోయినవాడు ఉత్తముడు కాదు, పైనున్న శరీరం ఎప్పుడును మారును కదా, గుణముల తారతమ్యముచే ఆయా కాలములో ఈశ్వరుడు దానిని మారునట్లు చేయుచుండును. లోనున్న జీవుడు నిత్యుడు, జ్ఞాన స్వరూపుడు. అతనికి పుట్టుక లేదు, చావు లేదు. అనాదిగా వచ్చిన కర్మ సంబంధముచే అతనికి శరీరముతో కూడుట, వీడుట సంభవించుచుండును. ఇందుకు కారణం ఎవ్వడు? అందుచేత నీవు ఒకరిపై కోపము తెచ్చుకొనకుము. పరమాత్మ మృత్యువుకు కూడా ఆవలివాడు, మృత్యువు శరీరముగా గలవాడు.

వారి వారి కర్మలను అనుసరించి ఫలమునిచ్చునట్లు చేయువాడే కానీ అతనికి పక్షపాతం ఉండదు. దయమాలినతనం ఉండదు. ప్రజలందరూ అతనికి సమానులే కనుక ఒకరు శత్రువులు కారు ఒకరు మిత్రులు కారు. కర్మానుసారముగా అతడు నడిపించుచుండును. గాలి కదలికను బట్టి ధూళి కణములు ఎట్లు పరిగెత్తుచుండునో అట్లే ఆ జీవులను ఈశ్వరుడే కదిలించుచుండును. వాని కర్మానుగుణముగా కదలినట్లు చేయుటయే అతని పని కానీ మంచిని చెడును ఇచ్చుటలో అతని ప్రమేయము లేదు. సర్వాంతరాత్మగు భగవానుడు కర్మవశ్యుడైన జీవునకు ఆయుష్షును పెంచుట తగ్గించుట కర్మానుగుణముగా చేయుచుండును. అతడే కర్మచే ఎక్కువ కాలము బ్రతికి ఉండుట కర్మ తగ్గుటచే పోవుట లేనివాడు. అందుచే మన సుఖ దుఃఖములకు మన కర్మయే కారణము కానీ సర్వేశ్వరుడు కాడు. ఈ సుఖ దుఃఖమునకు కారణం అయిన దానిని కొందరు కర్మ అందురు మరి కొందరు దైవమందురు వేరే కొందరు ఆ భగవాను సంకల్పమందురు అతని సంకల్పముచే అనుగ్రహము నిగ్రహము అనువానిచే సుఖము దుఃఖము కలుగును జీవుడు చేయవలెనని శాస్త్రములో సర్వేశ్వరుడు చెప్పిన కర్మలను చేసిననాడు భగవానునకు అనుగ్రహము కలుగును. ఆచరించని నాడు నిగ్రహము కలుగును. మనకు సుఖదుఃఖములను అనుభవించుటయే తెలియను గానీ ఆ భగవానుకు నిగ్రహమే కలిగినదో అనుగ్రహమే కలిగినదో తెలియదు. అతడు ఇంద్రియములకు గోచరము కానివాడు అతడు ఇట్టివాడు ఇచట ఉండును ఇప్పుడు ఉండును అని నిర్ణయించుటకు వీరైనవాడు కాదు. అనేక విధములకు శక్తులకు పుట్టిన చోటు అట్టివాడు ఏమి చేయదలంచెనో ఎవ్వరునూ ఎరుంగలేరు. కావున నాయనా ఈ కుబేరుని అనుచరులు నీ సోదరుడగు ఉత్తముని చంపిన వారు కారు. కర్మాధీనమై సాగెడు ఈశ్వర ప్రేరణయే ఈ చావు పుట్టుకలకు కారణము. అతడే విశ్వమును సృజించును, అతడే కాపాడును, అతడే అంతమొందించును. కానీ అతడు నేను చేయుచున్నాను చేసిన ఫలము నాది అను భావము లేనివాడు ఆ భావము అహంకారము చే కలుగును ఆ భావము లేకపోవుటచే అతనికి సత్వ రజ స్తమో గుణములచే కలిగెడి సర్వ వ్యాపారములు చేయుచున్నను వాటి వలన దోషములు అంటవు

