రాజ రహిత అరాజకత్వము - వేన హస్త మథన ప్రక్రియ

Churning Vena's Arms & Appearance of King Prithu

bhagavatam

పాపాత్ముడైన వేన మహారాజు మరణానంతరం రాజ్యంలో అరాజకత్వం నెలకొని, ధర్మరక్షణ లేక సర్వత్రా అశాంతి వ్యాపించింది. ధర్మాన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో మహర్షులు తమ దివ్యశక్తి ద్వారా వేన శవపు భుజాలను మథనం చేశారు. ఆ మథన ప్రక్రియ వలన భగవంతుని అంశతో జన్మించిన తేజోమయుడైన పృథు మహారాజు ఆవిర్భవించి, లోకానికి శాంతి సుభిక్షాలు అందించే ధర్మరాజుగా ప్రకటితుడయ్యాడు.

Following the death of the sinful King Vena, the earth fell into chaos and lawlessness, with calamities spreading across the kingdom due to the absence of a righteous ruler. The great sages, seeking to restore order and protect dharma, churned the arms of Vena's lifeless body through their mystic power. From this sacred churning emerged the magnificent and radiant King Prithu, an empowered incarnation of Lord Vishnu destined to establish righteousness and bring prosperity back to the world.

← Prev Next →
Churning Vena's Arms & Appearance of King Prithu bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశేన సర్వతన్ భృణ్ మనసి ప్రతీతా ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే ఓ దేవా, నీవు నిత్య ముక్తుడవు. అతిశయించిన దయ గల నీవు నా వంటి శరణు వేడిన అజ్ఞానుల సంసార బంధమును విడిపించదవు. వినాశ రహితుడవు, అంతర్యామివగు నీవు దేహధారులందరి అంతఃకరణముల యందు అనుభవమునకు వచ్చే అంతరతమమగు చైతన్యము. రూపముగా ప్రకటమగుచున్నావు. పూర్ణమము ఈశ్వర భావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములు అనే ఆరు ఐశ్వర్యములు గల నీవు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడవు. నీకు అనేక నమస్కారములు. ఏత్ క్యాంటో థర్డ్ చాప్టర్ 17th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. చతుర్ధ స్కంధము 19వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా వేణుని యొక్క వధ జరిగిన తరువాత తన బాహుల నుండి పృథు చక్రవర్తి ఉద్భవించటం, ఉద్భవించిన పృథు చక్రవర్తికి వందిమాగధులు స్తోత్రాలు చేస్తా అన్నప్పుడు వారిని వారించటము తరువాత వారు తిరిగి స్తోత్రం చేయడానికి పూనుకోవటం మనం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని అనుభవిద్దాం. పృథువు అను పేరుతో అవతరించిన ఈ చక్రవర్తి లోకములో ధర్మమును నిలుపుటకు అవతరించినవాడు. ధర్మానుష్ఠానము చేయువారలో ఇతడు శ్రేష్టుడు. ధర్మమును బాగుగా ఎరిగి ఆచరింపలేని లోకులను వారి వారి ధర్మములను ఎరిగి ఆచరించునట్లు చేయుటకు ఈ పృథ్వు అవతరించినాడు. ఇతడే ధర్మ మర్యాదలను స్థిరము చేయువారిలో అగ్రేసరుడు. అతడు ధర్మ రక్షకుడు. ధర్మ విరోధులను శాసించువాడు. ఈ పృథ్వు లోక పాలులనందరును తన శరీరముగా దాల్చి వారికి తాను ఆత్మయై నిలుచున్నాడు.

