ఇంద్రుని అశ్వాపహరణ యత్నము - మహావిష్ణువు ప్రత్యక్ష దర్శనము

Indra's Interference & Appearance of Lord Vishnu

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, అసూయ మరియు భయముతో నిండిన ఇంద్రుడు మహారాజు సగరుని అశ్వమేధ యాగపు గుర్రమును అపహరించి యజ్ఞమును భగ్నం చేయాలని యత్నించే వృత్తాంతమును తెలుసుకుంటాము. సగర పుత్రులు ఆ అశ్వమును వెదుకుతూ భూమిని తవ్వి, తపస్సులో నున్న కపిల మహాముని ఆశ్రమమును చేరుకుంటారు. ఆ సందర్భంలో సాక్షాత్తు మహావిష్ణువు ప్రత్యక్షమై, అహంకారముతో చేసిన పనుల పరిణామాలను మరియు భక్తి శరణాగతి యొక్క మహిమను స్పష్టముగా బోధిస్తాడు.

In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, we explore how Indra, consumed by jealousy and fear, attempts to steal the sacrificial horse of King Sagara to disrupt the grand Ashwamedha Yagna. The sons of Sagara, in their relentless pursuit of the stolen horse, dig deep into the earth and unknowingly disturb the meditation of the great sage Kapila Muni. At this pivotal moment, the Supreme Lord Vishnu manifests His divine presence, illuminating the significance of surrender, devotion, and the consequences of ego-driven action.

← Prev Next →
Indra's Interference & Appearance of Lord Vishnu bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు సక్తైహి దుష్ప్రాపణాయ గుణ సంఘ వివర్జితాయ తాత్మభిహి సహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే సమైశ్వరాయ దేహము, సంతానము, ఇంటిలోని పెద్దలు, ఇల్లు, సంపదలు, బంధుజనులు అను వాటియందు తగులుకున్న వారలు ఈశ్వరుని పొందలేరు. ఆయనకు మాయాశక్తి యొక్క సత్వరజస్తమో గుణములతో సంఘము లేదు. జీవన్ముక్తులు షడేశ్వర్య సంపన్నుడగు ఈ ఆ ఈశ్వరుని నిరంతరముగా తమ హృదయంలో భావన చేసెదరు. ఏక రసమగు జ్ఞానమే స్వరూపముగా గల ఆ ఈశ్వరుని కొరకు నమస్కారము. ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ ఎయిటీన్త్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 23వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మిదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథ్విరాజుకు భగవంతుడు ఉపదేశం చేయటము తిరిగి పృథురాజు భగవంతుని ప్రార్థించటము ఆ తరువాత వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవటం వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విదురుడు మైత్రేయుని ఇంకా పృథురాజు చేసినటువంటి కర్మలు ఏమిటివి అని అడిగాడు. దానికి జవాబుగా అతను చెప్పేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. మైత్రేయుడు ఇట్లు చెబుచున్నాడు. గంగా యమునుల మధ్య దేశములో బ్రహ్మావర్తమును పుణ్యక్షేత్రమందు తమ ప్రాచీన కర్మల ఫలముగా లభించిన భోగములను అనుభవించుచు తమ పుణ్యకర్మ ఫలముగా లభించిన సుఖమును కూడా దుఃఖము వలె అనుభవించుచు పుణ్య పాపములను అంతముందించుకోవలెనని దేనియందును ఆసక్తి లేక జీవితమును గడుపుచుండెను. ఎవరు ఆ పృథ్విరాజు. అతని ఆజ్ఞ సప్త దివీపములలో అవ్యాహతముగా సాగుచుండెను. భగవద్భక్తులను బ్రాహ్మణులను అతడు సేవించుచు వారిని తన శాసనమునకు వశులుగా ఉన్నట్టు భావింపకుండెను. ఒకసారి అతను మహా సత్రయాగం చేయవలెనని దీక్ష పట్టెను. అప్పుడు ఆ సత్రయాగములో దేవతలందరూ బ్రహ్మర్షులు మొదలగు వారందరూ వచ్చి సభలో ఉండిరి. బ్రహ్మర్షులు రాజర్షులు కూడా అచ్చట చేరి ఉండిరి. పూజ్యులగు వారందరిని వారి వారికి తగినట్లు రాజు ఆదరించెను. నక్షత్రముల మధ్య చంద్రుని వలె వారి మధ్య నుండి లేచి నిలిచెను.

అతడు పొడువైనవాడు, బలిష్టమైన భుజములు గలవాడు, అందమైన నాసిక ముఖము కలవాడు, సౌమ్యుడు. అందమైన దంతకాంతి ప్రసరించునట్లు మందహాసము చేయువాడు. విశాలమైన వక్షస్థలము, బలిసిన నితంబము. సుందరమైన ఉదరము సుడివలె లోతైన నాభి కలవాడు. ఇంద్రియ శక్తి కలవాడు పాదము ఎత్తు ఉండును. తొడలు బంగారు కాంతితో ప్రకాశించుచుండును. కేశములు సన్నగా వంకరగా నల్లగా నున్నగా అందముగా నుండును. శంఖము వంటి మెడ గలవాడు విలువగల రెండు పట్టుబట్టలు దాల్చి ఉన్నాడు. సహజము కాంతి గలవాడు నియమములలో ఉండుటచే ఆభరణమును ధరించలేదు. కృష్ణాజనమును ధరించినాడు. దర్భలతో కట్టిన పవిత్రమును వేలికి ధరించినాడు. అతని కన్నులు ప్రీతితో ఎదుటి వారిని చల్లబరుచునవిగా ఉండెను. ఇట్లు ఒప్పుచున్న ఆది రాజగు పృథ్వు ఆ సదస్సునంతను ఆనందింపచేయుచు ప్రసన్నము అపశబ్దము లేనిదియు గూఢమునగు మాటలతో అందరినీ ఆనందింపచేయుచు అందరకు ఉపకరించునట్లు ఈ క్రింది విషయములను చెప్పుచున్నాడు. ఓ సభ్యులారా మీకు మంగళమవు కాక. ఈ యజ్ఞభూమికి విచ్చేసిన మీరందరూ సాధువులు. మీరు అన్నిటినీ ఎరుంగినవారు. మీకు నేను ఉపదేశింపగల జ్ఞానము గలవాడను కాను. కానీ నేను ఎరుంగదలచిన దానిని మీ ముందు ఉంచి దానిని స్పష్టముగా తెలుసుకునవలెనని చెప్పుచున్నాను. మీకు అభిప్సితతమగు ధర్మము ఎరిగించుచున్నాను. భగవానుడు నన్ను ప్రజారక్షణము చేయవలెని ఆదేశించుచున్నాడు. వారిని దండము ధరించి శాసింప నియమించినాడు. నేను ప్రజలకు జీవికను కలిగింపవలెను, రక్షింపవలెను. అట్లు చేయుటచే నేను పుణ్య లోకములను పొందెదను. బ్రహ్మవేత్తలు వేదార్థమును ఎరింగి ఆచరించి ఉపదేశించి ఏ లోకములను పొందుదురో ప్రజారక్షణము చేయుటకే నాకు ఆ లోకములు లభించును. ఈ ప్రజారక్షణము చేయుటచే కర్మసాక్షిగా నిలిచిన సర్వేశ్వరుడు సంతుష్టి నందును. అందుచే వాని అనుగ్రహముచే ముక్తి కూడా లభించును. ప్రజల నుండి పన్ను తీసుకునుచు వారిని రక్షింపని రాజు ధర్మాచరణమున ప్రవర్తింపచేయని రాజు ప్రజల పాపమును తాను పొందును. తనకు ఉండవలసిన జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము తొలగిన వాడగును. కావున ప్రజలారా మీరందరూ.

నా కొరకు నా పరలోకమున హితము కలుగుటకు మీ ధర్మములు అసూయ లేని వారై ఆచరింపుడు. మీరు ఆచరించు ధర్మములను భగవానుని ప్రీతికే సమర్పింపుడు. నేను చెప్పిన మాటలను మీరు అనుమోదింపుడు. చేసిన వారికి, వారిని శాసించిన వారికి, చేయుచున్నప్పుడు అనుమతించిన వారికి కూడా ఫలము సమానముగానే లభించును. అందుచే ధర్మాచరణము చేయు మీకు, ధర్మాచరణము చేయు మిమ్ములను, ధర్మాచరణమున ప్రవర్తింపచేసి. అనుమోదించుచున్న నాకు కూడా ఫలము సమానముగా లభించును. మనము చేయు కర్మలచే భగవానుడు సంతుష్టుడై ఫలమున సంగును. కొందరు భగవానుడు ఉన్నాడని అంగీకరింపరు. కొందరు ప్రకృతి పురుషుడు అని వారి కంటే వేరుగా ఈశ్వరుడు ఉన్నానని అంగిక నిబ్బరు. ఈశ్వరుడు నిరూపించుటకు ప్రమాణము లేదని వారు అందురు. ఈశ్వరుడు ప్రత్యక్షముగా గోచరింపడు. ప్రత్యక్షముగా గోచరము కాని దానిని అనుమానం సాధింపలేదు. ప్రత్యక్షానుమానములకు గోచరము కాని దానిని శబ్దము చెప్పవలెను. కానీ శబ్దము పురుషుడు చేయదగిన కార్యములనే చెప్పును కానీ ఎవ్వరి చేతను ఎక్కడను సాధింపబడని సిద్ధమైన బ్రహ్మమును ప్రతిపాదింపలేదు. అందిచే ఈశ్వరుడు ఫలమునిచ్చుననుట సంగతము కాదు. బ్రహ్మోపాసన చేసినచో బ్రహ్మ ప్రాప్తి కలుగునని వేదము చెప్పుచున్నది. అచట ఈశ్వరుడు ఫలమునిచ్చుట లేదు. మనము చేయు కర్మల చేత ప్రత్యేకమైన శక్తి గలదై ప్రకృతియే మనకు సుఖమును దుఃఖమును వసంగుచున్నది. కానీ ఈశ్వరుడు అనువాడు లేడని కొందరు భావింతురు. కానీ ప్రమాణమునందు విశ్వాసము గల ఆస్తికులు దానిని అంగీకరింపరు. యజ్ఞములచే ఆరాధింపబడి ఈశ్వరుడు ఉన్నాడు. అతడే ఫలమునిచ్చువాడు. ఈ లోకములో పై లోకములో ప్రకాశవంతములగు విచిత్రములకు భోగభూములు ఉన్నవి. వానిని అనుభవించు విచిత్రములకు శరీరములు ఉన్నవి. అట్టి విచిత్రమైన సృష్టి ఈశ్వరుడు లేనిదే సంభవింపదు. అచేతనమగు ప్రకృతి భగవానుడిచే నియమింపబడిన నాడు ఈ విచిత్ర సృష్టి జరగదు. జీవులు ఈ సృష్టిని చేయజాలరు. ఇందులో కొన్ని వారికి దుఃఖమును కలిగించునవి, కొన్ని సుఖమును కలిగించునవి ఉండును. జీవులే సృష్టించుకున్నచో వారికి దుఃఖము కలిగించు వాటిని చేసుకొనరు.

అందుచేత స్వరూపములో స్వభావములో దోషములు అంటని కళ్యాణ గుణములు గల సత్య సంకల్పము గల భగవానుడే సృష్టించున్నాడని అంగీకరింపవలెను. అతడే మనం ఆచరించు కర్మలకు ఫలమునిచ్చును. అందుచే భగవంతుని ప్రీతికే కర్మలను ఆచరింపవలెను. మా పూర్వులందరూ తమ కర్మలచే భగవానుని ఆరాధించినారు. స్వయంభూ మనువు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు. ఇటువంటి వారెందరూ ఆ గదాధరుని ఆరాధించినారు. ప్రహ్లాదుడు, బలి కూడా భగవానుని ఆరాధించినారు. వేనుడు మొదల కొందరు మాత్రం అజ్ఞానముచే ఈశ్వరుని ఎరుంగలేక ధర్మ విషయమున మోహమునందినారు. అందుచే కేవలము కర్మలు ఫలమును ఇయ్యజాలవు. ఆ కర్మలచే కలిగెడి అపూర్వము కూడా ఫలమును ఇయ్యజాలదు. ఆరాధింపబడె దేవతలు ఫలమును ఇయ్యజాలరు. వారికి ఆత్మగా నుండి పరమ పురుషుడే ఫలమును సంగెడివాడు. ఆధ్యాత్మికాది తాపములతో దుఃఖమునందుచున్న వారలను భగవత్పాద సేవనమునందు రుచి కలిగిన నాడు దినదిన ప్రవర్ధనమానమై అనేక జన్మలలో వృద్ధి నందిన మనస్సును అంటి ఉన్న మలినము తొలుగును. భగవాని పాదాంగుష్టము నుండి వెలువడిన గంగా నది వలె భగవత్పాద భజనయే మన మనస్సులోని మాలిన్యమును తొలగింపజాలినది. వేరొక సాధనము లేదు. ఇట్లు మనోమాలిన్యము తొలగిన నాడు మనస్సు విషయములందు సంఘము లేనిదై ఉండును. అందుచే వైరాగ్యము కలుగును. ప్రకృతి కంటే ఆత్మ వేరని తెలియును. జ్ఞానము, కర్మ అను రెండును వెనక నిలిచుటచే బలమైన భక్తి యోగము ఆవిర్భవించును. అట్టి శక్తి గలవారు భగవత్పాదముల యందే నివాసము గలవారగుదురు. వారికి మన క్లేశములను కలిగించు గర్భ జన్మ జరా మరణాదులతో నిండిన సంసారం అంటదు. కావున మీరందరూ మీ వర్ణములకు ఆశ్రమములకు తగినట్టుగా పంచమహాయజ్ఞములను ఆచరించుచు మనసుతో ధ్యానము, వాక్కుతో స్తోత్రము, శరీరముతో పరిచర్య ఏ విధముగా మాయ లేకుండా చేసి ఆ భగవత్ పాదారవిందములు అనుగ్రహముచే మీ మీ యోగ్యతకు తగిన కోరికలను నింపుకొనుడు. మనము చేయు కర్మలు భిన్న భిన్నములకు ద్రవ్యములు. తో వేరు వేరు దేవతలను ఉద్దేశించి చేయబడినవే అయినను అన్నిటికీ ఆత్మ భగవానుడు కనుక అన్నియు తనకే చెందును. భగవానునికి హే గుణములు లేవు అతడు జ్ఞాన స్వరూపుడు అనంత కళ్యాణ గుణములు గలవాడు అతడే అనేక విధములకు ధ్యానము నేయి

పశువులు మొదలగు ద్రవ్య రూపములగును తెలుపు మొదలగు గుణములు కలవిగను ఆయా క్రియలగునను మంత్రములగను ఉండెను. ద్రవ్యములు మంత్రములు క్రియలు అనునవి అన్నియు భగవానుని శరీరములే అందుచే అతడే యజ్ఞ స్వరూపుడు మనము ఇంద్రుడు మొదలగు దేవతలను అగ్ని మొదలగు వారిని ఆరాధించుటచే వారిలో ఆత్మగానున్న భగవానుడే ఆరాధింపబడును. యజ్ఞో వైవిష్ణుః తదేవాగ్నిహి తద్వాయుః తత్సూర్యః అని వేదము చెబుచున్నది. కనుక మనము చేయు కర్మలన్నియు పరమ పురుషునికే ఆరాధనములగును. ఆరాధింపబడిన అతడే ఫలమున సొంగును. కర్రలో వ్యాపించిన అగ్ని ఆ కర్ర పొడవుగానున్నచో పొడవుగాను గుండ్రముగానున్నచో గుండ్రముగాను చిన్నదిగానున్నచో చిన్నదిగాను కనపట్టును. ఆ భేదము కరలకు సంబంధించినదే కానీ అగ్నికి చెందినది కాదు. అట్లే ప్రకృతి, కాలము, వాసనలు, ధర్మము ఉన్నగు వానిని శరీరముగా కలిగి ఉన్న జీవునిలో ఆత్మగా ఉండి. భగవానుడు ఆ శరీరము ద్వారా జీవుని ద్వారా మనము చేయు క్రియలకు ఫలముకు స్వర్గాదులు తానే అయి ఆ ఫలమునిచ్చువాడు తానే అయి ఉండును. నా పరిపాలనలోనున్న జనులందరూ ఈ భూమియందు తమ తమ వర్ణాశ్రమములకు తగిన ధర్మములను ఆచరించుటయందు దీక్ష గలవారై ఉన్నారు. యజ్ఞములో ఆరాధింపబడు ఇంద్రాది దేవతలకు ఆత్మ అయి నియామకుడై ఉండి హితమును ఉపదేశించి శ్రీహరిని ఆశ్రితుల పాపములను హరించువానిని. నిత్యము భజించుచున్నారు. ఇట్లు వారు ఉండుట నన్ను అనుగ్రహించుటయే. క్షత్రియులు, బ్రాహ్మణులు అన్యోన్యముగా ఆదరముతో ఉండవలెను. క్షత్రియులకు ఐశ్వర్యం అధికముగా నుండగనే భవదనుగ్రహ పాత్రులకు బ్రాహ్మణుల యందు తిరస్కర భావము కలుగును. బ్రాహ్మణులు ఓర్మితో, తపస్సుతో బ్రహ్మోపాసనతో, అతిథి పూజతో, శమదమాదులతో ప్రకాశించు వారలై ఉందురు. ఐశ్వర్యముతో గర్వించిన క్షత్రియులు వారిని ఎన్నడును గర్వముతో అవమానింపరాదు. బ్రాహ్మణులు క్షత్రియులపై ఆగ్రహము కలవారు కారాదు. ఈ రెండు కులములు అన్యోన్యము ఒకరినొకరు ఆదరించుకొనుచు నన్ను అనుగ్రహింతురు కాక. మనువు మొదలగు రాజులందరు బ్రాహ్మణ సేవా పరాయణులు. వారికి కూడా ఆరాధింపదగినవాడు పురాణ పురుషుడు. ఆ పురాణ పురుషుడగు శ్రీహరి ఒకరి అనుగ్రహముచే తాను యశస్సును లక్ష్మిని పవిత్రతను పొందునవసరం లేనివాడైనను బ్రాహ్మణ పాద సేవనము చేయుచునే ఉండును.

అట్లు చేయుచుండుట చేతనే తనకి వైభవం ఏర్పడినదని భావించుచుండును. అట్టి బ్రాహ్మణులందరును సేవింపుడు. సకల జీవరాశి హృదయమున వసించు ఉండువాడును. అవు అగును కర్మవశ్యుడు కానివాడును బ్రాహ్మణులెడ ప్రీతి గలవాడును అగు ఈశ్వరుడు బ్రాహ్మణ సేవచే మిక్కిలి సంతోషించును అందుచే నా ప్రజలందరూ బ్రహ్మ కులమును సేవింతురు గాక. బ్రహ్మవేత్తలకు వేదాధ్యయన పరులగు బ్రాహ్మణులతో నిత్య సంబంధం ఉండుటచే మనసునకు మిక్కిలి శాంతి శీఘ్రముగా లభించును. మనసున కోరికలు లేక శాంతుడైన వాడు సాధింపరానిది ఏదీయును ఉండదు. దేవతలకు అగ్నిహోత్రుడు ప్రాణం వంటివాడు. అగ్నిహోత్రమును సమర్పించినది. దేవతలకు అర్పించినట్లే అగునని శాస్త్రములు చెప్పుచున్నవి కానీ అచేతనము అగ్నిలో హోమము చేయుట కంటే భగవానునొంది జ్ఞానము భక్తి కలిగిన బ్రహ్మనిష్ఠులకు బ్రాహ్మణులకు అర్పించిన దానిని దేవతలు ఆదరముతో స్వీకరిందురు. వారి ద్వారా వారికి ఆత్మగానుండు అనంతుడు ప్రీతినందును. భగవానుడు తను ప్రేమించిన భక్తులను తనకు ఆత్మగా భావించును. వారిని విడిచి ఉండడు అందుచే వారికి అర్పించిన దానిని సాక్షాత్ తనకి అర్పించినట్టు భావించును. ఈ విశ్వమంతయు వేదమునందు పరమాత్మయందు నిలిచి ఉండెను. పరమాత్మ యొక్క స్వరూప రూప గుణములు వేదములో అద్దములో కనపడినట్లు స్పష్టముగా భాషించును. బ్రాహ్మణులు దేనియందును రాగము లేక భ్రమ ప్రమాదాది దోషములు లేక బ్రహ్మమును ప్రకాశింపజేసే వేదమును శ్రద్ధతో నేర్చుకొందురు. ఇతరులకు నేర్పుదురు. యజ్ఞములకు ఉపయోగింతురు. జపము చేతురు. పారాయణము చేతురు. వారి తపస్సుతో సదాచారముతో మౌనముతో ధ్యానముతో ఆ బ్రహ్మమును ఆ బ్రహ్మమును ప్రతిపాదించు వేదమును ధరించి యుందురు. కావున వానికి ఆరాధించుట సర్వే సర్వ శ్రేయములగు మూలము నేను జీవించి ఉన్నంత కాలము అట్టి బ్రాహ్మణుల పాదపద్మ పరాగము కిరీటముపై ధరించి యుందును. బ్రాహ్మణ పాదరేణువును ఎల్లప్పుడూ ధరించి ధరించు పురుషులకు పాపము నశించును. సర్వ కళ్యాణ గుణములు చేరి ఉండును. శుభ గుణములు గలవానిని పెద్దలను సేవించి వానిని సమస్త సంపదలు వరించును. అందుచే నేను బ్రాహ్మణ కులమును, వేదమును నా ప్రజలతో కూడా సేవింతును. ఆ భగవానుడు నన్ను అనుగ్రహించుకాక. ఇప్పుడు చక్రవర్తి ఈ విధంగా మాట్లాడగా పితృ దేవతలు, దేవతలు, బ్రాహ్మణులు కూడా మనసులో సంతోషించి బాగు బాగు అని పొగిడిరి.

మీ తండ్రి చాలా పాపము చేసి బ్రాహ్మణుడిచే శిక్షింపబడి చనిపోయినాడు కానీ పుత్రేణ జయతే లోకాన్ పుత్రునిచే లోకమును జయించును అని చెప్పినట్లుగా నీ వంటి కుమారుని కనుటచే అతడు ఆ నరకమును దాటినాడు. పూర్వం హిరణ్యకశిపుని భగవానుని నిందించి నరకమును పొంది కుమారుని ప్రహ్లాదుని వలన ఆ నరకము నుండి బయటపడినాడు. ఓ వీర శ్రేష్టుడా, నీవు ఈ భూమికి రాజువై చాలా సంవత్సరముల యందు నుందువు కాక. సర్వలోకమునకు ఒకే భర్తయగు అచ్యుతుని యందు ఇంతటి భక్తి గల నీవు పవిత్రమైన కీర్తి గలవాడవు. నీవు ప్రభువుగా ఉండుటచే శ్రీహరి ప్రభువుగా మరల వారమై మరల కలవారమై ఉన్నాము. లోకములో ప్రశన్సింపబడు కీర్తి గల కథను నీవు లోకమున ప్రకాశింప చేసినావు. నీవు ప్రజలకు ఉత్తమమైన మార్గమును ఉపదేశించుట యుక్తమే. మహాత్ములు కరుణా స్వభావులు అగు ప్రభువులకు ప్రజలయందు అనురాగం ఉండుట స్వభావము. కర్మవశముచే సంసారమున భ్రమించుచున్న న్యాయహీనులమైన మమ్ము నీ ఉపదేశముచే అజ్ఞానమునకు ఆవలి ఒడ్డు చేర్చితివి నీవే భగవానుడవు. బ్రాహ్మణులలో నుండి క్షత్రియులను, క్షత్రియులలో నుండి బ్రాహ్మణులను, వారిద్దరిలో నుండి విశ్వమునంతను ధరించి భగవానుడవు నీవే. రజస్తమోగుణములు ఆక్రమణలేని శుద్ధ సత్వము గల పరమ పురుషుని విభూతియగు నీకు నమస్కారము. దీని తరువాత సనత్ కుమార్ ఉపదేశం మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. పృథువు ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని పూర్తి చేసుకోవడానికి కొంత సమయం ఎక్కువగా అయింది ఈ పాడ్కాస్ట్ లో. అందరూ కూడా విని ఆనందిస్తారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The self-realized one, who is attached to the wealth of the house, who is devoted to the people, who is devoid of the association of virtues, who is pleased with the hearts of his own, who is enlightened, who is the Lord of the knowledgeable, the Lord of the gods, the body, the offspring, the elders in the house, the house, Those who are attached to wealth, relatives, and such things cannot attain God. He has no association with the Sattvic quality of Maya's power. The liberated souls, who are endowed with the six divine qualities, constantly contemplate this God in their hearts. Salutations to that God, who is the embodiment of knowledge, which is the essence of one taste. Eighth Canto, Third Chapter, Eighteenth Prayer. Welcome to the 23rd podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the Midura Maitreya conversation, we have learned that Bhagavan preached to Prithviraj, and Prithviraj prayed to Bhagavan, and then they all went back. Now Vidura asked Maitreya what were the deeds done by Prithu Raja. In response to that, the matter he is saying Let's experience it now. Maitreyi said like this. In the middle of the Ganges and Yamuna, in the land of Brahma, enjoying the pleasures obtained as the fruits of their ancient deeds, and also experiencing the happiness obtained as the fruits of their meritorious deeds, like sorrow, the merits and sins She was living her life without any interest in anything, thinking that she should end it. Who is Prithviraj. His command continued uninterruptedly in the seven islands. He served the devotees of God and the Brahmins, and did not consider them as being under his authority. Once, he took a vow to perform the great Satrapen ritual. Then, in that Satra-yagam, all the gods, Brahma-rishis, and others, came and sat in the assembly. Brahmins and Rajas were also present there. The king honored all the worshippers according to their respective capacities. He rose from among the stars like the moon.

He is tall, has strong shoulders, has a beautiful nose, and is gentle. One who smiles, spreading a beautiful light of teeth. Broad shoulders, well-built. With a beautiful belly, deep and round, with a belly button. The one who has sensory power will have a high foot. Thighs gleam gorgeously. Hair is thin, curly, black, smooth, beautiful and looks good. He is wearing two silk robes, valuable ones, with a conch-like neck. He is natural, radiant, and does not wear jewelry because he is in the rules. He is clothed with Krishna complex. He wore the sacred thread on his finger. His eyes were warmly affectionate. Thus, the first king, Prithu, who agreed, is making the entire assembly happy, being pleasant, without any noise, and with secret words, making everyone happy, and in a way that benefits everyone, he is saying the following things. May it be auspicious for you, my dear members. All of you who have come to this sacrificial ground are saints. You're the one who knows everything. I can advise you I am not a wise person. But I am telling you, I have placed before you what I intended to do, and I want you to understand it clearly. I am making you aware of the Dharma that is prescribed. The Lord has commanded me to protect the people. He appointed them to be punished and to be ruled. I must provide life and salvation to the people. By doing so, I will attain the worlds of merit. Those who, by understanding and teaching the meaning of the Vedas, attain these worlds, I will grant them those worlds only for the protection of the people. By protecting the people, the Lord, who stands as a witness to karma, is in satisfaction. Therefore, by his grace, salvation is also attained. A king who takes taxes from the people and does not protect them, a king who does not act according to righteousness, will bear the sins of the people. He will lose the knowledge, power, strength, and wealth that he should have. Therefore, O people, all of you.

For my sake, for my good to be in my heaven, practice your dharmas without envy. Offer the dharmas you practice to the pleasure of the Lord. Please confirm that you agree with my statement. To those who do, to those who rule them, and to those who permit while doing, the reward is equally obtained. Therefore, to you who practice righteousness, to you who practice righteousness, make you act in righteousness. I am also receiving the fruit equally. By the actions we perform, the Lord is pleased and the fruits are obtained. Some people do not agree that God exists. Some believe that God is different from nature and man, and that they are different. They conclude that there is no evidence to prove that God exists. God is not directly visible. It cannot be proven by direct observation. That which is not visible to direct inference should be expressed in words. But the sound says that it is the work that a man can do, but it does not propose a ready-made Brahma that cannot be achieved by anyone or anywhere. Andeche It is not possible for God to give the fruit. The Vedas say that if one worships Brahma, one attains Brahma. There, God does not give fruit. Nature, with its unique power, is giving us happiness and sorrow through the actions we perform. But some people think that there is no God. But the believers in the standard do not accept it. Ishvara is worshipped through yajna. He is the one who gives the fruit. In this world and the next, there are luxurious and varied things to enjoy. They have bodies to experience the peculiarities. Such a wonderful creation would not have happened without God. When the unconscious nature is appointed by God, this strange creation will not happen. The creation would not have been possible if it was not for the beings. In this, some cause sorrow to them, and some cause happiness. Those who create life will not make those that cause them sorrow.

Therefore, it must be accepted that the Lord, who has the qualities of auspiciousness, truth, and resolve, created the form and nature without any flaws. He is the one who gives the fruits of the actions we perform. Therefore, one should perform actions for the pleasure of God. All our ancestors worshipped the Lord because of their karmas. Svayambhu, Uttanapada, Dhruva, Priyavrata. All such people have worshipped that Gadadhara. Prahlada and Bali also worshipped lord. Some, starting with Venu, due to ignorance, unable to understand God, have become deluded in matters of dharma. Therefore, only karmas cannot give the fruits. That which is united by karma cannot give fruit. The gods who are worshipped cannot give the fruit. The Supreme Being, as the supreme soul, is the giver of the fruits. Those who are suffering from spiritual afflictions and sorrows, when they find pleasure in the service of the feet of the Lord, will be constantly increasing day by day, and the impurity attached to the mind that has grown in many births will be removed. Like the Ganges river emanating from the lotus feet of the Lord, the worship of the Lord's feet is in our minds Impervious to dirt. There is no other tool. Thus, when mental confusion is removed, the mind will be without association with worldly matters. Therefore, detachment arises. The soul is different from the nature. Knowledge and action, both standing behind, a strong devotion yoga will manifest. Those who have such power reside only in the lotus feet of the Lord. It is said that their suffering is filled with the cycle of birth, death, and old age. Therefore, all of you, according to your castes and ashrams, practice the five great sacrifices, with your mind, meditation, and praise with your speech, How to serve with the body without illusion, and by the grace of those lotus feet of the Lord, fill yourselves with desires that are appropriate to your worthiness. The karmas we perform are the substances for the different results. Even though they are made to address different gods, since the soul is God for all, everything belongs to Him. The Lord has no qualities; He is the embodiment of knowledge, possessing infinite auspicious qualities. He is the one who meditates on many things

Animals and other forms of wealth, speaking, having qualities, and being the actions, and being mantras. Money, mantras, and actions are all parts of the divine body. Therefore, he is the embodiment of sacrifice. By worshiping Indra and other gods, and Agni and others, the divine being who is in them is worshiped. Yajno vaivishnuha tadevaagnihi tadevaayuha tatsuryaha, thus the Vedas say. Therefore, all the actions we perform are worships to the Supreme Being. He who is worshipped is the fruit of the tree. The fire spread in the stick, if the stick is long, it is long, if it is round, it is round, if it is small, it is small, it appears round. The difference is that the handles are related, but the fire is not. Similarly, being in the soul of a being who has nature, time, smells, and dharma as their body. The God, through that body, through the living being, to the actions we do, to the fruits, He Himself is the one who gives the fruits, He Himself is the one who gives the fruits. All the people under my rule on this earth, their own They are dedicated to practicing the dharmas suitable for the varnashramas. Being the soul and the appointed one to the Indra and other deities worshiped in the Yagnya, and being the one who advises and removes the sins of those who are dependent on Srihari. They are worshipping daily. It is by their being that they are granted me. Kshatriyas and Brahmins should live in harmony with each other. Kshatriyas having abundant wealth, Brahmins have a negative feeling towards them. Brahmins shine with ormi, penance, Brahmopasana, guest worship, and Samadhimaadulu. Kshatriyas who are proud of their wealth should never be humiliated with pride. Brahmins are not angry at Kshatriyas. These two castes, being mutually supportive, will not only bless me. All the kings from Manu onwards were devoted to the service of Brahmins. He is also worthy of worship, a great man. That ancient man, Srihari, by the grace of one, even though he is not one who needs to attain fame and Lakshmi's purity, the Brahmin's feet It will be serving.

It is because of doing so that he feels that he has attained glory. All such Brahmins should be served. He who dwells in the heart of all living beings. Yes, he is one who is not subject to karma, and he is one who is pleased with Brahmins. This God is very pleased with the service of Brahmins. Therefore, may all my people serve the Brahma caste. By being constantly connected with Brahmins who are scholars and those who study the Vedas, peace of mind is quickly attained. He who is at peace without desires in his mind, there is nothing impossible for him. Agnihotri is the life of the gods. The homa was the final offering. The scriptures say that it is like offering to the gods, but more than offering to the unconscious, to the Brahmanishtas and Brahmins who have knowledge and devotion to the Lord, the gods accept what is offered. Through them, the infinite one is pleasing to them. The Lord thinks of his own people as if they were his own. He will not leave them. Therefore, what was offered to them He would consider it as if he had offered it himself. This entire universe exists within the Vedas and the Supreme Being. The form, attributes, and qualities of the Supreme Being are clearly described in the Vedas, as if they were reflected in a mirror. Brahmins, without any attachment to anything, without any defects like delusion and pride, learn the Vedas with devotion, which illuminate the Brahman. Teach others. Yagnas are used for things. Chant. The recitation is being done. With their penance, with good conduct, with silence, with meditation, they hold the Vedas that proclaim that Brahman, that Brahman. Therefore, worshiping him is the root of all good things. As long as I live, I will wear the lotus feet of such Brahmins on my crown. For men who always wear and wear the Brahmin's sandalwood paste, sin will be destroyed. It is full of all auspicious qualities. He who has good qualities will be served by elders, and all wealth will be bestowed upon him. Therefore, I, along with my people, serve the Brahmin caste and the Vedas. Unless the Lord has given me this grace. Now the emperor this When they spoke in this way, the ancestors, gods, and Brahmins were also pleased in their hearts and praised them, saying 'Good, good'.

Your father committed many sins, was punished by a Brahmin, and died, but as it is said, 'Putraṇa jayate lokāṁ,' the world is conquered by a son. By having a son like you, he crossed that hell. In the past, Hiranyakashipu, after blaspheming the Lord, attained hell, and was freed from that hell by his son Prahlada. Oh, brave one, you will be the king of this earth for many years. You, who have such devotion to Achyuta, the only husband of all the worlds, are a sacred and glorious one. Because you are the Lord, we are again the Lord, again the Lord, and again the dreamers. You have made the story that is praised in the world shine in the world. It is good to teach people the best way. It is natural for the great souls, who are compassionate, to have affection for the people. Due to karma, you have brought us, who are unjust and deluded in the world, to the shore of ignorance through your teachings. You are the Lord. From the Brahmins, Kshatriyas, and from the Kshatriyas, Brahmins From both of them, you are the one who holds the entire universe and becomes God. Salutations to you, the supreme being, who is pure and without any impurities, possessing uncontaminated goodness. After this, let's learn about Sanath Kumar's teachings in another podcast. It has taken some time to complete the teaching that Pruthuvu gave to all the people in this podcast. Hoping that everyone will listen and be happy, Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo