దక్షునికి మేష శిరస్సు సంధానము - యజ్ఞ పరిసమాప్తి
Daksha Restored with a Goat Head & Yajna Completion
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, పరమేశ్వరుని కోపం శాంతించిన తర్వాత, మహర్షుల ప్రార్థనలు మరియు శ్రీమహావిష్ణువు అనుగ్రహం వలన యజ్ఞ వాటిక పునరుద్ధరించబడుతుంది. హోమాగ్నిలో భస్మమైన దక్షుని శిరస్సు లభించకపోవడంతో, అతనికి మేష శిరస్సు అమర్చబడి పునర్జీవం ప్రసాదించబడుతుంది. మరణించిన దేవతలు మరియు మహర్షులు కూడా దైవకృపచే తిరిగి జీవం పొంది, అసంపూర్ణంగా మిగిలిన యజ్ఞం భక్తిశ్రద్ధలతో సమాప్తి చేయబడుతుంది. అహంకారానికి పశ్చాత్తాపం కలిగి శరణు వేడిన వారికి భగవంతుని కరుణ తప్పక లభిస్తుందని ఈ ఉదాత్తమైన ఘట్టం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.
In this sacred episode from the Fourth Canto of Srimad Bhagavatham, Lord Shiva's rage subsides and the devastated yajna grounds are restored through divine grace. By the mercy of Lord Vishnu and the prayers of the assembled sages, Daksha is revived with a goat's head in place of his own, which had been consumed in the sacrificial fire. The other fallen demigods and sages are also healed and restored to life, and the interrupted yajna is finally completed with great devotion and reverence. This deeply moving episode illustrates that the Lord's compassion ultimately prevails, and that even the gravest of conflicts can be resolved through surrender and sincere prayer.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నతోస్మి అనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణైహి స్వలీలయా సందధతే వ్యయాత్మనే దేశ కాల వస్తు పరిచ్ఛేదము లేని శ్రీహరి శక్తులు అనంతములు పావనము చేసే లీలలు గల ఆయన ప్రభావములు ఆశ్చర్యమును గొలుపును ఆయన తన లీలచే సత్వరజస్తమోమగు గుణాత్మకమగు ప్రకృతి ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చక్కగా చేయుచున్నాడు. వినాశము లేని స్వరూపము గల ఆ శ్రీహరి కొరకు నమస్కరించుచున్నాను. సెవెంత్ క్యాంటో ఎయిత్ చాప్టర్ ఫార్టీయత్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షుని యొక్క వృత్తాంతంలో దక్షుడు చనిపోయినప్పుడు తిరిగి తనకి రుద్రుడు ఆ పొట్టేలు యొక్క శిరస్సును ఇవ్వటము తరువాత తను మళ్ళీ కలుసుకొని స్తుతించడానికి కోసం సిద్ధమవుతాడు. దక్షుడు చేసే స్తుతి నుంచి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఓ దేవా, నీవు పరిశుద్ధుడవు. ఏ దోషములు నిన్ను అంటవు. నీకు కర్మ చేయ వచ్చేడి శరీరం ఉండదు. కర్మకు వశుడవు కావు. నీవు ఎల్లప్పుడూ నీ స్వరూపమందే మాయ అంటకుండా జ్ఞాన ప్రకాశము కలిగి ఉందువు. బుద్ధిచే కలిగెడి వేరు వేరు విధములగు ప్రవృత్తులు నీకు ఎన్నడును కలగవు. నీతో సముడు గాని అధికుడు గాని లేడు. నీ స్వరూపమంతయు స్వయం ప్రకాశమే కానీ జడభాగం ఉండదు. నీవు పరిశుద్ధుడవు అగుటే కాక ఇతరులకు కూడా అశుద్ధిని కలిగించుచు సంసారమును తొలగించి పరిశుద్ధులను చేసి భయరహితులను చేయుదువు.
