దక్షుని యజ్ఞ సంకల్పము - సతీదేవి పితృగృహ గమనము

Daksha's Grand Sacrifice & Sati's Desire to Attend

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, ప్రజాపతి దక్షుడు మహోన్నతమైన యజ్ఞమును నిర్వహించాలని సంకల్పించి, తన అల్లుడైన పరమేశ్వరుని ఆహ్వానింపక పక్షపాత నిర్ణయం తీసుకుంటాడు. దేవతలు మరియు మహర్షులు యజ్ఞశాలవైపు వెళ్తుండటం చూసిన సతీదేవికి తన పుట్టింటిని సందర్శించాలని తీవ్రమైన వాంఛ కలుగుతుంది. శ్రీపరమేశ్వరుడు ప్రేమతో హెచ్చరికలు చేసినప్పటికీ, తండ్రిపై అనురాగం మరియు పుట్టింటి మోహం సతీదేవిని ఆపలేకపోతాయి. ఈ ఘట్టం పురాణాలలో అత్యంత హృదయవిదారకమైన సంఘటనకు నాంది పలుకుతూ, మానవ బంధాలు మరియు దైవభక్తి మధ్య గల సంఘర్షణను అద్భుతంగా చిత్రిస్తుంది.

In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, the powerful Prajapati Daksha resolves to perform a grand Vedic sacrifice, deliberately excluding his son-in-law Lord Shiva from the ceremony. Sati Devi, witnessing the divine celebrations and celestial beings traveling toward her father's yajna, feels a deep longing to attend and be reunited with her family. Despite Lord Shiva's loving warnings about the disrespect that awaits her, Sati's devotion to her father and her natural affection for her birthplace compel her to seek permission to go. This poignant episode beautifully illustrates the eternal tension between worldly ties and divine devotion, setting the stage for one of the most heart-rending events in all of the Puranas.

← Prev Next →
Daksha's Grand Sacrifice & Sati's Desire to Attend bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః విష్ణు పత్ని మహామాయే మహాపురుష లక్షణే ప్రియే ధామే మహాభాగే లోకమాతర్ నమోస్తుతే విష్ణుపత్నివగు ఓ లక్ష్మీ గొప్ప మాయాశక్తివి నీవే పురుషోత్తముని లక్షణములే నీయందు కూడా కలవు గొప్ప భాగ్యవతియగువో లోకజననీ నాపై ప్రీతిని కలిగి యుండుము. నీకు నమస్కారమగుగాక. సిక్స్త్ క్యాంటో 19 చాప్టర్ సిక్స్త్ ప్రేయర్. భగత్ బంధువులారా. శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితము స్వయంభు మను యొక్క కుమార్తెల యొక్క వివాహాలు, వారి పుత్రులు, వారిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ చివరి భార్య అయినటువంటి మూర్తి యొక్క పుత్రులు నరనారాయణులు కలగటం వారిని స్తుతించటాని కోసమని ఋషులందరూ వెళ్ళటం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత భాగాన్ని మనం అనుభవిద్దాం. ఋషులు ఇలా స్తుతిస్తున్నారు నరనారాయణులతో. ఈ జగత్తునంతకు కారణము నీ సంకల్పమే. ఆ సంకల్పమే మాయ అనబడును. ఆకాశం ఒకచోట తెల్లగా, ఒకచోట నల్లగా కనబడునట్లు. నీవే నీయందే ఈ జగత్తును దేవతలు, తిరియక్కులు, మనుష్యులు, స్థావరములు అనేటి భిన్న భిన్న రూపములతో ఏర్పరిచితివి. ఆకాశము తెల్లగా నల్లగా నున్నట్లు కనపడుచున్నను ఆ రంగులు ఆకాశమును ఎట్లు అంటవో అట్లే నీ శరీరము. వంటిదగు ప్రకృతి యందే నీ సంకల్పముచే ఏర్పరిచిన దేవ మనుష్యాది భేదములు నీకు అంటున్నవి కావు. నీవు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒక్క రూపముగానే ఉందువు. నీకు శరీరము వంటిదైన అందరిచే చూడబడుచున్న ప్రకృతి వికారములగు శరీరములందు. భేదములు ఏర్పడుచుండును. జీవుడు తన శరీరముగానున్న ప్రకృతి కంటే వేరని గుర్తించకుండా మాయ చేయును. దానిచే జీవుడు శరీరముతో తాను వేరని గుర్తించక బంధమున ఉండును.

దాని నుండి విడువబడుటకు శరీరము కంటే తాను వేరని ఎరంగవలెను. దానిని ఎరంగించుటకే ఈ నరనారాయణ రూపము నీవు దాల్చితివి. నీ శరీరము ప్రకృతి వికారము కాదు. కర్మవశ్యము కాదు, కేవలము జ్ఞానము వసంగుటకు మనుషులతో సమానమగు రూపము తాల్చితివి. భగవానుడే ధర్మునకు మూర్తి అను భార్య యందు నరనారాయణులనెడి పేరు గల ఋషులుగా జన్మించినారు. అట్టి భగవానునకు నమస్కారము. తన సంకల్పముచే జగత్తునకు బంధమును మోక్షమును కలిగించువాడు భగవానుడు. ఆ భగవత్ తత్వము శాస్త్రము చేతనే అనగా వేదము చేతనే ఎరుంగదగిన వివిధ విచిత్ర శక్తులు గలది. తాను సృష్టించిన జగత్తును రక్షించుటకు, సృష్టించుటకు, సంహరించుటకు ఆయా కార్యములందు శక్తిని వసంగి తానే తన అంశలచే ఈ లోకములో మమ్ములను దేవతలను పేరుతో సృజించినాడు. అట్టి పరమ పురుషుడే ఈ నరనారాయణ అవతారమున దర్శనం వసంగినాడు. ఆ భగవానుడు పరిపూర్ణ కృపతో నిండిన చూపుతో చూచుగాక. లక్ష్మీదేవికి నివాస స్థానమగు తామర పువ్వు కూడా ఆ స్వామి నేత్రముచే క్రింద క్రిందు చేయబడినది. సౌందర్యములో తిరస్కరింపబడినది అట్టి పరమ పురుషుడు మమ్మల్ని కటాక్షించుగాక ఈ విధంగా దేవతలేచే స్తుతింపబడిన నరనారాయణులు ఇద్దరు గంధమాదన పర్వతమునకు వేయించేసిరి. ఆ నరనారాయణులే భూమి యొక్క భారమును తొలగించుట కొరకు యదువంశమున కురువంశమున శ్రేష్టులగు కృష్ణార్జునులుగా అవతరించిరి. దక్షిణ కుమార్తెలలో స్వాహాను నామెను అగ్నికి వసంగెను. అగ్నులు త్రేతాగ్నులని మూడు అగ్నులు. ఆ మూడింటికి అభిమాన దేవత అగ్నియే. అతనికి స్వాహాను భార్యయందు పావకుడు, పవమానుడు, శుచి. అను ముగ్గురు కుమారులు జన్మించిరి. దేవతలను ఉద్దేశించి వసంగిన చెరువు, పురోడాశము మొదలగు ద్రవ్యములను వారు భుజించి దేవతలకు అందింతురు కనుక వారికి హుతభోజనులని భోజులని పేరు. ఈ ముగ్గురు నుండి 45గురు అగ్నిహోత్రులు జన్మించిరి. పితృ పితామహులతో కలిసిన వారు 49 అగుదురు.

