పృథు సనత్కుమార సంవాదము & ప్రాచీనబర్హి (Parts 25-31)
Prithu-Sanatkumara Talks & Pracinabarhi (Parts 25-31)
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ మహత్తర ఘట్టంలో, మహారాజు పృథువు మరియు బ్రహ్మజ్ఞాని సనత్కుమారుని మధ్య జరిగిన దివ్య సంవాదం విశదంగా వివరించబడింది. భగవద్భక్తి, వైరాగ్యం మరియు పరమాత్మ స్వరూపంపై సనత్కుమారుడు పృథు మహారాజుకు అమూల్యమైన ఆధ్యాత్మిక బోధలు అందజేస్తారు. ఆ తదుపరి, యజ్ఞకర్మలలో నిమగ్నుడైన ప్రాచీనబర్హి మహారాజు కథ ప్రారంభమవుతుంది, ఆయన ఆత్మీయ పరివర్తనకు శ్రీహరి అనుగ్రహం ఏ విధంగా మార్గం సుగమం చేస్తుందో ఈ ఎపిసోడ్‌లో హృద్యంగా తెలుపబడింది.
In this profound episode of Srimad Bhagavatham Canto 4, the sacred dialogue between King Prithu and the great sage Sanatkumara unfolds, revealing timeless wisdom on devotion, detachment, and the nature of the Supreme Lord. Sanatkumara guides Prithu with illuminating instructions on how a sincere devotee should cultivate unwavering love for Sri Hari and gradually transcend the bondage of material existence. The episode then transitions to the story of King Pracinabarhi, whose intense engagement in ritualistic sacrifices draws the compassionate attention of the Lord, setting the stage for deeper spiritual instruction.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః అజాత జన్మస్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుఖార్ణవాయ అనోరణిమ్నే పరిగణ్య ధామ్నే మహానుభావాయ నమో నమస్తే ఓ దేవా నిర్గుణవుడవు నీకు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములతో సంగము లేదు పరమానంద మహోదధివియగు నీవు సూక్ష్మతమమగు ఆకాశము కంటే సూక్ష్మమగు స్వరూపము గలవాడవు. నీ స్వరూపమునందు దేశకాలముల కొలతలు. లేవు. సర్వోత్తమగు ప్రభావము గల నీవుకు అనేక నమస్కారములు. ఎయిత్ కాంటో సిక్స్త్ చాప్టర్ ఎయిత్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. చతుర్ధ స్కంధం 25వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు పితుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజు యొక్క చరిత్రలో భాగంగా పృథురాజుకి సనత్ కుమారుడు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఆ ఉపదేశాన్ని విన్న తరువాత పృథురాజు ఏం మాట్లాడుతున్నాడో నన్ను తెలుసుకుందాం. ముని కుమారులారా, తాపత్రయముచే దుఃఖించుచున్న వారలపై దయ చూపడి శ్రీహరి ఇంతకుముందే నన్ను అనుగ్రహించినాడు. దానిని ఆవిర్భవింప చేయుటకు మీరు ఇచ్చటికి వచ్చేసినారు. ఇంత ఉపకారము చేసిన మీకు దయామయులగు మీకు గురుదక్షిణగా నేను ఏమి వసంగగలను? ఈ శరీరము నాది అనుకొనడి సకల పదార్థములు సత్పురుషులు అనుగ్రహించి వసంగినవే గానీ నావి అనుకొని నొసంగదగినవి ఏమియు లేవు. మీరు వసంగిన వానిని మరల మీకు గృహదక్షిణగా వసంగుట తగదు కదా అయినను మీ సేవకుడను నాకు చెందినవన్నీ మీవే అందుచే నా ప్రాణములు, నా భార్య, పుత్రులు, రాజ్యము, సైన్యము, పరికరములు, భూమి, ధనము మొదలగున అన్నియు మీవే.
అవి సమర్పించుచున్నాను. సేనాపతిగా ఉండుట, రాజ్యమును పాలించుట, దండనాయకుడై ఉండుట, సర్వలోకాధిపత్యము కూడా వేద శాస్త్ర విజ్ఞానము గల బ్రహ్మవేత్తలదే. వారిది కానిది ఏదీయు లేదు. బ్రాహ్మణుడు తినుచున్నది, ధరించుచున్నది, వసంగుచున్నది కూడా తన సొత్తే గానీ ఒకరిది కాదు. ఆ బ్రాహ్మణులు అనుగ్రహించి క్షత్రియులకు వసంగిన దానిని వారు నభవించుచున్నారు. మీరు ఆధ్యాత్మిక విచారమును నాకు ఎరిగించి దుస్తరమగు సంసార ఆర్ణమును దాటిడి ఉపాయమును సంగినారు. మీ కారుణ్యము అనంతము. మీరు చేసిన ఈ ఉపకారమునకు ఎవరు ప్రత్యొంపకారము చేయగలరు? దానికి ప్రతిగా సమర్పింపదగినది ఏమీయు లేదు. అంజలి ఘటించుటయే దానికి ప్రత్యుపకారమని అది రాజగు పృథ్వి కృతజ్ఞతను ఆవిష్కరింపగా ఆత్మయోగ నిష్ఠులగు సనత్కుమారులు ఆ పృథ్విచే పూజింపబడిన వారై. అతని శీలము ప్రశంసించుచు అందరూ చూచుచుండగా ఆకాశమునకు ఎగిరి వేనపుత్రుడగు పృథ్వి చక్రవర్తి సనత్కుమారుడు చేసిన ఆధ్యాత్మిక శిక్షణచే. పరమాత్మోపాసనమున నిష్ట గలవాడై అన్ని కోరికలు ఈడేరిన వాని వలె ఒప్పుచుండెను. ఇట్లు భగవత్ ఉపాసన చేయుచు తాను చేయదగిన కర్మలన్నింటిని ఆయా కాలములకు తగినట్లుగా చేయుచు అంతయు బ్రహ్మార్పణము చేయుచుండెను. తాను చేయు కర్మచే కలిగెడి ఫలమును పరమాత్మ ప్రీతికే అర్పించుచుండును. తాను చేయు పని తనది అని భావింపక పరమాత్మదే అని భావించుచుండును. కర్మ చేయువాడు పరమాత్మయే నెరుంగును. ప్రకృతి సంబంధముచే తాను చేయుచున్నానని భావించుచున్నట్టు ఎరింగి ఉండును. రాజప్రసాదములో ఉండి సామ్రాజ్య లక్ష్మి కలవాడై ఉండియు దేహమే నేను అనడి భ్రాంతి లేనివాడై సూర్యుడు తన కిరణములు బురదపై పడినను బురద అంటనట్లు ఏ విధములకు దోషములంటక ఒప్పుచుండును. ఆత్మ స్వరూపమెరింగి ప్రకృతి కంటే ఆత్మను వేరుగా ఎరింగెడి జ్ఞానముతో భగవద్భక్తితో కర్మలను ఆచరించుచుండును. ఇట్లుండి. అర్చి అనే పేరు గల భార్యను పరిణయమాడి ఆమె యందు తనతో సమానులగు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్వక్షుడు, ద్రవిణుడు, వృకుడు అనే ఐదుగురు కుమారులను కనెను.
పృథువు ఇంద్రాది లోకపాలుల యొక్క గుణములన్నింటియు కలిగి ఉండిన వాడై పరమాత్మ యొక్క సృష్టిలోని జగత్తును రక్షించుటకు తగిన సమయములలో అందుకు తగిన కాలమును వినియోగించుచుండెను. చంద్రుడు అందరకు ఆహ్లాదమును కలిగించును అందుచే అతనికి సోమరాజు అని పేరు వచ్చెను తన మనోవాక్ కాయ వ్యాపారములతో సౌమ్యముగు గుణములచే ప్రజలను రంజింపచేయుటచే పృథ్వునకు రాజు అని పేరు వచ్చెను సూర్యుడు భూమిమందలి సారమును గ్రహించి మరల వర్ష రూపముగా వర్షింపచేయును అట్లే ఇతడు కూడా ప్రజల నుండి ధనమును సేకరించి వారికై వినియోగించుచుండును, అగ్ని వలె ఇతరులు ఆక్రమించుటకు వీలు కాకుండెను, ఇంధుని వలె జయించుటకు శక్యము కాకుండెను, ఓరిమిచే భూమితో సమానముగా ఉండెను. ఇంద్రుడు ఆకాశము నుండి వర్షించినట్లు అందరి కోరికలను వర్షించుచుండెను. స్వర్గం వలె అందరుకు తృప్తినిచ్చుచుండెను. సముద్రం వలె ఎవరి చేతను పరిచ్ఛేదించుటకు వీలు కాని వాడై ఉండెను. హిమోత్ పర్వతం వలె శ్రేష్టమగు వస్తువులకు స్థానమై ఉండెను, మేరు పర్వతం వలె అన్నింటినీ తన అధీనమున ఉంచుకొనెను, యముని వలె తగిన శిక్ష వసంగుచుండెను. వాయువు వలె బలముచే శక్తిచే అందరకు ఆత్మయే ఉండెను. రుద్రుని వలె శరీరము బలము ఇంద్రియ బలము గలవాడై ఉండెను. సౌందర్యములో మన్ముధుని వలె ఉండెను. అడ్డు లేక సంచరించుటలో సింహం వలె ఉండెను. మనువు వలె అందరి యెడ వాత్సల్యము కలిగి ఉండెను. వేద వాదమునందు బృహస్పతి వలె ఉండెను. బ్రహ్మ వలె అందరిపై ప్రభుత్వము గలవాడై ఉండెను. గోవుల యందు గురువుల యందు బ్రాహ్మణుల యందు భక్తుల యందు భక్తి గలవాడై ఉండెను. ఒకరికొకరు పాటుపడుటలో తనకు తానే సాటి అనదగినట్లు ఉండెను. పల్లెలలో పట్టణములలో ఉండెడి వారందరూ అతని కీర్తిని గానము చేయుచుండగా వినిన వారి మనస్సులను రాముని వలె హరించువాడై ఉండెను ఈ విధముగా సర్వగుణ సంపన్నుడై లోకమును పాలించెను తాను బాగా వృద్ధుడై ప్రజలందరును ఇంత కాలమును చక్కగా పాలించి
స్థావర జంగమములు అన్నిటికీ జీవికలను కల్పించి ధర్మమును ఎరుంగి పాలించి భగవానుని ఆదేశమును అనుసరించి ప్రజా పాలనము నెరవేర్చెను. తన కుమార్తెగా భావించి పోషించిన భూమిని తాను వదిలి వెళుచున్నానని బాధపడుచున్నదా అనునట్లుగా ఉన్న దానిని తన కుమారులకు అప్పగించి తపోవనముకేగెను. అచ్చట కూడా వానప్రస్థ నియమములను నిర్వఘ్నముగా పాలించి పూర్వము పాలనమును ఎట్లు దీక్షగా ఉండెనో అట్లే స్వర్గమును పొందుటకు తీవ్రమగు తపస్సు చేయు దీక్ష వహించెను. కందమూలములను, ఫలములను ఆహారముగా తీసుకునుచు, కొంతకాలము పండిన ఆకులను తినుచు, కొంతకాలము నీరు మాత్రమే తాగుచు, కొంతకాలము వాయువును ఆహారముగా తీసుకునుచు తపస్సు