పురంజన కథా అంతరార్థ వివరణ - జీవాత్మ పరమాత్మ తత్వము
Narada Explains the Spiritual Significance of the Allegory
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ గంభీరమైన ఎపిసోడ్లో, మహర్షి నారదుడు పురంజన కథలో దాగి ఉన్న అధ్యాత్మిక రహస్యాన్ని విశదంగా వివరిస్తాడు. నవద్వార పురం, సర్పం, సుందరి, మరియు రాజు యొక్క భోగలాలసత్వం — ఇవన్నీ జీవాత్మ భౌతిక దేహంలో చేసే ప్రయాణానికి సంకేతాలని నారదుడు తెలియజేస్తాడు. ఇంద్రియ సుఖాలకు లోనైన జీవుడు పరమాత్మతో తన నిత్య సంబంధాన్ని మరచి జన్మ మరణ చక్రంలో చిక్కుకుంటాడని ఈ కథ స్పష్టం చేస్తుంది. ఈ అమూల్యమైన తత్వబోధ ప్రతి ముముక్షువుకూ భగవంతుని చేరే మార్గాన్ని సుస్పష్టంగా చూపిస్తుంది.
In this profound episode of Srimad Bhagavatham Canto 4, the great sage Narada unveils the deeper spiritual meaning hidden within the allegory of King Puranjana. Every element of the story — the city of nine gates, the serpent, the beautiful woman, and the king's wanderings — is revealed as a symbolic representation of the soul's journey through the material body. Narada masterfully explains how the individual soul, enchanted by the senses, forgets its eternal relationship with the Supreme Lord and becomes bound by the cycle of birth and death. This timeless teaching illuminates the path back to the Divine and reminds every sincere seeker of the ultimate purpose of human life.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః జయోరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః ఓ శ్రీహరి, నిన్ను సకల లోకములు కీర్తించును. నీ పరాక్రమము అనన్యము. వేదవేత్తల యందు నీకు ప్రీతిమెండు. సత్వరజస్తమో గుణములను ఉపాధిగా స్వీకరించే నీకు అనేక నమస్కారములు. ఎయిత్ క్యాంటో 17th చాప్టర్ 25th ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక 34వ పాడ్కాస్ట్ చతుర్ధ స్కంధములో స్వాగతం. ఇంతవరకు మిధుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానంలో పురంజన చరిత్రతో పాటు దాని తత్వార్ధాన్ని కూడా కలిపి తెలుసుకుంటూ కథలో ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు జీవితంలో వృద్ధుడైపోయి జర అనేటువంటి దశలో వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలను ఆ తత్వార్ధాన్ని మనం గ్రహిద్దాం. ఆ కాల కన్యయే జర అనగా ముసలితనం. ఆమె కాలం యొక్క కుమార్తె. ఆమెను ఎవ్వరూ పెళ్లి ఆడరు. ఎవ్వరూ స్వీకరింపరు. మూడు లోకములలో తిరిగినను జరను స్వీకరించే వారెవరు? పూర్వము యయాతినకు మహారాజు దేవయాని శుక్రుని కుమార్తెను ప్రేమించెను. శుక్రుని కోపముచే శపింపబడి వార్ధక్యమును పొందెను. అతనికి నలుగురు కుమారులు. యాది తనకింకనో యవ్వనముతో ఉండి భార్యతో రమింపవలెనని కోరిక తగ్గక కుమారులను తన వార్ధక్యమును తీసుకొని యవ్వనమునిమ్మని కోరెను. మొదట ముగ్గురు కుమారులు అంగీకరణ ఇవ్వలేదు. నాలుగవ కుమారుడగు పూరువు తన యువ్వనమును యయాతికిచ్చి తాను వార్ధక్యమును స్వీకరించెను. అప్పుడు సంతోషించి యయాతి మిగిలిన ముగ్గురికి రాజ్యము లేదని పూర్వునకు రాజ్యము ఇచ్చెను. ఇట్లు మొత్తము చరిత్రలో జరను కోరి పుచ్చుకొనిన వాడు ఒక్క పూర్వే. జరకు భర్త లేడు. అన్ని లోకములు తిరుగుచు బ్రహ్మలోకము నుండి భూలోకమునకు వచ్చిన నారదుని చూచినది. అతనిని చూచి కామపర్వసురాలై వరించినది. నారదుడు ఆమెను తిరస్కరించెను.
ఆమెకు కోపం వచ్చి నారదుని శపించెను. ఓ నారదముని, నా కోరికను అంగీకరించినావు కావు కనుక నీవు ఒకచోట స్థిరముగా ఉండక దేశములు తిరుగుచుండుము అని శపించెను. అందుచేతనే నారదుడు ఒకచోట నిలవడు. మూడు లోకములు తిరుగుచుండును. అతడు మహాజ్ఞాని కనుక భగవత్ ధ్యానమున ఉండి నిత్య భగవత్ స్మరణచే ముసలితనమునందక ఉన్నాడు. నారదుడు ఆ కాలకన్య అగు జరకు ఒక సలహా చెప్పెను. నీవు ఎచ్చట తిరిగినను నిన్ను ఎవ్వరును స్వీకరింపరు. యవ్వన దేశపు రాజు ఉన్నాడు అతని పేరు భయుడు నీవు అతనిని వరింపుము అని చెప్పెను. అట్లే అని జర యవన దేశమునకేగి ఆ భయుడను రాజును వరించెను. ఓ యువనేశ్వరా నీవు యవనుల రా యవనేశ్వరా నీవు యవనుల రాజువు. నిన్ను తలంచిన వారు ఎన్నడును నిన్ను విడక ఉందురు. నీవు నీ సామర్థ్యము నేను ఎరుంగుదును నన్ను స్వీకరింపుము. ఎవరైనాను ఒకరు వచ్చి దీనిని స్వీకరింపుడని ప్రార్థించిన నాడు తిరస్కరించిన వాడును ఒకరు వచ్చి నాకు దీనిని వసంగుడని ప్రార్థించిన వసంగని వాడును మూర్ఖులు అజ్ఞానులును. వారు జాలి పడదగిన వారు. నేను నిన్ను కోరుచున్నాను కనుక దయచేసి నన్ను స్వీకరింపుము. తీవ్రమగు ఆర్తితో స్త్రీ యాచించిన నాడు స్వీకరించుట పురుష ధర్మము. అని కన్యయ్యగు జర చెప్పగానే యవ్వనేశ్వరుడగు భయుడు ఎవ్వరికినీ తెలియకుండా రహస్యముగా దేవతలు మరుగుపరిచిన దేవగుహ్యం అనబడి అనబడెడి రహస్య శాపమును లోకమును నిర్వహింపదలచి చిరునవ్వుతో ఆమెతో ఇట్టనెను. ఓ జరా, నేను ధ్యానములో ఆలోచించితిని. నిన్ను లోకములో ఎవ్వరునూ స్వీకరింపరు. అందుచే నీకు నేను ఎవరో తెలియకుండా వారిని ఆశ్రయించి అనుభవించు శక్తిని వసంగుచున్నాను. ఈ లోకంలోని వారందరును నీచే అనుభవింపదగిన భర్తలే అగుదురు. నీవు హాయిగా అందరినీ అనుభవింపుము. ఇట్లు అనుభవించినచో వారు నిన్ను ఏమి చేయుదురు అని భయపడకుము. వానినే చంపగల శక్తి నీకున్నది. నీకు సహాయముగా నా సోదరుడగు జ్వరమును సాయము వసంగెదను. నీవు కూడా నా సోదరివే. మీరిద్దరూ నా సోదరీ సోదరులై లోకమంతయు విహరింపుడు. మీకు భయంకరమగు సైన్యము తోడుగా ఉండును అని చెప్పెను.
