కర్దమ దేవహూతుల దివ్య వివాహ మహోత్సవము

The Sacred Marriage of Kardama and Devahuti

bhagavatam

ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, మహర్షి కర్దముడు మరియు మను-శతరూపల పుత్రిక దేవహూతి మధ్య జరిగిన దివ్యమైన వివాహ మహోత్సవాన్ని వివరిస్తాము. మహారాజు మను తన సద్గుణవతియైన కుమార్తెను కర్దముని ఆశ్రమానికి తీసుకువచ్చి, ధర్మబద్ధంగా వివాహం జరిపిస్తాడు. దేవహూతి యొక్క నిష్కళంక భక్తి మరియు సేవాతత్పరతకు సంతసించిన కర్దముడు ఆమెను పత్నిగా స్వీకరించి, ఆమె జీవితాన్ని దివ్యానుగ్రహంతో నింపుతాడు. ఈ పవిత్ర ఘట్టం, నిజమైన వివాహం ఈశ్వరప్రాప్తిని లక్ష్యంగా కలిగిన ఆత్మల మిలనమని బోధిస్తుంది.

In this episode of the Srimad Bhagavatham podcast, we explore the divinely ordained union of the sage Kardama Muni and the devoted Devahuti, daughter of Manu and Shatarupa. Emperor Manu brings his virtuous daughter to the hermitage of Kardama, fulfilling a celestial promise and establishing a marriage rooted in dharma, devotion, and spiritual purpose. Kardama Muni, moved by Devahuti's sincere dedication, accepts her as his wife and blesses her with a life of profound grace and divine abundance. This sacred episode reminds us that true marriage is a union of souls united in the pursuit of God-realization.

← Prev Next →
The Sacred Marriage of Kardama and Devahuti bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః కర్తాస్య సర్గాదిషుయో న బాధ్యతే న హన్యతే దేహ గతోపి దైహికైహి ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమో సక్త వివిక్త సాక్షిణే నారదుడు ఈ రకంగా ప్రార్థిస్తున్నాడు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేసేది భగవానుడే కానీ ఆయన కర్తృత్వము అనే బంధము లేదు. ఆయన ప్రాణుల దేహములలో ఆత్మ రూపముగా ఉన్నాడు కానీ ఆయనకు దేహ ధర్మములగు పుట్టుక మరణం మొదలగు వాటిచే తిరస్కారము లేదు. ప్రాణుల యందరి ద్రష్ట ఆయనయే కానీ శుద్ధ చైతన్య స్వరూపుడగు ఆయనకు చైతన్యముచే ప్రకాశింప చేయబడే మనోవృత్తులలోని సత్వరజస్తమో గుణములతోడి కాలుష్యము లేదు. ఆయన ప్రాణులలో ఆత్మరూపముగా దేహేంద్రియాదుల కంటే విలక్షణుడై వాటి తోడి సంఘము లేకుండా సాక్షియై నిలిచి ఉన్నాడు. ఆయనకు నమస్కారము. ఫిఫ్త్ క్యాంటో 19th చాప్టర్ 12th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 32వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలోని దేవహుతి తన యొక్క పుత్రుడైనటువంటి కపిలుడితోని మోక్షం గురించి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతుంది. దానికి కపిలుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. విందాం. మోక్షమందు ఇచ్చగల పురుషులకు జ్ఞాన యోగమే మోక్ష సాధనము. ప్రకృతి వికారముకు శరీరము కంటే వేరైన ఆత్మ స్వరూపము ఎరుంగటయే జ్ఞాన యోగము. ఆ జ్ఞానము కలుగగానే విషయానుభవముచే కలిగెడి సుఖ దుఃఖములు అంతమగును. జ్ఞాన యోగమును వినవలెనని కోరిన ఋషులకు పూర్వకాలమందు నేను చెప్పిన దానిని మరల నీకు ఇప్పుడు చెప్పెదను. అంటే దేవహుతికి. జీవుడు బంధమును పొందుటకు, మోక్షమును పొందుటకు మనసే కారణము. సత్పరజస్తమో గుణములయందు వశమై శబ్దాది విషయములను అనుభవించడి మనసు జీవునకు సంబంధమును కలిగించును.

