పృథు చక్రవర్తి శత అశ్వమేధ యజ్ఞ సంకల్ప వైభవము

King Prithu's Performance of Horse Sacrifices

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, ధర్మపరిపాలకుడైన పృథు చక్రవర్తి నూరు అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించాలని సంకల్పించిన వైభవాన్ని శ్రద్ధగా తెలుసుకుంటాం. ఆ యజ్ఞ మహిమకు సాక్షాత్తు భగవంతుడే సంతుష్టుడై దివ్యంగా అనుగ్రహించాడు. అయితే, స్వర్గాధిపతి ఇంద్రుడు పృథు చక్రవర్తి మహిమను సహించలేక వందవ యజ్ఞానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు, ఈ ఘటన భక్తి, ధర్మం మరియు దైవానుగ్రహం యొక్క గొప్పతనాన్ని మనకు స్పష్టంగా చాటిచెప్తుంది.

In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, we explore the magnificent resolve of Emperor Prithu to perform one hundred Ashwamedha Yagnas, a feat that even rivaled the glory of Indra, the king of the heavens. The Lord Himself, pleased by Prithu's righteous rule and unwavering devotion, graced the sacrificial arena, making this yajna a truly divine occasion. We witness how Indra, overcome with jealousy, attempted to obstruct the hundredth sacrifice, revealing the profound spiritual and cosmic significance of Prithu's extraordinary undertaking.

← Prev Next →
King Prithu's Performance of Horse Sacrifices bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వ తను భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృషే భగవతే బృహతే నమస్తే ఓ దేవా నీవు నిత్య ముక్తుడవు. అతిశయించిన దయగల నీవు నా వంటి శరణు వేడిన అజ్ఞానుల సంసార బంధమును విడిపించెదవు. వినాశ రహితుడవు అంతర్యామివి అగు నీవు దేహధారులందరి అంతఃకరణములయందు అనుభవునకు వచ్చే అంతరతమమగు. చైతన్యము రూపముగా ప్రకటమగుచున్నావు. పూర్ణమగు ఈశ్వర భావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనే ఆరు ఐశ్వర్యులు గల నీవు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు. ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ 17th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 22వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజు యొక్క పృథురాజుకు భగవంతుడు చేసిన ఉపదేశాన్ని మనం అనుభవించాం. తరువాత జరిగే కథను తెలుసుకుందాం. భగవానుడు ఆదేశింపగా పృథువు సర్వేశ్వరుని ఆజ్ఞను శిరసా స్వీకరించెను. ఆయన పాదములపై పడి నమస్కరించెను. అచట నిలిచి ఉన్న ఇంద్రుడు తన అశ్వమును అపహరించితినని సిగ్గుతో ప్రేమతో పృథువు పాదములపై పడి నమస్కరించెను. పృథువు ఆ ఇంద్రుని పైకి లేవనెత్తి కౌగలించుకొని అతనిపై ద్వేషమును వీడి ఉండెను. భగవానుడు పృథ్వు చేసిన ఆరాధనను స్వీకరించి అతని భక్తికి చాలా సంతోషించి. వెడలిపోవుటకు సిద్ధపడెను. కానీ ఆ రాజునందు గల అనుగ్రహముచే సత్పురుషులకు సుహృత్ అగుటచే తన పుండరీకముల వలె విశాలముగు నేత్రములతో చూచుచు నిలిచి ఉండెను. బయలుదేరలేకపోయెను. అది రాజకు పృథ్వి చేతులు జోడించి నిలచి కళ్ళనీరు నిండుగా భగవానుని చూడలేక మాట్లాడలేక భగవాను మనస్సులో నిలుపుకొని ఆలింగనము చేసుకొని మౌనముతో నిలిచి ఉండెను.