భగవానుడు దేవ మనుష్యాది సకల ప్రాణుల ఆత్మ అయినవాడు అన్నిటిలో నుండి కర్మానురూపముగా నియమించువాడు. అన్నిటికీ కారణమైనవాడు అచేతనము ప్రకృతిని తన శరీరముగా కలిగి ఉండి శక్తి వలె తన నుండి వేరు చేయవీలు కాని ప్రకృతిని జీవుల కర్మానుగుణముగా మార్చి సృజించును. పాలించును, సంహరించును, అతడే మృత్యువు, అతడే అమృతము. కనుక బయటి వానిని చూడక అన్నిటికీ లోనుండు సర్వేశ్వరుడే నాకు ప్రాప్యము, అదియే పొందించునది, అదియే ఆధారమైనదని భావించుచుండుము. సృష్టికర్తలగు చతుర్ముఖుడు మొదలగు బ్రహ్మలందరు అతనికే పూజగా తాము చేయు కర్మలను చేయుచుందురు. ఎద్దులను ముక్కుత్రాడు పోసి నడిపించునట్లు అందరును తమ వశం తన వశమునందు ఉంచుకొని నడిపించువాడు అతడే. ధృవా ఐదేళ్ల వయసులో సవతి తల్లి మాటలకు బాధపడి తల్లిని వదిలి అడవికి పోయి తపస్సు చేసి భగవాను దర్శించితివి ఆరాధించితివి. మూడు లోకములలో ఉత్తమమైన పదమిని పొందుతివి అట్టి నీకు ఈ రోషము తగునా అతనిని అన్వేషించుచుండుము. అతనికి మన వంటి కర్మకృతమగు శరీరము లేదు. ఆయనలోని ఆత్మయందే అతడు చేరి ఉండును. అతడు సత్వరజస్తమో గుణములు లేనివాడు. అతనితో సమానుడు గాని అధికుడు గాని లేడు. ఎల్లప్పుడూ ఏకరూపకముగా రూపముగా ఉండువాడు, ఎల్లప్పుడూ జ్ఞాన సంకోచమును అందనివాడు, అట్టి వానిని నీవు దర్శింప ప్రయత్నింపుము. బాహ్యముగా కనిపించు భేదములన్నియు అతనిని దర్శించినచో లేనివని తెలియును. ఇంతవరకు నీవు ఐశ్వర్యమునే కోరి భగవానుని ఆశ్రయించితివి. ఇప్పుడు నీకు ఆత్మ అయినవాడు, జ్ఞాన శక్త్యాది గుణములు కలవాడు, పరిమితులు లేనివాడు, ఆనందమే తప్ప ఇతరములు లేనివాడు, జ్ఞాన బల క్రియాది శక్తులు పరిపూర్ణముగా కలవాడు. అట్టి వానిని ఏ కారణము లేక వేరొక దానిని కోరక ఎల్లకాలమునందు ప్రేమతో ఎడతెగక స్మరింపుము. అట్టి భక్తిచే నేను నాది అను భావము తొలగి విడదీయుటకు వీలు కాని శరీరమే నేను అనడి అహంకార గ్రంథి వదిలిపోవును.