ఆ నలభై ఐదు అగ్నిహోత్రముల పేర్లతో వేదములో చెప్పబడిన యజ్ఞములలో అగ్ని దేవతగా కలిగిన యాగములు నెరవేర్పబడుచున్నవి. దక్షిణి కుమార్తెలలో 15వ ఆమె స్వధ. ఆమెను పితృ దేవతలకు భార్యగా వసంగెను. పితృ దేవతలలో కొందరు గృహస్తులుగా ఉండి యజ్ఞము చేయని వారు. కొందరు అయజ్యులు అందురు. వారిని అయజ్యులు అందురు. యజ్ఞము చేసిన యజ్వలగు పితృ దేవతలను అగ్నిశ్వాత్తులు, బరిహిషదులు, సోమ్యులు అందురు. బరిహిషదులు అను వారికి అగ్నోకరణము, సుమపానము ఉన్నవి కనుక వారికి ఆ పేర్లు వచ్చినవి. అయజ్వలు అగ్నోకరణము లేనివారు. కనుక వారిని అనగ్నులు అందురు. అట్లే వారిని ఆజ్యపులు అందురు. వారే అగ్నిశ్వాత్తులు. ఇట్లు పితృ దేవతలు రెండు రకములుగా ఉందురు. వారిరువురకు స్వధ అనునామే భార్యగా ఉండెను. ఆ పితృ దేవతల వలన ఇద్దరు కన్యలు జన్మించిరి. మేధా, వైతరిణి అని వారి పేర్లు. వారికే వయునా, ధారిణి అని కూడా పేర్లు. ఆ కన్యలు ఇరువురు సనక సనందాదుల వలె వివాహం లేని వారై. బ్రహ్మజ్ఞానముతో శాస్త్రజన్య జ్ఞానము వివేకాదులచే కలిగిన విజ్ఞానము కలవారై బ్రహ్మోపదేశము చేయుచు బ్రహ్మచారణులుగా ఉండిపోయిరి. దక్షిణి కుమార్తెలలో పదునారవ ఆమె సతీదేవి. ఆమెను రుద్రునికి భార్యగా వసంగెను. ఆమె భర్తను శ్రద్ధాభక్తులతో అనుసరించుచు జీవించుచున్నను గుణములచే శీలముచే తనకు తగిన కుమారుడు జన్మించలేదు. దక్షుడు ఏ అపరాధము లేకయే రుద్రుడిపై కోపము తెచ్చుకొనెను. ఆ కోపముచే రుద్రుని యెడల తిరస్కార భావముతో ఉండెను. దానిని సహింపలేక సతీదేవి యోగాగ్నిచే తానే తన దేహమును దహించుకొనెనది. సతీదేవి భర్తను తన తండ్రియగు దక్ష ప్రజాపతి అనాదరించుటచే శరీరమును త్యజించినది. అది వినిన విదురుడు రుద్రుడు శీలవంతులలో శ్రేష్టుడు కదా ఎవరియందును వైరము లేకుండుట సమదర్శనముతో ఉండుట స్వభావము కలవాడు కదా.

శ్రేష్టుడగు అట్టి రుద్రుని కుమార్తెలయందు ప్రేమగల దక్షుడు ఏ కారణముచే ద్వేషించెను? కుమారి కూతిరిపై ప్రేమ చేత అయినను అల్లుని ఆదరించుట లోక సహజము కదా? అంతేగాక. రుద్రుడు చరాచరములగు ప్రాణులందరకును జ్ఞానోపదేశం చేసిన గురువు. ఎవరియందును వైరము లేనివాడు, ఎవరినీ ద్వేషించి కలహించు స్వభావము లేనివాడు, తనయందును సర్వభూతములందును ఆత్మగా ఉండు పరమాత్మయందు రమించువాడు. శ్యమదమాది సంపన్నుడును లోకమునంతకు ఆరాధింపదగువాడును అగు రుద్రుని దక్ష ప్రజాపతి ద్వేషించుటకు కారణమేమి? దక్షుని ద్వేషము వలనే కదా సతీదేవి ప్రాణములు వదిలినది. ఎందుకని అట్లు జరిగినదో వివరింపుము. ఎంతో క్లేశము కలిగిన గాని ప్రాణములను వదలలేరు కదా. ప్రాణములను బదులుట చాలా కష్టము కదా, కారణము తెలియజేయుము అని విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మైత్రేయునితోని. అప్పుడు మైత్రేయుడు దానికి వివరాన్ని అందిస్తాడు. పూర్వము మరీచి మొదలగు ప్రజాపతులు అనేకులు యజమానులుగా చేసెడి సత్రయాగమును చేసి అందు మహాపురుషులందరూ చేరి ఉండిరి. తమ పరిజనముతో ఇంద్రాది దేవతలందరూ సంఘములుగా అచ్చడికి వచ్చిరి. అగ్ని అభిమానించు దేవతలందరూ సంఘములుగా అచ్చడికి వచ్చిరి. అప్పుడు అచ్చడికి దక్ష ప్రజాపతి వచ్చెను. అతని తేజస్సును చూచి సూర్యుని తేజస్సును చూచినట్లు ఆశ్చర్యపడి సభలోనున్న వారందరూ లేచి నిలిచిరి. ఆ దక్షిణి కాంతిచే సభ అంతయు చీకట్లు పోయి కాంతి నిండినది. ప్రకాశవంతములగు అగ్ని మొదలగు దేవతలందరు కూడా లేచి నిలుచుండిరి. కానీ బ్రహ్మ రుద్రుడు మాత్రం ఆసనము నుండి లేచి నిలవలేదు. సదస్సులందరూ దక్షుని చాలా సత్కరించిరి. బ్రహ్మ లోకులందరుకు సృష్టికి మూలమైన తండ్రి వంటివాడు. దక్షుడు బ్రహ్మకు నమస్కారము చేసి అతని అనుజ్ఞతో కూర్చుండెను. తాను వచ్చినను లేవక కూర్చొని ఉన్న శివుని చూచి అతని అనాదరమును సహింపలేక మండిపడెను. ప్రక్కగా చూచుచు చూపులతో దహించుచున్నాడా అనునట్లు తీవ్రతను చూపుచు ఇట్లు పలికెను.

