ధ్రువ విమాన ఆరోహణ - దివ్య ధ్రువమండల మోక్షపదము
The Grand Ascent of Dhruva to the Absolute Planet
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, భగవంతుడైన శ్రీమహావిష్ణువు యొక్క దివ్య పార్షదులు బాల భక్తుడు ధ్రువుని ధ్రువలోకానికి తీసుకెళ్ళేందుకు విచ్చేస్తారు. ధ్రువుడు తన తల్లి సునీతికి మరియు మహర్షులకు సాష్టాంగ నమస్కారం సమర్పించిన పిదప, దివ్యమైన విమానమెక్కి ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణమవుతాడు. ఆ దివ్య విమానం పైకి సాగిపోతున్న సమయంలో, దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ, అచంచల భక్తితో పరమాత్మను మెప్పించిన ఈ బాల యోగికి జయజయ ధ్వానాలు చేస్తారు.
In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, we witness the glorious moment when Lord Vishnu's divine messengers arrive to escort the young devotee Dhruva to Dhruvaloka, the eternal and imperishable abode. Dhruva, humbled by grace and overwhelmed with devotion, first offers heartfelt obeisances to his mother Suniti and the assembled sages before boarding the magnificent celestial aircraft. As the luminous vessel ascends through the higher planetary systems, all the demigods shower flowers and sing praises, glorifying the unparalleled bhakti of this child-saint whose steadfast resolve conquered even the Supreme Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః సర్వేంద్రియ గుణ దృష్టే సర్వ ప్రత్యయ హేతవే అసతా ఛాయా యోక్తాయ సదా భాసాయ తే నమః సకల ప్రాణుల దేహములలో నుండు సకల ఇంద్రియములకు ఆ ఇంద్రియ విషములైన శబ్ద స్పర్శ రూపరస గంధములకు సాక్షిగా నుండు వాడవు మనసులో కలిగే సంకల్ప సకల సంకల్పములకు మూల కారణము నీవే. ఈ జగత్తులోని సత్ అసత్తులు నీ ఛాయా రూపములే. సజ్జనులకు మాత్రమే సాక్షాత్కరించు నీకు నమస్కారము. ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ 14th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 16వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మిదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షిణి యొక్క వృత్తాంతము, ధృవుని యొక్క వృత్తాంతము. పూర్తిగా మనం అనుభవించాం. ఇప్పుడు పృథు చక్రవర్తి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మైత్రేయుడు వర్ణించిన ధ్రువుడు వైకుంఠ స్థానమును అధిరోగించు వృత్తాంతమును విని భగవానుని యందు భక్తిభావం కలవాడై విదురుడు మరల ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ప్రచేతసులు అనువారు ఎవరు? వారు ఎవరి కుమారులు? ఏ వంశములో జన్మించినారు? వారు సత్రయాగమును ఎచ్చట చేసిరి? భగవత్ దర్శనమునకు ఉపాయమును ఎరింగిన మహా భాగవతుడు నారదుడు భగవత్ పరిచర్యా విధానమును అనగా క్రియా యోగమును వారికి ఎట్లు ఉపదేశించినాడు? యజ్ఞములచే ఆరాధింపబడువాడును యజ్ఞ ఫలమును వసంగువాడునగు భగవానుని వర్ణాశ్రమములకు తగిన యజ్ఞములచే ఆరాధన చేయవలెనని భక్తిగల నారదుడు చెప్పినాడు కదా. దేవర్షియగు నారదుడు ఆ ప్రచేతసులు చేసిన బ్రహ్మ సత్రమునందు ఏ ఏ భగవత్ కథలను చెప్పినాడో వాని నాకు పూర్తిగా వివరింపగోరుచున్నాను.
విషయాన్ని విదురుడు అడిగాడు. విదురుడు ఇట్లు అడగగా ధ్రువుని వంశములో జన్మించిన ప్రచేతసుల వృత్తాంతమును చెప్పుటకు ముందు ధ్రువుని వంశమును కీర్తించుచున్నాడు. ధ్రువుని కుమారుడు ఉత్కరుడు తండ్రి వనమునకు ఏగిన తరువాత అతడు సింహాసనమును అధిష్టించి రాజ్యమును పాలించుటకు అంగీకరింపలేదు. అతడు పుట్టిన దగ్గర నుండి రాగద్వేషములు లేని ప్రశాంత చిత్తము కలవాడు నిస్సంగుడు. విషయలోభము గల జనులతో కలియుట అతనికి రుచింపలేదు. లోకమంతయు భగవానునిచే ధరింపబడి నియమింపబడి అన్ని శరీరముల్లో వ్యాపించి ఉండి తన సంకల్ప రూప జ్ఞానముచే నడిపించుచుండునని అతడు ఎరిగినవాడు. జీవాత్మ ధర్మభూత జ్ఞానము కలదనియు ఆవరణము తొలగిన నాడు ఆ జ్ఞానము నిరదిశయమగుటచే ఆ ఆత్మయే బ్రహ్మము అని చెప్పదగినట్లు ఉండుననియు ఇది సుఖ స్వరూపమనియు శరీరములో నుండుననియు అతడు ఎరుంగును. ఆనందమను గుణమును గుణము కలదనియు అది నిత్యమనియు అతడు ఎరుంగును. ఎడతెగని యోగాభ్యాసముచే అగ్నిచే మాలిన్యము దహింపబడునట్లు అతని కర్మ నశించెను. ఆత్మ కంటే ఇతరమైన దేహమునకు సంబంధించిన వానిని అతడు తలంచిన వాడై ఉండెను. తలంచని వాడే ఉండెను. జడుని వలె బాహ్య విషయములను గూర్చిన బుద్ధి లేని వాడై జ్వాల అణిగిన అగ్ని వలె ఉండెడివాడు. బాలుర వలె తన గొప్పతనము ఎరుంగక ప్రదర్శింపవలెనని కోరిక లేక ఉండెడివాడు. మంత్రులు, కులవృద్ధులు మొదలగు వారందరూ అతనిని పిచ్చివానిగా తలంచిరి. అందుచే అతనిని రాజుగా చేయక భ్రమి అను భార్య యందు ధ్రువునకు జన్మించిన రెండవ కుమారుడగు వత్సరుని రాజుగా చేసిరి. వత్సరుడు శీల రూప గుణములచే అపురూపయగు స్వర్వీధి అను నామెను భార్యగా వివాహమాడెను. ఆమె యందు పుష్పార్ణుడు మొదలగు ఆరుగురు కుమారులు జన్మించిరి. పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అని వారి పేర్లు. పుష్పార్ణునకు ప్రభా, దోష అని ఇద్దరు భార్యలు. ప్రభా అను నామెను ప్రాతః మధ్యం దిన సాయం అను ముగ్గురులు కుమారులు. ప్రాతః మధ్యం దిన సాయం.
దోష అనునామకు ప్రదోష, నిషీధ, వ్యుష్ట అను ముగ్గురు కుమారులు కలిగిరి. వ్యుష్టునకు పుష్కరిణి అను భార్య యందు సర్వ తేజస్సు అనడి కుమారుడు కలిగెను. పై పేర్లు గ్రహ మండలముల గమనమునకు ఆధారమైన ధ్రువుని ఆధారమగు చేసుకొని తిరుగుచున్న కాలచక్రముచే ఏర్పడు రాత్రింబ వేళ్ళ స్వరూపము నిరూపింపబడినది. ధ్రువము అనగా కదలకుండా ఉండెడి ఇరుసు వంటిది. దానిపై చక్రము తిరుగుచుండెను. ఆ తిరుగుటకే భ్రమి అను పేరు. అనగా భ్రమణము. తిరుగుట అని అర్థం. ఇట్లు జ్యోతిష్ చక్రము తిరుగుటకు ఆధారమైన దంపతులను ధ్రువ, భ్రమి అను దంపతులుగా నిరూపించిరి. ఆ భ్రమికి ఇద్దరు కుమారులు ఉత్కలుడు, వత్సరుడు. కాలము యొక్క ప్రభావమును దాటినవాడు ఉత్కలుడు. జ్యోతిష్య చక్రమునకు వశపడి సంవత్సరం మొదలగు భాగములు కలది వ్యవహారంలో ఉన్న కాలము అదే వత్సరుడు. మొదటిది ఆ ఖండము అచట దినరాత్రి విభాగం ఉండదు. వత్సరాది విభాగం ఉండదు. రెండవ కుమారుడు వత్సరునకు స్వర్వీధి అనునామే భార్య అనగా గ్రహ నక్షత్ర తారకలు సంచరించడి మార్గము. దాని నుండే లోకమునకు కాల వ్యవస్థ ఏర్పడినది. ఆ దంపతులకు ఆరుగురు కుమారులు వారే ఆరు ఋతువులైరి. దీనిలో మరల పగలు రాత్రి అని రెండు విభాగములు ఏర్పడినవి. అవి వారి గమనము చేతనే వచ్చినవి. వారి పేర్లే ప్రభ, దోష, వెలుగు, చీకటి అని అర్థం. పగలు మూడు భాగములు, రాత్రి మూడు భాగములు. అవే వారి కుమారులు. ఈ విధముగా కాల స్వరూపం నిరూపించి కాలమే సర్వలోకమును అభివ్యక్తము చేయుచున్నట్లు సూచించుచున్నాడు. విష్ణునకు పుష్కరిణి యందు సర్వ తేజస్సు అనిటి కుమారుడు కలిగినని చెప్పిరి. ఆ సర్వ తేజస్సే జ్ఞాన స్వరూపమగు ఆత్మ. అతనికి ఆకూతి అనునామె భార్య.
ఆకూతి అనగా సంకల్పము. ఇది కలగగానే మనువు అనేటి కుమారుడు జన్మించెను. మనువు అనగా ఎరుక, ఎరుంగుట అని అర్థం. ఆ మను భార్య నడ్వల, ఆ మను పేరు చక్షువు. ఈ విధంగా సృష్టి ప్రారంభము నుండి మను వరకు ఎరుంగ చేసినాడు. ఈ చక్షువు అను మనువునకు నడ్వల అను భార్య యందు పురువు మొదలగు 12 మంది కుమారులు జన్మించిరి. పురువు, కుత్సుడు, త్రితుడు, జ్యుమ్నుడు, సత్యవంతుడు, రుతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముఖుడు అని ఆ 12 గురి పేర్లు. ఉలుమునకు పుష్కరిణి అను నామయందు ఉత్తములగు ఆరుగురు పుత్రులు జన్మించిరి. ఆంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అని వారి పేర్లు. అంగుని భార్య సునీధ. వారికి దుష్ట స్వభావము గల వేణుడు అను పుత్రుడు జన్మించెను. ఆ వేణుని దుష్ట స్వభావం వలన రాజర్షి అయిన తండ్రియగు అంగుడు దుఃఖితుడై పట్టణమును వదిలిపోయినాడు. అతని చెడు స్వభావమును భరించలేక మునులు తమ వజ్రము వంటి వాక్కుతో శపించిరి. అతడు చనిపోయెను. తమకు వంశము లేదని అతని కుడిచేతిని వారు మధించిరి. ఆ మధ్యకాలమునందు రాజు లేకపోవుటచే దుండగులు ప్రజలను పీడించిరి. అప్పుడు లోక రక్షణకై నారాయణుడే అతని కుడభుజము నుండి పృథ్వి అనే పేరుతో ఆవిర్భవించెను. అతడే మొదటి రాజు. అతడే గ్రామములు, పట్టణములు మొదలగు వానిని ఏర్పరిచెను. అతనిచే ఏర్పడినది కనుకని భూమికి పృథ్వి పృథ్వి. అను పేరు కలిగినది. వేణుడు దుష్ట స్వభావుడు అని విని విదరుడు ఇట్లు ప్రశ్నించుచున్నాడు. మహాత్ముడు బ్రహ్మజ్ఞాని, శీలనిధి, సజ్జనుడగు రాజునకు దుష్టుడగు కుమారుడు ఎట్లు కలిగెను? ధర్మమును ఎరింగిన మునులు ఏమి అపరాధము చేసినాడని వేణుని శపించిరి. ప్రజా పాలనము చేయు రాజునకు శాపము ఇచ్చుట ఉచితమా?
పాపం ఆచరించిన వాడైనను ప్రజాపాలకునిని ప్రజలు చంపరాదు కదా? రాజు తన తేజస్సుచే లోకములను భరించువాడు కదా? ఈ సందేహమును తీర్ప కోరుచున్నాను అని మైత్రేయుడు అడిగినాడు. ఆ ప్రశ్నకు జవాబుగా మనకు విషయాన్ని మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to all the gurus. The one who is seen by the qualities of all senses, the one who is the cause of all perceptions, the one who is the light of the unborn, the one who is always the light, salutations to them. To all the senses in the bodies of all living beings, to all the poisonous sounds, touch, form, taste, and smell Being a witness, you are the root cause of all the resolutions that arise in our minds. The good and the evil in this world are only your reflections. Greetings to the virtuous, who alone are able to be enlightened. Eighth Canto, Third Chapter, Fourteenth Prayer. Devotees of God, welcome to the fourth episode of Srimad Bhagavata Tattva Deepika, the 16th podcast. Until now, as part of the Midura Maitreya conversation, the story of Dakshi and the story of Dhruva. We’ve pretty much taken it for the most part. Now, let's learn about Prithu Chakravarti. Having heard the story of Dhruva, who was described by Maitreya, ascending the abode of Vaikuntha, and being filled with devotion to the Lord, Vidura is again asking thus. Who are the Prachetas? Whose sons are they? In which dynasty were they born? They performed the Satra yagam Where did you do it? How did Narada, the great devotee who knew the means to see God, teach them the method of God's service, that is, Kriya Yoga? Narada, who is devoted, said that one should worship the Lord, who is worshiped by sacrifices and who is the giver of the fruits of sacrifices, by sacrifices appropriate to the Varnaashramas, isn't it? I want to fully explain to you which divine stories Narada, the sage, narrated in the Brahma Satram performed by those Prachetas.
Vidur asked the matter. When Vidura asked this, before telling the story of Prachetas born in the lineage of Dhruva, he is praising the lineage of Dhruva. After Dhruva's son Utkara's father went to the forest, he did not agree to ascend the throne and rule the kingdom. From the time he was born, he had a calm mind without any likes or dislikes, he was detached. He did not like associating with people who were greedy. He who knew that the whole world is ruled by God, is appointed, pervades all bodies, and is guided by the knowledge of his will. That the soul has the knowledge of the dharma-bhuta, and that when the covering is removed, that knowledge becomes non-directional, and that the soul itself is Brahman, and that it is worth saying, and that it is a form of happiness, and that it is in the body, he will understand. He understands that the quality of bliss is a quality and that it is eternal. By unceasing yoga practice, his karma was destroyed as if it were being burned away by fire. He who considered the one related to the body other than the soul He was there. He was the one who didn't think. Like a fool, he was without wisdom regarding external matters, like a fire that has been extinguished. He was one who did not have the desire to show his greatness like a boy, without understanding it. Ministers, elders, and others considered him insane. Therefore, instead of making him king, they made Vatsaru, the second son born to Dhruva, the wife of Bhrami, the king. Vatsarudu married a woman named Swarvidhi, who was unique in her beauty and virtuous qualities. She was born with six sons, Pushparnudu and others. Their names are Pushparnudu, Tigmaketu, Ishudu, Urjudu, Vasuvu, Jayudu. Pushparnu had two wives, Prabha and Dosh. Prabha, Anu, and Namenu are three sons. Pratah, Madhyam, Din, Sayan.
Dosha, Anunamaku, Pradosha, Nishidha, and Vyushta, these three sons were born. Vyushtunaku, in his wife named Pushkarini, a son named Sarva Tejasu Anadi was born. The form of the nightly roots is proved by the time wheel that revolves, taking as its basis the Dhruva, which is the basis of the movement of the planets. A pivot is like a hinge that allows movement. A wheel was turning on it. The name of the movement is Bhramari. A rotation. It means to rotate. Thus, the couple who are the basis for the rotation of the astrological wheel were proven to be Dhruva and Bhrami. Bhrami had two sons Utkala and Vatsaru. The one who overcomes the effects of time is called an Utkaludu. The time in the transaction that is subject to the astrological wheel and has the beginning and ending parts of the year is the same as the benefic. The first is that the continent does not have day and night division. There is no annual division. The second son, Vatsaruna, is named Swarvidhi, meaning the path where the planets and stars travel. From that, the time system was established for the world. To that couple The six sons are the six seasons. It is divided into two parts, day and night. They came by the grace of God. Their names mean Light, Wickedness, Radiance, and Darkness. Day has three parts, Night has three parts. Those are her sons. In this way, by proving the form of time, time itself is indicating that it is expressing the entire world. They said that Vishnu had a son named Sarva Tejasu in the Pushkarini. That all-pervading light is the Self, the knowledge-supreme. His wife's name is Aakuti.
Aakoothi means determination. As soon as this happened, Manu, the son, was born. Manuvu is the Tamil word for man. That man's wife is Nadvala, that man's name is Chakshuvu. In this way, from the beginning of creation to man, he made it. In this Chakshuvu, Anu, Manu, and Nadvala, along with their wives, had 12 sons, including Puru. Puruvu, Kutsudu, Thritudu, Jyumnudu, Satyavanthudu, Rutudu, Vrutudu, Agnishtomudu, Atiratrudu, Pradyumnudu, Shibi, Ulmukudu, these are the 12 names. Ulumunaku, in the name of Pushkarini, six virtuous sons were born. Their names are Angudu, Sumanasudu, Khyati, Kratuvu, Angirasudu, Gayudu. Angun's wife is Suneha. They had a son named Venudu, who was of evil nature. Due to the evil nature of that Venu, Angudu, the father of the king, became sorrowful and left the city. Unable to bear his evil nature, the sages cursed him with their diamond-like words. He's dead. They crushed his right hand, saying that they had no lineage. In the meantime, the king The lack of it has led to the mischief of the mischievous people. Then, for the protection of the world, Narayana himself emerged from his four arms with the name Prithvi. He was the first king. He established villages, towns, and so on. The earth is the earth, because it was created by him. It has a name. Vedarudu, hearing that he is wicked, is questioning like this. How did a wicked son, born to a king who is a great sage, knower of Brahman, treasure of virtue, and a good person, arise? The sages who knew Dharma cursed Venu, saying what crime had he committed? Is it appropriate to curse a king who rules the people?
Even though he was a sinner, shouldn't the people kill the king? Isn't it the king who bears the world by his splendor? I am asking for clarification on this doubt, said Maitreyi. As an answer to that question, let's find out the matter in another podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.