కోపమును నియమించుకొనుము. బలమైన మందుచే రోగమును తగ్గించుకొనునట్లు తత్వజ్ఞానముచే సకల శ్రేయస్సులకు ప్రతికూలమగు రోషమును తగ్గించుకొనుము. రోషము గల పురుషుని చూచి లోకము భయపడుచుండును. లోకమునకు బెంగ రోషము గల పురుషుని చూచి లోకము భయపడుచుండును. లోకమునకు బెంగ కలిగించుట కంటే పాపము లేదు. అది ధర్మము. దానిచే పురుషార్థము నశించును. వృద్ధుని సోదరుడు కుబేరుడు. కోపముచే నీవు వానిని అవమాన పరిచితివి. నీ సోదరుని చంపిన వానిని కుబేరుని పరిజనము చంపితివి, జనమును చంపితివి. అతనిని వినయముతో అనునయించి అనుగ్రహింప చేసుకొనుము. మహా పురుషుల తేజస్సు వంశమును నాశనము చేయగలదు. ఈ విధంగా స్వయంభువ మనువు తన మనుమని మనుమనికి ఉపదేశము చేసి అతన్ని నమస్కరింపగా ఆనందించి ఋషులతో తన పట్టణమునకు ఏ గెను దీని తర్వాత భాగం ఏమిటో మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the peaceful one, the terrible one, the ignorant one, the virtuous one, the one with unspecialized qualities, the one of equality, salutations to the one with knowledge, the destroyer of ignorance, the supreme soul, manifesting in his Maya power, being predominated by Sattva Guna, being peaceful, being predominated by Rajo Guna, being terrible Even though he appears as a fool due to the dominance of the quality of darkness, there are no differences in his form of knowledge, which is of a single essence. Many salutations to that Supreme Being, who is declared equally in all things, as the embodiment of power. Etchanto de Segunda, o Chapter. 12th Prayer. Oh Gods, welcome to the fourth episode of Srimad Bhagavata Tattva Deepika, the 14th podcast. Until now, as part of the conversation with Vidura Maitreya, we have learned about Dhruva's story to some extent. Dhruva, with the anger that the Yaksha killed his brother Uttama, is killing all the Yakshas. Seeing that, his grandfather, the self-existent Manu, came to give him advice. Let us now experience that teaching. Oh, my Lord, anger is the gate to hell, it is sin. These Yakshas are They don't know what kind of sin. You shall not kill them, it is not in our nature. The saints will be damning. It is inappropriate to make fun of innocent Yakshas. Some yaksha killed your brother Uttama. Because of the affection you have for your brother, you have been hurt and killed many people. This is not the right path for the sages who follow the Lord, the Supreme Being. This is the way animals, who think that the body is the soul, should behave. Sectarianism is forbidden among devotees of God. Sri Hari is the one who is the soul of all beings. You have attained the highest position by pleasing that Vishnu, which is impossible to worship. All the devotees of Hari consider you to be the best among Bhagavatas.

You, who should have corrected the practice of the virtuous, have committed a crime that should not have been done. There is no greater enemy to devotion to God than jealousy. For those who have sinned, forgive with patience. When others are in sorrow, one should not be able to bear it with compassion, one should not be sad. Just as one loves one's body, one should love all creatures. In all bodies, the knowledge itself is the form of the being, and one should see it with equanimity. Even though the body is different, that difference should not be considered with discrimination. When you behave like this, the Lord, who is the soul of all, will bless you. A man who worships the Supreme Being, the Lord, will be free from the faults caused by anger and other defects that arise from being subject to nature while still alive. After leaving the body, one attains the form of eternal bliss, that Brahma. Those who know the principle do not do such a thing with anger. A man or a woman is made up of the five elements and is associated with a body of gods, humans, etc. The union of male and female bodies creates all living beings The entire group of living beings, formed by the relationship between two bodies made of five elements, is also made of five elements. The reason for all of this is the gradation of the Sattva, Rajas, and Tamas qualities in the nature ordained by the Supreme Being, which is the reason for the creation, preservation, and destruction to occur. When the Rajoguna increases and the Sattva Guna decreases, creation takes place. When the power increases and the Rajas tastes, it is created and remains secure. The quality of Tamas increases and disappears. The male is called Eshwar. He who is not connected with the qualities of goodness and truth, is joined with this nature as a cause. Sukha Dukkha Taratamyamdu Deva Manushyadi Deha bhedamunaku karma ye karanamu. God is watching and guiding it. When the needle is close to the stone, it seems as if there is movement in the iron. When God is close, it is an unmanifest prime. Its function, the greatness, and other things are manifesting. Nature is the body of God.

Therefore, even though the body is changing, there is a possibility to think that he himself has changed. When the body changes, the one who is inside changes. He changed, didn't he? When a body that was in childhood attains youth, the child becomes a young man. Therefore, the one who became this world, the one who changed, is the Lord of all. God is not the cause of them attaining different bodies like gods and humans, or of them experiencing happiness and sorrow. Their own actions are the cause. According to the karma of the creatures, he remains without doing anything, even though he is not the doer. Not without him. Therefore, the body changes, and the living being experiences happiness and sorrow, and he is the reason for that, therefore they call him the doer. But he isn't the one who does it. A being, according to the nature of his karma, experiences differences and happiness and sorrow in his bodies. Such a strange and powerful being is the Lord. Who killed your brother? Who is the one who was killed? When you know the essence of it, you will know. The Supreme Being exists as the embodied energy of time. He, in those times, through his father Makes kids cry. Death will come when the time comes, it will make them die. He is unborn, he is undestroyed, he is without end, he is the one killed by God. Not a Yaksha, the dead one is not the best, the body above will always change, right? Due to the disparity of qualities, in those times, God makes it change. The one who is in the loan is eternal and is the embodiment of knowledge. He is not born and he is not dead. From the beginning, due to the karmic connection, he is bound to the body, he is bound to it. Who is responsible for this? Therefore, do not be angry with anyone. The Supreme Being is beyond death, and death itself is a body.

He who does not have partiality, but does what is according to their respective karmas, gives the fruit. Kindness ain't a little. All people are equal to him, therefore one is not an enemy, one is a friend. He leads according to karma. Just as dust particles move according to the movement of air, similarly, God Himself moves these creatures. His job is to make things move according to their karma, but he has no involvement in giving good or bad. The all-pervading God, being karmic, increases or decreases the lifespan of a being according to their karma. He is the one who lives for a long time because of karma, and he is the one who does not die because of karma decreasing. Therefore, our happiness and sorrow are caused by our actions, but there is no God. Some call the cause of this happiness and sorrow karma, some call it divine, and some call it the will of God. By His will, by grace and control, happiness and sorrow arise. The soul should do it, according to the scriptures When the actions of the Lord are performed, grace is bestowed upon the Lord It will happen. When it is not practiced, control will happen. We do not know how to experience happiness and sorrow, but we do not know whether that God has control or grace. He is not one who is visible to the senses, he is such a person, he is not one who can decide whether he will be here now or not. He is the place where many kinds of powers are born, and no one knows what he intends to do. Therefore, my son, the followers of this Kubera did not kill your brother Uttama. The cause of these deaths and births is the divine inspiration that follows the karmic cycle. He is the one who creates the universe, He is the one who protects, He is the one who destroys. But he who has no feeling that what I am doing is mine, that feeling arises from ego. Because of the lack of that feeling, he does all the deeds that are done by the qualities of Sattva, Raja, and Tamo, but he does not get any faults from them

The Lord, the soul of all beings, including gods, humans, and other creatures, is appointed from all things in accordance with karma. The one who is the cause of everything, the unconscious, having nature as his body, transforms the nature that cannot be separated from him like power, according to the karma of the beings. He who governs, He who destroys, He is death, He is immortality. Therefore, without looking at the outsider, consider that the Lord who is within everything is attainable to me, that is what will be attained, that is what is the basis. The four-faced creator, along with all the Brahmas, perform their respective rituals as an act of worship to him. He is the one who leads the oxen by putting a nose rope on them, and he is the one who keeps everyone under his control and leads them. Dhruva, at the age of five, being saddened by the words of his stepmother, left his mother, went to the forest, performed penance, and had a vision of God, and worshipped him. You have attained the best position in the three worlds, is such anger befitting you? Search for him. He does not have a body like ours, which is karmic. He is united with the Spirit of the Soul. He is Sattva, Rajas and Tamas One without a guilty conscience. There is no one like him, nor is there anyone superior to him. He who is always of the same form, who is always unattainable to the contraction of knowledge, try to see such a person. All the apparent differences are known to be non-existent when seen by him. Until now, you have sought only wealth and have sought refuge in God. Now, the one who is your soul, the one who has qualities like knowledge, power, etc., the one who has no limitations, the one who has only bliss, the one who has complete powers like knowledge, strength, action, etc. Remember such a person with love and never-ceasing love, without any reason, without desiring anything else. By such devotion, the feeling that 'I am mine' is removed, and the body that cannot be separated, I am that, the egoistic knot will be released.

Take up anger. By strong medicine, reduce the disease, and by the knowledge of truth, reduce the anger that is contrary to all well-being. The world is afraid to see a man with passion. The world is afraid to see a man with anger and worry. There is no sin greater than causing worry to others. It is dharma. It destroys the purpose of man. Kubera, the brother of the old man. In your anger, you have humiliated him. You killed the one who killed your brother, you killed Kubera's relative, you killed the people. Please hum along and try to get his vocal. The brilliance of great men can destroy a lineage. In this way, Swayambhuva Manu, after instructing his Manu to Manu, was pleased to see him bow down, and with the sages, to his town, what is the next part of this, we will learn in another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus