Base పురంజన ఉపాఖ్యానము & ప్రాచేతస ముక్తి (Parts 32-39)

Puranjana Allegory & Pracetas Liberation (Parts 32-39)

bhagavatam

In this profound episode of Canto 4, the allegorical tale of King Puranjana reaches its deeply philosophical conclusion, revealing how the soul becomes entangled in the material world through the nine gates of the body and ultimately faces the consequences of its attachments. Narada Muni unveils the hidden spiritual meanings behind the story, showing that Puranjana represents the conditioned living being who forgets his eternal relationship with the Supreme Lord. The episode then transitions to the glorious liberation of the Pracetas, who, after thousands of years of austerity and devotion, receive the blessings of Lord Vishnu and are granted ultimate liberation from the cycle of birth and death. These two narratives together offer timeless wisdom on detachment, devotion, and the soul's journey back to Godhead.

In this profound episode of Canto 4, the allegorical tale of King Puranjana reaches its deeply philosophical conclusion, revealing how the soul becomes entangled in the material world through the nine gates of the body and ultimately faces the consequences of its attachments. Narada Muni unveils the hidden spiritual meanings behind the story, showing that Puranjana represents the conditioned living being who forgets his eternal relationship with the Supreme Lord. The episode then transitions to the glorious liberation of the Pracetas, who, after thousands of years of austerity and devotion, receive the blessings of Lord Vishnu and are granted ultimate liberation from the cycle of birth and death. These two narratives together offer timeless wisdom on detachment, devotion, and the soul's journey back to Godhead.

← Prev Next →
Puranjana Allegory & Pracetas Liberation (Parts 32-39) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో మరకతశ్యామ వపుషేధిగతశ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే ఓ కేశవా మరకత మాణిక్యము వలె శ్యామలమైన దేహము గల నిన్ను లక్ష్మీదేవి చేరి సేవించుచున్నది పీతాంబరుడవగు నీకు అనేక నమస్కారములు ఎయిత్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, థర్టీ ఫిఫ్త్ ప్రేయర్. భగవద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కందము 32వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోపాఖ్యానాన్ని మనం సేవిస్తున్నాం. పురంజనోపాఖ్యానంలో వాస్తవమైన కథను తెలుపుతూ తరువాత భాగంలో దాని అంతర్గతంగా ఉన్న తత్వార్ధాన్ని వివరిస్తున్నారు. కొంత భాగం వరకు మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగంలోని తత్వార్ధాన్ని తెలుసుకుందాం. ఇంతకుముందు పాడ్కాస్ట్ వినని వారైతే ఆ పాడ్కాస్ట్ ని విని ఇది వినటం వల్ల ఇంకా చాలా అర్థమవుతుంది. ఇంతవరకు పురంజైనుడు. అనేడి జీవుడు సుషుప్తి అవస్థలో జాగ్రత్త అవస్థలో ప్రవర్తించేడి రీతి చెప్పబడినది. ఇప్పుడు స్వప్నావస్థ. పురంజనుడు అనే రాజు వేటకేగుట ఇచర వర్ణించబడినది. జాగ్రత్త అవస్థలో ఉండెడి శరీరమును సుఖ దుఃఖమును అనుభవింపచేయుటకు జీవునికి పరమ పురుషుడే సృష్టించెను. అట్లే స్వప్నావస్థలో కూడా జీవుడు ఒక్కడే కొంతకాలమే విషయములను అనుభవించుచు ఉండుటకు తగిన శరీరమును విషయములను సృష్టించెను. కొంత కాలము మాత్రమే జీవుడు స్వప్నములను కాంచుచుండును. రథమునెక్కి వేటకు వెళ్ళును. స్వప్నంలో ఉండెడి శరీరమే రథము. దానికి సర్వేశ్వరుడు కల్పించిన ఇంద్రియములే గుర్రములు. మనస్సే పగ్గములు. ఈ రథము చాలా వేగముగా పోవును. కలలో ఎంతో వేగముగా విషయములు నడిచిపోవుచుండును. ఈ రథము బుద్ధి అనేటి సారథి చేతనే నడపబడును. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరమునకు ఉండేటి బుద్ధి.