భగవానుని యందు అనురక్తి కలిగిన మనస్సు మోక్షమును అందుటకు సాధనమగును. నేను నాది అనేది అభిమానము అజ్ఞానము చేయగలుగును. అన్నిటినీ పొందవలెనని లోభము కలుగును. కామముచే, లోభముచే మంచి పనులు, చెడు పనులు చేయుచుందురు. అహంకారము, మమకారం వదిలిన మనసు తాను చేయు సర్వ కర్మలకు ఫలమును కోరక భగవత్ ఆరాధనముగా చేయుదురు. అప్పుడు దుఃఖము ఉండదు, సుఖము ఉండదు. మనసు జ్ఞాన వైరాగ్యములు కలుగుటకు యోగ్యమగును. శాస్త్రములచే ఆత్మ స్వరూపము శరీరము కంటే వేరైనదని ఎరుంగుట జ్ఞానము. శరీరము కొరకు ఇంద్రియముల ద్వారా విషయములను అనుభవించనన్నడి కోరిక లేకుండుట వైరాగ్యము. మనసులో జ్ఞాన వైరాగ్యములు కలిగిన నాడు భగవానునిపై ప్రేమ కలుగును. ఏ విధముగను ఏ విధముగను మార్పు చెందనది సూక్ష్మమైనది తనంత తాను ప్రకాశించునది ఆత్మ తత్వముగా తెలియును. ఆత్మయే నేను అనబడును. ఆత్మ జ్ఞాన స్వరూపము గలది అనగా తనంత తాను ప్రకాశించునది మిగిలిన వానిని అన్నిటినీ ఎరుంగదగిన జ్ఞానము గలది. ఇట్లు భగవత్ భక్తి కలిగిన వానికి మనస్సు వశమగును. తాను అనగా ఆత్మ స్వరూపం గోచరించును. భగవానుడు సకల జీవులకు లోన వ్యాపించి నియమించువాడు అట్టి వాని యందు భక్తి ఉండుట చేతనే బ్రహ్మ ప్రాప్తి కలుగును. ఇంతకంటే వేరొక మార్గము లేదు. మనస్సు విషయములను అనుభవించుట యందు రుచి తగ్గినదై ఆత్మ వైపు మరలుటకు ప్రధాన కారణము సత్పురుషులతో సహవాసము. సత్పురుషులు అనగా అందరి యెడల ఓర్మి గలవారు. ఎంతటి మూర్ఖులైనను వారి యందు విసుగు చెందక వారి తప్పులను లెక్క చేయక సహించగలవారు. స్వార్థము లేకయే ఒకరికి కలిగిన దుఃఖమును ఓర్వలేక పోగొట్టవలెనని కోరువారు. సకల ప్రాణులను ప్రేమించి వారి మేలు కోరువారు. వారికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. వారిని వేరొకరు ద్వేషించిన ద్వేషించవచ్చు కానీ వారు ఎవరినీ ద్వేషించరు. వారిని అజాత శత్రువులు అందురు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము గలవారు.