నీ వంశం నీ వశమందుండు ప్రకృతిచే దేవాది శరీరములు కల్పించి అందులో జీవునితో కూడి నీవు ఉందువు. స్వతంత్రుడవై నీవు కర్మకు వశుడైన వాని వలె మనుష్యులతో సమానమగు శరీరమును స్వీకరించి ఉందువు. నీ సౌశీల్యము, వాత్సల్యము కీర్తింప శక్యము కానివి. పృత్విక్కులు ఇట్లు స్తోత్రము చేయుచున్నారు. నిరంజనా, పుణ్య పాప సంబంధం అంటని వాడవు నీవు. నందీశ్వరుడు మమ్ములను శపించినాడు. అందుచే మాకు కర్మాచరణమే ప్రధానమను పట్టుదల కలిగి నీ తత్వమును ఎరుంగలేని వారమైతిమి. భగవాన్ నీవు జ్ఞానము, శక్తి మొదలగు ఆరు గుణములు కలవాడవు. ధర్మమని పేర్కొనబడిన ఈ యజ్ఞ కర్మ వేదముచే ప్రతిపాదింపబడినది. అది ఇంద్రాది దేవతలకు ప్రీతిని కలిగించునది. కానీ దేవతలలో అధిష్టించి ఉండి యజ్ఞములచే ఆరాధింపబడేవాడవు, యజ్ఞములకు ఫలమును వసంగిడివాడవు నీవే అయి ఉన్నావు. సదస్యులు ఇటు స్తోత్రము చేయుచున్నారు. నిన్ను పొందుటకు ఉపాయం వసంగడి వాడవు నీవే కదా? జ్ఞానం లేని ప్రాణి జాతము కోరికలచే పేడింపబడి సంసార మార్గములో సాగుచున్నది. ప్రాణిజాతము కోరికలచే పీడింపబడి సంసార మార్గములో సాగుచున్నది. ఈ సంసార మార్గములో విశ్రాంతి స్థానము నీ పాదములే. దానిని వారు ఎప్పుడు పొందుదురో కదా. ఈ సంసార మార్గమున పయనించుట చాలా క్లేశములను కలిగించును. దానిలో విశ్రాంతి స్థానం ఉండదు. దుర్గముల వంటి క్లేశములు అనేకములు ఇందు నిండి ఉండును. మృగములను వేటాలుటకు వేటగాని వలె యముడు అనగా మృత్యువు వీరిని గురిచేసి వేటాటుకు కాచి ఉండును. ఎడారిలో ఎండమావుల వలె అనుభవించిన అంతమొందించు విషయములు ఇందు ఎన్నో కలవు. ఇందు నేను నేను అనుకొనని శరీరము నాది అనుకొనని వస్తువులు మోసుకొనిపోవు భారములు. వీరుని మోసుకొని ఈ దుర్గముమగు సంసారములో దుర్జనులని క్రూరముగములను పొంచి ఉండగా సుఖదుఃఖములు అనడి గోతులలో పడుచు లేచుచు ఒక ప్రక్క శోకమనడి కార్చిచ్చు తరుముకొని వచ్చుచుండగా పైనుంచుచున్న ఈ సంసారులనెడి బాటసారులు నీ పదమనెడి చల్లని విడిదిని చేరుట ఎన్నడో కదా. రుద్రుడు ఇట్లు స్తోత్రం చేయుచున్నాడు. ఓ వరదా ఏ కోరిక కావలసినను ఆరాధింపదగినది నీ చరణారవిందమే ఆ చరణారవిందము సుకుమారము సుందరము సుగంధము.
అట్టి పాదమునందు ఈనాడు నా మనస్సు నిలిచినది. ఇంతకాలము లోకులందరూ నా నడువడిని చూచి నిందింతులని నాకు బాధగా ఉండెడిది. ఈనాడు నీ పాదమునందు మనస్సు నిలిచిన తరువాత ఎవరు నిందించినో నాకు లెక్కలేదు. నీ అనుగ్రహం నా యందు ప్రసరించినది కనుక నాకు వేరొకటి కోరిక కోరదగినది లేదు. భృగు స్తుతిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలందరూ శరీరధారులగు జీవులు. వారందరూ దాటశక్యముగాని నీ మాయచే జ్ఞానము మరుగుపడి చీకటి వంటి ఈ శరీరంలో పడి నిద్రించుచున్నారు. ఆ శరీరములోనున్న జీవులలో నీవు అంతరాత్మగా ఉందువని వారు నేటికీ ఎరుంగలేకున్నారు. నీవు శరణాగతులకు బంధువువు. నిన్ను నీవెంత ప్రేమించుకొందువో నిన్ను ఆశ్రయించిన వారిని అంతకన్నా ఎక్కువగా ప్రేమింతువు. బ్రహ్మాదులందరు అపరాధములకు ఆగ్రహించువారే అపరాధములను సహించు స్వభావం గలవాడవు నీవు ఒక్కడవే అనుగ్రహించుము. బ్రహ్మ స్తుతిస్తున్నాడు. ప్రభో నీ స్వరూపము వాక్కునకు గాని మనస్సునకు గాని గోచరము కాదు జీవుడు రూపము స్పర్శము మొదలగు వాటిని గ్రహించెడి ఇంద్రియములచే ఎరుంగబడువానిని గుర్తింపగలడు కానీ నిన్ను ఎరుంగలేడు. నీవు అజ్ఞానము కంటేను జ్ఞానమును కలిగించెడి ఇంద్రియముల కంటేను ఆ ఇంద్రియములు గ్రహించెడి విషయములను కంటేను సత్వాది గుణముల కంటేను ఆవలి వాడవు. వాటికి అన్నింటికీ ఆశ్రయము అయిన వాడవు, ప్రకృతి పరిణామ రూపమైన ఈ శరీరము కంటే శరీరముతో కూడి ఉన్న జీవుని కంటే అత్యంత విలక్షణుడవు నీవు. అట్టి నిన్ను ప్రకృతి వికారమైన ప్రకృతి వికారములని గ్రహింపజాలిన కన్ను ఎట్లు గ్రహింపగలదు? ఇంద్రుడు స్తుతిస్తున్నాడు అచ్యుతా నీ శరీరమే విశ్వమునంతను సుఖింప చేయుచున్నది మనస్సులకు చూపులకు ఆనందమును కలిగించున్నది నీవు ఈ రూపమును ధర్మ సంస్థాపనములకై స్వీకరించితివి. ఆ ధర్మమును స్థాపించుటకు అద్దముగనున్న అధార్మికులను ఈ శరీరమే అంతమొందించును. అధర్మమును తొలగించుటకే, ధర్మమును కాపాడుటకే నీవు ఎనిమిది భుజములతో ఎనిమిది ఆయుధములను ధరించి ఒంటివి. యజ్ఞపత్ములు స్తుతిస్తున్నారు. పుండరీకాక్షా, ఈ యజ్ఞము నిన్ను ఆరాధించుటకై దక్షుడు ఆరంభించినాడు. పశుపతియ గురుద్దుడు ఆ దక్షుని యందలి కోపముచే
యజ్ఞమును ధ్వంసము చేసినాడు. ఈ యజ్ఞ భూమి స్మశాన సదృశ్యమై అమంగళకరమై కనపడుచున్నది. నీవు నీ పుండరీకముల వంటి నేత్రములతో దీనిని పవిత్రము చేయుము. ఋషులు స్తుతిస్తున్నారు. హే భగవాన్, నీ చేష్టతము పొందక, నీ చేష్టతము పొందిక లేనిదై ఆశ్చర్యకరముగా ఉండును. నీవు కూడా మా వలె కర్మ చేయుచుందువు. ఆ కర్మమే పుణ్య కర్మ. పాప కర్మ అనునట్టి కర్మలను పోలియే ఉండును. కానీ ఆ కర్మ ఫలము నీకు అంటదు. బ్రహ్మాది దేవతలందరూ తమ ఐశ్వర్యమునకై ఏ లక్ష్మిని ఆశ్రయింతురో ఆ లక్ష్మి స్వయముగా నిన్ను అనువర్తించుచుండును. నీవు ఆమెను అపేక్షతో అపేక్షతో చూడక ఉదాసీనుడవై ఉందువు. సిద్ధులు ఇటు స్థితిస్తున్నారు ప్రభు నీ కథలు అమృతము నది అమృత నది వంటివి మా మనస్సు అనడి ఏనుగు ఇంతకాలము క్లేశములు అనడి కార్చిచుచే దహింపబడి ఆ తాపముచే