రెండు లోకములకు హితమును సంపాదింప చేయుచున్నాడు. సూర్యుడు ఆయా కాలములందు భూమిపై యునున్న జలమును తన కిరణములచే స్వీకరించి మరల తగిన సమయమున సర్వభూతములకు వసంగునట్లు ఈ పృథ్వే సర్వభూతములకు మేలు కోరి. లోకములో ప్రజల నుండి ధనమును స్వీకరించి మరల వారి క్షేమముకై వినియోగించుచున్నాడు. శాసనమును అతిక్రమించిన వారిని తపించుచున్నాడు. ఇతడు భూమి వలె తనను అవమానించిన వారిని కూడా బాధింపక వారు చేసిన అతిక్రమణమును సహించి కరుణతో ఆశ్రయమును సంగి ఆధారభూతుడై నిలబెట్టుచున్నాడు. ఇంద్రుడు వర్షింపకపోయినచో లోకమంతయు క్లేశమునందును. అట్లు అనావృష్టి ఏర్పడకుండా ఇంద్రుడు రక్షించినట్లు తానే వర్షించి రక్షించుచున్నాడు. ఇతని ముఖము చంద్రునితో సమానమై ఉండునది. చంద్రుడు అమృతమూర్తి. ఈ పృథువు కూడా అనురాగములో నిండిన మాటలను మందహాసమును చూపులను ప్రజలపై. పరచి చంద్రుని వలె ఆహ్లాదమును కలిగించుచున్నాడు. వరుణుడు సముద్ర జలములచే ఆవరింపబడి ఎవ్వరికీ వ్యక్తముగా కనపడడు. అతని మార్గము ఎవ్వరికినీ గోచరము కాదు. అట్లే ఈతడు కూడా ప్రాకారాదులచే ఆవరింపబడి రాజభవనములలో తాను చేసేడి పని ముందుగా ఎవ్వరికీ తెలియకుండా గంభీరముగా ఉపకరించుచుండును. ధనమును భద్రముగా కాపాడును. అనంతమైన మహత్వము గలవాడు గుణములకు ప్రధాన కేంద్రము. ఈ గుణములన్నియు వరుణుని యందు ఉన్నట్లే ఈ పృధువునందు కూడా గోచరమగును. ఈ పృధువు అగ్నితో సమానుడు. దగ్గరకు చేరలేని తేజస్సు గలది అగ్ని. పృథ్వు కూడా శత్రువుల మనసుచే కూడా ఆక్రమింప వీలు కానివాడు. దగ్గరగా ఉన్నవాడు కూడా అతని పౌరుషముచే దగ్గరగా చేర జంకుచుండును. అగ్నిహోత్రము. అరణి నుండి పుట్టినట్లు ఇతడును వేనుని శరీరమును మధింపగా బయలు వెడలినవాడు. అందుచే అతడు అగ్నితో సమానుడు. వాయువు అందరి శరీరములో ఉండును. శరీరములను ధరించును. అందుచేతనే వాయువును సూత్రాత్మ అందురు. దారములోన చొచ్చి ఉండి మణులను ధరించినట్లు ప్రాణులలో వాయువు చొచ్చి ధరించి ఉండును అట్లు పృథ్వి కూడా తన చారులచే అంతటా వ్యాపించి తన దేశములో పై దేశములో ఏ ఏ వ్యక్తులు ఏ పనులు చేయుచున్నారో తాను ఎరుంగుచుండును

