Complex ముఖద్వార నిరూపణ - పురంజనుని ప్రమదా దివ్య రూపము
Puranjana's Search for a Kingdom & Entry into Nine-Gate City
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, పురంజనుడు తనకు తగిన రాజ్యం కోసం భూమిపై అన్వేషిస్తూ అనేక ప్రదేశాలు సందర్శిస్తాడు. చివరకు అతడు తొమ్మిది ద్వారాలు కలిగిన అద్భుతమైన పురాన్ని చూస్తాడు, ఇది మానవ దేహానికి గొప్ప ఆధ్యాత్మిక రూపకంగా వర్ణించబడింది. అక్కడ అతనికి దివ్య సౌందర్యంతో విరాజిల్లే ఒక అపూర్వమైన స్త్రీ కనిపిస్తుంది, ఆమె రూప లావణ్యం పురంజనుని మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది. నారద మహర్షి చెప్పిన ఈ రూపక కథ, జీవాత్మ ఇంద్రియ బంధనాల్లో చిక్కుకుపోయే తీరును మనకు స్పష్టంగా బోధిస్తుంది.
In this profound episode of Srimad Bhagavatham Canto 4, the allegorical story of King Puranjana unfolds as he wanders the earth in search of a suitable kingdom to reign over. Unable to find a satisfying dwelling despite visiting countless places, Puranjana eventually discovers the magnificent nine-gated city, a deeply symbolic representation of the human body with its nine openings. There he encounters a breathtakingly beautiful woman of divine form, whose grace and splendor captivate him entirely, drawing him into the cycle of worldly attachment. This timeless allegory, narrated by the great sage Narada, invites us to reflect on the soul's journey through material existence and its entanglement with the senses.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో హిరణ్య గర్భాయ ప్రాణాయ జగతాత్మనే యోగైశ్వర్య శరీరాయ నమస్తే యోగ హేతవే జగత్తు రూపముగా వెలిగిన ఓ శ్రీహరి తేజోమయుడవగు నీవే సమిష్టి బుద్ధిశక్తి క్రియాశక్తుల రూపముగానున్నావు నీవు యోగ ప్రవర్తకుడవు మాత్రమే కాక యోగము మరియు దాని సిద్దులు నీ శరీరమే. నీకు అనేక నమస్కారములు. ఎయిత్ క్యాంటో. 16th చాప్టర్, 33rd ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధములో 30వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానంలో పురంజనుడి యొక్క కథను మనం తెలుసుకున్నాం. ఈ పురాణ కథకి అంతర్గతంగా ఉన్నటువంటి తత్వార్ధాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం, శ్రద్ధగా విందాం. రంజనోపాఖ్యానము ప్రాచీన బర్హికి నారదునిచే చెప్పబడినది. ఇందు అతనికి ఆధ్యాత్మోపదేశము చేయబడినది. దేహాత్మాభిమానముతో నేను స్వతంత్రుడనని అనుకొనుచు తనకు తత్వము, హితము, పురుషార్థము తెలియునవి. తెలియని అహంకరిచ్చడి సంసారి జీవునకు హఠాత్తుగా తత్వోపదేశము చేసినచో మనసుకు ఎక్కదు. అందుచే సంసారులకు తెలిసినది స్త్రీ పురుష సంబంధం సాంసారిక ప్రవృత్తి కదా అందుకే. దానిలో ఇమిడ్చి తత్వోపదేశమును చేయుచున్నాడు. ఇచ్చట జీవుడే పురంజనుడు. జీవునకు శరీరము వాడు వెనక జన్మలలో ఆచరించిన కర్మలచే లభించును. అందుచే పురమును జనింపచేయువాడు అనగా కలిగించుకొనువాడు పురంజనుడు. జీవుడే తన కర్మలచే ఆ కర్మలకు తగిన శరీరమును సర్వేశ్వరుడు నిర్మించునట్టు చేయును. కనుక జీవుడే పురంజనుడు. శరీరమే పురము. ఇతనికి మిత్రుడు అవిజ్ఞాతుడని పేరు కలవాడు. అవిజ్ఞాతుడు అనగా ఎవరి చేతను ఎరుంగబడనివాడు. అతడే భగవానుడు.
అతడు జీవునకు మిత్రుడు. అతని వ్యాపారములు అందరకు సప్రసిద్ధములు. సృష్టి స్థితి లయములు అతడు చేసే వ్యాపారములు. భగవానుడు ఎవరికినీ గోచరుడు కాడు కానీ అతడు చేసే జగత్ సృష్ట్యాదులు అందరకు తెలుసు కనుక అవిజ్ఞాతుడు. విజ్ఞాత చేష్టితుడు. పురంజనుడు ఒకనాడు తనకు తగిన పురమునకై వెతుకుచు భూమండలమంతయు పరిభ్రమించుచుండెను. జీవునకు పరమాత్మకు మిత్రత్వం ఉన్నదని ఉపనిషత్తు చెప్పినది. దాసుపర్ణాసుజా దాసుపర్ణాసయుజాసఖాయ అని అట్లే. భ్రాతా పితా నివాస శరణం సుహృత్ నారాయణః అని ఉపనిషత్తు చెప్పినది. అందుచే జీవునకు మిత్రుడు అవిజ్ఞాతుడు అనిడి భగవానుడే సహస్ర నామములలో అవిజ్ఞాత అని భావం భగవానునకు నామం ఉన్నది. అతడు మనలో అన్నింటిలో ఉండియు వేనిలో ఉండెను వానికి తెలియకుండును. కనుక అతడు అవిజ్ఞాతుడు. అతడు చేయు జగత్ వ్యాపారం అందరికీ తెలియనదే. కనుక అతడు విజ్ఞాత చేష్టితుడు. అట్టి భగవానుడు మిత్రుడుగా గల జీవుడు తనకొక పురమును కల్పింప చేసుకొనుటకు ప్రవర్తించుచున్నాడు. అతడు ప్రవర్తించుటయే కర్మ. ఆ కర్మచే లభించునదే శరీరము. జీవుడు పరమాత్మతో విడుబడి ఉండడు. కానీ అతనిని గుర్తింపజాలడు. తాను ఎన్నో శరీరములలో ప్రవేశించుచు కర్మ చేయుచుండును. అది ఏ పురంజనుడు లోకమంతయు తిరుగుట. అనురూపమొగు పురమున అతనికి లేదు. అతని మనసు చెడును. లోకములో ఉన్న పట్టణములన్నియు చూచెను. కానీ అతనికి ఒక్కొక్క కారణముచే ఒక్కొక్క పురము నచ్చలేదు. సర్వ విషయ భోగమును అనుభవింపదగిన శరీరమును పొందవలెనని కాంక్షించెను. వృక్షాది శరీరములలో శరీరము ఉన్నను మనసు ఉండదు. పశుపక్షాది శరీరములలో మనసు ఉన్నను బుద్ధి ఉండదు. వాక్కు ఉండదు. అట్లే అనుభవింపదగిన విషయములు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు అనుభవించే శక్తి అన్ని శరీరములకు ఉండదు. ఒక్క మనుష్య శరీరమునకే భోగం అనుభవించుటకు, ఆలోచించుటకు, నిశ్చయించుటకు, మాట్లాడటకు తగిన శక్తి ఉన్నది. అట్లు అన్ని వైభవములతో కూడిన పురం మనుష్య శరీరము. హిమోత్ పర్వత దక్షిణ పారస్వమున ఈ శరీరమును లభించును. అదే పురంజనుడు పొందిన శరీరము. భారతదేశంలో మనుష్య శరీరముతో పుట్టుట.
శరీరమనడి పురమునకు తొమ్మిది ద్వారములు, రెండు నేత్రములు, రెండు నాసికా నాళములు, నోరు, రెండు స్తోత్రములు అనే ఏడు ద్వారములు. ఈ శరీరము అనేటి పురమునకు పై భాగమున ఉన్నవి. క్రింది భాగమున మూత్ర ద్వారము, మల ద్వారము అనేటి రెండు ద్వారములు ఉన్నవి. పట్టణములకు ప్రాకారం వలె ఈ శరీరమునకు చర్మము పొరలు ఉన్నవి. పూల తోట వలె కేశములు ఉన్నవి. భుజముల పై భాగము మేడ. లోపల ప్రవహించు రక్తము జలముతో నిండిన అగర్త తొమ్మిది కన్నములే గవాక్షములు రెప్పల తుద వెంట్రికలు తోరణములు బంగారుతో, వెండితో, ఇనుముతో చేయబడిన భవనములు ఉన్నట్లు శరీరములో మూలాధారము మొదలగు ఆరు చక్రములు ఉన్నవి. అవే భవనములు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వెండి, బంగారము ఇనుముగా నిరూపింపబడినవి. మధ్యలో రాజ ప్రసాదము అదే హృదయము. ఆ ప్రాసాదమునందు నవరత్నములతో పొదగబడిన ద్వారము ఉన్నట్లు హృదయమునకు చెంది 101 నాడులు ఉన్నవి. ఆత్మ. ఉండెడి స్థానము హృదయము. కనుక దానిని రాజప్రాసాదముగా వర్ణించిరి. ఈ జీవుని ఆశ్రయించి ఇంద్రియములు ప్రాణములు ఉండును. కనుక హృదయమే సభ్యులు చేరెడి సభాస్థలి. అదియే నాలుగు మార్గముల కూడలి. పరమాత్మ విహరించు స్థలము కనుక అది క్రీడాభూమి. నేత్రములు మున్నగింద్రియములు అంగళ్ళు వాటి నుండి శబ్దాది విషయములను సంపాదించి రాజు అనుభవించుచుండును. హృదయ స్థానము నుండి శిరస్సు వైపు పోయెడి సుషుమ్నా నాడి రాజమార్గము. అది జీవుడు ముక్తికి పోవు మార్గము. జనులందరు విశ్రమించెడి స్థానమును చైతన్యమందురు. అట్లే జీవుడు సుషుప్త వ్యవస్థలో పురీతత్ అనేడి చోట విశ్రమించును. కనుక అది చైత్యము. ఆధార చక్రము మొదలుకొని చక్రములలో ఉన్న కరణికలు, పగడపు అరుగులు, ధ్వజములు, జెండాల వలె చేతులు, పాదములు. ఈ విధముగా పురమునందువలె ఈ శరీరమునందు కూడా అన్నియు అమరి ఉన్నవి. కావున దేహమును పురముగా చెప్పుచున్నారు. ఆ పట్టణమున విహరించుటకు తగిన ఉపవనమున్నది. శరీరమునకు వెలుపల ఉండెడి కూటములు శబ్దములు మున్నగు విషయములు ఇందు ఉపవనముగా వర్ణింపబడినవి.
ఇందు రకరకమునగు చెట్లే సంసారులైన పురుషులు ఆ చెట్లను పెనవేసుకొని అనేకమైన భావములతో నిండి స్త్రీల స్త్రీలతల వలె ఉందురు ఆ స్త్రీ పురుషులు కలిగిన బిడ్డలు పక్షులు వాటి కలకలమే కోలాహలము ప్రియురాంటతో ప్రియులు ఆడెడి ముచ్చటలే పురమునందు వెలుపల ఉండెడి తుమ్మెదల రోద పక్షుల వంటి బిడ్డలు ముద్దు పలుకులే ఆ పురమునందలి పక్షుల కలకలము అరణ్యములో ఉండవలసిన మృగములన్నియు ఈ ఉపవనములో పెంపుడు మృగములుగా ఉండును వ్యాఘ్రములు, సింహములు ఈ ఉపవనమున ఉండును. కానీ ఇవి హింసింపవు, వినోదములు కల్పించుచుండును. అరణ్యములో ఉండు మృగములు ప్రాణములు తీయును. ఉపవనములో ఉన్న మృగములు ప్రాణములు తీయవు. అట్లే ఈ శరిదమనడి పురములో ఉండెడి. అల్లుళ్ళు, మామలు, బావమధువులు మున్నగు వారు హింసింపకుండా వినోదును కల్పించుచు కల్పించుచునే మంచి మాటలతో దోచుకొనెడు మృగములు. ఈ దారిని పోయెడి బాటసారులు స్త్రీ పురుషులు పిల్లలు పిల్లల అందమైన పలుకులను కలకలమును చూచి లోపలికి ఆహ్వానింపబడినట్లు సంసారం వైపు ఆకర్షింపబడుదురు. ఆ వనమునకు ఒకనాడు ఒక కాంత అనుకొనకుండా వచ్చినది. రాజు చూసినాడు ఆ కాంతయే బుద్ధి. జీవునకు ప్రకృతి పరిణామముగా బుద్ధితో సంబంధం అనుకొనకుండా జరుగునదే కానీ జీవుడు తనంత తాను కల్పించుకొనున్నది కాదు. వెతుకగా వెతుకగా ఈ పట్టణము పురంజనమునకు పురంజనునకు కనబడినది. అనుటచే మనుష్య జన్మ ఎన్నో శరీరములలో తిరిగిన తర్వాత జీవుడు పొందునని సూచించినది. ఆ స్త్రీ వెంట ఉన్న 10 మందియే బుద్ధిని అనుసరించి ప్రవర్తించడి 10 ఇంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటి జ్ఞానేంద్రియములు 5. నోరు, కాలు, చేయి, మూత్రద్వారం, మలద్వారం అనేటి కర్మేంద్రియములు ఐదు బుద్ధిని అనుసరించి ఉందురు. ఇంద్రియ వ్యాపారములు అనంతములుగా ఉండును. అవి నూరును. నూరుగా పరిమితము చేసినచో ఇంద్రియ వ్యాపారములే అనగా వృత్తులే పరిచారికలు. ఆమె వెనుక ఐదు తలల పాము నడిచి వచ్చుతున్నది. అది ఆమెకు రక్షణగా ఉన్నది. అది ఏ ప్రాణము.
ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అని ప్రాణములు ఐదు విధములుగా ఉండును. కనుక ప్రాణమును ఐదు తలల పాముగా వర్ణించిరి. ఈ పాము ఎల్లప్పుడూ జీవుని శరీరములో అనుసరించి ఉండును. బుద్ధి ఏనటి నాయక తనను భరించెడి జీవునకై అన్వేషించుచుండును. బుద్ధి ప్రకృతి యొక్క వికారమే ప్రకృతికి జీవునికి కలిగే సమాగమము దైవికము. ప్రకృతితో సంబంధించని పురుషుడు ఉండడు. పురుషునితో సంబంధించక ప్రకృతి ఉండజాలదు. అందుచే వీరిద్దరిని ప్రేయసీ ప్రియులుగా వర్ణించుచున్నారు. పురుషునితో కలయుటకు మునుపు బుద్ధి కార్యనిర్వహణము నందు సామర్థ్యము లేనిదై ఉండును. బుద్ధియే ఇంద్రియముల ద్వారా భిన్న భిన్న విషయములను అనుభవించి వేరు వేరుగా కనపడుతును. కనుక ఆ నాయికను కామరూపిణి అందురు. బుద్ధివృత్తులు అనేక విధములుగా ఉండును. ఆ వృత్తులని ఆ నాయిక అవయవములుగా ఇందు వర్ణించినారు. ఆమె నాసిక అందముగా ఉండును. కుండలములతో భాసించు చెవులు గలది అనగా శ్రోత్రేంద్రియ వృత్తులు నిరూపింపబడినవి. ఆమె నూపురములతో గల్లు గల్లు మనుచు అందముగా నడుచుట కర్మేంద్రియములతో చేయి వ్యాపారములు. ఈ విధంగా ప్రకృతి వికారము బుద్ధి ఇందు నాయకగా నిరూపింపబడినది. పురంజనుడు ఆమె దగ్గర చేరును. ఆమెచే మోహితుడగును. ఇది ప్రకృతి పురుష సమాగమము. ఆ బుద్ధివృత్తులు మనోవ్యాపారము కలిసి 11 రకములుగా ఇంద్రియముల ద్వారా ప్రసరించును. ఇంద్రియములు 10, మనస్సు 11ను వెంట సంచరించడి మహాభటులు. వారి వెంట ఉండెడి స్త్రీలే బుద్ధివృత్తులు మనోవృత్తులు అతడు దగ్గరకు వచ్చి మాట్లాడుటతో ఆమె పురుషుని వైపు అనగా పురంజనుని వైపు ఆకర్షింపబడి మోహితురాలాయెను. పురుషుడు ప్రకృతికి ప్రకృతి పురుషునకు వశపడి ఉందురు. అప్పుడు ఆ వనిత అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పుచున్నది. నీవు ఎవరి పిల్లవు? నీ స్వరూపమేమి? నీ పేరేమని అడిగిన నాకు నా పేరు తెలియదు. ఇతరుల పేరు తెలియవు అనగా ప్రకృతి జ్ఞానము లేదు కనుక తనను గూర్చిన గాని పురుషుని గూర్చి గాని ఎరుంగదు.
నన్ను సృష్టించిన వారెవరో నేను ఎరుంగను అనగా పరమ పురుషుని కూడా నేను ఎరుగదు. ఇప్పుడు ఇచ్చట ఉన్నానని మాత్రమే నాకు తెలియును. శరీరం ఆత్మతో కలిసినప్పుడే బుద్ధికి తెలివి కలుగును. అంతకు ముందు తెలియదు. అందుచే ఆమె ఇప్పుడు ఇచ్చట ఉన్న నిన్ను తప్ప. వేరొకరిని ఎరుంగనున్నది. మనమిద్దరము కలిసి ఉండుటకు ఈ పురము ఏర్పడి ఉన్నది. ఈ పురమును ఎవరు నిర్మించిరో నాకు తెలియదు. జీవుని యొక్క బుద్ధి ప్రకృతి స్వరూపమును గాని, పురుష స్వరూపమును గాని, వీరిని సృష్టించిన పురుషుని స్వరూపమును గాని స్పష్టముగా ఎరుంగ చాలదు. ఈ మహా భటులు నా మిత్రులు వారి వెంట ఉన్న ఈ స్త్రీలు నా చెలికత్తెలు. ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియ వ్యాపారములు కూడా బుద్ధి అధీనములై ప్రవర్తించుచుండును. నేను పండుకొనినప్పుడు కూడా ఈ సర్పరాజు ఈ పట్టణమును కాపాడుచు మేలుకొని ఉండును. ప్రాణమే నాగరాజు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పని చేయకుండా నిద్రలో ఉండగా కూడా ప్రాణము కదులుచునే ఉండును. నీవు అదృష్టవశమున వచ్చితివి. గ్రామ్య భోగములను అనుభవింప గోరుచున్నావు, తప్పక పొందుదును. ఇంద్రియముల యొక్క సమూహమే గ్రామ్యము. వాటిచి అనుభవింపబడి శబ్ద స్పర్శాది భోగము గ్రామ్య భోగము. పురుషుడు శరీరముతో బుద్ధితో కూడి ఉండి ఇంద్రియములతో భోగమును అనుభవించుచుండును అనునది. ఇక ఇంకను ఆ స్త్రీ ఇటు చెబుచున్నది నీవు ఈ నవద్వారపురమునందు నాతో కలిసి ఉండి నేను సంపాదించి పెట్టిన భోగమును అనుభవించుచు ఈ పట్టణమును పరిపాలింపుము. పురుషుడి శరీరములో 100 సంవత్సరములు విషయ భోగం అనుభవించుచుండును. ఇంకా ఈ తత్వార్ధాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. కొంత భాగము. పురంజనోపాఖ్యానంలో మనకు కథారూపకంగా చెప్పిన దాన్ని తత్వపరంగా అందించడానికి వివరించారు. దాన్ని తీసుకోవడానికి కొంత సమయం ఎక్కువగా పట్టినది. అందరూ కూడా దీన్ని విని అర్థం చేసుకోవాలని భావిస్తూ మరొక పాడ్కాస్ట్ లో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ స్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Hiranyagarbha, the life force, the soul of the universe, the body of yoga and wealth. Salutations to the cause of yoga, you who appeared as the world. You are the radiant Sreehari, who is in the form of the world. You are in the form of collective intellect, energy, and action You are not only a practitioner of yoga, but also your body is the yoga and its fruits. Many salutations to you. The eighth canto. Chapter 16, Prayer 33. Devotees of God, welcome to the 30th podcast in the fourth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, as part of the conversation between Vidura and Maitreya, we have learned the story of Puranjuna in the Puranjuna's anecdote. Let us learn the philosophical meaning of this ancient story today, let us listen carefully. The Ranganopakhyana was composed by Narada in the ancient times. Indu was given spiritual guidance. With self-conceit, I think I am independent, and I know the essence, well-being, and purpose of things. If a person who is unknown and arrogant suddenly imparts the essence of truth to a worldly being, it will not be accepted by the mind. Therefore, for the family It is known that it is a male-female relationship, a social tendency, that's why. In it, he is imparting the essence of philosophy. The one who gave is Puranjana. The body of a living being is obtained by the karmas performed in past lives. Therefore, the one who gives birth to a city, that is, the one who causes it to be, is Puranjunudu. The living being, through his actions, makes the body suitable for those actions, as the Lord God creates it. The living being is Puranjana. The body is the city. He has a friend who is called Avignat. An anonymous person is someone who is not known to anyone. He is God.
He is a friend to life. His businesses are well known to everyone. The creation, preservation, and destruction are the actions he performs. God is not visible to anyone, but since everyone knows the creation of the world that he does, he is invisible. The familiar. Puranjunudu once wandered the earth in search of a suitable city for himself. The Upanishads say that there is friendship between the individual soul and the Supreme Soul. Dasuparnasayuja dasuparnasayujaasa khaya ante alaage. The Upanishads say that the abode of a brother, father, and son is Narayana. Therefore, the Lord is the friend of the living being, and the unknowable is the Lord. In the thousand names, the Lord has the feeling of being unknowable. He is in all of us, yet he is in none. So he is a closeted racist. The world business he does is not known to everyone. So he is a know-it-all. Such a being, who is a friend of the Lord, is acting to create a city for himself. His behavior is his karma. The body is the result of karma. The soul is separated from the Supreme Soul He doesn"t exist. But he can"t be recognized. He enters many bodies and performs actions. That is the Puranjunudu who roams the whole world. He has no city to compare to it. He's corrupt at heart. He saw all the cities that were in the world. But he didn't like each town for one reason or another. He desired to obtain a body that would allow him to experience all pleasures. In plants and other bodies, although there is a body, there is no mind. In the bodies of animals and birds, although there is mind, there is no intellect. There will be no speech. Similarly, not all bodies have the power to experience sound, touch, form, taste, and smell. Only a human body has the power to experience pleasure, to think, to decide, and to speak. Thus, a city full of all glories is a human body. This body is found in the southern hemisphere of the Himavat mountain. That is the body that Puranjana obtained. Born in the United States of India, male.
The body has nine gates, two eyes, two nasal passages, mouth, and two stomata, making a total of seven gates. This body is located on the upper part of the city. The lower part has two openings, the urinary opening and the anus. Like the walls of a city, this body has layers of skin. Hair is like a garden. The upper part of the shoulders. Inside, the flowing blood is filled with water, and the nine eyes are the windows, the eyelids are the eyebrows, and the structures are made of gold, silver, and iron, just as there are six chakras in the body, starting with the Muladhara. The same buildings. The qualities of Sattva, Rajo, and Tamo are proven to be silver, gold, and iron. The royal palace in the middle is the heart. In that palace, there is a door adorned with nine jewels, and the heart has 101 nadis. The soul. The place where it resides is the heart. Therefore, it was described as a royal palace. The senses and life force reside in this organism. Therefore, the heart is the meeting place where members gather. It is the junction of the four routes. It is a playground where the Supreme Being is present. Eyes, nose, ears, and other senses, from which the king experiences sounds and other things. The Sushumna Nadi is the royal path that goes from the heart to the head. That is the path to liberation for the living being. All the people will be in a place where they rest, in consciousness. Similarly, the living being rests in the Sushupta system, at the place called Puritat. So that is the Chaitya. Starting from the base wheel, the spokes, the spokes, the coral-like structures, the flags, hands, and feet like flags. In this way, just as in the city, everything is also arranged in this body. Therefore, they are calling the body a city. There is a suitable grove for strolling in that town. The assemblies, sounds, and other things that are outside the body are described as the forest here.
In this, various kinds of trees, men who are family, embracing those trees, filled with many emotions, like the women's breasts, those women and men, the children born of them, birds, their playfulness, the noise, with the beloved, the beloved playing The pleasantness, the town, the outside, the thumping, the roaring birds, like children, the affectionate words, the chirping of the birds in that town, all the animals that should be in the forest, in this sub-garden, will be domestic animals, tigers, The lions will be in this enclosure. But these do not inflict violence, they provide entertainment. The animals that live in the forest will take lives. Animals in the forest do not take lives during the Upanayana. Similarly, in this Sharidamanadi Puram. Sisters-in-law, uncles, brothers-in-law, and others, without causing harm, while providing entertainment, are like animals that steal with good words. Those who go on this path, men, women, and children, seeing the beautiful words and chatter of the children, are invited inside and attracted towards family life. One day, a woman came to the forest without thinking. Raju He saw that woman's intelligence. It is something that happens without the connection of intellect as a natural consequence of life, but the life itself is not something that is created by itself. Searching and searching, this town appeared to Puranjananu. It is said that after a human being has wandered through many bodies, the soul reaches the end. Those 10 senses that are with that woman, do not act according to wisdom. Eye, nose, ear, tongue, skin are the five sense organs. The mouth, leg, hand, urinary tract, and anus are the five organs of action, following the five intellects. The business of the senses is infinite. They are 100%. If it is limited to one hundred, then the senses are the business, that is, the professions are the maids. She was walking around five headed snake. It's her protection. It's a life.
Prana, Apana, Vyana, Samana, Udana, thus the five pranas are of five types. Therefore, they described life as a five-headed snake. This snake always remains following the body of the prey. The intellect searches for the being that bears it. The distortion of the intellect is the union that occurs between nature and the individual. There is no man who is not connected to nature. Nature cannot exist without a male. Therefore, they are described as lovers. Before uniting with a man, the intellect is incompetent in the performance of actions. The intellect, through the senses, experiences different things and appears differently. Therefore, that heroine is called a Kamarupini. The intellects are of many kinds. The actors are described as the limbs of the heroine. She has a beautiful nose. It is said that it has ears that shine with earrings, meaning that the auditory senses are proven. She walks beautifully, making a rustling sound with her anklets, and does business with her hands and senses. In this way, nature's distortion is proven to be the hero of intellect. Puranjaneya will reach out to her. He'll be seduced by her. It is the confluence of nature and man. Those intellects, along with the mental activity, are manifested through the senses in 11 ways. The senses are 10, and the mind is 11, wandering along, great warriors. The women who were with them, their intellects, their mental states, as he came closer and spoke, she was attracted towards the man, that is, towards Puranjunudu, and became enchanted. The male is subject to nature, the female is subject to nature. Then that woman was answering the questions he asked. Whose child are you? What is your form? You started questioning me about my name, and I didn't know it. Others' names are not known, meaning there is no knowledge of nature, therefore, one does not know about oneself or about men.
I do not know who created me, and I do not know the Supreme Being. I only know that I am here now. It is only when the body is united with the soul that the intellect is enriched. I didn't know that before. Therefore, except for you who are here now. I'm going to get someone else. This town was established for the two of us to live together. I don't know who built this town. It is not enough to clearly understand the nature of the intellect of a living being, or the nature of the male, or the nature of the male who created them. These great warriors are my friends, and these women who are with them are my maids. The senses, mind, and the functions of the senses are also governed by the intellect. Even when I am asleep, this serpent king protects this city and stays awake. Life is Nagaraju. Even while sleeping without the senses, mind and intellect working, the life force keeps moving. You have come to the right place. You wish to experience rural pleasures, I will surely get it. Gramya is the collective term for the senses. Those are experienced, sound, touch, etc., enjoyments, rural enjoyments. The man, being with the body and mind, experiences pleasure with the senses, that is what it is. And now that woman is saying this: You, stay with me in this Navadwarapuram, enjoy the pleasures I have earned and provided, and rule this city. In a man's body, he experiences sensual pleasures for 100 years. We will learn about this philosophical meaning later. Some portion of it. In the Puranic narrative, what is told to us in the form of a story is explained to be presented in a philosophical manner. It took me a long time before I could take it. Hoping everyone is along for the ride and listening along. Jai Srimannarayana. Salutations to the revered gurus