దాహము కలదై నీ కథామృత నదిలో మునిగినది బ్రహ్మ సంపత్తిని పొందినట్లు మా మనోగుణము ఆ కార్చిచ్చును పూర్తిగా మరచి ఆ నది నుండి వెలిగి రాక అందే మునకలు వేయుచున్నది. దక్షపత్నియగు యజమాని ఇటు స్తుతిస్తున్నది. ఈశా నీకు స్వాగతము శ్రీనివాసా మమ్ములను అనుగ్రహింపుము. నీకు ఇదే నమస్కరించుచున్నాను, కేవలము మొండెము ఉండి శిరస్సు లేనిచో ఎట్లు అందము లేదో నీవు లేనినాడు ఎన్ని అంగములతో పరిపూర్ణమైన యజ్ఞము శోభిల్లదు. నీవు శ్రీనివాసుడవు, నీ కాంతయగు శ్రీచే మమ్ములను అనుగ్రహింపచేయుము. లోకపాలులు స్తుతిస్తున్నారు. నీవు ఈ చర్మ శక్షువులకు గోచరము కాని వాడవు. ఆత్మ దర్శనము చేయగలవారే నిన్ను చూడగలరు. మా చూపులు అసత్పదార్థములనే గ్రహించును కానీ ఆత్మతత్వమును చూడలేవు. ఈ శరీరమునే తానని భావించుచుండును. దానికి కారణము నీ మాయ. ఈ శరీరముగా పరిణమించిన తిరుణాత్మకమగు మాయ నీ అధీనమున ఉండును, నీవు అంతటా వ్యాపించి ఉండువాడవు, జీవుడు అణుస్వరూపుడు, నీవు ఈ ప్రకృతి కంటే జీవుల కంటే వేరైన వాడవు. ఈ పంచభూతములతో ఏర్పడిన శరీరములో నీవు జీవుని వలె వశించి ఉందువు ఇది నీ విచిత్రమైన అనుగ్రహ కార్యము యోగీశ్వరులు ఇట్లు స్తుతిస్తున్నారు ప్రభు నీవు విశ్వాత్మకుడవు చేతనా చేతనాత్మకమగు ప్రపంచములో నీవు ప్రవేశించి
నీ స్వభావం మారకయ్యే ఉండి దానిని ధరించి నియమించుచుందువు. విశ్వము కంటే నీవు వేరైన వాడవు కానీ వేరుగా తోచవు. లోనునట్టు తెలియవు. అందుచే జీవులు తాము నీకంటే వేరనియు స్వతంత్రమనియు అనుగొనుచుందురు. నీతో గల సంబంధము ఎరింగి తాను బ్రహ్మాత్మకుడనని వేరైన అస్తిత్వము లేని వానినని గుర్తించిన వాని కంటే నీకు ప్రియమైన వాడు వేరొకడు లేడు. కొందరికి నీవు ఆత్మవని తాము శరీరమని జ్ఞానం ఉండదు. నీవు స్వామివని తాము సేవకులమని భావింపరు అట్టి వారిని కూడా వాత్సల్యముతో అనుగ్రహించుచుందువు నీ యందు కొందరికి ఎన్నడూను తొలగని దేనిని కోరని ప్రేమ ఉండును అట్టి వారిని కూడా నీవు అనుగ్రహము నిండిన చూపుతో అనుగ్రహింతువు స్వామి నీవే ఈ జగత్తునకు సృష్టి స్థితి లయములను చేయువాడవు అట్లు చేయుటకు నీ సంకల్పమే కారణము ఆ సంకల్పముచే సత్వ రజస్తమో గుణములతో తరతమ భావమును ప్రకృతి పొంది అనేక విధములగు శరీరములుగా మారుచుండును. ఆ మాయ అనడి ప్రకృతి నీకు శరీరం వంటిది నీకే చెందినది దానిచే జీవులు దేవ మనుష్యాది శరీరమును పొంది ఉందురు. అందున్న జీవులతో చేరి నీవు కూడా ఆ శరీరములలో ఉందువు. ఆయా శరీరములకు గల నామ రూపములు నీ వరకు సాగునట్లు నీవు అందు ఉందువు. కానీ దానిలో చేరి ఉన్నందువలన నీకు అన్యధా జ్ఞానము గాని విపరీత జ్ఞానము గాని కలగవు. వానికి కారణములైన సత్వాది గుణములు నీకు అంటవు. నీ ప్రకాశముచే దోషములు అంటవు. కనుక నీవు ప్రకాశించుచుందువు. అట్టి నీకు నమస్కారము. బ్రహ్మ ఇటు స్తుతిస్తున్నాడు సర్వేశ్వరా నీవు సత్వగుణం ప్రధానముగా గలవాడవు రజస్తమో గుణముల సంపర్కము లేని వాడవు దోషములు అంటని వాడవు ధర్మము, అర్థము, కామము, మోహము పుట్టించువాడవు. నీ కళ్యాణ గుణములను, స్వరూప రూప విభూతులను నేను ఎరుంగను. నీ వేదము ఎరుంగదు. ఇంకా మిగిలిన జ్ఞానులు ఎరుంగరనుటలో సందేహమే లేదు. అగ్ని స్తుతిస్తున్నాడు.
జ్ఞాన స్వరూపా, నీ తేజస్సు చేతనే నేను ప్రకాశించుచున్నాను. నా తేజస్సు లోకమును ప్రకాశింపజేయు సమర్థమగుటకు కారణము నాలో నిండు నీ తేజస్సే. ప్రకాశించుచున్న తేజస్సు గలవాడనై ఇంద్రాది దేవతలకు నాలో అర్పింపబడిన హవిస్సులను అందించుచున్నాను. నీవు యజ్ఞముచే ఆరాధింపబడు ఇంద్రాది రూపములతో వెలేవాడవు. ఐదు విధములకు అగ్ని రూపుడవు నీవే ఆశ్రావయ అను నాలుగు అక్షరముల మంత్రములతో అస్తు శ్రౌషట్ అను నాలుగు అక్షరములతో యజ అను రెండు అక్షరములతో యే యజామహే అను ఐదు అక్షరములతో వషట్ అను రెండు అక్షరములతో కూడిన యజస్సులచే పూజింపబడువాడవు నీవే. చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ పూయతేచ పునర్ధ్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని ప్రార్థింపబడిన విధమగు ఐదు విధములగు యజస్సులచే ఆరాధింపబడు నీకు నమస్కారము. ఇంకా ముందు భాగంలో ఇంకా ఎవరెవరు స్తుతిస్తున్నారో ఆ స్తుతిని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Guru. I am the infinite, the endless, with power, with wondrous strength, with pure actions, the creator of the universe, the sustainer, the controller, the qualities, the play of the self, the destruction of the self, the limitless, the power of Sri Hari He who has infinite and pure play, whose influences are astonishing, He is doing the creation, preservation, and destruction of the world beautifully through the nature that is composed of Sattva, Raja, and Tama. I offer my salutations to that Srihari who has a form that is imperishable. Seventh Canto Eighth Chapter Forty-Fourth Prayer. Welcome to the eighth podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book, Bhod Bandhula. Until now, as part of the conversation between Vidura and Maitreya, in the story of Daksha, when Daksha dies, Rudra returns the head of that ram to him, and then he prepares to meet again and praise him. We begin with the adoration that Daksha performs. Oh, Lord, You are holy. No faults will be found in you. You have karma The body does not come into being. You are not a victim of fate. You will always have the light of knowledge without the illusion of your form. The different tendencies that arise from intellect will never occur to you. There is no one equal to you or above you. Your form is self-illuminating, but it does not have a physical form. You are holy, and not only that, but also by causing impurity to others, by removing the world, by making the holy, and by making the fearless.