జీవుడు శరీరముతో కూడి ఉండి అనేక విధములు కర్మలు చేయుచు భోగములు అనుభవించుచు ఆత్మ విచారము గాని పరమాత్మ విచారము గాని లేకుండా శరీర పోషణమే పరమార్థమని భావించి జీవించుచుండును. ఇట్లుండగా వార్ధక్యము వచ్చును. కాలమునకు చండవేగుడని పేరు. కాలము యొక్క వేగము తీవ్రమైనది. గంధర్వులు ఎవ్వరికినీ కనపడకుండా తిరగగల మాయా శక్తులు గలవారు. అట్టి గంధర్వులు రాత్రింబవళ్ళు మనకు తెలియకుండా తిరుగుచుందురు. కాలము తిరుగుచున్నదని గుర్తింపజాలము. కాలము సంవత్సరమని భావించినచో అందు పగళ్ళు గడుచుచునే ఉన్నవి. ఆయుష్షు గడిచిపోవుచునే ఉన్నది. కానీ మనము దానిని ఎదిరించి మన పనులు మనము చేసుకొనుచుందుము. కానీ కొంత కాలమునకు మన శక్తి తగ్గుచుండును. మన ప్రయత్నము తగ్గును. అనుకొనకుండా లభించిన దానిని అనుభవించి జీవితమును సాగించుచుండుము. నారదుని ఉపదేశముపై ఆమె భయుడు అనే రాజు వద్ద ఏగెను. అతడు యవ్వనేశ్వరుడు. యవ్వనములు అనగా శరీరముతో వచ్చేడి రోగములు, మనసున వచ్చేడి బెంగలు ఇవే వ్యాధులు, ఆధులు. వీని చేత భయము కలుగుచుండును. అందుచే ఆ యవ్వనులకు రాజు భయుడు. ఈ యవ్వనేశ్వరుడగు భయును వద్దకు కాలకన్య ఆగు జర వెళ్ళెను. భయుని భర్తగా వరించెను. అతడు కూడా భార్యగా స్వీకరింపలేదు కానీ చెల్లెలుగా స్వీకరించెను. భయము అన్న జర చెల్లెలు. మన శరీరమున ముసలితనము, భయము అనునవి అన్నాచెల్లెలు వలె చేరి ఉండును. భయుడు ఆమెను తన సోదరిగా స్వీకరించి నీవు ఎవ్వరినీ స్వీకరింపమని ప్రార్థింపనక్కర్లేదు. వారికి తెలియకుండా నీకు ఇష్టం వచ్చిన పురుషుని వశపరుచుకుని అనుభవింపమని వరమిచ్చెను. అందుచే జర మనతో చెప్పి రాదు. మనకు చెప్పకుండా వార్ధక్యం వచ్చుచుండును. ఆమెకు తోడుగా భయుడు తన సోదరుడగు ప్రజ్వరుని ఆమెకు సాయముగా ఇచ్చెను.
ఈ ప్రజ్వరుడే చనిపోవుటకు ముందు వచ్చెడి తీవ్రమైన జ్వరము. దీనినే వైష్ణవ జ్వరము జ్వరమందురు. వీరి వెంట యవ్వన సేవానాయకుడు ఎవరికీ తెలియకుండా సహాయముగా నడుచును. వీనిని అన్నిటినీ లోకము పైకి పంపి దేవగుహ్యమను అనగా మరణమును లోకమున సాగించుచుండును. దేవతలు ఇట్టి రహస్యమైన పనిని భయమునకు అప్పజెప్పిరి. ఈ పని ఎవ్వరికినీ తెలియకుండా జరగవలెనని శాసించిరి. అది ఏ మరణము? దీని నెరవేర్చుటకు భయుడు జర ప్రజ్జరుల సహాయముతో ప్రవర్తించుచున్నాడు. భయుడు సేనానాయకుడగు జరుడు. కాలకన్యలతో కలిసి లోకమంతయు సంచరించుచు ఒకనాడు పురంజనపురిని చేరినాడు. ఈ పట్టణమునకు కాపలాగా ఉన్న ముసలి పాము చాలా బడలి ఉన్నది. ఆ పట్టణము నిండా ఈ లోకములో అనుభవింపదగ్గ భోగములు నిండుగా ఉన్నవి. కాలకన్య ఆ పురంజనపురమున చేరి ఆక్రమింపగానే భయుని సైనికులు ఆ పట్టణములో ప్రవేశించి పీడించిరి. ఈ శరీరము అంతమగుటకు తగిన సమయము ఆసన్నమైనప్పుడు జర ముసలితనము ఆక్రమించును. అనుభవింపదగిన భోగములు అన్నియు ఉన్నను లోపల పాము వలె కాపాడుచున్న ప్రాణశక్తి క్షీణించుటచే జీవుడు బలహీనుడై