పృథు మహారాజు వనగమనము - యోగ సమాధి మోక్షసిద్ధి

The Renunciation and Attainment of Liberation by Prithu

bhagavatam

శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్‌లోని ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లో, మహారాజు పృథువు తన రాజ్యాన్ని త్యజించి, పట్టమహిషితో కలిసి వనప్రవేశం చేసి మోక్షమార్గంలో పయనించే మహత్తర ఘట్టాన్ని వివరిస్తాం. ఇంద్రియ నిగ్రహం, మనోనిరోధం, మరియు శ్రీహరిపై అచంచలమైన ధ్యానంతో పృథు మహారాజు కఠోర యోగసాధన చేస్తాడు. భగవత్కృపతో మరియు అనన్య భక్తిశ్రద్ధలతో, ఆయన యోగసమాధి స్థితిలో దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందుతాడు.

In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the majestic final chapter of Maharaja Prithu's earthly journey, as he renounces his kingdom and retires to the forest with his devoted queen to pursue the highest spiritual goal. With unwavering determination, Prithu immerses himself in rigorous yogic practice, progressively withdrawing his senses and mind from the material world and fixing his consciousness entirely upon the Supreme Lord Sri Hari. Through the grace of the Lord and the power of steadfast devotion, Prithu attains the ultimate liberation — merging his soul in divine union and departing this world in a state of perfect yogic samadhi.

← Prev Next →
The Renunciation and Attainment of Liberation by Prithu bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణీ ఓ వాసుదేవుడా, సకల ప్రాణులకు ఆశ్రయమైన నీవు సకల ప్రాణులలో సాక్షి చైతన్య రూపముగానున్నావు. ఓ పురుషోత్తమా, నీకు నమస్కారము. ఎయిత్ క్యాంటో, 16th చాప్టర్, 29th ప్రేయర్. భగవంతులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 26వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు వదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథ్రాజు యొక్క చరిత్రను మనం అనుభవించాం. పృథురాజు తన జీవితాన్ని చాలిస్తూ తను వృద్ధలోకాలో వెళ్ళిపోవటం ఆ తర్వాత జరుగుతున్న విషయాన్ని మనం చూద్దాం. పృథువు గతించిన తరువాత అతని కుమారుడు విశ్వాజితుడు రాజాయెను. అతడు తన సోదరులకు నాలుగు దిక్కులను పరిపాలించుటకు సంగెను. తూర్పు దిక్కును హర్యక్షునకు, దక్షిణ దిక్కును ధూమ్రకేసునకు, పశ్చిమ దిక్కును వృకునకు, ఉత్తర దిక్కును ద్రవిణునకు పాలించుటకు. అప్పచెప్పెను. ఇందుని వలన ఎవరికీ కనబడకుండా అంతర్ధానముకు శక్తిని పొందుటచే అతనికి అంతర్ధానుడు అని కూడా పేరు వచ్చెను. శిఖండిని అను భార్య యందు అతనికి ముగ్గురు కుమారులు కలిగిరి. గార్హపత్యము, ఆహ్వనీయము, దక్షిణాగ్ని అని మూడు అగ్నులు వశిష్టుని శాపముచే పావకుడు, పవమానుడు, శుచి అను పేర్లతో మనుష్యులై ఈ అంతర్ధానుని కుమారులుగా జన్మించిరి. వారు మరల సస్వరూపమునందిరి. అంతర్ధానుడు వేరొక భార్య వచస్వతి అను నామ యందు హవిర్ధానుడు అను కుమారుని పొందెను. ఈ అంతర్ధానుడు రాజ్య పరిపాలనమున పన్నులు వసూలు చేయుట, శిక్షించుట, కప్పములు కట్టించుకొనుట మొదలగు వానిచే ప్రజలను బాధింపవలసి వచ్చునని రాజుగా ఉండుటను వదలి దీర్ఘసత్ర యాగమును చేయుటకు సిద్ధపడెను. ఆ దీర్ఘసత్ర యాగములో తనను ఆశ్రయించిన వారి క్లేశములను నష్టింపచేయుటచే హంస అని పేరునొందిన పరమ పురుషుడగు పరమాత్మను ఆరాధించుచు తనకు పరమాత్మ ఆత్మగా ఉన్నాడని గుర్తించి దర్శించుచు సమాధిచే భగవల్లోకమును పొందెను.

హవిర్ధానుడు తన భార్యయగు హవిర్ధాని యందు బరిషిదడు, బర్హిషదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, శత్రుడు, జితవ్రతుడు అనేడి ఆరుగురు కుమారులను కనెను. హవిద్దానుని కుమారుడగు బర్హిషదుడు యజ్ఞయాగాది కర్మలయందు చాలా నిష్ట గలవాడు. అతడు భూమండలమునంతను యజ్ఞ భూమిగా చేసెను. యజ్ఞము చేసిన చోట మరల యజ్ఞము చేయకుండా భూమి అంతటా యజ్ఞము చేయుటచే భూమి అంతయు అతడు యజ్ఞములో పరిచిన దర్భలచే నిండి ఉండెను. అందుచే అతనిని ప్రాచీన బర్హి అని వ్యవహరించేవారు. ఆ ప్రాచీన బర్హి సర్వాంగ సుందరి అలంకార శోభితమగు సముద్రుని కూతురగు శతధృతిని బ్రహ్మ ఆదేశముచే వివాహమాడెను. ఆ ప్రాచీన బర్హి సర్వాంగ సుందరి అలంకార శోభితమగు సముద్రుని కూతురగు శతధృతిని బ్రహ్మ ఆదేశముచే వివాహమాడెను. పూర్వము సప్త ఋషులు సత్రయాగము చేయుచుండగా వారి భార్యలను చూచి అగ్ని కామ పరవశుడాయెను. దాని నిరింగిన అగ్ని యొక్క భార్యయగు స్వాహాదేవి సప్తర్షుల భార్యల రూపమును ధరించి తన భర్తయగు అగ్నిని రమింపజేసెను. అప్పుడు అతని నుండి స్కలితమైన రేతస్సును ఆడుచిలుక రూపముతోనున్న ఒక రెల్లుకాండమునందు ఉంచి విడలిపోయెను. అప్పుడు అగ్ని ఆ సుఖిని రప్త ఋషుల సప్త ఋషుల భార్య అను భ్రాంతితో కామించెను. అట్లే ఈనాడు కూడా ప్రాచీన బర్హితో శతధృతి అగ్నికి ప్రదక్షిణము చేయుచుండగా అగ్ని శరధృతిని కామించెను. ఆమె నూపురములు ఘల్లు ఘల్లు మనుచు అగ్నికి ప్రదక్షిణము చేయుచున్నప్పుడు చూచిన దేవతలు గంధర్వులు కూడా మోహమునందిరి. ప్రాచీన బర్హి శతధ్రుతియందు పది మంది కుమారులను పొందెను. వారందరకు ప్రచేతసులు అని పేరు. వారందరూ ధర్మ నిష్ణాతులు. ప్రజా సృష్టి యందు తండ్రి ఆదేశింపగా వారు సంతానమును పొందుటకు సముద్రమును ప్రవేశించి పదివేల సంవత్సరములు తపస్సులచే ఆరాధింపదగిన భగవానుని ఆరాధించిరి. తరువాత అరణ్యమునకేగిరి. అరణ్యమునకేగుచుండగా దారిలో రుద్రుడు కనపడెను. వారా రుద్రుడినే ధ్యానించుచు పూజించుచుండుటచే రుద్రుడు ప్రత్యక్షమాయెను.

ఈ సంసారములో శరీరధారులగు వారికి శివునితో సమాగమము కలుగుట దుర్లభం. దుర్లభమైనట్టి శివుని దర్శింపవలెనని వారు ధ్యానము చేసిరి. భగవానుడగు రుద్రుడు ఆత్మారాముడు. జ్ఞానము కలవాడు. అతనికి లోక సంచారము చే ప్రయోజనము లేదు. కానీ దీనులైన లోకులను అనుగ్రహించుట కొరకు శక్తితో కూడా సంచరించుచుండును. రచేతసులు సంతానమునకై తండ్రిగారిచే ఆదేశింపబడిన వారై సృష్టి చేయుట కొరకు తపస్సు చేయవలెనని పశ్చిమ దిక్కున చేరిరి. అచ్చట సముద్రము వలె అంతులేని అందమైన ఒక సరస్సును చూచిరి. ఆ సరస్సు జ్ఞానవంతుల మనస్సు వలె నిర్మలముగా ఉండెను. చేపలు దానియందు విహరించుచుండెను. నల్లని, ఎర్రని కలవలు, తామరలు, కలహారములు మొదలగు పువ్వులు, హంసలు, సారసములు, చక్రవాకములు. కాండరవములు, కారండవములు మొదలగు ప్రక్షులు నిండి ఉండెను. పువ్వులందరి మకరందమును ఆస్వాదించిన తుమ్మెదలు మదించి గానము చేయుచుండెను. ఆ పుష్పముల యందలి పుప్పొడిని గాలి నెలవైపులా వెదజల్లుచుండెను. ఆ సరస్సునందు మద్దెలలు మొదలగు వ్యాద్యములు. రకరకము మనోహరమగు గానమును వినిపించెను. రాజపుత్రులకు ప్రచేతసులు ఆశ్చర్యపడివి. అప్పుడు ఆ సరస్సు నుండి గంధర్వ కిన్నరాది పరివారముచే స్తోత్రము చేయబడుచు ప్రమధ గణములతో కూడిన రుద్రుడు వెలికి వచ్చెను. బంగారు వంటి శరీర కాంతి, నల్లని కంఠము, త్రిలోచనములు గల ఆ పరమశివ మూర్తిని వారు నమస్కరించి. భగవానుడగు రుద్రుడు భక్తవత్సరుడు. తనను శరణు జొచ్చిన వారి ఆర్తిని తీర్చువాడు. ధర్మజ్ఞుడు వినయాది శీల సంపదలు గల ప్రచేతసులను చూచి అతడు సంతిష్టి నందెను. ప్రచేతసులతో రుద్రుడు ఇట్లు పలుకుచున్నాడు. మీరు ప్రాచీన బర్హి కుమారులను నేను ఎరుంగుదును. మిమ్ములను అనుగ్రహించుటకే ఇప్పుడు మీకు దర్శనం వసంగుచున్నాను. సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి కంటే జీవుని కంటే పరుడగు భగవానుడగు వాసుదేవుని ఎవరు శరణు పొందురో వాడు సర్వోత్కృష్టుడు. అట్టి భక్తుడు నాకు ప్రియుడు. పురుషుడును నూరు జన్మలలో ధర్మములను ఆచరించినచో బ్రహ్మతో సామ్యమును పొందును లేదా బ్రహ్మయే అగును. అటువంటి నూరు జన్మలు తపస్సు చేసినచో అంతకు పైవాడనైన నన్ను పొందును. తరువాత భాగవత ధర్మమును ఆచరించిన వాడై ఇంద్రియములకు గోచరము గాని

మాటలతో చెప్పుటకు శక్యముగాని విష్ణువునకు సంబంధించిన స్థానమును పొందును. దేవతలు, బ్రహ్మాంద్రాదులు నేను కూడా కల్పాంతమునందు ఆ స్థానమునే పొందుదుము. మీరు భాగవతులు. భగవంతుడు నాకు ప్రియుడు కావున మీరు కూడా నాకు ప్రీతిపాత్రులే. నాకు భాగవతుల కంటే వేరొకరు ప్రియమైన వారు లేరు. నేను ఇప్పుడు మీకు రహస్యముగా ఉపదేశించవలసిన దానిని ఉపదేశించెదను. ఇది చాలా పవిత్రమైనది. చెప్పెదన వినుడు అని దయతో చేతులు జోడించి నిలిచిన రాజపుత్రులను గూర్చి నారాయణపరుడగు రుద్రుడు ఇట్లు ఉపదేశం ఆరంభించెను. రుద్రుడు చేసిన ఉపదేశాన్ని రుద్రగీత అంటారు. దాన్ని మనము మరియొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, the Lord of all beings, the great lord, the sustainer of all beings, the Vasudeva, witness. Oh Vasudeva, you are the refuge for all beings, and you are the witness consciousness in all beings. Oh, Lord, I salute you. Eighth Canto, Sixteenth Chapter, Twenty-ninth Prayer. Oh Gods, welcome to the 26th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation with Maitreya, we have experienced the history of Prithraj. Prithu Raju, spending his life, going to the world of old age, let's see what happens after that. Prithu was succeeded by his son Vishwajit. He gave his brothers the task of ruling the four directions. To rule the east to Haryaksha, the south to Dhumrakeshana, the west to Vrukuna, and the north to Dravinuna. He promised. Because of this, he gained the power of disappearance without being seen by anyone, and he also got the name Antardhanudu. Shikhandi's wife He had three sons. Garhapatyamu, inviting, Dakshinagni, these three fires, by the curse of Vasishta, became humans with the names Pavakudu, Pavamanudu, and Shuchi, and were born as the sons of this Antaradhanu. They again assumed their original form. Antaradhanudu had a son named Havirdhanudu in the name of Vachaswati. This inner-hearted man, abandoning being a king, having to trouble the people by collecting taxes, punishing, and having to collect tributes, decided to perform a long-night sacrifice. In that long-established sacrifice, by causing the sufferings of those who had taken refuge in him to be destroyed, he, who is the Supreme Being, known as Hamsa, worshipping the Supreme Soul, recognizing that the Supreme Soul is his own soul, and seeing, attained the supreme world through samadhi.

Havirdhanudu had six sons named Barishiddu, Barhishadu, Gayudu, Shukrudu, Krishnudu, Shatrudu, and Jitavrathudu, with his wife Havirdhani. Barhishadu, the son of Haviddanu, was very devoted to the rituals of Yagnya and Yagya. He made the whole earth a sacrificial ground. Without performing a Yagnya again at the place where the Yagnya was performed, the entire earth was filled with the darbha grass that he had introduced into the Yagnya. He was therefore called the Ancient Barhi. That ancient Barhi, adorned with the beauty of a beautiful woman, Shatadhruti, the daughter of the ocean, was married by the order of Brahma. That ancient Barhi, adorned with the beauty of a beautiful woman, Shatadhruti, the daughter of the ocean, was married by the order of Brahma. Once upon a time, while the seven sages were performing the Satra Yagam, Agni, seeing their wives, became engrossed in lust. Swahadevi, the wife of that unquenchable fire, assuming the form of the seven sages' wives, pleased her husband, the fire. Then, placing the semen from him in a reed stem that was in the form of a dove He separated. Then Agni desired that Sukini, the wife of the seven Rishis, the Rapta Rishis. Similarly, even today, while circumambulating the fire with the ancient Bharhitho Shatadhruti, the fire desired the Sharadhruti. When she was circling the fire with her flutes, the gods and Gandharvas who saw it were also fascinated. In the ancient Barhi Satadhruuti, he had ten sons. They are called Prachetas. All of them are religious scholars. In the creation of the people, as the father commanded, they entered the ocean to have children, and for ten thousand years, they worshiped the Lord, who is worthy of worship through penance. And then retreating into the wilderness. While going to the forest, Rudra appeared on the way. By meditating on and worshipping Rudra, Rudra appeared.

In this world, it is difficult for those who are embodied to have a union with Shiva. They meditated, thinking that it was difficult to see Shiva. Rudra is the embodiment of the supreme spirit. The Knower. He has no use for worldly travel. But to bless the humble people, He also travels with power. The Rachitas, having been commanded by their father, went to the west to perform penance to create the universe. There, like an endless beautiful lake, they saw a lake. The lake was as pure as the mind of the wise. The fish were frolicking in it. Black, red, mixed, lotuses, lotuses, mixed, and flowers, swans, cranes, and chakravakas. The kandaravamulu, karandavamulu and other prakshul were full. The bumblebees, having enjoyed the nectar of all the flowers, were singing merrily. The pollen from those flowers was scattered in all directions by the wind. In that lake, there are musical instruments like mridangam and others. He played various beautiful songs. The Rajputs' servants They were surprised. Then, from that lake, praised by the Gandharvas, Kinnaras, and other attendants, Rudra, along with the Pramatha Ganas, came out. They saluted that supreme Shiva idol, which had a golden-like body radiance, a black throat, and three eyes. Rudra is the God of devotion. He is the one who will relieve the suffering of those who seek refuge in him. Seeing the virtuous, humble, and virtuous people, he was pleased. Rudra is saying this to the Prachetas. I will make you the sons of the ancient Barhi. I am now granting you a vision to bless you. He who surrenders to Vasudeva, the supreme being, who is beyond the qualities of Sattva, Rajas, and Tamas, and who is superior to the living being, is the most excellent. Such a devotee is dear to me. A man, if he practices righteousness for a hundred births, attains equality with Brahma or becomes Brahma himself. If one performs penance for a hundred births, one will attain me, who is beyond that. Afterwards, being one who practiced the Bhagavata Dharma, not visible to the senses

It is impossible to describe with words the place related to Vishnu. Gods, Brahma and others, I too will attain that place at the end of the eon. You are devotees. For I am predestined to love the Lord, and you are predestined to love me. I love no one but the Bhagavathas. I will now secretly teach you what I have to teach. It's very sacred. Narayana Parudu, thus began the teaching about the Rajputs who stood with folded hands, saying, "Listen, O king." The sermon given by Rudra is known as Rudra Gita. We will find out in another episode. Jai Srimannarayana and salutations to the Ashmadguru.