ఓ దేవతలారా, ఓ అగ్నులారా, ఓ మహర్షులారా, సత్పురుషుల నడవడిని మీకు ఎరింగించుటకై నేను ఈ మాటను చెప్పుచున్నాను వినుడు. నేను అజ్ఞానం వలన గాని మాత్సర్యం వల గాని మాట్లాడటం లేదు. ఈ రుద్రుడు లోకపాలుల కీర్తిని నాశము చేయుచున్నాడు. సిగ్గుమాలినవాడు తన ధర్మమును వీడిన మూర్ఖుడు. సత్పురుషులందరూ ఆచరించడి వైదిక ఆచారమును పాడు చేసినవాడు. ఈతడు నా కుమార్తెను. బ్రాహ్మణ అగ్ని సాక్షిగా సత్పురుషుని వలె పాణిగ్రహణము చేసినాడు. అందుచే నేను ఇతనికి గురువును, అతడు నాకు శిష్యుడు. నా కుమార్తె పాణిగ్రహణము చేసిన తరువాత ఇతడు నన్ను గౌరవింపవలెను. నేను వచ్చునప్పుడు లేచి నిలిచి నమస్కరింపవలెను. ప్రత్యుత్థానము అభివాదము చేయకపోయినను మాటతోనైనను గౌరవింపలేకపోయినాడు. సదాచారము లేనివాడు అపవిత్రుడు దురహంకారి మర్యాదను మీరినవాడు. ఇతనికి నా కుమార్తెనిచ్చుట నాకు ఇష్టము లేదు కానీ ఎట్లో ఇచ్చితిని. ఉపనయన సంస్కారము లేని వానికి నిర్దిష్టమగు వేదమిచ్చుట ఎంత దోషమో అంత దోషము కలిగినది. ఇతడు స్మశానములలో ఘోరములగు భూతగణములతో దిగంబరుడై సంచరించుచుండును. జుత్తు విప్పుకొని పిచ్చివాని వలె నవ్వుచు ఏడ్చుచు తిరుగుచుండును. స్మశానములోని భస్మమును స్నానము చేసినట్లు ఒంటి నిండుగా పూసుకొనును. చనిపోయిన శవమునకు వేసిన మాలికలను ఎముకలను ఆభరణములుగా దాల్చును. ఇతడు అమంగళమైనవాడు కానీ ఇతనికి శివుడని అనగా మంగళకరుడని పేరు కలిగినది. ఇతడు మదించినవాడు, మదించిన వారికి ప్రియమైనవాడు, కేవలము తమోగుణమే కలవాడు, ప్రమధుల అను పేరు గల భూతములకు నాయకుడు, తమోగుణమే కలిగిన ప్రమధ గుణములకు ఉన్మత్తులకు ఇతడు నాధుడు, దుష్టమైన మనసు గలవాడు, ఆచరణము లేనివాడు. ఇట్టివానికి నేను మంగళాచారము గల నా కుమార్తెను బ్రహ్మ ఆజ్ఞచే వసంగినాను. ఇది చాలా శోకింపదగిన విషయము. ఇప్పుడు ఏమియు చేయజాలను. కానీ ఇతడు నన్ను గౌరవింపపోవుట. క్షమింపదగినది కాదు అని నిందించి ఏమియు బదులు చెప్పకుండా ఉదాసీనముగా కూర్చొని ఉన్న శివుని చూచి ఓర్వలేక దక్షుడు ఆచమనము చేసి కోపముతో శపించునకు సిద్ధపడెను.