ఉండును. ఈ జర అనడి కాల కన్యకు తోడుగా వ్యాధులు, ఆధులు, రోగములు, బెంగ వచ్చి చేరును. ముసలితనమునకు ఈ శరీరముతో కూడిన జీవుడు వశపడును. దీనితో పురంజనుడను జీవుడు ఇంతవరకు ఉన్న కుటుంబముతో కూడా దుఃఖములు పొందుచుండును. బుద్ధి అనడి ప్రియురాలు మాత్రం అతనిని వదలక కౌగలించుకొని ఉండును. విషయ భోగము నుండి చిత్తము మరలదు, వివేకము నశించును. అనుభవించుచు శక్తి గాని కర్మలు చేయు శక్తి గాని ఉండదు. పురంజనుని కుమారులు, కుమార్తెలు మాట వినరు. ఇంద్రియ వ్యాపారములు, బుద్ధివృత్తులు తన వశమందు ఉండవు. భార్యకు కూడా అతనిపై ప్రేమ తగ్గును. బుద్ధి కూడా పని చేయుట మానును. అతనిని అనగా జీవుని ఆ జరాకన్య కౌగలించుకొని ఉండును ఏమియు చేయలేదు శోకించుచుండును కోరికలు మాత్రం
కోరుట మానలేదు కానీ పొందలేడు. దానితో దైన్యమును అందించుచుండును. ఇంద్రియ వ్యాపారములను బుద్ధివృత్తులను తన వశమునందు ఉంచుకొనవలెనని ప్రయత్నం వదలలేదు. చిట్టచివరకు ఏమియు చేయలేక ఈ పట్టణమును వదిలిపోవలెనని అనిపించును. ఇట్లు ప్రాణ, ఇంద్రియ, వ్యాపారములు సన్నగిల్లి, భోగశక్తి తగ్గి, ఆధి వ్యాధులు అధికమై, శరీరము తన వశము లేకుండా పోయినప్పుడు జీవునకు శరీరం వదలనన్నటి కోరిక లేకపోయినను వదలుటకు సిద్ధపడును. భయుని అన్నగారు ప్రజ్వరుడు. అతడు కాయకన్యతో వచ్చినాడు. ఈమె కోరిక నెరవేర్చవలెనని భయుని ఆజ్ఞ పాటించవలెనని పురమునంతను కాల్చినాడు. మరణమునకు ముందు వచ్చెడి తీవ్రమగు జ్వరమే ఈ సోదరుడు. ఈతడు శరీరమును తపింపచేయును. లోనున్న జీవుడు ఇంద్రియములు బుద్ధి అన్నియు బాధలతో ఉడికిపోవుచుండును. ఏమియు చేయజాలక ఈ పురమునకు ఇంతవరకు రాజుగా ఉన్న పురంజనుడు గడగడ వణుకుచుండెను. పట్టణమును కాపాడలేకపోయును. నిప్పు అంటుకున్న చెట్టు తొర్ర నుండి పక్షి పారిపోవుటకు ప్రయత్నించునట్లు ప్రయత్నించును కానీ ఉండజాలడు. వెడలజాలడు. గంధర్వులు అనగా కాలము ఇతని శక్తిని హరించును. ఆది వ్యాధులు అతని నిరోధించినవి. ఇంకా పట్టణమును వీడిపోవుట తప్పదు కానీ అతని మనస్సు భార్యా బిడ్డలను, అల్లుళ్ళను, ఇంటిని, భవనమును తలంచుండును. నేను చనిపోయినచో నా భార్య బిడ్డలతో ఎట్లు బ్రతుకును? నేను లేనిదే ఎన్నడును భుజింపదు, స్నానము చేయదు. నా కోపం వచ్చుచున్నదనచో భయపడుచుండును. నేను గట్టిగా మాట్లాడిన బెదిరిపోవుచుండును. నేను ఏదైనా తెలియక పొరబడినచో తెలియజేయుచుండెడిది. నేను దేశాంతరం వేగిన క్షోకముతో కృషించెడిది. వీరుడైన పుత్రుడు అన్నను నేను లేని బాధతో ప్రాణములు వీడును. నా కుమార్తెలు, కుమారులు ఆశ్రయము లేక సముద్రములో పడవపై ప్రయాణము చేయునప్పుడు పడవ బ్రద్దలు అయినప్పుడు బాధపడినట్లు నేను పోయినచో బాధపడుదురు. ఇట్లు తన భార్యను గూర్చియే ఆలోచించుచుండగానే భయుడు అనడి గంధర్వ రాజు పశువును కట్టి లావుకొని పోయినట్లు పురంజనుని పట్టణము నుండి వెలికేడ్చును. ఇదియే జీవుని శరీర వియోగమందలి అవస్థ.