కొంతసేపట్లు నిలిచి తన కన్నీటిని తుడుచుకొని ఎంత చూసినను తృప్తి తీరక ఆ పరమ పురుషుని చూచుచుండెను. అతడు పాదములు నేలపై మోపి నిలచి గరుత్మంతుని వీపుపై చేయి అనుకొని నిలుచి ఉండెను. ఆ భగవానుడితో పృథ్వు ఇట్లు మాట్లాడెను. ప్రభు, నీవు బ్రహ్మాదులకు కూడా నియామకుడవు. నీవు అందరికీ కోరిన కోరికలను వసంగు వాడవు. పొందవలెనని కోరెడి అర్ధకామములు నశ్వరములను ఎరింగినవాడు ఎట్లు నిన్ను వరములు కోరగలడు? ఈ అర్ధకామములు నరకములోనున్న దేహులకు కూడా ఉండునో అట్టి క్షుద్రమైన వరములను నేను కోరజాలను. నీవు మోక్షమును వసంగ గలవాడవని నేను ఎరుంగుదును. కానీ మోక్షము భగవానుని సంబంధమును వీడి ఆత్మను మాత్రమే. అనుభవించుచు ఉండెడిది అయినచో నాకు వలదు. కేవలం ఆత్మానుభావము నాకు అక్కరలేదు. మహానుభావులగు భాగవతులు నీ గుణానుభూతిచే హృదయము నుండి ఆ గుణములను కీర్తించుచుందురో అట్టి భగవత్పాదారవింద మకరందము పానము చేయు భాగ్యము కలిగింపుము. నీ గుణములనే భాగవతులు ప్రేమతో పలికిన వానిని వినుటకు తగినట్లు వేల వేల చెవులను నాకు సంగుము. భగవద్గుణములు అనంతములు. నీ భక్తులు ఆ గుణములను అనుభవించి. హృదయము నుండి నోటితో పలుకునప్పుడు అనంతములగు గుణములను వినుటకు అనంతములగు చెవులను నాకు సంగుము. అట్టి గుణానుభవము లేని ఆత్మానుభవము నాకు వలదు. నీ గుణానుభవము చేసి పరవశించి పలికెడి భక్తుల ముఖము నుండి వెలువడిన ఆ అమృత స్పర్శచే ప్రసరించిన వాయువునైనను చాలు. తత్వ మార్గమును మరచిన కుయోగులకు కూడా ఆ వాయు ప్రసారం ఒక్కసారి నీ పాదారవింద స్మరణను కలిగింపజాలును. అట్టి భాగవత సహవాసముతో వారి ముఖముల నుండి వెలువడిన గుణానుభవామృతమును ఆస్వాదించునట్లు వరమున సొంగుము. స్వామి, నీ కీర్తి పరమ శోభనము. సత్పురుషులతో కలిగినప్పుడు అప్రయత్నముగా ఒక్కసారి అయినను నీ కీర్తిని విన్నచో కీర్తియు మంగళము ఎల్లప్పుడూ కలుగుచుండును. అట్టి నీ కీర్తిని ఒక్కసారి వినినవాడు పాపి అయినను వాడే సారమును ఎరింగినవాడు జ్ఞానహీనమగు పశువు వలె. శరీర పోషణనే కోరినవాడు ఎవ్వడైనను నీ గుణ శ్రవణమునే మరల మరల వినవలెని కోరడు. అందరి చేతను కోరబడెడి లక్ష్మీదేవి నీ గుణముల యందు ఉండెడి ప్రీతి చేతనే నిను వరించినది. పురుషోత్తమా నీవు తప్ప ఇతరులు బద్ధులలో గాని ముక్తులలో గాని