ఈ రుద్రుడు దేవగణములలో అధముడు. ఇతడు యాగ ప్రదేశములో ఇంద్రాది దేవతలతో సమానముగా భాగమును పొందకుండు కాక అని శపించెను. సభలో ఉన్నవారందరును రుద్రునకు శాపమిచ్చుట తగదని వారించుచున్నను వినలేదు. రుద్రునకు శాపమును వసంగి తీవ్రముగు కోపముతో ఆ యజ్ఞ సదస్సు నుండి బయటకేగి తన భవనమునకేగెను. దక్షుడు శపించిన విషయము రుద్రుని అనుచరులకు తెలిసెను. అందు ప్రధానుడు నందీశ్వరుడు. దక్షుని శాపమును విని కోపముతో ఎర్రనైన కనులు కలవాడై ఆ దక్షుణకు తిరిగి దారుణమగు శాపమును వసంగెను. రుద్రుని నిందించుచుండగా విని ఆమోదించి వారింపక ఊరుకొనిన సదస్సులకు కూడా శాపమును వసంగునట్లు ఇట్లు పలికినాడు. ఈ దక్షుడు ఆత్మజ్ఞానము లేనివాడు. తనకు ఆత్మగానున్న బ్రహ్మను ఎరుంగక తానే స్వతంత్రుడని భావించు మూర్ఖుడు. తన విషయమున ఏ ద్రోహము చేయని భగవానుడు రుద్రుడి విషయంలో ద్రోహముతో శాపము వసంగినాడు. కావున ఈతడు తత్వజ్ఞానము లేనివాడై జ్ఞానహీనుడై ఉండుకాక. తత్వజ్ఞానము లేకుండుటయే గాక నీచములగు విడవదగిన కర్మలయందు ఆసక్తి గలవాడుగా అగుగాక సాంసారిక విషయ సుఖములందు ఆసక్తి గలవాడగు గాక స్థిరమగు ఫలము కలగని కర్మలను ప్రశంసించెడి వేద వాక్యములచే మతి చెడిన వాడై కర్మలచే ఆచరించు వాడగు గాక. దేహమే ఆత్మ అని భావించు స్వభావము గలవాడై పశువు వలె ప్రవర్తించుచు స్త్రీ కాముకుడై కొద్ది కాలములో మేక ముఖము గలవాడగు గాక. అతనిని అనుసరించిన వారందరూ ఈ లోకములో జన్మ మరణాదులు పొందుచు తిరుగుచుందురు కాక రుద్రుని ద్వేషించిన వారందరూ పువ్వులు పూచుటయే తప్ప పండ్లు పండని చెట్ల వలె మోక్షమనడి ఫలము సంగని కర్మలను మాత్రమే చేసెడి వాడై వేదపూర్వ భాగమందే రుచి రుచి గల వారగుదురు గాక మద్యపు వాసనచే మనసు కైపెక్కినట్లు స్వర్గాది సుఖములను కలిగించి మోహము కలిగించడి కర్మకాండచే మోహము నందుదురు గాక తినకూడని వాటిని, తినవలసిన వాటిని ఎరుంగక అన్నిటినీ తినడి సర్వభక్షులగుదురు గాక. బ్రాహ్మణులై ఉండి కేవలం శరీరం పోషించుకొనుటకే భార్యను బిడ్డలను పోషించుటకే విద్యా తపోవ్రతములు ఆచరించడి నీచులగుదురు గాక. ధనమందు దేహమునందు ఆనందము పొందిడి వారగుదురు కాక యాచకులై తిరుగుదురు కాక ఈ రకంగా శాపం అందించిన తర్వాత నందీశ్వరుడు ఇచ్చిన శాపం తర్వాత జరిగే భాగాన్ని తర్వాత మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Vishnu's wife, the great illusion, the great man's characteristic, beloved abode, great fortune, salutations to the mother of the world. Oh Lakshmi, wife of Vishnu, you are the great illusionary power. The characteristics of the Supreme Being are also in you Oh, you are a great fortunate one, O Mother of the world, have affection for me. Iyeka thank you. Sixth Canto 19 Chapter Sixth Prayer. Bhagat's relatives. Welcome to the third podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Previously, the marriages of the daughters of Swayambhu Manu, their sons, Knowing the inner meaning among them, we have learned that the sons of Murthy, the last wife, having Naranarayanulu, all the sages went to praise them. We will experience the next part. The sages sing the praises of Narayana. Your will is the only cause of this world. The intention is called Maya. The sky appears white in some places and black in others. You are the one, this world is yours, gods, celestial beings, humans, and the earth You have created it with different forms. Although the sky appears white and black, just as those colors touch the sky, so is your body. Such is the nature, in which the differences created by your will, such as gods, humans, etc., are not for you. You are always the same form. In the bodies of all, which are like your body, and which are seen by everyone, and which are like nature's distortions. Differences will arise. The individual, without recognizing that he is different from nature, creates illusion. By that, the being, without recognizing itself as different from the body, remains in bondage.

To be freed from it, one must be different from the body. You have assumed this form of Narayana to eradicate it. Your body is not a natural phenomenon. It is not necessary for karma, but only to gain knowledge, you have assumed a form equal to humans. The Lord himself, as the embodiment of Dharma, was born as a couple with names like Naranarayanulu among the sages. Salutations to that Lord. He who, by his will, causes bondage and liberation to the world is the Lord. That divine essence is capable of being understood only through scriptures, that is, through the Vedas, possessing various and strange powers. To protect, to create, to destroy the world that he created, having instilled power in those actions, he himself created us and the gods in this world with his parts. Such a supreme being is the one who is seen in this Narayana incarnation. May the Lord continue to look down with perfect grace. The lotus flower, the abode of Lakshmi Devi, was also brought down by the Lord's eyes. That supreme being, who is rejected in beauty, us May they be blessed. In this way, the two Narayanas, praised by the gods, were offered to the Gandhamadana mountain. Those Narayanaas, to remove the burden of the earth, incarnated as Krishna and Arjuna, the best in the Yadu dynasty and Kuru dynasty. She is the one who let Sahana and Nameri to the fire by the southern daughters. The three fires are the three fires of the Treta Yuga. The fire goddess is Agni, the third one. He is Pavakudu, Pavamanudu, and Shuchi to his wife Swaha. Three sons were born. The cows that are offered to the gods, the purodashamu and other substances, they eat and offer to the gods, therefore they are called Hutabhojanulu and Bhojulu. From these three, 45 Agnihotri were born. Those who have been united with the ancestors become 49.

The sacrifices mentioned in the Vedas, with the names of forty-five Agnihotras, are being performed as sacrifices to the fire god. Swadhayi is the 15th daughter of the southern sisters. She was married to the ancestor deity. Some of the Pitruligas were homemakers who did not perform yajna. Some are Ayjju. They are called Ayajis. The ancestors who performed the Yagnya (sacrifice) are called Agnishwatthu, Barhihisadu, and Somyulu. Those who were called Barihisadulu had Agnokaranam and Sumapana, therefore they got those names. Those who are not illuminated. Therefore, they are called Anagnulus. Similarly, they are called Ajyapu. They are firecrackers. Thus, the ancestors are of two types. Both of them had a wife named Swadha. Two virgins were born of the gods. Their names are Medha and Vaitarani. They are also known by the names Vayuna and Dharini. Those two virgins remained unmarried like Sanaka and Sanandadu. With the knowledge of Brahman, the knowledge born of scriptures, the knowledge acquired by the wise, being those who have it, giving the Brahma Upadesha They remained as celibate. She was the sixteenth consort of the South Indian goddess. She was married to Rudra. Even though she lives following her husband with devotion and faith, she has not been able to give birth to a son suitable for her through her qualities and character. Daksha, without any fault, became angry with Rudra. He was angry and rejected Rudra. Unable to bear it, Sati Devi burned her body with the fire of yoga. Sati Devi, because her husband was disrespected by her father-in-law Daksha Prajapati, abandoned her body. Vidura, who heard that, Rudra is the best among the virtuous, right? He has no animosity towards anyone, he has equanimity, he has the nature of being.

Why did Daksha, who was fond of the daughters of the great Rudra, hate them? Kumari, even if it is out of love for her husband, is it natural for the world to support the husband? Moreover. Rudra is the guru who imparted knowledge to all living beings, both animate and inanimate. He who is without enmity towards anyone, who has no nature of quarreling by hating anyone, he who is in himself and in all beings, delights in the Supreme Soul. What is the reason for Daksha Prajapati to hate Rudra, who is full of Shyama, Dama, and Sampann, and who is worshiped by all the worlds? It was because of Daksha's hatred that Sati Devi gave up her life. Explain why that happened. Even with so much pain, they cannot give up their lives, can they? It is very difficult to exchange lives, isn't it? Vidura is questioning Maitreyi, asking to explain the reason. Maitreyi then narrated the details. In the past, many kings like Marichi and others, as rulers, performed the Satra Yagam, and all those great men were present. With their entourage, Indra and all the other gods went to the assembly They came. All the gods, who were fond of fire, came to the assembly. Then, Daksha Prajapati came to the assembly. Seeing his radiance, as if seeing the radiance of the sun, everyone in the assembly was astonished and stood up. The south light filled the entire assembly with light, dispelling the darkness. All the gods, beginning with the radiant fire, stood up. But Brahma and Rudra did not get up from their seats. All the assemblies greatly honored Daksha. Brahma is the father of all creation, for all the universes. Daksha prostrated himself before Brahma and sat down with his master's permission. He, having come, seeing Shiva sitting without getting up, could not bear his neglect and became enraged. He spoke as if he was burning with intense gazes, looking at the side.

Oh gods, oh fire, oh great sages, I am telling you this word to make you realize the behavior of the virtuous, listen. I am not speaking out of ignorance or envy. This Rudra is destroying the fame of the lords of the worlds. A shameless man is a fool who has abandoned his duty. He who destroyed the Vedic rituals, which all the virtuous men followed. This is my daughter. He performed the Paanagrahaana, as a Brahmin, with the witness of the fire. So I am his guru and he is my student. After my daughter's wedding, he should respect me. When I come, I will stand up, I will bow down. Even though he did not greet the resurrection, he could not respect it with words. A person without good conduct is impure, arrogant, and excels in disrespect. I don't like giving my daughter to him, but how could I? Giving a specific Veda to one who has not undergone the Upanayana ceremony is as much a sin as it is a sin. He roams in the cemeteries, naked, with terrible ghosts. Hair He/She is wandering around, laughing and crying like a madman. The ashes from the cremation ground are applied to the body fully. She will wear the garlands and bones that were put on the dead body as ornaments. He is inauspicious, but he is called Shiva, meaning auspicious. He is intoxicated, dear to those who are intoxicated, possessing only the quality of darkness, the leader of the beings called Pramathas, the master of the qualities of Pramathas, intoxicated, intoxicated, he is the master of the qualities of the intoxicated, the one with a wicked mind, the one without practice. To this one, I, with auspicious conduct, my daughter, was born by the order of Brahma. This is very sad. I can't do anything right now. But this man does not respect me. Unable to bear seeing Shiva, who was sitting indifferently without replying, without condemning, Daksha performed Achamana and was ready to curse with anger.

This Rudra is the lowest among the gods. He cursed that he would not receive a share equal to the gods like Indra in the Yaga region. All those present in the assembly, even though they were warning that it was not appropriate to curse Rudra, did not listen. Rudra, having cursed, with intense anger, left the Yagnya Sammelanam and went to his own house. The followers of Rudra came to know about Daksha's curse. The presiding deity is Nandeeshwara. Hearing Daksha's curse, he, filled with anger and having red eyes, returned to Daksha and received a terrible curse. While condemning Rudra, he spoke thus, so that the curse would befall even the assemblies that heard, approved, and remained silent without repressing them. This Daksha is devoid of self-realization. He is a fool who considers himself independent, not realizing that Brahma, who is his soul, is also there. The God who did not betray his own matter, in the matter of Rudra, was cursed with betrayal. Therefore, this person, being without knowledge, being without wisdom. Not only lacking knowledge of the truth, but also being interested in actions that are lowly and worthy of abandonment, being interested in worldly pleasures Do not be one who praises actions that do not bear fruit and are not stable, but one who is deluded by the words of the Vedas and acts according to them. Having the nature of thinking that the body is the soul, behaving like an animal, being lustful, and becoming a goat-faced person in a short time. All those who followed him are wandering in this world, taking birth and death, but all those who hate Rudra are only blooming flowers, like trees that do not bear fruit, having attained the fruit of liberation, having done only karmas May those who are tasteful in the Vedic part be so, that just as the mind is captivated by the smell of alcohol, may they cause heavenly pleasures and delusion through the rituals, may they be deluded by delusion, those things that should not be eaten, May all eat without hesitation, may all be omnivores. Even being Brahmins, only to nourish the body, to nourish the wife and children, to practice education, penance, and vows, may you become vile. Those who have gained wealth and joy in their bodies will become beggars, but they will wander as beggars. In this way, after giving the curse, the curse given by Nandishwar, what happens after that Let us know the part later. Jai Srimannarayana Asmatgurubhyo Namaha