శరీరము శిథలమై శిథిలమై రోగములు మెండై తీవ్రముకు జ్వరము ఆక్రమించి శరీరమును వీడి స్థితి వచ్చిన వచ్చినను జీవునకు వివేకము కలగదు. తనను గూర్చి గాని భగవంతుని గూర్చి గాని ఆలోచన ఉండదు. భార్యా బిడ్డలు, ఇల్లు, ఆస్తి వీరిని గూర్చియు ఆలోచించుచుండును. వీరి ఆలోచనలో వీరు ఉండగా మృత్యువు ఆక్రమించి వెలిగీడుచును. ఎప్పుడు ఈతనిని వెలికి ఈడ్చినదో ఇంతకాలము పట్టణమును కాపాడిన ఆ పాము కూడా ఆ పట్టణమును వీడిపోవును. జీవుడు శరీరమును వీడగానే ప్రాణము కూడా పోవును. ఇంత బాధ కలిగి భయుడు అను మృత్యువు. తనను లావుకొని పోవుచున్నను వెనుక తాను వదిలిన మిత్రుడు జ్ఞాపకం రాలేదు. ఆ మిత్రుడే అవిజ్ఞాతుడు అనగా ఎవరి చేతును ఎరుంగ శక్యము గాని భగవానుడు. అతనిని మరచి జీవుడు శరీరములో చేరును. ఇది ఉన్నంత కాలం బుద్ధి అంతయు లోక విషయములందే ప్రవర్తించును. కానీ భగవానునికై ప్రవర్తించదు. మరణ సమయములో కూడా భార్యను, బిడ్డలను తలంచుండునే గానీ భగవానును తలంచడు. ఇట్లు జీవుడు మరణించగా ఇంతకాలము కోరికలతో ఆయా ఫలములకై పశువులను చంపి యజ్ఞములను చేసినాడు కదా. ఆ చంపబడిన పశువులు వీడు చేసిన పాపములను తలంచి వీనిని తన కొమ్ములతో పొడిచి హింసించుచుండును. ఫలములను కోరి కర్మలను ఆచరించినచో కొంతకాలం సుఖమును అనుభవించినను తరువాత దుఃఖమే కలుగును. చనిపోవు సమయములో అతడు భార్యనే తలంచుచు శరీరమును వీడుటచే ఇతడు మరల ఒక్క స్త్రీగా జన్మించెను. విదర్భ దేశ రాజకుమార్తెగా జన్మించెను. ఈ జన్మలో శరీరమును వీడినప్పుడు దేనిని స్మరించుచు జీవుడు శరీరమును వీడునో అట్టి శరీరమునే మరల జన్మలో పొందును. కావున పురంజనుడు ఒక స్త్రీ శరీరముతో జన్మించినాడు. తర్వాత జరిగిన కథాభాగం ఏమిటి? ఎక్కడ జన్మించింది ఆ విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Gurus. Victory to the Lord, salutations to the Lord of the Universe. Salutations to the divine Brahman, salutations to the three-fold quality. Salutations to Sri Hari, may all the worlds praise you. Your prowess is unparalleled. You are devoted to the Vedas. Many salutations to you, who accept the qualities of Sattva, Rajas, and Tamas as your occupation. Eighth Canto, 17th Chapter, 25th Prayer. Dear relatives, welcome to the 34th podcast of Srimad Bhagavata Tatva Deepika in the fourth book. Until now, as part of the conversation between Mithura and Maitreya, we are moving forward in the story by learning along with the Puranjana history in the Puranjana narrative, including its philosophical meaning. Now, let us understand the philosophical meaning of the consequences that occur after reaching the stage of becoming old in life. The word 'kal kanyaye jara' means old age. She is the daughter of Kaal. No man's going to marry her. No one will accept. Who are those who accept even if they wander in the three worlds? Once upon a time, King Devayani of Yayati fell in love with Shukra's daughter. Blessed by the wrath of Venus He/She/It has aged. He has four sons. Yadi, thinking that he should be young and enjoy with his wife, without decreasing his desire, he asked his sons to take his old age and give him youth. Initially, three sons did not agree. The fourth son, Pooru, gave his youth to Yayati and accepted old age himself. Then, being pleased, Yayati gave the kingdom to the former, saying that the remaining three had no kingdom. Thus, in the entire history, only one person has ever taken a chance. Jarakku is childless. All the worlds revolved and saw Narada who came from Brahmaloka to Bhuloka. Seeing him, she became like a mountain of passion and fell in love. Narada refused her.