మొదలగు పరికరములన్నియు స్వప్నావస్థలో ఉండును. జాగ్రత్త అవస్థలో శరీరము అనేటి రథము నూరేళ్లు సాగునది. చాలా కాలం ఉండునది. స్వప్నములో రథమనగా శరీరము చాలా వేగముగా నడుచునది. కొద్ది కాలమే ఉండిపోయేడిది. అందు రథికుడు అనగా ఆత్మ శరీరమునందలి హృదయములో కూర్చునును. శోకము, మోహము అనేటివి ఈ రథమునకు పైన కనపడేడి రెండు శిఖరములు. ఈ రథము నుండి ఐదు వైపులకు నిర్గమ ద్వారములు ఉండును. అందులో నుండి వచ్చుటకు అవకాశం ఉండును. ఆ వచ్చునవే శబ్దాది విషయములు. దీనికి ఏడు ధాతువులు ఉండును. శరీరమునకు త్వక్ అనగా చర్మము, మాంసము, మేధస్సు అనగా కొవ్వు, రక్తము, ఎముకలు, శుక్లము అనేటి ఏడు ధాతువులు ఉండును. ఈ రథము ఐదు రకములుగా నడుచును. కర్మేంద్రియములే ఐదు నడకలు. అనంతమైన వాసనలు చేరి ఉన్న అహంకారమును వేటకు వెళ్ళువారు అమ్ముల పొదిని దాల్చినట్లు దాల్చి ఉండును. విషయములందు బుద్ధిపూర్వకముగా ప్రవర్తించునట్లు చేయు సంస్కారము వాసన. అవి అనంతములు. 11 గురు సేనాపతులతో ఇతడు వేటకు బయలుదేరినాడు. కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు, మనస్సు అన్నిటి 11 ఇంద్రియముల యొక్క వృత్తులే సేనాపతులు. ఈతడు చేరిన అడవి పేరు పంచప్రస్థము. అందమగు ఐదు కొండ చర్యలు ఆ వనమునందున్నవి. అది స్వప్నములో కనపడు జగత్తు. అందు అనుభవింపదగిన శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉండును. ఆ పంచప్రస్థ వనము అనేటి వనమునకు పురంజనుడు ఏగినాడు. జాగ్రత్త అవస్థలో రజోగుణముతో కూడిన సత్వగుణము కలిగి బుద్ధివృత్తులు పని చేయుచుండును. స్వప్నావస్థలో రజోగుణముతో కూడిన తమోగుణము వృద్ధి చెందిన బుద్ధి. వృత్తులు పని చేయుచుండును. కావున అప్పుడు జీవుడు అసురీవృత్తి కలవాడై రజోగుణముతో కూడిన కామము, క్రోధము కలవాడై కర్మ వాసన నడి బాణములతో ఆ వనములో కనబడే మృగములను అనగా విషయములను వేటాడుచుండును.

