మను వంశ వృత్తాంతము & దక్ష యజ్ఞ భంగము (Parts 1-8)
Manu's Dynasty & Daksha's Sacrifice (Parts 1-8)
ఈ ఎపిసోడ్‌లో మను వంశములో జన్మించిన మహాత్ములు మరియు ధర్మపరులైన రాజుల గురించి విశదముగా వివరించబడింది. తరువాత, దక్షుడు నిర్వహించిన మహాయజ్ఞము మరియు అహంకారము వలన సంభవించిన విధ్వంసకరమైన పరిణామాల గురించి హృదయంగమముగా వర్ణించబడింది. భగవంతుని భక్తులను అవమానించుట మరియు దైవ నియమములను ఉల్లంఘించుట ఎంతటి మహావిపత్తులకు దారి తీయునో ఈ కథలు స్పష్టముగా తెలియజేస్తున్నాయి. ధర్మము, భక్తి మరియు పరమాత్మ సార్వభౌమత్వముపై అమూల్యమైన జ్ఞానమును అందించే ఈ ఎపిసోడ్‌ను శ్రద్ధగా వినండి.
In this episode of our Srimad Bhagavatham podcast series, we explore the glorious lineage of Manu, tracing the great souls and kings who descended from him and shaped the course of cosmic history. We then turn to the dramatic and fateful story of Daksha's grand sacrifice, where pride and disrespect set the stage for one of the most profound events in Vedic tradition. The episode powerfully illustrates how arrogance toward the Lord's devotees and the disregard of divine order can lead to devastating consequences. Together, these narratives offer timeless wisdom on dharma, devotion, and the sovereignty of the Supreme Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యం వైశ్వ సంతమను విశ్వ సృజస్వ సంతి యం చేకితానమను చిత్తయ ఉచ్చకంతి భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని తస్మై నమో భగవతేస్తు సహస్ర మూర్ధ్ని ఆ అనంతుని చేష్టను అనుసరించియే జగత్తును సృష్టించే ప్రజాపతులు చేష్టను చేయుచున్నారు. ఆయన ప్రాణులలో ఆత్మ చైతన్యమై ప్రకాశించుచుండగా ఆ ప్రకాశమును అనుసరించి జ్ఞానేంద్రియములు శబ్దాది విషయములను ప్రకాశింపజేయుచున్నవి. ఆయన పడగపై భూమండలము ఆవగింజవలెనున్నది. అట్టి వెయ్యి పడగల భగవానుని కొరకు నమస్కారమగుగాక. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, ఫార్టీ ఎయిత్ ప్రేయర్. భగవంతువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము నాలుగవ స్కంధంలో ప్రప్రథమ పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు భగవంతుని అనుగ్రహం వలన, ఆచార్య కృప వలన మూడు స్కంధములను మనము పూర్తి చేసుకొని దానిలో ఉన్న తత్వార్ధాలను వరాహ రూపం యొక్క అవతారాన్ని, స్వయంభూ మను యొక్క అవతరణము, కపిలోపాఖ్యానము ఇవన్నీ కూడా చక్కగా అనుభవించాం. ఇవి వినకుండా ఉంటే ముందు వెళ్లి ఆ భాగాలు విని ఆనందించాలని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. వెనుక స్వయంభువ మనో వంశం యొక్క వృత్తాంతము చెప్పి దేవహుతి కపిల సంవాదం మూడవ స్కంధంలో వివరించినారు. ఇప్పుడు ఆకూతి, ప్రసూతి అను ఇద్దరు కన్యల యొక్కయు దేవహుతి కుమార్తెల యొక్కయు సంతతిని వివరించుతున్నారు. స్వయంభు మనువుకు శతరూప అనేడి భార్య యందు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను ముగ్గురు కన్యలు జన్మించినారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కుమారులు జన్మించినారు.