She was so angry she cursed Narada. Oh Narada Muni, since you have not accepted my request, you will not stay in one place but will wander from country to country, thus he cursed. Therefore, Narada does not stay in one place. Three worlds are rotating. Because he is a great sage, he is in old age, meditating on God and constantly remembering God. Narada gave a piece of advice to Jaraka, who was a mermaid. Wherever you go, no one will accept you. There is a king of the young country, his name is Bhayudu, you should offer him a boon, he said. Similarly, he went to the Yavana country and married that fearful woman, the king. Oh, young king, you are the king of the Yavanas, oh, young king, you are the king of the Yavanas. Those who have thought of you will never be separated from you. I will accept your ability. When someone comes and prays that this is accepted, and when someone comes and prays that this is given to me, both the one who rejects and the one who prays, are fools and ignorant. They deserve pity. I desire you, therefore please me Acceptance. When a woman begs with intense longing, it is the duty of a man to accept. And as soon as Kanyayagu said this, Yuvaneshwarudu, without anyone knowing, secretly, the divine secret that the gods had hidden, and the secret curse that was spoken, the world, intending to carry it out, said this to her with a smile. Oh, listen, I was thinking about it in my meditation. No one in the world will accept you. Therefore, without knowing who I am, I am giving you the power to experience by relying on them. All those in this world will become husbands whom you can experience. You can enjoy yourselves. Do not fear what they will do to you if they experience this. You have the power to kill him. I will help you, my brother, I will help you with fever. You're also my sister. May you both be brothers and may you roam the world together. He said that a terrible army will be with you.
A living being, being united with the body, performs various kinds of actions, enjoys pleasures, and lives believing that body nourishment is the ultimate goal, without self-reflection or contemplation of the Supreme Soul. While it is like this, old age will come. Kala is the name of the fasting day. The speed of time is accelerated. Gandharvas were magical beings who could move about undetected. Such Gandharvas roam around without our knowledge, day and night. Time is not something that can be measured. If time is considered as a year, then the days are passing by. Life is passing by. But we oppose it and do our work. But after some time, our strength decreases. Our efforts will decrease. Experience what you have unknowingly received and continue your life. She, on Narada's advice, stood against the king named Bhayudu. He is a young man. Youth means diseases that come with the body, and troubles that come with the mind, these are the diseases, the causes. He is afraid of him. Therefore, the king is afraid of those young men. This The young man, fearing, went to the Kalakanya. He came as Bhayani's husband. He was not accepted as a wife, but he accepted as a sister. A sister named fear. Old age and fear in our body are like sisters who have joined together. Fear, accept her as your sister, and you don't need to pray to accept anyone. Without their knowledge, he granted a boon to you to subdue and enjoy any man you like. Therefore, it cannot be told to us. We are getting old without telling us. Along with her, Bhayudu, her brother, Prajvaruni, gave her help.