వేట రాజులకు చెడ్డది కాదు. చేదగినదే కానీ తాము దేవ పితృ కార్యములందు వినియోగించుటకు అవసరమైన మృగములను చంపుటకును దేశోపద్రవమును కలిగించు మృగములను చంపి దేశ రక్షణ కలిగించుటకును ఎంతవరకు అవసరమో అంతవరకు వేటాడుట రాజునకు తగును. కానీ అవసరము లేకుండా వినోదము కొరకు కాముతో చంపదగిని వానిని చంపదగిన వానిని చంపుట రాజునకు దోషము. అట్లే స్వప్నము పురుషునకు వచ్చుట సహజమే. కానీ అది సాత్వికములగు వాసనలచే శుభమగు అనుభవములను రాబోవు వాడిని సూచించు సాత్వికము కళలు వచ్చుట ఉత్తమం. అట్టివి కాకుండా చెప్పుటకు వీలు కానివ్వచ్చుట పాపము. కలలు వాసన చేతనే వచ్చును. అట్టి కలలు వచ్చుట ఇందు సూచింపబడుచున్నది. పురంజనుడు జీవుడవ అడవికేగి బాణములతో మృగములన్నిటినో దయామాలి. చంపెను ఆహారమునకు పనికిరాని వానిని యజ్ఞములో ఉపయోగించుట కొరకు తగని వానిని కూడా చంపి బడలిపోయెను. రాజు బుద్ధితో కర్మను ఆచరించుట స్వప్నావస్థలో పురంజనుడు వదలి వదలరాని భార్యను వదలి వేటకు వెళ్ళినాడు. అనగా సాత్వికమైన బుద్ధిని వదలి తామసమైన బుద్ధికి వశమై చేయరాని పనులను చేసినాడు. ఆకలి దప్పులతో అలమటించినాడు. ఇంటికి వచ్చినాడు అనగా మేలుకొనినాడు. ఇప్పుడు అతనికి రాణి వైపు మనస్సు మళ్ళినది అనగా సాత్వికమైన బుద్ధి ఉండవలెనని కోరిక కలిగినది. ఆమెకై వెదకెను. ఆమె చెలికత్తెలను అడిగెను. ఆమె ఎచ్చటను కనబడుట లేదు. సాత్వికమైన బుద్ధి లభించుట చాలా కష్టము. ప్రేమించు ప్రియురాలు గృహమున లేనిచో చక్రము వీడిన రథమునందు ఉన్నట్లే రతికుడు దీనుడై ఉండును. నా ప్రియురాలు నేను సుఖంలో ఉన్నప్పుడు తేల్చేడిది ఆమె ఇప్పుడు లేదు అని బాధపడినాడు. జీవునకు సాత్వికమయమైన బుద్ధి ప్రియురాలి వంటిది. పట్టపురాణి ఆమెతో కూడి ఉన్నని అతనికి ఆనందము. చెలికెత్తెలు పురంజనుడు ప్రశ్నింపగా ఆమె ఎందుకో ఆస్తరణము లేని నీలపై పరుండి ఉన్నదని చెప్పిరి. అతడికి వెళ్లి ఆమెను మృదుమధురముగా మాటలతో లాలించెను. హృదయము ఆమె ఎడబాటుతో బాధపడుచుండెను.

పాదములను పట్టుకొనెను, ఒడిలో పరుండబెట్టుకొనెను. ఈ కథలో జీవుడు తనకు వివేకమును కలిగించడి సాత్వికమైన బుద్ధికై ఎంత అనునయించి ప్రవర్తించునో తెలియచేయును. ఆమెను అనుగ్రహించమని ప్రార్థించెను. ఇంత ఆర్తి గలవాడై అనుగ్రహించమని ప్రార్థించి మరలా ఆ బుద్ధిని పొందవలెనని ప్రయత్నించెను. సాత్వికమైన బుద్ధి లేనిచో వివేకము ఉండదు. వివేకము లేనిచో నిద్రపోయి కలగనిన వాని వలె జీవుడు ఏవేవో పనులు చేయును. మరలా మేలుకొని వివేకము కలిగి సాత్వికమైన బుద్ధితో కూడవలెనని ప్రయత్నించును. అప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి అనగా సాత్విక బుద్ధి అను పట్టపురాణితో చేరును. ఇది తత్వార్ధము. ఇంతటితో పురంజనోపాఖ్యానంలో ఉన్న తత్వార్ధాన్ని మనం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the one with the emerald-like body, the one who is the destroyer of the darkness of the world. Salutations to you, O Keshava, the one with the emerald-like body. Lakshmi Devi is serving you, who has a body as dark as emerald. To you, who are the one with the emerald-like body, the one with the emerald-like shade Many salutations, eighth canto, Sixteenth Chapter, Thirty-fifth Prayer. Devotees of Bhagavad, welcome to the 32nd podcast of Srimad Bhagavata Tatva Deepika. Until now, as part of the conversation with Vidura Maitreya, we have been enjoying the Puranjana story. Puranjana Katha contains a narrative of a true story interspersed with philosophical discourse. We’ve done parts of it. Let's explore the philosophical aspects of the front part. If you haven't listened to the podcast before, listening to this podcast will make you understand a lot more. Puranjaneya is the name of a Puranic sage. The way a living being behaves in a state of deep sleep, in a state of alertness, is described. Now it's the sleep state. King Puranjana is described as going hunting. The Supreme Being created the living being to experience pleasure and pain in a state of caution. Similarly, even in the dream state, the individual, alone, for a short time, to experience things, created a suitable body and things. Only for some time, the living being will be dreaming. He will go hunting on the back of a chariot. The body in a dream is the chariot. The senses that the Lord has created are the horses. The mind is the reins. This chariot is very fast. In dreams, things happen very fast. This chariot is driven by the intellect, which is the charioteer. The intellect that exists in the gross body during the state of caution.

All the instruments etc. will be in a dream state. In a state of care, the body is like a chariot that lasts for a hundred years. It's been a long time. In a dream, the body is like a chariot, moving very fast. It lasted so short a time. And the charioteer, that is, the soul, sits in the heart within the body. Grief and delusion are the two peaks that appear above this chariot. This chariot has five exits on five sides. There is a possibility of it coming from within. Those are the things that come, the sounds and the subjects. It has seven elements. The body has seven elements: skin, flesh, intellect, which is fat, blood, bones, and semen. This chariot travels in five ways. The five motor activities are the five verbs. Those who go hunting will wear the quiver of arrows as if they have worn it. The culture that makes one act wisely in matters is fragrance. They are endless. He set out on a hunt with eleven gurus. Five karmendriyas (organs of action), five gyanendriyas (organs of perception), and the mind, all 11 The activities of the senses are the generals. The name of the forest where he went swimming is Panchaprastham. Five beautiful mountain actions are in that forest. It is the world that appears in a dream. There are sounds, touch, form, taste, and smell that can be experienced. Puranjana went to the forest called Panchaprastha. In a state of caution, with the quality of Rajas, along with the quality of Sattva, the intellectual faculties are functioning. In the dream state, the intellect is enriched with the quality of Rajas, along with the quality of Tamas. Professions are working. Therefore, then the living being, being of demonic nature, being full of lust and anger mixed with passion, with the arrows of karma's smell, is hunting the animals that appear in that forest, that is, the subjects.

Hunting is not bad for kings. It is permissible, but hunting to the extent necessary to kill the animals needed to be used in the duties of gods and ancestors, to kill the animals that cause danger to the country, and to protect the country, is appropriate for the king. But without need, for the sake of entertainment, killing someone who is not worthy of being killed, killing someone who is worthy of being killed, is a sin for the king. Similarly, it is natural for a dream to come to a man. But it is best to have auspicious experiences through the fragrances that are virtuous, indicating the one who is to come, and to have virtuous arts. It is a sin to not be able to tell what is not possible. Dreams come from the scent. Such dreams are indicated here. Puranjunudu, being a living being, went to the forest and, with arrows, killed all the animals with compassion. He killed the one who was not fit for food, and also killed the unworthy one to use him in the sacrifice, and was ruined. Raju, with his wisdom, performed his duty. In a dream state, Puranjunudu left his unwilling wife and went hunting. That is to say, abandoning a virtuous intellect, he became subservient to a tainted intellect and did things that should not be done. Appetite He's riled up. He came home, meaning he woke up. Now, his mind turned towards the queen, meaning he desired to have a gentle intellect. She's been on a hunt. She asked her maids. She is nowhere to be seen. It is very difficult to get a sattvic intellect. If a beloved is not at home, a lover is as if he is in a chariot without wheels. My beloved, when I was happy, she was the one who decided, but now she is not, and he was saddened. The soul's virtuous intellect is like a beloved. The king was pleased with her company. When Cheliketelu Puranjunudu questioned, she said that for some reason, she was lying on the unsteady ground. He went to her and caressed her with soft words. The heart was suffering from a sense of estrangement.

He took my feet, and laid them in his lap. In this story, the creature will explain how much he will behave with humility for a sage to give him wisdom. He prayed to God to bless her. He prayed to be blessed with such devotion and tried to regain that wisdom. Without a sattvic intellect, there is no wisdom. Without wisdom, like one who is asleep and dreaming, the soul does various things. Again, awaken, have wisdom, and try to be with a gentle intellect. Then, the agricultural intellect, that is, the Sattvic intellect, will join with the royal one. It's philosophical. With this, we have understood the philosophical meaning in the Puranjnopakhyanam. We'll learn about the front part in the next podcast. Jai Srimannarayana. Salutations to the Asmadgurus