చేయుచుండెను. గ్రీష్మ ఋతువులో నాలుగు అగ్నిహోత్రములను నాలుగు ప్రక్కల ఉంచుకొని సూర్యుడు తపించుచుండగా తపస్సు చేయసాగెను. వర్ష ఋతువులో నీటిలో కంఠం వరకు మనిగి ఉండి తపస్సు చేసెను. ఏమియు పరుచుకొనక నేలపై పరుండెను, శీతోష్ణాదులను సహించుచు మౌనవ్రతుడై ఇంద్రియ నిగ్రహము గలవాడై శాంతుడై శ్రీహరిని ఆరాధించుచు ఉత్తమమైన తపస్సు చేసెను. తపస్సు చేయుచు ప్రాణాయామము చేయుచు మనసులోన మాలిన్యములను కర్మలను నాశము చేసుకొనెను ఇంద్రియములు విషయముల నుండి వెనకకు మరల్చెను దేహముతోను దేహమునకు సంబంధించిన వారితోను బంధము వీడెను సనత్ కుమారుడు తనకు ఉపదేశించిన ఆధ్యాత్మిక యోగమును అనుసరించి పరమ పురుషుని భక్తితో సేవించెను. ఈ విధముగా భగవత్ ధర్మములను పాటించిన సాధువగు ఆ పృథ్వునకు జ్ఞాన శక్త్యాది గుణములతో పూర్ణుడైన భగవానుని యందు అవ్యభిచరితమగు భక్తి కలిగెను. సంతతమో భగవత్ పరిచర్య చేయుచుండెను. దానిచే మనసు రజస్తమస్సులు లేక శుద్ధ సత్వమావిర్భవించెను. భగవత్ స్మరణము, భగవత్ భక్తి పరిపూర్ణముగా కలిగెను. దానిచే వైరాగ్యం ఏర్పడెను. దానిచే స్వస్వరూపము, పరస్వరూపము తెలిసి సంశయములన్నియు విడిపోయెను.
ఆత్మకు అంటి ఉన్న ప్రకృతి బంధము తొలగిపోయెను. దేహమే ఆత్మ అయినటి బుద్ధి పోయెను. ఆత్మ స్వరూపము సాక్షాత్కరించెను. దానిచే నిర్వ్యాపరుడాయెను. శరీరము కంటే తాను వేరు అనేటి జ్ఞానము కాక శరీరమే భాసించకుండా తానే భాసించుచుండెను. మరి దేనియందు మనసు చలించుట లేదు? భగవత్ కథలయందు మనసు నిశ్చలముగా నిలువని వానికి మనసు మరల మరల వేరొక విషయమునందు వెళుచుంటుంది. ఉండును కానీ పృథ్వును కట్టి ప్రమాదము కలగలేదు తనను పరమాత్మతో విడదీయరాని తత్వమును ఎరంగెను పరమాత్మతో సమానముగా ఎనిమిది గుణములు తనలో ఆవిర్భవించెను ఇట్లు కొంతకాలము సాగగా ప్రారబ్ధ కర్మ అవసానమై శరీరమును వీడెను ఆ శరీరమును వీడినప్పుడు తాను మడమలపై కూర్చొని మడమలతో గుదస్థానము నొక్కి ఉంచి మూలాధారమునందు ప్రాణశక్తిని ఊర్ధ్వముగా నిలిపి నాభిని హృదయమును ఉదరమును శీర్షస్థానమును వాయు చేరునట్లు చేసెను. తన శరీరములో నుండి వాయువును వాయువుతోను పృథ్వి వికారముగు శరీరమును పృథ్విలోను తేజస్సును తేజస్సులోను ఇంద్రియములను ఆకాశమునందును ద్రవమును జలమునందును లేమగునట్లు చేసెను. ఇట్లు కార్యవర్గమంతయు కారణములందు చేరునట్లు చేసి అన్నిటికీ కారణముకు ప్రధానమగు ప్రధానము జీవుని యందుంచెను. అప్పుడు అతిత్సమష్టితో కూడి ఉన్న సస్వరూపమును అనుసంధించుకొనెను, జ్ఞాన వైరాగ్య బలముచే పుణ్య పాప కర్మలన్నింటిని తనను వీడునట్లు వీడిపోవునట్లు చేసెను, పరమాత్మ ఆత్మగా గలవాడై. ఎనిమిది గుణములు ఆవిర్భవించిన వాడై స్వస్వరూపము ఆవిర్భవించి ముక్తుడాయెను. ఆయన భార్య మహారాణి అర్చి అనునామే అంతవరకు నేలపై కాలు మోపి ఎరుగనిది భర్తను అనుసరించి అరణ్యమునకు వచ్చినది. అడవిలో భర్త సేవ ఋషుల వలె దేహ యాత్ర. చేయుచు శరీరము కృషించుచున్నను దుఃఖమునందలేదు. ఆమె పృథ్వు శరీరమును వీడి వెడలుటను గమనించి కొద్దిగా విలపించి ఆ కొండ చెరియందు చితిమైన ఉంచి భర్త శరీరముకు సంస్కారము చేసెను. తరువాత అతడు సరస్సులో స్నానము చేసి భర్త భర్తృపీతికే తృణమొనర్చి దేవతలకు నమస్కరించి భర్త పాదములనే ధ్యానించుతూ చేతికి మూడు సుమారులు ప్రదక్షిణము చేసి ఆ అగ్నిలో తాను ప్రవేశించెను. ఆ మందర పర్వత పానుపై
ఈ విధముగా వారిరువురు దేహయాత్రను చాలించుటకు చూచిన దేవతలు పుష్ప వర్షమును కొరిపించిరి. దుందుబులు మ్రోగెను. ఆమెను చూచిన దేవతా స్త్రీలు ఇట్ల అనుకొనుచున్నారు. ఓహో ఈమె ధన్యురాలు. రాజులలోకెళ్ళ శ్రేష్టుడగు పృథువును భర్తగా పొందినది, లక్ష్మీదేవియే రూపుదాల్చి యజ్ఞపతియగు శ్రీహరిని చేరినట్లు చేరినది, తన పాతివ్రత్య బలముచే పృథువును అనుసరించి పైలోకములకేగుచున్నది, చురుడు భగవత్ప్రాప్తికి సాధనము నివృత్తి ధర్మము. అనగా ఫలమును, సంఘమును, కర్తృత్వమును వీడి భగవదారాధన రూపముగా తన ధర్మమును తాను ఆచరించుట అట్టి వారికి ఏది దుర్లవమగును? స్వర్గాది లోకములే కాదు, భగవత్ ప్రాప్తి కూడా వారికి సులభముగా లభించును. మనుష్య జన్మ మోక్షమునకు సాధన భూమి. అది లభించుట చాలా కష్టం. కర్మ పరిపాకముచే మనుష్య జన్మ పొంది కూడా శబ్దాది విషయములపై కోరిక కలిగి భగవత్ ప్రాప్తికి దూరమగువారు. దైవమునే మోసము చేయువారు. ఇట్లు దేవతా స్త్రీలు చేయుచుండగా ఆమె పతిలోకమునకేగినది. ఆమె భర్తయ్యగు పృథ్వు జ్ఞానములో అగ్రేసరుడై భగవన్ నివాస భూతమగు శ్రీ వైకుంఠమునే చేరెను. ఆమె కూడా ఆ లోకమునే చేరినది. పృథ్వు మహానుభావుడు, పూజ్యులలోకెళ్ళ పూజ్యుడు. అతని దివ్య చరిత్రమును నీకు వినిపించితిని. ఇది చాలా పవిత్రమైనది. దీనిని ఎవరు శ్రద్ధతో విందురో, వినిపించురో వారు పృథ్వు పొందిన స్థానమును పొందురు. బ్రాహ్మణుడు పృథ్వి చరిత్రను విన్నచో బ్రహ్మ వర్చస్సు పొందును. క్షత్రియుడు భూమి పతిత్వమును పొందును. వైశ్యుడు ఉత్తమ వణిక్కు అగును. శూద్రుడు ఉత్తమముడగును. పురుషుడు గాని, స్త్రీ గాని మూడు మార్లు దీనిని వినెనచో సంతానము లేని వారు యోగ్యులపు సంతానము పొందుదురు. నిర్ధనుడు ధనవంతుల్లో శ్రేష్టుడగును. కీర్తి లేనివాడు విపులము కీర్తిని పొందును. జ్ఞానము లేనివాడు జ్ఞాని అగును. ధనమును కీర్తిని ఆయుర్దాయమును కలిగించు చరిత్రము ఈ పృధు చరిత్రము. ఈ పృధు చరిత్రము. స్వర్గమును ప్రసాదించును కలిదోషములు అంటకుండా చేయును ధర్మార్థ కామ మోక్షములను సిద్ధింపచేయును విజయమునకు