This eruption came before death, a severe fever. This is called Vaishnava fever, fever. A young servant follows them, helping without anyone knowing. Sending all of this to the world, the secret of the gods, that is, death, continues in the world. The gods entrusted this mysterious task to fear. They decreed that this work should be done without anyone knowing. What death? To fulfill this, Bhayudu is acting with the help of some wise men. The commander of the army is Jarudu. He, along with the fairies, wandered all over the world and one day reached Puranjana Puri. The old snake that guards this town is very weak. That city is full of pleasures that can be experienced in this world. The fairy-maiden, upon reaching that city, as soon as she occupied it, the soldiers of Bhayu entered that town and tormented it. When the time comes for this body to end, old age will take over. Even though there are all the enjoyable pleasures, the life force that protects like a snake inside, due to its depletion, the living being remains weak. This is a little When asked, along with the virgin, diseases, afflictions, illnesses, and worries will come and join. In old age, this being associated with the body, is subject to control. With this, Puranjunudu, the soul, along with the family that has been until now, also suffers sorrows. The wise and beloved one, however, would not let him go, but would embrace him. The mind is not free from sensual enjoyment, and wisdom is lost. Experiencing, there is no power or the power to perform actions. Puranjaneya's sons and daughters do not listen to his words. The senses and the intellect are not under his control. Even his wife's love for him diminishes. Even the intellect abhors company. He, that is, the living being, that Jara Kanya, embraced him, but did nothing. She was grieving, but only desires
He wanted but did not receive. With that, it provides poverty. He did not give up trying to keep the senses and the intellect under his control. Finally, unable to do anything, he felt like leaving this town. Thus, when the life force, senses, and activities diminish, the power of enjoyment decreases, and diseases increase, and the body becomes uncontrollable, even if the soul has no desire to leave the body, it is ready to let go. Bhayani's brother is Prajwal. He came with the maiden. He burned the whole town so that her wish would be fulfilled and that Bheyan would obey the order. This brother is the severe fever that comes before death. The swim makes the body ache. The living being, with its senses and intellect, is being afflicted by all kinds of suffering. Unable to do anything, Puranjunudu, who had been the king of this town until now, was trembling. Could not defend the city. A bird, caught in a fire, tries to escape from a hollow tree, but cannot. It cannot escape. Gandharvas, meaning time, his power It will be removed. The initial diseases were prevented by him. Still, it is inevitable to leave the town, but his mind is thinking of his wife, children, sons-in-law, house, and building. If I die, how will my wife and children live? I am not there, it never bothers, it never takes a bath. If I am angry, I will be afraid. I am speaking loudly, but you are getting scared. I'm just a chatbot that can tell when I'm confused or misunderstood. I am tired of the suffering caused by the burning of the country. I will leave my son, who is a hero, with the pain of not being there. My daughters and sons, when they are traveling on a boat in the sea without shelter, when the boat breaks, they suffer, and if I am gone, they will suffer. Thus, while he was thinking about his wife, Bhayudu, the Gandharva king, as if he had tied up an animal and made it fat, emerged from Puranjunu's town. This is the state of the body of a living being in the process of disintegration.
The body becomes weak, diseased, and the diseases become severe, and fever takes over, leaving the body. Even if such a situation arises, the soul does not have wisdom. There is no thought about oneself or about God. He is thinking about his wife, children, house and property. While they are in their thoughts, death takes over and consumes them. When he pulled him out, the snake that had protected the town for so long would also leave that town. As soon as a living being leaves the body, life also goes away. Death is such a pain. Even though he was getting fat, he did not remember his friend who had left him behind. That friend is unknown, meaning that he is uncontrollable by anyone's hands, the Lord. Forgetting him, the living being joins the body. As long as this exists, the intellect will only act on worldly matters. But it does not serve God. Even at the time of death, one should remember his wife and children, but not God. Thus, when the living being dies, for so long, with desires, for those fruits, he killed animals and performed sacrifices, right? That killed The cattle, remembering the sins he has committed, will pierce him with their horns and torment him. If one performs actions desiring fruits, even after experiencing happiness for some time, one will eventually experience sorrow. At the time of death, he, remembering his wife, gave up his body, and thus he was reborn as a single woman. Born as the daughter of a king from Vidarbha. In this life, when the body is abandoned, the soul, remembering what, abandons the body, such a body is obtained again in the next birth. Therefore, Puranjana was born with a female body. What is the next part of the story? We will find out where he was born in another podcast. Jai Srimannarayana, salutations to the Asmadgurus