ఇతరుల కార్యమును సాధించుటకు యత్నించువారు. మంచి స్వభావమే ఆభరణముగా గలవారు. అట్టివారు సాధువులు, సత్పురుషులు అనబడుదురు. వారు భగవానుని యందు ఏ ఫలమును కోరక స్థిరమైన భక్తిని కలిగి ఉందురు. తాము చేయు పనులన్నియు భగవానుని కొరకే చేయువారు. నా ఆరాధనకు అడ్డుపడి అడ్డుపడిడి బంధువులను కూడా దూరము చేసుకొనుడివారు. నా ఆరాధనకు అడ్డు వచ్చేడి పనులను విడిచెడి వారు. నా కథలను వినుట చేతనే ఆనందించెడి వారు. నా కథలను ఒకరు చెప్పుచున్నప్పుడు వినవలెనని ఒకరు వినునప్పుడు చెప్పవలెనని కోరిక గలవారు. నా యందే మనస్సు నిలిపి ఎన్నో శ్రమలను ఓర్చుకొని ఉండెడి వారు. వారికి ఇది నాది, వీరు నావారు అని మనసులో సంఘము ఉండదు. ఇంద్రియములు ఆయా విషయములు అనుభవించుటచే కలిగే దోషములు లేనివారు. వారితో కలిసెడి వారికి కూడా అట్టి దోషములు అంటకుండా చేయువారు. అట్టి సత్పురుషులతో కలియుట వలన భగవానుని దివ్య లీలలు, దివ్య గుణములు వినుట సంభవించును. ఆ కథలే చెవికి, మనస్సుకు అమృతం వలె తృప్తిని కలిగించును. అట్టి రుచి కలిగినందువలన మోక్షమునకు మార్గము గురువును ఆశ్రయించవలెనని కోరిక కలుగును. దానిచే జ్ఞానము కలుగును. భగవానుని యందు భక్తి కలుగును. ఇట్లు సత్పురుషుల సహవాసము మొదలు ప్రేమతో ఎడతెగక స్మరించుట వరకు కలిగిన తరువాత మనసు ఇతర విషయములకు పోకుండా నిశ్చలముగా ఉండును. అప్పుడు వారు ఏ పదార్థమును చూచినను సృష్టించు వాడను నేనని, రక్షించు వాడను నేనని. నేనే లోన ఉండి నియమించుచున్నానని గుర్తించుచుందురు. దాని వలన మనసులో పరాగు పోయి వానినే సంతతం స్మరించడి శ్రద్ధ కలుగును. అప్పుడు భక్తి యోగము సాధించని మార్గమును ఆచరింతురు. అప్పుడు భక్తి కలిగి నన్ను పొందుదురు. భక్తికి ముందుగా సత్వరజస్తమో గుణముల ప్రకోపముచే కలిగెడి ప్రకోపము తగ్గి. సత్వగుణము పెంపొందించడి ఆహారమును తీసుకునవలెనని కోరిక కలుగును. దానిచే జ్ఞానము వైరాగ్యము కలుగును. వానిచే భక్తి కలిగి భక్తిచే తన స్వరూపమును తాను ఎరింగి ఆత్మజ్ఞానము కలవాడగును.

దేవహుతి కపిలుడు చెప్పిన మోక్షోపాయ సంగ్రహమును విని విస్తరముగా ఎరుంగుటకు ఇట్లు ప్రశ్నించుచున్నది. ముక్తిని పొందుటకు యోగ్యము భక్తి ఏ విధముగా ఉండవలెను? తాపత్రయములచే ఆర్తినందుచున్న నేను ఏ విధముకు భక్తిచే నిరతిశయానంద రూపమగు నీ స్వరూపమును చేరగలను. భగవానుడు అనబడు లక్ష్యమును గురిచేసి ప్రయోగించడి బాణం వంటిది కదా భక్తి అది ఎట్లుండవలెను? దానికి అంగములేవి? ఏ అంగముల చేత పరమాత్మను పొందుటకు సాధనము భక్తి అగు భక్తి ఏర్పడను? నేను జ్ఞానహీనురాలను. జ్ఞానము ఎరుంగుటకు చాలా కష్టం. నాకు సుఖముగా తెలియనట్లుగా నీవే ఎరంగింపవలెను. ఈ విధంగా తల్లి ప్రశ్నింపగా తల్లిపై గల ప్రేమతో నీవు ఎరంగగోలిన భక్తి స్వరూపమును గూర్తి వివరించుచున్నాను. భక్తి కలుగుటకు ముందు శబ్దాది విషయములను గ్రహించే జ్ఞానేంద్రియములు వేద విహిత కర్మానుష్ఠానము చేయజాలిన కర్మేంద్రియములు మనస్సు కూడా శుద్ధ సత్వమయమగు భగవత్ విగ్రహమునందు నిలుచుట ఆవశ్యకము. దానిని ఒక ప్రయోజనమును కాంక్షించి చేయరాదు. శ్రవణము, కీర్తనము, స్మరణము చేయుచు సత్వగుణ ప్రధానమగు భగవానుని దివ్య మంగళ విగ్రహమును సేవించుచుండవలెను. ఇట్లు సర్వేంద్రియ వ్యాపారములు భగవత్పరముగా సాగిననాడు ఆ భక్తి అనాదిగా జీవుని అంటి వచ్చుచున్న లోపలికి తీసుకునిన అన్నము మొదలగు వాటిని జఠరాగ్ని దహించినట్లు పుణ్య పాప రూపము కర్మ వాసనలను జీర్ణము చేయును. కొందరు నా పాద సేవ యందే ఆసక్తి గలవారలై సర్వేంద్రము నాయందే నిలిపి నా కళ్యాణ గుణములనే విని ఆనందించుచు ఆ ఆనందమును వీడి భగవంతుని సాయుధ్యమును పొందుటకు కూడా ఇచ్చగింపరు. వారు నా సుందరములగు దివ్యములగు అభిమతములను ఈడేర్పజాలిన రూపములనే ధ్యానించుచుందురు. నన్ను కూర్చిన కథలనే చెప్పుచుందురు. అదే వారికి పరమ ప్రయోజనము. వారు ముక్తిని కూడా కోరరు. చూడదగిన విలాసములతో ఇండిన నా మందహాసమును నా మధుర భాషణములను వారు సేవించి పరవశమగుచుందురు. అట్టి భక్తియే వారు కోరకపోయినను వారి ప్రారబ్ధ కర్మ అంతయు అంతము కాగానే అర్చిరాది మార్గం.

భాగముతో ముక్తిని పొందునట్లు చేయును. వారు భగవత్ ఐశ్వర్య రూపముగు మోక్షమును కాంక్షింపరు. ఇంకా అట్టి భక్తులు అణిమాది సిద్ధులను కానీ బ్రహ్మలోక పర్యంతం ఉండెడి లోకములలో వైభవమును కానీ కోరరని చెప్పనవసరము లేదు. నేను ఉండెడి లోకము శాంత స్వరూపమగునది. అది శుద్ధ సత్వమయము. అచట నుండు వారు నన్నే అనుభవించుచుందురు. ఆ అనుభవము ఎన్నడును వారికి లేకుండా ఉండదు. కాలచక్రము ఆ లోకమును ఎన్నడును స్పృశింపలేదు. వారికి నేనే బిడ్డల వలె ప్రేమపాత్రుడినై ఉందును. మిత్రుని వలె విశ్వసింపదగిన వాడనై పూజింపదగిన వాడనై ఉందును. అన్ని భావములతో నన్ను ఆరాధించుచుందురు. వారి ఆరాధనచే సంతుష్టినందిన నేను నా అనుభవమును పరిపూర్ణముగా వారికి కలిగించి మరల దాని నుండి జారక ఉండునట్లు చేయగలను. అనన్యమైన భక్తి గలవారు నన్ను ఆరాధించుట కంటే వేరొక దానిని కోరరు. వారికి ఈ లోకము పై స్వర్గాది లోకములు కూడా నిరసింపదగినవే అగును. ఈ లోకములో సుఖములను పైలోకములో సుఖములను పొందుటకు తగిన కర్మలను ఆచరించుటకు ఉపయోగించెడి శరీరమును కూడా వారు ఆదరింపరు. దేహమందు అభిమానము లేక ఉందురు. ఆ దేహమునకు సంబంధించిన సంతానము, భార్య, ధనము, పశువులు, ఇల్లు. మొదలగు వానిని కూడా వారు ఆదరింపరు. అన్ని విధములా ఉపకరించడి నన్నే హితుడుగా గురువుగా అనన్య భక్తితో ఆరాధింతురు. అట్లు నన్ను ఆరాధించు వారిని నేనే ఈ సంసారం నుండి దాటించెదను. ప్రకృతి కంటే జీవుల కంటే వేరైన వాడను నేను. అన్నిటిలోనా ఉండి ధరించి నియమించు వాడనగు సకల కళ్యాణ గుణముల గల నాకంటే ఇతరులను సేవించుటచే తీవ్రమగు సంసార భయము నివర్తింపదు. వాయువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ నా ఆజ్ఞావశవర్తులే. వారందరూ జీవకోటిలోని వారే. నేను ఆజ్ఞాపించిన కార్యములనే చేయుచుందురు. నా వద్ద భయం వలనే వాయు ఎల్లప్పుడూ వీచుచున్నది. సూర్యుడు తపించుచున్నాడు, ఇంద్రుడు వర్షించుచున్నాడు, అగ్ని దహించుచున్నాడు, మృత్యువు కూడా నా వద్ద భయము చేతనే సంచరించుచున్నది.

