నారద మహర్షి ఆగమనం - పురంజన ఉపాఖ్యాన ఆరంభము

Arrival of Narada Muni & Allegory of King Puranjana

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో, మహర్షి నారదుడు ప్రాచీనబర్హిషత్ మహారాజు వద్దకు విచ్చేసి, పురంజన మహారాజు యొక్క గాఢమైన ఆధ్యాత్మిక ఉపాఖ్యానమును ఆరంభిస్తారు. పురంజన కథ జీవాత్మ యొక్క భౌతిక దేహముతో, ఇంద్రియములతో, మరియు సంసార బంధనములతో కలిగే అనుబంధమును సూచించే ఒక అద్భుతమైన రూపకము. ఈ శాశ్వతమైన ఉపాఖ్యానము ద్వారా, ఆత్మ యొక్క నిజమైన స్వరూపమును మరియు పరమాత్మ వైపు సాగే జీవయాత్రను గురించి మనకు బోధించబడుతుంది.

In this episode of our Srimad Bhagavatham series, the great sage Narada Muni arrives and begins narrating the profound allegorical tale of King Puranjana to King Prachinabarhisat. The story of Puranjana serves as a deep spiritual metaphor, representing the conditioned soul's entanglement with the material body, senses, and worldly attachments. Through this timeless allegory, Srila Vyasadeva guides us to reflect on the true nature of the self and the soul's ultimate journey back to the Supreme Lord.

← Prev Next →
Arrival of Narada Muni & Allegory of King Puranjana bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః మంగళ స్వరూపుడగు శ్రీహరియే ప్రళయములో సర్వమును నశింపజేయును సకల శక్తులను ధరించే ఆయనయే సకల విద్యలకు మూలస్థానము ప్రాణులకు రక్షకుడగు అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 29వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనం పురంజనోపాఖ్యానంలో ప్రారంభం చేసుకుని పురంజనుడు ఒక యువతిని తన ఒక అందమైన పట్టణం కోసం వెతుకుతూ వెళుతుండగా ఒక యువతితో తను కలవటం ఆ యువతితోనే తను కలిసి తిరుగుతూ ఉండి ఆనందిస్తున్నటువంటి వరకు మనం అనుభవించాం. తర్వాత విషయాన్ని మనం తెలుసుకుందాం. అతడు ఒకనాడు విల్లు ధరించిన వాడై వనమునకేగెను. ఆ వనము పంచప్రస్థము అని పిలువబడును. అతడు ఒక రథము రథము ఎక్కి వెడలెను. ఆ రథమునకు ఐదు గుర్రములు పూన్పబడినవి. అది చాలా వేగముతో పోదగిన రథం. దానికి రెండు దండములు కట్టబడి ఉన్నవి. రెండు చక్రములు ఉన్నవి. ఒక ఇరుసు ఉన్నది. మూడు వెదుళ్ళు కట్టబడి ఉన్నవి. ఐదు కట్లతో అవి బంధింపబడి ఉన్నవి. గుర్రములు ఐదింటికి ఒకటే పగ్గము. సారధి ఒక్కడే. రథికుడు కూర్చుండు స్థానం ఒకనికే సరిపోవును. దానికి పైన పొడువైన రెండు గోపురం వలె ఉండును. ఏడు ఆవరణములు ఉండును. రథము ఐదు రకముల నడకలను కలిగి ఉండును. బంగారు అలంకారము చేయబడి ఉండును. ఆ రథమునకంతకు బంగారు కవచము ఆ రాజు తరగని బాణములు గల అమ్ముల పొదులను ధరించెను. 11 గురు సేనానాయకులు అతని వెంట వెడలుచుండిరి. ఈ వనమునందు

