పృథు చక్రవర్తి ప్రజాహిత దివ్యోపదేశ ప్రసంగము
King Prithu's Core Philosophical Speech to His Subjects
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, మహారాజు పృథు చక్రవర్తి తన ప్రజలకు మానవ జీవిత పరమార్థమును గురించి అత్యంత తత్త్వబోధతో నిండిన దివ్యోపదేశమును అందిస్తారు. శ్రీ మహావిష్ణువు పట్ల భక్తియే జీవన సారమని, భౌతిక సుఖాలకు అతీతంగా మోక్షమే మానవుని అసలైన లక్ష్యమని ఆయన స్పష్టంగా నొక్కి చెప్తారు. ధర్మబద్ధమైన పాలనతో పాటు ప్రజల ఆత్మికోన్నతికై నిరంతరం కృషి చేసిన పృథు చక్రవర్తి ఆదర్శ రాజకీయ నీతికి ఈ ప్రసంగం ఒక చిరస్మరణీయ నిదర్శనంగా నిలుస్తుంది.
In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, the great emperor Prithu addresses his subjects with a deeply philosophical and spiritually illuminating discourse on the purpose of human life. He emphasizes the supreme importance of devotion to Lord Vishnu as the ultimate goal, guiding his citizens beyond material pursuits toward lasting liberation. King Prithu's words reveal the ideal of a righteous ruler who governs not merely for earthly prosperity, but for the eternal well-being of every soul under his care.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమస్తుభ్యమనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణి నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయచ సాంప్రతం ఓ దేవా! నీ లీలలు ఊహకు అందవు. గుణకార్యమగు జగత్తునకు ప్రభువుడవగు. నీయందు సతహాగా గుణములు లేవు. అయినను ఇప్పుడు ఈ స్థితి కాలమునందు నీవు సత్వగుణము ఉపాధిగా కలిగి ఉన్నావు. నీకు నమస్కారము. ఎయిత్ క్యాంటో ఫిఫ్త్ చాప్టర్ ఫిఫ్టీయత్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 24వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మునులు, పితృ దేవతలు అందరూ కూడాను పృథ్యురాజును ప్రశంస ఇచ్చినటువంటి ప్రశంసలు వారికి అందించిన ఉపదేశాలని మనం అనుభవించాం. ఇప్పుడు సనత్ కుమారుల వారు చేసే ఉపదేశాన్ని మనం విందాం. ఈ విధంగా ప్రజలందరూ అధికమగు పరాక్రమము గల పృథ్వును ప్రశంసించుచుండగా అచ్చటికి సూర్యుని వంటి దివ్య తేజస్సుతో విరాజిల్లు నలుగురు మునులు వచ్చిరి. వారి తేజస్సుచే పైకి లేచిపో సిద్ధపడిన ప్రాణములు వారిని ఎదుర్కొని నమస్కరించి తనలో నిలుపుకొనెను. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడి వారికి స్వాగతం పలకనిచో ప్రాణములు లేచిపోవునట. లేచి నమస్కరించి ఆదరించినచో ప్రాణములు మరల వారిలో చేరునట. ఈ శాస్త్రమును ఎరింగిన పృథువు ఆ నలుగురు మునులను చూచి తన సభాసదులతో కూడా ఎదుర్కొనెను. ఇంద్రియములకు అధిపతియగు జీవుడు శబ్దాది విషయములను ఎదురేగి గ్రహించినట్లు ఆ మునులను ఎదుర్కొని ఆదరించెను. వారి యందరి గౌరవముచే వినయముచే శిరస్సును వంచిన వాదై. వారికి అర్ఘ్యపాద్యమును సమర్పించి ఆసనమును చూపి తగినట్లు పూజించెను. వారికి పాద ప్రక్షాళనము చేసి ఆ జలముతో శిరస్సును ప్రోక్షించుకొనెను.
నడువడి గల పెద్దలు ఎట్లు ఆచరింతురో ఆ ఆచరణములను గౌరవించుచు అట్లే ప్రవర్తించును. వేదికలలో అగ్నిహోత్రములు నిలిచి ఉన్నట్లు ఆ మునులు బంగారు ఆసనములపై కూర్చోండిరి. శ్రద్ధతో వారి మాటలను వినుట అందలి ప్రీతితో తొందరపడుచు ఇంద్రియములన్నిటినీ వారికి అభిముఖముగా ఉంచి పృథువు ఇట్లు మాట్లాడుచున్నాడు. మంగళమునకు స్థానమైన మీరు ఈనాడు నాకు దర్శనము ఒసంగుట నేను చేసుకునిన పూర్వ పుణ్య ఫలము. యోగులు కూడా తగు ప్రయత్నము చేయి మిమ్ములను చూడజాలరు. బ్రాహ్మణులను వారిచే ఆరాధింపబుడు శివుడు విష్ణువు ఎవరిని అనుగ్రహింతురో వారికి ఈ లోకములో పై లోకములో పొందరానిదేమీ ఉండును. లోకమంతటా మీరు ఎల్లప్పుడూ సంచరించుచునే ఉందురు. అన్నింటినీ చూడగలిగిన పరమాత్మను బ్రహ్మాదులు కూడా ఎట్లు చూడలేరో అట్లే మిమ్మల్ని ఎవ్వరునూ కాంచజాలరు. మీ వంటి సాధువులు ఏ గృహస్తుల ఇళ్లకేగి వారు వసంగిన జలమును, తృణమును, భూమిని ఆదరింతురో అట్టి గృహస్తుల దరిద్రులైనను సాధువులే. వారు ధన్యులు. అన్నిటినీ పవిత్రము చేయగల భగవానునకు సంబంధించిన భాగవతుల పాదము సోకని గృహములు పరిపూర్ణముగా సంపదలతో నిండినవైనను సర్పములు వసించెడి చందన వృక్షములు వంటివి. ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా, మీకు స్వాగతము. మీరు బాలురై ఉండియు మోక్షమును ఇచ్చగలవారు. జితేంద్రియులు మిమ్ములను చూచి మీరు ఆదరించు మోక్షమును కాంక్షించు మునులందరు శ్రద్ధతో సాధనానుష్ఠానమును ఆచరించుచుందురు. ఇంద్రియములచే అనుభవించడి మేము చేసెడి కర్మలచే దుఃఖములకు నిలయమైన సంసారంలో పడి ఉన్న మా వంటి వారులకు క్షేమము కలగనేరదు. మీరు కుశలమా అని అడుగుట అసంగతము. మీరు ఆత్మారాములు బుద్ధివృత్తులే మంచివి చెడువి అగు విషయములను ఆలోచించుచు సుఖమునకు దుఃఖమునకు కారణమగుచున్నవి.
మీరు ఆత్మ యందే ఎల్లప్పుడూ బుద్ధివృత్తులను నిలిపి చింతించుచుందురు. కావున మీకు విషయ చింతన ఉండదు. అందుచే మీకు కుశలమే తప్ప అకుశలము కలగనేరదు. కావున మిమ్ములను కుశల ప్రశ్నలు వేయుట అవివేకం, మేము తాపత్రయముచే దుఃఖించుచున్న వారము, మీరు మాకు మేలు కోరువారరు. మీ యందు గల విశ్వాసముచే దీనులమై ఉన్న మాకు ఎట్లు తొందరగా క్షేమము కలుగునని ప్రశ్నించుచున్నాను. ప్రశస్తమగు జ్ఞానము గల జ్ఞానులకు ఆత్మ అయినవాడు వారి యెడల ప్రీతి గలవాడు భగవానుడు అనుట సత్యము. భగవానుడే వారికి తన విషయమైన జ్ఞానమును సంగును. భగవానుడే జ్ఞానులను తన శరీరముగా పరిగ్రహించి తన భక్తులకు అనుగ్రహించుటకై ఈ లోకమును సంచరింప చేయుచుండెను. ఇట్టు పృథ్వు పలకగా వినుటకు మధురముగాను హితమును చక్కగాను ఉన్న అతని మంచి మాటలను విని సంతోషించి. మందహాసము చేయుచున్న వాని వలె ఉండి సనత్కుమారుడు ఇట్లు పలికెను. మహారాజా, నీవన్నింటినీ ఎరుంగుదువు కానీ సర్వభూతములకు హితమును ఎరుంగింపవలెనని సద్బుద్ధితో మమ్ములను మంచి ప్రశ్నను అడిగితివి. భోగములను అనుభవింపదలచిన వారికి, మోక్షమును పొందదలచిన వారికి కూడా వారు కోరిన భోగ మోక్షములు లభించుటకు మొదటి మెట్టు సాధు సమాగమము. సత్సంగమే భోగ మోక్ష సమాగమము. సత్పురుషులతో మాట్లాడుట చేతను వారిని ప్రశ్నించుట చేతను ప్రాణులకు భోగము మోక్షము పొందుటకు తగిన ఉపదేశము లభించును. భోగములను కోరు వారికి సత్పురుషులతో కలయుట, తరువాత మాట్లాడుట, తరువాత వారిని ప్రశ్నించుట, ప్రశ్నకు సమాధానముగా వారు భోగ సాధనముల ఉపదేశించుట. ఆ సాధనమును ఆచరించుట అను వరుసలో భోగము లభించును. మోక్షము కోరు వారికి సత్పురుషుల సంగమము, వారితో మాట్లాడుట, వారిని ప్రశ్నించుట, వారు భగవత్ గుణములను వర్ణించుట. వానిని విని వాని యందు అనురాగము ఏర్పడుట అనునవి వరుసగా జరుగును. మోక్షమునకు సాధనమగు భగవద్గుణ శ్రవణమునందు నీకు అనురాగం ఎప్పుడును ఉన్నది.
గుణ శ్రవణమునందు ప్రీతిచే నీకు భగవానుని యందు ఏనాడును తొలగని వేరొక ఫలమును కోరని భక్తి స్థిరముగా ఉన్నది. అదే మనసున కంటిన కషాయం వంటిదగు పుణ్య పాప కర్మ వాసనను అంతమొందించును. శాస్త్రములలో మనుషులు మోక్షమును పొందుటకు సాధనము భక్తియే అని నిశ్చయముగా సిద్ధాంతము చేసినారు. ఆ భక్తి పరబ్రహ్మము సర్వేశ్వరుడు గుణత్రయ రహితుడగు భగవానుని యందు దృఢముగా ఉండవలెను. భగవంతుని కంటే ఇతరములైన వాటియందు సంఘము లేకుండా ఉండవలెను. దానిచే పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అనునవి మూడును క్రమముగా కలుగును. భగవంతుని గుణములయందు ప్రీతి కలిగిన వానిని ఎడతెగక స్మరించుట పరభక్తి. ఆ పరభక్తిచే మానసికముగా సాక్షాత్కారము కలుగును. అదియే. పరజ్ఞానము. అట్టి పరజ్ఞానముచే రెప్పపాటు కాలము కూడా దానిని వదిలి ఉండలేని నిరతిశయమగు ప్రీతి పరమ భక్తి అది దృఢముగా ఉండవలెను. అనగా మధ్యలో మరియొక విషయమును స్మరించకుండా నిశ్చలముగా ఉండవలెను. కావున వేరొక విషయమును గూర్చిన ఆలోచన లేక మిక్కిలి ప్రీతితో భగవానుని ఎదురుగా నర్షించునట్లుగా స్మరించుటయే పరమ భక్తి. అదియే మానవునకు క్షేమమును కలిగించు సాధనము. అట్టి భక్తి కలుగుటకు ప్రథమ సాధనము శ్రద్ధ. శ్రద్ధతో ఆ భగవాను దర్శించుటను వారి పరిచర్య చేయుట వానిని గూర్చి ఎరుంగుటను చేయుచుండును. ఆ భగవానుని పరతంత్రమై ఉండెడిది ఆత్మ స్వరూపమనే తెలుసుకొని భగవానునికి పరతంత్రమై వాని కొరకే ప్రవర్తించుచుండును. పవిత్రముగా ఆ భగవత్ కథలనే వినుచుండును. భక్తితో భగవానుని సేవించెడు భాగవతులను ప్రేమతో సేవించుచుండును. ఈ క్రమముతో మానవుడు క్షేమమును పొందును. ఇట్లు భగవత్ ప్రీతి కలుగుటచే భగవంతుని కంటే ఇతరములగు ఇంద్రియములకు ప్రీతిని కలిగించడి విషయములపై కోరికలపై మనసు లగ్నము కాదు. తత్వమును, ఉపాయమును, పురుషార్థమును ఎరుంగవలెనడి కోరికతో ఆచార్యుని సేవించును. ఆచార్య సేవనముచే ఆధ్యాత్మిక శిక్షణ పెంపొంది.
భగవత్ స్వరూప రూప గుణములను మననము చేయుటయందు ధ్యానము చేయుటయందు తొందర కలుగుచుండును. తన శరీరముతో ఆచరించడి కర్మలన్నింటిని భగవత్ సేవా రూపముగా ఆచరించుచుండును. తీసుకునని ఆహారములో వివేకము కలిగి దానిచే మనసు పరిశుద్ధమై ఆత్మానుభవం చేత చేతనే ఎల్లప్పుడూను సంతోషము నొందుచుండును. అట్టి భక్తునకు భగవత్ గుణములను వినుట, స్మరించుట అనడి అమృతమును పానము చేయుట కంటే ఇతర విషయములను అనుభవము చేయుటచే సంతోషము కలగదు. అట్టి భక్తి గలవానికి విశ్వమంతయు ఆ భగవానుని శరీరముగా అన్నిటిలోనూ భగవానుడు ఆత్మగా గోచరించును. అందుచే ఎవ్వరిని వారు హింసింపజాలరు. భోజనాది సమయములలో కూడా ఆ భగవ లీలలను అనుభవించుచుందురు. వారి ఇంద్రియములు, మనస్సు ఇతర విషయములపై ప్రసరింపక. యమ నియమములు కలదై ఉండును. వారికి దేనియందు కోరిక ఉండదు. వేరొకరిని వారి సాధనమును వారి ఆరాధించని దేవతలను వారు నిందింపరు. దేహ ధారణమునకై అవసరమైన ఆహారమును స్వీకరించి అవసరమైన వ్యాపారములు చేయుచుందురు. శీతోష్ణములను వ్యాధులను ఓర్మితో సహింతురే గాని దుఃఖింపరు. భగవత్పరులైన భక్తులు తమ చెవులకు అలంకారముగా భగవద్గుణములను వినుచుందురు. మరల మరల చెప్పుచుందురు. భక్తి క్రమముగా వృద్ధినందును. దానిచే భగవంతుని కంటే ఇతరములయందు సంఘము తొలుగును. హేయ గుణములు లేని బ్రహ్మమునందు శీఘ్రముగా అనురాగం ఏర్పడును. ఇట్లు ఆచార్యులను ఆశ్రయించి జ్ఞానమును పొంది తత్వ విచారముచే వృద్ధినందిన భక్తిచే పురుషుడు జ్ఞాన వైరాగ్యములతో అతిశయముకు భక్తిని పొందును. దానిచే పంచభూతాత్మకమగు ఈ జీవుని రూపము శరీరము బీజము లేనిదగును. దేహ సంబంధము కలుగుటకు బీజము పుణ్య పాపముననడి కర్మలే కదా.
జ్ఞాని జ్ఞాన భక్తి వైరాగ్యములు వానిని దహించి వేయును. కర్రలను ఒకదానితో ఒకటి రాపాడగా అగ్ని పుట్టి ఆ కర్రలనే దహించినట్లు శరీరంలోనున్న జీవుని జ్ఞానము శ్రవణ మనన ధ్యానములచే వృద్ధినంది. దేహమునకు మూలమైన పుణ్య పాప కర్మలను దహించి వేయును. ఈ విధముగా శరీర సంబంధము పోవును. దానిచే ఈ సత్వరజస్తమో గుణములు వానిచే కలిగే ద్వేషాదులు కనపడకుండా పోవును. మరల దేహ సంబంధమును పొందడు. ఇంతవరకు భగవంతునితో జీవునకు ఉండెడి సంబంధమును మరుచునట్లు చేసినది శరీరమే. ఇప్పుడు ఇది నశించుటచే జీవ పర సంబంధము స్పష్టముగా ప్రకాశించుచుండును. తన దేహమును ఇంద్రియములచే అనుభవించు శబ్దాది విషయములు భోగ స్థానములు మున్నగు వానిని శరీర సంబంధము చేతనే జీవుడు అనుభవించుచుండును. దేహ సంబంధం విడిననాడు ఇవి అంటవు. ఈ శరీర సంబంధము జీవునకు భాసించినంత కాలము జీవునకు పరమాత్మకు సంబంధం లేనట్లు కనపడును. విషయములను మనసులో ఆలోచించుట చేతనే విషయముల వైపు ఇంద్రియములు ఆకర్షింపబడును. బుద్ధి తాను పొందదగిన పురుషార్ధము భగవత్ ప్రాప్తి అను అధ్యవసాయము ఇయ్యలేదు. నీటి ఒడ్డున ఉన్న దర్భ మొదలగు దుబ్బులు ఒడ్డు నీటిచే మన్ను కరిగి పడుటచే ఎట్లు పడునో అట్లే ఇంద్రియములు విషయముల వైపు పడుటచే మనసు కూడా పడును. భగవత్ విషయమును చింతించెడి చిత్తము దాని నుండి జారిపోవును. ఆ ఉపాసనా రూపమగు భగవత్ చింతనము తొలగినచో ఆత్మ పరమాత్మల యాధాత్మ్య జ్ఞానము జారిపోవును. అప్పుడు ఆ ఆత్మ పరమాత్మకే చెందినదనియు పరమాత్మ కొరకే ప్రవర్తించెడనియు భాసింపదు. తాను తనంత ప్రవర్తించినట్లు అనిపించును. ఇదే బంధమునకు మూలము. ఆత్మకు కోరి పొందదగిన సుఖము భగవానుడే. దానిని పొందుటకు తన స్వరూపము తనకు తెలియవలెను.
తాను భగవత్పర తంత్రుడనియు భగవదాజ్ఞచే భగవత్ కార్యము భగవత్ ప్రీతికై చేయుచున్నాననియు సంతతము స్వస్వరూపము భాసించుచుండవలెను అది భాసింక భాసింపకపోవుటచే పోవుటయే ఆత్మ సుఖమును అందకపోవుటకు కారణము. తన స్వరూపము తాను సంతతము మననము చేసుకొనక విషయములను ధ్యానించుట చేతను వానితో ఇంద్రియములు కలియుట చేతను అనర్థము కలుగుచున్నది. ఇంద్రియములు, శబ్దాది విషయములు, పురుషుడు కోరి పొందవలసిన సుఖమునకు విరోధులు, అన్నిటికీ మూలము సమాధి అనగా తన స్వరూపము చే తాను సంతతము భావించుచుండుట. అది లేనిచో చైతన్యము కలిగి ఉండియు జ్ఞానము విజ్ఞానము కలిగి ఉండియు స్థావరత్వము పొందును జ్ఞానమును మరుగుపరుచున్నది అజ్ఞానము తత్వముల స్వరూపమును వాస్తవముగా ఎరుంగలేకపోవుట అదియే ధర్మార్థ కామ మోక్షములని నాలుగు పురుషార్ధములను పొందకుండా చేయును. ధర్మార్థ కామములు మూడును పురుషుడు కోరి పొందదగినవే కానీ అవి కొంతకాలమే సుఖమును కలిగించును. నిత్యముగా సుఖమును కలిగించునది మోక్షము అనగా భగవత్ ప్రాప్తి. ధర్మార్థ కామములు ఎప్పుడైనను మృత్యు భయముతో కూడినవే. బ్రహ్మ మొదలు తృణము వరకు సకల పదార్థములు సత్వరజస్తమో గుణములు వైషమ్యము నొందిన ప్రకృతి వలన ఏర్పడినవే. అందు కొన్ని ఉత్కృష్టము గలవి గొప్పవి కొన్ని నికృష్టములు సామాన్యమైనవి కావచ్చు కానీ అవి అన్నియు కాలరూప ఈశ్వరునిచే ఒకనాడు నశింపజేయబడునవే కనుక క్షేమము లేదు అవి స్థిరము కావు అందుచే ఓ రాజా, ప్రాణములు, ఇంద్రియములు, దేహము, మనస్సు అని వానితో కూడి ఉన్న స్థావర జంగమ శరీరములలో కూడిన క్షేత్రజ్ఞులు అనగా జీవులు ఆ శరీరములోనున్న జీవుల లోపల నుండి నియమించెడి పరమాత్మ. ఆత్మగా గల ఆత్మ స్వరూపమునే సంతతము భావించుచుండవలెను. ఈ క్షేత్రములను అనగా శరీరమును నాది అని భావించెడి గృహ పుత్ర ధనాదులను నేను నాది అని భావించుచున్నట్టు చేసేడిది అజ్ఞానము. ఆత్మయే జ్ఞానము కలది అదియే శరీరేంద్రియాదులను శరీరమునకు చెందిన ధనగృహాదులను పాలించుచుండును అట్టి జీవరూపముతో తనకు తానే ప్రకాశించుచుండెడి ఆత్మకు ఆత్మయై ఉండడివాడు భగవానుడు
నేను అనేటి జీవుడు భగవానునకు శరీరములో శరీరం వలె ఉండును కనుక నేను అనగా భగవానుడే అని భావించుచుండుము. ఈ శరీరమందే జీవుడు పరమాత్మ కూడా ఉండుటచే ఈ జీవుడే పరమాత్మ అను భ్రాంతి మాయచే కలుగుచుండును కానీ అందు జీవుడు కర్మచే జ్ఞాన సంకోచము వికాసము పొందుచుండును. భగవానుడు అట్టి మార్పులను అందడు. ఈ వివేకము కలిగిన నాడు స్వస్వరూపము భాసించును. జీవుడు జీవుడుగా భాసించును. అట్లు శరీరములో జీవునకు ఆత్మ జీవు ఆత్మగా జీవుడే అనతగినట్లుగా ఉండెడి కర్మ సంబంధము లేని నిత్య ముక్త శుద్ధ స్వప్రకాశితమగు భగవత్పత్వమును నేను శరణు పొందుచున్నాను. భగవత్ వ్యతిరిక్తములగు పదార్థములన్నియు భగవతాత్మకములే అను జ్ఞానము గలవారై భగవత్ పాద పద్మ యోగ నిష్ఠులు కర్మ వాసనలతో నిండిన శరీర సంబంధమును నాశనము చేసుకొందురు. అట్టి వాసుదేవునే రక్షకుడుగా ఉపాయముగా నీవు భావింపుము. ఈ సంసారము ఒక సముద్రము. జ్ఞానేంద్రియములు ఐదు, మనస్సును ఆరు, దీని యందు ఉండెడు మొసళ్ళు. దాని దాటవలెనని కోరువారు భగవానుడిని భగవానుడైన నౌకను ఆశ్రయింపవలెను. ఆశ్రయింపని వారు ఈ సముద్రమును ఎంత కష్టపడినను దాటచాలరు. ఆ భగవత్పాద నౌక ఆశ్రయించుటకు సుఖమైనది, సులభమైనది. దానిని ఆశ్రయించిన ఈ సముద్రం యొక్క ఆవలి అంచును చేరును. ఇట్లు బ్రహ్మ మానస పుత్రుడగు సనత్ కుమారుడు పృథ్వునకు ఉపదేశించెను. ఆత్మ తత్వమును ఎరింగించెను. పృథ్వు అతని మిక్కిలి అతని మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలుకుచున్నాడు. ఇంతవరకు పృథువుకు సనత్కుమారుడు ఉపదేశించినటువంటి విషయాన్ని మనం అనుభవించాము. కొంత విషయం పూర్తి కావడాని కోసమని ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. చక్కగా దీన్ని విని ఈ తత్వాన్ని విని మనము మోక్షానికి మార్గాన్ని అర్థం చేసుకుంటామని. భావిస్తూ మరొక పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations to you, the infinite one, the one without attributes, the action-doer, the one without attributes, the giver of qualities, the one with goodness, the one with truth, O God! Your miracles are immeasurable. Lord of the world, who is full of virtues. You have no qualities that are consistent with your claim. However, now, in this state of time, you have the quality of goodness as your support. Namaste. Eighth Canto, Fifth Chapter, Fifty-fifth Prayer. Devotees of God, welcome to the fourth episode of Srimad Bhagavata Tattva Deepika, the 24th podcast. Until now, as part of the conversation between Vidura and Maitreya, we have experienced the praises given by the sages and ancestors to Prithuyaraja, and the teachings they imparted to him. Now let's listen to the teachings of the Sanat Kumaras. In this way, while all the people were praising Prithu, who had great valor, four sages came there, shining with a divine light like the sun. The souls that were ready to rise up by their splendor, faced them, bowed down, and held them within themselves. When the elders arrive, get up If you don't welcome those who stand, their lives will be lost. If you get up, greet, and welcome, then lives will be re-entered in them. The king who knew this scripture, seeing those four sages, also confronted his courtiers. The being who is the master of the senses, as if confronting and grasping the objects of sound and other senses, confronted those sages and welcomed them. Arguing with the respect and humility of all of them, bowing the head. He offered them arghya and asana and worshiped them as appropriate. He washed their feet and washed their heads with that water.
The elders who are walking, how they practice, respecting those practices, he behaves like that. The sages, as if standing as fire sacrifices on the platforms, sat on golden seats. Listening to their words with attention, with love for them, and with all the senses directed towards them, Prithu is speaking thus. You, who are the abode of auspiciousness, granting me your darshan today is the result of my past good deeds. Yogis also try their best, but they cannot see you. Brahmins, those who are worshiped by them, Shiva, Vishnu, whomever they bless, they will have something unattainable in this world and the next. You are the one who is always moving in the world. Just as even Brahma and others cannot see the Supreme Being who can see everything, similarly, no one can see you. Saints like you, to the houses of householders, they respect the water, grass, and land that they have settled, such householders are also saints even though they are poor. They are lucky. The houses that do not touch the feet of the devotees related to the Lord who can make everything sacred are completely Like sandalwood trees where snakes reside, filled with wealth. Oh, Brahmin gentlemen, I welcome you. You are a boy and yet you give salvation. Those who are self-controlled, seeing you, and desiring the salvation that you protect, all the sages will perform their spiritual practices with devotion. Those who are like us, who are experiencing through the senses and are trapped in the world of sorrows due to the actions we have done, will not have well-being. Asking about your well-being is not appropriate. You are the souls, the intellects, thinking about good and bad things, causing happiness and sorrow.
You always keep your intellects engaged in the soul. Therefore, you will not have any worries. Therefore, you will only have good fortune, not bad. Therefore, it is foolish to ask you about your well-being. We are suffering from anxiety, and you do not wish us well. I ask how we can be quickly delivered, being poor in your faith. It is true that the Lord is pleased with those who are wise and have excellent knowledge, and He is pleased with them. God himself will give them the knowledge of His own. God himself, accepting the wise as his body, was making this world wander to bestow grace upon his devotees. Thus, when Prithu spoke, it was sweet to hear, and his good words were pleasing and good. Hearing them, he was pleased. Like one who is laughing mockingly, Sanatkumar said thus. Oh Maharaja, you know everything, but with good sense, you asked us a good question to know the good of all beings. For those who desire pleasures, liberation Even those who desire, for them, to attain the pleasures and liberation they desire, the first step is the association with the virtuous. Satsang is the meeting of Bhoga and Moksha. By talking to virtuous people and by questioning them, one receives appropriate teachings for the creatures to attain enjoyment and salvation. For those who desire pleasures, to associate with good people, then to speak, then to question them, and to teach them the means of attaining pleasures as an answer to the question. In the process of practicing that discipline, enjoyment is obtained. For those who desire salvation, the company of virtuous people, talking to them, questioning them, and describing the divine qualities of God. Hearing him, affection for him will be established, and so on will happen sequentially. You always have a liking for listening to the divine virtues that are the means to salvation.
With devotion in listening to the qualities, you have a steadfast devotion that never fades away, not desiring any other fruit, towards the Lord. That which is like a concoction that is seen in the mind, it destroys the bad and good karmic residue. In the scriptures, it is determined and established that devotion is the means for humans to attain salvation. That devotion should be firmly established in the Supreme Brahman, the Lord of all, the one without the three Gunas, the Lord of the three Gunas. There should be no association with things other than God. Through that, devotion to others, knowledge of others, and supreme devotion, these three will be gradually attained. Remembering the one who is pleased with the virtues of God without ceasing is supreme devotion. That devotion leads to mental realization. That is it. It is supreme knowledge. Such supreme knowledge, even for a blink of an eye, that unparalleled love that cannot be left behind, that supreme devotion should be firm. That is, one should remain steadfast without remembering another matter in between. Therefore, without thinking about another matter, remembering with great devotion in front of the Lord is supreme devotion. That is for mankind A means to a salvation. The first step to such devotion is faith. With devotion, one should see that God, serve Him, and learn about Him. That which is the supreme being, knowing that it is the form of the soul, becomes supreme to the Lord and acts for His sake. He listens to the stories of the Lord as they are sanctified. Those who serve the Lord with devotion, serve the Lord with love. With this order, man will attain well-being. Thus, by pleasing God, do not cause pleasure to other senses than God, do not fix your mind on matters of desire. He serves the teacher with a desire to learn the principle, the means, and the purpose. Spiritual training is enhanced by the service of the teacher.
In contemplation of the divine form, the qualities of form and sound, one is quickly engrossed. He performs all the actions with his body as a form of service to God. Taking wisdom in food, purifying the mind through it, and always being happy through self-experience. Such a devotee does not find happiness in experiencing other things than listening to, remembering, and drinking the nectar of the divine qualities. To such a devotee, the entire universe appears as the body of that Lord, and in everything, the Lord appears as the soul. Therefore, they cannot harm anyone. Even during meal times, they experience those divine plays. Their senses, mind, and other things do not spread. Yama is about right conduct. They have no desire for anything. They do not blame the gods who do not worship their means of worship. They accept the necessary food for body maintenance and perform the necessary business. They endure the cold and diseases with patience, but do not grieve. Devotees who are devoted to God, to their ears They listen to the virtues of God as a decorative element. They keep saying it again and again. The process of devotion is gradually increasing. The church falls short of the Lord, because of that. In Brahma, which has no evil qualities, affection will quickly arise. Thus, by taking refuge in the teachers, gaining knowledge, and through the contemplation of truth, a man, through devotion that has grown, attains knowledge, detachment, and excessive devotion. Therefore, the form of this being, which is made up of five elements, the body, is without a seed. The seed for the body's connection is due to good and bad deeds, isn't it?
Wisdom, knowledge, devotion, and detachment burn him. When the sticks are rubbed together, fire is produced, and as those sticks are burned, the knowledge of the being in the body increases through hearing, contemplation, and meditation. It burns away the good and bad karmas that are the root of the body. In this way, the body-related problems will go away. By that, the qualities of Sattva, Rajas, and Tamas will disappear, and the hatred caused by them will disappear. Again, he does not get the body. Until now, the body has made the relationship between the soul and God disappear. Now, because of this destruction, the relationship between life and death is clearly evident. The soul experiences the objects of sound, etc., which are the objects of enjoyment, through the body. These will not be said when the body relationship is broken. As long as this body-related thing shines in the being, it appears as if the being has no connection with the Supreme Being. It is by thinking about things in the mind that the senses are attracted towards things. Intelligence has not given the effort of attaining the Purushartha that one can attain. Darbha grass on the bank of a pond Just as the soil erodes and falls due to the water of the shore, similarly, as the senses fall towards objects, the mind also falls. The mind that contemplates the divine will slip away from it. If the worship-like contemplation of the Supreme Being is removed, the knowledge of the supreme soul's superiority will slip away. Then it does not appear that the soul belongs to the Supreme Soul and acts for the sake of the Supreme Soul. He seems to behave himself. This is the root of the relationship. The Lord is the source of all comfort. To obtain it, one must know its form.
He is the embodiment of the divine, and by the command of God, he is doing God's work and God's pleasure. It should always shine in its own form. That is, the reason for not shining and not going away is the reason for not attaining self-happiness. His own form, without constantly contemplating it, and by meditating on things, and by the senses uniting with him, leads to misfortune. The senses, the objects of sound, etc., are opposed to the pleasure that a man desires to attain; the root of all this is Samadhi, that is, constantly contemplating one's own form. If that is not there, even if there is consciousness, even if there is knowledge and wisdom, it attains stability. Ignorance hides knowledge. The nature of the four: Dharma, Artha, Kama, Moksha, cannot be truly understood It makes men incapable of achieving anything. Dharma, artha, and kama are three things that a man desires and can obtain, but they only bring happiness for a short time. That which always brings happiness is Moksha, that is, attainment of God. Righteousness, wealth, and desires are always accompanied by fear of death. Brahma to the smallest particle Until then, all substances are formed by the nature that has attained the qualities of Sattva, Rajas, and Tamas. Therefore, some are excellent, some are great, some are inferior, some are ordinary, but all of them are destined to be destroyed one day by the timeless God, therefore there is no safety, they are not stable. Therefore, O King, lives, The senses, the body, the mind, and the eternal and transient bodies that are associated with them, the knowers of the field, that is, the living beings, are the Supreme Soul that is appointed from within the living beings in that body. One should constantly contemplate the form of the soul, which is the self. This field, meaning the body, considering it as mine, the house, son, wealth, etc., I am making them as if I am mine, that is ignorance. The soul itself is knowledgeable; it is the one who governs the body, the senses, and the wealth belonging to the body. The one who is the soul to the soul that shines with such a life form is the Lord
I am a living being, and the Lord is in the body, so consider that I am the Lord. Because the soul and the Supreme Soul reside in this body, the illusion that this soul is the Supreme Soul arises through Maya, but in that, the soul experiences the contraction and expansion of knowledge through karma. God does not give such changes. When this wisdom is present, one's true form shines. The living being lives. Thus, in the body, as the soul is in the living being, as the soul is the living being, I surrender to the eternal, liberated, pure, self-illuminating, and divine essence that is without karmic relationships. Those who have the knowledge that all things that are contrary to God are of the nature of God, and are devoted to the lotus feet of God, destroy the body-related desires filled with karmic residues. Consider Vasudeva as your savior and helper. This world is an ocean. The five senses, the mind, and the sixth is the crocodile. Those who wish to cross it should seek refuge in the Lord, the Lord's boat. Those who do not seek shelter, how much of this ocean No, no, you don't cross. It is pleasant and easy to take refuge in the lotus feet of the Lord. It will reach the other side of the ocean that it is based on. Thus, Brahma, the son of Manasa, Sanat Kumara, preached to Prutha. He who has torn the soul. Prithu praised him greatly and thus spoke. Until now, we have experienced the matter that Sanatkumara taught Pruthu. I had to take up more to complete the subject. Listen to this carefully, listen to this philosophy, and we will understand the path to salvation. We'll see you in another podcast. Jai Shri Srimannarayana.