పంచభూతముల సృష్టి క్రమము - తన్మాత్రల విభాగము
Creation of Five Gross Elements & Subtle Senses
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహర్షి మైత్రేయులు విదురునికి తన్మాత్రల నుండి పంచభూతముల సృష్టి క్రమాన్ని అద్భుతంగా వివరిస్తారు. తమోగుణ అహంకారము నుండి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే తన్మాత్రలు ఉద్భవించి, వాటి నుండి వరుసగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతములు ఏర్పడతాయని తెలుపబడింది. సూక్ష్మము నుండి స్థూలముగా జరిగే ఈ సృష్టి క్రమము పరమాత్మ యొక్క అసాధారణ సంకల్పశక్తికి నిదర్శనముగా నిలుస్తుంది. ఈ జ్ఞానము భక్తులకు భగవంతుని సర్వశక్తిమంతమైన మహిమను అర్థం చేసుకోవడంలో గొప్ప వెలుగును ప్రసాదిస్తుంది.
In this sacred episode of Srimad Bhagavatham, Canto 3, the great sage Maitreya reveals to Vidura the divine process by which the five gross elements — earth, water, fire, air, and space — emerge in sequential order from the subtle sense objects known as tanmatras. Each tanmatra, born of the primordial ego in the mode of ignorance, gives rise to a corresponding gross element, beautifully illustrating how the entire material creation unfolds through the will of the Supreme Lord. This profound knowledge illuminates the intricate relationship between the subtle and the gross, guiding sincere seekers toward a deeper understanding of the Lord's magnificent cosmic design.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః సర్వ సత్వాత్మ దేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలో కృపాలాయ సహవోజో బలాయచ సకల ప్రాణుల వ్యష్టి దేహము ఈ పృథివి మరియు సమిష్టి స్థూల బ్రహ్మాండము కూడా శ్రీహరియే ముల్లోకములలోని ప్రాణులకు ఇంద్రియ మనోదేహముల శక్తిని వసగే వాయువు రూపములో శ్రీహరియే ఉన్నాడు. అట్టి శ్రీహరికి నమస్కారము. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 39th ప్రేయర్. భగవత్ బంధువులారా. శ్రీమద్ భాగవత తత్వ దీపికలో తృతీయ స్కంధములో 13వ పాడ్కాస్ట్ లోకి స్వాగతం. ఇంతవరకు బ్రహ్మ స్తుతించిన తర్వాత పరమాత్ముడు తిరిగి ప్రత్యక్షమై తనకు సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత విదురుడు అడిగిన ప్రశ్నలకి మైత్రుడు ఇంకా కొన్ని వివరాలు తెలుపుతున్నాడు అది మనం తెలుసుకుందాం. ఇంకను తపస్సును ఆచరింపుము. అని భగవానుడు ఆజ్ఞాపించుటచే బ్రహ్మ మనసును నిశ్చలముగా ఉంచుకొని దేవ మానములో నూరు సంవత్సరములు తపస్సును చేసెను. ఆ బ్రహ్మ కూరుచునిన పద్మము అడుగున ఉన్న నీరు ప్రళయ కాలమందలి వాయువుచే ఇటునటు కదులుచుండెను. బ్రహ్మ తన ధ్యానముచే వృద్ధి చెందిన తపస్సు చేతను కర్మ యోగము చేతను వృద్ధి చెందిన జ్ఞాన బలము కలవాడై ఆ వాయువును నీటిని ఒకసారిగా లోనికి పీల్చెను. తాను కూర్చునిన పద్మము అంతరిక్షం వరకు వ్యాపించినంతటి ఔన్నత్యమును కలిగి ఉండెను. దాన్ని చూచి దీనియందు అణిగి ఉన్న పూర్వకల్పమునందుల లోకములను మరల కల్పించెదని అనుకొనింది. భగవాన్ని ప్రేరణచే పద్మకోశమును తాను అధిష్టించి ఆ పద్మకోశమును అనేక రూపములు కలదానిగా విభజించెను.
ఆ తామర మొగ్గ 14 లోకములుగా విస్తరింపదగినది. దానిని దేవతలు, మనుష్యులు, తిరియక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరములు అనగా వృక్షాదులు అను నాలుగు రూపములలో నుండి జీవులుగా విభజించెను. దానిని శరీరధారులకు ప్రాణులచే అనుభవింపదగిన శబ్దము మొదలగు విషయములుగా విభజించెను. జీవుల జీవులు విషయాలను అనుభవించుటకు సాధనములుగా ఉండెడి జ్ఞానేంద్రియములుగా కర్మేంద్రియములుగా విభజించెను. పద్మకోశం అనగా బ్రహ్మ అధిష్టించిన తామర మొగ్గ భోక్తలు, జీవులు, భోగ్య పదార్థములు, భోగోపకరణములు, భోగస్థానములు అనువానితో నిండిన ప్రపంచ రూపమై ఉండెను. ఒక ప్రయోజనము లేకుండా తన ధర్మము సృష్టిని తాను చేసి భగవంతుని ఆరాధించుటచే అతడు పరమేష్టిత్వమును పొందెను. విదురుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఈ చేతనా చేతనాత్మకమగు ప్రపంచము సృష్టించుటలో భగవంతుడు చేయు వ్యాపారము ఎవరికినీ ఊహింప వీలు కానిది. ఈ ప్రపంచ సృష్టికి కారణముగా భగవానుడు కాలమును కాలమును శరీరమును స్వీకరించి. ప్రేరణ చేసినాడని చెప్పినారు కదా, ఆ కాలం యొక్క స్వరూపమును నాకు ఎరంగింప కోరుచున్నాను. మైత్రుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు. భగవానుడు పృథివ్యాధి పదార్థ సంబంధము లేనివాడు. కారణాంతరము లేనివాడు. భగవానుడే ప్రకృతిని తన శరీరముగా దాల్చి ఆ ప్రకృతితో కూడిన తాను జగత్తునకు ఉపాదాన కారణమైనాడు. ప్రకృతి విశిష్టుడగు పరమాత్మ జగత్తునకు ఉపాదాన కారణం. ప్రకృతి సంబంధము లేని తానే నిమిత్త కారణము. ప్రకృతి పురుష కాలములతో కూడిన పరమాత్మ జగత్తునకు మూల పదార్థము అనగా ఉపాదానం. అదియే జగద్రూపముగా మారినది. ఈ విశ్వరూపముగా ఉన్న బ్రహ్మ పూర్వము తన సంకల్పము చేత స్థూలము అచేతనముతో చేతనములతో నిండిన విశ్వమును మహత్తు మొదలు పృథ్వి వరకు ఎన్నో రూపములతో ఉన్న వానిని వెనకకు తీయవలెనని సంకల్పించి సూక్ష్మావస్థను పొందించెను. సూక్ష్మావస్థను పొందిన చేతన అచేతన విశిష్ట బ్రహ్మము కారణము. సూక్ష్మావస్థలోనున్న చేతన అచేతనములు స్థూల రూపము నొందిన నాడు కార్యం.
మళ్ళీ అచేతన విశిష్ట బ్రహ్మము కారణము సూక్ష్మావస్థలో ఉన్న చేతనా చేతనములు స్థూల రూపము నొందిన నాడు కార్యము ఇవి రెండూను ఒకటే. కాలము కూడా ఈశ్వరునకు శరీరం వలె నియమింపదగినది. అతడు లేనిదే ఉండజాలనిది అగుటచే అతని శరీరమే. అందుచేత పరమాత్మ కాల శరీరకుడు కనుక కాలమే పరమాత్మ అనవచ్చును. కాల స్వరూపం ప్రత్యక్షముగా గ్రహింప వీలు కానిది. అందుచేత దానిని అవ్యక్తము అందురు. దానిచే సృష్టికి ముందు, సృష్టికి తరువాత ఆ విభాగము చేసి పరిచ్ఛిన్నము చేసినారు. విశ్వరూపుడగు పరమాత్మ సృష్టికి ముందు సూక్ష్మావస్థలో ఉండు విశ్వము తానే అయి ఉన్నాడు. సృష్టికి తరువాత స్థూలావస్థలో ఉండు విశ్వము తానే అయి ఉన్నాడు. అందుచే ఇప్పుడు విశ్వం ఎట్లున్నదో ముందు కూడా అట్లే ఉన్నది. సృష్టికి తర్వాత కూడా అట్లే ఉన్నది. కాలం యొక్క ప్రేరణ చేతనే చేతనా చేతన విశిష్టమగు పరమాత్మ నుండి సృష్టి సాగును. అది ప్రాకృతము. వైకృతం అని రెండు విధములు. ఈ రెండు విధములుగా ఈ రెండు విధములకు సృష్టి తొమ్మిది విధములు. ఒకటి మహత్ సృష్టి, రెండు అహంకార సృష్టి. మూడు భూత సృష్టి, నాలుగు ఇంద్రియ సృష్టి, ఐదు దేవ సృష్టి, ఆరు అండ సృష్టి. ఈ ఆరు విధముల సృష్టిని ప్రాకృత సృష్టి అందురు. ఏడు స్థావర సృష్టి, ఎనిమిది తిరియక్కుల యొక్క సృష్టి, తొమ్మిది మనుష్య సృష్టి. ఈ స్థావర తిర్యకు మనుష్య సృష్టిలు మూడును వైకృత సృష్టి మొత్తము ప్రాకృత వైకృత సృష్టిలు తొమ్మిది విధములు. కాలము యొక్క శక్తి చేతనే ప్రళయము జరుగుచుండును. ప్రళయము మూడు విధములుగా ఉండును. ఈ కాలమునందు వీనికి మరణము అని ఒక నియతి ఏర్పడి జరిగిన ప్రళయము నిత్య ప్రళయము అనబడును. దీనికి దీనిని కాల ప్రళయమందురు. ఇది ఒక విధము. సంకర్షణుని ముఖము నుండి అగ్ని వెలువడి ప్రళయము జరుగును. దీనిని నైమిత్తిక ప్రళయమందురు. ఇది ఒక ద్రవ్యముచే కలిగిన ప్రళయము కనుక దీనిని ద్రవ్య ప్రళయమందురు.
ప్రకృతిలో నుండి సత్వరజస్తమో గుణములలో సామ్యావస్థ కలిగినప్పుడు ప్రళయము ఏర్పడును. ఇది ప్రాకృత ప్రళయము. ఇది గుణములచే కలిగినది కనుక దీనిని గుణప్రళయము అని కూడా అందురు. ఇట్లు ప్రళయము, కాల ప్రళయము, ద్రవ్య ప్రళయము, గుణ ప్రళయము ప్రాకృత ప్రళయము అని కూడా వ్యవహారము కలదు. అందు ప్రాకృత ప్రళయములు తొమ్మిది విధములుగా ఉండును. సృష్టికి ఉన్ముఖమైన ప్రకృతి పురుష శరీరముగా గల పరమాత్మ నుండి కాలము యొక్క ప్రేరణచే భగవానుని సంకల్పముచే కలిగిన సత్వ రజస్తమో గుణముల వైషమ్యముచే మహత్మత్వము సృజింపబడినది. ఇది ప్రకృతి నుండి వచ్చిన మొదటి సృష్టి. ఇది మహత్ సృష్టి అనబడును. రెండవది అహంకార సృష్టి. ఈ అహంకారము నుండి పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, తన్మాత్రులు వెలువడినవి. అహంకార సృష్టి ప్రకృతి నుండి జరుగుట అహం సర్గము అనబడును. ఇక మూడవది భూత సృష్టి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మహాభూతములుగా కాకుండా సూక్ష్మావస్థలో ముందు ఉండును. వానిని తన్మాత్రులు అందురు. వీనినే శక్తులు అందురు. పంచమహాభూతములను ద్రవ్యములు అందురు. ఈ రెండూను భగవానునకు శరీరం వంటివి అనగా అతని చేతనే నియమింపబడి. నిలువబడి నియమింపబడుతున్నది. ఈ విధంగా ధన్మాత్ర ద్రవ్య సృష్టి మూడవ దగు భూత సృష్టి నాలుగవ సృష్టి నుండి మిగతా భాగాన్ని మనం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. May you be the special one in all goodness, the one who resides in the body. Salutations to the three-eyed one, the merciful one, the one who is equal to the gods. May the strength of all beings be in you. This earth and the collective gross universe are also Sri Hari in the three worlds Sri Hari is in the form of Vasaguva, the air, with the power of senses, mind, and body for living beings. Salutations to Shri Hari. Fourth Canto, Chapter 24, 39th Prayer. Beloved brothers. Welcome to the 13th podcast in the third book of Srimad Bhagavata Tattva Deepika. After Brahma praised, the Supreme Being reappeared and gave him the knowledge needed to create, and disappeared. After that, Maitrudu is giving some more details to the questions asked by Vidurudu, let's find out. And continue to practice austerity. And by the order of the Lord, Brahma, keeping his mind steady, performed penance for a hundred years in the divine abode. The water at the bottom of the lotus that Brahma sat on was moving here and there by the wind during the time of destruction. Brahma Having grown through his meditation, through penance, and through karma yoga, having the strength of knowledge, he suddenly inhaled that air and water. The lotus that he sat on possessed the same greatness as the expanse of space. Seeing that, she thought that she would create again the worlds in the previous creation that was hidden in it. Inspired by the Lord, he assumed the lotus-like form and divided that lotus-like form into many forms.
That lotus bud is destined to spread over fourteen worlds. Then the gods, humans, and creatures, that is, animals and birds, and the stationary things, that is, trees, were divided into living beings from four forms. It divided it into things such as sound, which can be experienced by the embodied beings, and so on. Living beings are divided into sense organs and motor organs to experience things. Padmakosha means the world filled with the lotus bud established by Brahma, beings, objects of enjoyment, objects of enjoyment, and places of enjoyment. Without any benefit, by creating his own dharma and worshiping God, he attained supreme status. Vidur again questions. The business that God does in creating this conscious, interactive world is beyond anyone's imagination. The reason for the creation of this world is that the Lord accepts time, time, and the body. They said that he inspired, right? I want to make me understand the nature of that time. Maitrudu like this He's answering. The Lord is not involved in the material sense. One who is not caused. The Lord himself, assuming nature as his body, and being united with that nature, became the cause of the world. The Supreme Being, who is the unique essence of nature, is the cause of the world. The cause is the cause that is not related to nature. The Supreme Being, which is united with the three times (past, present, future), is the original substance of the world, that is, the cause. It became the form of the world. This Brahma, who is in the form of the universe, decided to take back the universe, which was filled with gross, unconscious, and conscious beings, from the beginning to the earth, in many forms, with his will, and attained a subtle state. The conscious, unconscious, and distinct Brahman that has attained the subtle state is the cause. When the subtle and the unsubtle, the conscious and the unconscious, attain a gross form, it is the work.
Again, the unconscious, distinct Brahman is the cause. When the consciousnesses that are in a subtle state attain a gross form, the result is the same. Time is also something that can be appointed to God, like a body. His body is such that it cannot exist without him. Therefore, since the Supreme Being is the embodiment of time, time itself can be considered the Supreme Being. The nature of time is not something that can be directly perceived. Therefore, it is called unmanifest. Before and after creation, that division was made and it was transformed. The supreme being, the universe, exists in a subtle state before creation; the universe itself is the same. After creation, the universe exists in a state of mass, and he himself is it. Therefore, the universe is as it was before. It remains the same even after creation. Creation proceeds from the Supreme Being, who is distinct from the inspiration of time. It is Prakrit. Vaikhrutham has two types. In these two ways, the creation of these two ways is nine ways. One is the great creation and the other is the creation of ego. Three, the creation of the elements, four The creation of the senses, the creation of the five gods, the creation of the six eggs. These six types of creation are called Prakrita creation. Seven, the creation of the base, eight, the creation of the circumference, nine, the creation of man. These are the three types of human creations, and the entire Vaikuntha creation is Prakrita Vaikuntha creation, and there are nine types. The power of time is what causes the end of the world. The Pralayam is of three kinds. In this era, a destiny has been established for them that death will occur, and the calamity that has happened is called the eternal calamity. This is called the time of destruction. It is a kind of. From the face of Sankarshana, fire will erupt and a deluge will occur. This is called Naimittika Pralayam. This is a catastrophe caused by a substance, therefore it is called a substance catastrophe.
When the quality of Sattva, Rajas, and Tamas are in equilibrium from the nature, then the dissolution occurs. It is Prakrit Pralayam. It is also called Gunapraalayam since it is made of Gunas. Thus, there is also a practice of Pralayam, Kala Pralayam, Dravya Pralayam, Guna Pralayam, and Prakrita Pralayam. There are nine types of Prakrita Pralayas. From the Supreme Soul, which is the body of nature and man, facing creation, by the inspiration of time, by the intention of the Lord, due to the disparity of the qualities of Sattva, Rajas, and Tamas, the greatness was created. This was the first creation that came from nature. This is called the great creation. The second is the creation of the ego. From this ego, the five elements, the sense organs, the organs of action, the mind, and the subtle elements are emanated. The creation of ego is called the origin of ego. Now, the third is the creation of the elements. That is, sound, touch, form, taste, and smell, instead of being in a gross state, exist in a subtle state. They are his minions. They are the ones who are empowered. The five great elements are the substances They are. These two are like the body to God, that is, they are appointed by Him. It is being stopped and is being appointed. In this way, let's learn about the remaining part from the third Bhuta creation, Dhanmatra Dravya Srishti, and the fourth creation, in another podcast. Salutations to Asmadguru, Jai Srimannarayana.