నిత్యులలో గాని కళ్యాణములు గలవారు లేరు. నీవు పురుషోత్తముడవు. లక్ష్మీదేవి అందుచేతనే ఇతరులను విడిచి నిన్ను వరించినది. సర్వజ్ఞత్వాది గుణములకు నిలయమైన వాడవు. అందుచే నేను కూడా నీ పాదముననే భక్తితో సేవించి వాడనగునట్లు అనుగ్రహింపుము. నీ పాదములు అపరిచ్ఛిన్నములు కనుక ఎందరు సేవించినను సేవింపదగినవే. ఒకరు అనుభవించిన దానిని రెండవ వారికి అవకాశమును వసంగ జాలినవి కావు. కావున నీ పాదములు సేవింపవలెనని కోరెడి లక్ష్మికిని నాకును కలహము రాదు. ఇంతకాలము నేను యజ్ఞాది కర్మలను ఆచరించినాను. అది సంసారమనడి అనర్థ ఫలమునే వసంగును. అట్టి అసారమైన యజ్ఞాది కర్మలు నేను ఆచరించినను దానిని ఆరాధనగా చేయునట్లు నాలో ఉండి చేయించి. తుచ్ఛమగు యజ్ఞమును అనంత స్థిర ముక్తి ఫల సాధనముగా చేసినావు. నీవు దిన వత్సలుడవు. నిన్ను సేవించడి వారి దోషములను చూడని వాడవు. పశువుల కొరకు, పుత్రుల కొరకు, స్వర్గాది ఆముష్మిక ఫలముల కొరకు యజ్ఞాది కర్మలు చేయవలెనని. వేదము చెప్పుటచే వాని యందు ఆశతో చేయుచున్న వారలను చూచి నీవే వారికి ఆ ఫలములందు ఆశను తగ్గించి పూర్ణ ఫలమగు మోక్షమును ప్రసాదించుచున్నావు. నీవు స్వస్వరూపముననే ఆనందించు స్వాత్మారాముడవు. నీకు సకల లోక జననియగు లక్ష్మితో ప్రయోజనమేమియు లేదు. ఆమెను అనుగ్రహించుటకు ఆమెచే సేవింపబడి ఆమెను ప్రేమించుచున్నావు. కొంతమంది కేవలం కర్మలను ఆచరించుచుందురు. కర్మలచే ఐహికములను ఆముష్మకములగు ఫలములను పొందుచుందురు. మరికొందరు కోరికలు లేని వారై ఆత్మ యాధాత్మ జ్ఞానము పొంది దేహమే ఆత్మ అనేటి భ్రాంతిని ఆత్మ స్వతంత్రం అనేటి భ్రాంతిని తొలగించుకొని నిరతిశయానంద రూపమగు ఆత్మనే పొంది ఉందురు. కానీ సత్పురుషులు నీ పాద ధ్యానము కంటే మరియొక దానిని ఫలముగా వాంచింపరు. నిత్యము, నిరతిశయము, అనంతమునగు భగవదానందములో ఒక తుంపర వంటిది కేవలాత్మానుభవము. అందుచే సత్పురుషులలో నీ చరణ స్మరణమనెడి సముద్రమునంది మునుగుచుండవలెనని కోరుచుందురు. దానికంటే ఇతరమైన దానిని దేనిని వాంచింపరు. నిన్ను భజించుచున్న నన్ను వరమును కోరుకొనుమని నీవు చెప్పుట మోహమును కలిగించుచున్నది.

ఆ మాట విషముతో కూడిన పాలను త్రాగుమని వసంగినట్లున్నది. నిన్ను సేవింపక సంసారములో పడి ఉండి అదృష్ట వశమున నిన్ను సేవింప లభించిన వారిని మరల వరమునొసొంగుదునని లోభపెట్టి సంసారమున పడద్రోయుట ఉచితము కాదు. పాశము వలె నీ వాక్కు బంధించును. వేద వాక్కులు ఫలమునందు ఆశ చూపి కర్మలను చేయునట్లు చేసి బంధమున పడద్రోయుచున్నవి. ఫలాశ లేని వాడై ముముక్షువు అయినవాడు మరల ఫలములకు ఆశపడి కర్మలయందు ప్రవర్తించుట సంభవింపదు. ఆత్మ పరమాత్మ జ్ఞానము లేనివాడు అదృష్టవశమున నిన్ను చేరి శవించు భాగ్యము లభించియు నీకంటే వేరైన అర్థమును కామమును ఆశించినచో మరల్ నీకు దూరమగును. నీవు స్వామివై యుండి కాపాడవలసినది పోయి నీవే మమ్ములను ఆశగొలిపి నీకు దూరము చేయుట తగదు. తెలివితక్కువ పిల్లవానిని తండ్రి ఎట్లు దిద్దుబాటు చేయునో అట్లే నీవు నాకు ఏది మేలు కలుగునదో దానిని నెరవేర్పుము. ఈ విధంగా ఆది రాజగు పృథ్విచే స్తుతింపబడిన వాడై పృథ్వితో ఇట్లనెను రాజా నీకు నాయందు స్థిరమగు భక్తి కలువు కాక అదృష్టవశముచే నాయందు నీకీ బుద్ధి కలిగినది. దానిచే దారుటకు శక్యము గాని మాయను జయించినావు. నీవు చెప్పినట్లు నీవు నేను చెప్పినట్లు నీవు ధర్మ రక్షణము చేయుచు ప్రజాపాలనము చేయుము. నా ఆజ్ఞను పాలించు వారు మంగళమునందును. ఇట్లు రాజర్షియగు పృథువునకు అనుగ్రహము సంగి అచ్యుతుడు వెడలిపోవుటకు సిద్ధపడెను. అతని వెంట వచ్చిన దేవతలు, ఋషులు, గంధర్వులు మొదలగు వారందరు అతనితో పాటు వెడలిపోవుటకు సిద్ధపడిరి. భగవానుడితో వచ్చిన వారందరిని కూడా భగవదాత్మకులుగా భావించి పృథువు మాటలతోను ధనముతోను సంస్కారముతోను ఆరాధించెను. భగవానుడు బయలుదేరి విడలగనే వాని వారందరు విడలిరి. కంటికి గోచరము గాని భగవానుడు కంటికి కనబడి అనుగ్రహించినందుకు ఆనందించి పృథువు తన పట్టణమునకేగెను. పృథువు వెనక్కి వచ్చుతున్నాడని విని రాజభవనమును అలంకరించిరి. ముత్యముల హారములతో, పుష్పాహారములతో, పట్టు వస్త్రములతో, స్వర్ణ తోరణములతో పరిమళములు గల అగరు ధూపములతో రాజభవనమంతయు అలంకరింపబడెను. రాజమార్గమంతయు చందన, అగరు, జలములతో తడుపబడెను. దానిపై పుష్పములను, అక్షతలను, లాజలను చల్లిరి. మార్గములో అరటి చెట్లు, పోక చెట్లు నాటిరి.

