కపిల ఆవిర్భావము & సాంఖ్య యోగము (Parts 35-44)

Lord Kapila Advent & Sankhya Disquisition (Parts 35-44)

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, దేవహూతి మరియు కర్దమ మహర్షి పుత్రుడుగా అవతరించిన భగవాన్ కపిలుని దివ్యమైన ఆవిర్భావం వర్ణించబడింది. కర్దమ మహర్షి వనవాసానికి వెళ్ళిన అనంతరం, భగవాన్ కపిలుడు తన తల్లి దేవహూతికి సాంఖ్య యోగముయొక్క అమూల్యమైన జ్ఞానాన్ని అనుగ్రహించారు. ప్రకృతి గుణాలలో చిక్కుకున్న జీవాత్మ ఏ విధంగా మోక్షమును పొందగలదో, భక్తి మరియు జ్ఞానముల సమన్వయం ద్వారా ఆచరణీయమైన మార్గం ఈ భాగంలో సవివరంగా తెలుపబడింది.

This sacred episode from Canto 3 of Srimad Bhagavatham explores the divine advent of Lord Kapila, the incarnation of the Supreme Lord who descended as the son of Devahuti and Kardama Muni to restore the ancient wisdom of Sankhya philosophy. After the departure of Kardama Muni to the forest, Lord Kapila compassionately imparts the profound teachings of Sankhya Yoga to His devoted mother Devahuti, illuminating the nature of the soul, material existence, and the path to liberation. These timeless instructions reveal how the conditioned soul becomes entangled in the modes of nature and how sincere devotion and discriminative knowledge together lead to ultimate liberation.

← Prev Next →
Lord Kapila Advent & Sankhya Disquisition (Parts 35-44) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యదోపరామో మనసో నామ రూపా రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచి సద్మనే నమః ఇంద్రే వ్యాపారములను మననాది వ్యాపారములను కూడా కట్టిపెట్టినప్పుడు నామ రూపములను తెలుసుకుంటూ ఉండే మనస్సు తన స్వరూపమునందు విలీనమగును. అప్పుడు జీవుడు తన స్వరూపమగు అద్వితీయ ఆత్మయందు నిలిచి ఉండును. ఈ విధంగా జీవుడు ఆ ఈశ్వరుని ఆత్మ రూపముగా పొందగలుగును. ఆ విధంగా శుద్ధమగు అంతఃకరణములో ఆత్మరూపకంగా ప్రవేశించే ప్రకాశించే సర్వజ్ఞుడగు ఈశ్వరుని కొరకు నమస్కారము. సిక్స్త్ క్యాంటో, ఫోర్త్ చాప్టర్, 26th ప్రేయర్. భగవంతులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధం 35వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిలుడు. దేవహూతికి అంటే తన తల్లికి బోధిస్తున్నటువంటి జ్ఞానం మనం అనుభవిస్తున్నాం. ఇంతవరకు తన్మాత్రల గురించి, సృష్టి గురించి ఈ ఇంద్రియాలు వారి అతిష్ఠాన దేవతలు విషయాలని కూడా మనం అనుభవించాం. ఈ విషయాలని తిరిగి వినాలనుకొని అనుకునేవారు 32వ పాడ్కాస్ట్ నుంచి మొదలు పెట్టుకొని వింటే కపిలగీత పూర్తిగా అర్థమవుతుంది. పరమ పురుషుడు కాలము కర్మ అనగా జీవాదృష్టము. సత్వము, రజస్సు, తమస్సు అని వాటితో కూడిన ఈ మహత్తు మొదలు పృథ్వి వరకు ఉన్న తత్వములలో తాను ఆవేశించి వానిని ఒకదానితో ఒకటి కలిగినట్లు చేసెను. ఈశ్వరుడు ఆ తత్వములలో ప్రవేశించిన తరువాత ఈ తత్వములు సంహతములు సమాగతములు ఆయను. అనగా ఒకదానితో ఒకటి వేరుగా ఉండుటకు తగి ఉండి మొదట కలియును.