కానీ రాగద్వేషములు నందక ఉదాసీనుడై ఉండును. ప్రజలకు ఆపదలు కలగకుండా కాపాడుటయే తన కర్తవ్యముగా తలచుండును. ఇట్లు పృథ్వు వాయువుతో సమానముగా వర్తించుచున్నాడు. ఇతడు యమునితో సమానుడు. యముడు ధర్మ నియంత. అతనికి స్వపర భేదము లేదు. పృథ్వు కూడా శత్రువులైనను కుమారునైనను దండించును. దండింపదగని వానిని దండింపడు. తన కుమారుడైనను దండింపతగని వాడు. వాడు ఆనాడు దండించను. తన కుమారుడైనను దండింప తగిన నాడు దండించును. ఇట్లు ధర్మ మార్గమున లోక శిక్షణ చేయు వృత్తువు యమునితో సమానుడు. సూర్యుడు మానస పర్వతము అనగా లోకాలోక పర్వతం వరకు అడ్డు లేక ఒక చక్రముతో కూడిన రథముతో సంచరించుచుండును. తన కిరణములతో లోకమును తపింప చేయుచుండును. పృథ్వు కూడా ఆజ్ఞారథము అవ్యాహతముగా అంతటా నడుచునట్లు చేయగల సమర్థుడు. తన ఆజ్ఞలన్నిటి కిరణములచే లోకమును తపింపచేయును రక్షించును. ప్రజలను రంజింపచేయువాడగుటచే రాజు అనబడును. ఆ రాజ శబ్దము పృథ్వునందే సార్ధకము. పృథ్వు తానే చేయు వ్యాపారములచే. ప్రజల మనసును ఆనందింపచేయును. ప్రజా మనోరంజనము చేయువాడు కనుక పృథ్వే రాజు అనతగినవాడు. ఇతని సంకల్పము అప్రతిహతము. సంకల్పించునవి అన్నియు చేయగలవాడనని తప్పు మార్గమును సంకల్పించువాడు కాడు. సత్యసంధుడు. వేదవేత్తలు బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు విషయమున మంచిగా ప్రవర్తించును. వయోవృద్ధులను, శీలవృద్ధులను సేవించును. సర్వభూతములకు రక్షణ కల్పించుటలో సమర్థుడు. అందరును సమ్మానించును. దీనుల యెడ వాత్సల్యము కలవాడై ఉండును. పరస్త్రీలను మాతృభావమును ఆదరించును. తన భార్యను తన శరీరముగా భావించి ప్రేమించి ఆనందింప చేయుచుండును. ప్రజలను తండ్రి బిడ్డలను చూచునట్లు వారి దోషములను చూడక ప్రీతితో అనువర్తించుచు బ్రహ్మ బ్రహ్మవేత్తలను దాసుని వలె సేవించును. దేహధారులందరూ తమ ఆత్మను ఎట్లు ప్రేమింతురో ప్రజలందరూ పృథువును అట్లే ప్రేమింతురు. మంత్రులకు ఆనందమును చేకూర్చును. విషయములందు సంఘము లేని వారి యందు ఎక్కువ ఆదరము కలిగి ఉండును.

వారితోనే కూడి ఉండు దుష్టుల యెడ దండపాణియగు యముని వలె ప్రవర్తించును. ఈ పృథ్వు తన బలము చేత భూమిని గొవ్వుగా మార్చి ఔషధులను పితకగలవాడు. తన ధనస్సు అగ్రభాగముతో ఎత్తుపల్లముగా ఉన్న భూమిని సమతలము గల దానిగా చేయును. ఇతడు సాక్షాత్తు భగవానుడు. ఈతడు మూడు లోకములకు నియామకుడు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అనబడెడి మూడు విధములుగా ఉండు జీవులను శాసించివాడు ఈతడు. సకల లోకులకు ఆత్మ అయినవాడు. భగవానుడే తన అంశచే వేణుని శరీరము నుండి మనుష్యుడుగా అవతరించినాడు. జీవునియందు ప్రకృతి సంబంధముచే దేవ మనుష్యాది భేదములు. కనపడుచుండును కానీ వాస్తవముగా జీవులకు పరస్పరము స్వరూపమునందు భేదము లేదు అట్లే భగవానుడు జీవులలో తానుండి జీవులకు ఆత్మ అయినను జీవునితో చేరు ఉండి శరీరములో ఉన్నను మాయ తన వశమునందు ఉన్నవాడు అగుటచే శరీరముచే ఏర్పడు భేదము గాని కర్మ బంధము గాని అతనికి ఉండదు. ఈ పృథువు ఉదయ పర్వతం మొదలు భూమండలమునంతను రక్షింపగలడు. తనతో సమానుడు గాని అధికుడు గాని అగు వేరొక వీరుడు లేనివాడు. ఇతడు జయశీలమగు రథమునెక్కి. ధనస్సు ధరించి సూర్యుడు భూమి చుట్టూను తిరుగునట్లు భూమండలమునంతను పరిక్రమించును. లోకపాలురు రాజులు కూడా ఇతనికి కానుకలు అర్పించుచుందురు. స్త్రీలు మధురమగు కంఠముతో ఇతని చరిత్రమును ఇతడే మొదటి రాజు ఒకటచే ఆది రాజగు పృథ్వు భగవానుడే అని గుర్తించి గానము చేయుచుందురు. భూమిని గోవుగా చేసి ఔషధులను పిండుట ప్రజలకు వారి వారికి తగిన వృత్తులను కల్పించుట తన ధనస్సుతో పర్వతములను బ్రద్దలు చేసి