సిద్ధపడిన రాజు ఈ చరిత్రం వినిన శత్రురాజులు అతనికి లొంగి కప్పమును కట్టెదరు. ఈ చరిత్రం వినిన వారికి భగవానుడి కంటే ఇతరములగు విషయమునందు మనస్సు లగ్నము కాదు భక్తి కలుగును. ప్రతిదినము ఆదరముతో దీనిని వినునచో సంసార సముద్రమును దాటుటకు నా వలె భగవత్ పాదముల యందు నిశ్చలమగు భక్తి ఏర్పడును. తర్వాత జరిగిన విషయాన్ని మనం మళ్ళీ అనుభవిద్దాం. పృథువు స్వర్గలోకానికి ఎగాడు, తనతో పాటు తన భార్య కూడా వెళ్ళింది. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. The one who is born without birth, the one who is in control of the state of being, the one who is the cause of the qualities of liberation, the one who is the ocean of happiness, the one who is the one to be considered, the one who is the abode of the great one, salutations, salutations to that God. You are without attributes, you have no connection with the creation, preservation, and destruction of the world You, who are the ocean of supreme bliss, are subtler than the most subtle form of the sky. In your form, there are no measurements of space and time. You have the supreme influence. Many salutations to you. Eighth Kanto, Sixth Chapter, Eighth Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 25th podcast episode of Chaturtha Skandham. Until now, as part of the conversation between Pitura and Maitreya, as part of the history of Prithu Raja, we have experienced the teaching that Sanat's son taught Prithu Raja. After hearing that sermon, let's find out what Prithu Raju is talking about. Oh, sons of the sage, show mercy to those who are suffering from anxiety. Srihari has already blessed me before. You've come here to be exposed to it. Having done so much good, we are compassionate to you What can I offer you as Guru Dakshina? Considering this body as mine, all substances are bestowed by the virtuous, but there is nothing to be denied, considering it as mine. You should not return the one who has been settled to you as a housewarming gift, but your servant and everything that belongs to me is yours. Therefore, my life, my wife, my sons, kingdom, army, equipment, land, wealth, and all that, are yours.