తీవ్రముగు భక్తి యోగము గలవారు జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి చేతనే నా పాద మూలమును చేరి క్షేమము గలవారగుదురు. వారికి దేని వలనను భయము కలగదు. సకల శాస్త్ర సారము ఇదే వేరొక కోరిక లేని. మధ్యలో విడువని నాయందు నిలిపిన భక్తియే మోక్షమునకు కలిగించుటకు సాధనము. వేరొకటి కాదు. ఇంకా ముందు భాగంలో కపిల గీత అంటాం దీన్ని మనం ఇంకా ఏం వివరిస్తున్నారో తర్వాత మనం తెలుసుకుందాం. దీన్ని మనము మరొకసారి కూడా విని అర్థం చేసుకోవటంలో మంచి పరమార్థం మనకి లభిస్తుంది. మరొకసారి వినడానికి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. The one who is responsible for the creation, is not killed by the body, nor is he seen by the worldly. He is not blamed by the qualities of the worldly, to him I bow. Narada is praying in this way. The creator, preserver, and destroyer of the universe is God, but He has no bond of agency. He is in the bodies of living beings as the form of the soul, but He is not rejected by the bodily functions such as birth and death. He is the seer of all beings, but he is the embodiment of pure consciousness. He has no impurity in the qualities of Sattva, Rajas, and Tamas in the mental tendencies that are illuminated by consciousness. He, in the living beings, as the form of the soul, being distinct from the body and senses, without being associated with them, stands as a witness. Greet him. Fifth Canto, Chapter 19, 12th Prayer. Devotees of God, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 32nd podcast. Until now, in the conversation between Vidura and Maitreya, Devahuti, along with his son Kapila, is discussing the knowledge about salvation Asks for Prasad. Kapiludu is about to give an answer to that. Let's listen. For those men who can give liberation, knowledge yoga is the means to liberation. The knowledge of the soul's form, which is different from the body, is the yoga of knowledge. As soon as that knowledge is attained, the pleasures and sorrows associated with worldly experiences will end. I will now tell you again what I told the sages in ancient times who desired to hear the knowledge of Yoga. That is to say, to Devahuti. The mind is the cause for a being to attain bondage and to attain liberation. Being controlled by the qualities of goodness, passion, and ignorance, the mind, which experiences sounds and other things, causes attachment to the individual soul.

A mind filled with devotion to God is the means to attain liberation. I can make my own pride and ignorance. Greed to get everything. By lust, by greed, they do good deeds and bad deeds. The mind that has abandoned ego and attachment, without desiring the fruits of all actions performed by itself, performs the worship of God. Then there will be neither sorrow nor happiness. The mind is worthy of knowledge and detachment. The knowledge that the soul is different from the body is that it is known by the scriptures. The desire to not experience things through the senses for the sake of the body is detachment. When the mind is filled with knowledge and detachment, love for the Lord arises. That which does not change in any way, that which is subtle, that which shines on its own, is known as the essence of the soul. The Self is the Aham. That which is the form of self-knowledge, that is, that which shines on its own, that which has the knowledge to know all others. Thus, the mind is controlled by one who has devotion to God. He is the manifestation of the self. Bhagavanudu sakala He who pervades and rules within beings, it is only by having devotion to such a one that one attains Brahma. There is no other way. The main reason for turning away from the soul, having lost interest in experiencing the things of the mind, is association with virtuous people. A saint is someone who is patient with everyone. Even the most foolish, without getting annoyed with them, without counting their mistakes, those who can tolerate them. Those who wish to end the suffering of someone without selfishness, unable to bear it. They love all living creatures and want them to prosper. They have no enemies. They may hate others, but they do not hate anyone. They are considered as invincible enemies. Those who have control over their senses and mind.

Those who strive to achieve the work of others. Those who are the best in character are the jewels. Such people are called saints and noble men. They have unwavering devotion to God without desiring any fruit. They do all the works for the pleasure of God. Those who obstruct my worship, even those relatives who keep a distance. Those who left the works that hindered my worship. Those who are happy only by listening to my stories. Those who desire to listen when someone tells their stories and to tell when someone listens. Those who have their minds fixed on me and endure many hardships. They will not have the community in their hearts that this is mine, these are theirs. Those who are free from the defects that arise from the senses experiencing their respective objects. Those who unite with them, those who prevent them from committing such sins. By associating with such virtuous people, one can hear the divine plays and divine qualities of the Lord. Those stories are like nectar to the ears and the mind, they give satisfaction. Because of such taste, the path to salvation is the guru A desire to take refuge arises. It will give knowledge. Devotion to the Lord is the source of all spiritual growth. Thus, after the company of virtuous people, from the beginning, until constantly remembering with love, the mind remains steadfast without going to other matters. Then they saw any substance, saying that I am the creator, I am the protector. They will recognize that I am inside and that I am appointing myself. Therefore, by going into the mind, remembering him continuously will give devotion. Then they practice the path which is not achieved by Bhakti Yoga. Then they will receive me with devotion. Before devotion, the aggravation caused by the manifestation of the qualities of Sattva, Rajas, and Tamas diminishes. One should take food that enhances the quality of sattva. By that, knowledge and detachment will be attained. He who is devoted to him, having devotion, will realize his own form, and will be self-aware.

Devahuti Kapiludu, having heard the collection of means of liberation, is asking thus to understand it in detail. How should devotion be in order to attain liberation? I, who am afflicted by the three sufferings, how can I attain Your form, which is the form of unceasing bliss, through devotion? The goal that is called God, like an arrow aimed and shot, isn't devotion like that? How should it be? What are its limbs? By which limbs is the means to attain the Supreme Being established? Is it devotion? I am a fool. It is very difficult to know. You must make me feel comfortable, as if I don't know. In this way, when the mother asks, with the love for the mother, I am explaining the form of devotion to you, which is like a lamp. Before devotion arises, it is necessary for the senses that perceive sound and other objects, and the organs of action that are capable of performing the prescribed actions of the Vedas, to be situated in the pure, virtuous form of the divine. It should not be done with the desire for a benefit. Listening, singing, remembering, and thus, the divine nature of the Lord, who is predominated by the quality of goodness Mangala Vigraha is to be worshipped. Thus, when all the activities of the senses proceed as divine, that devotion, from ancient times, as the soul's attachment, taking into the inner self, like the digestive fire burning the food, it digests the forms of merit and sin, the smells of karma. Some are interested in serving my feet, keeping the entire universe in me, listening to my auspicious qualities, rejoicing, and even giving up that joy to attain the union with God. They meditate on the forms that can display my beautiful and divine desires. They tell the stories that made me sit. It is the ultimate goal for them. They also do not ask for salvation. They will be delighted to serve my smile, my sweet speech, which is filled with pleasures worth seeing. Such devotion, even if they do not desire it, as soon as their past karmas are completely exhausted, the path of Archara.

It makes you reach the end with a share. They do not desire the liberation that is the form of divine wealth. Furthermore, there is no need to say that such devotees do not desire the powers of the unmanifest and the powers of the unmanifest, but the glory in the worlds that exist up to the Brahmaloka. The world I live in is a peaceful one. It is pure Sattva. Those who are there will experience me. That experience will never be without them. The cycle of time has never touched that world. I will be there to take care of them like a loving parent. He will be trustworthy like a friend, worthy of worship. They worship me with all their hearts. I, who am satisfied by their worship, can fully impart my experience to them and make them not fall away from it again. Those who have unwavering devotion do not desire anything else but to worship me. For them, this world and the heavens above are also worthless. In this world, they do not respect even the body that is used to perform actions appropriate for attaining pleasures in the higher world. Without pride in the body They are there. The offspring, wife, wealth, cattle, and house related to that body. And they do not even respect him. They worship me with unwavering devotion, considering me as a benefactor and a guru, in every way. Thus, I myself will help those who worship me to cross this world. I am a different kind of user than nature, with different needs. Being in all, wearing and adorning, having all the virtues of auspiciousness, serving others does not alleviate the intense fear of worldly life. The gods, including Vayu and Indra, obey my commands. They are all part of the living organism. And they do as I command. I have fear, therefore the wind always blows. The sun is scorching, Indra is raining, fire is burning, even death is wandering near me out of fear.

Those who have intense devotion and yoga, through devotion combined with knowledge and detachment, will reach the base of my feet and be blessed. They have no fear of anything. This is the essence of all sciences, without any other desire. The devotion that is established in the heart, which is not released in the middle, is the means to attain liberation. No other than this. And in the front part, we call it Kapila Geeta. We will learn later what they are explaining. By listening to this again and understanding it, we will get a good meaning. Prayer for listening. Jai Srimannarayana. Salutations to the Guru