నారద ముని బోధనలు - ప్రాచీనబర్హి వైరాగ్య హృదయము
Narada's Structural Teachings to King Pracinabarhi
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, మహర్షి నారదుడు యజ్ఞకర్మలలో మునిగిన రాజు ప్రాచీనబర్హిని సమీపించి, భక్తి మరియు వైరాగ్య మార్గం వైపు సున్నితంగా నడిపిస్తాడు. పురంజన రాజు కథ అనే అలంకారిక ఉపాఖ్యానం ద్వారా నారదుడు జీవాత్మ శరీరంలో మరియు సంసారంలో ఎలా బంధింపబడుతుందో హృద్యంగా వివరిస్తాడు. బాహ్య కర్మకాండలు మాత్రమే కాకుండా, శ్రీహరిపై సంపూర్ణ శరణాగతియే మోక్షానికి నిజమైన మార్గమని ఈ ఘట్టం స్పష్టం చేస్తుంది. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం కలిసి ముక్తికి రాజమార్గమని ఈ ఎపిసోడ్ మనకు శాశ్వత సందేశమిస్తుంది.
In this profound episode from Canto 4 of Srimad Bhagavatham, the great sage Narada Muni approaches King Pracinabarhi, who is deeply entangled in elaborate ritualistic sacrifices, and gently guides him toward the higher path of devotion and renunciation. Through the beautiful allegorical story of King Puranjana, Narada illustrates how the soul wanders through the body and the material world, bound by desire and ego. The sage reveals that true liberation comes not through external rituals alone, but through surrendering the heart entirely to the Supreme Lord Sri Hari. This episode is a timeless reminder that knowledge, devotion, and detachment together form the royal road to moksha.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే పురుష శ్రేష్ట స్థిత్యుత్పత్యప్యయేశ్వరా భక్తానామ్ నః ప్రపన్నానామ్ ముఖ్యో హ్యాత్మ గతిర్విభో ఓ పురుషోత్తమా, జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ప్రభుడవు నీవే. నీకు నమస్కారము. ఓ ప్రభు, నీ భక్తులమగు మేము నిన్ను శరణు వేడుచున్నాము. మాకు సత్యమైన ఆత్మ, ముఖ్యమైన ఆశ్రయము నీవే. ఎయిత్ క్యాంటో 24 చాప్టర్ 28 ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 37వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశించినటువంటి ఆత్మ, బంధము, మోక్షము ఈ విషయాల మీద తను అందించినటువంటి ఉపదేశాన్ని మనం అనుభవించాం. ఇంక ముందు తను నారదుల వారు ఉపదేశించిన ఉపదేశాన్ని మనం విందాం. ఆత్మకు, బంధమునకు, మోక్షమునకు కారణమును నారదుడు ప్రాచీన బర్హికి వివరించెను. అయినను మనసు ప్రశాంతము కాలేదు. ఇట్లు చెప్పుచు నారదుడు మరియొక రహస్యమైన విషయమును చెప్పెదను వినుము. జీవుడు ఒక లేడి వంటివాడు. ఆ లేడి కథ తెలిపినచో జీవ స్వభావం మనకు తెలియును అని హరిణ వృత్తాంతము చెప్పుచున్నాడు. ఒక లేడీ ఓ పూల తోటలో ఆశ్రమ వాటికలో తన ప్రియురాలతో కలిసి ఆనందించుచున్నది. తుమ్మెదలు ఆ పూలపై వాలి గానము చేయుచున్నవి. ఆ గాన ధ్వనిని విని లేడి ఆనందించుచున్నది. ఒకరి ప్రాణములు తిని తన ప్రాణములను పోషించుకొనడి క్రూర మృగములు ఎదురుగా తిరుగుచున్నవి. వెనక నుండి వేటగాడు బాణము ఎక్కుపెట్టి వేటాడుటకు సిద్ధమై ఉన్నాడు. ఒకసారి దానిని భావింపుము. జీవుడు కూడా ఆ లేడి వలెనే ఉన్నాడు.