అందు ఆ కూతిని స్వయంభూ మనువు రుచి అనువానికి వసంగెను కుమార్తెనిచ్చుచు ఈమె యందు నీకు కలిగిన కుమారుడు నాకు కుమారుడుగా ఉండునని ధర్మశాస్త్రములోని పుత్రికా ధర్మమును ఆశ్రయించి రుచికి వసంగినాడు. శతరూప దానిని ఆమోదించినది. రుచి అను ప్రజాపతి సర్వశక్తులు పరిపూర్ణముగా గలవాడు. ధర్మానుష్ఠానముచే తేజో విశేషము కలిగినవాడు. ఉత్కృష్టముగా సమాధితో భగవానుని ఆరాధించి ఆ కూతి అనడి తన భార్య యందు ఒక పురుషుని ఒక స్త్రీని బిడ్డలుగా పొందెను. ఆ కుమారుడు యజ్ఞుడను పేరుతో వతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క అంశం. వారికి కలిగిన ఆడుబిడ్డ దక్షిణ అను పేరుతో లక్ష్మీ అంశముతో జన్మించినది. వారిద్దరూ కవర్ పిల్లలుగా జన్మించిరి. వారు విష్ణు, లక్ష్మి అంశలతో జన్మించుటచే వారిద్దరూ దంపతులుగా ఉండుటలో విరోధము లేదు. అందుచే వారు దంపతులు అయిరి. ఆ కూతి కుమారుడగు విష్ణువు అంశ సంభూతుడగు యజ్ఞుడను కుమారుని స్వయంభువ మనువు తన కుమారునిగను దక్షిణ అను కన్యను కుమార్తెగను స్వీకరించెను. ఆ దక్షిణాను కన్యను యజుర్వేద మంత్రములతో అధిపతియగు యజ్ఞుడను పేరుగల భగవానుడు భార్యగా స్వీకరించెను. వారిద్దరికీ 12 గురు కుమారులు జన్మించిరి. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కపి, విప్రవు, వష్ణుడు, సుదేవుడు, రోచనుడు అను నామధేయములతో పన్నెండుగురు విరాజిల్లిరి. యజ్ఞుడు, దక్షిణ అను తల్లిదండ్రులకు జన్మించిన వారు వీరు. వీరు స్వయంభువ మన్వంతరములో దేవతలై ఉండిరి. స్వయంభువ మన్వంతరములో మరీచి మొదలగు వారు ఋషులుగా ఉండిరి. యజ్ఞుడు దేవేంద్రుడుగా ఉండెను. ప్రతి మన్వంతరములోను సంతాన వర్ధనమునకును లోక మర్యాద పాలకునకును ఆరు విధములుగా భగవానుడు ఉండును.
ఆ ఆరింటిని ప్రతి మన్వంతరమున ఎరుంగవలెను. స్వయంభువ మన్వంతరమున మనువు స్వయంభువుడు, తుషితుడు తుషితులు అనేటి 12గురు దేవతలు, మరీచి మొదలగు వారు ఋషులు. యజ్ఞుడు భగవానుని అంశావతారం. అతడే ఇంద్రుడు కూడా. ప్రతి మన్వంతరమున వీరు మారుచుందురు. విష్ణువు అవతారముండును. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనునిద్దరు స్వయంభువ మనువు కుమారులు. వారి వంశము వారిచే ఆ మన్వంతరము పాలింపబడినది. స్వయంభువ మనువు కుమార్తెలలో దేవహుతి కర్దమునకు భార్య అయినట్లు వారి చరిత్రమును చెప్పబడినది. ప్రసూతి అనడి కుమార్తెను మనువు బ్రహ్మ కుమారుడగు దక్షిణకు భార్యగా వసంగినాడు. ఆ మూడు లోకములలో వారి సంతతియే విస్తారముగా వర్ధిల్లినది. ఆకూతి సంతతి కంటే ప్రసూతి సంతతి అధికం. కర్దమునికి తొమ్మండిగురు కుమార్తెలు. వారు మరీచి మొదలగు బ్రహ్మ ఋషులకు భార్యలుగా ఉండిరి. మరీచి భార్య కళ. ఆమె కశ్యపుడు, పూర్ణిమ అనిడి ఇద్దరిని కనెను. వారి వంశవున పుట్టిన వారు ఈ జగత్తున బాగా వర్ధిల్లిరి. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అని ఇద్దరు కుమారులను దేవకుల్య అనేటి కుమార్తెయును జన్మించిరి. దేవకుల్య అనునామే భగవానుని పాద ప్రక్షాళనముచే ఏర్పడిన దేవనది అయి విరాజిల్లెను. కర్దముని రెండవ కుమార్తె అనసూయ. ఆమె అత్రి మహర్షి భార్య. ఆమె కీర్తి గల ముగ్గురు కుమారులను కనెను. దత్తుడు, దుర్వాసుడు, సోముడు. అని వారి నామధేయములు. వారు ముగ్గురును విష్ణువు, రుద్ర, బ్రహ్మల యొక్క అంశలచే జనించినారు. వారిలో విష్ణువు సర్వ జగత్తునకు ఆత్మయగు పరమాత్మ కనుక.
ఆయన అంశనే జనించిన దత్తుడు అవతారములలో ప్రధానుడుగా భావింపబడెను. బ్రహ్మ రుద్ర అంశలచే జన్మించుటచే దూర్వాసుడు, సోముడు ఇతరుల కంటే అధికమైన జ్ఞాన శక్తులు గలవారే కానీ విష్ణువు యొక్క అవతారములు కారు. ఇట్లు బ్రహ్మ, విష్ణు, రుద్రుల అంశలచే ముగ్గురు జన్మించుటలో కారణమును విదుడు ప్రశ్నించగా మైత్రేయుడు ఇట్లు చెప్పుచున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మవేత్తలలో అగ్రేసరుడగు అత్రి మహర్షిని సృష్టి చేయుటకై ఆజ్ఞాపించెను. బ్రహ్మ ఆజ్ఞచే అత్రి మహర్షి భార్యయగు అనసూయతో వృక్షమును పేరుగల కులపర్వతమును తపస్సు చేయుటకేగెను. ఆ పర్వతమందు వింధ్యా నది ప్రవహించుచున్నది. ఆ నదీ తీరములయందు పూల గుత్తులతో నిండిన అశోక వృక్షములు అందముగా ప్రకాశించుచుండెను. అట్టి రమణీయమైన పావనమైన ప్రదేశమున అత్రి మహర్షి ప్రాణాయామముతో మనస్సును నియమించి ఆకలి దప్పులు శోక మోహములు లేనివాడై గాలిని ఆహారముగా స్వీకరించుచు ఒంటి పాదముతో నిలిచి తపస్సు చేసెను. సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతుడగు భగవానుడు తనతో సమానము సంతానమును తనకు ప్రసాదించవలెనని భగవానుని శరణముగా విశ్వసించి తపస్సు చేసెను. ప్రాణాయామముచే వాయువును నిరోధించుటచే అదే సమిధగా అగ్ని ప్రజ్వలించి అత్రి మహర్షి శిరస్సు నుండి అగ్ని బయలు వెడలి జ్వాల లోకమును దహించి వేయుచుండెను. త్రిమూర్తులు అట్లు మూడు లోకములు అత్రి మహర్షి తపోబలముచే తపించిపోవుట చూచి అత్రి మహర్షి ఆశ్రమనుకు వచ్చిరి. వారితో వారి కీర్తిని స్తోత్రము చేయుచు అప్సరసలు, మునులు, గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు, ఉరగలు, ఉరగులు కూడా ఆశ్రమమునకు వచ్చిరి. ఇట్లు త్రిమూర్తులు ఆవిర్భవించి తన ఎదుట సన్నిధి చేసి ఉండుట తన మనోనేత్రమును దర్శించిన అత్రి మహర్షి లేచి నిలిచెను. తర్వాత నేలపై దండం వలె పడి నమస్కరించెను.
పుష్పాదులు దోసిలలో పట్టి వారికి ఎదురుగా నిలిచి ఇట్లు స్తోత్రము చేసెను. త్రిమూర్తులు గరుడ వాహనంతో విష్ణువు, వృషభ వాహనముతో రుద్రుడు, హంస వాహనముతో బ్రహ్మ వారి వారి చిహ్నములతో ఎదురుగా సన్నిధానము చేసి ఉండిరి. కృపా పరిపూర్ణములగు చూపులతో మందహాసముతో నిండిన ముఖముతో వారు అత్రి మహర్షిని చూచుచుండిరి. అనుగ్రహముతో నిండిన ఆ తేజస్సుచే అత్రి నేత్రములు మిరుమిందిరి. మిట్లు గొల్పు గొల్చెను. అతడు కనులు మూసి మనసు వారి యందే లగ్నము చేసి చేతులు రెండు జోడించి మధురమైన వాక్కుతో సర్వలోకములకు పూజనీయులగు వారిని ఇట్లు స్తుతించెను. జగత్తును సృష్టించుటలో, రక్షించుటలో, లయము చేయుటలో సమర్థములగు సత్త గుణముతో, రజోగుణముతో, తమోగుణముతో కూడిన దేహములను ధరించి ఉండి ప్రతి కల్పమున సృష్టి స్థితి లయములను చేయు బ్రహ్మ విష్ణు శివమూర్తులకు మీకు నమస్కారము. నేను జగదీశ్వరుడగు వానిని భావించి ఆహ్వానించితిని. నాకు సంతతిని వసుంగమని ప్రార్థించితిని. మీరు ఎవరు వచ్చినారు? నేను ధ్యానించిన సర్వోత్కృష్ణుడగు సర్వేశ్వరుడు భగవానుడే అతనితో సమానుడగు పుత్రుని నాకు వసంగునట్టు ధ్యానించితిని. శరీరధారులు తమ మనస్సుచే కూడా గ్రహించుటకు శక్యముగాని మీరు ముగ్గురు ఇత్తడ సాక్షాత్కరించిరి. మీ రాకకు కారణమేమి? నా యందు అనుగ్రహించి వివరింపగోరుచున్నాను. ఇట్లు అట్లే అత్తిరి ప్రార్థింపగా దేవతలు నవ్వి ఆ ఋషితోని మధురంగా వాక్యాన్ని పలుకుతారు. ఈ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. He who is the end of the universe, the creator of the universe, the mind that is the cause, the one who is the peak, the earth is the cause, salutations to him. Salutations to the Lord, the thousand-headed one. Following the actions of that infinite being, the world The creator is performing the act of creation. While the soul is shining as consciousness in those beings, following that light, the sense organs are illuminating the sounds and other things. The earth upon his head was like a mustard seed. May salutations be offered to the Lord, who is worthy of being worshipped with a thousand arms. Sixth Canto, Sixteenth Chapter, Forty-eighth Prayer. Oh Gods, Srimad Bhagavata Tattva Deepika, fourth book, in the fourth book, the very first podcast. Welcome to the first podcast. Until now, by the grace of God, by the grace of the teacher, we have completed three kandhas, and the philosophical meanings in it, the incarnation of Varaha form, the incarnation of Swayambhu Manu, We have experienced Kapilopakhyanam and all these things very well. If you don't listen to these, go ahead and listen to those parts We are moving forward praying for joy. The account of the Swayambhuva Manava dynasty is described in the third book of the Devahuti Kapila Samvadam. Now, Akuti and Prasuti are explaining the lineage of two virgins and the daughters of Devahuti. Swayambhu Manu was born to his wife named Shatarupa, who had three daughters named Akuti, Devahuti, and Prasuti. Two sons were born to Priyavrata and Uttanapada.
And that Koothi, the self-born Manu, was settled for the taste of the daughter, giving her a daughter, saying that the son you had in her should be my son, relying on the daughter's dharma in the Dharmashastra, he was settled for the taste. The Shatarupa was approved by it. Ruchi Anu Prajapati is all-powerful. One who is endowed with splendid splendor by the grace of the Lord. Having worshiped the Lord with utmost devotion, that Kuthi Anadi had a son and a daughter with his wife. The son is an incarnation of the great Vishnu, called Yajnudeva. The child they had, named Dakshina, was born with Lakshmi as a part of her. Both of them were born as cover girls. Since they are born with aspects of Vishnu and Lakshmi, there is no conflict in them being a couple. So they ended up being a couple. That Koothi's son, Vishnu's part-incarnate, Yagnya's son, Swayambhuva Manu accepted his son as his son, and Daksha as his daughter. That southern maiden, with the Yajurveda mantras, the lord, the one named Yagnudu He accepted the wife. They had 12 sons each. Tosadu, Pratosadu, Santoshudu, Bhadrudu, Shanti, Idaspati, Idmudu, Kapi, Vipravavu, Vashnudu, Sudevudu, Rochanudu, with these names, twelve people shone. They are the children of Yajnasura and Daksha. They were the gods in the Swayambhuva Manvantara. In the Swayambhuva Manvantara, Marichi and others were sages. Yajnudu was the god of Yajna. In every Manvantara, for the increase of progeny and for the ruler of worldly decorum, the Lord exists in six ways.
Those six are to be taken in every Manvantara. In the Swayambhuva Manvantara, Manu is Swayambhu, Tushita is Tushitulu, these are 12 gods, and Marichi and others are sages. Yajnudu is the avatar of the Lord. He is Indra himself. They change in each Manvantara. Vishnu will be the avatar. Priyavrata and Uttanapada were the two sons of Swayambhuva Manu. The Manvantara was governed by their lineage. It is said that among the daughters of Swayambhuva Manu, Devahuti became the wife of Kardama, according to their history. Manu, the son of Brahma, married the daughter of Manu, who was the daughter of Manu. In those three worlds, their descendants flourished extensively. The reproductive output of the auki is higher than that of the reproductive population. Kardamuni had nine daughters. They were wives of Brahma Rishis like Marichi. Mareechi's wife Kala. She bore two sons, Kashyapa and Purnima. Those who were born in their lineage prospered greatly in this world. Purnima had two sons, Virajudu and Vishwagudu, and a daughter named Devakuliya They were born. The name Devakula is the river that originated from the washing of the feet of the Lord and shines. Kardamuni's second daughter was Anasuya. She was the wife of the sage Athri. She had three famous sons. Dattudu, Durvasudu, Somudu. And they are named. They are the three born of the elements of Vishnu, Rudra and Brahma. Among them, Vishnu is the supreme soul, the soul of the entire universe.
Dattudu, who was born from his essence, was considered the foremost among the incarnations. Durvasa and Somu, born from the Brahma-Rudra aspects, possess greater knowledge and power than others, but are not incarnations of Vishnu. Thus, when Vidu asked the reason for the three being born from the parts of Brahma, Vishnu, and Rudra, Maitreya said thus. The four-faced Brahma, the foremost among the knowers of Brahma, ordered Athri Maharshi to create. By the order of Brahma, Atri Maharshi's wife, Anasuya, went to perform penance on the Kulaparvatam named Vrikshamu. The Vindhya Range is host to the Vindhya Range river. On the banks of the river, the Ashoka trees, filled with bunches of flowers, were shining beautifully. In such a beautiful and sacred place, Atri Maharshi, with his mind focused on pranayama, without hunger, thirst, or sorrow and delusion, accepted the air as food, stood on one leg, and performed penance. The Lord, who is the cause of the creation, preservation, and destruction of the entire universe, should grant him a child equal to himself He believed in the refuge and performed a penance. By controlling the air through pranayama, the fire blazed up as the same kindling, and from the head of Atri Maharshi, the fire emerged and burned the world in flames. The Trinity, thus, the three worlds, seeing Atri Maharshi's penance exhausting due to the power of penance, Atri Maharshi came to the hermitage. With them, praising their fame, apsaras, sages, Gandharvas, Siddhas, Vidyadharas, Uragas, and Uragugulu also came to the ashram. Thus, the Trinity appeared and appeared before him, and Athri Maharshi, who had seen his mind-eye, stood up. Then he prostrated himself before the ground.
Pushpadevu held the flowers in his hands, stood before them, and praised them thus. The Trinity, with Garuda as their vehicle, Vishnu, with Vrishabha as their vehicle, Rudra, with Hamsa as their vehicle, were seated opposite each other with their respective symbols. With eyes full of grace and a smiling face, they were looking at Athri Maharshi. With the radiance filled with grace, the eyes of Atri blinked. I have cleaned it. He closed his eyes, fixed his mind on them, joined his hands, and with a sweet voice, praised those who are worshiped by all the worlds. In creating the world, in protecting it, in dissolving it, with the power of the Sattva Guna, with the Rajo Guna, Having assumed bodies filled with darkness, I bow to you, the Brahma, Vishnu, and Shiva deities, who perform the creation, preservation, and destruction of every cycle. I considered him as the Lord of the Universe and invited him. I prayed to the gods to have children. Who are you? I meditated on the all-pervading, supreme God, the Lord, who is equal to him I meditated so hard that I could not have a son. The body's inhabitants, which is impossible for even the mind to perceive, you three have manifested it. What is the reason for your arrival? I am asking for a detailed explanation of what is being granted in me. Thus, as the sage prayed, the gods laughed and sweetly spoke the words to the sage. We'll discuss this further in our next podcast. Jai Shri Srimannarayana.