I am submitting them. Being a commander, ruling the kingdom, being a commander, even the sovereignty of all the world belongs to the Brahmavidas who have knowledge of the Vedic scriptures. There is nothing that they do not have. What a Brahmin eats, wears, and possesses is his own property, not someone else's. Those Brahmins, by bestowing grace, have given it to the Kshatriyas, and they are enjoying it. You have made me aware of spiritual inquiry and have shown me the way to transcend the difficult worldly existence. Your compassion is infinite. Who can repay for this favor you have done? Nothing can be offered in return. That offering of Anjali is reciprocated, and as the king Prithvi expresses gratitude, the eternal sons who are devoted to self-yoga become worshiped by that earth. While praising his character, everyone was watching, and the prince of heaven, the emperor of the earth, Sanatkumara, through spiritual training. Being devoted to the worship of the Supreme Being, he agreed like one who had all desires fulfilled. Thus, worshipping the Lord He was doing all the deeds that he could, according to the respective times, and he was offering everything to Brahma. He who performs actions, offers the fruits obtained by them to the Supreme Soul with devotion. He does not consider his work as his own, but considers it as the work of the Supreme Being. The doer of karma is none other than the Supreme Soul. It seems as if he is doing it because of nature. Being in royal grace, being the Lakshmi of the empire, being without the delusion that the body is me, even if the sun's rays fall on the mud, it agrees without being mud, without causing any faults to any kind of things. Having realized the nature of the soul, one should perform actions with knowledge and devotion, separately from nature. Thus it is. Having married his wife named Archi, he had five sons named Vijitashwa, Dhumrakesh, Harvaksh, Dravinudu, and Vrukudu, who were equal to him.
The Supreme Being, who possessed all the qualities of the lords of the worlds, Indra, etc., was using the appropriate time and the appropriate period to protect the world in the creation. The moon brings joy to everyone, hence he was named Somaraju. By his mental words and body, and by his gentle qualities, he pleased the people, hence he was named the king of the earth. The sun is the essence of the earth He receives and again causes rain in the form of rain, similarly, he also collects wealth from the people and uses it for them Like fire, it was not possible for others to occupy it, it was not possible to conquer it like fuel, it was equal to the earth in its depths. Indra, as if raining from the sky, was raining everyone's wishes. He was giving everyone satisfaction like heaven. Like the ocean, he was unable to be controlled by anyone. Like the Himalayas, it was the place of the best things, like the Meru mountains, it kept everything under its control, like Yama, a fitting punishment He was being destroyed. Like air, with strength and power, the soul was present in everyone. He was as strong as Rudra, with a strong body and senses. He was like a madman in beauty. He was like a lion in his roaming without any hindrance. He had affection for everyone like Manu. He was like Brihaspati in Vedic arguments. Like Brahma, he was the one who had the government over everyone. He was devoted to cows, gurus, Brahmins, and devotees. He was unparalleled in his support for one another. While all those living in villages and towns were singing his praises, he was like Rama, destroying the hearts of those who heard. In this way, he was all-gun-endowed and ruled the world. He became very old, and all the people for so long Nicely ruled
Providing livelihoods to all the stationary and movable things, upholding Dharma, and following the orders of the Lord, he carried out public governance. As if feeling sad that he was leaving the land he had nurtured thinking of it as his daughter, he entrusted it to his sons and went to the hermitage. There also, having strictly followed the rules of asceticism, she vowed to perform rigorous penance to attain heaven, just as she had been steadfast in her previous governance. Taking roots and fruits as food, eating some ripe leaves for some time, drinking only water for some time, taking air as food for some time, he was doing penance. In the summer season, keeping four Agnihotras on four sides, as the sun was scorching, he began to do penance. During the rainy season, he stayed in the water up to his neck and performed penance. Without revealing anything, he lay on the ground, enduring the heat and cold, remaining in a vow of silence, being controlled by the senses, being peaceful, worshiping Sri Hari, he performed excellent penance. Doing penance While doing pranayama, he destroyed the impurities and karmas in his mind, he turned away from the senses and the objects, he broke the bond with the body and those related to the body, Sanat Kumara, the spiritual that was taught to him He served the Supreme Being with devotion following the yogic path. In this way, that saint who followed the divine duties, having attained the qualities of knowledge, power, and other virtues, developed unwavering devotion to the Lord. Santamto Bhagwat Paricharayechuned. By that, the mind, without the influxes of passion, pure Sattva manifested. The remembrance of God, the devotion to God, was perfectly fulfilled. It brought about a sense of detachment. By that, knowing the self-form and the other-form, all doubts were dispelled.
The bond of nature that was attached to the soul was broken. The intellect which was the soul has lost its body. The Self-Manifested Soul. He was the one who defined it. Without the knowledge that he is separate from the body, he was shining without the body itself. Then, what is it that our minds are not drawn to? In the stories of the Lord, the mind does not remain steadfast; the mind repeatedly goes to another subject. He exists, but he did not have any danger by binding Prithvi. He realized the essence that cannot be separated from the Supreme Soul. He manifested eight qualities in himself, equal to the Supreme Soul. Thus, after some time passed, the inevitable karma of past deeds was exhausted, and he left the body When he left the body, he sat on his heels, pressed his anus with his heels, kept the life force upwards in the root, and made the navel, heart, abdomen, and head reach the air. From his body, he made the air to be with the air, the body of the earth to be in the earth, the radiance to be in the radiance, the senses to be in the sky, and the liquid to be in the water. Thus Having made the entire work reach the causes, the supreme being placed the supreme cause in the soul. Then, uniting with the Saswara form, which is united with the assembly of the Supreme Being, by the strength of knowledge and detachment, he made all the meritorious and sinful deeds leave him, making them disappear. The Supreme Being being the soul. He who manifested the eight qualities, manifested his true form, and became liberated. His wife, the great queen Archi, followed her husband to the forest, having never set foot on the ground until then. The service of the husband in the forest is like a journey of the body, like the sages. Doing, the body is working hard, but there is no sorrow. Observing her leaving Prithvi's body, she grieved a little and placed the pyre on the edge of the hill and performed the last rites for her husband's body. After that, she bathed in the lake, offered grass to her husband's grief, bowed to the gods, meditated on her husband's feet, circumambulated three times, and entered the fire. On the slopes of the Mandara mountain
In this way, the gods who tried to end their journey by body, cut off the rain of flowers. The thunder crashed. The goddesses who saw her thought thus. Oh, this is the lucky one. She, who had married the best among the kings, Lakshmi Devi herself took the form and reached Srihari, the sacrificer, who is the lord of the sacrifices. By the strength of her chastity, she followed Pruthu and went to the upper worlds The means to attain the Lord is detachment. That is, abandoning the fruit, the church, and the authority, and practicing his own religion as the form of divine worship, what is difficult for such people? Not only the heavens and the worlds, but also the attainment of God is easily available to them. Human birth is the means to liberation. It is very difficult to get. Even after attaining human birth through the process of karma, those who have desires for worldly matters and are distant from attaining God. Those who deceive God. Thus, while the goddesses were performing, she went to the earth. Her husband, Prithu, became the foremost in knowledge and reached Sri Vaikuntham, the abode of the Lord. She too has entered that world. Prithu was a great man, the most worshipful of worshippers. I have narrated to you his divine biography. It's very sacred. Whoever listens to this with attention, whoever makes it heard, they will attain the position that Prithvi has attained. A Brahmin, upon hearing the history of the earth, attains the glory of Brahma. The Kshatriya caste is the one who holds the earth. A Vaishya is a person of good character. The Shudra is superior. If a man or a woman listens to this three times, those who do not have children will get children of worth. A poor man is better than a rich man. He who is without fame will gain much fame. A man without knowledge is like a ship without a rudder. The history that brings wealth, fame, and longevity is this great history. This is the history of Pruthu. He bestows heaven, removes the faults of Kali, makes one free from them, and bestows righteousness, desire, and liberation, and to victory
The king, having prepared, hearing this history, the enemy kings will surrender to him and pay tribute. Those who hear this history will not be attached to other things than the Lord, and will have devotion. If you listen to this with reverence every day, you will develop unwavering devotion at the feet of God, which will help you cross the ocean of worldly life. Let's go back in time and experience the event again. Prithu went to heaven, taking his wife with him. Jai Srimannarayana. Salutations to the Asmadgurus