ఐదు కొండ చర్యలు విహరింపదగినవే ఉండును. అందుకే దానికి పంచప్రస్థం అని పేరు. అతడు ఆ వనములో నాకెవరు దురో అని గర్వించిన వాడై విడుచుటకు తగని భార్యను విడిచి మృగములను వేటాడవలెనని ఆసక్తి గలవాడెను. అతనికి అసురీ ప్రవృత్తి కలిగెను. ఘోరమగు మనసుతో దయారిహితుడై వాడియగు బాణములతో ఆ వనములో కనపట్టు మృగములను చంపెను. వేటాడిన రాజు కొన్ని నియములకు లొంగియే వేటాడవలెను. శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించుటకు కర్మలలో ఏ మాంసమును అర్పించవలెనని చెప్పెనో వాటి కొరకే రాజు వేటాడవచ్చును కానీ ఇతరములను వేటాడ నిషిద్ధము. అతడు కూడా ఆయా కార్యములకు ఉపయోగింపదగినవి శాస్త్రము చెప్పిన జంతువులనే చంపవలెను. వనమునందే చంపవలెను. అవసరమైనంత వరకే చంపవలెను. ఈ విధముగా వేట హింస అయినను అది ఒకానొక కోరికతో చేసినను నియమములో కట్టుబడి చేసినచో అతనికి పాపం అంటదు. తాను చేయదగిన పనిని జ్ఞానముతో చేయువాడు కనుక అతనికి పాపం అంటదు. అహంకారముతో, మమకారముతో చేసినచో, లోభముచే హింస కొరకే చేసినచో అతడు సంసారములో పడి నశించిన జ్ఞానము గలవాడై నరకమును పొందును. ఈ పురంజనుడు వాడ్నన్నిటినీ ఎరింగియు అసుర వృత్తిచే ఎన్నో మృగములను చంపెను. విచిత్రములకు రెక్కలు గల బాణములతో ఎన్నో మృగముల శరీరములను నశింపచేసెను. వానిని చూచి దయగలవారు బాధపడుచుండిరి. చెవుల పిల్లులను, పందులను, ఎనుబోతులను, గవయవములను, ముళ్ళపందులను, యజ్ఞమునకు పనికి వచ్చు వానిని, పనికి రాని వానిని, చంపదగినవి అని చెప్పిన వానిని. చెప్పనివి వానిని కూడా చంపి ఆకలి దప్పులతో బడిలిపోయి ఇంటికి తిరిగి వచ్చెను. స్నానము చేసెను, ఆహారము తీసుకునెను, శ్రమ తీర్చుకొనెను. అలంకరించుకొని పట్టమహిషిని విడిచి వేటకు వెళ్ళినావని ఆమెను చూడవలెని కోరిక కలిగెను. తృప్తి గలవాడై సంతోషముతో కామపరవశుడై గర్వముతో ప్రియురాలిని చూడవలెనని ఏగెను. ఆమె కనిపించలేదు. ఆమె చెలికత్తెలు అంతఃపురమున ఉండగా వారిని అడిగెను.

మీరందరూ సుఖముగా ఉన్నారా? మీ రాణి కుశలమా? పూర్వము మన ప్రాసాదములో ఎంత వైభవం ఉండేటిదో ఆ వైభవం ఇప్పుడు గోచరింపలేదు. ఇంటిలో పిల్లలకు తగిన పతిదేవత అయి భర్తకు భార్యగా స్త్రీలు ఎనిచో ఆ ఇల్లు చక్రములు లేని గుర్రములు లేని రథం వలె వికలమై ఉండును. అట్టి యజమాని దీనుడై ఆ ఇంటనుండును. నేను దుఃఖముతో బాధపడుచుండగా నన్ను అడుగడుగునా పైకి లేవనెత్తి ఆనందింపచేసేడి రాణి ఎక్కడున్నది? ఇట్లు పురంజనుడు అడగగా ఆ చెలికత్తెలు, రాజా, రాణి మనసు చాలా బాధతో కృంగినట్లుంది. కారణం మాకు తెలియదు. కానీ ఆమె ఏమియు నేలపై పరుచుకొనక వట్టి నేలపై పడు పండుకొనినది చూడుము. అనిరి. పురంజనుడు నేలపై పరున్న రాణిని చూచెను. ఆమెను చూడగానే జ్ఞానము వికలమాయెను, శోకవశుడాయెను. మనసులో బాధపడుచు మృదువైన మాటలతో అనునయించుచు ఆమెకు తనపై ప్రణయకోపం ఏర్పరచుటకు కారణమేమో ఎరుంగక మనసులో ఆలోచించెను. ఏమియు కారణము తోచలేదు. ఆమెను అనునయించెను. ఆమె పాదములను పట్టుకొనెను. ఆమెను తన ఒడిలో పడుండ పెట్టుకొని లాలించెను. పురంజనుడు ఆమెతో ఇట్లు మాట్లాడెను. ప్రభువులు తమ భృత్యుడు తమకు విధేయుడని భావించి వారు తప్పు చేసినప్పుడు శిక్షింపక వదిలినచో ఆ సేవకులు చాలా దురదృష్టవంతులు. ప్రభువు మృత్యుని శిక్షించుట అనుభవమే కానీ శిక్ష కాదు. ప్రభువు శిక్షించినాడు అని భావించువాడు అజ్ఞుడు. నీవు నాకు స్వామినివి. నీవు నాపై కినుక గలదానివై యుండుట నాకు శిక్ష. నాకు శిక్ష కాదు అనుగ్రహమే. అనురాగముతో నిండిన బిడియముతో మందహాస పూరితమగు నీ చూపులను. కనుబొమ్మలు పక్కకు తిప్పుచు నల్లని ముంగురులు ముఖముపై విసురుకొనుచుండగా నా వైపు చూచి మధురమగు ఒక మాట పలుకుము. నీ యెడల ఎవరైనా అపచారము చేసినచో భగవత్భక్తులు తప్ప వారు ఎవరైనాను నిన్ను శిక్షించెదను. నీవు నా ప్రక్కన ఉండగా

నాకు కోపం వచ్చిన నాడు నా ఎదుట ధైర్యముగా నిలబడగలిగిన నా వాడు ఈ లోకములో గాని పై లోకములో గాని లేడు. భగవద్దాసులు అపచారము చేయరు. వారి విషయము మనసులో శంకించనవసరము లేదు. ఇంతవరకు తిలకము లేని ముఖమును నేను చూడలేదు. సంతోషము లేని ముఖమును నేను చూడలేదు. ముఖమునకు వ్రాసుకొనదగిన ద్రవ్యములను వ్రాసుకొనకుండా, పెదవికి రంగు వేసుకొనకుండా, వక్షస్థలమున సరిగా ఆవరణం ఏర్పరచుకొనకుండా నీవు ఉండుటకు కారణం ఏమి? నన్ను క్షమింపుము. నేను తప్పు చేసితిని. నిన్ను అడగకుండా వేటకు వెళ్ళితిని. తనతో కలిసి రమింపవలెనని కోరిక కలిగి ధైర్యము చెడి ఉన్న పురుషుని ప్రియురాలు ఆదరింపకుండుట తగదు కదా? వేటకు వెళ్ళలి బాధకు గురైనను అనుగ్రహింపుము. ఇంతవరకు మనం పురంజనుల యొక్క ఆ భార్యాభర్తల విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ కథా భాగానికి అంతరార్థం ఏమిటో తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Shiva, Rudra. Salutations to the sustainer of power, the lord of all knowledge, the lord of the beings. Salutations to Sri Hari, who is the auspicious form. In the apocalypse, He who destroys everything, He who possesses all powers, He is for all knowledge Salutations to Sri Hari, who is the protector of beings at the root. Devotees of God, welcome to the 29th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Vidura and Maitreya, we started with the Puranjunopakhyanam, and as Puranjunudu was going in search of a beautiful town for himself, he met a young woman, and he was wandering around with that young woman We have experienced it until we are happy. We will proceed with the rest. Once upon a time, he went to the forest carrying a bow. That forest is called Panchaprastha. He mounted a chariot and set off. The chariot was adorned with five horses. It is a chariot that can go very fast. It is tied with two garlands. There are two wheels. There's a joint. Three gourds The ones that are built. They are tied with five cuts. Horses are five in a row. The charioteer is one and only. The seat of the charioteer is not enough for one person. Above that, there are two tall towers. There are seven enclosures. The chariot has five different ways of walking. It is decorated with gold ornaments. That chariot was covered with gold armor, and the king wore armor studded with innumerable arrows. Eleven Guru's commanders followed him. In this forest

Five hill actions are worth visiting. That is why it is called pancha prastha. He was proud that no one would be afraid of him in that forest, and he was interested in leaving his wife who was not worthy of being left, and hunting animals. He was possessed by an Asura. With a terrible heart, being merciless, with sharp arrows, he killed the animals that were caught in that forest. The hunted king must submit to a few rules. The king may hunt for the sake of what meat was said to be offered in rituals to use meat in rituals, but it is forbidden to hunt others. He also should kill the animals that the scriptures say are useful for those tasks. It must be killed in the woods. Kill as much as you need to. In this way, even if hunting is violence, if it is done with a desire, if it is done in accordance with the rules, he will not be sinful. He who does the work that he can do, with knowledge, will not sin. If done with arrogance and attachment, if done with greed for violence, he will fall into worldly life and attain hell, being ignorant. This Puranjunudu He killed many animals by using all of them as bait and the demonic profession. With arrows with wings to the strange creatures, he destroyed many animal bodies. Seeing him, those who were compassionate were saddened. Those who are like cats, pigs, hyenas, porcupines, rabbits, those who are useful for sacrifice, those who are not useful, those who are said to be killable. He killed the one who didn't tell him, and was bedridden with hunger and thirst, and returned home. He bathed, he ate, he relieved his fatigue. Having adorned herself, she left the queen and went hunting. A desire arose to see her. Being satisfied, being happy, being engrossed in lust, he desired to see his beloved with pride. She wasn't there. She asked her maids while they were in the palace.

Is everyone alright? Is your queen in good health? In the past, how much splendor our palace had, that splendor is not visible now. In the house, women, as suitable goddesses for children, as wives to their husbands, are like a house without wheels, a chariot without horses, disheveled. Such a master is humble and resides in that house. Where is the queen who, while I was suffering with sorrow, lifted me up at every step and made me happy? Thus, when Puranjunudu asked, the maidservants said, "Oh King, the Queen's heart is very saddened and depressed." We are not aware of the reason. But she did not spread anything on the ground, see how she is lying down on the bare ground. Puranjunudu saw the queen lying on the ground. Upon seeing her, Gyan lost consciousness and became unconscious. He thought in his mind, feeling sad in his heart, and with soft words, he tried to appease her, without knowing the reason why she harbored romantic anger towards him. I cannot think of any reason. He persuaded her. He held her feet. He let her lie on his lap and caress her. Puranjaneya spoke thus to her. The lords, their servant, to them Considering him as a loyal servant, if they are left without punishment when they make mistakes, those servants are very unfortunate. The Lord's discipline is not punishment but discipline. He who thinks that the Lord has punished him is a fool. You are mine. Your being kind to me is my punishment. I deserved mercy, not punishment. With love, with affection, with a smiling face, your eyes. Turning your eyebrows aside, while the black hairs are throwing on my face, look at me and speak a sweet word. If anyone commits an offense against you, except for those who are devotees of God, I will punish you. While you are beside me

The one who stood bravely in front of me when I was angry, that person is not in this world or the next. Bhagavad-dhāsa is free from demonic traits. They don't need to doubt their feelings. I have never seen a face that hasn't been smeared. I've never met a sad-looking face. What is the reason you are not there without writing down the things that are worth writing down for the face, without coloring the lips, without properly covering the chest? Please forgive me. I made a mistake. Without asking you, I went hunting. Is it not appropriate for a woman who is courageous and has a desire to be with him to not respect a man who is weak and has a desire to enjoy with him? Grant me the strength to go hunting, even though I am troubled. Until now, we have learned about the husband and wife of Puranjunula. We will find out what the story is about in the podcast later. Jai Srimannarayana and salutations to the Ashram Guru.