Your lineage is in your control, by nature, God has created bodies, and in that, along with the living being, you exist. Being independent, you, like one subject to karma, have accepted a body like that of a man, equal to men. Your kindness and affection are beyond description. The earthly people are praising thus. Niranjana, you are not using the relationship between virtue and sin. Nandishwar cursed us. Therefore, we have a determination that only karma is important, and we have become those who cannot understand your essence. Oh God, you are the one with six qualities like knowledge, power, etc. This sacrificial act, which is considered dharma, is propounded by the Vedas. It pleases the gods, Indra and others. But you are the one who is exalted among the gods, worshiped by sacrifices, and you are the one who bestows fruit on sacrifices. The assembly is praising. You are the means to attain you, aren't you? A creature without knowledge, driven by desires, is progressing on the path of life. The animal kingdom is afflicted by desires and is on the path of worldly life It is going on. In this worldly path, your feet are the resting place. When they would get it. Traveling on this path of life causes a lot of suffering. It doesn't have a resting place. There are many sufferings like Durga's. Like a hunter who hunts animals, Yama, that is, death, targets them and protects them from hunting. There are many things that have been experienced like the sun in the desert, which are worth mentioning. In this, the body that I do not think of, the things that I do not think of, the burdens that I carry away. Carrying the burden, in this world of fortune and misfortune, while the wicked and cruel lurk, sleeping and waking in the paths of happiness and sorrow, while a sorrowful fire is chasing them, the travelers who are above, your Reaching a cool retreat, it's been a long time, hasn't it? Thus, Rudra is performing the hymn. Oh, boon-giving one, whatever wish you desire, it is worthy of worship. Your lotus feet are the one to be worshipped. Those lotus feet are delicate, beautiful, and fragrant.
In that very foot, today my mind has settled. For so long, I have been saddened that all the people see my walking and condemn it. Today, after my mind is fixed on your feet, I do not care who condemns me. Since your grace has been bestowed upon me, I have no other desire. Bhrigu is praising. The gods, including Brahma, are all embodied. They are all, by your illusion, unable to cross, and are sleeping in this body, which is like darkness, hidden by knowledge. They still don't understand that you are the inner soul in the beings in that body. You are a relative of the Sharanagathas. As much as you love yourself, you will love those who have taken refuge in you even more. Oh Brahma, all the gods are angry with the sins, you are the one who has the nature of tolerating sins, please forgive me. Brahma is praising. Oh Lord, your form is not visible to speech or mind. The living being can recognize the form, touch, and other things by the senses that perceive them, but you You cannot be. You are more than the senses that cause knowledge, more than the things that those senses perceive, more than the qualities of goodness, you are the other side. You are the refuge for all of them, more unique than this body, which is the form of nature's evolution, than the living being associated with the body. How can a nature that is distorted by nature, a distorted nature, perceive you? Indra is praising, Achyuta, your body is making the entire universe happy, it is giving joy to the minds and eyes. You have accepted this form for the establishment of Dharma. This body itself will destroy the unrighteous, who are like a mirror to establish that dharma. To remove unrighteousness, to protect righteousness, you, with eight arms, wielding eight weapons, are united. The Yajnapatis are praised. Pundarikaksha, this yajna (sacrifice) has been started by Daksha to worship you. Pashupati's guru, due to the anger within Daksha
He destroyed the sacrifice. This sacrificial ground, resembling a cremation ground, appears inauspicious. You purify it with eyes like lotuses. The saints are praising. Hey Bhagavan, without receiving your action, your action being without consistency, it will be surprising. You also do karma like us. That karma is the meritorious karma. Sinful deeds are similar to that. But that karmic consequence will not reach you. All the gods, including Brahma, who seek refuge in Lakshmi for their prosperity, that Lakshmi herself will be devoted to you. You will be indifferent, not looking at her with longing. Siddhas are settling here, Lord, your stories are like the nectar river, like the nectar river. Our mind, which has been tormented by suffering for so long, is burning, and due to that heat, having thirst, it has drowned in the nectar river of your stories, the wealth of Brahma As if we have forgotten the fire, that river is shining and making us dive into it. The master, being a dutiful wife, is praised here. Esha, welcome Srinivasa Please bless us. I salute you with this, just as a body without a head is not beautiful, how can a yagna be complete with many limbs when you are not there? You are Srinivasa, please bless us, who are your servants. The lauders sing. You are not visible to these skin cells. Only those who can see the Self can see you. Our eyes perceive only false things, but we cannot see the essence of the soul. He thinks he is the body. You are the cause of it. This body, which has transformed into a mirror, is under your control. You are omnipresent. The soul is atomic in nature. You are different from this nature and from the beings. In this body formed with the five elements, you are subdued like a living being. This is your wonderful act of grace. Yogis are praising thus, Lord, you are the soul of the universe. Can you enter the world that is conscious
You will remain the same, and you will adopt and administer it. You are different from the universe, but you don't seem different. I'm not sure about the loan. Therefore, beings think that they are different from you and independent. The relationship with you, the one who recognizes that he is the Brahmatema, the one who has no separate existence, there is no one dearer to you than him. Some people do not have the knowledge that you are the soul and they are the body. You, Swami, do not consider them as servants. You also bless such people with affection. Some of you have love that never fades away, that never asks for anything. You also bless such people with a full-hearted look You are the one who bestows grace, Swami. You are the one who performs the creation, preservation, and destruction of this world. Your will is the reason for doing so. Through that will, with the qualities of Sattva, Rajas, and Tamas, the nature attains the state of Tatvam and transforms into various kinds of bodies. That illusion, that nature, is like a body to you, it belongs to you, by which beings, gods, humans, etc., attain bodies. Join with the creatures that are there, and you too In the bodies of which they exist. You are the one who has the names and forms of those bodies, so that they continue until you. But because you are included in it, you will not have any other knowledge or extraordinary knowledge. The virtues that are the cause of that, the good qualities, are not for you. Your light will dispel the darkness. So you shine. Greetings to you. Brahma is praising, O Lord of all, you are the one with the quality of goodness as the foremost, you are the one without contact with the qualities of passion and ignorance, you are the one who does not cause faults, you are the one who creates dharma, wealth, desire, and delusion. I do not know your auspicious qualities, your form, your manifestations. You don't know the Vedas. The remaining wise men are without doubt. Agni is praising.
Oh, embodiment of knowledge, I shine because of your radiance. My radiance illuminates the world, the reason for its ability is the radiance filled in me. I am the one with the radiant light, offering the oblations offered to the gods like Indra. You are not the one who is worshiped by Indra and other forms through Yagnya. You are the form of fire for the five types. With the four-letter mantra 'Ashravaya', with the four-letter 'Astu Shraushat', with the two-letter 'Yaja', with the five-letter 'Ye Yajamahe', with the two-letter 'Vashat', by the yajus You are the one who is worshipped. With four arms, with two arms, with five arms, with four arms, with two arms, with equal Vishnu, be pleased, I pray. Salutations to you, who are worshiped by five kinds of sacrifices. And in the front, who else is praising, we will know that praise later in the podcast. Salutations to Asmadguru, Jai Srimannarayana.