అల్పమైన ఫలమును ఆశించి దానిని అనుభవించుచు జీవుడు ఈ సంసారంలో సంచరించుచుండును. స్త్రీలపై కలిసి ఇంటిలో ఉండి ఒకరినొకరు ప్రేమించుకొని కలిసి పాటలను వినుచు తన ఆయుష్షును హరించెడి రాత్రింబ వళ్ళు తోడేళ్ళ వలె సాగిపోవుచుండగా మనకు కనపడకుండా వెనక నుండి వేటగాడు లేడిని కొట్టినట్లు మృత్యువు ఈ ప్రాణమును తీయుటకు సిద్ధపడుచున్నాడు. దీనిని మనం భావించవలెను. పువ్వులు వంటి వారు స్త్రీలు ఆకర్షణగా ఉందురు. దూరము నుండియే మనసును హరింతురు. చూచినంత మాత్రముచే చేరవలెనని తోచునట్లు చేయుదురు. ఆ పువ్వులపై నుండు తుమ్మెదల వలె మకరంద పరిమళం వలె అల్పము అస్థిరమునగు సుఖమును కలిగించు కర్మలను చేయుచుందుము. ఎంతసేపు నాలుకతో చవి చూచుట, తినుట, స్త్రీ పురుషులు అన్యోన్యం రమించుట, ఆనందం అనుకొని జీవించుచుందురు. తుమ్మెదలు పాటలు పాడినట్లు స్త్రీల మనోహరములగు మాటలను వినుచు ఒడలు తెలియక పరవశమై ఆహారము మైధునమే. జీవిత సారముగా జీవించుచుందురు. మన ఆయువును తీయుచు రాత్రి పగలు సాగిపోవుచుండును. కానీ క్షుద్రమైన ఆనందమును అనుభవించుచు దానిని లెక్కచేయక ఇండ్లలో భార్యాభర్తలు సుఖమును అనుభవించుచు వడలు మరిచి ఉందురు. వెనక నుండి బాణమును ఎక్కుపెట్టిన వేటగాని వలె మృత్యువు వచ్చి ఒక్క బాణపు వెరటుతో ప్రాణము తీయును. ఓ రాజా దీనిని గూర్చి నీవు ఆలోచించుము. నీ మనసులో ఆ లేడి వ్యాపారమును ఆలోచించి, నీ హృదయములో కలిగెడి క్షుద్ర విషయములపై ఆసక్తిని విరమించుకొనుము. చెవులకు ఎంతో ఇంపుగా ఉండెడి ఫలములను ఇచ్చునవి ఇచ్చునవి వేదములు. ఎన్నో కర్మలను ఆచరింపుడును చెప్పుచుండును. కానీ అవన్నియు మనకు వినాశమును కలిగించెడివి. కావున నీవు స్త్రీతో కలిసి ఉండెడి గృహస్థాశ్రమమును వీడుము. ఈ సంసారములో కాముకుల వార్తలే గానీ భగవత్ కథలు ఉండవు. జీవులకు శరణమైన వాడు రక్షించువాడు భగవానుడే. వాని శరణు పొందుము. ఈ సాంసారిక ప్రవృత్తి విడిచిపెట్టి. భవత్ ప్రవృత్తి గలవాడవు కమ్ము. ఈ విధముగా నారదుడు ప్రాచీన బర్హికి అచేతన తత్వం యొక్కయు చేతనులై జీవుల యొక్కయు ఈశ్వరుని యొక్కయు స్వరూప స్వభావములను స్పష్టముగా వివరించెను.
కర్మలలో ఏది చేయదగునో, ఏది చేయరాదో తెలియజేసెను. దానిచే అతనికి వైరాగ్యము కలిగెను. నారదునితో ఇట్లు పలుకుచున్నాడు. ఓ మహర్షి, మీరు చెప్పిన ఉపదేశముచే ఆత్మ స్వరూపమును దర్శించుటకు కోరిక కలిగినది. మీరు చెప్పినది మాకు కర్మలు చేయమని చెప్పడి వారికి తెలియదు. వారు ఎనింగి ఉన్నచో నాకు చెప్పకుండా ఉండరు. మీ ఉపదేశముచే నా సంశయము తీరినది. కానీ ఒక సంశయం మాత్రము ఇంకను నాకు వదులుట లేదు. దీని విషయమున ఋషులు కూడా సంశయం కలిగిన వారే అగుదురు. పురుషుడు ఈ లోకములో పుణ్య కర్మలను, పాప కర్మలను ఒక శరీరముతో చేయుచుండును. ఆ శరీరం ఇచ్చటనే విడిచివేయును. మరియొక శరీరముతో ఆ పై లోకములో సుఖ దుఃఖమును అనుభవించుచుండును అని మీ వంటి వేదవేత్తలు చెప్పుచుందురు. మనము వెనకటి జన్మలలో చేసిన కర్మలకు కారణము అయిన దేహము, మనస్సు అట్లు చేయుటకు కారణమైన సత్వాది గుణములు శరీరము ఇప్పుడు ఉండవు. ఇప్పుడు చేసేడి కర్మ, ఇప్పుడు కర్మ చేసేడి దేహము, కర్మలు, గుణములు, మనస్సు తరువాత కాలముంది ఉండవు. చేసినది ఒకటి, అనుభవించినది వేరొకటి. అందుచే పూర్వజన్మలలో చేసిన పుణ్య పాపములకు ఫలము ఇప్పుడు అనుభవించుచున్నట్లు లేదు. ఇప్పుడు చేయునవే అనుభవించుచున్నట్లు తెలియుచున్నది. కావున సత్వరజస్తమస్సులు. పుణ్య పాపములు, మనస్సు, దేహము రాబోవు జన్మలలో సుఖ దుఃఖములకు కారణం అనుకొనుట సంగతము కాదు. ఇప్పుడు మట్టిని చక్రము మీద పెట్టి కుమ్మరి కర్రతో తిప్పినచో ఇప్పుడే కుండవచ్చును కానీ కారణము నశించిన తరువాత కార్యము జరింపదు. అట్లే దేహము నశించిన తరువాత కర్మలు నశించిన తరువాత వేరొక జన్మలో కార్యములు వచ్చును అనుట ఎట్లు కదురును కుదురును అని ప్రాచీన బరిహి సందేహం ప్రకటించెను. దీనికి నారదుడు ఇట్లా సమాధానం చెప్పుచున్నాడు. కర్మలు చేయుటకు కారణము శరీరమే. అది నశించును. అది స్థూల శరీరము.
స్థూలమగు శరీరము నశించినను మంచి చెడు కర్మలు చేయుచున్న చేయించునది మనస్సు. ఆ మనస్సు గల జీవుడు ఈ శరీరములో రాబోవు శరీరములో కూడా ఉండును. జీవుడు ఆ మనస్సుతో వేరొక శరీరమును పొంది ఈ కర్మలకు ఫలమును తానే అనుభవించును. నిద్రపోవుచు మనము కలగందుము. కలలో పరుండి నిద్రపోవుచున్న శరీరమును వదలి అది నా శరీరము అనేటి భావము లేకుండా వేరొక శరీరముతో జీవుడు సుఖదుఃఖమును అనుభవించుచున్నాడు. పండుకొనినప్పుడు ఉన్న జీవుడే కలలో వేరొక శరీరముతో ఉండి సుఖదుఃఖమును అనుభవించుటకు కారణము మనస్సు. మనస్సు పరుండి ఉండును. సరే. సారీ, మనుష్యుడు పరుండి ఉండును కానీ కలలో ఆ మనుష్య దేహమును వీడి దేవ శరీరముతో ఆకాశములో ఎగురుచున్నట్లు కలగనును. ఈ శరీరము ఎరుగదు. ఎగరదు. వేరొక శరీరము ఎగిరినది. అట్లు ఎగురుచున్నట్లు కలవచ్చుటకు కారణము వీడు వెనక చేసిన కర్మ వలన భగవానుడు అనుగ్రహించి ఆకాశములో ఎగురగలిగిన శరీరమును ప్రసాదించును. ఆ శరీరముతోనున్న వీనికి వెనక శరీరములోనున్న మనస్సే ఉండును. కనుక తృప్తిని కలిగించును. ఒకప్పుడు అట్లే దుఃఖమును కలిగించును. చేసిన కర్మ యొక్క సంస్కారము మనసును అంటి ఉండును. ఈ కర్మలచే సంతోషించిన భగవానుడు కలలో ఆ ఆత్మకి కర్మలకు తగిన శరీరమునిచ్చి ఆ కర్మల చేత అనుభవింపదగిన సుఖదుఃఖానుభవము కలిగించును. వెనక కర్మ చేసినవాడు ఇప్పుడు అనుభవించువాడు ఒక్కడే. విన కర్మలు చేయునట్లు ప్రేరణ చేసినది ఇప్పుడు ఫలములు అనుభవించుచున్నది సుఖదుఃఖములను అనుభవించినట్లు చేయునది మనస్సు ఒక్కటే. అందుచేత ఆత్మ మనస్సు మారలేదు. కనుక ఎవడు దానితో కర్మ చేసినాడో వాడు దానితోనే ఆ కర్మను అనుభవించును. ఇందు దేహము ప్రధానము కాదు మనస్సు చేయునది అనుభవింపచేయునది చేయువాడు అనుభవించువాడు ఆత్మ.
అవి రెండూను శరీరములను మారినను ఒకే రీతిగా ఉండును. కనుక వెనుకటి కర్మల ఫలమును దేహము నశించినను వేరొక దేహముతో అనుభవించుట అసంగతము కాదు. చేసిన కర్మ ఇప్పుడే నశించుచున్నది కదా, తరువాత వేరొక కాలమునందు ఫలమిచ్చుననుట ఎట్లు కుదురును అని శంక కలగవచ్చును. ఈ జన్మలో నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను అని శరీరముతో తాను ఒకటై నాకు ఈ కర్మ ఫలము ఈ జన్మలో నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను అని శరీరముతో తాను ఒకటై నాకు ఈ కర్మ ఫలమును ఇచ్చునను భావముతోనున్న మనసుతో కర్మ చేయుచున్నాడు. కర్మ నశించినను, కర్మ చేసినప్పుడు కలిగిన ఈశ్వర నిగ్రహ అనుగ్రహములు అట్లే ఉండును. ఈశ్వరుని ఉపాసనముచే మనము చేయదగిన కర్మలు చేసినచో సర్వేశ్వరుడను అనుగ్రహించును. వాని శాసనమును ఉల్లంఘించినచో సర్వేశ్వరుడు నిగ్రహించును. కావున కర్మ నశించినను కర్మచే కలిగిన భగవాను నిగ్రహానుగ్రహములు ఫలమును ఇచ్చి తీరును. ఇంద్రియములన్నియు ఒక్కసారి వాని వాని విషయములతో కలిసినను జ్ఞానం ఒక్కసారి కలుగుట లేదు. కన్ను చూచుట, చెవి వినుట, ముక్కు వాసన చూచుట ఒక్కసారి కలగవు. క్రమముగా కలుగుచుండును. కంటితో చూచుచున్నప్పుడు చెవితో వినుటకు తగిన శబ్దం ఉన్నను చెవి వినదు. వాసన తెలియదు. తరువాత శబ్దం వినబడును. వాసన తెలియదు. కారణం మనస్సు ఇంద్రియములతో కలిసినప్పుడే ఇంద్రియములు విషయములు ఉన్నను ఒకప్పుడు జ్ఞానము కలిగించుట ఒకప్పుడు జ్ఞానము కలగకుండా అను వాటికి కారణం మనస్సు అని ఊహించవచ్చును. ఇప్పుడు ఇంద్రియముచే చూడబడినవి గానీ, బుద్ధిచే భావింపబడినవి గానీ మన కోరికకు, మన కలకు కారణము కాకపోవచ్చును. ఎప్పుడో ఒకనాడు ఇంద్రియములచే, మనస్సుచే, బుద్ధిచే అనుభవింపబడినవి కోరబడుచున్నవి కలలో రావచ్చును. అందుచే మనస్సు కలిగిన పురుషుడు మనస్సుచే ఇంద్రియములచే అనుభవించడి విషయములనే కోరుచుండును. అందుచేత మనకు ఈనాడు కోరికలు కలుగుటకు కలలు వచ్చుటకు వెనకటి జన్మ మనస్సు ఉండిననే కానీ కోరబడుట కలలు వచ్చుట కుదరదు.
కనుక ఒక దేహం ఉన్నది. కనుక వెనక దేహం ఉన్నది, మనస్సు ఉన్నది అని నిశ్చయించుట వీలగుచున్నది. ఇంతకుముందు ఎప్పుడును అనుభవించని విషయమును మనస్సు కోరదు. ఇంతకుముందు ఎప్పుడో అనుభవించిన విషయమే మన కోరికలలో మెదులును. ఈ జన్మలో ఒక విషయము అనుభవించుటచే మనసులో వాసన ఏర్పడును. ఆ వాసనలు ఉండుటచే మరల కోరికలు కోరబడిన వానిని అనుభవించుటకు జన్మ బతుచున్నది. ఇందుచే వేరు వేరు జన్మలు వచ్చుటకు వేరు వేరు రకముల కర్మలు కారణము. ఆ వాసనలు ఏర్పడుటకు మనస్సు కారణము. ఇట్లు ఆత్మ మనస్సు అనునవి ఎన్నో జన్మలలో అనుసరించి వచ్చుచుండును. కొన్ని మంచి వాసనలు, కొన్ని చెడు వాసనలు మనసున అంటి ఉండును. దానికి కారణము వెనకటి జన్మలో మనసులో సత్వగుణము అధికముగా ఉండి మంచి విషయములను కోరి మంచి కర్మలను చేయుటచే మంచి వాసనలు ఏర్పడెను. రజస్తమో గుణములు అధికముగాముగా ఉండి చెడు కోరికలు కలిగి చెడు కర్మను చేయుటచే మనసున చెడు వాసనలు ఏర్పడును. అందుచే ఇప్పుడు మనలో కలుగుచున్న రుచి వాసనలకు మూలము వెనకటి జన్మలోని మనస్సే. ఈ జన్మలో ఉన్నదని నిశ్చయించుటకు అవకాశం నొచ్చెనుచున్నది. మనము ఎప్పుడు చూడనిది విననిది మనస్సులో భాసించుచుండును. ఆయా దేశములలో, ఆయా కాలములలో, ఆయా పనులను చేసి, ఆయా రూపములలో అనుభవింపవలెనని కోరికలు కలుగుచుండును. దానికి కారణము మన బుద్ధిలో వెనుకటి జన్మలో చూసిన వినిన ఎన్నో రూపములు వాసనా రూపములుగా నిలిచి ఉండుట. ఈ రూపము ఇట్టి రూపము మనసులో ఉండునని చెప్పుట శక్యము కాదు. బుద్ధిలో ఉండు రూపములు అనంతములు. నేను ఉండెడి దేశం ఇట్టిది కావలెను. ఇట్టి కాలములో ఇట్టి రూపముతో నేను ఉండవలెనని నేను ఇట్టి పనిని చేయవలెనని వేరు వేరు విధములుగా మనుషులు కోరుకొనుటకు కారణము జన్మల వాసనలు వానికి ఆశ్రయమగు మనస్సు అని చెప్పవచ్చును. ఈ జన్మలో మనచే కోరబడు పదార్థములన్నియు వెనక ఏదో ఒక జన్మలో కోరబడి అనుభవింపబడి మనసులో వాసనలుగా ఏర్పడి ఉండును. అవియే ఇప్పుడు మరల ఆ వాసన విశేషముగా రుచి ఏర్పడుచున్నది. మనస్సు లేకపోయినచో వాసనలు ఉండవు. వాసనలు లేకపోయినచో కోరికలు కలగవు. కనుక మనస్సు దాని యందలి కోరికలు వెనకడి జన్మల నుండి వచ్చుచున్నవని గ్రహించవచ్చును.
మనసులో సత్వగుణము అధికముగా ఉండి రజస్తమస్సులు తగ్గిననాడు మనస్సు భగవంతుని భజించుటకు ఉపక్రమించును. అప్పుడు అజ్ఞానము క్రమముగా తగ్గును. చంద్రునికి గ్రహణము పట్టి విడినట్లు కొంత కాలం అజ్ఞానము ఆవరించి ఉండి ఉండి వీడుటచే జ్ఞానము కలుగును. జీవుడు అనాదిగా ఉన్నవాడు. ఇంద్రియములు శబ్దాది విషయములు సత్వాది గుణములు వారి మనసును అంటి ఉంచునంత వరకు నేను నాది అని శరణమందే నేను అనుభావము శరీరమునకు చెందినవి నావి అనుకొనుట ఏర్పడి ఆత్మ స్వరూపం మరుగుపడును. అది సాగుచున్నంత కాలము తనను తాను ఎరంగ జాలదు. శరీరమును నేను అని అనుకొనుచున్నప్పుడు ఆ శరీరమును గూర్చిన జ్ఞానము కూడా సుషుప్తిలోను ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు మరణం వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు సంకోచించును. అందుచే దేహమున్నను కనపడుచున్నను దేహము నేను అను బుద్ధి కూడా అప్పుడు కలగదు. యవ్వనములో స్పష్టముగా గోచరమగుచున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు అన్ని వ్యాపారములు చేయించుచు భాసించుచున్నది. కానీ అది గర్భములో ఉన్నప్పుడు బాల్యమునందు సుషుప్తి దశయందు ఉన్నను లేనట్లే అగును. మనసు ఉండును దాని పని చేయదు. అమావాస్య చంద్రుడు కనబడినట్లు అజ్ఞానము ఆవరించి మనసు శక్తిని తగ్గించును. గర్భములో, బాల్యములో మనసు పని చేయదు. పని చేయదు కనుక ఇంద్రియములు పని చేయవు. కనుక సంసారము తొలగిపోవునని అనుకొనరాదు. అప్పుడు కూడా వెనక అనుభవించిన విషయములను మనసు వాసనలచే ధరించి ఉండును. బాహ్యముగా పనిచేయవు కానీ ఇంద్రియములు మనస్సు వాసనలు వదిలి ఉండవు. బుద్ధి వానిని భావించుట మానదు. అందుచే విషయములు బాహ్యముగా లేకపోయినను మనసులో భావనా రూపముగా వాసనా రూపముగా ఉండుటచే సంసారము జీవుని వదలదు. ఈ దేహము ఐదు కూటములచే ఏర్పడినది. 11 ఇంద్రియములతో కూడినది. పంచప్రాణులతో నడుచునది. మూడు గుణములు కలది. ఇట్లు శరీరము స్థూలముగా కాక సూక్ష్మముగా లింగ శరీరము అనబడుచు ఎల్లప్పుడూ ఉండును. జ్ఞానము గల ఆత్మ నేను అనేటి జీవుడుగా దేహములో ఉండును.
ఈ లింగ శరీరముతో కూడిన మనసున అంటిన అనేక విధములగు వాసనలచే రుచులచే ఇటువంటి శరీరమును ఎన్నింటినో పొందుచున్నాడు. హర్షమును శోకమును అందుచున్నాడు. సుఖము రాబోచున్నదని ఎరింగిన మనసులో కలిగెడి వికారము హర్షము. దుఃఖము రాబోచున్నదని ఎరింగెడి మనసులో కలిగెడి వికారము దుఃఖము. ఇప్పుడు అనుభవించుచున్న విషయము అనిష్టమైనచో కలిగిన మానసిక వికారము శోకము. ఈ లింగ శరీరముతో జీవుడు వీటినన్నిటినీ అనుభవించుచున్నాడు. జలగ వంటి పురుగు ఆకులపై ప్రాకుచున్నప్పుడు శరీరములో కొంత భాగమును ముందుకు నడిపి కొంత భాగమును కదలకుండా నిలిపి ముందునకు సాగుచుండును. అట్లే. జీవుడు మరణమున ఈ దేహమును వీడునప్పుడు కూడా స్థూల శరీరమును వీడి లింగ శరీరము వదలక ముందుకు సాగుచుండును. కర్మల యొక్క ప్రభావముచే దేహము కంటే వేరైన ఆత్మ ఉన్నట్లు భాసింపదు. అంతవరకు ఈ లింగ శరీరము వదలదు. భూతముల జన్మ కారణము మనస్సే. ఇంద్రియములతో వెనుక అనుభవించిన విషయములను మనస్తుతో తలవంచుచు మరల కర్మలను చేయుచుండును. కర్మలచే ఆత్మ ప్రకాశింపక దేహమే నేను అనిపించుండును. దేహమునకు చెందినవి నావి అనిపించుచుండును అదియే అవిద్య అనబడును. అవిద్యచే బంధము ఏర్పడును. కర్మ చేయుచుండుటచే విషయముల అనుభవం జరిగి రుచి వాసనలు ఏర్పడును. మరల వానిచే శరీరము కర్మ బంధము మరల జన్మ వచ్చుచుండును. కావున ఇట్లు దేహ దేహము దేహ సంబంధము పూర్తిగా తొలగుటకు శ్రీహరిని పరిపూర్ణముగా ధ్యానింపవలెను. ఈ చేతనా చేతనములతో నిండిన విశ్వమంతయు ఆ భగవానుడు ఆత్మగా కలిగి నిలిచి యున్నది, ప్రవర్తించుచున్నది అని సంతతము భావించుచుండవలెను. ఆ శ్రీహరి చేతనే ఈ జగత్తు పుట్టుచున్నది, నిలుచున్నది. లయమగుచున్నది ఎరుంగవలెను. దీనితో నారదుడు ప్రాచీన బర్హి ఉపదేశించినటువంటి ఉపదేశ జ్ఞానం పూర్తవుతుంది. దీని తర్వాత భాగాన్ని మరల విషయం మరల మనం తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the best of men, the one who is situated and is born. Oh Lord, the chief of those who surrender, the path to the self is yours. Oh Supreme Being, you are the lord of the creation, preservation, and destruction of the universe. Namaskar. Oh Lord, we, your servants, pray unto you. You are the one with the true spirit and the one who gives us the most important shelter. Eighth Canto 24 Chapter 28 Prayer. Dear devotees, welcome to the 37th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation with Vidura Maitreya, we have experienced the teachings he gave on the topics of self, bondage, and liberation, which Narada preached to the ancient Barhi. Now, let's listen to the teachings that Narada gave. Narada explained to the ancient Barhi the cause of the soul, bondage, and liberation. Nevertheless, my mind is not at peace. Thus saying, Narada will tell another secret. Listen. The creature is like a deer. If the story of the deer is told, we will know the nature of life, said the deer He is telling the story. A lady is enjoying herself with her lovers in a flower garden, in an ashram. The bumblebees are singing on those flowers. The deer is enjoying the sound of the song. Cannibalistic beasts are roaming in front, devouring one another's lives to sustain themselves. The hunter is ready to hunt from behind, having loaded the arrow. Take it all at once. The creature was like a deer.
The soul, desiring a small fruit, experiences it and wanders in this world. On women, together, staying in the house, loving each other, listening to songs together, while their lives are being spent like wolves, without us seeing, from behind, like a hunter hitting a deer, death this He is ready to take the life. We must consider this. Women are attractive like flowers. They take away our peace of mind. They do as much as they can, as if they are going to reach as much as they can. Like bees on flowers, like the fragrance of nectar, we perform actions that cause a fleeting, unstable happiness. How long will they live thinking of it as pleasure, tasting, and enjoying the harmony between men and women with their tongues? Like bumblebees singing songs, listening to the enchanting words of women, without knowing the waist, being ecstatic, food is love. They live as the essence of life. Our life is being taken away, day and night are passing by. But experiencing base pleasure, without considering it, in houses Husband and wife are enjoying happiness and forgetting their worries. Death comes like a hunter who has mounted an arrow from behind, taking life with a single arrow's throw. Oh King, you have thought of this. Consider the business of that deer in your mind, and cease to be interested in the petty things that are mixed in your heart. The Vedas are those that give fruits that are very pleasing to the ears. He is saying that he performs many karmas. But all of them are destructive to us. Therefore, abandon the householder's life where you live with a woman. In this world, there are only sensual news and stories of God. The Lord is the One who protects those who take refuge in Him. Seek His Sanctuary. Abandoning the family institution. You are full of the spirit. In this way, Narada clearly explained the nature of the unconscious element, consciousness, and the forms of living beings and God to the ancient Barhi.
He explained what should and should not be done in karma. He was filled with detachment. He is speaking like this with Narada. Oh sage, by the teachings you gave, I have a desire to see the form of the soul. Those who told you to do karmas, they don't know. They never stop telling me what's in their mind. My doubt has been cleared by your teachings. But one doubt hasn't left me yet. Even the sages are doubtful about this matter. A man performs good deeds and bad deeds in this world with one body. The body will be released right there. With another body, in that upper world, experiencing happiness and sorrow, so say the Vedic scholars like you. The body and mind, which are the cause of the karmas done in past lives, and the good qualities that cause them, the body will not be there now. The karma that is done now, the body, karmas, qualities, mind, and then time, will not exist. There's the doing and there's the experiencing. Therefore, the merits earned in previous births The result of sin is not being experienced now. It seems that what is being done now is being experienced. Therefore, the elements of goodness and evil. Punya papamulu, mind, body, considering it as the reason for happiness and sorrow in the coming births is not appropriate. Now, if you put the clay on the wheel and turn it with a potter's wheel, you can make a pot right now, but the work will not be done after the cause is destroyed. Similarly, how can it be said that after the body is destroyed, after the karmas are destroyed, actions will come in another birth? The ancient Barihi doubted and declared. Narada is giving this answer. The body is the instrument by which actions are performed. It's gonna be a flop. It is the gross body.
Even if the gross body is destroyed, the mind is what makes one do good and bad deeds. That mind-bearing being will also be in this body, and in the body that is to come. The living being, with that mind, attains another body and experiences the fruits of these actions himself. We fall asleep while we are dreaming. Leaving the body that is lying in a dream and sleeping, without the feeling that it is my body, the living being is experiencing happiness and sorrow with another body. The being that is in a dream while sleeping, having another body, is the mind that is the reason for experiencing happiness and sorrow. The mind will be open. Okay. Sorry, man will be open, but in a dream, leaving that human body, one will dream of flying in the sky with a divine body. This body does not know. It does not fly. Another body flew. The reason for appearing to be flying like that is that the Lord, by the karma done by him, bestows upon him a body that can fly in the sky, having been blessed. The one who is with the body also has the mind in the back body. So satisfying. Once upon a time, it caused sadness. Of the karma done Culture is something that sticks with you. The God, pleased by these deeds, in a dream gives the soul a body appropriate for its actions, and causes the experience of happiness and sorrow that can be experienced through those actions. The one who did the karma behind is the one who is suffering now. The mind is the only one that inspires us to do deeds, and now it is experiencing the fruits, making us experience happiness and sorrow. Therefore, the mind of the soul has not changed. Therefore, whoever has done karma with it, he will experience that karma with it. In this body, the mind is not the main thing; what the mind does, what it experiences, the one who does it, the one who experiences it, is the soul.
They both remain the same even though their bodies have changed. Therefore, it is not inconsistent to experience the fruits of past karmas with another body even after the body is destroyed. The karma done is being destroyed now, right? How can it be said to give fruit in another time? One may have such a doubt. In this birth, I am a Brahmin, a Kshatriya, and with the body, I am one, and to me, this fruit of karma, in this birth, I am a Brahmin, He is doing karma with a mind that is with the feeling that he is one with the body, that he is one with me, that he will give me this fruit of karma. Even if karma is destroyed, the divine grace and blessings received when karma is performed will remain the same. If we perform actions that are worthy of worshiping God, then the Lord of all will bless us. If one violates his command, the Lord of all will control. Therefore, even if karma is destroyed, the divine grace and blessings received through karma will surely give fruit. Even though all the senses are connected to their respective objects, knowledge is not obtained all at once. Seeing with the eyes, hearing with the ears, smelling with the nose, these things do not happen all at once. Gradually It is happening. When looking with the eyes, even if there is a sound suitable for hearing with the ears, the ear does not hear. No, I can't smell. The sound will be heard after that. No, I can't smell. The reason is, only when the mind is united with the senses, even though the senses and objects exist, sometimes it causes knowledge, sometimes it does not cause knowledge, the reason for that can be assumed to be the mind. Now, what is seen by the senses or what is felt by the intellect may not be the cause of our desire or our dream. Someday, what has been experienced through the senses, the mind, and the intellect may come in a dream. Therefore, a man with a mind desires things that are experienced by the mind and senses. Therefore, for us to have desires and dreams today, it is only possible if there is a past life's mind, but it is not possible to be desired and have dreams.
So there is a body. Therefore, it is possible to determine that there is a body behind and a mind. The mind does not desire what it has never known. What we have experienced sometime in the past is repeated in our desires. In this life, a certain feeling is formed in the mind by experiencing something. Because of those smells, birth is being lived to experience the one who is desired again. Therefore, different types of karmas are the reason for different kinds of births. The mind is the cause of the formation of those smells. Thus, the soul and mind have been following for many births. Some good smells and some bad smells stick to the mind. The reason for that is that in the previous birth, the quality of goodness was more in the mind, and by desiring good things and doing good deeds, good fragrances were formed. If the qualities of Rajas are excessive and one has bad desires, and by doing bad deeds, bad smells are formed in the mind. Therefore, the reason behind the taste and smell we experience now is our past life's mind. The opportunity to determine whether it exists in this life It is happening. What we have never seen or heard is reflected in our minds. In those countries, in those times, in those forms, one desires to do those works and experience them. The reason for that is the many forms we have seen and heard in our past lives, remaining as the form of desire. It is not possible to say that this form, this form, exists in the mind. The forms that exist in the intellect are infinite. I want the country I was born in. In this time, in this form, I should be, I should do this work, in different ways, the reason why people desire is the fragrance of births, the mind that takes refuge in it, can be said. All the things we desire in this life are formed in our minds as aromas, having been desired and experienced in some previous life. Those are now again, that smell is especially tasty. Smells are there only when there is mind. Without the smell, desires do not arise. Therefore, one can understand that the desires within the mind have been coming from previous births.
When the quality of goodness is predominant in the mind and the quality of passion and ignorance decreases, the mind will begin to worship God. Then the ignorance will gradually decrease. Just as the moon is affected by an eclipse, similarly, if ignorance prevails for some time, it leads to knowledge. The living being is the one that has been from time immemorial. Until the senses, the objects of sound, and the qualities of goodness cling to their minds, thinking that I am mine, surrendering, and considering that I am the feeling, belonging to the body, the form of the soul is hidden. As long as it continues, it does not care for itself. When I think of the body as myself, even the knowledge about that body, in deep sleep, when there is more sorrow, when death comes, when there is a severe fever, it shrinks. Therefore, even though there is a body, even though it appears, the intellect that I am the body will not arise then. In youth, the mind, which is clearly visible, consisting of the organs of action and organs of knowledge, is shining, performing all activities. But when it is in the womb, in childhood, in the state of deep sleep It seems like it's not there. The mind is present, but it is not the mind that does the work. As if the new moon moon is visible, ignorance covers and reduces the power of the mind. The mind is not working in the womb or during childhood. The senses do not work because it does not work. Therefore, one should not think that worldly life will be removed. Even then, the mind will hold on to the experiences it has had. They do not function externally, but the senses, the mind, and the passions do not leave. One should not forget to consider the intellect. Therefore, even if the objects are not external, because they exist in the mind in the form of feelings and desires, the world does not leave the soul. This body is made up of five knots. Endowed with the senses. Walking with five lives. It is a three-fold one. Thus, the body is not gross, but subtle, and is always called the Linga body. The soul with knowledge, I, as a being, exist in the body.
He is obtaining such a body for many reasons, with the many kinds of smells and tastes that are attached to the mind associated with this physical body. He is experiencing both joy and sorrow. The delusion that happiness is about to come, the joy that arises in the mind. The mind that is filled with the thought that sorrow is about to come, that mental state is sorrow. The mental disorder and sorrow that occurs when what is being experienced is undesirable. The individual is experiencing all of these with this physical body. When a worm like a leech is crawling on leaves, it moves some part of its body forward and keeps some part still, and moves forward. Similarly. Even when a being leaves this body at the time of death, he leaves the gross body and continues to move forward without abandoning the subtle body. The effect of karma does not appear to be that the soul is separate from the body. Until then, this sex body will not leave. The cause of the birth of ghosts is the mind. He who is burdened by the things he has experienced with his senses, he who is bowed down with his mind, and he who performs actions again. The body itself is the illusion of the self, which is not the self but is the result of karmas. They belong to the body, I It feels like that, that is ignorance. Ignorance breeds bondage. Because of karma, the experience of things happens, and tastes and smells are formed. Again, by him, the body, the bondage of karma, again birth will come. Therefore, in this way, to completely remove the body-body, body-relatedness, one should fully meditate on Srihari. This entire universe, filled with consciousness, is sustained and functioning as the divine being, the soul, and should be constantly contemplated. This world is being and will be created by Sri Hari. It is becoming rhythmic, like a child. With this, Narada's ancient Barhi-teached knowledge of the teachings is completed. We will learn about the next part again later. Asmad Gurubhyo Namah Jai Srimannarayana