భూమిని సమతలముగా చేయుట మున్నగు ఇతని లీలలను స్త్రీలు గానము చేయుచుందురు. సింహము తోక పైకెత్తి విహరించినట్లు విల్లు ఎక్కుపెట్టి. ఆ ఈ పృథ్వి సంచరించునప్పుడు ధర్మ విరోధులైన వారు అక్కడక్కడ మూలకు వదిగిపోవుచుందురు. ఇతడు నూరు అశ్వమేధ యాగములు సరస్వతీ నది ఆవిర్భవించిన చోట చేయును. అందు చివర యాగమున ఇంద్రుడు ఈతని అశ్వమును అపహరించునని ఈ విధముగా. పృథ్వు చరిత్రను దేవతా స్త్రీలు గానము చేయుచుందురు. ఈ పృథ్వు తన భవనమునందే ఉద్యానవనమున భగవానుడు సనత్కుమారుని భక్తితో సేవించి నిర్మలగు బ్రహ్మ నిర్మలమగు బ్రహ్మజ్ఞానము నొందినాడు. ఆ జ్ఞానము వలన పృథువు బ్రహ్మానుభవము నొందినాడు. ఇట్లు దేవతా స్త్రీలు గానము చేయుచుండగా పృథువు తన చరిత్రను తాను వినగలడు అని గాయకులు స్తోత్రము చేసిరి. ఇతడు దిక్కులను అన్నిటినీ జయించి అప్రతిహతమగు ప్రజ్ఞ గలవాడై తన పరాక్రమముచే లోకులకు ఏ ఉపద్రవము లేకుండా కాపాడును. సురాసురుల చేత గానము చేయబడు మహిమ గలవాడై వెలుగుచుండును అని మునులచే ప్రేరణ చేయబడిన సూతమాగధులు పృతువును స్తోత్రము చేసిరి. భగవానుడగు పృథువు తన గుణములను సూతమాఘదులు స్తోత్రము చేయగా వారి వారికి అభిమతములగు వస్త్రాభరణాదులను వసంగి తృప్తి పరచెను. బ్రాహ్మణాది వర్ణముల వారిని అందరినీ ఆరాధించెను. భృత్యులను, మృత్యులను, పురోహితులను, పురజనులను, జానపదులను కూడా వారి వారికి తృప్తి కలుగునట్లు సేవించెను. భూమి గోవు రూపం ఎందుకు ధరించినది? మృతువు దాని నుండి ఔషధులను పితికినాడని చెప్పినారు కదా, అప్పుడు దూడ ఎవరు? పిండుటకు ఏది పాత్రము అయినది? విషమముగా ఉన్న భూమిని అతడు సమముగా ఎట్లు చేయగలిగెను? అతని యాగాశ్వము ఇంద్రుడు ఎందుకు అపహరించెను? సనత్కుమారుని వలన జ్ఞానోపదేశమును పొంది రాజర్షియగు పృథువు ఏ గతిని పొందినాడు?

ఆ భగవానుడు పృథ్వి యొక్క లీలలను అన్నిటినీ వినవలెనని కోరికగల నాకు వివరింపగోరుచున్నానని విదురుడు మరల మైత్రేయుని ప్రార్థించెను. ఇట్లు విదురుడు భగవత్ కథను చెప్పమని కోరగా మైత్రేయుడు చాలా మెచ్చుకొని ఇట్లు సమాధానము చెప్పెను. సో విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయుడు ఇచ్చేటువంటి జవాబుని మనం మరొక పాడ్కాస్ట్ లో అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. For the liberation of those who have surrendered like me, for the liberated one, for the abundant compassion, for the ocean of salutations, for the one who is always in my own self, for the one who is known through the mind, for the one who is seen through the eye, O Lord, you are eternally liberated. Oh, you, with excessive compassion, if someone like me seeks refuge, you will liberate the worldly bonds of ignorance. You are the one without destruction, you are the inner self, the inner consciousness that comes to experience in the inner hearts of all embodied beings. You are being revealed. You, who have six wealths namely completeness, God-like feeling, virility, fame, wealth, knowledge, and detachment, are beyond the limitations of time, space, and objects. Many salutations to you. Aitken, Third Chapter, Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the 19th podcast episode of Chaturtha Skandham. Until now, as part of the conversation between Vidura and Maitreya, after the killing of Venu, Prithu Chakravarti emerged from his arms, When the Vandi Magadhas were offering prayers to the newly ascended Prithu Chakravarti, they were stopped. After that, they offered prayers again We have learned to take the initiative. Let's take a tour. This emperor, who incarnated with the name Pruthuvu, incarnated to uphold Dharma in the world. He is the best among those who practice dharma. To make the people who do not know and practice Dharma well, know and practice their respective Dharmas, this earth has incarnated. He is the foremost among those who establish dharma and morality. He is the protector of dharma. The one who rules the opponents of dharma. This earth, all the inhabitants of the world, assuming it as their body, stands as their own soul.

He is the one who is making both worlds better. The sun, in those times, accepts the water on the earth with its rays and, again, at the appropriate time, causes all beings to be inhabited, so that this earth, desiring good for all beings, may be good to all beings. He is receiving wealth from the people of the world and using it for their welfare again. He is pursuing those who have transgressed the law. He, like the earth, without hurting those who have humiliated him, enduring the transgression they have committed, with compassion, taking refuge, and establishing himself as the foundation, is standing firm. If Indra does not rain, the whole world will be in suffering. Thus, to prevent drought, Indra protects by raining down on himself. His face is as big as the moon. The moon is the embodiment of nectar. This earth also, filled with words full of affection, smiles, and shows on the people. He is shining like the moon, bringing joy. Varuna is covered by the ocean waters and is not visible to anyone. His way is not for everyone. Similarly, this swimmer is also surrounded by courtyards in royal palaces He quietly helps others without anyone knowing about his actions. And prosperity in the form of money. The one with the infinite greatness is the prime focus of the qualities. All these qualities are visible in this earth, just as they are in Varuna. This Prithu is equivalent to the fire. Fire is a brilliant body that cannot be reached. Even the earth is not conquered by the enemy. Even the one who is near will be afraid to approach him because of his might. Agnihotram. As he was born from the forest, he also mingled with the body of Venu and emerged. Therefore, he is equal to fire. Air is in everyone's body. Will wear their bodies. Therefore, they call air the Sutratma. Like a thread, it is in the air, and like jewels worn, the air is in the creatures, worn. Similarly, the earth also, by its chariots, is spread everywhere, and in its country, in the upper country, which people are doing what works, she is knowing

But he is detached from attachment and aversion. Protecting the people from dangers is his duty. Thus, Prithu is equal to the air. He is equivalent to Yama. Yama is the god of dharma. He has no self-contradiction. Even the earth, being enemies, will punish the son. He who does not punish the unpunishable. He is the one who will punish his son. He would never have been punished for it. He will punish his son when it is time to punish him. Thus, the one who practices the path of righteousness and trains the world is equal to Yama. The sun, without any obstruction, travels with a chariot containing a wheel, up to the mountain of the world. He makes the world tremble with his rays. Prithu is also capable of making the chariot run smoothly and continuously. He will make the world tremble and save it by the rays of all His commandments. The king is one who pleases the people. The royal sound is meaningful in the earth. Through his own business activities. Will win the hearts of people. Because he is the one who enlightens the people, the king of Prithvi is worthy of respect. His will is decisive. He who resolves to do all things will not resort to wrong paths. He is truthful. The Vedas, the Brahmins who are knowers of the Vedas, will behave well in matters. He serves the elderly and the aged. The one who is capable of protecting all beings. All are invited to attend. He will be affectionate towards the deities. He will protect the feelings of another woman. He considers his wife as his body and loves her, making her happy. Like a father looking after his children, without seeing their faults, lovingly following them, Brahma serves the knowers of Brahma like a servant. All the embodied beings love their soul in the same way that all the people love the earth. It will bring joy to the ministers. In matters, those who do not have a church will have more respect.

He behaves like the punitive Yama, joining with them, against the wicked. This Prithu, with his strength, turned the earth into a mountain and could make medicines. He will make the uneven ground level with the top part of his bow. He is the God. The Lord of the Sea is the ruler of the three worlds. He is the one who governs the beings that are in three ways, called the bound, the liberated, and the eternal. The one who is the soul of all. The Lord himself took the form of a human being from the body of a Veena. In living beings, there are differences between gods, humans, etc., due to nature. It appears, but in reality, there is no difference between beings in their form. Similarly, the Lord, being in beings, is the soul of the beings, but being in the body, the illusion is in his control, therefore, it is formed by the body He has no difference, no karmic bond. This Prithu, starting from the Udaya mountain, can protect the entire earth. He is the only one who is equal to him, or superior to him, or who is not a hero. He mounted a victorious chariot. Holding a bow, the sun, the earth It revolves around the earth and revolves around the entire earth. The kings of the world also offer him gifts. Women, with a sweet voice, sing his story, recognizing that he is the first king, the first king, Prithu, the Lord, is the king, and sing. Making the earth a cow and extracting medicines, providing people with their respective professions, and breaking mountains with his bow

Women sing his plays, including making the earth level. Like a lion raising its tail and roaming, placing a bow. When this earth moves, those who are against dharma will be scattered here and there. He performed a hundred Aswamedha sacrifices at the place where the Saraswati river originated. And at the end, in the Yagam, Indra will steal his horse in this way. The history of Prithu is sung by the goddesses. This Prithu, in his own building, in the garden, served Lord Sanatkumara with devotion, and attained pure Brahma, pure Brahma-knowledge. Through that knowledge, Pruthuvu attained the experience of Brahman. Thus, while the goddesses were singing, the singers praised that Prithu could hear his own history. He conquers all directions, is immeasurable in wisdom, and protects the people from any calamity by his valor. He who is glorified by the gods and demons, the Sutamagadhas, inspired by the sages, praised Prithu. The Lord Prithu, his When the virtues were praised by the Sutamagadhis, Vasangi satisfied them by giving them the clothes and ornaments that were their liking. He worshipped all the people of the Brahmin caste. He served the servants, the dead, the priests, the townspeople, and the common people, so that each one would be satisfied. Why did the earth take the form of a cow? They said that the dead man plucked the medicines from it, right? Then who is the calf? What is the instrument for grinding? How could he make the land that was in distress even? Why did Indra steal his sacrificial horse? Having received enlightenment from Sanatkumara, what state did King Prithu, who became a Rajarshi, attain?

Vidura again prayed to Maitreya that the Lord should explain to him all the plays of the earth, which he desired to hear. Thus, when Vidura asked to tell the story of the Lord, Maitreya, greatly pleased, thus replied. So, let's experience the answer given by Maitreya to the questions asked by Vidur in another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus