శ్రీ పృథు చక్రవర్తి పట్టాభిషేక వైభవ మహోత్సవము

The Coronation and Grand Installation of King Prithu

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, భూమిపై మొట్టమొదటి అభిషిక్త చక్రవర్తిగా పృథు మహారాజు పట్టాభిషేక వైభవాన్ని మనం దర్శిస్తాము. మహర్షులు, దేవతలు మరియు సమస్త దివ్యప్రాణులు ఈ మహోత్సవంలో పాల్గొని పృథు చక్రవర్తిని స్తుతించారు. స్వయంగా భగవంతుడు ఈ శుభకార్యాన్ని అనుగ్రహించగా, సమస్త విశ్వం ఆనందంతో పరిపూర్ణమైంది. భగవత్ సంకల్పంతో సింహాసనమెక్కిన రాజు ఎలా సమస్త జీవుల శ్రేయస్సుకు దైవీయ సాధనమవుతాడో ఈ ఘట్టం అద్భుతంగా వివరిస్తుంది.

In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, we witness the magnificent coronation of King Prithu, the first consecrated monarch of the earth, whose divine installation was celebrated by the greatest sages, demigods, and celestial beings. The Lord Himself blessed this grand occasion, and the entire universe rejoiced as Prithu ascended the throne with unparalleled glory and righteousness. This episode beautifully reveals how a God-realized ruler becomes an instrument of divine grace for the welfare of all living beings.

← Prev Next →
The Coronation and Grand Installation of King Prithu bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయానం వచసానిరుక్తం నమామహేదేవ వరం వరేణ్యం అఖండ సచ్చిత్ స్వరూపుడగు ఈశ్వరుని యందు వికారములు ఏమియు లేవు. జగత్ కారణుడగు ఆయన కాలమునకు అతీతుడు. ఆయన సకల ప్రాణుల హృదయ గుహయందు ఆత్మరూపముగా ప్రకటమగుచున్నాడు. ఆయన నిరవయువడు. ఆయన స్వరూపము సుతరాము ఊహకు అందేది కాదు. వాక్కుతో నిర్వచించేది కాదు. మనస్సు ఎంత వేగము గలదైనా ఆయన స్వరూపమును అందుకోలేదు. సర్వోత్కృష్టుడు దేవ నాయకుడగు ఆ శ్రీహరికి మేము నమస్కరించుచున్నాము. ఎయిత్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్ 26 ప్రేయర్. భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము. 20వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజును వందిమాగధులు కీర్తిస్తున్నారు. కీర్తించిన తర్వాత విదురుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అసలు గాయ ఆవు రూపం లోపల ఎందుకు భూమి వచ్చింది? ఎందుకు గోరూపాన్ని దాల్చింది? మరి ఎలా పృథువును పృథువు ఆ యొక్క రాజ్యాన్ని ఉద్ధరించాడు. ఆ విషయాలన్నీ కూడా చెప్పమని అడుగుతున్నది. మైత్రేయుడు ఇలా వివరంగా చెప్తున్నారన్నమాట. బ్రాహ్మణులందరూ పృథువును ప్రజాపాలకుడుగా పట్టాభిషేకం చేసినారు. కానీ భూమండలమంతయు అన్నము లేక ఆకలితో బాధపడుచుండే. ప్రజలు కృశించి శరీరములతో పృథువు వద్దకు వచ్చి ఇట్లు మొరపెట్టిరి. ఓ ప్రభు తొర్రలో ఉన్న నిప్పుచే చెట్లు కాలిపోవుచున్నట్లు మేము జఠరాగ్నిచే తాపము నొందుచున్నాము. బ్రాహ్మణులందరూ వేనునని

శరీరము నుండి నిన్ను ఆవిర్భవింపచేసి మాకు రక్షకుడుగా ఏర్పరిచినారు. నీవే రక్షింప సమర్ధుడవని నిన్ను రక్షకుడుగా చేరినాము. అన్నము లేక మేము నశింపకముందే ఆకలితో అలమటించుచున్న మాకు అన్నము సంగు ప్రయత్నము చేయుము. నీవు మాకు జీవనమును ఏర్పరచడి పాలకుడవు, నీవే లోకపాలకుడవు. అందుచేత మమ్ములను కాపాడతగునని ప్రార్థింపగా. వారి విలాపమును విని పృథ్వు చాలాసేపు ఆలోచించాడు. వీరికి ఆహారమును కల్పింపవలెని నిశ్చయించుకొనెను. ఇల్లు ఎక్కుపెట్టి రుద్రుడు త్రిపురములపై ఆగ్రహించినట్లు భూమిపై కోపముతో బాధింప సమకట్టెను. అతనికి అతని కోపమును ప్రయత్నమును చూచి భూమి వెనకెను. వేటగాడు వెంటాడుచుండగా లేడి పరిగెత్తునట్లు భూమి గోరూపమును దాల్చి పారిపోసాగెను. కోపముతో పరిగెత్తిన అటువైపు దాన్ని వెన్నంటెను. అది ఏ దిక్కులకు వెళ్ళినను అక్కడికక్కడ విల్లునెక్కుపెట్టి పృధు కనపడుచుండెను. జన్మించిన వారు ఎట్లు మృత్యువు నుండి తప్పించుకొనలేరో అట్లే పృథ్వు నుండి గోరూపము ధరించిన భూమి తప్పించుకొనలేక బాధపడుచున్న మనసుతో వెనకకు మరలెను. పృథ్వుతో ఇట్లు అనుచుండెను. ధర్మజ్ఞా, నీవు భూతములను పరిపాలించువాడవు. నన్ను కూడా కాపాడుము. ధర్మజ్ఞుడవు కదా, ఏ పాపము ఎరుగని దీనురాలనగు నన్ను స్త్రీ అని దయ తలచక. చంపుటకేలా ఉద్యమించుచున్నావు? సాధారణముగా కారుణ్యము, వాత్సల్యము కలవారు అపరాధము చేసిననాడు కూడా స్త్రీలను చంపుటకు ఉద్యమించరు. నేను నౌక వలె ప్రజలను ఈ జలములలో ధరించి రక్షించుచున్నాను. నన్ను నీవు లేకుండా చేసినచో ఈ ప్రజలు ఆధారము లేని వారై నీటిలో పడిపోవుదురు. నీవు నిలుచుటకు కూడా ఆధారముగా ఉండవలెను కదా? అందుకే నన్ను కాపాడుము అని భూమి ప్రార్థించెను. పృథువు ఇట్లు పలుకుచున్నాడు. ఓ వసుధా, నీవు నా శాసనమును అతిక్రమించినావు. అదే నీవు చేసిన అపరాధము. అందుచే నిన్ను చంపెదను.

నీకు యజ్ఞములో మేము భాగము వసంగుచున్నాము. దేవతా రూపముగా నీవు యజ్ఞ భాగమును స్వీకరించుచున్నావు. దానికి బదులుగా నీవు వసంగవలసిన ధాన్యాదులను మాకు వసంగుట లేదు. నిత్యము పెట్టెడి మేతను అంతను మేయుచు పాలు ఇయ్యకుండా ఎగచేపుచున్న గోవును శిక్షింపక తప్పదు కదా? ఈ సకల భూతములకు జీవనమునకై కల్పాది యందు బ్రహ్మ ఔషధీ బీజములను నీలో ఉంచినాడు. వాని నుండి నీవు ఔషధులను బయల్పరిచి లోకులకు ఆహారము కల్పింపవలెను. నీవు బుద్ధిహీనురాలవై నన్ను అవమానించి చేయవలసిన పనులను చేయకున్నావు. ఆకలితో ప్రజలందరూ అలమటించుచున్నారు. వారి దుఃఖమును ఉపశమింపచేతును లోకములో పురుషుడైనను, స్త్రీ అయినను, నపుసకుడైనను తనను తాను పొగడుకొనుచు అధముడై ఇతరుల యెడ దయలేక వర్తించువాడు వధింపదగినవాడే కానీ రక్షింపదగినవాడు కాదు. నీవు మాయచే గోవుగా మారినావు. నీవు లేనిదే ప్రజలను నేను నిలబెట్టుటకు ఆధారము లేదని నీవు గర్వించుచున్నావు. అందుచే నిన్ను నూగింజలంత చిన్న శకలములుగా వధింతును. ఆధారముగా నీవు లేకున్నా నా యోగశక్తిచో ప్రజలను ప్రజలందరిని నిలిపెదెను అని తీవ్రమగు కోపముతో మృత్యువే రూపు దాల్చినదా అన్నట్లు పృథు చక్రవర్తికి ఉన్నటువంటి ఆ పుత్తు చక్రవర్తికి భూమి నమస్కరించి గడగడ వణుకుచు ఇట్లు పలికెను. భూమి ఇట్లు స్తోత్రము చేయుచున్నది. పరమ పురుషుడవగు నీకు నమస్కారము. నీ శరీరముగా విడదీయుటకు వీలు కాకుండా నీతో చేరి ఉన్న ప్రకృతిచే ఈ జీవ శరీరమును సృష్టించిన వాడవు నీవు. జీవుని ద్వారా ప్రకృతిలో చేరి సత్యాది గుణములు గలవాడుగా కనపడుచున్నావు. నీవు ప్రకృతి పురుషుల శరీరము కలవాడవయు వానికంటే వేరుగా ఉండడివాడవు. నిన్ను గూర్చిన జ్ఞానము నీకు పూర్తిగా ఉండుటచే దేహములయందు ఆత్మ భ్రమ దేహములు చేయు క్రియలను తానే చేయుచున్నాననెడి భ్రమ నీకు ఉండవు.

ఆ భ్రమలచే జీవులకు ఆకలి, దప్పి, శోకము, మోహము, ముసలితనము, మరణము తానే చెందుచున్నట్లు అనిపించుచుండును. అట్టి ఊర్ములు అనబడెడి ఆరును నీకు ఉండవు. బ్రహ్మలో నీవు అంతర్యామివై ఉండి జీవులకు శరీరములను సృష్టింపచేసి ఆ జీవులు ఉండుటకు ఆధారముగా నన్ను సృష్టి చేసితివి. నా యందే గుణమయమగు ప్రకృతి దాని పరిణామములు నిలిచి ఉన్నవి. అట్టి సృష్టికర్తవు నీవే కదా? నీవు స్వతంత్రుడవు. నీవే విల్లు ఎక్కుపెట్టి చంపుటకు వచ్చినచో నన్ను రక్షించుటకు నీకంటే వేరొకరు ఎవరున్నారు? నీవు ఈ చరాచరమగు జగత్తును రక్షించుటకై వచ్చిన వాడవు కానీ సంహరించుటకు వచ్చిన వాడవు కావు. నీ కర్తవ్యము ప్రజాపాలనము. నేను లేనిచో ఈ ప్రజలకు భోగ్య వస్తువులు కానీ వానిని అనుభవించుటకు తగిన శరీరములు ఇంద్రియములు కానీ వానిని అనుభవించుటకు తగిన స్థానములు గృహాదులు కానీ ఉండవు కదా? నీవు నన్ను చంపుట తగునా? మనసును వశపరుచుకొని నీ స్వరూపము నీవు ఎరింగిననే తప్ప నీవు చేసేడి వ్యాపారముల యొక్క రహస్యము తెలియదు. నీ మాయచే మోహమునందిన మా వంటి వారలము, నీ రహస్యము నిరంగజాలము. నీ అభిప్రాయమును గుర్తించలేము. నీవు ఒక్కడివే. అయి ఉండియు బ్రహ్మ రుద్రాది రూపములు దాల్చి వేరు వేరుగా కనపడుచుందువు. మహత్తు మొదలు పృథివి వరకు సృష్టింపచేసిన వాడవు నీవే. నీవే సర్వ జగత్తుకు కారణమైన వాడవు. అచేతనమగు ప్రకృతి అనేటి ద్రవ్యమును, జీవుల కర్మను, ప్రకృతిలోను, గుణములలోను కదలిక కలిగించు కాలమును, జీవుని నీకంటే వేరుగా చేయుటకు వీలుగాని శక్తులుగా నీలో చేర్చి ఉన్న. నీవే సృష్ట్యాది యందు ఆయా శరీరములతో చేయుచున్నావు. నీవు సృష్టించిన ఈ జగత్తు ఒకనాడు నీటిలో మునిగిపోగా నీవే ఆది వరాహమై పాతాళము నుండి వెలుపలికి తెచ్చితివి. ఇప్పుడు జలములపై నౌక వలె నన్ను ఉంచి నా యందు ప్రజలను రక్షించుటకు హృదు చక్రవర్తిగా అవతరించినావు. అట్టి నీవే వాడియగు బాణముతో నన్ను చంపుటకు సిద్ధపడుచున్నావు.

నీ లీలా రహస్యము మాకు తెలియదు. నీవు ఎన్నో అవతారములు ఎత్తి లోక విరోధులను అంతమొందించి కీర్తిని ఆర్జించుకొనిన వాడవు. అట్లు కీర్తిని సంపాదించిన అనేక అవతారములకు నమస్కారము. ఈ విధంగా భూమి పృథ్వును స్తోత్రము చేసెను. కోపముతో వణుకుచున్న పెదవి గల పృథ్వును చూచి భయపడినదై ఎంతో ధైర్యము తెచ్చుకొని మరల ఇట్లు మాట్లాడుచున్నది. మహారాజా! కోపమును నిరోధించుకొనుము. నేను విన్నవించు మాటలను పరిశీలించుము. బుద్ధిమంతులు సర్వ వస్తువుల నుండి సారమును గ్రహింతురు. ఆ సారమును విడిచిపెట్టుదురు. నేను చెప్పడి దానిలో సారభూతమైన దానిని వినుము. పురుషులకు కోరదగిన పురుషార్ధములు సిద్ధించుటకు తత్వద పరిశులు అయిన మునులు అనేకమైన ఉపాయములను నిర్ణయించినారు. అవి ఈ లోకములో సుఖములను, పైలోకములో సుఖములను కూడా వసంగగలవు. వానిని ఎరుంగిన వారు వానిని ఆచరించి ఫలమును పొందుచుందురు. వానిని ఆదరింపక తమ బుద్ధికి తోచిన ఉపాయములను కొందరు ఆచరించి ఫలసిద్ధి నొందలేకపోవుచున్నారు. ఓ మహారాజా! ఈ భూమిపై ఔషధులను బ్రహ్మ పూర్వము సృష్టించెను. వానిని భుజించి ఈ లోకములో మానవులు జీవించుచుందురు. ఆ ఔషధులతోనే యజ్ఞానుష్ఠానము చేసి కొందరు స్వర్గాది లోకములు పొందుచుందురు. కానీ ఇప్పుడు అసత్పురుషులు కొందరు లోక పావనముగు యజ్ఞానుష్ఠానము చేయక కేవలము శరీర పోషణమునకై ఆ ఔషధులను భుజించుచున్నారు. అట్లు భుజించినచో ఈ ఔషధులు వ్యర్థముగా నశించిపోవుచున్నవి. మీ వలె ధార్మికులై రాజులు నేడు లోకమును పాలించువారు లేరు. లోకములో చోరులు అధికమైనారు అందుచే యజ్ఞమునకు ఉపయోగించవలెననియు అసత్పురుషులు వానిని అనుభవించినచో లోకములో మరల ఔషధులు మొలవక యజ్ఞాదులు సాగక లోకమున ధర్మాచరణ తొలగిపోవుననియు ఆలోచించి నేను ఔషధులను లోనికి తీసుకుంటిని. అవి చాలా కాలమై నాలో మరుగుపడి ఉండిపోయినవి, అందుచే అవి ఇప్పుడు మొలవ చాలవు. దానికి తగిన ఉపాయమును నీవు నిశ్చయించి వానిని వెలికితీయవలెను. నీవు మహాబాహువై సకల ప్రాణిజాతమును రక్షించువాడవై ఉన్నావు కావున నేను గోరూపమును దాల్చి ఉండును ఉందును నా నుండి ఔషధులను పిండుము దానికి తగిన పాత్రను ఔషధుల నడి పాలను పితికెడి వానిని సంపాదింపుము

నేను నాలోనున్న ఔషధులను క్షీరములుగా శ్రమింప చేసెదను. ఓ వీరా, నీ సామర్థ్యముచే పర్వతాదులచే నిమ్నోన్నతమగు ఉన్నత భూమిని సమతలముగా చేయుము. అప్పుడు వర్ష ఋతువులో దేవతలు వర్షింప చేసిన వర్షము అంతటా వ్యాపించి నిలుచుటకు అవకాశం ఏర్పడును. లేనిచో పై నుండి పడిన నీరు అంతయు పొర్లిపోవుచుండును. ఇట్లు చేసినచో నీకు లోకమునకును మంగళమగును. ఈ విధంగా భూమి హితమును ప్రియముగా విన్నవించెను. పృథ్ చక్రవర్తి దానిని స్వీకరించెను. ఆ తరువాత జరిగినటువంటి విషయాన్ని మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The unmanifest, the infinite, the first, the cave-dwelling, the pure, the unborn, the speech-filled, I bow to that great God. The boon-granting, the bestower, the unbroken, conscious form, there are no distortions in that God. He is the cause of the universe, beyond time. He is proclaimed in the heart of every creature as the Spirit. He is a bachelor. His form is beyond imagination. It cannot be defined by words. Though the mind is infinitely fast, it cannot grasp His form. We offer our salutations to that Srihari, the supremely excellent and divine leader. Eighth Canto, Fifth Chapter 26 Prayer. Devotees of Bhagavat, Srimad Bhagavata Tattva Deepika, Fourth Canto. Welcome to episode 20. Thus far, as part of the conversation between Vidura and Maitreya, the Vidiutas praise Prithu. After the kirtan, Vidur asks a few questions. Why did the earth come into existence inside the form of a cow? Why did she dress up as a gorilla? And how Prithu, Prithu rescued that kingdom. All those things also It's asking me to tell it. Maitreyi explains it this way. All the Brahmins crowned Pṛthu as their Prajapati. But the whole earth was starving in the absence of food. People, weakened, with their bodies, came to Prithu and cried out like this. Oh Lord, just as the trees in the fire are burning in the hole, we are suffering from the heat of the digestive fire. All Brahmins are Vena

You were made from the body and established as our protector. You are the protector, we have joined you as your protector. Before we perish without food, make efforts to provide us with food. You are the ruler of our lives, you are the ruler of the world. Therefore, praying that we may be saved. Hearing their lament, Prithu pondered for a long time. He decided to provide them with food. Having built a house, Rudra, as if angered by Tripura, caused suffering on earth with anger. The earth fled its face from his wrath and his efforts. As the hunter chased, the deer, as if running, assumed the form of a mountain and began to run away. He ran with anger, he ran with anger. Whatever direction it went, Pruthu was seen there, holding a bow. Just as those who are born cannot escape death, similarly, the earth, having assumed a cow form from the earth, is returning backwards with a suffering mind, unable to escape. With Prithu, thus He was saying. Oh, knower of righteousness, you are the one who rules the beings. Save me too. You are a knower of dharma, don't think of me as a woman who is innocent and doesn't know any sin. Why are you protesting to kill? Generally, those who have compassion and affection do not agitate to kill women even when they commit a crime. I am a boat, carrying people in these waters, protecting them. If you make me without you, these people will fall into the water without support. You should also be the basis for standing, shouldn't you? And the earth itself prayed to me to be saved. Prithu said so. Oh Vasudha, you have transgressed my law. That is the crime you have committed. So I'll kill you.

We are sharing a part of the Yagna with you. As a deity, you accept the share of the Yagnya. Instead of that, you are not to store the grains that you are supposed to store for us. Is it not necessary to punish the cow that grazes all the fodder that is put daily without giving milk? For all these beings, for their life, in the Kalpadi, Brahma has placed the seeds of medicine in you. From him, you should dispatch medicines and provide food to the people. You, being a fool, insulted me and did not do the things that should have been done. The people are starving. He who mocks his own soul, whether man or woman or eunuch, who boasts of himself and is wicked and does not have mercy on others, is to be put to death, but he is not to be saved. You turned out to be a coward. You are proud that you are the reason I have a foundation to stand on without people. Therefore, I will kill you in small pieces, as small as a mustard seed. Even without you as a basis, my yogic power will keep the people, all the people, standing, with intense anger As if death itself had taken form, the earth bowed to that son of Emperor Prithu, and trembling, he spoke thus. The earth is praising like this. Salutations to you, O Supreme Person. You are the one who created this living body by joining with nature, so that it cannot be separated from your body. You appear to be one who is connected to nature through the living being and possesses the qualities of truth. You are the one who has the body of nature and man, and you are different from him. Because you have complete knowledge about yourself, you will not have the illusion of the soul in the bodies, the illusion that you are doing the actions of the bodies yourself.

Through those illusions, beings experience hunger, thirst, sorrow, delusion, old age, and death as if they themselves are experiencing them. You will not have six such villages. In Brahma, you, being the inner controller, created bodies for the living beings, and you created me as the basis for those living beings to exist. My nature is full of virtues, and its consequences are permanent. Oh! You are the creator, aren't you? You are independent. If you come to kill me by lifting the bow, who else is there to protect me besides you? You have come to protect this moving and unmoving world, but you have not come to destroy it. Your duty is to govern the people. If I am not there, these people will not have the necessary things to enjoy, nor will they have the bodies and senses to experience them, nor will they have the necessary places to live, houses, etc., right? Are you going to kill me? Having subdued the mind, unless you know your own form, you do not know the secret of the businesses you do. We, who are deluded by your illusion, are like you, your secret is a mystery. Nee We cannot identify the opinion. You're one of them. Being, you are appearing differently, assuming the forms of Brahma, Rudra, etc. You are the one who created from the greatness to the earth. You are the cause of the entire universe. The unconscious nature is the substance, the actions of living beings, the time that causes movement in nature and qualities, and the powers that are placed in you as if you cannot make the living being different from you. You are creating with those bodies in the beginning. This world that you created, once upon a time, when it was submerged in water, you yourself became the first boar and brought it out of the underworld. Now, having placed me like a ship on the waters, you have incarnated as the emperor of the heart to protect the people in me. Oh, you are ready to kill me with a sharp arrow.

We don't know your secret. You have taken many incarnations, destroyed the enemies of the world, and earned fame. Salutations to those who have earned such fame. In this way, the earth praised the earth. Seeing Prithvu with a trembling lip, frightened, she gathered great courage and spoke again like this. Your Highness! Keeping anger away. Consider the words I just spoke. The wise extract the essence of all things. They will release the essence. Listen to the essence of what I am saying. For men, the Purusharthas (goals of human life) that are ordained, the sages who are the best of the wise have determined many means. They can also cause pleasures in this world and pleasures in the hereafter. Those who know him, practice him, and receive the fruit. Without respecting him, some people are following the methods that come to their mind and are unable to achieve the desired results. Oh, King! On this earth, Brahma created medicines beforehand. Eating him, in this world Humans live. With those medicines, some perform yajna and attain heaven and other worlds. But now, some unrighteous people, without performing the sacred yajna (sacrifice) for the purification of the world, are merely consuming those medicines for the sake of nourishing their bodies. If it is consumed like that, these medicines will be wasted. There are no kings like you who are righteous and rule the world today. In the world, thieves are numerous, therefore, thinking that it should be used for Yagnya, and if the wicked experience it, the medicines will not sprout again in the world, the Yagnyadi will not continue, and the practice of Dharma will be lost, I brought the medicines inside. They have been lingering in my mind for a long time, so they are not enough to sprout now. You must decide on the appropriate remedy and bring him out. You are the mighty one, the protector of all living beings, therefore I will assume the form of a cow and will be there. Pluck the medicines from me, and collect the milk of the cows that have been milked

I will make the medicines I have laborious like milk. Oh hero, by your power, by the mountains, make the highest land that is lower than the lowest level even. Then, during the rainy season, the rains caused by the gods spread throughout and created an opportunity for it to settle. Otherwise, all the water that falls from above will overflow. If you do this, it will be auspicious for you and the world. In this way, he/she lovingly presented the welfare of the earth. Prithviraj accepted it. Let's find out what happened next in another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.