మామిడి తోరణములు మాలికలుగా కట్టిరి. మంగళమునకై దీపములను, కానుకలను, మంగళ ద్రవ్యములను పట్టుకొని అలంకరించుకొని కన్యలు ఎదురేగిరి. శంఖములు, దుందుబులు మృగుచుండెను. పృత్విక్కులు వేదమును చదువుచుండిరి. పృథువు వానన్నిటిని చూచుచు వినుచు తన గొప్పదనం అని భావించి అహంకరించక భవనములో ప్రవేశించెను. మహా కీర్తిశాలియగు పృథువు మార్గములలో తనను పూజించిన వారినందరినీ పూజించెను. పౌరులను, జానపదులను ప్రీతితో వారికి తగినట్లు ఆదరించెను. ఈ విధముగా ప్రశంసనీయమగు కార్యములను చేయుచు మహానుభావుడగు పృథువు విస్తారము కీర్తి లోకమంతై వ్యాపించినట్లు భూమండలమును పాలించి పరమ పదమునకేగెను. ఈ విధంగా మైత్రేయుడు విదురునకు గుణవంతులకు పెద్దలచే గౌరవింపబడిన పృథువు చరిత్రను వివరించెను. విదురుడు ఆ పృథువు చరిత్రను ఇంకను వినగోరి ఆ పృథువు చేసిన ప్రశస్తము కర్మలను ఉపదేశింపవలసినదిగా మైత్రేయుని కోరినాడు. మరి పృథ్వు చేసినటువంటి ఆ కర్మలు ఏమిటివో మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Gurus. For the liberation of those who have surrendered like me, for the liberated one, for the great compassion, for the salutations to Nolaya, for the self-controlled, for the all-encompassing, for the all-seeing, for the enlightened one, for the one who is remembered by all, O Lord, for the one who is eternally liberated. Oh, exceedingly merciful one, you liberate the worldly bonds of the ignorant who seek refuge in me. You are the one without destruction, the inner self. You are the inner self that comes to experience in the inner hearts of all embodied beings. You are manifesting as consciousness. You, who have the complete divine feeling, energy, fame, glory, knowledge, and detachment, are beyond the limitations of time, space, and objects. Many salutations to you. Eighth Canto, Third Chapter, 17th Prayer. Devotees of God, welcome to the fourth episode of Srimad Bhagavata Tatva Deepika, in the 22nd podcast. Until now, as part of the conversation between Vidura and Maitreya, we have experienced the teachings given by God to Prithu Raja. Let's go watch the rest of the movie. When the Lord commanded, Pruthuvi accepted the order of the Lord of all. He fell at his feet He bowed down. Indra, who was standing there, with shame and love, fell at the feet of Pruthuvu and bowed down. Pruthuvu lifted Indra up, embraced him, and abandoned hatred towards him. The Lord accepted the worship offered by Prithu and was greatly pleased with his devotion. He was ready to leave. But by the grace of that king, being a friend to the virtuous, he stood with his wide eyes, watching like his lotus-like eyes. He could not leave. That king, joining his hands to the earth, stood with tears filling his eyes, unable to see the Lord, unable to speak, keeping the Lord in his mind, embracing, stood silently.

After standing for some time, wiping away her tears, no matter how much she looked, she was not satisfied and kept looking at that supreme being. He stood with his feet planted on the ground, his hand resting on Garuda's back. Prithu spoke to the god. Oh Lord, You are also the ruler of the Brahmas. You are the one who fulfills the desires of all. How can one who knows the desires and impermanent things that one desires to obtain ask for boons from you? I do not desire such petty boons, which may also be for the bodies in hell. I know that you are the one who grants salvation. But liberation is only of the soul, abandoning the relation to the Lord. If it is something that can be experienced, then I don't need it. I don't need spirituality. Oh, great devotees, by the experience of your virtues, will you praise those virtues from your hearts? Grant us the fortune to drink the nectar of the lotus feet of the Lord. Oh, Bhagavatas, who speak of your virtues with love, grant me thousands of ears to listen. The virtues of God are infinite. Your devotees Experience the virtues firsthand. When I speak from my heart with my mouth, grant me ears to hear infinite qualities. I do not need that kind of experience, the experience of the self. Having experienced your virtue, and being ecstatic, even the air that spreads from the faces of devotees, that which emanates from the touch of that nectar, is enough. Even for those who have forgotten the path of philosophy, that air transmission can once remind you of the remembrance of your lotus feet. It is like a boon to enjoy the nectar of the experience of virtues that emanated from their faces with the association of Bhagavata. Oh, Lord, your glory is supremely splendid. When you are with good people, if you hear of your fame even once effortlessly, fame and auspiciousness will always be with you. He who hears of your glory once, even if he is a sinner, he who understands its essence is like an ignorant animal. He who desires nourishment of the body, no one desires to listen to your qualities again and again. Lakshmi Devi, who is desired by everyone, has married you because of the love she has for your virtues. Oh, Supreme Being, except for you, others are bound But in the muktu

There are no weddings among the eternal ones. You are the Supreme Being. Lakshmi Devi, therefore, abandoned others and chose you. You are the abode of all perfections. Therefore, I too, with devotion, serve and worship at your feet, so please grant me that. Your feet are unblemished, therefore, no matter who serves, they are worthy of being served. What one experiences, the opportunity for another is not something that can be ensured. Therefore, there will be no conflict between Lakshmi, who desires to serve your feet, and me. "For this long I've observed the rituals of the Yajna. That is, it will lead to the fruit of the misfortune called family. Even though I have performed such useless sacrifices, make me do it by being in me as if I am worshiping it. You have made a worthless sacrifice as a means of achieving infinite and permanent liberation. You are a daydreamer. You are the one who does not see the faults of those who serve you. For cattle, for sons, for heavenly and otherworldly fruits, one should perform sacrifices and other rituals. Seeing those who are doing it with hope in him by telling the Vedas, you yourself reduce their hope in those fruits and make it a complete fruit You are bestowing salvation. You are the Self, blissful in your own form. You have no benefit from Lakshmi, the mother of all the worlds. You love her, you are serving her, you are serving her. Some people just perform rituals. Through karma, they obtain worldly possessions and the fruits of actions. And some, having no desires, having attained self-knowledge, having dispelled the delusion that the body is the self, the self is independent, having attained the self, which is the form of unconditioned bliss. But the saints do not desire another fruit than the meditation of your feet. In the eternal, infinite, and boundless bliss of God, Kevalaatmanubhava is like a blink. Therefore, among the virtuous, they wish to be immersed in the ocean of remembrance of your feet. Nothing else is worthy of being desired. You are saying that I, who worship you, should ask for a boon, which is causing delusion.

It is as if the word is instructing to drink poisoned milk. It is not appropriate to deceive and destroy someone who has fallen into family life, thinking that they will be blessed again to serve you without serving you, and to be in family life. Your tongue is like a rope that binds. The Vedic words show hope in the fruit, make one do actions, and are preventing bondage. He who is without the fruit, being a seeker of liberation, will not again desire fruits and will not act in karmas. One who does not have the knowledge of the soul and the supreme soul, even if he is fortunate enough to reach you and attain the fortune of dying, if he desires a different meaning and desire, he will be far from you. You, being the Lord, should protect what needs to be protected. Going and enticing us with hope and keeping us away from you is not appropriate. Just as a father corrects a foolish child, so do you fulfill what is good for me. In this way, having been praised by Adi Raja, the earth said to the earth, O king, may you have steadfast devotion to me, but by chance, you have this understanding of me. It is impossible to overcome that illusion You have won. As you said, as I said, you protect Dharma and govern the people. Blessed are those who obey my commands. Thus, the king, Prithu, was blessed, and Achyuta prepared to leave. The gods, sages, gandharvas, and others who came with him were all ready to leave with him. Considering all those who came with the Lord as divine souls, he worshiped Pruthuvu with words, wealth, and culture. The Lord departed and all of them separated. Pleased that the Lord appeared to him, visible to his eyes, Pruthuvu went to his city. Hearing that Prithu was coming back, they decorated the palace. The entire palace was decorated with fragrant incense, with pearl necklaces, flower garlands, silk clothes, and golden decorations. The royal road was strewn with sand, gravel and water. Flowers, akshata (rice), and laja (crisps) were sprinkled on it. Banana trees and jasmine plants were planted along the path.

Mango garlands are tied in a chain. The virgins went out, having held lamps, gifts, and aromatic substances for the auspicious rite. The conch and the drums are being played. The Pruthvikas were the ones who recited the Vedas. Pruthuvu, seeing and hearing all the rain, considering his greatness, entered the building without being arrogant. The great glorious Prithu worshiped all those who worshiped him in the paths. He/She lovingly cared for the citizens and the common people according to their needs. Thus, doing commendable deeds, the great Prithu, extending his fame throughout the world, ruled the earth and attained the supreme position. In this way, Maitreyi explained the history of Pruthuvu, who was honored by the elders and virtuous. Vidurudu, wishing to hear the history of that Pruthuvu, requested Maitreya to teach him the glorious deeds and actions done by that Pruthuvu. And what are the deeds that Prithu did, we will learn in another episode. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha