భూదేవి సస్య నిరోధము - గోరూప భూదేవి దోహన ప్రక్రియ

The Milking of Mother Earth in the Form of a Cow

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, భూదేవి తన సస్య సంపదను మానవాళికి నిరోధించిన మహత్తర సంఘటనను వివరిస్తున్నాము. అధర్మం పెచ్చరిల్లుతున్న కాలంలో భూమాత గోరూపం ధరించి తన పోషణ శక్తిని ఉపసంహరించుకుంటుంది. ప్రజల కష్టాలను చూసిన మహారాజు పృథువు, ధర్మపాలన నిమిత్తం గోరూప భూదేవిని దోహనం చేయుటకు సంకల్పించి, సృష్టి రహస్యాన్ని ఆవిష్కరించే ఈ అద్భుత ఘట్టాన్ని ప్రారంభిస్తాడు.

In this sacred episode from Canto 4 of the Srimad Bhagavatham, we explore the profound episode of Mother Earth withholding her abundant harvests from humanity. Angered by the negligence and adharma of rulers and people alike, Bhudevi assumes the form of a cow and withdraws her nourishing gifts. The great King Prithu, determined to restore prosperity to his subjects, prepares to forcibly milk the earth-cow, setting the stage for a remarkable cosmic event that reveals the intimate relationship between righteous kingship and the bounty of nature.

← Prev Next →
The Milking of Mother Earth in the Form of a Cow bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నయశ్చ కశ్చాతితి తర్తి మాయాం యయాజనో ముహ్యతి వేదనార్ధం కం నిర్జితాత్మాత్మ గుణం పరేశం నమామభూతేషు సమంచరంతం ఈశ్వరుని మాయను ఎవడైనను తరించలేడు. దానిచే వ్యామోహమును పొందియున్న జీవుడు తన స్వరూపమును తేలేకున్నాడు. మాయాశక్తిని దాని సత్వరజస్తమో గుణములను వశము చేసుకునియున్న ఆ పరమాత్ముని మేము నమస్కరించుచున్నాము. ఆయన సకల ప్రాణులలో సమానముగా ప్రాణరూపుడై సంచరించుచున్నాడు. ఎయిత్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్ థర్టీయత్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం. 21వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజు భూమి మధ్యలో జరిగిన సంభాషణలో భూమి పై పృథ్విరాజు చూపించిన ఆగ్రహానికి భూమి స్తోత్రము చేస్తూ తన నుండి పిదుక్కొని ఔషధములను తీసుకోమని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా భూమి హితాన్ని విన్నవించిన తరువాత స్వయంభు మనువును దృఢమునుగా కల్పించెను. తానే పితికుటకు సిద్ధపడెను. తానే అంటే పృథురాజు. తన హస్తమునే పాలు పిండుటకు పాత్రగా కల్పించెను. ఇట్లు సకల ఔషధులకు మూలమగు క్షీరమును పితికి భూమిపై ఔషధులను మరల మలుచునట్లు చేసెను. పృథువు వలె సారాసార వివేకము గల పురుషులందరూ వారి వారి కోరికల కనుగణముగా ఆ గోవు నుండి పిండుకొనిరి. వశిష్టాది ఋషులు ఋషులు బృహస్పతిని దృడగా చేసి వాక్కు, మనస్సు, శ్రవణము అనేటి ఇంద్రియములచే వేద రూపముగా క్షీరమును పితుక్కొనిరి. అట్లే దేవతలు ఇంద్రుని దృఢగా కల్పించి బంగారు పాత్రయందు మనశ్శక్తియగు సహనమును ఇంద్రియ శక్తియగు ఓజమును వృతమును పిదుక్కొనిరి. అసురులలో శ్రేష్టుడగు ప్రహ్లాదుని దృఢగా కల్పించి లోహమయమగు పాత్రయందు మూడు విధములగు

సురను ఆసవమును క్షీరముగా పితుక్కొనిది. సుర బెల్లముతోను పిండితోను పుల నుండి వచ్చేడి తేనెతోను తయారగును. అందుచే సుర మూడు విధములు అట్లే గంధర్వులు అప్సరసలు. విశ్వావసువును దృఢగా చేసుకొని పద్మమును పాత్రగా కల్పించుకొని గంధర్వులకు ఇష్టమగు సౌందర్యమును మద్యమును పిండుకొనిరి. పితృగణములు. శ్రాద్ధ దేవతలు అర్యముడు అనువానిని దృఢగా కల్పించుకొని కాల్చని పచ్చి మట్టి పాత్రలో కవ్వమును పిండుకొనిరి. సిద్ధులు కపిల మహర్షిని దృఢగా ఉంచుకొని సంకల్ప మాత్రముచే సిద్ధించెడి అణిమ మొదలగు సిద్ధులను ఆకాశమనడి పాత్రయందు పితుక్కొనిది. ఆశ్చర్య రూపములు ధరించు కింపురుషాదులు మయుని వత్సగా చేసుకొని యోగ ప్రక్రియలో ధారణ అనడి శక్తిని పిండుకొనిది. ఆ ధారణచే వారు ఏ రూపమును కోరినా ఆ రూపమును దాల్చగలవారు అగుదురు. మాంసమును తినడి యక్ష, రక్షో, భూత, పిశాచాదులు. భూతపతియగు రుద్రుని దృడగా కల్పించుకొని కపాలమనడి పాత్రయందు ఆసవము వలె మాదకము రక్తమును పిండిరి. పడగలు లేని పాములు, పడగలు గల సర్పములు, కరిచెడి స్వభావము గల దంత శూకములనడి పాములు, నాగములు, తక్షుడను నాగరాజును దృఢగా కలిపించుకొని పాములు ఉండెడి బిలమును పాత్రగా కలిపించుకొని పురుగులను ఫలములను తమకు ఆహారముగా పిండుకొనినవి వృక్షములు వటవృక్షమును దృఢగా చేసుకొని తమ పట్టలలోనికి కటు ఆమ్ల మధురాది రసములను క్షీరముగా పిండుకొనినవి ఇట్లే ఆయా జాతులలో ప్రధానమైన వారిని దృఢగా కల్పించుకొని తమ తమ పాత్రల యందు తమకు కావలసిన వానిని వసంగ గల భూమి నుండి పిండుకొనిరి. ఈ విధంగా పర్వతములు హిమవత్ పర్వతమును దృఢగా చేసుకొని తమ చర్యలలో రకరకముల ధాతువులను పిండుకొనినది. పృథ్వు మొదలగు అందరును వారి వారికి ఉపయోగించు పదార్థములను పిండుకొనిరి. పృథ్వు చక్రవర్తి భూమి అట్లు అందరికీ అపేక్షితములగు పదార్థములను వసంగుటచే సంతృష్టినంది ఆమెను తన కుమార్తెగా ప్రేమించెను. అందుచే భూమికి పృథ్వి అను పేరు వచ్చెను. తరువాత తన విల్లు ధరించి దాని చివరతో పర్వతములన్నిటినీ సమము చేసెను.

అప్పుడు భూమండలము సమతలమాయెను. ప్రజలకు జీవిక కల్పించువాడై ప్రజలకు కావలసిన నివాసములు కల్పించెను. ఆ నివాసములే గ్రామములు, పురములు, పట్టణములు, దుర్గములు, పల్లెలు అను పేర్లతో ఏర్పడెను. గోవులకు గోష్టములను ఏర్పరిచెను. సేనలను శిబిరములు ఏర్పరిచెను. పురములు, గ్రామములు పృథువు నాటి నుండే ఏర్పడెను. అంతకు ముందు అట్టి ఏర్పాటు లేదు. అందరూ వాటియందు యథాసుఖముగా భయము లేకుండా నివసించుచుందురు. ఈ విధంగా పృథ్ చక్రవర్తి భూమి నుండి ఔషధులను పిండి భూమిని సమము చేసి ప్రజా నివాసములను కల్పించెను. స్వయంభువ మనువు వసించిన క్షేత్రము బ్రహ్మావర్తం. దానికి ఒకవైపు సరస్వతి, ఒకవైపు దృషద్వతిల్ అనేడి నదులు కలవు. సరస్వతి నది తూర్పున పారుచుండును. ఆ బ్రహ్మవర్తమునందు పృథువు నూరు యజ్ఞములు చేయ కల్పించెను. పృథ్వు యొక్క యజ్ఞ మహోత్సవం లోకోత్తరముగా విరాజిల్లుచుండెను. ఆ యజ్ఞమునందు సాక్షాత్తు భగవానుడవు శ్రీహరి యజ్ఞపతిగా ఉండెను. అచట ప్రత్యక్షముగా శ్రీహరి సన్నిధానము చేసి ఆ యజ్ఞముచే ఆరాధింపబడి ఫలమును వసంగు వాడై ఉండెను. ఆ శ్రీహరిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రాది లోకపాలురు, గంధర్వులు సేవించి వారి వైభవమును గానము చేయుచుండిరి. సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, సునందుడు మొదలగు భగవత్ సవాసందులందరూ శ్రీహరిని అనుసరించి అచరకు వచ్చి యుండిరి. శ్రీహరిని సేవించుటకు కపిలుడు, నారదుడు, దత్తుడు, సనకాది కుమారులు అనుసరించి వచ్చిరి. ఆ బ్రహ్మావర్తమునందే భూమి సర్వ కామములను పృథ్వునకు క్షీణముగా ప్రవహింపచేసినది. అచ్చట ఇక్షు, ద్రాక్షాది నదులను, పెరుగు, పాలు, అన్నము, నెయ్యి మొదలగునవి జలముల వలె పాడునట్టి నదులను ప్రవహించుచుండెను. వృక్షములన్నియు మకరందమును స్రవించు పుష్పములతో ఫలములతో నిండి ఉండెను. సముద్రము రత్నరాశులను వసంగుచుండెను. పర్వతములు నాలుగు విధములగు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను నాలుగు విధములగు అన్నములను కల్పించుచుండెను. పృథువు యజ్ఞము ఇంత వైభవముగా జరుగుచుండుట చూచి ఇంద్రుడు అసూయపడెను. నూరవ అశ్వమేధ యాగము జరుగుచుండగా భగవానుని ఆరాధించుటకు నిర్ణయింపబడిన యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించెను.

అపహరించుకొని ఆకాశములో పారిపోవుచుండగా అత్రిముని చూచెను. ఇంద్రుడు ధార్మికుడు అనునట్లు భ్రాంతిని కలిగించునట్లు జటలను దాల్చి ఉండెను. ఆ వ్రేలాడుచున్న జటలను చూచి అతడు నాస్తికుడు అగు పాఖండునని గుర్తింపగా వీలు కాకుండెను. అత్రి మహర్షి అశ్వమును అపహరించుకొని పోవుచున్నవాడు ఇందుడని గుర్తించి అతనిని చంపమని పృథ్వు కుమారుని ప్రేరణ చేసెను. అతని వెంట పృథ్వు కుమారుడు పరిగెత్తుచు కోపముతో ఆగుము ఆగుము అనుచు పరిగెత్తుచుండెనే గాని జడలు ధరించి భస్మము పూసుకొని ధర్మమే రూపు దాల్చినది అనునట్లు ఉండుటచే పృథుపుత్రుడు జంకి బాణము వేయుట మానెను. అత్రి మహర్షి మరల అతడు యజ్ఞమును నాశనము చేయు ఇంద్రుడే చంపుమని ప్రేరణ చేసెను. ఇట్లు అతిరి చెప్పగా పృథుపుత్రుడు చంపవలెనని తొందరలో పరిగెత్తిపోవుచున్న ఇందుని వెంట సింహము ఏనుగును వెంటాడునట్లుగా అనుసరించెను. ఆ పాఖండ రూపములో ఉన్న ఇంద్రుడు మాయచే దాల్చిన ఆ రూపమును విడిచెను. గుర్రమును అచటనే వదలెను. కనపడకుండా అంతర్ధానమాయెను. పృథుపుత్రుడు ఆ అశ్వమును తీసుకొని వెనకకు వచ్చెను. పృథుపుత్రుడు అశ్వమును జయించి వెనకకు తెచ్చినాడని సంతోషించి అత్రి మొదలగు మహర్షులు విజితాశ్వుడని అతనికి పేరు పెట్టిరి. సార్ధకమగు ఆ పేరుతోని తర్వాతి కాలమున అతడు వ్యవహరింపబడుచుండెను. మైత్రేయుడు మరల ఇట్లు చెబుచున్నాడు. ఇంద్రుడు దట్టమగు చీకటిని ఆ యజ్ఞ క్షేత్రమున వ్యాపింపచేసెను. బంగారు రసనతో యూపమునకు బంధింపబడి ఉన్న అశ్వమును ఎవరికీ కనపడకుండా వచ్చి ఇంద్రుడు మరలా అపహరించుకొని పోయెను. అత్రి మరలా విజితాశ్వునకు చూపి వెన్నాడి చంపమని చూపెను. కానీ ఆ ఇంద్రుడు వృద్ధుని వలె కపాలమును ఖట్వాంగమును ధరించి ఉండుటచే అతనిపై బాణములు వేయలేదు. అత్రి ఊరుకొనక అతడు ఇంద్రుడే బాణము వేయమని ప్రోత్సహించెను విజితాశ్వుడు. బాణమును సంధించెను. ఇంద్రుడు భయపడి ఆ రూపమును విడిచిపెట్టి మరల మాయమాయెను. తరువాత విజితాశ్వుడు అశ్వమును తీసుకొని మరల తండ్రి యజ్ఞ క్షేత్రమునకు చేరెను.

ఇంద్రుడు మోసము చేయుటకై స్వీకరించిన ఆ పాఖండ రూపమును తరువాత జ్ఞానహీనులు స్వీకరించుట జరుగుచుండెను. పాఖండము అనగా పాపఖండము అని అర్థం. వారే పాషండులు. వారు యజ్ఞ విరోధులు, వేద విరోధులు అయి ఉందురు. పృథ్వు యజ్ఞమును పాడు చేయుటకు ఇంద్రుడు దాల్చిన ఆ రూపమును స్వీకరించిన వారు అనుసరించు మార్గము పాషండ మార్గము. ధర్మం వలె కనిపించు అధర్మమును ఆశ్రయించి ప్రవర్తించు వారు పాషండులు. వారు దిగంబరులుగా ఎర్రని వస్త్రమును దాల్చి అందరకూ నచ్చునట్లు మాట్లాడగల నేర్పును సంపాదించి లోకమును వంచించుచుందురు. ఇంద్రుడు యజ్ఞమును విఘ్నము చేయుటకు సిద్ధపడినాడని ఎరింగిన పృథ్వు ఇంద్రుని చంపవలెనని విల్లు ఎక్కుపెట్టి బాణమును సంధించి నిలిచెను. అప్పుడు వృత్వికులందరూ చంపవలెదని వారించిరి. యజ్ఞములో చంపరాదు. ఇంద్రుడు యజ్ఞమును నాశనము చేయవలెనని వచ్చి నీ కీర్తి చేతనే కాంతిహీనుడైనాడు. మేము సమర్థులమగు మంత్రములతో అతనిని ఆహ్వానించెదము. అతనిని మా మంత్ర బలముచే పురోడాశయమును అగ్నిలో హోమము చేసినట్లు ఆహుతి చేసెదము అని ఋత్విక్కులు పలకగా పృథ్వి ఊరుకుండెను. ఋత్విక్కులు శృక్కు అనేటి హోమము చేసే హోమము చేసేడి సాధనమును చేతిలో పట్టుకొని మంత్రమును చదువుచు ఇంద్రుని హోమము చేయవలెనని సిద్ధపడి అప్పుడు చతుర్ముఖుడు వచ్చి వారించెను. వారించిన తర్వాత ఏం జరిగిందో మరియొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. No one can cross this illusion, which is the illusion of the Vedas. I bow to the self-realized one, who is beyond the qualities of the Vedas. No one can cross the illusion of the Lord. The being, deluded by it, has lost its own form. We salute that Supreme Being, who has subdued the qualities of Maya, Sattva, and Raja. He is moving as the life form, equally among all living beings. Eighth Canto, Fifth Chapter, Thirty-second Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Fourth Canto. Welcome to episode 21. Until now, as part of the conversation between Vidura and Maitreya, Prithu Raja, in the conversation that took place in the middle of the earth, praises the earth for the anger shown by Prithviraja on the earth, and tells him to take medicine from her. Let us try to understand what happened next. In this way, after hearing the plea for the welfare of the earth, Swayambhu Manu was firmly established. He himself is ready to be tormented. He is Prithu Raja. His own hand's milk He provided a vessel for sucking. Thus, it made the earth yield the milk, which is the root of all medicines, so that the medicines may be renewed on the earth. Like Pruthuvi, all the men with complete wisdom drank from that cow according to their respective desires. Vasishta and other sages firmly established Brihaspati, and through the senses of speech, mind, and hearing, they milked the ocean of milk in the form of the Vedas. Similarly, the gods firmly created Indra, and in a golden vessel, they took the power of mind, the power of endurance, the power of senses, and the power of wealth. Prahlada, the best among the demons, was firmly created in a metal vessel of three types

Sura made asavamu kshiramuga pithukkiంది. It is prepared with jaggery, flour, and honey that comes from the pulp. Therefore, the three types of gods are like that, and so are the Gandharvas and Apsaras. Having strengthened Vishravasu, having made the lotus a vessel, they drank the beauty and alcohol that were pleasing to the Gandharvas. The ancestors. The gods of Shraddha firmly placed the offering and poured the kavam into a freshly made earthen pot. The Siddhas, keeping Kapila Maharshi firmly, had the powers of accomplishment, such as the power of accomplishment, etc., poured into the vessel called the sky. The wondrous forms, the Kimpurushas, taking Maya as their beloved, in the process of yoga, the power of holding, the power of thought, is drawn. By that holding, they can assume any form they desire. The flesh-eating Yakshas, Rakshasas, ghosts, and demons. Having firmly imagined Rudra, the ghost, they squeezed the blood like asava, like asava, into the vessel called Kapala. Snakes without wings, snakes with wings, snakes with a nature of biting, tusked ankles, cobras, Takshudanu and Nagaraju, firmly united, having mixed the pit of snakes into a vessel, having squeezed the worms and fruits into their food, the trees, having firmly made the banyan tree, into their clutches, bitter, sour, sweet, and other juices Having squeezed them as milk, they firmly established the chief ones in their respective castes, and from the earth, they sowed those who were needed in their respective roles. In this way, the mountains, having strengthened the Himalayas, have extracted various minerals from their actions. Prithu and others squeezed the materials they used for themselves. Prithu, the emperor, was pleased with her for providing all the desired things on earth and loved her as his daughter. Therefore, the earth was named Prithvi. Then, holding his bow, he leveled all the mountains with its end.

Then the earth became flat. He provided for the people's livelihood and provided them with the necessary dwelling places. Those residences were formed with the names of villages, towns, cities, forts, and hamlets. He established cowsheds for cows. He formed armies and camps. Towns and villages were formed long ago by the Pruthuvas. There was no such arrangement before. Everyone lives happily and without fear in them. In this way, Emperor Prithu, after extracting medicines from the earth, leveled the land and provided housing for the people. The site where Swayambhuva Manu resided is called Brahmavarta. It has on one side the Saraswati, on the other side the rivers called Drishadvati. The Saraswati River flows to the east. In Brahmavarta, Pruthuvu performed a hundred yagnas. Prithu's great yagna (sacrifice) was being celebrated on a grand scale. In that Yagnya, Srihari himself was the Yagnapati, the direct Lord. There, directly, having made Sri Hari's presence, being worshiped by that Yagnya, he was the one who received the fruit. Brahma, the creator god, Rudra, Indra, and other lords of the world, along with the Gandharvas, served and sang their glory. The Siddhas, Vidyadharas, Daityas, Danavas, Yakshas, Sunandu and other Bhagavat Savasandulu all came to Acharaka following Srihari. To serve Srihari, Kapila, Narada, Dattudu, and the sons of Sanaka came following. In that Brahmavarta, the earth, with all desires, flowed down to the earth. There, the rivers of Ikshu, Drakshadi, and others, like rivers flowing with curd, milk, rice, ghee, and so on, were flowing. All the trees were filled with flowers and fruits that were nectar-producing. The sea was housing gems. The mountains were providing four types of food, edible, non-edible, non-digestible, and non-digestible. Seeing that the Pruthuvu's yagna was happening with such splendor, Indra became envious. While the hundredth Ashwamedha Yaga was taking place, Indra stole the sacrificial animal that was decided to be worshiped to the Lord.

While they were abducting and fleeing in the sky, Atrimuni saw them. Indra, as if a righteous person, as if creating confusion, had worn matted hair. Seeing the dangling matted hair, he could not recognize that he was a heretic, a Pakhundu. Athri Maharshi, recognizing that Indra was the one who was abducting the horse, inspired Prithu's son to kill him. His son, along with him, was running with anger, saying, "Stop, stop," but as he was running with matted hair and wearing ashes, and as it was appearing as if Dharma itself had taken form, the son of Prithu did not stop shooting arrows. Atri Maharshi again, he, Indra, who destroys the Yagnya, inspired to kill him. Thus, as the prince was about to kill him, Indu, who was running in haste, followed him like a lion and an elephant chasing. Indra, who was in the form of a Pakhanda, left that form that was created by Maya. The horse was left there. Unse door ho gaye, jaise ki unhone khud ko bandh liya hai. Prithu's son came from behind, taking the horse. Prithuaputra They rejoiced that he had conquered the horse and brought it back, and they named him Vijitashwa, after the sages Atri and others. That name, which was meaningful, was used by him in later times. Maitreyi again says this. Indra caused the dense darkness to spread over the sacrificial field. Indra came and stole the horse that was tied to the Upanu with golden rasa without anyone seeing it. Atri again showed Vijitashva and showed him to kill him. But Indra, like an old man, having a skull and a khatvanga, did not shoot arrows at him. Athri, without retiring, encouraged Indra to shoot an arrow. Vijitaashvudu. The arrow was aimed. Indra, frightened, abandoned that form and again disappeared. After that, Vijitashvu took the horse and returned to his father's sacrificial field.

Indra accepted that demonic form to deceive, and later, the ignorant ones accepted it. Pakhandam means sinful deed. They are the Catholics. They are against the Yajna and the Vedas. Those who have accepted the form that Indra assumed to spoil the earth's sacrifice are following the path of the heretic. Those who appear to be righteous but act by relying on unrighteousness are hypocrites. They, as naked, wearing a red garment, and having acquired the skill to speak in a way that pleases everyone, will deceive the world. Indra, knowing that Indra was ready to obstruct the Yagnya, Prithu, thinking that he should kill Indra, took up his bow, aimed the arrow, and stood there. Then the elders urged that all the Vrittikas should be killed. Sacrifice is not a thing. Indra came to destroy the yajna and became devoid of light because of your fame. We will invite him with competent ministers. As the priests said that we would offer him as a sacrifice as if offering the Purodasha in the fire with the power of our mantra, the earth was silent. The priests, holding the sacrificial implements, the sacrificial fire, and the mantra in their hands, prepared to perform the sacrifice to Indra. Then, Chaturmukha came and stopped them. We'll find out more in another podcast after we finish this one. Jai Srimannarayana. Salutations to the Guru