దీనిని సంహతత్వమందురు. మరల వేరుగా చేయుటకు వీలు కాకుండా తరువాత కలిసిపోయును. దానిని సమాగతత్వమందురు. ఈశ్వరుడు లోన ప్రవేశించి ఈ భూతములను సంహతములను సమాగతములను చేసెను. అది ముందు ఒక అండముగా ఏర్పడెను. ఆ అండమున చైతన్యము గల పురుషుడు చేరెను. దాని నుండి విరాట్ పురుషుడు అనగా సకల శరీరములందు ఉండెడి పురుషులందరి మొత్తముగు సమిష్టి పురుషుడు లేచెను. ఈ అండమునకు ఒకదానికి ఒకటి పది రెట్లు ఉండునట్లు జలము మొదలగు ఆవరణములు ఏర్పడెను. పంచభూతములు, అహంకారము, బుద్ధి అనేడి ఏడును ఈ అండమునకు ఆవరణములై ఉండెను. ఈ అండమునందే దేవలోకములు, మనుష్య లోకములు ఏర్పడినవి. ఇది అంతయు భగవానుడగు శ్రీహరి రూపము అనగా శరీరము. ఈ సమిష్టి శరీరముగా ఉండి బంగారం వలె ప్రకాశించెడి అండకోశము నుండి ఆవిర్భవించిన పురుషుడే చతుర్ముఖుడు. ఈ అండకోశమునందు ఆవిర్భవించిన ఆ చతుర్ముఖుని యందు అనిరుద్ధ రూపమున ఉన్న భగవానుడు ఆవేశించి ఉండెను. దానిచే ఆ చతుర్ముఖుడు సృష్టి చేయుటకు సిద్ధపడెను. చతుర్ముఖ శరీరమే సమిష్టి శరీరము. ఆ శరీరమందరి ఇంద్రియములే వ్యష్టి అనగా ప్రాణికోటి యొక్క సకల శరీరములో ఉండెడి ఇంద్రియములుగా భగవానుడు ఏర్పరిచెను. చతుర్ముఖ బ్రహ్మ శరీరము సమిష్టి శరీరము. ఆ సమిష్టి శరీరము యొక్క ముఖము నుండి దేవ మనుష్యాది శరీరముల వ్యష్టి ముఖము ఏర్పడెను. ఇదే మాట పలికెడిది. అది వాగింద్రియం. వాగింద్రియమునకు అధిష్టాన దేవత అగ్ని. తరువాత సమిష్టి శరీరము యొక్క నాసాభిలమున నుండి వ్యష్టి శరీరము యొక్క నాసికా ఇంద్రియము ఏర్పడెను. అదే ఘ్రానేంద్రియమునకు స్థానము.

ఆ ఘ్రానేంద్రియమునకు ప్రాణము అధిష్టాన దేవత. అనగా వాయువు అధిష్టాన దేవత. సమిష్టి శరీరము నేత్రముల నుండి వెస్ట్నేత్రములు ఏర్పడెను. నేత్రములందు చక్షువు అని ఇంద్రియముండును. వాటికి సూర్యుడు అధిష్టాన దేవత. శ్రవణ గోళములయందు శ్రోత్రేంద్రియములు ఏర్పడెను. శ్రోత్రేంద్రియమునకు దిక్కులు అధిష్టాన దేవత. సమిష్టి పురుషుని చర్మము, వెంట్రుకలు మొదలగు వాని నుండి వ్యష్టి చర్మాదులు ఏర్పడెను. త్వక్ ఇంద్రియమునకు అధిష్టాన దేవత ఔషధులు. తరువాత జననేంద్రియము. ఆ జననేంద్రియమునకు అధిష్టాన దేవత జలములు. తరువాత మలద్వారము. దానియందు పాయువు అనడి ఇంద్రియము ఏర్పడెను. అపానము అపానము కంటే పిదప జనులకు భయమును కలిగించు మృత్యువు పుట్టెను. తరువాత హస్తములు దాని అధిష్టాన దేవత ఇంద్రుడు. తరువాత కర్మేంద్రియములలో పాదములు ఏర్పడెను. ఆ పాదేంద్రియమునకు అధిష్టాన దేవత హరి అనగా ఉపేంద్రుడు. తరువాత నాడులు ఏర్పడెను. ఆ నాడులు ద్రవముతో నిండి ఉండును. వాటికి నదులు అధిష్టాన దేవత. తరువాత ఉదరము ఏర్పడెను. దానియందు ఆకలి దప్పులు కలుగుచుండును. వీనికి సముద్రుడు అధిష్టాన దేవత. తరువాత హృదయం బయలు వెడలెను. హృదయము నుండి మనస్సు అనేటి ఇంద్రియం ఆవిర్భవించెను. దీనికి అధిష్టాన దేవత చంద్రుడు. హృదయము నుండి ఏ బుద్ధి ఏర్పడెను? దానికి రుద్రుడు దేవత. హృదయము నుండి ఏ చిత్తము ఏర్పడెను? చిత్తమును అభిమానించు దేవత చైత్యుడు. అనగా క్షేత్రజ్ఞుడు, జీవాత్మ. ఈ విధంగా సమిష్టి చతుర్ముఖ శైలమందలి ఇంద్రియముల నుండి తదధిష్టాన దేవతల నుండి వ్యష్టీంద్రియములు అభిమాన దేవతలు ఏర్పడినవి. ఇన్ని ఏర్పడినను శరీరము కదలకుండెను. ఆ ఇంద్రియములు గాని ఆ మహా భూతములు గాని కదలిక లేనివి. అప్పుడు ఈ శరీరములో ఆయా ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఆ ఇంద్రియములలో ప్రవేశించెను.

అప్పుడు వానిలో ప్రవృత్తులు కలిగెను. వన్హి అనగా అగ్ని. వాగింద్రియము ద్వారా ముఖమును చేరెను. ఘ్రానేంద్రియము ద్వారా నాసికా రంధముల యందు వాయువు ప్రవేశించెను. చక్షురేంద్రియము ద్వారా నేత్ర గోళములలో సూర్యుడు ప్రవేశించెను. శ్రోత్రి ఇంద్రియము ద్వారా కర్ణ రంధ్రములో దిక్కులు ప్రవేశించెను. త్వకింద్రియము ద్వారా రోమాదుల యందు ఔషధులు ప్రవేశించెను. రేతస్సు ద్వారా జలములు శిష్ణమున ప్రవేశించెను. అపానము ద్వారా మృత్యువు గుదమున ప్రవేశించెను. గమనము ద్వారా విష్ణువు చరణములలో ప్రవేశించెను. ఇంద్రుడు హస్తములలో ప్రవేశించెను. నదులు నాడులలో ప్రవేశించెను. హృదయమునందు ఆయా వ్యాపారములకు అధిష్టాన దేవతయగు చంద్ర, బ్రహ్మ, రుద్ర, చైత్యులు ప్రవేశించిరి. ఈ చైత్యుడే క్షేత్రజ్ఞుడు అనబడెడి ఆత్మ. ఈ ఆత్మ ప్రవేశించినంతవరకు మిగిలిన అందరూ ప్రవేశించినను ఆ సమిష్టి పురుషుని శరీరము జలములలో పరుండి ఉండునే గాని అది కదలకపోయెను. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే ఆ విరాట్ పురుషుడు ఆ నీటి నుండి లేచెను. పురుషుడు నిద్రపోవుచున్నప్పుడు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఉన్నను ఆ శరీరము కదలదు. అందుండు క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ ఆ శరీరమందు మేల్కొని సంకల్పించిన నాడే శరీరము కదలుటకు సిద్ధమగును. ఆ శరీరమందుండు క్షేత్రజ్ఞుడు శరీరమందు ప్రవేశించినప్పుడు పరమాత్మ ఆత్మగా ఉండి వాని శరీరమున ప్రవేశించును. అందుచేత ఆ శరీరమునందలి సకల ప్రవృత్తులకు మూలము క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ. అతనినే ప్రత్యగాత్మ అందురు. తత్వజ్ఞానమును సాధించెడి వారు ఈ శరీరములో శరీరము కంటే, బుద్ధి కంటే, ఇంద్రియము కంటే, ప్రాణాదుల కంటే వేరైన పరిశుద్ధ స్వరూపుడగు ఆత్మ స్వరూపమునందు ముందు మనసులో ధ్యానించవలెను. ఆ ఆత్మ యందు ఆత్మగా పరమాత్మ ఉండును. కనుక ఆ పరమాత్మ యందు భక్తితో శరీరముతో చేయు కర్మలాచరించు కర్మలాచరించుచు

ప్రత్యేకాత్మ యొక్క యధార్థ జ్ఞానమును కలిగి ఉండి శరీరము కంటే వేరైన ఆత్మకు ఆత్మను భావింపవలెను. శరీరములో నుండు జీవుడు దేహములోనే ఉన్నను ప్రకృతి సంబంధం చే కలుగు దేవత్వ మనుష్యత్వము మొదలగు ధర్మములలో ధర్మములతో సత్వరజస్తమస్సులచే కలుగు సుఖదుఃఖములతో సంబంధము సహజముగా లేనివాడే ఉండును. జీవునకు దేవ మనుష్యాది వికారములు లేవు. నడుచుట మొదలగు బాహ్యమగు వ్యాపారములకు అతడు ఆశ్రయము కాడు. సత్వాది గుణములతో సంబంధము లేనివాడు. నీటిలో ప్రతిబింబించు సూర్యుడు నీటి యందున్నను ఆ జలముల యందుండు చిన్నతనము గాని పెద్దతనము గాని కదలిక గాని ఆ సూర్య ప్రతిబింబమునకు అంటదు. అచట సూర్యుడు దూరముగా ఉన్నాడు. నీటిలో కనిపించునది ఆ సూర్యుడు కాదు, ఆ సూర్యుని ప్రతిబింబం. అందుచే ఆ నీటిలో కలుగు మార్పులు సూర్యునిలో కలగవు. ఆకాశము ఘటమందు ఉండును. సూర్యుడు నీటిలో ఉండడు కానీ ఆకాశములో ఉండును. వాస్తవముగా ఉన్నను చిన్నదానిలో ఉన్న ఆకాశమునకు చిన్నతనము, పెద్దవానిలో ఉన్న ఆకాశమునకు పెద్దతనము అంటవు. ఆ ఆకాశమునకు ఈ మార్పులు అంటడి స్వభావము లేదు. స్వభావముచే భిన్నమైనది కనుక ఆకాశమునకు ఎట్లు అంటవో అట్లే దేవ తిరియక్ మనుష్య శరీరములలో జీవుడు ఉన్నను. జీవునకు ఆకాశమునకు వలె దోషములు అంటడి స్వభావము లేదు. కనుక దోషములు అంటవు. నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు నీరు కదలుటచే కదలుచున్నట్లు కనబడుట వాస్తవము కాదు. ఆ కదలిక జలములదే. కానీ సూర్యుడు కదలుచున్నాడనే భ్రాంతిచే అనుకొందురు. అట్లే శరీరమే నడుచుండును. శరీరమే మనుష్యుడు, దేవుడు అనురూపములను పొందుచుండును. కానీ ఆత్మ కదలదు. ఆత్మకు రూపము లేదు. శరీరమే ఆత్మానుభ్రాంతి కలగగానే ఆ నీటి యొక్క కదలిక సూర్యబింబమునందు ఉన్నది అనుకొనునట్లు శరీరం యొక్క ధర్మములు ఆత్మ యందున్నవిని భ్రాంతిచే అనుకొనుచున్నారు.

దేహ సంబంధము గాని, సాంసారిక ప్రవృత్తులలో కర్తృత్వము గాని, సుఖ దుఃఖ అనుభవం గాని, సహజముగా లేని ఆత్మ ప్రకృతి కంటే భిన్నమైన స్వభావము గలదైనను, దేహమే నేను అనే అభిమానముచే ఆత్మ స్వరూపం మరుగుపడును. అప్పుడు జీవుడు శబ్దాది గుణములయందు ఆసక్తి గలవాడగును. శరీరము చేయుచున్నదని మరిచి నేను చేయుచున్నానని అనుకొనును. నేను స్వతంత్రుడను అని అనుకొనును. జీవుడు స్వతంత్రుడు కాదు. కర్మ పరతంతుడు కానీ శరీరమే నేను అనుకుట చేతను ప్రకృతి సంబంధము చే కర్మలచే కలగడి పాప పుణ్యములు వానిచే భిన్న భిన్న యోనులలో పుట్టుట దానిచే సంసారమును పొందుచున్నాడు. దానికి అంతకు కారణం మనసులో కలిగిన విమానమే అనగా భావనమే. ఆత్మకు దేవత్వము మనుష్యత్వము లేకపోయినను శబ్దాది విషయములను ధ్యానించుచుండుటచే జన్మ మృత్యు పరంపరా రూపముకు సంసారము నిర్వర్తించదు. సంసారమే అనర్థము. స్వప్నములో శరీరములు తాను కానని తెలియును. కానీ స్వప్నములో వేరు వేరు శరీరములతో రకరకములగు విషయములను భావించి సుఖములను దుఃఖములను అనుభవించుచుందుము. స్వప్నములో దేహములు తాను కాకపోయినను విషయానుభవముచే ఎట్లు సుఖదుఃఖానుభవం కలుగుచున్నదో అట్లే జాగరణ దశలో కూడా కలుగును. అందువలన అనర్థములకు మూలము మనస్సు ప్రకృతి వికారములకు ఇంద్రియములు. శబ్దాది విషయములందు తగులుకొని ప్రవర్తించుచుండగా మనస్సు దానిని అనుసరించి అనర్థములు తెచ్చుకొనుచున్నది. మనస్సు ఇంద్రియముల వెంట విషయముల వైపు పోకుండా భగవాని యందు వశపరుచుకొనుటకు భక్తి సాధనము. మరి ఈ భక్తి మార్గంలో మనసు మారాలన్నా మనసు అటువైపు మరలాలంటే ఏం చేయాలి ఆ ప్రక్రియ ఏమిటి అనేది మనము ముందు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. Whatever is beyond my mind, that is my form. By the power of memory, by the power of sight, by the power of thought, that which is created, by that alone, in my own organization, I bow to that pure and good one. To Indra, to the business of speech, to the business of thought, also When bound, the mind that is aware of names and forms merges into its own form. Then the being will be in its own unique soul. In this way, the being can attain the form of the soul of that God. In that way, salutations to the all-knowing God, who shines and enters into the pure inner self in the form of the soul. Sixth Canto, Fourth Chapter, 26th Prayer. Oh Gods, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 35th podcast. Kapila as a part of Vidura Maitreyi conversation. We are experiencing the knowledge that Devahuti, meaning her mother, is teaching. Until now, we have experienced about the individual selves, about the creation, these senses, their exalted deities, and also about the subjects. Those who want to listen to these topics again are from the 32nd podcast If you start and listen to the Kapila Sita, you will fully understand it. The Supreme Being is time, action, and vision of life. The greatness that is composed of Sattva, Rajas, and Tamas, beginning from the earth, in the elements, he agitated and made them one with each other. After God entered those principles, those principles are destructible and united. That is, to be separate from each other, they are attached and first unite.

It's called the destruction. It will merge together so that it is not possible to do it separately again. It's called being inclusive. God entered and destroyed these ghosts, demons, and associates. It formed as an egg. The man with the consciousness entered the egg. From that, Virat Purusha, meaning the collective Purusha, which is the sum total of all the Purushas residing in all bodies, arose. The water and other enclosures were formed such that each egg was ten times bigger than the other. The five elements, ego, intellect, etc., are the seven that are the covering to this egg. In this egg, the heavens and the earth were created. This is all the form of Lord Sri Hari, that is, the body. The male who emerged from the ovary, which is like a collective body and shines like gold, is the four-faced one. In this ovary, in that four-faced one, the Lord, who is in the form of Aniruddha, was agitated. By that, that four-faced one was ready to create. The four-fold body is the collective body. All the senses of the body, individually, that is, of the living being The Lord has set forth in the created order the various sense objects in the physical creation. The four-faced Brahma body is the collective body. From the face of that collective body, the individual faces of the gods, humans, and other bodies were formed. That's the word. It's a Vaginadi. The presiding deity of the vocal cords is Agni. Then, from the nasal cavity of the collective body, the nasal sense organ of the individual body was formed. It is the location of the olfactory receptor.

The presiding deity of the olfactory sense is the life force. Ana means Vayu, the lord of air. The collective body formed from the eyes to the west. The eye is the sense organ that is in the eyeball. The sun is their supreme deity. In the ears, the auditory organs were formed. The deity presiding over the direction of the hearing sense is the Dikpalakas. From the skin, hair, and other parts of the collective male, individual skin organs were formed. The presiding deity of the throat is the Aushadhis. The genitals next. The presiding deity of the genitals is the waters. The anus. In it, the anal organ sensory organ was formed. Apaanamu, after Apaanamu, death, which causes fear to people, was born. The Hastams are the ruling deities, with Indra as their presiding deity. Then the feet were formed in the organs of action. The presiding deity of that padeendriya is Hara, also known as Upendra. The Nadus were formed subsequently. Those veins are filled with fluid. They are associated with rivers as the presiding deities. The abdomen then formed. In it, hunger and thirst will occur. He is a sea person The presiding deity. The heart was later removed. From the heart, the mind, the sense organ, manifested. Its presiding deity is the moon. What wisdom arose from the heart? Rudra is the god of that. What kind of mind was formed from the heart? Chaitya is the form of the deity worshipped in the Chaitya. That is, the knower of the field, the individual soul. In this way, from the senses within the collective Chaturmukha Shailam, from the established deities, the external senses and the deities of pride were formed. Even with all this, the body did not move. Those senses or those great beings are motionless. Then, in this body, the presiding deities of those senses entered into those senses.

Then, tendencies were combined in him. Vanhi means fire. The face reached through the vocal cords. Through the olfactory sense, air entered the nasal passages. The sun entered the eye through the visual sense. Through the auditory sense, directions entered the ear canal. Through the sensory organs, medicines entered the hair. The waters entered the Shishna through the Rayatasu. Death entered the anus through Apana. Vishnu entered into the feet through the path of Gamana. Indra entered into the arms. The rivers entered the valleys. In the heart, the presiding deities of those businesses, Chandra, Brahma, Rudra, and Chaiti, entered. This Chaitya is the Atman, the Self, the Kshetra-jñāna. Until this soul enters, even if everyone else enters, that collective male's body, even if it lies in the waters, it did not move. As soon as the astrologer entered, that giant man rose from the water. When a man is sleeping, his life, senses, Though the mind and intellect exist, the body does not move. Therefore, the knower of the field, that is, the soul, awakens in that body and when it is determined, the body becomes ready to move. When the knower of the field enters the body, the Supreme Soul, being the soul, enters his body. Therefore, the knower of the field is the soul, that is, the individual soul, which is the source of all tendencies in that body. He is called the direct self. Those who attain the knowledge of the truth should first meditate in their minds on the pure form of the soul, which is different from this body, from the body, from the intellect, from the senses, and from the life forces. The Supreme Soul exists in the form of the individual souls. Therefore, with devotion to that Supreme Being, performing actions with the body, performing actions

Having the true knowledge of the individual soul, one should consider the soul as separate from the body. The being in the body, even though in the body, is not naturally connected with the divine and human qualities, and is unconnected with the happiness and sorrow caused by the qualities of Sattva, Rajas, and Tamas. The living being has no distortions of gods, humans, etc. He does not rely on external businesses like walking. One devoid of any association with good qualities. The reflection of the sun in the water, even though it is in the water, the smallness or greatness or movement in those waters does not touch that reflection of the sun. The sun was setting in the distance. The reflection of the sun, not the sun itself, is what you see in the water. Therefore, the changes that occur in the water do not occur in the sun. The sky is the limit. The sun is not in the water but in the sky. Although it is real, the sky in the small one is small, and the sky in the big one is big. That sky has no such changes. By nature Because it is different, just as they are called to the sky, similarly, even though the divine is in the bodies of men. There is no such nature for a living being as for the sky. So that it is not a fault. The sun reflected in the water does not appear to be moving because of the water's movement. The movement is of water. But they think it is an illusion that the sun is moving. The body moves like that. The body is the man, and the man is the image of God. But the spirit does not move. The soul has no form. As soon as the body has self-realization, the movement of that water is in the sun's reflection, so they are thinking that the qualities of the body are in the soul, by delusion.

Whether it is related to the body, or the sense of being the doer in worldly activities, or the experience of happiness and sorrow, even if it is of a nature different from the natural self, the self is obscured by the pride that the body is me. Then the being becomes interested in the qualities of sound and other things. Forgetting that I am doing it, I think I am doing it. I think I am independent. The individual is not independent. Karma is the supreme being, but I consider the body as such, and through the connection with nature, through actions, the sins and virtues that arise, by them, being born in different wombs, he is obtaining the world through that. The reason for that is the feeling, the emotion that arises in the mind. Even if the soul does not have divinity or humanity, by meditating on sound and other subjects, it does not perform the cycle of birth, death, and rebirth. The world is a bad place. In a dream, he knows that he is not the body. But in a dream, with different bodies, imagining various things, experiencing pleasures and sorrows, we are. In a dream, even though the bodies are not ones of oneself, through the experience of the senses Just as the experience of happiness and sorrow occurs, so too does it occur during the waking state. Therefore, the root of misfortunes is the mind, the distortion of nature, and the senses. While acting upon what is touched by the sounds, the mind follows it and brings about misfortunes. Devotion is the means to control the mind from following the senses towards worldly matters and to be controlled by God. So, in this path of devotion, what should we do to change the mind, to turn the mind in that direction, what is that process, we will learn in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.